military operation
-
ఇజ్రాయెల్‌కు ప్రాణనష్టం
టెల్ అవీవ్: దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్లను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా సైనిక ఆపరేషన్ చేపట్టిన ఇజ్రాయెల్‌కు ప్రాణనష్టం సంభవించింది. హెజ్బొల్లాపై యుద్ధంలో తమ జవాన్లు ఎనిమిది మంది మరణించినట్లు ఇజ్రాయెల్ సైనికాధికారులు బుధవారం ప్రకటించారు. రెండు వేర్వేరు ఘటనల్లో వీరు మృతి చెందినట్లు తెలిపారు. తాము వెనుకడుగు వేయబోమని, హెజ్బొల్లాపై దాడులు ఆపే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. మరోవైపు హెజ్బొల్లా సైతం వెనక్కి తగ్గడంలేదు. ఇజ్రాయెల్ సేనలపై విరుచుకుపడుతోంది. లెబనాన్–ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని రెండు ప్రాంతాల్లో ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ పదాతి దళానికి అండగా యుద్ధ ట్యాంకులు సైతం రంగంలోకి దిగాయి. ఇజ్రాయెల్ దాడుల్లో తమ సభ్యులు కొందరు గాయపడ్డారని హెజ్»ొల్లా తెలియజేసింది. 50 గ్రామాలు, పట్టణాలు ఖాళీ! దక్షిణ లెబనాన్ మొత్తం యుద్ధక్షేత్రంగా మారిపోవడంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సరిహద్దు నుంచి 60 కిలోమీటర్ల లోపు ఉన్న గ్రామాలు, పట్టణాలను వెంటనే ఖాళీ చేయాలని ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించారు. దీంతో జనం సురక్షిత ప్రాతాలకు తరలివెళ్తున్నారు. ఇప్పటికే వేలాది మంది తరలిపోయారు. దాదాపు 50 గ్రామాలు, పట్ణణాలు ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. గత రెండు వారాల్లో ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో దాదాపు వెయ్యి మంది మరణించినట్లు సమాచారం. హెజ్బొల్లా కబంధ హస్తాల నుంచి లెబనాన్ ప్రజలకు విముక్తి కల్పించడానికే సైనిక చర్య ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. లక్ష్యం నెరవేరేదాకా దాడులు ఆగవని అంటోంది. -
Israel-Hamas war: వెస్ట్‌బ్యాంక్‌పై భీకర దాడి
వెస్ట్‌బ్యాంక్: గాజాలో తమ అధీనంలోనే ఉన్న వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయెల్ బుధవారం విరుచుకుపడింది. ఫైటర్ జెట్లు, డ్రోన్లతో భీకర దాడులకు దిగింది. దాంతో 9 మంది మరణించారు. వెస్ట్‌బ్యాంక్‌లో మిలిటెంట్లు స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారని, వారు సాధారణ ప్రజలపై దాడి చేయకుండా నిరోధించడానికే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సైన్యం వెల్లడించింది. వెస్ట్‌బ్యాంక్‌లోనూ ఇజ్రాయెల్ అడపాదడపా దాడులు చేస్తున్నా ఇంతగా విరుచుకుపడడం ఇదే తొలిసారి. అక్కడి జెనిన్ సిటీని దిగ్బంధించినట్లు తెలుస్తోంది. ఉత్తర వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్, తుల్కారెమ్, అల్–ఫరా శరణార్థి శిబిరంలోకి సైన్యం చొచ్చుకెళ్లినట్లు ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి నదవ్ సొషానీ ప్రకటించారు. ‘‘ఈ దాడి ఆరంభమే. వెస్ట్‌బ్యాంక్‌లో అతిపెద్ద సైనిక ఆపరేషన్‌కు ప్రణాళిక సిద్ధం చేశాం’’ అన్నారు.ఇజ్రాయెల్ సైన్యానికి, తమకు కాల్పులు జరిగినట్లు పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూపులు కూడా పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో, గాజాలో మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేస్తున్నట్లుగానే వెస్ట్‌బ్యాంక్‌లోని వారి స్థావరాలను ధ్వంసం చేయక తప్పదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ స్పష్టం చేశారు. -
రష్యా సినిమా హాళ్లలో ఉక్రెయిన్‌పై దాడి దృశ్యాలు.. పుతిన్ కీలక ఆదేశాలు
మాస్కో: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తూ విధ్వంసాన్ని సృష్టిస్తోంది రష్యా. వేలాది మంది సైనికులను కోల్పోతున్నా వెనక్కి తగ్గటం లేదు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇప్పటికే సైనిక బలగాల సామర్థ్యాన్ని పెంచుకునేందుకే మొగ్గు చూపిన పుతిన్.. తాజాగా జారీ చేసిన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. ఉక్రెయిన్‌పై దాడి, నియో-నాజీల భావజాలానికి వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధానికి సంబంధించిన డాక్యుమెంటరీలను సినిమా హాళ్లలో ప్రదర్శించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దాడులు మొదలు పెట్టి ఏడాది కావస్తున్న క్రమంలో ఫిబ్రవరి నాటికి ఈ డాక్యుమెంటరీలను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది క్రెమ్లిన్. ఫిబ్రవరి 1 నాటికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలను అమలు చేస్తుందని పేర్కొంది. ఈ ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్‌లో పాలుపంచుకుని తమ హీరోయిజాన్ని ప్రదర్శించిన వారికి అంకితం చేసే డాక్యుమెంటరీలు తీసేలా పుతిన్ ఆదేశించినట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఆయా సినిమా నిర్మాతలకు సహాయం అందించాలని రక్షణ శాఖకు సూచించినట్లు పేర్కొంది. ఆ దిశగా తీసుకున్న చర్యలపై మార్చి 1 నాటికి నివేదిక సమర్పించాలని రక్షణ మంత్రి సెర్గీ షోయిగూను ఆదేశించారు. గత ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడి మొదలు పెట్టి యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పశ్చిమ ప్రాంత అనుకూల దేశంలో నిరాయుధీకరణ, నాజీ భావజాలం కట్టడి అంటూ ఈ సైనిక చర్య చేపట్టారు. ఈ దాడి చెపట్టినప్పటి నుంచి రష్యాలోని అధికార టీవీ ఛానళ్లు.. తమ సైనిక బలగాలను పొగుడుతూ పలు కార్యక్రమాలను ప్రదర్శిస్తూ వస్తున్నాయి. మరోవైపు.. స్వతంత్ర మీడియా సంస్థలు మూసివేశారు. జర్నలిస్టులు దేశం దాటి వెళ్లిపోయారు. ఉక్రెయిన్‌పై దాడిని ఎవరైనా విమర్శిస్తే జైలు శిక్ష విధించేలా ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి: Russia-Ukraine war: ఒక్క క్షిపణితో 400 మంది హతం ! -
రష్యా దాష్టీకం!... దాదాపు 287 మందికి పైగా ఉక్రెయిన్ చిన్నారులు..
