Main goal to ‘liberate’ Donbas: ఉక్రెయిన్‌లో సైనిక చర్యకు సంబంధించిన మొదటి దశ పూర్తయిందని రష్యా డిప్యూటీ చీఫ్ కల్నల్ జనరల్ సెర్గీ రుడ్స్కోయ్ అన్నారు. ఈ ఆపరేషన్‌కి సంబంధించిన ప్రధాన పనులన్నీ పూర్తయ్యాయని తెలిపారు. అంతేగాక ఉక్రెయిన్‌లో సాయుధ దళాల పోరాట సామర్థ్యం గణనీయంగా తగ్గిందని కూడా చెప్పారు. ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతాన్ని విముక్తి చేయడమే రష్యా ప్రధాన లక్ష్యం అని నొక్కి చెప్పారు. రష్యా అధ్యక్షుడ వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ యుద్ధం ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని అన్నారు.
అయితే ఈ యుద్ధంలో సుమారు వెయ్యి మంది రష్యా సైనికులు మృతి చెందగా, మూడు వేల మందికి పైగా గాయపడ్డారని రుడ్స్కోయ్ వెల్లడించారు. అయితే నాటో మాత్రం ఈ యుద్ధంలో దాదాపు 15 వేల మంది రష్యాన్ సైనికులు మరణించారని చెప్పడం గమనార్హం. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలను దిగ్బంధం చేసి ఉక్రెయిన్ బలగాలకు నష్టం కలిగించేలా చేయడమే కాకా అక్కడ ఉక్కెయిన్ సైనిక దళాలు బలపడకుండా చేస్తాం అని తెలిపారు.
డోనెట్స్క్, లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ భూభాగాలను స్వాధీనం చేసుకునేంత వరకు ఈ దాడి ఆపేది లేదని తెగేసి చెప్పింది. పైగా తమ ప్రధాన లక్ష్యం ఉక్రెయిన్ నుంచి డాన్‌బాస్ ప్రాంతాన్ని విముక్తి చేయడమే అని రష్యా స్పష్టం చేసింది. అయితే పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించలేదని రష్యా పదే పదే సమర్థించుకునే యత్నం చేయడం విశేషం.
(చదవండి: కీవ్‌లో కల్లోలం.. ఏ క్షణంలోనైనా)
Comments
Please login to add a commentAdd a comment