Ukraine's prosecutor general said: రష్యా ఉక్రెయిన్ పై దురాక్రమణ దాడికి దిగినప్పటి నుంచి ఉక్రెయిన్‌లో దాదాపు 287 మందికి పైగా చిన్నారులు మృతి చెందారని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం తెలిపింది. కేవలం మారియుపోల్‌ని స్వాధీనం చేసుకునే క్రమంలోనే 24 మంది పిల్లలు మృతి చెందారని పేర్కొంది. రష్యా ఉక్రెయిన్‌ని ఆక్రమించుకునే దిశగా పౌరులే లక్ష్యంగా విచక్షణరహితంగా కాల్పులు జరిపిందని, ఆ క్రమంలోనే ఈ చిన్నారులంతా మృతి చెందారని వెల్లడించింది.
అంతేకాదు ఈ కాల్పుల్లో సుమారు 492 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించింది. అంతేకాదు రష్యా బలగాలు మారియుపోల్‌ని ముట్టడి చేసిన తర్వాత ఆ నగరం శిథిలానగరంగా మారిపోవడమే కాకుండా వీధుల్లో శవాలు కుళ్లిపోయి అత్యంత దయనీయంగా ఉందని తెలిపింది.
రష్యా ఉక్రెయిన్‌పై సాగిస్తున్న యుద్ధాన్ని ప్రత్యేక సైనిక చర్యగా చెప్పుకుంటూ...ఉక్రెయిన్ సైనిక నిర్యూలన దిశగా యుద్ధ నేరాలకు పాల్పడుతుందంటూ మాస్కో పై ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 250 మందికి పైగా చిన్నారులు చనిపోయారని, ఐదు మిలిలన్ల మందికి పైగా హింసాత్మక భయానక వాతావరణంలో గడుపుతున్నారని పేర్కొంది.
(చదవండి: రష్యాను ఒంటరిని చేయలేరు)
Comments
Please login to add a commentAdd a comment