Ukraine's prosecutor general said: రష్యా ఉక్రెయిన్ పై దురాక్రమణ దాడికి దిగినప్పటి నుంచి ఉక్రెయిన్‌లో దాదాపు 287 మందికి పైగా చిన్నారులు మృతి చెందారని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం తెలిపింది. కేవలం మారియుపోల్‌ని స్వాధీనం చేసుకునే క్రమంలోనే 24 మంది పిల్లలు మృతి చెందారని పేర్కొంది. రష్యా ఉక్రెయిన్‌ని ఆక్రమించుకునే దిశగా పౌరులే లక్ష్యంగా విచక్షణరహితంగా కాల్పులు జరిపిందని, ఆ క్రమంలోనే ఈ చిన్నారులంతా మృతి చెందారని వెల్లడించింది. అంతేకాదు ఈ కాల్పుల్లో సుమారు 492 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించింది. అంతేకాదు రష్యా బలగాలు మారియుపోల్‌ని ముట్టడి చేసిన తర్వాత ఆ నగరం శిథిలానగరంగా మారిపోవడమే కాకుండా వీధుల్లో శవాలు కుళ్లిపోయి అత్యంత దయనీయంగా ఉందని తెలిపింది. రష్యా ఉక్రెయిన్‌పై సాగిస్తున్న యుద్ధాన్ని ప్రత్యేక సైనిక చర్యగా చెప్పుకుంటూ...ఉక్రెయిన్ సైనిక నిర్యూలన దిశగా యుద్ధ నేరాలకు పాల్పడుతుందంటూ మాస్కో పై ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 250 మందికి పైగా చిన్నారులు చనిపోయారని, ఐదు మిలిలన్ల మందికి పైగా హింసాత్మక భయానక వాతావరణంలో గడుపుతున్నారని పేర్కొంది. (చదవండి: రష్యాను ఒంటరిని చేయలేరు) -
ఫస్ట్ స్టేజ్ మిలటరీ ఆపరేషన్ ఫినిష్...అదే మా ఏకైక లక్ష్యం! : రష్యా
Main goal to ‘liberate’ Donbas: ఉక్రెయిన్‌లో సైనిక చర్యకు సంబంధించిన మొదటి దశ పూర్తయిందని రష్యా డిప్యూటీ చీఫ్ కల్నల్ జనరల్ సెర్గీ రుడ్స్కోయ్ అన్నారు. ఈ ఆపరేషన్‌కి సంబంధించిన ప్రధాన పనులన్నీ పూర్తయ్యాయని తెలిపారు. అంతేగాక ఉక్రెయిన్‌లో సాయుధ దళాల పోరాట సామర్థ్యం గణనీయంగా తగ్గిందని కూడా చెప్పారు. ఉక్రెయిన్‌లోని డాన్బాస్ ప్రాంతాన్ని విముక్తి చేయడమే రష్యా ప్రధాన లక్ష్యం అని నొక్కి చెప్పారు. రష్యా అధ్యక్షుడ వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ యుద్ధం ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని అన్నారు. అయితే ఈ యుద్ధంలో సుమారు వెయ్యి మంది రష్యా సైనికులు మృతి చెందగా, మూడు వేల మందికి పైగా గాయపడ్డారని రుడ్స్కోయ్ వెల్లడించారు. అయితే నాటో మాత్రం ఈ యుద్ధంలో దాదాపు 15 వేల మంది రష్యాన్ సైనికులు మరణించారని చెప్పడం గమనార్హం. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలను దిగ్బంధం చేసి ఉక్రెయిన్ బలగాలకు నష్టం కలిగించేలా చేయడమే కాకా అక్కడ ఉక్కెయిన్ సైనిక దళాలు బలపడకుండా చేస్తాం అని తెలిపారు. డోనెట్స్క్, లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ భూభాగాలను స్వాధీనం చేసుకునేంత వరకు ఈ దాడి ఆపేది లేదని తెగేసి చెప్పింది. పైగా తమ ప్రధాన లక్ష్యం ఉక్రెయిన్ నుంచి డాన్బాస్ ప్రాంతాన్ని విముక్తి చేయడమే అని రష్యా స్పష్టం చేసింది. అయితే పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించలేదని రష్యా పదే పదే సమర్థించుకునే యత్నం చేయడం విశేషం. (చదవండి: కీవ్‌లో కల్లోలం.. ఏ క్షణంలోనైనా) -
ఉక్రెయిన్ విలవిల: మోదీజీ... జోక్యం చేసుకోండి ప్లీజ్!
