goal
-
కొత్త పన్ను కోడ్ అవసరం
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన దేశం) లక్ష్య సాధనకు తక్కువ పన్ను రేట్లతో కూడిన సమగ్రమైన పన్నుల కోడ్‌ను తీసుకురావాల్సిన అవసరాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. మరింత మందిని పన్ను పరిధిలోకి తీసుకురావడం, వసూళ్లు మెరుగుపరుచుకోవడం, నిబంధనల అమలును ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. ఇందుకు ‘ఎఫ్‌ఎల్‌ఏటీ’ నమూనాను ప్రస్తావిస్తున్నారు. కేవలం కొన్ని శ్లాబులు, తక్కువ రేట్లతో, వివాదాలను తగ్గించే విధంగా, పన్ను చెల్లింపుదారులను విస్తృతం చేసే విధంగా ఉండాలంటున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు సమర్పించనున్న నేపథ్యంలో నిపుణుల సూచనలకు ప్రాధాన్యం నెలకొంది. ‘‘జీఎస్టీ కింద ఎన్నో రకాల రేట్లు ఉండడం ఎంత మాత్రం మంచిది కాదు. జీఎస్టీ అన్నది ఒక్కటే రేటుగా ఉండాలి. కానీ, మన దేశంలో ఒకటే రేటు అన్నది సాధ్యం కాదు’’అని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) మాజీ చైర్మన్ పీసీ ఝా అభిప్రాయపడ్డారు. కాకపోతే 5 శాతం, 16 శాతం, 28 శాతం చొప్పున మూడు పన్ను శ్లాబులను పరిశీలించాలని సూచించారు. థింక్ చేంజ్ ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా ఈ అంశంపై మాట్లాడారు. ప్రస్తుత పన్ను వ్యవస్థలోని నిబంధనలను సులభతరం చేయాల్సిన అవసరాన్ని ఎర్నెస్ట్ అండ్ యంగ్ పార్ట్నర్ రాజీవ్ ఛుగ్ సైతం సమరి్థంచారు. ‘‘పన్ను రేట్లు తగ్గించడం వల్ల పౌరులు, కంపెనీలకు ఖర్చు పెట్టేందుకు వీలుగా నిధుల మిగులు పెరుగుతుంది. రేట్లను క్రమబద్దీకరిస్తే అది ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలుస్తుంది’’అని ఛుగ్ వివరించారు. -
జర్మనీకి భారత్ షాక్
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జర్మనీ జట్టుతో గురువారం జరిగిన చివరిదైన రెండో మ్యాచ్‌లో టీమిండియా 5–3 గోల్స్ తేడాతో జర్మనీని ఓడించింది. భారత్ తరఫున సుఖ్జీత్ సింగ్ (34వ, 48వ నిమిషాల్లో), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (42వ, 43వ నిమిషాల్లో) రెండు గోల్స్ చొప్పున చేయగా... అభిషేక్ (45వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. జర్మనీ జట్టుకు ఇలియన్ మజ్కోర్ (7వ, 57వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించగా... హెన్రిక్ మెర్ట్జెన్స్ (60వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 0–2తో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో భారత్ నెగ్గడంతో సిరీస్ 1–1తో సమమైంది. ఈ నేపథ్యంలో సిరీస్ విజేతను నిర్ణయించేందుకు ప్రత్యేకంగా ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో జర్మనీ 3–1తో భారత్‌పై గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. -
వెఘొర్స్ 'సూపర్ గోల్'.. నెదర్లాండ్స్ సంచలన విజయం
యూరో కప్-2024లో నెదర్లాండ్స్ బోణీ కొట్టింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం హాంబర్గ్ వేదికగా పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-1తో నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ గేమ్‌లో ఆఖరికి విజయం డచ్ జట్టునే వరించింది.తొలుత ఫస్ట్‌హాఫ్ 16వ నిమిషంలో ఆడమ్ బుకస పోలండ్‌కు మొదటి గోల్‌ను అందించాడు. అనంతరం 29వ నిమిషంలో నెదర్లాండ్స్ ఫార్వర్డ్ కోడి గక్పో అద్బుతమైన గోల్ కొట్టి స్కోర్‌ను 1-1తో సమం చేశాడు.ఫస్ట్‌హాఫ్ ముగిసే సమయానికి ఇరు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలిచాయి. ఈ క్రమంలో బ్రేక్ సమయంలో పొలాండ్ మేనెజర్ మిచాల్ ప్రోబియర్జ్ తమ జట్టులో ఒక మార్పు చేశాడు. జాకుబ్ మోడర్‌కు బదలుగా ఇంపాక్ట్ సబ్‌గా స్జిమాన్స్కీ జాకుబ్ తీసుకువచ్చాడు.కానీ ఎటువంటి ఫలితం లేదు. దీంతో ప్రోబియర్జ్ మళ్లీ 10 నిమిషాల తర్వాత మరో రెండు మార్పులు చేశాడు. కానీ ఫలితం ఏ మాత్రం మారలేదు. ఇక సెకెండ్ హాఫ్ ముగిసే సమయం దగ్గరపడుతుండడంతో 1-1 డ్రాగా ముగుస్తుందని అంతా భావించారు.వౌట్ వెఘొర్స్ అద్బుతం..ఈ క్రమంలో డచ్ మేనేజర్ రోనాల్డ్ కోమాన్ తీసుకున్న ఓ నిర్ణయం అందరి అంచనాలను తారుమారు చేసింది. ఆఖరి బ్రేక్ సమయంలో రోనాల్డ్ కోమాన్.. మెంఫిస్ డిపే స్థానంలో వౌట్ వెఘోర్స్ట్ని ఇంపాక్ట్ సబ్‌స్ట్యూట్‌గా తీసుకువచ్చాడు.మైదానంలో అడుగపెట్టిన వెఘొర్స్.. ఆట మరికొద్దిసేపట్లో ముగుస్తుందనగా 83వ నిమిషంలో గోల్‌కొట్టి డచ్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో నెదర్లాండ్స్ జట్టు ఒక్కసారిగా సంబరాల్లో మునిగి తేలిపోగా.. పొలాండ్ నిరాశలో కూరుకు పోయింది.చదవండి: ఆర్చరీలో భారత్‌కు ఒలింపిక్ బెర్త్ -
ఒక అసాధ్యాన్ని సాధిస్తా! ఈ భూమిని మరింత గొప్పగా తీర్చిదిద్దుతా
మనం అందరం కారణజన్ములం. ఏదో ఒక ప్రత్యేకమైన గొప్ప పని చేసేందుకు ఈ భూమిపై జన్మించాం. ఇంత గొప్ప అవకాశం వృథా చేసుకోకండి. ఈ సంవత్సరం ఏదైనా కొత్త, సృజనాత్మకమైన పని మొదలుపెట్టండి. ఏదైనా కొత్త పని చేయకుండా ఏ సంవత్సరమూ గడచిపోకూడదు. మీకు ఏ కలలూ లేకపోతే, వాటిని నిజం చేసుకోలేరు కదా! ఏ కొత్త ఆవిష్కరణ అయినా ఒక కలతో మొదలవుతుంది. ఉన్నతంగా కలలుగనే, ఆలోచించే స్వేచ్ఛని మీకు మీరు ఇచ్చుకోండి. ఆపై, వాటిని సాధించేందుకు నూరుశాతం ధైర్యంతో, సమర్పణ భావంతో పనిచేయండి. చాలాసార్లు ఉన్నతమైన కలలు కనేవారిని ఇతరులు అపహాస్యం చేశారు. కానీ వారు వెనక్కు తగ్గకుండా, తమ లక్ష్యాలను సాధించేవరకూ స్థిరంగా నిలబడ్డారు. మనలో ఉండే ప్రాణశక్తి ప్రవహించేందుకు ఒక దిశను చూపటం అవసరం. దానికి సరైన దిశను చూపకపోతే మీరు గందరగోళంలో చిక్కుకుపోతారు. జీవశక్తి ఒక నిర్దిష్ట దిశలో పయనించేలా చేయాలంటే మనకు నిబద్ధత అవసరం. ఈ రోజున చాలామంది, తమ జీవితానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం, దిశానిర్దేశం లేకపోవడం చేత అయోమయంలో ఉన్నారు. మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీ ప్రాణశక్తి తారాస్థాయిలో ఉంటుంది, మరి అంత ఎక్కువగా ఉన్న ఆ ప్రాణశక్తికి, ఎటువెళ్లాలో చెప్పకపోతే, అది అక్కడే చిక్కుకుపోతుంది. ఒకేచోట పేరుకుపోతే ఏమౌతుంది? కుళ్ళిపోయి, పనికి రాకుండా పోతుంది. ఇక్కడ రహస్యం ఏమిటీ అంటే, మన లక్ష్యం పట్ల నిబద్ధత ఎంత గొప్పగా ఉంటే, దాన్ని సాధించేందుకు అంత గొప్ప శక్తి మనకు లభిస్తుంది. లక్ష్యం ఎంత గొప్పగా ఉంటే, పనులు అంతా సులభంగా, తేలికగా జరిగిపోతాయి. అదే చిన్న లక్ష్యాలు పెట్టుకున్నారనుకోండి, ఎందుకంటే మీలో సామర్థ్యం కొండంత ఉంది, మీరేమో ఈ చిన్న పనిలో ఇరుక్కుపోయారు అనిపించి మీకే చికాకుగా ఉంటుంది. మీరు సమాజం బాగు కోసం పనిచేస్తున్నప్పుడు, మీరు పది పనులు చేస్తున్నారనుకుందాం. వాటిలో ఒక పనిలో పొరపాటు జరిగినా, మిగతా తొమ్మిది పనులూ చేస్తూ ఉంటే, ఈ మొదటి పనిలో పొరపాట్లు వాటంతట అనే సర్దుకుంటాయి. సాధారణంగా కృప అనేది ఇలా పనిచేస్తుంది. మొదట అవసరమైన వనరులు సమకూరితే, అప్పుడు పెద్ద లక్ష్యం పెట్టుకుని పని చేద్దామమని మనం సాధారణంగా అనుకుంటాం. కాని, మొదట మీ లక్ష్యం గొప్పగా ఉంటే, వనరులు వాటంతట అనే సమకూరుతాయి. మనం పెట్టుకున్న లక్ష్యమే మనకు ఆ శక్తిని బహుమతిగా ఇస్తుంది. మీరు మీ కుటుంబ శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకున్నారనుకోండి, ఆ కుటుంబమే మీకు సహాయం చేస్తుంది. మీరు సమాజం మొత్తానికి గొప్ప పనిచేయాలని సంకల్పించుకుంటే సమాజం మొత్తం మీకు సహాయపడటాన్ని మీరే చూస్తారు. మీకు కావలసిన సహాయం మీరు అడక్కముందే వచ్చి చేరుతుంది. సాధారణంగా మనం మనసులో తపనపడుతూ ఉంటాము, కానీ మన చర్యలు నెమ్మదిగా ఉంటాయి. విజయానికి సోపానం ఏమంటే, మనసులో ఓరిమి, పనిలో ఉత్సాహం. అభిరుచిని, వైరాగ్యాన్ని సరిసమానంగా స్వీకరించండి. మీ లక్ష్య సాధనకై ధైర్యంగా ముందుకు సాగండి, అవసరమైనప్పుడు వదిలేయడం కూడా నేర్చుకోవాలి. అపుడు సహజంగా సమృద్ధి చేకూరుతుంది. మీరు ధ్యానం చేసినపుడు మీరు సూక్ష్మంగా గమనించగలుగుతారు. మీకు పూర్తిగా విశ్రాంతి లభిస్తుంది, అదే సమయంలో బుద్ధి, వివేచన, సద్యఃస్ఫూర్తి వృద్ధి చెందుతాయి. మీరు ఎఱుకతో ఉండి పనిచేస్తే అది సరైన పని అవుతుంది. చెదిరిపోని దృష్టి, సద్యఃస్ఫూర్తితో పనిచేసే మనసు మీ లక్ష్యాన్ని సాధించేందుకు సహాయ పడతాయి. ఒత్తిడి లేని, ఉత్సాహభరితమైన జీవితానికి, మీరు అనుకున్న లక్ష్యాలపై స్పష్టమైన అవగాహనతో పనిచేసేందుకు సరైన మార్గం ధ్యానం. నిబద్ధత అనేది దీర్ఘకాలంలో ఎప్పుడూ సుఖాన్ని ఇస్తుంది. ఈ ప్రపంచాన్ని మరింత సురక్షితంగా జీవించే అద్భుత ప్రదేశంగా మార్చాలని కంకణం కట్టుకోండి. అసాధ్యమైన కల కనండి! మీ నిబద్ధతకు ఆశించిన ఫలితం రావాలంటే సరైన ఆలోచనలు, సరైన చర్యలు రెండూ అవసరమే. మీరు సాధించాలనుకుంటున్న అన్ని విషయాలతో పెద్ద చిట్టా తయారు చేసుకోకండి. స్థూలంగా పరిశీలించి, నిజంగా అవసరమైన కొన్ని లక్ష్యాలను ఎంచుకోండి. మనకు అత్యంత సంతృప్తిని ఇచ్చే వాటిని, దీర్ఘకాలంలో పదిమంది జీవితాలను తీర్చిదిద్దే వాటిని ఎంచుకుని పని చేసినపుడు, మగిలిన చిన్నాచితక విషయాలు వాటంతట అవే గాడిలో పడతాయి. మనస్సు పూర్తిగా వర్తమానంలో ఉన్నప్పుడు, మీకు సరైన ఆలోచనలు వస్తాయి. లక్ష్యాలు పెట్టుకోవడం మాత్రమే కాకుండా, వాటిని సాధించే విధానం కూడా ప్రణాళిక వేసుకోవాలి. మూడేళ్ళ తర్వాత మిమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? ఒక ఇరవై ఏళ్ల తర్వాత? నలభై ఏళ్ళ తర్వాత? ఫలితం గురించి ఎక్కువ ఆలోచించకుండా మీ విధిని నూరు శాతం నిర్వర్తించండి. గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ -
నిర్మాత కావాలన్నదే లక్ష్యం
‘‘కృష్ణ, చిరంజీవిగార్ల సినిమాలు చూసి హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీగార్ల స్ఫూర్తితో హాస్య నటుడిగా నాకంటూ గుర్తింపు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. నిర్మాత కావాలన్నదే నా లక్ష్యం.. అలాగే ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ నిర్మించాలన్నది నా కల’’ అని నటుడు గడ్డం నవీన్ అన్నారు. రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’, వెంకటేష్ ‘సైంధవ్’ చిత్రాలతో పాటు ‘భైరవ కోన’, ‘మిస్టరీ, ‘వృషభ’, ‘చూ మంతర్’, ‘భూతద్దం భాస్కర్’ వంటి పలు సినిమాల్లో నటిస్తున్న ఆయన మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ 150 సినిమాలు చేస్తే, వాటిలో 90 చిత్రాల్లో మంచి పాత్రలొచ్చాయి. ఈ ఏడాది సంతృప్తికరమైన ప్రయాణం సాగుతోంది’’ అన్నారు. -
గెలుపు గుర్రాలపై ఫోకస్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. గెలుపు గుర్రాలను ఎంపిక చేయడమే లక్ష్యంగా మార్గదర్శకాలను సిద్ధం చేయడంపై దృష్టిపెట్టింది. ఈ మేరకు సోమవారం గాందీభవన్‌లో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో బాబా సిద్ధిఖీ, జిగ్నేశ్ మేవానీల సమక్షంలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీఈసీ సభ్యులు బలరాం నాయక్, రోహిత్‌చౌదరి, మహేశ్‌కుమార్‌గౌడ్, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రేమ్‌సాగర్‌రావు, అంజన్‌కుమార్ యాదవ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, మన్సూర్ అలీఖాన్, వంశీచంద్‌రెడ్డి, శివసేనారెడ్డి, సంపత్‌కుమార్, జగ్గారెడ్డి, రేణుకా చౌదరి, జానారెడ్డి, జీవన్‌రెడ్డి, అజారుద్దీన్, సీతక్క, సునీతారావు తదితరులు ఇందులో పాల్గొని చర్చించారు. 18 నుంచి దరఖాస్తులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ ప్రారంభించాలని పీఈసీ సమావేశం నిర్ణయించింది. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు గాందీభవన్‌లో దరఖాస్తులను స్వీకరించనుంది. అయితే ఈ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు.. పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు. ఇక దరఖాస్తు రుసుము కింద ఓసీల నుంచి రూ.10 వేలు, ఇతర వర్గాల నుంచి రూ.5వేలను డీడీ రూపంలో తీసుకోవాలని సమావేశంలో అభిప్రాయపడినా.. ఓసీలకు రూ.50 వేలు, ఇతరులకు రూ.25 వేలుగా ఫీజును ఖరారు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఫీజు ఎంతన్నది సబ్‌కమిటీ ఖరారు చేయనుంది. దరఖాస్తుల స్వీకరణ ముగిశాక సెప్టెంబర్ మొదటివారంలో మరోమారు సమావే శం కావాలని.. మూడో వారానికల్లా తొలి విడత జాబితా సిద్ధం చేయాలని కూడా నిర్ణయించారు. ఆశావహులు దరఖాస్తు చేసుకునే సమయంలోనే.. పార్టీలో అనుభవం, గత నాలుగేళ్లలో చేసిన కార్యక్రమాలను వివరించాలని పేర్కొననున్నట్టు తెలిసింది. బీసీలకు ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో కనీ సం 2 అసెంబ్లీ సీట్లకు తగ్గకుండా కేటాయించాలనే అంశంపైనా చర్చించినట్టు సమాచారం. అనంతరం స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ మూడో వారంలో తొలి జాబితా ప్రకటిస్తామని, అభ్యర్థుల ఖరారులో సామాజిక న్యాయాన్ని పాటిస్తామని చెప్పారు. అడిగిన అందరికీ టికెట్లివ్వడం కుదరదు: మహేశ్‌కుమార్‌గౌడ్ పీఈసీ సమావేశం అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు.పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకునే హక్కు అందరికీ ఉంటుందని.. అయితే అందరికీ టికెట్లు ఇవ్వడం కుదరనందున సర్వేలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఒక్క సర్వేలు మాత్రమే ఆధారం కాదని, పీఈసీ అనేక అంశాల్లో వడపోత చేపట్టి అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరిస్తుందని వివరించారు. ఆ జాబితాలను స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుందని, తర్వాత సీడబ్ల్యూసీ ఆమోదం తీసుకుని టికెట్లను ప్రకటిస్తారని చెప్పారు. రేవంత్ వర్సెస్ పొన్నాల పీఈసీ సమావేశం అనంతరం ఏఐసీసీ గదిలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. వరంగల్ జిల్లా రాజకీయాలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని తాను చాలా కాలం నుంచి కోరుతున్నా.. సమయం ఇవ్వడం లేదని, ఇష్టారాజ్యంగా పార్టీ జిల్లా అధ్యక్షులను నియమిస్తున్నారని పొన్నాల ప్రశ్నించినట్టు సమాచారం.దీంతో వరంగల్‌లో జరిగిన సమావేశానికి పొన్నాల వచ్చి మాట్లాడి ఉండాల్సిందని రేవంత్ పేర్కొన్నట్టు తెలిసింది. దీనిపై పొన్నాల ఆగ్రహంగా స్పందిస్తూ.. ఎవరు పిలిచారని వరంగల్ మీటింగ్‌కు రావాలని నిలదీశారని, బీజేపీలోకి వెళ్లాలని చూసిన నాయకులను తీసుకొచ్చి అందలం ఎక్కించారని మండిపడినట్టు సమాచారం. పార్టీలో 45 ఏళ్లుగా పనిచేస్తున్న తమ లాంటి నేతలకు కనీస మర్యాద ఇవ్వకుండా వ్యవహరిస్తే ఎలాగని నిలదీసినట్టు తెలిసింది. ఈ సమయంలో అన్ని విషయాలు తర్వాత మాట్లాడుదామంటూ మాణిక్‌రావ్ ఠాక్రే సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. తానేమీ అబద్ధం చెప్పడం లేదని, పీసీసీ అధ్యక్షుడి ముందే అన్నీ ప్రస్తావిస్తు న్నానని పొన్నాల గట్టిగా మాట్లాడినట్టు సమాచారం. -
రాజ్యాధికారమే లక్ష్యం కావాలి