Russia And Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు భీకరంగా దాడులు చేస్తున్నాయి. బాంబుల మోత మోగిస్తున్నాయి. రష్యా చర్యలను పలు దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి డా. ఇగోర్ పొలిఖా భారత్ మద్దతు కోరారు. భారత్ రష్యాతో ప్రత్యేకమైన స్నేహం కలిగి ఉందని, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని భారత్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మిత్రదేశమైన భారత్.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను నిలువరించడానికి సాయం చేయగలదని పేర్కొన్నారు. వెంటనే భారత్దేశ ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా, ఉక్రెయిన్ దేశాధినేతలతో మాట్లాడాలని కోరారు. ప్రపంచంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎవరి మాట వింటారో? లేదో? తెలియదు కానీ, ప్రధానిమోదీ మాటలను ఆలోచిస్తారని తాను ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు రష్యాది సైనిక చర్య కాదు.. యుద్ధమే అని భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి డా. ఇగోర్ పొలిఖా అన్నారు. రష్యా దాడుల్లో భారీగా ఉక్రెయిన్ ప్రజలు మృతి చెందారని తెలిపారు. యుద్ధ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని చెప్పారు. యుద్ధ సంక్షోభ వేళ భారత్ అండగా నిలవాలని కోరుకుంటున్నామని కోరారు. పరిస్థితులు క్షీణిస్తున్నందున ఉక్రెయిన్‌కు భారత్ మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. నాటో, ఈయూ సభ్యత్వం గురించి మాట్లాడలేనని పేర్కొన్నారు. -
నిస్సహాయ స్థితిలో ఉక్రెయిన్
UPDATES ► ఉక్రెయిన్‌లో 70 సైనిక స్థావరాలు, 10 వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. రాజధాని నగరం కీవ్‌లోని ఉత్తర భాగంలో రష్యా దళాలు ప్రవేశించాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా బలగాలు సమీపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లుహాన్స్క్లోని 2 పట్టణాలను రష్యా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. తమ విమానాలు కూల్చారన్న ఉక్రెయిన్ ఆరోపణలను రష్యా ఖండించింది. ఉక్రెయిన్ ప్రభుత్వ భవనాలను తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న యోచనలో రష్యా ఉన్నట్లు సమాచారం. ► రష్యా- ఉక్రెయిన్ వార్‌పై నాటో కీలక వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్‌కు నాటో బలగాలను పంపే ఆలోచన తమకు లేదని నాటో చీఫ్ ప్రకటించారు. నాటో ఉక్రెయిన్ వ్యాఖ్యలతో నిస్సహాయ స్థితిలోకి వెళ్లింది. ► రష్యా దూకుడు ముందు ఉక్రెయిన్ కకావికలం అవుతోంది. ప్రతిఘటన లేకుండానే రష్యా సైన్యం దూసుకుపోతోంది. మెజార్టీ నగరాల్లో పాగా దిశగా రష్యా మిలటరీ ముందుకెళ్తోంది. ఉక్రెయిన్ ఎక్కడా నిలువరించలేకపోవండంతో రష్యా దాడులు కొనసాగిస్తోంది. తక్కువ సైన్యం, ఆయుధ సంపత్తితో ఉక్రెయిన్ పోరాడలేని స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. చాలా చోట్ల ఉక్రెయిన్ వాసులు నగరాలు విడిచి వెళ్లిపోతున్నారు. ప్రాణ భయంతో ముఖ్య ప్రాంతాలకు ఉక్రెయిన్ పౌరులు దూరంగా ఉన్నారు. ప్రధానంగా ఎయిర్‌పోర్టులు, విద్యుత్ కేంద్రాలపై రష్యా దాడులు చేస్తోంది. ఇప్పటివరకు 40మంది ఉక్రెయిన్ సైనికులు, 10మంది పౌరులు మృతి చెందినట్లు రాయిటర్స్ కథనం వెల్లడించింది. ► ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆకాంక్షించారు. ఉక్రెయిన్‌లో విమానాలు ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదని, అయినప్పటికీ భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సృష్టం చేశారు. ►ఉక్రెయిన్‌లో మార్షల్ లా అమల్లో ఉండటంతో ప్రయాణాలు కష్టంగా మారాయని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటన వెలువరించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉండటానికి చోటులేకుండా చిక్కుకున్నవారి కోసం, స్థానిక యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. బాంబు వార్నింగ్‌లు, ఎయిర్ సైరన్ల మోత కీవ్‌లో చాలా చోట్ల వినిపిస్తున్నాయని పేర్కొంది. తాము చోట ఇలాంటి సైరన్లు వినిపిస్తే.. గూగుల్ మ్యాప్ ద్వారా సమీపంలోని బాంబ్ షెల్టర్లను చేరుకోండి. కీవ్‌లో చాలా మంది అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. తమపాస్పోర్టులు, పత్రాలను పట్టుకుని వీలైనంత వరకు ఇళ్లల్లోనే ఉండాలని సూచించింది. ► ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ ప్రచారంలో ఉన్న మోదీ.. ఢిల్లీ చేరుకున్న తరువాత సమీక్ష నిర్వహించనున్నారు. ►ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్రం పేర్కొంది. సుమారు 18 వేల మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోగా.. ఉక్రెయిన్ గగనతలం తెరుచుకోగానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రవాణా విమానాలను పంపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా భారతీయుల తరలింపుకు ఏర్పాట్లు చేస్తోంది. ►రష్యా దాడిలో ఉక్రెయిన్‌కు చెందిన 40 మంది సైనికులు, 10 మంది పౌరులు మృతి చెందినట్లు ఆ దేశ ప్రెసిడెంట్ కార్యాలయం ప్రకటించింది. రష్యా చేపట్టిన మిలటరీ ఆపరేషన్‌లో వందలాది మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. రష్యా ప్రకటించిన యుద్ధంలో సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొంది. ► ఉక్రెయిన్- రష్యా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు భారత్ వెల్లడించింది. రష్యన్ మాట్లాడే అధికారులను విదేశాంగ శాఖ ఉక్రెయిన్‌కు పంపింది. ఉక్రెయిన్ రాయబార కార్యాలయంలో సహకారం కోసం వారిని పంపినట్టు తెలిపింది. ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ పనిచేస్తోందని వెల్లడించింది. సమాచారం కోసం 24గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. ►మరోవైపు రష్యా దాడులకు ఉక్రెయిన్ సైన్యం కూడా దీటుగా స్పందిస్తోంది. 50 మంది దురాక్రమణదారుల్ని చంపినట్లు, 7 విమనాలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ► రష్యా దాడులతో ఉక్రెయిన్ అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు. దేశం కోసం ముందుకొచ్చిన వాళ్లకు ఆయుధాలు ఇస్తామని వెల్లడించారు. దీని కోసం అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ►స్టాక్ మార్కెట్లపై రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం చూపించింది. దాదాపు అన్నీ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు రూ.10 లక్షల కోట్లను కోల్పోయారు. సెన్సెక్స్ 2,702 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 815 పాయింట్లు నష్టపోయింది. భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్ ముగిసింది. ► రష్యాకు ఎట్టి పరిస్థితుల్లో లొంగేది లేదని, రష్యా దళాలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని ఉక్రెయిన్ తెలిపింది. తమ దాడిలో 50 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు పేర్కొంది. 6 రష్యా విమానాలను కూల్చివేశామని ప్రకటించింది. ►అయితే ఉక్రెయిన్ ప్రకటనను రష్యా ఖండించింది. తమ ఒక్క విమానాన్ని కూడా ఉక్రెయిన్ కూల్చలేదని పేర్కొంది. ఉక్రెయిన్ అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని స్పష్టం చేసింది. ►రష్యాది సైనిక చర్య కాదు.. యుద్ధమే అని భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి డా. ఇగోర్ పొలిఖా అన్నారు. రష్యా దాడుల్లో భారీగా ఉక్రెయిన్ ప్రజలు మృతి చెందారని తెలిపారు. పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని చెప్పారు. యుద్ధ సంక్షోభ వేళ భారత్ అండగా నిలవాలని కోరుకుంటున్నామని భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి డా. ఇగోర్ పొలిఖా కోరారు. పరిస్థితులు క్షీణిస్తున్నందున ఉక్రెయిన్‌కు భారత్ మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. నాటో, ఈయూ సభ్యత్వం గురించి మాట్లాడలేనని పేర్కొన్నారు. ► ఉక్రెయిన్- రష్యా ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తాయని ఊహించలేదని రక్షణ నిపుణుడు పీ.కే.సెహగల్ తెలిపారు. ఉక్రెయిన్ ఆక్రమణ తమ ఉద్దేశం కాదని రష్యా పలుమార్లు స్పష్టం చేసిందని అన్నారు. ఈ యుద్ధం వల్ల ప్రాణ నష్టం భారీగా ఉంటుందని అంచనా వేశారు. ► రష్యా దాడిలో ఇప్పటివరకు ఏడుగరు మృతి చెందిన ఉక్రెయిన్ అధికారుల ప్రకటించారు. తొమ్మిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయని వెల్లడించారు. ► ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంతో స్పందించిన ఐక్యరాజ్యసమితి.. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యల నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. యుద్ధం ఆపడంపై ఐక్యరాజ్యసమి బాధ్యత వహించాలని ఉక్రెయిన్ దేశం కోరింది. ► ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం విరుచుకుపడుతోంది. రష్యా యుద్ధ విమనాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్‌లోని కీవ్ ఎయిర్‌పోర్టు రష్యా సైన్యం అధీనంలోకి తీసుకుంది. రష్యా దాడిలో ఉక్రెయిన్‌లో 300 మంది పౌరులు మృతి చెందారు. ఉక్రెయిన్‌లో నిత్యావసరల కోసం జనాలు బారులు తీరారు. పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు క్యూ పెరిగింది. ► రష్యా దాడి నేపథ్యంలో కీవ్ నగరాన్ని ప్రజలు వీడుతున్నారు. తమ నగరంపై బాంబుల మోత మోగుతుండటంతో వేరే ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. దీంతో కీవ్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పెద్ద ఎత్తున వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. There are many kilometers of traffic jams at the exit from Kiev, people are leaving the city, The Insider reports.