కోరుట్ల: రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పద్మశాలీ ఆత్మగౌరవ సభలో వక్తలు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆదివారం జరిగిన పద్మశాలీ ఆత్మగౌరవ యుద్ధభేరి సభకు ప్రముఖ కవి గుంటుక నరసయ్య పంతులు ప్రాంగణంగా నామకరణం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 వేల మంది కులబాంధవులు తరలివచ్చారు. తొలుత ముఖ్య అతిథిగా హాజరైన మధ్యప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) పరికిపండ్ల నరహరి మాట్లాడుతూ, పద్మశాలీలు ఐక్యంగా ముందుకు సాగితే సాధించలేనిదేదీ లేదని, చట్టసభల్లో ప్రాతినిధ్యం సాధించడంపై దృష్టి పెట్టాలని కోరారు. పిల్లలు ఉన్నత చదువులు చదివి సంఘం ఐక్యతకు కృషి చేయాలన్నారు. పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజకీయాల్లో ప్రాధాన్యత సాధించేవరకూ పద్మశాలీలు విశ్రమించవద్దని కోరారు. అందరూ ఏకమై ‘మనఓటు మనకే’ నినాదంతో ముందుకు రావాలని కోరారు.కర్నూలు ఎంపీ సంజయ్ మాట్లాడుతూ, పద్మశాలీలు ఎక్కడున్నా జన్యుపరమైన సంబంధం కలుపుతుందన్నారు. ఏపీలో పద్మశాలీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. ఎంపీగా పార్లమెంట్లో పద్మశాలీలకు చెందిన రెండు వీవర్స్ బిల్లులు ప్రవేశపెట్టడానికి కృషి చేశానని తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ, పద్మశాలీ కులశక్తి విచ్ఛిన్నం కాకుండా పోరాటం చేస్తే సత్ఫలితాలు ఉంటాయన్నారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ, రాజకీయ పార్టీ ఏదైనా పద్మశాలీలు ఐక్యంగా ఉండాలని సూచించారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ, రాజకీయ అస్థిత్వాన్ని సాధించే దిశ గా ఏర్పాటు చేసిన ఈ సభకు వేలాదిగా పద్మశాలీ లు తరలిరావడం అభినందనీయమన్నారు. ఆత్మ గౌరవ యుద్ధభేరి సభ కమిటీ రాష్ట్ర చైర్మన్ బసవ లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ, చట్టసభల్లో ప్రాతి నిధ్యం ఉంటేనే పద్మశాలీల సమస్యలకు పరిష్కారం దక్కుతుందన్నారు. బీసీల్లో అతిపెద్ద సామాజికవర్గంగా ఉన్నా.. చట్టసభల్లో ఆశించిన రీతిలో ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆవేదన చెందారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, జగిత్యాల జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, పద్మశాలీ సంఘం రాష్ట్ర నాయకులు గజ్జెల శ్రీనివాస్, జక్కుల ప్రసాద్ పాల్గొన్నారు. -
#LionelMessi: ఆపడం ఎవరి తరం.. కెరీర్లోనే అత్యంత ఫాస్టెస్ట్ గోల్
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ మంచి దూకుడు మీద ఉన్నాడు. గతేడాది ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ గెలిచినప్పటి నుంచి మెస్సీలో ఉత్సాహం మాత్రం తగ్గడం లేదు. పైగ రోజురోజుకు మెస్సీ క్రేజ్ పెరుగుతూనే ఉంది. అతని జోరు.. ఫిట్నెస్ చూస్తుంటే మరో ఫిఫా వరల్డ్‌కప్ ఆడేలా కనపిస్తున్నాడు. తాజాగా గురువారం బీజింగ్ వేదికగా అర్జెంటీనా, ఆస్ట్రేలియా అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్‌లో మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్లోనే అత్యంత ఫాస్టెస్ట్ గోల్ నమోదు చేశాడు. ఆట మొదలైన నిమిషం 19 సెకన్ల వ్యవధిలోనే మెస్సీ అర్జెంటీనాకు గోల్ అందించాడు. మెస్సీ కెరీర్లో ఇదే అత్యంత ఫాస్టెస్ట్ గోల్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గత ఏడు మ్యాచ్‌ల్లో అర్జెంటీనా తరపున మెస్సీకి ఇది ఏడో గోల్ కాగా.. ఓవరాల్‌గా ఈ ఏడాది 13 మ్యాచ్‌ల్లో 17 గోల్స్ చేసిన మెస్సీ.. 5 అసిస్ట్‌లు అందించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే అర్జెంటీనా ఆస్ట్రేలియాపై 2-0 తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆరంభంలోనే మెస్సీ గోల్ అందించగా.. ఆట 68వ నిమిషంలో జెర్మన్ పెజెల్లా జట్టుకు రెండో గోల్ అందించాడు. Leo Messi. After one minute. Of course ☄️ (via @CBSSportsGolazo)pic.twitter.com/r5UknzrZvB — B/R Football (@brfootball) June 15, 2023 చదవండి: ఐపీఎల్ బంధం ముగిసే.. మేజర్ లీగ్ క్రికెట్లో మొదలు -
విజయంతో ముగించిన హైదరాబాద్ ఎఫ్‌సీ
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) లీగ్ దశను హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) విజయంతో ముగించింది. ఆదివారం కొచ్ఛిలో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 1–0 గోల్ తేడాతో కేరళ బ్లాస్టర్స్‌ను ఓడించింది. 29వ నిమిషంలో చేసిన ఏకైక గోల్‌తో బొర్జా హెరెరా హైదరాబాద్‌ను గెలిపించాడు. లీగ్ దశలో ఆడిన 20 మ్యాచ్‌లలో 13 గెలిచి 4 మ్యాచ్‌లు ఓడిన హైదరాబాద్ మరో 3 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. మొత్తం 42 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన టీమ్ ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించింది. లీగ్ దశలో 46 పాయింట్లతో ముంబై సిటీ ఎఫ్‌సీ అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 4న కోల్‌కతాలో మోహన్‌బగాన్, ఒడిషా ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్ విజేతతో హైదరాబాద్ రెండో సెమీఫైనల్ (తొలి అంచె)లో తలపడుతుంది. ఈ మ్యాచ్ మార్చి 9న హైదరాబాద్‌లోనే జరుగుతుంది. మార్చి 13న రెండో సెమీఫైనల్ (రెండో అంచె) మ్యాచ్ ప్రత్యర్థి వేదికపై జరుగుతుంది. -
cristiano Ronaldo: ఎట్టకేలకు గోల్.. కనిపించని సెలబ్రేషన్స్
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఎట్టకేలకు అల్-నసర్ తరపున తొలి గోల్ కొట్టాడు. అల్ ఫతేహ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి నిమిషంలో తన గోల్‌తో అల్-నసర్ను ఓటమి నుంచి గట్టెక్కించి మ్యాచ్‌ను డ్రా చేయడంలో సఫలమయ్యాడు. అదనపు సమయంలో లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన రొనాల్డో ఎప్పుడు గోల్ కొట్టినా సుయ్(Sui) సెలబ్రేషన్ చేయడం చూస్తుంటాం. కానీ తొలిసారి ఎలాంటి సెలబ్రేషన్స్ లేకుండా రొనాల్డో సాదాసీదాగా కనిపించాడు. బహుశా మ్యాచ్‌ను డ్రా చేసుకోవడమే అందుకు కారణమనుకుంటా. కాగా ఫిఫా వరల్డ్‌కప్ జరగుతున్న సమయంలోనే మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో తెగదెంపులు చేసుకున్న రొనాల్డో.. సౌదీ అరేబియాకు చెందిన అల్ నసర్ క్లబ్‌తో 200 మిలియన్ యూరోలకు రెండున్నరేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్నాడు. అల్ నసర్ క్లబ్‌కు వెళ్లినప్పటి నుంచి రొనాల్డో ఒక్క గోల్ కూడా కొట్టలేదు. తాజాగా క్లబ్ తరపున తొలి గోల్ నమోదు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే అల్ ఫతేహ్‌తో మ్యాచ్‌ను అల్ నసర్ 2-2తో డ్రా చేసుకుంది. ఆట 12వ నిమిషంలో మాజీ బార్సిలోనా స్టార్ క్రిస్టియాన్ టెల్లో గోల్ కొట్టడంతో అల్ ఫతేహ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆట 42వ నిమిషంలో టలిస్కా అల్ నసర్‌కు తొలి గోల్ అందించి 1-1తో సమం చేశాడు. తొలి హాఫ్‌ను రెండు జట్లు 1-1తో ముగించాయి. రెండో అర్థభాగం మొదలయ్యాకా 58వ నిమిషంలో అల్ ఫతేహ్ ఆటగాడు సోఫియాఏ బెండెబ్కా గోల్ కొట్టి జట్టును 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి నిర్ణీత సమయంలోగా అల్ నసన్ మరో గోల్ కొట్టలేకపోయింది. అయితే అదనపు సమయంలో రొనాల్డోకు లభించిన పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకొని గోల్‌గా మలచడంతో మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. ఇక 15 మ్యాచ్‌ల తర్వాత అల్ నసర్ లీగ్‌లో తొలి స్థానంలో నిలిచింది. జట్టు ఖాతాలో 34 పాయింట్లతో ఉంది. ఇక అల్ నసర్ గురువారం అల్ వేదాకు బయలుదేరి వెళ్లింది. د90+3' هدف التعادل لـ النصر عن طريق كريستيانو رونالدو الفتح 2 × 2 النصر#الفتح_النصر | #CR7 | #SSC pic.twitter.com/5SYppTQXlU — شركة الرياضة السعودية SSC (@ssc_sports) February 3, 2023 చదవండి: ఎన్బీఏ స్టార్ క్రేజ్ మాములుగా లేదు; ఒక్క టికెట్ ధర 75 లక్షలు -
Cristiano Ronaldo: 'ఇదంతా తొండి.. ఆ గోల్ నాది'
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. గ్రూప్-హెచ్లో భాగంగా క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఉరుగ్వేతో తలపడింది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ 2-0తో గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. ఇక పోర్చుగల్ మిడ్ ఫీల్డర్ బ్రూనో ఫెర్నాండేజ్ రెండు గోల్స్ చేసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫెర్నాండేజ్ ఆటతీరకు ముగ్దుడైన రొనాల్డో స్వయంగా అభినందించాడు. కానీ మ్యాచ్‌లో ఫెర్నాండేజ్ కొట్టిన ఒక గోల్ విషయమై ఆరోపణలు చేశాడు. ఆట తొలి అర్థభాగంలో ఇరుజట్లు ఎలాంటి గోల్ నమోదు చేయలేకపోయాయి. ఇక రెండో అర్థభాగంలో ఆట 54వ నిమిషంలో రొనాల్డో హెడర్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి కొట్టినట్లు భ్రమపడి సంబరాల్లో మునిగిపోయాడు. అయితే ఆ గోల్ చేసింది రొనాల్డో కాదని.. బ్రూనో ఫెర్నాండేజ్ అని తర్వాత తెలిసింది. అసలేం జరిగేందంటే.. వాస్తవానికి రొనాల్డో హెడర్ గోల్ చేసినట్లు ఎక్కడా కనిపించలేదు. అంతకముందే రొనాల్డోకు క్రాస్‌గా వచ్చిన బ్రూనో ఫెర్నాండేజ్ షాట్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. ఇక బంతి గోల్ పోస్ట్‌లోకి వెళ్లడానికి ముందు రొనాల్డోకు ఎక్కడా తగల్లేదని రిప్లేలో తేలింది. దీంతో బ్రూన్ ఫెర్నాండేజ్ ఖాతాలోకి ఆ గోల్ వెళ్లిపోయింది. అయితే రిఫరీ నిర్ణయంతో షాక్ తిన్న రొనాల్డో.. అంతా తొండి.. ఆ గోల్ నాది.. అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత బ్రూనో ఆట 90+ మూడో నిమిషంలో మరో గోల్ చేయడంతో పోర్చుగల్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లడం.. ఆపై విజయం సాధించడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ రొనాల్డో ఖాతాలోకి ఆ గోల్ వెళ్లి ఉంటే మాత్రం చరిత్ర సృష్టించేవాడే.. కానీ కొద్దిలో మిస్ అయింది. ఇక ఉరుగ్వేపై విజయంతో ఫిఫా వరల్డ్‌కప్‌లో ప్రి క్వార్టర్స్‌కు చేరిన మూడో జట్టుగా పోర్చుగల్ నిలిచింది. కాగా 2018 చాంపియన్స్ ఫ్రాన్స్‌తో పాటు ఐదుసార్లు చాంపియన్ అయిన బ్రెజిల్ కూడా ఇప్పటికే రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించాయి. ఇక పోర్చుగల్ తన తర్వాతి మ్యాచ్ డిసెంబర్ 3న దక్షిణ కొరియాతో ఆడనుంది. #Ronaldo fans, do answer this 👇 Did the ⚽ hit #Ronaldo before it went inside the 🥅 or not? 🤔#PORURU #BrunoFernandes #ManUtd #Qatar2022 #WorldsGreatestShow #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/58AxS2Bb11 — JioCinema (@JioCinema) November 28, 2022 The goal has officially been ruled as scored by Bruno Fernandes #POR #URU https://t.co/3NN2pbupe0 — FIFA World Cup (@FIFAWorldCup) November 28, 2022 చదవండి: FIFA WC 2022: ఏడు నిమిషాల ముందు గోల్ చేసి.. ప్రిక్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ -
వావ్ వాట్ ఏ గోల్.. రిచర్లిసన్ అద్భుత విన్యాసం! వీడియో వైరల్
ఫిఫా ప్రపంచకప్-2022లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్ బోణీ కొట్టింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా సెర్బియాతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో విజయం సాధించింది. బ్రెజిల్ యువ సంచలనం రిచర్లిసన్ రెండు గోల్స్‌తో బ్రెజిల్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. కాగా మ్యాచ్ తొలి భాగంలో బ్రెజిల్‌ను సెర్బియా తమ అద్భుతమైన ఢిపెన్స్‌తో అడ్డుకుంది. ఫస్ట్ హాఫ్‌లో ఇరు జట్లు గోల్స్ సాధించలేదు. సెకెండ్ హాఫ్ 63వ నిమిషంలో రిచర్లిసన్ బ్రెజిల్‌కు తొలి గోల్‌ను అందించాడు. అనంతరం 73వ నిమిషంలో రెండో గోల్‌ను కూడా రిచర్లిసన్ సాధించాడు. దీంతో బ్రెజిల్ అధిక్యం 2-0 చేరుకుంది. అనంతరం బ్రెజిల్ పటిష్టమైన ఢిపెన్స్ సెర్బియాకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా గెలుపొందింది. తద్వారా గ్రూప్-జి నుంచి బ్రెజిల్ అగ్ర స్థానంలో నిలిచింది. సంచలన గోల్‌తో మెరిసిన రిచర్లిసన్ ఈ మ్యాచ్‌లో రిచర్లిసన్ సంచలన గోల్‌తో మెరిశాడు. మ్యాచ్ సెకెండ్ హాఫ్ 73వ నిమిషంలో వినిసియస్ జూనియర్ పాస్ చేసిన బంతిని అద్భుతమైన అక్రోబాటిక్ సిజర్ కిక్‌తో రిచర్లిసన్ గోల్ సాధించాడు. దీంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా రిచర్లిసన్ అద్భుతమైన గోల్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. RICHARLISON WHAT A GOALL! pic.twitter.com/9SyAhhCPGj — TC (@totalcristiano) November 24, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: FIFA WC 2022: బోణీ కొట్టిన బెల్జియం.. కెనడాకు పరాభవం -
FIFA WC: పాపం.. గోల్ కొట్టినా సెలబ్రేట్ చేసుకోలేక
ఫిఫా వరల్డ్‌కప్‌లో ఒక ఆటగాడు గోల్ కొట్టాడంటే దానిని గొప్పగా చూస్తారు. మాములు మ్యాచ్‌ల్లో గోల్ కొడితే పెద్దగా కిక్ రాదు. కానీ ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్‌లు అలా కాదు. ఎందుకంటే నాలుగేళ్లకోసారి జరిగే సాకర్ సమరంలో గోల్స్ కొట్టిన ఆటగాడు హీరో అయితే కొట్టనివాడు జీరో అవుతాడు. ఇది మొదటినుంచి వస్తున్న సంప్రదాయమే. ఒక ఆటగాడు గోల్ కొడితే అది చూసిన అభిమానులు కేరింతలు, ఈలలు, గోలతో రెచ్చిపోతారు. మరి గోల్ కొట్టిన ఆటగాడి సెలబ్రేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే తాజాగా గురువారం స్విట్జర్లాండ్, కామెరున్ మ్యాచ్‌లో గోల్ కొట్టిన ఒక ఆటగాడు మాత్రం దానిని సెలబ్రేట్ చేసుకోలేకపోయాడు. అతనే స్విట్జర్లాండ్ స్రైకర్ బ్రీల్ ఎంబోలో. ఈ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ 1-0 తేడాతో కామెరున్‌పై విజయం సాధించింది. మ్యాచ్‌లో నమోదైన ఒక్క గోల్ కూడా బ్రీల్ ఎంబోలో చేసిందే. అతని గోల్ పుణ్యానే ఇవాళ స్విట్జర్లాండ్ మ్యాచ్‌ను గెలిచింది. మరి ఇంత చేసిన బ్రీల్ ఎంబోలో ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేదా అనే డౌట్ వస్తుంది. కారణం అతను గోల్ కొట్టింది తన స్వంత దేశమైన కామెరున్‌పై కావడమే. బ్రీల్ ఎంబోలో స్వస్థలం కామెరున్.. ఇప్పటికి అతని తల్లిదండ్రులు కామెరున్ వెళ్లి వస్తుంటారు. ఎంబోలో కూడా అక్కడే పుట్టి పెరిగాడు. అయితే పరిస్థితుల ప్రభావం వల్ల స్విట్జర్లాండ్‌కు రావాల్సి వచ్చింది. ఇక్కడే ఫుట్‌బాల్ కెరీర్‌ను ఆరంభించి ఇప్పుడు స్విట్జర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అందుకే జట్టుకు గోల్ అందించినప్పటికి సొంత దేశంపై ఆ గోల్ రావడంతో సెలబ్రేషన్ చేసుకోలేకపోయాడు. Breel Embolo with the opener to give the Swiss the opener against Cameroon The man wouldn’t celebrate against the country of his birth. Respect🤝#Qatar2022 pic.twitter.com/zqonADSKcx — OLT👑 (@CHAMPIONOLT) November 24, 2022 🇨🇲 Born in Cameroon 🇨🇭 Represents Switzerland ⚽️ Scores in #SUICMR Respect, Breel Embolo 🤝#FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/UCpZhx0TCY — FIFA World Cup (@FIFAWorldCup) November 24, 2022 చదవండి: FIFA WC: స్విట్జర్లాండ్ శుభారంభం.. కామెరున్‌పై విజయం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆడిషన్స్ ఇచ్చా కానీ.. రెండుసార్లు రెజెక్ట్ చేశారు: ప్రముఖ హీరో
Tiger Shroff Says Hollywood Is His Goal But I Have Failed In Auditions: బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తాజాగా నటించిన చిత్రం 'హీరోపంతి 2'. 2014లో వచ్చిన రొమాంటిక్-యాక్షన్ మూవీ 'హీరోపంతి'కి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తారా సుతారియా హీరోయిన్గా యాక్ట్ చేసింది. సాజిద్ నడియద్వాలా నిర్మించగా, ఇందులో లైలా అనే ప్రతినాయకుడి పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ తనదైన యాక్టింగ్ మార్క్ చూపించనున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలో 'మీరు హాలీవుడ్‌కు వెళ్లే సమయం వచ్చిందా' అని అడిగిన ప్రశ్నకు టైగర్ ష్రాఫ్ ఆసక్తిర విషయాలు తెలిపాడు. 'హాలీవుడ్లో యాక్షన్ హీరోలు ఎవరు లేరు. అందులోనూ నా ఏజ్ గ్రూప్ యాక్షన్ హీరోలు అసలే లేరు. 90వ దశకం నుంచి మనం చూస్తున్నాం. ఇప్పటివరకు స్పైడర్ మ్యాన్ తప్ప పూర్తి తరహాలో యాక్షన్ చిత్రీకరించే నైపుణ్యం ఉన్న వారిని చూసి చాలా కాలం అయింది. అయితే హాలీవుడ్ నుంచి నాకు రెండు సార్లు ఆఫర్ వచ్చింది. కానీ ఆ రెండు సార్లు ఆడిషన్లో ఫెయిల్ అయ్యాను. అయినా నేను ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. కాబట్టి చూద్దాం. హాలీవుడ్ సినిమాల్లో నటించడమే నా లక్ష్యం.' అని చెప్పుకొచ్చాడు టైగర్ ష్రాఫ్. కాగా సైబర్ నేరాలను అరికట్టేందుకు లైలాతో బబ్లూ (టైగర్ ష్రాఫ్) అనే వ్యక్తి ఎలా తలపడ్డాడనేదే 'హీరోపంతి 2' కథ అని తెలుస్తోంది. చదవండి: టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్ కోసం ఖరీదైన కార్లు !.. దిశా పటాని కామెంట్ హిందీలో కేజీఎఫ్ 2 సక్సెస్‌పై అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అందరిలో ఒకటే ఉత్కంఠ..ఆమె గోల్ వేయాలని ఐతే..