#Russia #Ukraine #Kiev #Kyiv #RussiaUkraine pic.twitter.com/Rd8wIrTuG7— WORLD WAR 3 - RUSSIA vs Ukraine #2022 (@WW32022) February 24, 2022 ►రష్యాపై ఎదురుదాడికి నాటో దళాలు సిద్ధమయ్యాయి. ఉక్రెయిన్ వైపు అమెరికా యుద్ధ విమనాలు మోహరించింది. ఇటు రష్యా దాడిని ఉక్రెయిన్ సైతం ప్రతిఘటిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను జనాలు వదిలి వెళ్తున్నారు. హైవేలపై ఎక్కడ చూసినా భయంతో తరలిపోతున్నారు. ►ఎయిర్‌బేస్‌లు ఉన్న ప్రాంతాను రష్యా మొదట టార్గెట్ చేసింది. సత్వోయ్లోని హైడ్రాలిక్ పవర్ ప్లాంట్‌పై రష్యన్ ఆర్మీ బాంబు దాడి చేసింది. రష్యా దాడిలో ఉక్రెయిన్‌లో 18 చోట్ల ఇప్పటికే 300 మంది పౌరులు మరణించారు. 23 ప్రాంతాల్లో రష్యా బాలిస్టిక్ మిస్సైల్ ఎటాక్ జరుపుతోంది. ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. ►ఉక్రెయిన్ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని భారత విదేశాంగశాఖ తెలిపింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల గురిచి ఆలోచిస్తున్నామని పేర్కొంది. విద్యార్థుల భద్రత కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని కోరింది. #RussiaUkraineConflict | External Affairs ministry set up control room in New Delhi in view of the situation in Ukraine. The control room will provide information and assistance. The contact details of the control room are 1800118797. ◾ +91 11 23012113 ◾ +91 11 23014104 pic.twitter.com/TU8a0O7xvY— NewsX (@NewsX) February 24, 2022 ► రష్యా దాడులతో అప్రమత్తమైన ఉక్రెయిన్ ఎదురుదాడి ప్రారంభించింది. రష్యాకు ధీటుగా భారీగా బలగాలను మోహరించి కీలక ప్రాంతాల్లో తిరుగుబాటు మొదలు పెట్టింది. రష్యా ఫైటర్ జెట్‌ను ఉక్రెయిన్ బలగాలు కూల్చివేశాయి. 5 రష్యా విమానాలు, హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ►ఉక్రెయిన్‌లోని నగరాలపై దాడులు చేయడం లేదని రష్యా పేర్కొంది. జనావాసాలు తమ లక్ష్యం కాదని, కేవలం సైనిక స్థావరాలు, వసతులు, ఎయిర్ డిఫెన్స్, వాయుసేనను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నట్లు తెలిపింది. ►రష్యా దాడులతో అప్రమత్తమైన ఉక్రెయిన్ ఎదురుదాడి ప్రారంభించింది. రష్యాకు ధీటుగా భారీగా బలగాలను మోహరించింది. రష్యా యుద్ధం ప్రకటించడంతో ఉక్రెయిన్ ప్రభుత్వం మార్షల్ లా విధించింది. పౌరులు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని ఉక్రెయిన్ ఆదేశించింది. ►తమ దేశాన్ని కాపాడుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ముందుగా దౌత్యపరమైన ప్రయత్నాలే చేస్తామన్న జెలెన్ స్కీ.. రెండో ప్రణాళికగా బలగాలను దింపుతామని తెలిపారు. ►రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్ మూసివేసింది. దీంతో ఉక్రెయిన్ నుంచి భారత పౌరులను తీసుకొచ్చేందుకు ఢిల్లీ నుంచి వెళ్లిన ఎయిరిండియా విమానం వెనక్కి మళ్లింది. #BREAKING : Another ballistic missile has been launched by Russian forces into Ukraine's second large city #Kharkiv #UkraineRussiaCrisis #RussiaUkraineConflict #UkraineConflict #UkraineCrisis #WWIII pic.twitter.com/RgNFTyz3rr— Baba Banaras™ (@RealBababanaras) February 24, 2022 ► రష్యా దాడికి ప్రతి చర్య తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై రష్యా అన్యాయంగా దాడి చేస్తోందని, ఈ పరిణామాలకు రష్యానే తప్పక బాధ్యత వహించాలన్నారు. యుద్ధం వల్ల సంభవించే మరణాలు, సంక్షోభాలకు రష్యానే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ► ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించాడు. ఉక్రెయిన్ స్వాధీనం చేసుకునే ఉద్ధేశ్యం రష్యాకు లేదన్నారు. రక్తపాతానికి ఉక్రెయిన్ పాలకులే బాధ్యత వహించాలని అన్నారు. వేర్పాటువాద ప్రాంతాల్లో పౌరులకు రక్షణకు మిలటరీ ఆపరేషన్ మొదలైనట్లు తెలిపారు. ► దక్షిణ బెలారస్లో ఉక్రెయిన్ సరిహద్దులకు అత్యంత సమీపంలోకి రష్యా బలగాలు చేరుకున్నాయి. మాక్సర్ సంస్థ సేకరించిన శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడయింది. దక్షిణ బెలారస్‌లోని మెజ్యార్ ఎయిర్‌ఫీల్డ్ వద్ద 100కుపైగా మిలిటరీ వాహనాలు, డజన్ల కొద్దీ గుడారాలు వెలిశాయి. ఈ విమానాశ్రయం ఉక్రెయిన్‌కు 40 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంది. రష్యా స్వతంత్ర దేశంగా గుర్తించిన డోన్బాస్లోకి రష్యా సేనలు చేరుకున్నాయి. Ucrania Ukraine launching anti aircraft missiles into the night #Ukraina #UkraineRussiaCrisis #worldwar3 Putin#RussiaUkraineConflict https://t.co/LK4aYL3cCW— Shekhar jatrana (@shekharbanat) February 24, 2022 ►రష్యా బలగాల నుంచి తమను తాము రక్షించుకొనేందుకు ఉక్రెయిన్ పౌరులు తుపాకులు చేతబట్టడానికి అనుమతించాలని ఉక్రెయిన్ యోచిస్తుంది. దీనికి ఆ దేశ పార్లమెంటు అమోదం తెలుపాల్సి ఉంది. ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. రష్యా సైనిక చర్య నిలిపేయాలని ఐక్యరాజ్యసమితి విజ్ఙప్తి చేసింది. Russia launched ballistic missile towards Ukraine. #worldwar3 #RussiaUkraineConflict #UkraineRussiaCrisis pic.twitter.com/PsZ5cpZrxd— ɅMɅN DUВEY (@imAmanDubey) February 24, 2022 ►ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ మొదలైందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. దీంతో డోన్సాస్‌లో ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లాలని పుతిన్ హెచ్చరించారు. ఇప్పటికే ఉక్రెయిన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఉక్రెయిన్‌కు 3 వైపులా బలగాలను రష్యా మోహరించింది. ఉక్రెయిన్ సరిహద్దులకు యుద్ధ ట్యాంక్‌లను తరలించింది. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలకు తమ బలగాలను పంపుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీచేశారు. డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల్లో రష్యా బలగాల మోహరించింది. Russian tanks are roaming openly.#RussiaUkraineConflict pic.twitter.com/96gEw59CEw— Abhishek Tripathi (@hinduabhishek01) February 24, 2022 బలగాలు రష్యా ఉక్రెయిన్ ఆర్మీ 8,50,000 2,00,000 యుద్ధ వాహనాలు 30,122 12,303 యుద్ధ ట్యాంకులు 12,420 2,596 విమానాలు 4,173 318 ప్రిగెట్స్ 11 1 విధ్వంస నౌకలు 15 0 యుద్ధ నౌకలు 605 88 అటాక్ హెలికాప్టర్స్ 544 34 Smoke rises in Kharkiv, the northeastern city of #Ukraine. #Ucrania #PutinNATO Kyiv #BBB22 #WWIII #RussiaUkraineConflict #RussiaUcraina #UkraineRussiaCrisis Biden pic.twitter.com/2lSysFUUr6— Ekta Verma (@EktVerma) February 24, 2022 Russia Ukraine Crisis War: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్ మొదలైందని ప్రకటించారు. ఈ సందర్భంగా డోన్భాస్‌లో ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లాలని పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై ఇప్పటికే రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. మరో వైపు పుతిన్ ప్రకటనతో ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ జనరల్ అత్యవసరంగా భేటీ అయ్యింది. -
రెడీ.. యాక్షన్
26/11.. ప్రపంచం మరచిపోలేని రోజు.. 2008 నవంబర్ 26 భారతదేశ ప్రజలు భయబ్రాంతులయిన రోజు. పాకిస్తాన్‌కు చెందిన పదిమంది ముష్కరులు అరేబియా సముద్ర జలాల నుంచి భారత భూభాగంలోకి అడుగుపెట్టారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో మారణ హోమం సృష్టించారు. ప్రతి భారతీయుడు మరిచిపోలేని ఘట్టం. 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. 304 మంది గాయాలపాలయ్యారు. ఆ మారణ హోమంలో స్వదేశీయులతో పాటు విదేశీయులు కూడా అశువులు బాశారు. అంతర్జాతీయ స్థాయి వసతులతో కూడిన పది నక్షత్రాల తాజ్ మహల్ హోటల్లో జరిగిన 60 గంటలపాటు మిలటరీ ఆపరేషన్. ఇది భారతదేశ చరిత్రలో రక్తంతో రాజుకున్న పుటలు. అలాంటి పరిస్థితులు ఇక ఎన్నడూ దేశంలో ఏ ఒక్కచోట జరుగకూడదన్నది భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం. అందులో భాగంగా తీర ప్రాంతంలో కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు. అప్పుడప్పుడు సాగర్ కవచ్ పేరుతో తీర ప్రాంతంలో అప్రమత్తం. నిఘా నీడలో రెండు రోజులపాటు జిల్లాలోని తీర ప్రాంతాన్ని జల్లెడ పట్టనున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక బందోబస్తు నిర్వహణకు జిల్లా పోలీస్ యంత్రాంగం సన్నద్ధమైంది. ప్రజలను అప్రమత్తం చేసేందుకు రెండు రోజులపాటు పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఒంగోలు క్రైం: జిల్లాలోని సముద్ర తీర ప్రాంతం పోలీస్ నిఘా నీడలో కట్టుదిట్టమైన భద్రత నడుమ అప్రమత్తం చేస్తున్నారు. సాగర్ కవచ్ పేరుతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయింది. అటు గుంటూరు జిల్లా సరిహద్దు మొదలుకొని ఇటు నెల్లూరు జిల్లా సరిహద్దు చేవూరు వరకు సముద్ర తీరాన్ని పోలీసులు తమ కనుసన్నల్లోకి తీసుకున్నారు. అటు పోలీసులతో పాటు తీర ప్రాంతంలోని ప్రజలను కూడా అప్రమత్తం చేసేవిధంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజులపాటు తీరం వెంబడి పోలీస్ కసరత్తు ప్రారంభించారు. బుధవారం తెల్లవారు జాము 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రత్యేక పహారా, కట్టుదిట్టమైన భద్రత కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం సన్నద్ధమయింది. తీరం వెంబడి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్లు రెండు ఉన్నాయి. ఒకటి కొత్తపట్నం కాగా రెండోది రామాయపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్లు. ఆ రెండు పోలీస్ స్టేషన్ల పోలీసులతో పాటు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా పోలీస్ బృందాలను కేటాయించింది. అందుకుగాను తీరం వెంబడి ఉన్న పోలీస్ స్టేషన్ల సిబ్బందితో పాటు వాటికి సంబంధించిన పోలీస్ సర్కిళ్ల ఇన్స్పెక్టర్లను కూడా జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు అప్రమత్తం చేశారు. ఇటు జిల్లాకు ఈశాన్య సరిహద్దులోని చీరాల రూరల్ పోలీస్‌స్టేషన్ మొదలుకొని దక్షిణం వైపున ఉన్న కందుకూరు సర్కిల్ వరకు పోలీస్ అధికారులు మొదలుకొని సిబ్బంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని నిఘా చేపట్టనున్నారు. చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ మొదలుకొని ఈపూరు పాలెం, వేటపాలెం, చిన్నగంజాం, నాగులుప్పలపాడు, ఒంగోలు తాలూకా, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక బందోబస్తు.. సాగర్ కవచ్ కోసం సముద్ర తీరం వెంబడి గ్రామాల్లో జిల్లా పోలీస్ యంత్రాంగం 160 మంది పోలీసులతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తీరం వెంబడి 102 కిలో మీటర్ల మేర 8 చెక్ పోస్ట్‌లు, 18 ల్యాండింగ్ పాయింట్లు, 12 పోలీస్ బీట్లు, 10 పోలీస్ పికెట్లు, ఐదు క్విక్ రీయాక్షన్ టీంలను సిద్ధం చేశారు. జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాలే లక్ష్యం.... ముష్కరులు ప్రజలను తద్వారా ప్రభుత్వాలను భయబ్రాంతులను చేసేందుకు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకుంటారు. అందుకోసం సాగర్ కవచ్‌లో భాగంగా పోలీసులు 10 పోలస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జిల్లా కేంద్రం ఒంగోలులోని పరిపాలనా కేంద్రం వద్ద ప్రత్యేకంగా పికెట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒంగోలు రైల్వే స్టేషన్ , ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్, రిమ్స్ ఆస్పత్రి, సూరారెడ్డిపాలెం, అమ్మనబ్రోలు, కరవది, సింగరాయకొండ, టంగుటూరు రైల్వే స్టేషన్లు, సింగరాయకొండ బస్టాండ్‌లో పికెట్లు ఏర్పాటు చేశారు. -
టార్గెట్ ఇండియా.. చైనా మిలిటరీ ఆపరేషన్!
యుద్ధోన్మాద చైనా అధికారిక పత్రిక 'గ్లోబల్ టైమ్స్' మరోసారి డోక్లామ్ వివాదంపై చెలరేగిపోయింది. డోక్లామ్‌లో మోహరించిన భారతీయ సైన్యాన్ని తరిమికొట్టేందుకు చిన్నస్థాయి మిలటరీ ఆపరేషన్‌ను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఈ వారాంతంలో చేపట్టనుందని 'నిపుణుల'ను ఉటంకిస్తూ ఆ పత్రిక చెప్పుకొచ్చింది. ' చైనా భూభాగంలోకి భారత సైనికుల చొరబాటును ఎక్కువకాలం చైనా సహించలేదనే విషయాన్ని గడిచిన 24 గంటల్లో చైనా వైపు నుంచి వెలువడిన వ్యాఖ్యలు.. భారత్‌కు తెలిపాయి. అయినా, భారత్ వెనుకకు తగ్గడానికి నిరాకరిస్తే.. రెండువారాల్లోపు చైనా చిన్నస్థాయి మిలిటరీ ఆపరేషన్‌ను చేపట్టవచ్చు' అని 'గ్లోబల్ టైమ్స్' పత్రిక హు ఝియాంగ్ను ఉటంకిస్తూ పేర్కొంది. దాదాపు రెండునెలలుగా వివాదాస్పద డోక్లామ్ ప్రాంతంలో భారత్-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌ను చొరబాటుదారుగా అభివర్ణిస్తూ చైనా 15 పేజీల వివరణాత్మక పత్రాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. డోక్లామ్ నుంచి భారత సైనికులు స్వచ్ఛందంగా, బేషరతుగా వెంటనే తప్పుకోవాలని డిమాండ్ చేసింది. డోక్లామ్ ప్రతిష్టంభన నెలకొని 50 రోజులైంది. నిజానికది భూటాన్ భూభాగం. అక్కడ చైనా రోడ్డు నిర్మించే ప్రయత్నం చేయగా... అది తమ ప్రయోజనాలకు భంగకరమని భారత్ అడ్డుపడింది. కానీ చైనా మాత్రం వివాదాన్ని పెద్దది చేయడం ద్వారా