Basketball game in viral video: చాలా మంది తమ వైకల్యాన్ని ప్రతికూలమైన అంశంగా భావించకుండా తమ శక్తి యుక్తులతో విజేతలగా మారారు. అంతేందుకు ప్రతికూలంగా ఉన్నదాన్ని సైతం అనుకూలంగా మార్చుకుని ఎదురు నిలిచిని వాళ్లు ఉన్నారు. మేము డిసేబుల్డ్ కాదు డిఫరెంట్‌గా చేసేవాళ్లం అని చాటి చెప్పి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వారెందరో ఉన్నారు. అచ్చం ఆ కోవకే చెందిందే జూల్స్ హూగ్లాండ్ అనే ఏళ్ల అమ్మాయి. ఇంతకీ ఆమె ఏం చేసిందనే కదా! వివరాల్లోకెళ్తే...జూల్స్ హూగ్లాండ్ అనే 17 ఏళ్ల అమ్మాయి దివ్యాంగురాలు. అమెకు కళ్లు కనిపించావు. అయితే ఆమె బాస్కట్ బాల్ కోర్టులో గోల్ చేస్తున్నసమయంలో అక్కడున్న ప్రేక్షకులంతా చాలా నిశబ్దంగా ఉన్నారు. ఆమె గోల్ చేస్తుందా లేదా అన్నట్లుగా చాలా ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే ఆమె ఒక హూప్ సాయంతో గోల్ చేయాల్సిన లక్ష్యాన్ని విని, తదనంతరం గోల్ వేస్తుంది. అయితే అక్కడ ఉన్నవారందరిలో ఒకటే ఆత్రుత ఆమె ఎలా వేస్తుందా అని. కానీ ఇంతలో ఆమె బాస్కట్ బాల్ని చాలా కరెక్ట్‌గా గోల్ చేసింది. అంతే అక్కడున్నవారంతా ఒక్కసారిగా అరుపులు, కేకలతో సందడి చేశారు. యుఎస్‌లోని జీలాండ్ ఈస్ట్ హైస్కూల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Good News Movement (@goodnews_movement) (చదవండి: ఉక్రెయిన్‌లో దయనీయ పరిస్థితి..!) -
ఫస్ట్ స్టేజ్ మిలటరీ ఆపరేషన్ ఫినిష్...అదే మా ఏకైక లక్ష్యం! : రష్యా
Main goal to ‘liberate’ Donbas: ఉక్రెయిన్‌లో సైనిక చర్యకు సంబంధించిన మొదటి దశ పూర్తయిందని రష్యా డిప్యూటీ చీఫ్ కల్నల్ జనరల్ సెర్గీ రుడ్స్కోయ్ అన్నారు. ఈ ఆపరేషన్‌కి సంబంధించిన ప్రధాన పనులన్నీ పూర్తయ్యాయని తెలిపారు. అంతేగాక ఉక్రెయిన్‌లో సాయుధ దళాల పోరాట సామర్థ్యం గణనీయంగా తగ్గిందని కూడా చెప్పారు. ఉక్రెయిన్‌లోని డాన్బాస్ ప్రాంతాన్ని విముక్తి చేయడమే రష్యా ప్రధాన లక్ష్యం అని నొక్కి చెప్పారు. రష్యా అధ్యక్షుడ వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ యుద్ధం ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని అన్నారు. అయితే ఈ యుద్ధంలో సుమారు వెయ్యి మంది రష్యా సైనికులు మృతి చెందగా, మూడు వేల మందికి పైగా గాయపడ్డారని రుడ్స్కోయ్ వెల్లడించారు. అయితే నాటో మాత్రం ఈ యుద్ధంలో దాదాపు 15 వేల మంది రష్యాన్ సైనికులు మరణించారని చెప్పడం గమనార్హం. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలను దిగ్బంధం చేసి ఉక్రెయిన్ బలగాలకు నష్టం కలిగించేలా చేయడమే కాకా అక్కడ ఉక్కెయిన్ సైనిక దళాలు బలపడకుండా చేస్తాం అని తెలిపారు. డోనెట్స్క్, లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ భూభాగాలను స్వాధీనం చేసుకునేంత వరకు ఈ దాడి ఆపేది లేదని తెగేసి చెప్పింది. పైగా తమ ప్రధాన లక్ష్యం ఉక్రెయిన్ నుంచి డాన్బాస్ ప్రాంతాన్ని విముక్తి చేయడమే అని రష్యా స్పష్టం చేసింది. అయితే పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించలేదని రష్యా పదే పదే సమర్థించుకునే యత్నం చేయడం విశేషం. (చదవండి: కీవ్‌లో కల్లోలం.. ఏ క్షణంలోనైనా) -
గౌతమ్ రెడ్డి ఆశయ సాధనకు మేకపాటి కుటుంబం సిద్ధం
-
గోల్ కొట్టే అవకాశం.. ప్రత్యర్థి ఆటగాడికి గాయం
ఆటలో క్రీడాస్పూర్తి ప్రదర్శించడం సహజం. ఎవరైనా ఆటగాడు గాయపడితే వారికి ధైర్యం చెప్పడం.. లేక సలహాలు ఇస్తుండడం చూస్తుంటాం. తాజాగా ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా గోల్ కొట్టే అవకాశం వచ్చినప్పటికి.. అదే సమయంలో ప్రత్యర్థి ఆటగాడు కండరాలు పట్టేయడంతో నొప్పితో విలవిల్లాడాడు. ఇది చూసిన తన ప్రత్యర్థి బంతిని గోల్‌పోస్ట్ వైపు కాకుండా పక్కకు పంపించి.. అతని దగ్గరికి వచ్చి సాయం చేశాడు. ఈ చర్యతో మిగిలిన ఆటగాళ్లు మొదట ఆశ్చర్యానికి లోనైనప్పటికి .. సదరు ఆటగాడు ప్రదర్శించిన క్రీడాస్పూర్తికి ఫిదా అయ్యారు. ఇది ఏ మ్యాచ్‌లో జరిగిందనేది తెలియనప్పటికి.. వీడియో మాత్రం వైరల్‌గా మారింది. చదవండి: ఎనిమిదేళ్ల తర్వాత ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్.. Spirit. pic.twitter.com/NbePpsWGZL — Abhijit Majumder (@abhijitmajumder) November 24, 2021 -
విజయానికి తొలిమెట్టు అవగాహన
అవగాహన.. మనం నిత్యమూ స్మరించే పదాల్లో ఒకటి. దాదాపుగా ప్రతి వ్యక్తీ వాడే మాట.. ‘‘ఈ విషయం మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది’’.. ‘‘ ఆ పని చేయడానికి కావలసిన ప్రాథమిక అవగాహన కూడా అతనికి లేదు’’. ఇటువంటి మాటలు మనం తరచు మాట్లాడుతూ ఉంటాం. అసలు అవగాహన అంటే ఏమిటో, అవతలివారిని ఏ విధంగా అవగాహన చేసుకోవాలో, అవగాహన వల్ల ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం... అవగాహన అనే పదం చాలా విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉంది. శాస్త్రీయంగా చెప్పాలంటే, ఏదైనా వస్తువు లేదా విషయంమీద ఒక వ్యక్తికున్న ఇంద్రియజ్ఞానాన్ని, ఆకళింపు శక్తినీ అవగాహనగా పేర్కొనవచ్చు. ప్రత్యేకమైన అంశంపై మనకున్న çస్పృహæ అంటే బాహ్య దృగ్విషయ సాక్షాత్కారం మనసులో నిండి ఉండడమే అవగాహన లేదా ఆకళింపు లేదా గ్రహింపు శక్తి. కొంచెం విడమరచి విశ్లేషిస్తే, ఆకళింపు అంటే చేయబోయే పనిమీద ప్రాథమికమైన జ్ఞానాన్ని కలిగి ఉండడం అన్న అర్థంలో తీసుకోవచ్చు. అదే విధంగా తాను కార్యసాధనలో కలిసి పని చేయబోయే వ్యక్తిని గురించి తెలుసుకుని ఉండగలగడాన్ని అవగాహనగా నిర్వచించవచ్చు. ఆనందకరమైన రీతిలో జీవితాన్ని గడపడానికి తన జీవితభాగస్వామితో నిత్యమూ ఆనందకరంగా చరించడమూ అవగాహనకు అందమైన ఉదాహరణే. ప్రజాసేవకు అంకితమయ్యే నాయకులు తాము చేసే సేవా కార్యక్రమాల మీద అర్థవంతమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉండడమూ అవగాహనే. అంతేకాదు, పసిపిల్లలను ముఖ్యమైన విషయాలపట్ల అప్రమత్తంగా తీర్చిదిద్దడమూ మకరందభరితమైన అవగాహనగానే పరిగణించాలి. పిల్లలకు కలిగించవలసిన గ్రహింపుశక్తి గురించి క్లుప్తంగా మాట్లాడాలంటే, బాల్యం ఆరంభ దశ ఎంతో సున్నితమైంది. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల ఎదుగుదల కాలాన్ని బాల్యారంభదశగా పరిగణిస్తే, ఆ సమయంలోనే వారిలో అన్ని విధాలుగా ఎదుగుదలకు ఉపయోగపడేలా, అత్యంత సులంభంగానే విషయాలన్నిటా ఆకళింపు చేసుకునేలా బీజాలు నాటాలి. ఈ సమయంలోనే వారిలో చూపు, స్పర్శ, గుర్తింపు, వినికిడిలాంటి చేతనలన్నీ విజ్ఞానరూపం వైపు తొంగిచూస్తుంటాయి. ఈ సమయంలో ఏ మాత్రం మొరటు తనానికి వారు గురైనా, వారి భావి జీవితాలకు ఎంతో నష్టం కలుగుతుంది. ఆరు సంవత్సరాలలోపు పిల్లల మానసికస్థితి అత్యంత సున్నితంగా ఉంటుంది. వారి వ్యక్తిత్వపు మొలకలు ఆరంభమయ్యే రోజుల్లో ప్రతి విషయం మీదాగ్రహింపు కలిగేలా వారిని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పూర్వ ప్రాథమిక దశలోని పిల్లలకున్న అవసరాలు తెలుసుకోవటం ఎంత ముఖ్యమో, వారి శక్తి సామర్థ్యాలను మనంఅంచనా వేయటం, విభిన్నమైన విషయాలపై అర్థవంతమైన రీతిలో బలాన్ని కలిగించడం పిల్లల సమగ్ర అభివృద్ధికి మధురఫలంగా రూపొందుతుందనడంలో ఎటువంటి సందేహమూ అక్కర్లేదు. అవగాహన గురించి విశ్లేషించుకునే సందర్భంలో తప్పకుండా ప్రస్తావించుకోవలసిన మరొక అంశం భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి ఉండవలసిన నమ్మకం. భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి ఉండవలసిన విశ్వాసపూరిత భావన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఈ అనుబంధమే ధరిత్రిలో సృష్టికార్యానికి మూలమై నవచరితకు ఆధారంగా నిలుస్తోంది కదా..!! ఈ రోజుల్లో జీవిత భాగస్వామితో ఉన్న విశ్వాసరాహిత్యంవల్లనే, వారి దాంపత్యబంధంలో ముఖ్యమైన శాంతి కరువవుతోంది, సుఖమన్నది అరుదవుతోంది. భార్యాభర్తలమధ్య పొడసూపే ఆకళింపు లేమివల్ల సత్సమాజం ఏర్పడేందుకు అవరోధాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఎందుకంటే, తల్లిదండ్రులు వ్యవహరించే తీరునే పిల్లలు అనుసరిస్తారు, అనుకరిస్తారు. ఇది మనస్తత్వ శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెప్పేదేగాక, మనం నిత్యమూ కనులముందు తిలకించేదే..!! ఒకరినొకరు అర్థం చేసుకోవడమైనా, ఒకరి అభిరుచుల్ని మరొకరు గ్రహించడమైనా, ఒకరి ఇష్ట్రపకారం మరొకరు నడుచుకోవడమైనా.. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ దంపతులు ఆలోచించి అడుగేస్తే ఆ దాంపత్యం చిగురులోనే మొగ్గ తొడుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భార్యాభర్తల బంధంలో ఒకరినొకరు అర్థం చేసుకుని చరించడం భారమైన విషయం కాదు, అది మధురమైన మకరంద సారం వంటిదని గ్రహించాలి.. ఇది నిజం..!! ఒకరిపై ఒకరికి అనురాగం, ప్రేమలను మరింత బలీయంగా ఉంచేది వారి మధ్య నిలిచివున్న అందమైన అవగాహనే. ‘‘భార్యకు నచ్చిన పనుల్ని చేయవలసిన అవసరం ఏముందని భర్త భావించడం, భర్త చెప్పినట్లుగా ఎందుకు నడుచుకోవాలి?’’ అని భార్య భావిస్తే, అతి కొద్ది రోజుల్లోనే ఆ బంధం దెబ్బతింటుంది. దీనికి ప్రధాన కారణం వారికి వారుగా ఒకరిపై ఒకరు పెంచుకున్న విశ్వాసరాహిత్యమే అని చెప్పడం నూటికి నూరుపాళ్ళూ నిజం. ఒక విషయాన్ని ఆకళింపుచేసుకోవడం జ్ఞానం కన్నా గొప్పదైన విషయంగా భావించమంటాడు ఓ తత్త్వవేత్త. ‘‘నీవెవరో చాలా మందికి తెలియవచ్చు, కానీ నీ విద్వత్తు మీద, శక్తిసామర్థ్యాల మీద నమ్మకం ఉన్న వాళ్ళ వల్లనే నీ ప్రతిభ లోకానికి పరిపూర్ణంగా తెలుస్తుంది’’ అనే భాష్యం సముచితంగా ఉంటుంది. విద్యార్థులు తమ విద్యపట్ల, లక్ష్యసాధకులు తాము సాధించ దలచిన లక్ష్యంపట్ల అవగాహన కలిగి ఉన్నట్లే, దేశ ప్రగతిని కాంక్షించే నాయకులకు తాము ఏ రకంగా ఉత్తమ సేవలను అందించి దేశానికి ప్రగతిని, సుగతిని అందించదలచుకున్నామో అన్న విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం దేశప్రగతికి అత్యంత ముఖ్యమైన విషయం. ప్రతి అందమైన బంధానికీ ఇరువురి మధ్య అవగాహన అనేది ఎంతో ముఖ్యం. సాధకుని ఆలోచనా ధోరణిలో నిండి వున్న దృఢమైన అవగాహనే కార్యసాధనలో విజయానికి ప్రధాన భూమిక నిర్వహిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఏదైనా లక్ష్యాన్ని సాధించాలి అని భావించినప్పుడు, ఆ లక్ష్య సాధనకు సంబంధించిన విషయాల పట్ల సమగ్రమైన గ్రహింపుని కలిగి ఉండడమనేది మౌలికమైన విజయసూత్రంగా భాసిస్తుంది. సాధనా క్రమంలో ఏదైనా విషయం తెలియకపోయినా, కొద్దిపాటి ఆకళింపు లేకపోయినా, ఆ విషయాన్ని సాధకుడు పనికిమాలిన అంశంగా భావించకూడదు. అదే, పరాజయానికి హేతువుగా మారుతుంది. నీకు ఏ విషయమైనా తెలియకపోయినా, ఆ రంగంలో నిష్ణాతులైనవారినో, అందులోని లోటుపాట్లను విడమరచి చెప్పగలవారినో ఆశ్రయించాలి. అందుకే, ఒక ఆర్యోక్తిలో చెప్పినట్లు ‘‘పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవడం ముఖ్యం కాదు. చిన్న చిన్న విషయాలను సమగ్రంగాఅర్థం చేసుకుంటూ ముందుకు సాగడం వివేకి లక్షణం’’ అన్న మాటలు శిరోధార్యమే..!! –వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి -
లక్ష్యసిద్ధికి త్రికరణశుద్ధి
మనం ఏ కార్యాన్ని ఆచరించినా త్రికరణశుద్ధితో ఆచరించాలి. మనస్సుకు, మాటకు, చేతకు తేడా లేకుండా ఉండటమనే నిజాయితీనే త్రికరణశుద్ధిగా వ్యవహరించవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, మనోవాక్కాయాల శుద్ధి. ఏదయినా పనిని మనసా, వాచా, కర్మణా అన్నిటా ఏకీభావ స్థితిలో మలచుకోవడమే త్రికరణశుద్ధి. మనసులో ఏ విధంగా కార్యాన్ని చేయాలని మనం సంకల్పిస్తామో, వచస్సులో, అంటే మన మాటల్లోనూ అదే ప్రతిఫలించాలి. కర్మణా అంటే కార్యాన్ని ఆచరించే విధానమూ మనం తలచిన విధంలో, చెప్పిన సంవిధానంలో పూర్తి చేయాలి. అప్పుడే ఆ కార్యం త్రికరణశుద్ధి కలిగినదై, లోకాన రాణింపునకు వస్తుంది. మనం ఎన్నో గొప్ప కార్యాలను మదిలో సంకల్పిస్తాం. తీరా, ఆ పనులను గురించి నలుగురిలో విడమరచి చెప్పాలంటే ఎందుకో బిడియం, ఎవరు ఏమనుకుంటారో..? అనే సందేహం. మనం సాధించగలమో లేదో అని అనుమానం. ఒకవేళ, మరీ సాహసం చేసి కొంతవరకు చెప్పగలిగినా, మళ్ళీ ఆచరించే సమయంలో మనకున్న సందేహాలతో ముందుకు సాగకుండా ఆగిపోతాం, దానికితోడు అనుకోకుండా ఎదురయ్యే అవాంతరాలు..!! ఈ విధంగా చేసే కార్యాలు నిరర్ధకమైన రీతిలోనే సాగుతాయి. మన మనసు అత్యంత పవిత్రమైనదనీ, సమస్త పుణ్యాలు అగణ్యమైన రీతిలో ఈ ధరిత్రిలో జరిగింది కేవలం మనసు వల్లనేనని పెద్దల ఉవాచ. అందుకని తలచిన పనులు సఫలం అవాలంటే, మనం భావించిన విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరచగలగాలి. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఏ పనిలోనైనా కార్యసిద్ధి అనేది ఒక్కరి వల్ల జరగదు. అది సమిష్టిగా, నలుగురితో కలిసి కృషి చేయడం వల్ల జరుగుతుంది లేదా కొంతమంది వ్యక్తుల సమన్వయంతో జరుగుతుంది. అధికశాతం పనులు రకరకాల వ్యక్తుల సమన్వయంతోనే జరుగుతాయి. ఈ కార్యక్రమంలో కొంతమంది విద్యాధికులు, కొంతమంది ఎక్కువగా చదువుకోనివారు కూడా భాగం కావచ్చు. వీరందరి మధ్యా జరిగే సమన్వయమే త్రికరణాలతో కూడుకుని తలపెట్టిన పనిలో కార్యసిద్ధిని కలిగిస్తుంది. వ్యక్తిగతంగా తాము చేసే పనులు కూడా శుద్ధమైన మనసుతో ఆచరిస్తే, విజయాలు సాధించవచ్చు. మధ్యయుగం కాలంలోని ఒక చిన్న కథ ద్వారా ఆ సందేశాన్ని తెలుసుకుందాం. ఒక గురువు గారు నదికి అవతలి ఒడ్డున తన శిష్యులతో నిలిచి ఉన్నారు. నదిలో వారిని దాటించే పడవవాడు వెళ్ళిపోయాడు. కానీ గట్టుకు రెండోవేపు ఒక శిష్యుడు నిలిచిపోయాడు. గురువుగారు, వేగంగా రమ్మని ఆ శిష్యుని ఆజ్ఞాపించారు. వెంటనే, ఆ శిష్యుడు నీటిమీద వేగంగా నడుచుకుని అవతలి గట్టుకు వెళ్ళిపోయాడు. గురువుగారు, శిష్యునికేసి ఆశ్చర్యంగా చూస్తూ, ‘‘నాయనా.. ఏ విద్యతో అంత వేగంగా నీటిమీద నడుచుకుంటూ రాగలిగావు’’ అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించగా, శిష్యుడు’’ భలేవారే.. గురువుగారు... మీకు తెలియని విద్యలేవి ఉన్నాయి నా దగ్గర..!! మీరు తొందరగా రమ్మని ఆజ్ఞాపించారు. నేను మదిలో నది ఒడ్డుకు రావాలన్న తలపును త్రికరణశుద్ధిగా ఆచరించాను. విజయవంతంగా మీ దగ్గరకు చేరుకున్నాను’’ అంటూ వినయంగా సెలవిచ్చాడు. ఇందులో శిష్యుడు చూపిన అగణితమైన ప్రతిభకన్నా, అతని అంకితభావం, నదిని విజయవంతంగా దాటే సమయాన మనసా, వాచా, కర్మణా ఒకే పద్ధతిలో ముందుకు సాగడం పెద్ద పెద్ద లక్ష్యాలను తలపోసే అందరికీ అనుసరణీయం. త్రికరణశుద్ధిగా చరించే మనిషి తనను తాను మూర్తిమంతంగా నడుపుకుంటూ, విజయాలను అవలీలగా సొంతం చేసుకోవడం జరుగుతుంది. ఎన్నో శాస్త్రాలను, విజ్ఞానాన్ని శిష్యులకు క్షుణ్ణంగా బోధించిన ఓ గురువుగారి జీవనప్రస్థానపు అంతిమఘడియల్లో అమృతతుల్యమైన ఈ సత్యం విశదం అయింది. మహా విజ్ఞాననిధియై జీవితాన్ని గడిపిన గురువుగారికి అంత్యకాలం చేరువ అయ్యింది. ఆయన శిష్యులందరిలో ఎడతెగని విచారం. ఆయన ఆశ్రమ ప్రాంతమంతా విషాద వీచికలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యశిష్యునిగా వ్యవహరిస్తూ, ఆశ్రమ యోగక్షేమాలు చూసే అతనిలో మరీ విచారం..!! ఈ వాతావరణాన్ని పరికిస్తున్న గురువుగారికి జీవన విషమస్థితిలోనూ ఏ మాత్రం మింగుడుపడడం లేదు. గురువు తన ముఖ్యశిష్యుణ్ణి దగ్గరకు పిలిచి ‘‘ఎందుకు మీరంతా అంతగా బాధపడిపోతున్నారు’’ అని ప్రశ్నించగా, అతను గద్గద స్వరంతో ‘‘గురువుగారూ.. మీరు మా నుంచి వెళ్ళిపోతున్నారు. మీవల్ల ఈ ఆశ్రమానికి వచ్చిన గొప్ప గుర్తింపు, ఎనలేని కాంతి మీ తదనంతరం మాయమవుతుంది. మాలో ఈ కారణం చేతనే రోజురోజుకూ అశాంతి పెరుగుతోంది’’ అన్నాడు. దానికి గురువు నవ్వుతూ ‘‘పిచ్చివాడా.. ఎంత అవివేకంతో మాట్లాడుతున్నావు నాయనా..!! నువ్వు చెప్పిన విధంగా జరిగితే, నేను ఇన్ని రోజులూ మీ అందరికీ చేసిన విద్యాబోధన అంతా వృథానే సుమా.. నేను మీకు ఇచ్చే సలహా ఒక్కటే.. నేను నేర్పించిన విషయాలను అన్నిటా ఆచరణలో పెడుతూ, మిమ్మల్ని మీరే దివ్యమైన జ్యోతుల్లా వెలిగించుకోండి. అది కేవలం మీరు త్రికరణశుద్ధితో చేసే పనులవల్లనే సదా సాధ్యమవుతుంది’’ అన్నాడు. శిష్యునికి జ్ఞానోదయ మయింది. మిగిలిన వారికీ ఇదే సందేశాన్ని అందించి, గురువు బోధలను మనసా వాచా కర్మణా ఆచరించి విజేతగా నిలిచాడు. త్రికరణశుద్ధిగా వుండడమే సిసలైన జీవనానికి ఆనందసూత్రం..!! త్రికరణశుద్ధి లేనివాడికి ఆనందం ఆమడదూరం. త్రికరణశుద్ధి ఉన్నవాళ్ళకే మకరందభరితమైన జీవనం అమితంగా లభ్యమవుతుంది. అందుకని ప్రతివాడు పాటించవలసింది ఒక్కటే.. ‘‘ఆనందంగా, స్థితప్రజ్ఞునిగా ఉండాలంటే త్రికరణశుద్ధిని తప్పనిసరి గా కలిగి వుండాలి. తెలియనిది మాట్లాడకుండా, తనకు అవగాహన ఉన్న విషయాలనే మాట్లాడడం. మాట్లాడిందే ఆచరించడం ప్రధానంగా పాటించవలసిన అంశాలు. ఇవి మొక్కుబడిగా కాకుండా, మక్కువతో పాటిస్తే, జగతిలో గొప్ప విజయాలు నిత్యమూ ఆవిష్కృతమవుతాయి. ‘‘త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును.. లోకము మెచ్చును’’ అన్న సంకీర్తనాచార్యుని వాక్కులు అక్షరసత్యం. త్రికరణశుద్ధితోనే జీవనానికి నిజమైన సత్వం, పస కలిగిన పటుత్వం కలుగుతాయి. బుద్ధిమంతుల ఆలోచనా సరళికి ఆధారమూలం జీవనగమనంలో వారు కలిగి ఉండే త్రికరణశుద్ధి..!! ఈ లక్షణం కలిగినవారికి తప్పక ఒనగూడుతుంది అన్నిటా కార్యసిద్ధి.. త్రికరణ శుద్ధిగా వుండడమే సిసలైన జీవనానికి ఆనందసూత్రం..!! త్రికరణశుద్ధి లేనివాడికి ఆనందం ఆమడదూరం. త్రికరణశుద్ధి ఉన్నవాళ్ళకే మకరంద భరితమైన జీవనం లభ్యమవుతుంది. అందుకని ప్రతివాడు పాటించవలసింది ఒక్కటే.. ‘‘ఆనందంగా, స్థితప్రజ్ఞునిగా ఉండాలంటే త్రికరణశుద్ధిని తప్పనిసరిగా కలిగి వుండాలి. తెలియనిది మాట్లాడకుండా, తనకు అవగాహన ఉన్న విషయాలనే మాట్లాడడం. మాట్లాడిందే ఆచరించడంప్రధానంగా పాటించవలసిన అంశాలు. ఇవి మొక్కుబడిగా కాకుండా, మక్కువతో పాటిస్తే, జగతిలో గొప్ప విజయాలు నిత్యమూ ఆవిష్కృతమవుతాయి. – వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి -
డ్రా అనుకున్న దశలో సూపర్ గోల్.. షర్ట్ విప్పి రచ్చరచ్చ
Cristiano Ronaldo Stunning Goal.. పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డొ సూపర్ గోల్‌తో మెరిశాడు. మాంచెస్టర్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డొ ఆట ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా గోల్‌తో మెరిసి జట్టుకు విజయం అందించాడు. అనంతరం షర్ట్ విప్పిన రొనాల్డొ గ్రౌండ్ మొత్తం కలియదిరుగుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. చాంపియన్స్‌లీగ్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా విల్లార్ రియల్‌తో జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ 2-1 తేడాతో గెలుపొందింది. కాగా ఆట 53వ నిమిషంలో పాకో అల్కాసర్ తొలి గోల్ కొట్టి యునైటెడ్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే ఏడు నిమిషాల వ్యవధిలో విల్లార్ రియల్ ఆటగాడు అలెక్స్ టెల్లిస్ గోల్ చేసి స్కోరును సమం చేశాడు. చదవండి: Viral Video: పారిస్ దద్దరిల్లింది.. పీఎస్జీ తరఫున తొలి గోల్ చేసిన మెస్సీ ఇక చివరివరకు మరో గోల్ రాకపోవడంతో మ్యాచ్ డ్రా అయితుందని అంతా భావించారు. విల్లార్ రియల్ గోల్‌కీపర్ యునైటెడ్ ఆటగాళ్లు గోల్ కొట్టకుండా చక్కగా నిలువరిస్తున్నాడు. అయితే రొనాల్డొ ఇక్కడే మ్యాజిక్ చేశాడు. 45 డిగ్రీల కోణంలో రొనాల్డొ హెడర్‌తో కొట్టిన బంతి నేరుగా గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. ఇంకేముంది రొనాల్డొ తన సంబరాలను షురూ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Incase you missed Ronaldo goal #MANVIL pic.twitter.com/Drel8Gpyqr — 🌟 VARANE🌟 (@Saif07799953) September 29, 2021 -
2024 ఎన్నికలే అంతిమ లక్ష్యం: సోనియా గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్ష నేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం సోనియా అధ్యక్షతన వర్చువల్‌గా ఈ సమావేశం జరిగింది. కేంద్రంలోని మోదీ సర్కార్‌పై ఐక్యంగా పోరాడటమే లక్ష్యం ప్రతిపక్ష పార్టీల భేటీ జరిగింది. స్వాతంత్ర్యోద్యమ విలువలు, రాజ్యాంగ సూత్రాలు, నిబంధనలను విశ్వసించే ప్రభుత్వాన్ని అందించాలనే ఏకైక ఉద్దేశ్యంతో పోరాడాలని సోనియా పిలుపు నిచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా ఐక్యంగా, ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలని సోనియా ప్రతిపక్ష పార్టీలను కోరారు. మనందరికీ ఎవరి సిద్దాంతాలు వారికి ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించి దేశ ప్రయోజనాల కోసం ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇదొక చాలెంజ్. ఐకమత్యాన్ని మించిన ప్రత్యామ్నాయం లేదు. 2024 ఎన్నికలే అంతిమ లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పోరాడాలని సోనియా సూచించారు. సమాఖ్య వ్యవస్థను, రాజ్యాంగ సంస్థలను దెబ్బతీస్తున్నారంటూ మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తిన ఆమె పరిమితులు, ప్రతి బంధకాలను అధిగమించి ఐక్యంగా పోరాడాలన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు ఐక్యతను చాటినట్టుగానే పార్లమెంటు బయట కూడా అదే స్థాయిలో పోరాడాలన్నారు. ప్రతిపక్షాల ఐక్యత వల్ల ప్రభుత్వం వ్యాక్సినేషన్ పాలసీని మార్చుకుందన్న సోనియా మూడు వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా మోదీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఇటీవలే విపక్షాలతో సమావేశమైన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పీడ్ పెంచడంతో తాజాగా సోనియా విపక్షాలతో భేటి కావడం విశేషం. -
జీరో యాంగిల్ నుంచి గోల్ కోట్టిన పదేళ్ల బాలుడు
-
68 గజాల దూరం నుంచి గోల్
-
ఎవరూ కలలో కూడా ఊహించని విధంగా..
లండన్: ఫుట్‌బాల్ ఆటలో గోల్ కొట్టడం మామూలు విషయం కాదు. ఒక్కోసారి గోల్‌పోస్ట్‌కు అత్యంత సమీపంలో ఉన్నా కూడా గోల్ కొట్టడం సాధ్యం కాదు. అలాంటిది ఏకంగా 68 గజాల దూరం నుంచి బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపాడు వేన్ రూనీ. ఒకప్పుడు ఇంగ్లండ్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ఆడిన రూనీ రిటైరయ్యాక క్లబ్బులు, లీగ్‌ల్లో ఆడుతున్నాడు. ప్రస్తుతం మేజర్ లీగ్ సాకర్‌లో డీసీ యునైటెడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తాజాగా లాస్ ఏంజెల్స్‌లో ఓర్లాండో సిటీతో జరిగిన మ్యాచ్‌లో రూనీ దాదాపు 68 గజాల దూరం నుంచి బంతిని ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. ఆ సమయంలో ఓర్లాండో ఆటగాళ్లంతా డీసీ కోర్టులోనే ఉన్నారు. ప్రత్యర్థి గోల్ కీపర్ బ్రియన్ రోవె సైతం గోల్‌పోస్ట్‌కు దూరంగా ఉన్నాడు. ఇదంతా గమనించిన రూనీ తెలివిగా చాలాదూరం నుంచి గోల్ కొట్టాడు. డీసీ గెలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఇక ఈ గోల్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. -
ఆ శక్తి ఏమిటో గుర్తించాడు
రెక్కాడితేగాని డొక్కాడని ఒక కూలివాడు ఉండేవాడు. రాళ్లు కొట్టి రోళ్లను తయారు చేసే ఒక ఆసామి దగ్గర ఇతను రోజుకూలి చేస్తుండేవాడు. ఈ పని చేసి చేసి అతడికి విసుగెత్తింది. నా జీవితంలో మార్పు కావాలి అనుకున్నాడు. ఇందుకు తన శక్తి చాలదని ఏ శక్తో తోడు కావాలని తలచాడు. ఏదో ఒక శక్తిని ప్రసన్నం చేసుకుంటే తన జీవితం బాగు పడుతుందని భావించాడు. ఆ ఆలోచన వచ్చిందే తడువు అతను పర్వత శిఖరం మీదకు చేరుకున్నాడు. అక్కడ కొలువై ఉన్న దేవతను తన కోర్కెను తీర్చవలసిందిగా ప్రాధేయపడుతూ పదే పదే చేతులు జోడించసాగాడు. అయితే ఆమె ఎంతకూ బదులివ్వకపోవడంతో మరికాస్తా పెద్ద దేవతను ఆరాధిస్తే బాగుంటుందనుకున్నాడు. ఈ దేవత కన్నా పెద్ద దేవత ఎవరా అని ఆలోచిస్తూ ఆకాశం వైపు చూస్తే సూర్యుడు కనిపించాడు. ప్రత్యక్షదైవం సూర్యుడే కాబట్టి సూర్యుణ్ణి ఆరాధిస్తే బాగుంటుందనుకున్నాడు. అంతే! సూర్యారాధన మొదలు పెట్టాడు. పొద్దుగూకులూ అదే ధ్యాస అతనికి. కొండమీది ఫలవృక్షాల నుంచి కొన్ని పండ్లు కోసుకు తిని ఆకలి తీర్చుకోవడం, అక్కడే ఉన్న నీటికుంటలో స్నానం చేయడం, సూర్యుణ్ణి ధ్యానం చేయడం, నిద్ర వస్తే ఏ చెట్టు కిందనో, కొండగుహలోనో పడుకోవడం.... ఇవే అతని నిత్యకృత్యాలు. సూర్యుడు ఏనాటికైనా కరుణిస్తే తన జీవితం మారిపోతుందని ఎదురు చూసేవాడు. ఇలా ఉండగా ఒకరోజు సూర్యుణ్ణి మేఘాలు కప్పివేయడంతో సూర్యుడు కనిపించకుండా పోయాడు. దాంతో సూర్యుడి కంటే మేఘాలే గొప్పవనుకుని సూర్యారాధన మాని వేసి, మేఘాలను ప్రార్థించసాగాడు. కొద్దికాలంలోనే మేఘాలు పర్వతాలను ఢీకొని అక్కడే అంతమౌతున్నాయి కాబట్టి పర్వతాలే గొప్పవని తోచింది. అందువల్ల పర్వతాలను ప్రార్థించసాగాడు. ఈ క్రమంలో రోజూ తన పలుగు దెబ్బకే పర్వతాలు పగిలిపోతున్నాయి కాబట్టి తానే వాటి కంటే బలం గలవాడినన్న సంగతి స్ఫురణకొచ్చింది. వెంటనే అతని ఆలోచనా విధానం మారింది. అందరికన్నా తానే శక్తిమంతుడినని తోచి తన స్వశక్తినే నమ్ముకోవడం మొదలు పెట్టాడు. చూస్తుండగానే అతను ఎన్నో అద్భుతాలు చేయగలిగాడు. అందరికన్నా గొప్పవాడు కాగలిగాడు. మనిషి శక్తి అతనిలోనే ఉంటుంది. దానిని అతను తనంతట తానైనా గుర్తించగలగాలి లేదంటే ఇతరులెవరైనా గుర్తించి దానిని వెలికి తీయాలి. అప్పుడు అతను తనకు తానే సాటి అవుతాడు. - డి.వి.ఆర్. -
నేర్చుకోవాలనుకుంటే ప్రతిదీ ఓ పాఠమే!