తాము అనుకున్నది సాధించింది. అక్కడేదో వివాదాస్పద అంశం ఉందనే అభిప్రాయాన్ని అంతర్జాతీయంగా కలిగించడంలో విజయవంతమైంది. చైనా తమ భూభాగాన్ని విస్తరించే క్రమంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. తొలుత సైనిక బలంతో ఇతర దేశాల భూభాగాన్ని దురాక్రమణ చేయడం, తర్వాత అది తమ అంతర్భాగమని అన్ని అంతర్జాతీయ వేదికలపై నొక్కి చెప్పడం. సాధ్యమైనంత ఎక్కువగా అంతర్జాతీయ వేదికలపై దీని ప్రస్తావన తెస్తుంది. ఫలితంగా సదరు చైనా ఆక్రమిత భూభాగం కాస్తా... వివాదాస్పద భూభాగంగా మారిపోతుంది. మరో విధానాన్ని కూడా డ్రాగన్ అనుసరిస్తోంది. చిలకొట్టుడుతో ప్రారంభించి మెల్లిగా దురాక్రమణను విస్తరిస్తుంది. దక్షిణ చైనా సముద్రంలో పారాసెల్స్, స్ప్రాట్లీ దీవుల సముదాయాలు పూర్తిగా తమవేనని చెప్పడం, కృతిమ దీవులను నిర్మించి ఆర్మీబేస్ కింద మార్చేందుకు మౌలికసదుపాయాలను అభివృద్ధి చేయడం... ఇలాంటిదే. డోక్లామ్ కవ్వింపును కూడా చైనా విస్తరణ కాంక్షలో భాగంగానే ప్రపంచ దేశాలు చూడాల్సిన అవసరం ఉంది. 1949లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) అధికారాన్ని హస్తగతం చేసుకున్నపటి నుంచీ చైనా దురాక్రమణల ద్వారా తమ భూభాగాన్ని విస్తరిస్తూనే ఉంది. పూర్తి కథనం: కబలిం‘చైనా’ చదవండి: మావో వల్లే 1959 సరిహద్దు వివాదం -
43 మంది తాలిబాన్ ఉగ్రవాదులు హతం
కాబూల్: ఆఫ్గనిస్తాన్ భద్రతా బలగాలు 'థండర్ 14' పేరుతో చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో 43 మంది తాలిబాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. కుందుజ్ ప్రావిన్స్‌లోని తాలిబాన్ ఉగ్రవాదులపై చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భద్రతా బలగాలకు ఎయిర్ ఫోర్స్ సహకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో 15 మంది ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. తాలిబాన్ ఉగ్రవాదులు శనివారం ఖాన్ అబాద్ జిల్లాను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. కుందుజ్ పట్టణానికి సమీపంలో ఉన్న ఈ వ్యూహాత్మక జిల్లాను భద్రతా బలగాలు వెంటనే తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయని మీడియా సంస్థ 'జిన్హువా' తెలిపింది. ఈ ఆపరేషన్‌లో తాలిబాన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హుస్సేన్ సైతం మృతి చెందినట్లు వెల్లడించింది. కుందుజ్ ప్రాంతంలో పట్టుకోసం తాలిబాన్లు ప్రయత్నిస్తుండటంతో గత రెండు మాసాల నుంచి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
సైన్యం కాల్పుల్లో 15 మంది ఉగ్రవాదులు హతం
కాబుల్: సైన్యం జరిపిన కాల్పుల్లో కనీసం 15 మంది తాలిబన్ గ్రూప్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ అఫ్ఘానిస్తాన్ లోని బఘ్లాన్ ప్రాంతంలో రెండు రోజులుగా జరుగుతోంది. సైన్యం జరిపిన కాల్పుల్లో 15 మంది మృత్యువాత పడగా, మరో 13 మంది గాయపడ్డారని అధికారులు భావిస్తున్నారు. బఘ్లాన్-ఈ-మర్కాజీ జిల్లాలో శుక్రవారం, శనివారం పలు ప్రాంతాల్లో సైన్యం కాల్పులు జరిపింది. రాజధాని కాబుల్ ఉత్తరాన ఈ ప్రాంతం 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో తాలిబన్ ఉగ్రవాదులు ఎక్కువగా సంచరిస్తున్నారన్న సమాచారంతో ఈ కాల్పులు జరిగాయి. పది గ్రామాలను ఉగ్రవాదులు వారి ఆధీనంలోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు. తాలిబన్లు ఈ ఘటనపై ఇప్పటివరకూ స్పందించలేదు. సైనికులకు సంబంధించిన వివరాలు వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు. -
ఇమ్రాన్ ఖాన్ యూటర్న్
ఇస్లామాబాద్: క్రికెటర్, రాజకీయవేత్త ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహరిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) మాటమార్చింది. ఉత్తర వజీరుస్తాన్ లోని పాకిస్థాన్ కు చెందిన తాలిబాన్ మిలిటెంట్లపై మిలటరీ ఆపరేషన్ కు మద్దతు తెలుపాలని నిర్ణయించుకుంది. పార్టీ కోర్ కమిటీ సమావేశంలో భేటి తర్వాత, సీనియర్ల లీడర్ల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉత్తర వజీరుస్థాన్ లో మిలటరీ ఆపరేషన్ ను ఇమ్రాన్ వ్యతిరేకించింది. మిలటరీ ఆపరేషన్ నిర్వహిస్తే అదొక ఆత్మహత్యా సదృశ్యం అని ఇమ్రాన్ గతవారం వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలో గత పదేళ్లలో జరిగిన హింసాత్మక సంఘటనల్లో 50 వేల మంది ప్రజలు మృత్యువాత పడినట్టు పాకిస్థాన్ రక్షణ శాఖ వెల్లడించింది. కరాచీ ఎయిర్ పోర్ట్ పై దాడి ఘటనలో 37 మంది మృతి చెందడానికి కారణమైన పాకిస్థానీ తాలిబాన్ గ్రూప్ పై ఆదివారం నుంచి పాక్ ప్రభుత్వం పెద్ద ఎత్తున మిలటరీ ఆపరేశన్ నిర్వహించింది