లక్ష్యసాధనకు వశపడడమే మార్గం. జీవితంలో కొంతమందికి వశపడండి. ప్రయత్నపూర్వకంగా తల్లికి వశపడండి, తండ్రికి వశపడండి. ప్రభుత్వచట్టాలకు వశపడండి. గురువుకి వశపడండి. వారిని గౌరవించడం నేర్చుకోండి. ఎవరికి వశపడాలనుకున్నామో వారికి వశపడాలనుకున్నప్పుడు మీరు స్వయంగా వారివెంట ఉండక్కరలేదు. వారి ఫొటో ఒక్కటి మీ జేబులో ఉన్నదనుకోండి. ‘‘మహానుభావుడు ఇక్కడే ఉన్నాడు. అన్నీ చూస్తున్నాడు.’’ అన్న భావన కలుగుతుంటుంది. మీరు చదువుకునే గదిలో కలాంగారి ఫొటో పెట్టుకుని ‘మీరు చెప్పినట్లే బతుకుతాను’ అని రోజుకు ఒకసారి ఆయన చెప్పిన ప్రతిజ్ఞ గుర్తు చేసుకున్నారనుకోండి. అలా ఉన్నప్పుడు పుస్తకం చదువుతూ మీరు సెల్‌ఫోన్ మాట్లాడగలరా? నా తపస్సు అంతా నా పుస్తకమే గదా... దానికి భంగం కలిగితే పెద్దాయన ఎంత బాధపడతారన్న భావన ఆయన ఎదురుగుండా ఉన్నప్పుడు హెచ్చరిస్తుంటుందిగదా! అసలు గదిలో ఉన్నది ఫొటో ఎందుకవుతుంది? కలాంగారే మా ఇంట్లో ఉన్నారు. నేను ఏం చేస్తున్నదీ ఆయన చూస్తున్నారు. నేను చదివినది ఆయన వింటున్నారు. వివేకానందుడి పుస్తకం చదువుతున్నాను... అంటే వివేకానందుడికి ఎదురుగా కూర్చుని ఆయన మాట్లాడుతుంటే నేను వింటున్నాను’ అన్నభావనలు కలుగుతాయి. అలా చదువుతూ కూడా–‘‘వారుచెప్పినట్లుగాక నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను’ అంటే ఇక ఎందుకు ఆ పుస్తకం చదవడం ..??? ప్రయత్న పూర్వకంగా వశపడడం అలవాటు కాకపోతే అది చివరకు అసహనానికి, చీకాకుకు దారితీస్తుంది. మరొకరు చెప్పింది వినాలనిపించదు. ఈ దేశంలో ఒకప్పడు చట్టసభల్లో ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే... మధ్యలో అంతరాయం కలిగించవద్దని స్వపక్షానికి సైగలు చేస్తూ పూర్తిగా ఓపికగా విన్న ప్రధానమంత్రులను చూసాం. ఒఠ్ఠిగా వినడమే కాదు, వారి ప్రసంగాలను మనసారా అభినందించే పరిపక్వత, విశాల హృదయం వారికి ఉండేవి. నెల్సన్ మండేలాను 27 సంవత్సరాలు కారాగారంలో బంధించి భయంకరంగా నానా హింసలు పెట్టారు. దక్షిణాఫ్రికాకు ఆయన స్వాతంత్ర్యం తెచ్చిన తరువాత ఆయన తనను హింసించిన వాళ్ళను కూడా మంత్రివర్గంలో చేర్చుకున్నారు. అది పరిపక్వత. అది మనిషికి ఉండవలసిన సంయమనం. చిన్నతనంలో మండేలా సహచరులతో కలిసి గొర్రెలు కాస్తున్నాడు. వారు ఒకరోజున వంతులవారీగా అక్కడే ఉన్న ఒక గేదెమీద ఎక్కి సరదాగా కాసేపు అలా తిరిగొస్తున్నారు. మండేలా వంతు వచ్చింది. ఆయన గేదెమీదకు ఎక్కగానే ఒక్క ఉదుటున అది గెంతుకుంటూ ఒక ముళ్ళపొదలోకి దూరి ఆయన్ని ఎత్తిపడేసి పారిపోయింది. ముళ్ళు గుచ్చుకుపోయాయి. బయటికి తీసుకు వచ్చి సపర్యలు చేస్తూ...‘బాధగా ఉందా!!’ అని స్నేహితులు అడిగారు. ‘బాధేమీ లేదు. ఒక పాఠం నేర్చుకున్నట్లుంది’ అన్నారు. ఏమిటది అని వారడిగితే – ‘‘ఈ గేదెకు నన్ను ఎక్కించుకోవడం ఇష్టంలేకపోతే ఇక్కడే ఎత్తిపడేయవచ్చు. కానీ ముళ్ళపొదల్లోకి తీసుకెళ్ళి అక్కడ పడేయాల్సిన అవసరం లేదు. ఇష్టంలేని విషయాన్ని ఇష్టం లేదని చెప్పడానికి నేను జీవితంలో ఇంత క్రూరంగా ప్రవర్తించి ఎవరినీ బాధపెట్టకూడదని తెలుసుకున్నా..’’ అని బదులిచ్చారు. మీరు కూడా జీవితంలో ఎదురయిన ప్రతి సంఘటనను ఒక పాఠంగా తీసుకోగల ఓర్పును, పరిపక్వతను పెంపొందించుకోండి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
రొనాల్డోకే సవాల్ ఈ సూపర్ గోల్: ఆనంద్ మహీంద్ర హర్షం
సాక్షి, ముంబై: ఇండియన్ కార్పొరేట్ దిగ్గజం, మహీంద్ర అండ్ మహీంద్రా లేటెస్ట్గా మరో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశారు. ట్విటర్లో చాలా యాక్టివ్‌గా వుండే ఆయన ట్వీట్ల ఖాతాలోకి మరో అర్థవంతమైన వీడియో చోటు సంపాదించుకుంది. కార్లోంచి ఖాళీ వాటర్ బాటిల్ బైటికి విసిరేసిన కారు డ్రైవర్ అక్కడ ఉన్న ఒకమ్మాయి ఇచ్చిన చెంప దెబ్బలాంటి రిటార్ట్కు సంబంధించిన వీడియో ఇది కారులోంచి విసరిన బాటిల్ ని అంతే వేగంతో కాలితో తన్నింది. దీంతో అది నేరుగా కారు విండోలోంచి డైరెక్ట్గాలోకి దూసుకుపోయింది. ఈ ఉదంతంపై మురిసిపోయిన ఆయన ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రోనాల్డో కంటే గొప్పగా గోల్ చేసిందంటూ ప్రశంసలు కురిపించారు. చూస్తే ఇలాంటి ప్రపంచ కప్ ఫుట్‌బాల్ మ్యాచుల్ని చూడాలనుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు ‘‘ఆ కారు డ్రైవర్ ఆ అమ్మాయి మీద కోర్టుకెక్కరని ఆశిస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఆనంద్ మహీంద్ర పేర్కొనట్టు ఫుట్‌బాల్ లెజెండ్ రోనాల్డ్కే సవాల్ విసురుతున్న జపాన్ గాల్ ఈ సూపర్ గోల్‌ను మీరూ ఒకసారి చూసేయండి... అలాగే నాలుగు అడుగుల లోతు వర్షపు నీటిలో కూడా మీ వాహనం టీయూవి 300లో సేఫ్‌గా డ్రైవ్ చేస్తున్నానంటూ ట్వీట్ చేసిన సౌమిత్ర జోషికి అద్భుతమైన సమాధానం ఇచ్చారు. జాగ్రత్తగా వెళ్లండి.. మీ అదృష్టాన్ని మరీ ఎక్కువ సేపు పరీక్షించుకోకండి .. ఆ వాహనం ఉభయచరం కాదంటూ చిన్న హెచ్చరిక కూడా చేశారు. Now she ‘bent’ that ball into the ‘goal’ even better than Ronaldo.. This is the kind of World Cup I want to watch... (and let’s hope the driver doesn’t file a suit against her!😊) #whatsappwonderbox pic.twitter.com/aJxNqf2PRe — anand mahindra (@anandmahindra) June 26, 2018 -
అమ్మాయిలంటే ఇలా ఉండాలి
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాలన్న ధ్యేయంతో చిన్నప్పట్నుంచీ ప్రతి క్లాస్‌లోనూ ఫస్ట్ వచ్చింది ఆంచల్ గంగ్వాల్. క్లాస్‌లోనే కాదు, క్లాస్ బయట ఆటల్లోనూ ఫైటింగ్ స్పిరిట్ చూపించింది. కలలకు రెక్కలు కట్టుకుని చదివి, ఫ్లయింగ్ బ్రాంచ్‌లో సీటు సాధించింది! వేటూరి గారు అన్నట్లు ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, మహా పురుషులవుతారు’. అంతేనా! ఆంచల్ గంగ్వాల్ కూడా అవుతారు! తమ మీద తమకు అచంచలమైన నమ్మకం ఉండి కృషి చేస్తే లక్ష్యాన్ని సాధించడం సాధ్యమేనని నిరూపించింది ఆంచల్. మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాకు చెందిన ఈ అమ్మాయి ఇటీవలే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్వీస్‌కు ఎంపికైంది. ఆరు లక్షల మంది రాసిన ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌లో 22 మంది ఎంపికయ్యారు. వారిలో అమ్మాయిలు ఐదుగురు. ఆ ఐదుగురిలో ఫ్లయింగ్ బ్రాంచికి మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపికైన ఒకే ఒక అమ్మాయి ఆంచల్. అందుకే ఆంచల్ సాధించిన విజయం పట్ల ఆమె అమ్మానాన్నలతో పాటు రాష్ట్రం కూడా గర్వపడుతోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్లో ఆంచల్‌కు అభినందనలు తెలియచేశారు. ఆ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి అర్చనా చిట్నీస్ అయితే స్వయంగా ఆంచల్ ఇంటికి వచ్చి మరీ అభినందించారు. ‘అమ్మాయిలంటే ఇలా ఉండాలి’ని అంచల్ బుగ్గలు పుణికారామె. పెద్దింటమ్మాయి కాదు! ముఖ్యమంత్రి అభినందనలు, మంత్రి ప్రశంసలు అందుకున్న ఆంచల్.. ఆర్థికంగా ఒక సాధారణ దిగువ తరగతి ఇంటి అమ్మాయి. నీముచ్ జిల్లా కేంద్రంలో బస్‌స్టాండ్‌లో టీ దుకాణం నడుపుతాడు ఆంచల్ తండ్రి సురేశ్. అయితే ఇప్పుడు పట్టణంలో అందరికీ ఆంచల్ వల్లనే ‘నామ్‌దేవ్ టీ స్టాల్’ గురించి తెలిసింది. ‘‘నా టీ స్టాల్‌ని వెతుక్కుంటూ వచ్చి ఆంచల్ తండ్రి మీరేనా అని అడిగి మరీ నన్ను అభినందిస్తున్నారు, నా కూతురు పైలటయినా అంత ఆనందం కలిగిందో లేదో కానీ తండ్రిగా నా గుండె ఉప్పొంగిపోతోంది’ అంటున్నాడు సురేశ్. ఇది ఆరో ప్రయత్నం రక్షణ రంగంలో చేరాలనే ఆలోచన బాల్యంలోనే మొలకెత్తింది ఆంచల్‌లో. నీముచ్‌లోని మెట్రో హెచ్ఎస్ స్కూల్లో క్లాస్ టాపర్ అయ్యింది. దాంతో స్కూల్ కెప్టెన్ అయింది. తర్వాత ఉజ్జయిన్లో విక్రమ్ యూనివర్సిటీలోనూ ప్రతిభ కనబరిచి స్కాలర్షిప్కు ఎంపికైంది. బాస్కెట్‌బాల్, 400 మీటర్ల పరుగులో కాలేజ్‌కు ప్రాతినిధ్యం వహించింది. డిఫెన్స్‌లో చేరాలంటే అన్ని రకాల నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి కాబట్టి ఇన్నింటిలో చురుగ్గా ఉండేదాన్నని చెబుతుంది ఆంచల్. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని వదులు కోవడానికి కారణమూ డిఫెన్స్ పట్ల ఇష్టమేనంటోంది. సబ్ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరితే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ప్రిపరేషన్‌కి వెసులుబాటు ఉండదని వదిలేసిందామె. ఆ తరువాత వచ్చిన లేబర్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరేటప్పుడు కూడా ప్రిపరేషన్‌కి అవకాశం ఉంటుందని నిర్ధారించుకున్న తర్వాతనే చేరింది. ఒక పక్క ఇతర ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే తను కలగన్న డిఫెన్స్ ఉద్యోగానికి పరీక్షలు రాస్తూ వచ్చింది. ఐదు ప్రయత్నాలు సఫలం కాకపోయినా సంకల్పాన్ని వదలకపోవడమే ఆంచల్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఆరవ ప్రయత్నంలో ఆమె ఎయిర్‌ఫోర్స్ రంగంలో సెలెక్ట్ అయింది. ఆ ఫలితాలు ఈ నెల ఏడవ తేదీన వెలువడ్డాయి. అప్పటి నుంచి ఆమె ఇంటి ఫోన్ రింగవుతూనే ఉంది. ‘ఆంచల్! నేల మీద నుంచి నింగి దాకా ఎదిగావు’ అంటూ అభినందనల వాన కురుస్తూనే ఉంది. – మంజీర ఆ వరదలే కారణం! నేను పన్నెండవ తరగతిలో ఉన్నప్పుడు ఉత్తరాఖండ్‌ను వరదలు ముంచెత్తాయి. అప్పుడు బాధితులను రక్షించడానికి ఆర్మీ జవాన్లు బృందాలుగా వచ్చారు. తమకు ఏమవుతుందోననే భయం వారిలో ఏ కోశానా కనిపించేది కాదు. ప్రమాదకరమైన ప్రదేశాల్లో చొరవగా దూసుకెళ్లిపోయి బాధితులను కాపాడడం చూసినప్పుడు నాకు ఒళ్లు పులకరించినట్లయింది. ఇలాంటి సర్వీసుల్లో చేరాలని నాకప్పుడే అనిపించింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పట్లో చేరలేకపోయాను. ఆ కల ఇప్పటికి తీరింది. నా కోచింగ్ కోసం నాన్న లోన్ తీసుకున్నాడు. ఉద్యోగంలో చేరగానే లోన్ తీరుస్తాను. ఆ లోన్ తీర్చినప్పుడే నాన్న కళ్లలోకి ధైర్యంగా చూడగలుగుతాను. – ఆంచల్, ఐఎఎఫ్ -
సూపర్ ‘స్విస్’
మొదట్లోనే ప్రత్యర్థికి ఆధిక్యం సమర్పించుకున్నా... తర్వాత పట్టు జారకుండా చూసుకుంటూ... అవకాశాలు సృష్టించుకున్న స్విట్జర్లాండ్... సెర్బియాను బోల్తా కొట్టిస్తూ విజయాన్ని ఒడిసిపట్టింది! గ్రానిట్ జాకా, జెర్డాన్ షకీరి రెండు అద్భుత గోల్స్‌తో తమ జట్టును గట్టెక్కించగా... చివరి నిమిషంలో మ్యాచ్‌ను చేజార్చుకుని సెర్బియా నిస్సహాయంగా మిగిలింది! కలినిన్‌గ్రాడ్: మొదటి మ్యాచ్‌లో బ్రెజిల్‌ను నిలువరించిన స్విట్జర్లాండ్... కీలకమైన రెండో మ్యాచ్‌లో సెర్బియాను ఓడించి నాకౌట్‌కు మార్గం సిద్ధం చేసుకుంది. గ్రూప్ ‘ఇ’లో భాగంగా శుక్రవారం రాత్రి ఇక్కడ జరిగిన పోరులో ఆ జట్టు 2–1తో సెర్బియాను కంగుతినిపించింది. స్విట్జర్లాండ్ తరఫున జాకా (53వ నిమిషం), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ షకీరి (90వ నిమిషం) ఒక్కో గోల్ చేశారు. అద్భుతం అనదగిన రీతిలో చాలా దూరం నుంచే బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపిన వీరు... తమ జట్టు ఆశలు నిలిపారు. అంతకు ముందు సెర్బియా తరఫున మిట్రోవిక్ (5వ నిమిషం) గోల్ కొట్టాడు. ప్రస్తుతం 4 పాయింట్లతో ఉన్న స్విస్ జట్టు... ఈ నెల 27న కోస్టారికాతో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్నా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఇదే రోజున బ్రెజిల్‌తో జరగనున్న పోరులో గెలిస్తేనే సెర్బియా తదుపరి దశకు వెళ్తుంది. మొదట్లోనే సెర్బియా షాక్... స్విస్‌కు మ్యాచ్ ఆరంభంలోనే సెర్బియా షాకిచ్చింది. డాసన్ టాడిక్ నుంచి అందిన క్రాస్‌ను చక్కగా సమన్వయం చేసుకున్న అలెగ్జాండర్ మిట్రోవిక్ 5వ నిమిషంలో తలతో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపి ఖాతా తెరిచాడు. దీంతో మొదటి భాగంలో 1–0తో సెర్బియాదే పైచేయి అయింది. రెండో భాగంలో స్విస్ జోరు... మొదటి భాగంలో కోల్పోయిన ఆధిక్యాన్ని స్విట్జర్లాండ్ రెండో భాగం ప్రారంభంలోనే సమం చేసింది. ఈ ఘనత షకీరి, జాకా ఇద్దరికీ చెందుతుంది. 53వ నిమిషంలో షకీరి కొట్టిన బలమైన షాట్‌కు బంతి సెర్బియా ఆటగాడికి తగిలి వెనక్కు వెళ్లింది. దీనిని దొరకబుచ్చుకున్న జాకా అంతే వేగంగా స్పందించాడు. ‘డి’ బాక్స్ ముందు ఉన్న అతడు... ఐదుగురు ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పిస్తూ నేరుగా గోల్ కొట్టాడు. మరోవైపు సెర్బియా పోటీగా ఆడటంతో మ్యాచ్ ‘డ్రా’వైపు సాగేలా కనిపించింది. అయితే... 90వ నిమిషంలో షకీరి అద్భుతం చేశాడు. దాదాపు మైదానం మధ్యలో బంతిని అందుకున్న అతడు ప్రత్యర్థి ఆటగాడికి చిక్కకుండా వేగంగా పరిగెడుతూ గోల్‌పోస్ట్ ముందు కీపర్‌ను ఏమారుస్తూ స్కోరు చేశాడు. ఈ ఆనందంలో అతడు చొక్కా విప్పి ఎల్లో కార్డుకు గురయ్యాడు. ఇంజ్యూరీ సమయం పెద్దగా మెరుపులేమీ లేకుండానే సాగిపోవడంతో స్విస్ జట్టునే విజయం వరించింది. ఈ ప్రపంచకప్‌లో తొలిగా గోల్ ఇచ్చి... మ్యాచ్‌లో గెలిచిన జట్టుగా స్విట్జర్లాండ్ నిలిచింది. గోల్ సంబరాలపై అభ్యంతరం మ్యాచ్‌లో గోల్స్ అనంతరం జాకా, షకీరి చేసిన ‘డబుల్ ఈగల్’ సంకేతాలు చర్చకు తావిచ్చాయి. వీరిద్దరితో పాటు మరో ఆటగాడు బెల్రామి సెర్బియాలోని ఒకప్పటి రాష్ట్రమైన కొసావో మూలాలున్న వారు. స్వయంప్రతిపత్తి అంశమై సెర్బియాతో కొసావో గతంలో పెద్ద ఎత్తున ఘర్షణ పడింది. ఇదే అంశమై పోరాడినందుకు 1980ల్లో షకీరి తండ్రిని సెర్బియా జైల్లో పెట్టింది. ప్రపంచ కప్‌లో అదే దేశానికి ప్రత్యర్థిగా ఆడే సందర్భం రావడంతో నాటి శత్రుత్వాన్ని దృష్టిలో పెట్టుకున్న షకీరి... కొసావో గుర్తు ఉన్న బూట్లతో మ్యాచ్ ఆడేందుకు ఫిఫా అనుమతి కోరాడు. అయితే, దీనికి అంగీకారం రాలేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లో అతడిని సెర్బియా అభి మానులు పలుసార్లు ఎగతాళి చేశారు. అయితే, గోల్ చేసిన అనంతరం జాకా, షకీరి వీటికి సమాధానంగా... సెర్బియా పతాకంలో ఉండే రెండు గద్దల గుర్తును ఎద్దేవా చేస్తున్నట్లు సంకేతాలు చేశారు. షకీరి ఏకంగా చొక్కానే విప్పేశాడు. వీటిపై స్విస్ కోచ్ పెట్కోవిక్ మ్యాచ్ తర్వాత స్పందించాడు. ఫుట్‌బాల్–రాజకీయాలు వేర్వేరని, రెండింటినీ ముడి పెట్టవద్దని వ్యాఖ్యానించి వాతావరణాన్ని శాంతింపజేశాడు. అటువైపు షకీరి కూడా ఇందులో వేరే ఉద్దేశం లేదన్నాడు. -
అది అప్పుడు గొంగళిపురుగు, మరి ఇప్పుడో!!
అబ్దుల్ కలాంగారు ప్రతిజ్ఞచేయించినట్లుగా లక్ష్యసాధనకు ఏకాగ్రతతో శ్రమించాలి. లక్ష్య్యసాధన లో రెండు భాగాలు – లక్ష్యం నిర్ణయించుకోవడం మొదటిదికాగా, రెండవది దాని సాధనకోసం శ్రమించడం. విద్యార్థులుగా మీరు విజేతల అనుభవాలను పరికించి చూడండి. లక్ష్యం నిర్ణయించుకునే దశ, లక్ష్యసాధన తరువాతి దశ.. గొంగళి పురుగు దశ, సీతాకోకచిలుక దశలా కనిపిస్తాయి. రేపు మీ జీవితంలో కూడా అంతే. గొంగళిపురుగు ఒళ్ళంతా నల్లటి వెంట్రుకలతో ఏవగింపు భావన కలిగించేలా ఉంటుంది. మీదపడితే దురదపెడుతుంది. దానిని చూడడానికి తాకడానికి ఎవ్వరూ ఇష్టపడకపోయినా అది ఆకులుతిని తన నోటివెంట వచ్చే ద్రవంతో గూడుకట్టుకుని దానిలో పడుకుని నిద్రపోతుంది. అది దానికి తపస్సు. అది ఆ నిద్రలో ఉండగానే రంగురంగుల అందమైన సీతాకోకచిలుకగా మారుతుంది. తరువాత తాను కట్టుకున్న గూడు బద్దలు కొట్టుకొని బయటకు రావడంకోసం రెక్కలు విప్పడానికి ఉన్నచోటు దానికి సరిపోదు. గూడు గోడలు అడ్డుపడుతుంటాయి. అలా కొట్టుకుంటున్నప్పడు అది అలసిపోదు. ‘నేను బయటకి వచ్చి తీరుతా’ అన్న కృతనిశ్చయంతో శ్రమిస్తుంది. అలా కొట్టుకోగా కొట్టుకోగా గూడుకు చిన్న రంధ్రం పడుతుంది. ఇంకా శ్రమించగా ఆ రంధ్రం నెమ్మదిగా పెద్దదయి తనకు అడ్డుపడిన చిక్కులను తొలగించుకుంటూ గూట్లోంచి బయటపడుతుంది. రివ్వున ఆకాశంలో ఎగిరిపోతుంది. అప్పుడు దానిని చూస్తే ఆశ్చర్యపోతారు. అప్పుడది.. ఒళ్ళంతా నల్లటి వెంట్రుకలతో ఏవగింపు భావన కలిగించిన పురుగు ఎంతమాత్రం కాదు. అసలు అది ముందు అలా ఉండేదంటే కూడా నమ్మశక్యం కాదు. ఎన్ని రంగులు, ఎన్ని రేఖలు, చిత్రవిచిత్రమైన గీతలు ముగ్గులు పెట్టినట్లుగా చాలా అందంగా కనబడుతుంది. పరమ సంతోషంగా గాలిలో ఎగురుతూ పోతుంటుంది. ఆకులుతిని బతికిన గొంగళిపురుగు మరింత ఆశ్చర్యకరంగా పూలలో మకరందాన్ని తన తొండంతో జుర్రుకునే క్రమంలో పూరేకులమీద వాలినా వాటికి ఏ మాత్రం అపకారం జరగనివ్వదు, పాడు చేయదు. అది గూడు బద్దలు కొట్టుకోలేకపోతున్నప్పుడు మీరు వెళ్ళి ఏ చీపురుపుల్లతోనో అడ్డొచ్చిన గూడును జాగ్రత్తగా తొలగించారనుకోండి. ఆశ్చర్యం.. సీతాకోకచిలుక బయటికొస్తుంది,కానీ ఎగరలేక కిందపడిపోతుంది. అదలా కష్టపడేక్రమం లోనే, దానికాళ్ళకు, దాని రెక్కలకు కావలసిన బలాన్నది సొంతంగా సమకూర్చుకుంటుంది. అదీ మనిషికి ఉండవలసిన సాధనాబలం. ‘భగవంతుడు ఇంత గొప్ప జన్మనిచ్చాడు. మేధస్సు ఇచ్చాడు. ఇన్ని విద్యాలయాలు ఇచ్చాడు. ఇంత జ్ఞానాన్ని అందించే పుస్తకాలనిచ్చాడు. ఇంతమంది పెద్దలనిచ్చాడు. ఇంత గొప్ప సమాజాన్నిచ్చాడు. ఇన్ని ఉపకరణాలతో నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేనా?’ అని తనను తాను ప్రశ్నించకుంటూ లక్ష్యం దిశగా ఏకోన్ముఖంగా సాగిపోయిన విద్యార్థి సీతాకోకచిలుక లాగా సకలవర్ణశోభితమై తన కాళ్ళతో, తన రెక్కలతో స్వేచ్ఛగా విహరిస్తూ వస్తాడు. అందుకే విజయానికి చిహ్నంగా పైకి ఎగురుతున్న సీతాకోకచిలుక బొమ్మను వేస్తారు. గురువుగారి దగ్గర విద్యనేర్చుకోవడం అంటే... శిష్యుడు గురువుగారిని శ్రమపెట్టకుండా ఆయన దగ్గరచేరి విద్యపొందాలి. ఎలా !!! పూవుకు ఏ మాత్రం అపకారం చేయకుండా దాని గుండెల్లోకి చొరబడి సీతాకోకచిలుక మకరందాన్ని జుర్రుకున్నట్లు శిష్యుడు విద్యను సముపార్జించాలి.‘భృంగావళీచ మకరందరసానువిద్ధఝుంకారగీతనినదైఃసహసేవనయ ..... శేషాద్రి శేఖరవిభో తవసుప్రభాతమ్’.... సీతాకోక చిలుకులు ఎగురుతున్నాయి. ఆ సవ్వడి మీకు వినబడడం లేదా, తెల్లవారుతోంది స్వామీ, మీరు లేవండి – అని వేంకటేశ్వరస్వామిని కూడా ప్రేమగా నిద్రలేపడానికి ఒకనాడు ఏవగింపు కలిగించిన ఇప్పటి సీతాకోచిలుక ఒక అద్భుతమైన ఉపమానంగా నిలుస్తున్నది. సాధకుడు దానినుంచి స్ఫూర్తిని పొందాలి. విజేతగా సప్తవర్ణాలతో మెరిసిపోవాలి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ప్రజా సంక్షేమమే వైఎస్సార్ సీపీ ధ్యేయం
విజయనగరం మున్సిపాలిటీ: ప్రజా సంక్షేమమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, ఇందుకోసం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాట పటిమే సాక్షాత్కరంగా నిలుస్తుందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డుకు చెందిన 35 మంది యువత పార్టీ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణక్య, ఐదవ వార్డు అధ్యక్షుడు ఇప్పిలి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో పార్టీలో ఆదివారం చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కోలగట్ల, పార్టీ నాయకులు పిళ్లా విజయ్‌కుమార్ వారందరికీ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ నాలుగేళ్లుగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కారు అవినీతి, అక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తోందని మండిపడ్డారు. ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష, హక్కు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం వద్ద వారి స్వార్ధ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారన్నారు. పార్టీలో చేరిన వారంతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయటం ద్వారా రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో జె.రమణమూర్తి, జె.గురువులు, బి.గంగరాజు, జి.జైరామ్, ఎం.ధనరాజ్ తదితరులు ఉండగా... కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం నగర కన్వీనర్ ఆశపు వేణు, మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన.శ్రీనివాసరావు, సీనియర్ కౌన్సిలర్ ఎస్‌వివి.రాజేష్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సంగంరెడ్డి బంగారునాయుడు, పార్టీ నాయకులు బొద్దాన అప్పారావు, బోడసింగి ఈశ్వరరావు, మార్రోజు శ్రీనివాసరావు, రెడ్డి గురుమూర్తి, పూసర్ల చిన్ని, 5వ వార్డు నాయకులు డి.పద్మావతి, ఇప్పిలి త్రినా«ధ్, జె.కామేష్, బి.భాస్కరరావు, సింహాద్రి, ప్రసాదరావు, ఆడారి శ్రీను, పి.కృష్ణ, చందక పైడిరాజు, ఇప్పలి శ్రీను, పిట్ట శ్రీను కన్ని కళ్యాన్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ సెంచరీ నా లక్ష్యం కాదు: కోహ్లి
బెంగళూరు: బ్యాటింగ్‌తో పాటు ఫిట్‌నెస్‌లో కొత్త ప్రమాణాలు సృష్టించిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేయడం తన లక్ష్యం కాదని దాని కంటే మ్యాచ్‌లు గెలవడమే తనకు ముఖ్యమని అంటున్నాడు. ‘నా దృష్టి ఎప్పుడూ మ్యాచ్‌లు గెలవడంపైనే ఉంటుంది. ట్రిపుల్ సెంచరీలాంటి లక్ష్యాలేమి నాకు లేవు. అవి ఇతరుల లక్ష్యాలు’ అని కోహ్లి అన్నాడు. ఒత్తిడిలో రాణించడాన్ని అమితంగా ఆస్వాదించే కోహ్లి పరీక్షల ముందు విద్యార్థులపై ఉండే ఒత్తిడి గురించి మాట్లాడుతూ... ‘బోర్డు పరీక్షలు రాసే సమయంలో నేను కూడా కొంత విరామం తీసుకొని ఆటలకు కేటాయించేవాడిని. ఒత్తిడిని తగ్గించడంలో అవి ఎంతో తోడ్పడేవి. మానసిక ఉల్లాసంతో పాటు సానుకూల దృక్పథం పెరగడంలో ఆటల పాత్ర చాలా ముఖ్యమైనది. దీంతో తిరిగి చదువుపై శ్రద్ధ పెట్టగలిగేవాడిని. విజయాలు మనకు ఏమి నేర్పవు. పరాజయాలే పాఠాలు చెప్తాయి. కష్ట కాలంలోనే మనలోని నైపుణ్యాలకు పనిపెడతాం’ అని పేర్కొన్నాడు. తొలి సారి భారత జట్టులో చోటు దక్కిన రోజులను గుర్తు చేసుకుంటూ... ‘టీమిండియాకు ఎంపికైన సమయంలో అమ్మతో కలిసి టీవీ చూస్తున్నా. ఫ్లాష్ న్యూస్‌లో నా పేరు చూసి తప్పుడు ప్రచారమేమో అనుకున్నా. కానీ ఆ తర్వాత బోర్డు నుంచి ఫోన్ రావడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి’ అని అన్నాడు. -
కలలకు కాళ్లొచ్చాయి!
తూనీగలా పరిగెట్టే చురుకైన విరాళికి అకస్మాత్తుగా జ్వరం. 23 రోజులు కోమాలోకి తీసుకెళ్లిన ఆ జ్వరం... 24 గంటలూ చక్రాల కుర్చీకే పరిమితమయ్యేలా చేసింది. వైకల్యం కాళ్లకే గానీ... మనసుకూ, మనిషికీ కాదని గ్రహించాక ఇక వెనుదిరిగి చూడలేదు. మోడలింగ్ చేయాలన్నది ఆమె కల. మనసుకు రెక్కలు మొలిచి... పట్టుదలను చేతుల చేతలకు ఆవాహన చేసుకుంటే... కలలకు కాళ్లొచ్చి లక్ష్యం దాకా తీసుకెళ్తాయని తెలిసింది విరాళికి. అదెలా...? ‘మిస్ ఇండియా వీల్‌చైర్ పాజెంట్’కు ఎంపిక కావడం ద్వారా!! ‘‘నీకు నువ్వు ముఖ్యం. ముందు నీ మీద నువ్వు దృష్టిపెట్టడం మొదలుపెట్టు. సమాజాన్ని మెప్పించాలని ప్రయత్నించకు. అందులోపడి నీ సంతోషాన్ని దూరంచేసుకోకు. శారీరక వైకల్యం నిజంగా వైకల్యమే కాదు. కరుణ, దయ, ప్రేమ లేకపోవడమే అసౖలైన వైకల్యం! కలల మజిలీ చేరడానికి, లక్ష్యసాధనకు శారీరక వైకల్యం అడ్డే కాదు. ఆత్మస్థయిర్యం ఎంతదూరాన్నైనా నడిపిస్తుంది. ఎన్ని అడ్డంకులనైనా ఎదిరిస్తుంది. ఎన్ని సమస్యలనైనా జయిస్తుంది. నీ హక్కును పొందే వరకు పోరాడుతూనే ఉండు!’’ తన రైటప్ పూర్తి చేసి మళ్లీ ఒక్కసారి చదువుకుంది. సంతృప్తి, ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వు ఆ ముఖంలో! తను పంపించాల్సిన వెబ్‌సైట్‌కు పోస్ట్ చేసింది. పర్సనల్ కంప్యూటర్ను టర్నాఫ్ చేసి వీల్‌చైర్‌ని వెనక్కి తిప్పింది తన గదిలోకి వెళ్లడానికి ఆమె. పేరు విరాళి మోది. ప్రస్తుతం ఇండియాలోనే ఉంటోంది. కాని అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో పెరిగింది. నేపథ్యం: విరాళి వాళ్ల కుటుంబం ప్రతి యేడాది అమెరికా నుంచి ముంబై (స్వస్థలం) వచ్చేది సెలవులు గడపడానికి. అలా తనకు పధ్నాలుగేళ్ల వయసు (2006)లో కూడా ఒకసారి వచ్చింది. అది వర్షాకాలం. సెలవులు గడిపింది. మళ్లీ అమ్మానాన్నతో కలిసి అమెరికా వెళ్లిపోయింది. అక్కడికెళ్లాక ఆమెలో అనారోగ్యం బయటపడింది. ఉన్నట్టుండి విపరీతమైన తలనొప్పితో జ్వరం మొదలైంది విరాళికి. పిల్లల డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు ఆమె తల్లిదండ్రులు.‘‘ఏం పర్వాలేదు.. సీజనల్ చేంజ్ వల్ల ఇలా అయింది. నాలుగు, ఆరు గంటలకు ఒకసారి ఈ మాత్రలు వాడండి. అంతా నార్మల్ అయిపోతుంది. భయపడొద్దు’’ అని చెప్పి పంపేశాడు డాక్టర్. ఇంటికెళ్లాక విరాళి పరిస్థితి ఇంకా దిగజారింది. అప్పుడే ఒళ్లంతా కొలిమిలా కాలిపోయేది. ఇంకో రెండుగంటలకు మంచులా చల్లబడేది. విరాళి తల్లిదండ్రులకు భయమేసింది. డాక్టర్ దగ్గరకు మళ్లీ పరిగెత్తారు. పాప కండిషన్ సీరియస్‌గా ఉంది. ఆసుపత్రిలో హడావిడి మొదలైంది. అమ్మాయి స్పృహ తప్పింది. పల్స్ పడిపోతోంది. గుండె ఆగింది. మూడు ఎలక్ట్రక్ షాక్స్ ఇచ్చి తిరిగి గుండె కొట్టుకునేలా చేశారు. కాని శ్వాస తీసుకోలేకపోతోంది. హార్ట్ మానిటర్స్‌ను అమర్చారు. బ్లడ్ప్రెషన్ మెషీన్ పెడుతూనే ఐసీయూలోకి మార్చారు. స్పృహ లేదు. అలా 24 గంటలు గడిచాయి. అయినా ఈ లోకంలోకి రాలేదు విరాళి. కోమా అన్నారు డాక్టర్లు. 23 రోజులు కోమాలోనే ఉంది. 24వ రోజు విరాళి బర్త్‌డే. కళ్లు తెరవకపోయినా కూతురికి పుట్టినరోజు జరపాలనుకుంది. భర్తతో చెప్పింది. సరే అన్నాడు. డాక్టర్ల అనుమతీ తీసుకుంది. అమెరికాలోని తన దగ్గరి స్నేహితులను, బంధువులను పిలిచింది. ఆ రోజు..: విరాళికి ఇష్టమైన వంటలను వండింది. కేక్ తెచ్చారు. ఆసుపత్రిలో విరాళి గదిని డెకరేట్ చేశారు. నర్సుల సహాయంతో విరాళికి స్పాంజింగ్ చేసి కొత్త బట్టలు వేసింది. కరెక్ట్‌గా పధ్నాలుగేళ్ల కిందట ఆమె పుట్టిన సమయానికి విరాళితో కేక్ కట్ చేయించారు. విరాళిలో చిన్న కదలిక. ఆ తల్లి దృష్టిలో పడ్డా... 23 రోజుల్నించి ఇలాంటి భ్రమలు ఆమెను చాలా ఆశపెట్టాయి. అందుకే పట్టించుకోలేదు. కాని పడుకున్న ఆ శరీరంలో మళ్లీ చిన్న కదలిక. ఈసారి ఆ తల్లి మనసు ఆత్రంగా కళ్లు చేసుకొని చేసుకొని చూసింది. హ్యాపీ బర్త్‌డే టూ యూ విరాళీ అని పాడుతున్న స్నేహితులు, బంధువులను ‘హుష్... ’ అంటూ నోటి మీద వేలేసి చూపిస్తూ ఆపింది. అందరూ ఒక్కసారిగా ఆపేసి ఆమెనే చూశారు. ఆమె విరాళిని చూసింది. విరాళి తల తిప్పింది కుడి నుంచి ఎడమవైపు. ‘బేటా... ’ ఆనందోద్వేగంతో కేక విరాళి తల్లిది. అందరి దృష్టి అటువైపే. బిడ్డ కదిలింది. వెంటనే కళ్లూ తెరిచింది. కనుబొమలు ముడి వేసింది. ‘‘నేనురా.. అమ్మను.. ’’ ఆమెను తోసేస్తూ.. ‘‘బేటా.. మై పాపా’’వాళ్ల నాన్నా.. ఆయనను తోసేస్తూ ‘‘వీరూ బేటా.. మై చాచా’’ ఇలా అందరూ ఒకర్ని కాదని ఇంకొకరు. విరాళిని ఈ లోకంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విరాళీకి అలసటగా ఉంది. మళ్లీ కళ్లు మూసుకుంది. అందరిలో కంగారూ. డాక్టర్లు పరిగెత్తుకొచ్చారు. చకచకా టెస్ట్‌లు మళ్లీ. తల్లిదండ్రుల్లో ఆందోళన ఏం చెప్తారో డాక్టర్లు అని. ‘‘అమ్మాయి కోమాలోంచి బయటకు వచ్చింది. కానీ... ’ అని ఆగారు. ‘‘కానీ ఏంటీ’’ భయంగా పేరెంట్స్. మెడ నుంచి కింద వరకు పారలైజ్ అయిపోయింది. కదల్లేదు. దాదాపు జీవితాంతం వీల్ చెయిరే’’ చెప్పారు డాక్టర్లు. కుప్పకూలిపోయారు తల్లిదండ్రులు. ఈ విషయం తెలియని విరాళి తన బర్త్‌డేకు వచ్చిన వాళ్లందరినీ గుర్తుపట్టే ప్రయత్నం చేస్తోంది. కలల నడక ఆగలేదు: విరాళికి మోడల్ కావాలని, సినిమాల్లో నటించాలని చిన్నప్పటి నుంచీ కల. దానికోసం స్కూలింగ్ అయిపోగానే ట్రైనింగ్ తీసుకోవాలని కూడా నిర్ణయించుకుంది. తల్లిదండ్రులూ ఆమె కోరికను కాదనలేదు. కాని ఇప్పుడు తను అసలు నడవలేదని తెలిస్తే బిడ్డ తట్టుకుంటుందా? అయినా చెప్పక తప్పలేదు. చెప్పారు.తను నడవలేదు. జీవితమంతా వీల్‌చైర్ ఆసరానే అనే నిజాన్ని విరాళీకీ చెప్పారు. షాక్ అయింది. ఆ షాక్‌లోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చింది. డిప్రెషన్‌తో కుంగిపోయింది. మళ్లీ దానికి ట్రీట్మెంట్ / మాత్రలు... హాస్పిటల్.. విసుగొచ్చింది విరాళికి. ఇది కాదు తన జీవితం! ఇలా బతకాలని అనుకోలేదు! మారాలి! ఇంకొకరి సానుభూతితో ఎన్నాళ్లు బతుకీడుస్తుంది? కాళ్ళు లేకపోతే ఏం? మనసుకు రెక్కలున్నాయి. మెదడుకు శక్తి ఉంది! ఎక్కడికైనా వెళ్లగలుగుతుందీ... ఏమైనా చేయగలుగుతుంది. ఆ ధైర్యం తను ఉన్న స్థితిని అంగీకరించేలా చేశాయి. తర్వాత ట్రీట్మెంట్కు శరీరాన్ని సిద్ధం సింది. కొంత కొంతగా మార్పు వచ్చింది. కాని చక్రాల కుర్చీ వీడేంతగా కాదు. మోడలింగ్.. నటన.. తన లక్ష్యం! తిరిగి ముంబైకి వచ్చేసింది. మోడలింగ్ అవకాశాలకోసం ఫోటో షూట్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఇండియాలో వికలాంగులకోసం సరైన ప్రయాణ వసతి లేదని ప్రాక్టికల్‌గా అనుభవించి, అర్థం చేసుకుంది. వాళ్ల హక్కులకోసం పోరాడ్డం ప్రారంభించింది. ఆ పోరాట ఫలితం కేరళలోని ఎర్నాకులంలో వికలాంగుల కోసం దేశంలోనే మొట్టమొదటి రైల్వేస్టేషన్ స్టార్టవడం. ఇంకోవైపు తన కలల సాధన పట్టాలెక్కింది. 2014లో ‘మిస్ ఇండియా వీల్‌చైర్ పాజెంట్’గా కూడా ఎన్నికైంది. అందుకే అంటుంది.. వైకల్యం శరీరానికి ఉండదు అని! -విరాళి -
మైనార్టీల సంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయం
సాక్షి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా రీజినల్ కో–ఆర్డినేటర్ మేకపాటి గౌతంరెడ్డి, కర్నూలు, నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. కర్నూలు పాతబస్తీలోని రాయల్ ఫంక్షన్ హాల్లో బుధవారం.. వైఎస్సార్సీపీ కర్నూలు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గౌతంరెడ్డి, బీవై రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా సహకరించాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్లు విధించి..ప్రజలకు మద్యం తాపిస్తూ ప్రాణాలను హరిస్తోందన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి జరగలేదని.. అధికార పార్టీ నేతలు అక్రమమార్గంలో ఆర్థికంగా బలపడుతున్నారని విమర్శించారు. నమ్ముకున్న వారిని అమ్ముకుని పోయాడంటూ పార్టీ మారిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి గురించి ఎద్దేవా చేశారు. జన్మభూమిలో రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్నారు. దీంతో విసిగిపోయిన ప్రజలు అధికారులను నిలదీస్తున్నారన్నారు. కర్నూలు మండల పరిధిలోని పూడూరులో అధికారులను ఊర్లోకి కూడా రానీయలేదన్నారు. సాధ్యంకాని హామీలు గుప్పించడం టీడీపీ అధినేత చంద్రబాబు నైజమన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, అన్ని వర్గాల ప్రజల మేలు కోసం నవరత్నాల వంటి పథకాలను రూపొందించారని తెలిపారు. డబ్బుతో రాజకీయం చేసే చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రజలు వైఎస్ఆర్సీపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. నైతిక విలువలు కాపాడేందుకే వైఎస్సార్సీపీ ఆవిర్భవించిందని, ప్రజల కోసమే జగన్మోహన్రెడ్డి ఎండనకా, వాననకా పాదయాత్రలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాజీనామా చేయించకుండానే 22 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్న టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శించారు. కర్నూలు సమన్వయకర్త హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. మైనారిటీలపై మానవత్వం చూపేది ఒక్క వైఎస్ఆర్ కుటుంబం మాత్రమేనని స్పష్టం చేశారు. పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. మైనార్టీలంతా వైఎస్సార్సీపీ పక్షమేనన్నారు. మైనారిటీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్‌ఖాదర్ మాట్లాడుతూ జాబు రావాలంటే బాబు పోవాలన్నారు. పార్టీ తల్లిలాంటిదని, గెలిపించిన పార్టీని వదలి మరో పార్టీలోకి చేరడం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు ఉందని విమర్శించారు. పత్తికొండ నేత, దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి సోదరుడు ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తల్లో నుంచే నాయకుడు పుడతాడన్నారు. అనంతరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎ.రహ్మాన్, సంయుక్త కార్యదర్శి బి.జహీర్‌అహ్మద్‌ఖాన్, ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్.మద్దయ్య, జిల్లా నాయకురాలు విజయకుమారి మాట్లాడారు. కార్యక్రమంలో వివిధ శ్రేణుల నాయకులు టి.వి.రమణ, కటారి సురేశ్‌కుమార్, మాజీ కార్పొరేటర్ దాదామియ్య, మహమ్మద్ తౌఫిక్, రాఘవేంద్రరెడ్డి, హరినాథ్‌రెడ్డి, ఆదిమోహన్‌రెడ్డి, సాంబశివారెడ్డి, మల్లికార్జున, జాన్, లతీఫ్, బోదేపాడు భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యం.. ఛేదించలేకపోయారు...
ప్రభుత్వం కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్సలు చేసి జనాభానియంత్రణకు తన వంతు ప్రయత్నంలో భాగంగా జిల్లాకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రజల్లో అవగాహన కల్గించివారే ఆపరేషన్లు చేయించుకునేలా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అధికారులు కృషిచేయాల్సి ఉన్నప్పటికీ తమకు కేటాయించిన లక్ష్యాన్ని సాధించడంలో విఫలమయ్యారు. తమకు ఉన్న గడువులో లక్ష్యాన్ని సాధించడం అధికారులకు కష్టమే... ► సంక్షేమ శస్త్రచికిత్సల టార్గెట్ సాధించడంలో విఫలం ► 15 వేలకు కేవలం 8969మాత్రమే పూర్తిచేసిన అధికారులు విజయనగరంఫోర్ట్: కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్స లక్ష్యం సాధించడానికి నిర్ధేశిత గడువు కేవలం 10 రోజులే ఉంది. అయితే సాధించాల్సిన లక్ష్యం మాత్రం వేలల్లో ఉంది. 11 నెలల్లో సాధించలేనిది కేవలం 10 రోజుల్లో సాధిస్తారనేది సందేహంగా నిలిచింది. 2016–17 సంవత్సరానికి వైద్య ఆరోగ్యశాఖకు ప్రభుత్వం కుటుంబ సంక్షేమ లక్ష్యం 15వేలు ఇచ్చింది. అయితే ఇంతవరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు 8969 చికిత్సలు చేశారు. ఇంకా 6031 కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంది. అయితే లక్ష్యాన్ని సాధించడానికి ఇంకా కేవలం 10 రోజులే ఉంది. ఈ 10 రోజుల్లో లక్ష్యాన్ని సాధించడం అంత సులవు కాదు. జనాభా నియంత్రణకు అతి ప్రధానమైన కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సల లక్ష్యాన్ని నెరవేర్చడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రతి నెలా నిర్వహించే సమావేశాల్లో కుటుంబ సంక్షేమ చికిత్సల లక్ష్యాన్ని సాధించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పదేపదే చెబుతున్నారు. కాని అది అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిలో జిల్లా వెనుకపడడమే ఇందుకు నిదర్శనం. జిల్లా జనాభా ఏటా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జనాభాను నియంత్రించడం చాలా అవసరం. కానీ అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. జనాభాను అరికట్టకపోతే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా స్థల సమస్య, నిరుద్యోగసమస్య, ఆహార సమస్య ఇలా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటికీ పరిష్కారమే కు.ని. చికిత్స. వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం.. కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్సల లక్ష్యాన్ని సాధించడానికి కృషిచేస్తున్నాం. సాధ్యమైనంత తొందరగా వీటిని పూర్తి చేస్తాం. ఈ నెలలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. డాక్టర్ సి.పద్మజ, డీఎంహెచ్ఓ, విజయనగరం -
పట్టుదలతోనే లక్ష్యసాధన సాధ్యం
జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ కల్లూరు: పట్టుదలతోనే లక్ష్య సాధన సాధ్యమని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. శుక్రవారం నగర శివారులోని బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సైన్స్ కాలేజ్‌లో కళాశాల వార్షికోత్సవం సందర్భంగా అవార్డ్స్డేను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక, క్విజ్ తదితర అంశాల్లో తప్పకుండా పాల్గొనాలన్నారు. కళాశాల కోశాధికారి డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు ఉత్తమ మార్గాలను అన్వేషించి అవసరమైన వనరులను సమకూర్చడంలో రాజీ పడకుండా ఎల్లవేళలా కృషి చేస్తామన్నారు. అనంతరం వివిధ అంశాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు, అవార్డులు ప్రదానం చేశారు. గాయకులు సాయిశిల్ప, సుమంత్ ఆలపించిన పాటలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ శివప్రసాద్ రెడ్డి, ఈడీలు రమేష్ రెడ్డి, నారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ టీఎస్ఎస్ బాలాజీ, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గిరీష్ రెడ్డి, వివిధ శాఖాధిపతులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
కోల్‌కతా 1, నార్త్ ఈస్ట్ 1
కోల్‌కతా: నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో ఇంజ్యూరీ సమయంలో గోల్ చేసిన అట్లెటికో డి కోల్‌కతా డ్రాతో గట్టెక్కింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో భాగంగా గురువారం జరిగిన ఈ మ్యాచ్ ఐదో నిమిషంలోనే నార్త్ఈస్ట్ కు వెలెజ్ గోల్ అందించాడు. ఆ తర్వాత దాదాపు మ్యాచ్ చివరి వరకు తమ ఆధిక్యాన్ని కాపాడుకున్న ఈ జట్టుకు ఇయాన్ హ్యుమే షాకిచ్చాడు. ఇంజ్యూరీ (90+) టైమ్‌లో అత్యంత సమీపం నుంచి బంతిని గోల్‌పోస్టులోకి పంపి సొంత గడ్డపై అభిమానులను మురిపించాడు. -
మత్స్య సంపదను పెంచడమే లక్ష్యం
నకిరేకల్ : మత్స్య సంపదను పెంచడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ పశు, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నకిరేకల్ మండలం వల్లభాపురం గ్రామ శివారులోని మూసీ జలాశయంలో 18.50 లక్షలకు 6లక్షల చేప పిల్లలను గురువారం ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి వదిలిపెట్టారు. అనంతరం జరిగిన సభలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన చండీయాగం ప్రతిఫలంగా ఈ ఏడాది తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, జలాశయాలు నిండాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో 45 నుంచి 50 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దళారీ వ్యవస్థను అరికడుతూ మత్స్య సంపదపై ఆధారపడిన గంగపుత్రులు, ముదిరాజ్‌లు, బెస్త వృత్తుల కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత సీమాంద్ర ప్రభుత్వాల హయాంలో మత్స్యశాఖకు రూ.1కోటి బడ్జెట్ ఉండగా నేడు తెలంగాణలో రూ.100కోట్లకు పెంచామన్నారు. సొసైటీ సభ్యులతో సభ్యత్వం లేని వారు కూడా ఆ జాతి కోసం జరిగే ఈ మేలులో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ వర్గానికి చెందిన వారందరికి సభ్యత్వం ఇస్తామన్నారు. పెరిగిన చేపలపై సభ్యులందరికి హక్కు ఉంటుందన్నారు. చేపల విక్రయానికి ప్రభుత్వం మార్కెట్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. ప్రధానంగా నియోజకవర్గ కేంద్రాల్లో చిన్న చిన్న చేప మార్కెట్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గంగ పుత్రుల కమ్యూనిటీ హాల్ కోసం రూ.10లక్షలు నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. గంగ పుత్రుల కోసం జీపులు, ద్విచక్రవాహనాలు కూడా 75శాతం సబ్సిడీపై అందిస్తుందన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం సార థ్యంతో 15 కమ్యూనిటీ హాల్లు మంజూరు కావడం హర్షణీయమన్నారు. మూసీ రిజార్వాయర్‌లో కూడా కేజి కల్చర్ 10 యూనిట్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ మత్స్యకారులలో ఆర్థిక పరిపుష్టి పెంచడం కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ చేప పిల్లలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మత్స్య సంపద దళారుల బారిన పడకుండా ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటూ వారి జీవితాలలో వెలుగు నింపేందుకే ఈ చేప పిల్లల పంపిణి కార్యక్రమం చేపట్టిందన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ రాష్ట్ర కమిషనర్ వెంకట్రావు, పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ శంకర్ రాథోడ్, పశు సంవర్థక శాఖ జేడీ నర్సింహ, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, ఓయూ జేఏసీ ప్రతినిధి దూదిమెట్ల బాలరాజు యాదవ్, నల్లగొండ ఆర్డీ ఓ వెంకటాచారి, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మొగిలి సుజాతయాదయ్య, జెడ్పీటీసీ పెండెం ధనలక్ష్మి, మూసీ మత్స్యకార సంఘం చైర్మన్ అల్వాల వెంకటస్వామి, డైరెక్టర్ సాదుల నర్సయ్య, వల్లభాపురం సర్పంచ్ జయమ్మ, ఎంపీటీసీ మాద ధనలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు పూజర్ల శంభయ్య, పల్రెడ్డి నర్సింహారెడ్డి, మాదగోని సైదులు, వీర్లపాటి రమేష్, మంగినపల్లి రాజు, ఎల్లపురెడ్డి సైదారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొత్తగూడెం సమగ్రాభివృద్ధే లక్ష్యం
ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కొత్తగూడెం /పాల్వంచ : కొత్తగూడెం జిల్లా సమ గ్రాభివృద్ధి సాధించాలనే సంకల్పంతోనే తాను పాదయాత్ర చేపట్టినట్టు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అన్నారు. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు అందుబాటులో అధికార యంత్రాంగం ఉండాలనే లక్ష్యంతోనే కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు ‘మన ప్రగతి యాత్ర’ పేరుతో కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు మంగళవారం పాదయాత్ర చేపట్టారు. తొలుత కొత్తగూడెంలోని శ్రీవిజయ విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అక్కడి నుంచి పాద యాత్ర ప్రారంభించారు. మధ్యాహ్నం పాల్వం చలోని నవ భారత్ చేరుకుంది. అక్కడి నుంచి ఆయనకు పార్టీ శ్రేణులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. నవభారత్, పాత పాల్వంచ, దమ్మపేట సెంటర్, అంబేడ్కర్, బస్టాండ్ సెంట ర్, ఇందిరా కాలనీ తదితర ప్రాంతాల్లో నాయకులు, మహిâýæలు బతుకమ్మలతో ఎదురెళ్లి స్వాగ తం పలికారు. దమ్మపేట సెంటర్లో సభలో జల గం మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధించేందుకు సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. కొత్తగూడెం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి సాధించేందుకు, విమానాశ్రయం, టూరిజం హోటâýæ్ల ఏర్పాటుకు, పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కాగా.. తొలిరోజు యాత్ర 17 కిలోమీటర్లు కొనసాగింది. రాత్రి పాల్వంచ మండలం జగన్నాధపురం పెద్దమ్మతల్లి దేవాలయం వద్ద బస చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్, నాయకులు కిలారు నాగేశ్వరరావు, మంతపురి రాజుగౌడ్, కాల్వ భాస్కర్, పొనిశెట్టి వెంకటేశ్వర్లు, మల్లెల రవిచంద్ర, మురళి, దాసరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
‘ఒక్కటే’ లక్ష్యం
కివీస్‌తో సిరీస్ కీలకం రోహిత్ శర్మ వ్యాఖ్య ముంబై: ప్రస్తుత సీజన్లో భారత జట్టు సరైన దిశలో సాగుతోందని స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అన్నాడు. ‘మా లక్ష్యం నంబర్‌వన్. ఇటీవల అగ్రస్థానంలో ఉన్నప్పటికీ రోజుల వ్యవధిలోనే చేజార్చుకున్నాం. మళ్లీ ఈ సీజన్లో సాధిస్తాం’ అని రోహిత్ చెప్పాడు. ముంబై స్పోర్ట్స జర్నలిస్టుల సంఘం స్వర్ణోత్సవ వేడుక అవార్డుల కార్యక్రమానికి రోహిత్‌తో పాటు అజింక్యా రహానే, మాజీ బౌలర్ జహీర్‌ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ ‘వెస్టిండీస్‌తో చివరి టెస్టు వర్షం వల్ల జరగకపోవడం వల్లే టెస్టు ర్యాంకింగ్‌సలో నంబర్‌వన్ స్థానాన్ని కోల్పోయాం. ఏకంగా 13 టెస్టులు జరగనున్న ఈ సీజన్లో రాణించి టాప్ ర్యాంకుకు చేరుకుంటాం. ముందుగా న్యూజిలాండ్ సిరీస్‌నుంచే మా జైత్రయాత్ర ప్రారంభిస్తాం’ అని అన్నాడు. రహానే మాట్లాడుతూ కివీస్‌తో త్వరలో జరిగే సిరీస్ కీలకమైందని. దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పాడు. తదుపరి జరిగే టెస్టులన్నీ స్వదేశంలోనే ఉండటంతో ఈ సీజన్ మొత్తం ముఖ్యమైందని అన్నాడు. జహీర్ మాట్లాడుతూ ‘ఇలాంటి పెద్ద సీజన్‌తో క్రికెటర్ల టెస్టు కెరీర్ గ్రాఫ్ అమాంతం మారుతుంది. గెలిచినా... ఓడినా... ఫలితమేదైనా కానివ్వండి... ఆటగాళ్ల కెరీర్‌కు ఇది మేలే చేస్తుంది’ అని అన్నాడు. ఆశావహ దృక్పథంలో సీజన్‌ను మొదలు పెట్టాలని అతను సూచించాడు. -
పట్టణాభివృద్ధే ధ్యేయం
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట పట్టణాభివృద్ధే తమ ధ్యేయమని మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక అన్నారు. శుక్రవారం పట్టణంలోని 26వ వార్డులో డ్రెయినేజి నిర్మాణ పనులను ఆమె ప్రారంభించి మాట్లాడారు. వర్షాలు పడుతున్నందున ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పోలెబోయిన రాధిక, ఆకుల లవకుశ, డీఈ వెంకటేశ్వర్రావు, సూర్గి శంకర్, మోత్కూరి సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యసాధకులు సింగరేణీయులు
కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యం విడిభాగాల తయారీకి చిన్నతరహా పరిశ్రమల స్థాపన దేశాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దుదాం స్వాతంత్య్ర వేడుకల్లో సీఎండీ శ్రీధర్ కొత్తగూడెం(ఖమ్మం) : యాజమాన్యం నిర్దేశించే ఎంతటి లక్ష్యాన్నైనా సింగరేణీయులు సమష్టి కృషితో సాధిస్తారు.. ఈ విషయాన్ని గతంలోనే రుజువు చేశారని సింగరేణి సీఎండీ నడిమట్ల శ్రీధర్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా పరిధి ప్రకాశం స్టేడియంలో సింగరేణి నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతి«థిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్, సింగరేణి ఎస్అండ్పీసీ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి మాట్లాడా రు. ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వా తంత్య్ర లభించిందని, వారి ఆశయాలు సిద్ధించేలా భారతావనిని మరింత గొప్పగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర ఫలాలు ప్రతీ భారతీయుడికీ అం దాలని ఆకాంక్షించారు. దేశ, రాష్ట్ర అవసరాల కోసమే ఈఏడాది సింగరేణి 66 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్ప త్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుందని, దీనిని సాధించాలంటే రోజుకు కనీసం 2లక్షల టన్నుల బొగ్గు వెలికి తీయాల న్నారు. భారీ వర్షాల కారణంగా ఓపెన్‌కాస్టులలో ఉత్ప త్తి వెనుకబడిందని, రానున్న కాలంలో సమష్టి కృషితో లోటును పూడ్చాలని కోరారు. రాష్ట్ర ఇంధన అవసరాల కు కావలసిన బొగ్గును అందిస్తూనే విద్యుత్ అవసరాల ను తీర్చడానికి కంపెనీ జైపూర్‌లో నిర్మించిన 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఈనెల 7న ప్రధా న మంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించి జాతికి అంకితం చేసినట్లు గుర్తుచేశారు. సౌకర్యాల మెరుగుకు మరిన్ని నిధులు సంక్షేమ కార్యక్రమాల్లో సైతం యాజమాన్యం ఎల్లప్పు డూ ముందుంటుందని, సీఎం కేసీఆర్ పిలుపుమేరకు 75 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని కేవలం 24 రోజుల్లో నే పూర్తి చేశామని సీఎండీ చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు 60,369 మందితో సామూహిక యోగా నిర్వహించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించామని తెలిపారు. మీ కోసం–మీ ఆరోగ్యం కోసంలో భాగంగా ఇంటింటికీ యోగా, సింగరేణి ఆణిముత్యాలులో భాగంగా 1200 మంది నిరుద్యో యువతీ యువకులకు పోలీస్, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాలనీలు, గనుల్లో సౌకర్యాలు మెరుగుపర్చడానికి నిధులు ఇప్పటి కే మంజూరు చేశామని, అవసరమైతే మరిన్ని మంజూ రు చేస్తామన్నారు. సమీప గ్రామాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని, సీఎస్ఆర్ కింద రూ.40 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. అన్ని ఏరియాల్లో చిన్నతరహా పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సింగరేణి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 5వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని, మరో 242 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపా రు. బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో కంపెనీకి అవసరమైన విడిభాగాల తయారీకి స్థానిక యువకులతో చిన్నతర హా పరిశ్రమలు స్థాపించాలని యోచిస్తున్నామని, అన్ని ఏరియాల్లో ఆసక్తిగల యువకులను ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. సింగరేణిలో ఉత్తమ కార్మికులు, ఉద్యోగులుగా ఎంపికైన వారిని సీఎండీ ఎన్.శ్రీధర్, ఆయన సతీమణి, డైరెక్టర్ల చేతులమీదుగా సత్కరించారు. డైరెక్టర్లు ఎ.మనోహర్‌బాబు, బి.రమేష్‌కుమార్, జె.పవిత్రన్‌కుమార్, రమేష్‌బాబు, జీఎం(పర్సనల్) వెల్ఫేర్ అండ్ సీఎస్ఆర్ జి.మురళీసాగర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కనకరాజు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘సమ సమాజ నిర్మాణమే లక్ష్యం’
అనంతపురం సప్తగిరి సర్కిల్ : సమ సమాజ నిర్మాణమే అభ్యుదయ సాహిత్య లక్ష్యమని భారతీయ అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శి పెనుకొండ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అభ్యుదయ సాహిత్యం 80 ఏళ్ల చరిత్ర కలిగి ఉందన్నారు. సమ సమాజ నిర్మాణమే అభ్యుదయ సాహిత్య లక్ష్యమన్నారు. మార్క్సిజం, తాత్విక నేపథ్యం ద్వారా పేదలవైపు నిలబడి సాహిత్యాన్ని సృష్టించేదే అభ్యుదయ సాహిత్యమన్నారు. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, మహిళలు దళితులు 90 శాతం అభ్యుదయ సాహిత్యం వైపు ఉన్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిలుకూరి దేవపుత్ర, మల్లెల నరసింహమూర్తి, రాజారెడ్డి, నాగేంద్రగౌడ్ పాల్గొన్నారు. -
మహిళల అభ్యున్నతే ధ్యేయం
గుంటూరు వెస్ట్: స్వయం సహాయక గ్రూపులు తీసుకున్న రుణాలు సక్రమంగా వినియోగమయ్యేలా చూడడంతోపాటు మహిళలు ఆర్థికంగా ఎదిగేలా పాటుపడాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) జిల్లా ఇన్చార్జి ప్రాజెక్టు డైరెక్టర్ పి.పాండురంగారావు కోరారు. ఆర్థిక అక్షరాస్యత, ఫ్యామిలీ బిజినెస్ ప్లాన్‌పై గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన జిల్లా రీసోర్సుపర్సన్లు (డీఆర్పీ), కమ్యూనిటీ ఆర్గనైజర్లకు (సీవో) మూడు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణా తరగతులు కలెక్టర్ బంగ్లారోడ్డులోని మహిళా ప్రాంగణంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పాండురంగారావు మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్న మెప్మా సిబ్బంది అర్హులైన గ్రూపులకు రుణాలు అందించాలని కోరారు. రాష్ట్ర మిషన్ కోఆర్డినేటర్ ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1.82 లక్షల గ్రూపులు ఉండగా అందులో 18 లక్షలకుపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారని అన్నారు. శిక్షణకు హాజరైన జిల్లా రోసోర్సు పర్సన్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఇక్కడ బోధించే అంశాలపై పట్టుసాధించి, జిల్లాలకు వెళ్లిన తర్వాత గ్రూపుల వారీ సమావేశాలు నిర్వహించి వ్యాపార ప్రణాళికలపై అవగాహన పెంచాలని కోరారు. ఎపీట్కో టీమ్ లీడర్ డి.శ్రీనివాసరఘు, మిషన్ జిల్లా కోఆర్డినేటర్ విజయ్ రాజ్‌కుమార్, వివిధ జిల్లాల నుంచి సుమారు 45 మంది డీఆర్పీలు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు పాల్గొన్నారు. -
గూగుల్ లక్ష్యం @ 100 కోట్లు..
-
గూగుల్ లక్ష్యం @ 100 కోట్లు..
ముంబై: భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యను వంద కోట్లకు చేర్చాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు గూగుల్ సంస్థ గురువారం ప్రకటించింది. ఈ విషయాన్ని గూగుల్ ఆగ్నేయ ఆసియా, భారత్‌ల వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ ముంబైలో వెల్లడించారు. అయితే ఎప్పటిలోపు దీన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో మాత్రం ఆయన చెప్పలేదు. ప్రస్తుతం భారతదేశంలో ఇంటర్నెట్ను వినియోగించేవారు 35 కోట్లు ఉన్నారనీ ప్రకటించారు. 2020 నాటికి 60 కోట్లకు చేరవచ్చనే అంచనాలున్నాయని ఆనందన్ పేర్కొన్నారు. ఇంటర్నెట్ను ప్రజలకు మరింత చవకగా, అందరికీ అందుబాటులోకి తెస్తేనే ఈ లక్ష్యాన్ని సాధించగలమని ఆయన వివరిం చారు. రైల్‌టెల్ భాగస్వామ్యంతో ఇప్పటికే గూగుల్ దేశంలోని 27 రైల్వే స్టేషన్లలో అందిస్తున్న ఉచిత వైఫై సౌకర్యాన్ని ఈ సందర్భంగా ఆనందన్ ఉదహరించారు. -
కేన్సర్ నివారణే ప్రధానం
దేవరకొండ : కేన్సర్ వ్యాధి నివారణే ప్రధానమని, వ్యాధి లక్షణాలు గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఆంకోటెలిగెంట్, నీలగిరి ఫౌండేషన్, యశోద కేన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కేన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఆయన దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేన్సర్ వ్యాధిని మొదట దశలోనే గుర్తిస్తే మేలు జరుగుతుందని అన్నారు. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం తరుపున చికిత్సకు కావాల్సిన సహాయాన్ని తన వంతుగా అందిస్తానని అన్నారు. అనంతరం దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, నగర పంచాయతీ చైర్మన్ మంజ్యానాయక్, వైస్ ఎంపీపీ దూదిపాల వేణుధర్‌రెడ్డి, వైస్ చైర్మన్ నల్లగాసు జాన్‌యాదవ్, పాశం రాంరెడ్డి, రేపాల హరి, తేలుకుంట్ల జయశ్రీ, సుజాత స్టీఫెన్, తాళ్లపల్లి రఘు, రాంబాబు, సుజాత, శ్రీకాంత్‌రెడ్డి, విజయ్‌కాంత్, కౌన్సిలర్లు ఆసిఫ్, వడ్త్య దేవేందర్, నాయకులు బండారు బాలనర్సింహ, చింతపల్లి సుభాష్, పొన్నెబోయిన సైదులు, చిత్రం ఏసోబు, బొడ్డుపల్లి కృష్ణ తదితరులున్నారు. -
లక్ష్యాన్ని చేరుకోవాలి
రాంనగర్: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ డాక్టర్ యన్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ఉన్నందున జిల్లాలో ఇప్పటి వరకు హరితహారం కింద నాటిన మొక్కల పూర్తి వివరాలతో హాజరుకావాలని అధికారులకు సూచించారు. నాటిన ప్రతి మొక్క వివరాలను పూర్తిస్థాయిలో క్రోడీకరించి సేకరించాలని నియోజకవర్గ ఇన్చార్జి అధికారులను కోరారు. 65వ జాతీయ రహదారి వెంట నాటిన ప్రతి మొక్కకు 30 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి మొక్కలను సంరక్షిస్తున్నట్లు వివరించారు. వర్షాలుపడని చోటట్యాంకర్లను ఉపయోగించి నీటిని సరఫరా చేసి మొక్కలను కాపాడాలని సూచించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమ అమలు జరుగుతున్న విధానంపై ఆకస్మిక తనిఖీలు చేస్తారని తెలిపారు. అధికారులు అప్రమత్తతో పనిచేసి జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కొన్ని శాఖల్లో ఇంకా మందకొడిగా పనులు నడుస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినందున వెంటనే సంబంధిత శాఖల అధికారులు పనులు వేగవంతంగా చేయడానికి కృషి చేయాలని సూచించారు. ఇప్పటివరకు నాటిన ప్రతి మొక్కను సంరంక్షించడానికి ఫెన్సింగ్ 15 శాతం మాత్రం జరిగిందని, మిగతా పనులు వేగవంతం చేసి ఫెన్సింగ్‌ను ప్రతి మొక్కకు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏజేసీ వెంకట్రావు, డీఆర్వో రవి, పులిచింతల స్పెషల్ కలెక్టర్ నిరంజన్, డ్వామా పీ.డీ. దామోదర్‌రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
దళితుల అభివృద్ధే ధ్యేయం: పిడమర్తి
కలకోవ(మునగాల): తెలంగాణలో దళితుల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఎస్సీ కారర్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి స్పష్టం చేశారు. గురువారం మండలంలోని కలకోవలో దళితులకు మూడు ఎకరాల భూమి సేకరణలో భాగంగా ఆయన గ్రామాన్ని సందర్శించి దళితులకు అవగాహాన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ చిర్రా శ్రీనివాస్ అధ్యక్షతన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో పిడమర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హుడైన ప్రతి దళితునికి మూడెకరాల భూమి పంపీణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పది వేల ఎకరాల భూమిని మూడువేల రెండు వందల మంది దళితులుకు పంపీణీ చేయడం జరిగిందన్నారు. ఇందుకు గాను ప్రభుత్వం రూ.361కోట్లు వెచ్చించిదన్నారు. ప్రస్తుతం పలు గ్రామాల్లో దళితులకు మూడెకరాల భూమి పంపీణీ చేసేందుకు అవసరమైన భూమిని రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం ఒక్కో ఎకరాకు రూ.ఏడు లక్షల వరకు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని సందర్శించి రైతులను చైతన్యవంతులను చేసి భూమిని కొనుగోలు చేసేందుకు అధికారులు సమాయత్తం మవుతున్నారన్నారు. తొలుత కలకోవకు చేరుకున్న పిడమర్తి రవికి టీఆర్ఎస్ గ్రామశాఖ, మండల శాఖ ఆ«ధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. గ్రామశివారులో గల అంబేద్కర్ విగ్రహానికి పిడమర్తి రవి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, కోదాడ నియోజక వర్గ ఇన్చార్జ్ కె.శశిధర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గరిణె కోటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు కోదాటి అరుణ, ముస్కుల సైదిరెడ్డి, నియోజకవర్గ నాయకులు కేఎల్ఎన్ ప్రసాద్, విద్యార్థి జేఏసీ నాయకులు కందుల మధు, స్థానిక నాయకులు కాసాని మల్లయ్య, అమరగాని వీరభద్రం పాల్గొన్నారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ రవిని పలువురు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. -
రొనాల్డో గర్జించాడు
యూరో ఫైనల్లో పోర్చుగల్ 2-0తో వేల్స్‌పై విజయం రొనాల్డో గర్జించాడు. అవును.. క్లబ్‌కు మాత్రమే బాగా ఆడతాడనే అపవాదును తునాతునకలు చేస్తూ ఇదిగో ఇదీ నా సత్తా అంటూ విమర్శకులకు తన కిక్ పవర్ ఏమిటో చూపాడు. ఇప్పటిదాకా ఆడిందేమిటని ఆడిపోసుకున్న వారే వహ్వా.. రొనాల్డో అని మనస్ఫూర్తిగా అనేలా సింహగర్జన చేశాడు. వేల్స్‌తో జరిగిన సెమీఫైనల్లో అతడి విశ్వరూపం చూసి మ్యాచ్ ఆద్యంతం ఈ స్టార్ నామస్మరణతో స్టేడియం మోతెక్కింది. ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా అంతా తననెందుకు కీర్తిస్తారో చాటుకుంటూ... కీలక సమయంలో గోల్ చేశాడు. మరో మూడు నిమిషాల్లోనే రెండో గోల్ అందేలా కృషి చేసి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అటు గ్యారెత్ బేల్ ఎంత ప్రయత్నం చేసినా తన జట్టు వేల్స్ అద్భుత ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. లియోన్: సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఈసారి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సరైన సమయంలో జూలు విదిల్చి స్థాయికి తగ్గ ఆటతీరుతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. యూరో కప్‌లో భాగంగా బుధవారం వేల్స్‌తో జరిగిన సెమీఫైనల్లో 2-0తో నెగ్గిన పోర్చుగల్ ఫైనల్లో ప్రవేశించింది. ఇప్పటిదాకా ఈ టోర్నీలో నిర్ణీత సమయంలో పోర్చుగల్‌కు దక్కిన తొలి విజయమిదే. ఫ్రాన్స్, జర్మనీ మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో ఆదివారం పోర్చుగల్ టైటిల్ కోసం పోరాడుతుంది. జట్టు తరఫున రొనాల్డో (50వ నిమిషంలో), నాని (53వ ని.) గోల్స్ చేశారు. యూరో కప్‌లో పోర్చుగల్ ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. గతంలో 2004లో ఫైనల్‌కు చేరి గ్రీస్ చేతిలో ఓడింది. మరోవైపు మ్యాచ్‌లో పట్టు కోసం విశ్వప్రయత్నం చేసినా వేల్స్ ఫలితం సాధించలేకపోయింది. స్టార్ ఫుట్‌బాలర్ గ్యారెత్ బేల్ తన ప్రయత్నాలను గోల్స్‌గా మలచలేకపోవడంతో వేల్స్ సూపర్ జర్నీ సెమీస్‌లో ముగిసింది. మిడ్‌ఫీల్డర్ ఆరోన్ రామ్సే నిషేధం కారణంగా మ్యాచ్‌కు దూరమవడం కూడా ఆ జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో ఇరుజట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 16వ నిమిషంలోనే పోర్చుగల్ తొలి గోల్ కోసం ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది. వేల్స్ పెనాల్టీ ఏరియాలో కుడివైపు నుంచి మరియో ఆడిన షాట్ గోల్‌పోస్ట్‌కు కాస్త దూరం నుంచి వెళ్లింది. మరోవైపు బేల్ 23వ ని.లో సెంటర్‌లైన్ కుడివైపు నుంచి గోల్ పోస్ట్‌లోకి బంతిని షూట్ చేసినా అది నేరుగా గోల్‌కీపర్ చేతుల్లోకి వెళ్లింది. 44వ ని.లో ఎడ్రియన్ సిల్వా ఎడమ వైపు నుంచి వేల్స్ గోల్ పోస్ట్ ముందుకు క్రాస్ షాట్ ఆడగా.. రొనాల్డో బంతిని హెడర్ చేశాడు. అయితే బంతి గోల్‌పోస్ట్ రాడ్ పైనుంచి వెళ్లడంతో గోల్రాలేదు. ద్వితీయార్ధం 53వ నిమిషంలో పోర్చుగల్ బోణీ చేయగలిగింది. రఫెల్ గురేరో అందించిన కార్నర్ షాట్‌ను పెనాల్టీ ఏరియాలో మెరుపులా పైకి ఎగిరిన రొనాల్డో హెడర్ గోల్ చేశాడు. ఆ తర్వాత మూడు నిమిషాలకే సాంచెస్ ఇచ్చిన పాస్‌ను రొనాల్డో గోల్ పోస్ట్‌వైపు ఆడగా.. అక్కడే ఉన్న నాని డైవ్ చేస్తూ ఎడమ కాలితో బంతిని నెట్లోకి పంపాడు. దీంతో పోర్చుగల్‌కు 2-0 ఆధిక్యం లభించింది. తర్వాత 63వ ని.లో రొనాల్డో ఫ్రీకిక్ గోల్‌పోస్ట్ రాడ్ పైనుంచి వెళ్లింది. చివర్లో వేల్స్ గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా పోర్చుగల్ కీపర్ పాట్రికియో వమ్ము చేయడంతో ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. యూరో కప్‌ల్లో అత్యధిక గోల్స్ (9) చేసిన ఆటగాడు రొనాల్డో. దీంతో ఫ్రాన్స్ దిగ్గజం మైకేల్ ప్లాటిని సరసన నిలిచాడు. -
జర్మనీ, పోలాండ్ ముందుకు...
గ్రూప్ ‘సి’ నుంచి మాజీ చాంపియన్ జర్మనీ, పోలాండ్ జట్లు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. మంగళవారం జరిగిన చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో జర్మనీ 1-0తో నార్తర్న్ ఐర్లాండ్‌పై గెలుపొందగా... పోలాండ్ 1-0తో ఉక్రెయిన్ను ఓడించింది. జర్మనీ, పోలాండ్ ఏడేసి పాయింట్లతో నాకౌట్ దశకు అర్హత పొందాయి. మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా జర్మనీ గ్రూప్ టాపర్‌గా నిలువగా... పోలాండ్‌కు రెండో స్థానం దక్కింది. నార్తర్న్ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆట 30వ నిమిషంలో మారియో గోమెజ్ జర్మనీకి ఏకైక గోల్ అందించాడు. ఉక్రెయిన్‌తో జరిగిన పోటీలో 54వ నిమిషంలో బ్లాస్జికౌస్కీ చేసిన గోల్‌తో పోలాండ్ విజయం ఖాయమైంది. యూరో టోర్నీ చరిత్రలో పోలాండ్ నాకౌట్ దశకు చేరుకోవడం ఇదే తొలిసారి. -
భారత్ ఆశలు సజీవం
* కొరియాపై 2-1తో విజయం * చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ లండన్: గత మూడు దశాబ్దాలుగా ఊరిస్తోన్న చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ పతకాన్ని ఈసారైనా సాధించాలనే పట్టుదలతో ఉన్న భారత్ తమ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. దక్షిణ కొరియాతో మంగళవారం జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌కిది రెండో గెలుపు. తాజా విజయంతో భారత్ పాయింట్ట పట్టికలో ఏడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత్ తరఫున కెప్టెన్ సునీల్ 39వ నిమిషంలో... నికిన్ చందన తిమ్మయ్య 57వ నిమిషంలో ఒక్కో గోల్ చేశారు. కొరియా జట్టుకు 57వ నిమిషంలో కిమ్ జుహున్ ఏకైక గోల్‌ను అందించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత్‌కు పలుమార్లు గోల్ చేసే అవకాశాలు వచ్చాయి. తుదకు 39వ నిమిషంలో భారత్ సఫలమైంది. ఆకాశ్‌దీప్ అందించిన పాస్‌ను డి ఏరియాలో ఉన్న సునీల్ లక్ష్యానికి చేర్చాడు. ఆ తర్వాత 57వ నిమిషంలో కొరియా స్కోరును సమం చేసింది. అయితే కొరియాకు ఆ ఆనందం నిమిషం కూడా నిలువలేదు. కొరియా స్కోరును సమం చేసిన వెంటనే భారత్ రెండో గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మిగతా మూడు నిమిషాలు ప్రత్యర్థికి మరో గోల్ చేయనీకుండా అడ్డుకొని భారత్ విజయాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం విశ్రాంతి దినం. గురువారం జరిగే చివరిదైన ఐదో లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. -
అయ్యో... బ్రెజిల్!
* రిఫరీ తప్పిదంతో తొలి రౌండ్లో నిష్ర్కమణ * కోపా అమెరికా కప్ క్వార్టర్స్‌లో పెరూ ఫాక్స్‌బరో (యూఎస్): కోపా అమెరికా కప్‌లో బ్రెజిల్ జట్టును దురదృష్టం వెంటాడింది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు పాలిట రిఫరీ విలన్‌గా మారారు. ప్రత్యర్థి జట్టు ఆటగాడి చేతికి తాకి నెట్‌లోనికి వెళ్లిన బంతిని గోల్‌గా ప్రకటించడంతో ఈ ప్రఖ్యాత జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో పెరూ ఈ వివాదాస్పద గోల్‌తో 1-0తో నెగ్గింది. 31 ఏళ్లలో బ్రెజిల్‌పై పెరూకిదే తొలి విజయం. మ్యాచ్ తొలి అర్ధభాగం బ్రెజిల్ హవా కనిపించింది. అయితే ద్వితీయార్ధం 74వ నిమిషంలో బ్రెజిల్‌కు ఊహించని షాక్ తగిలింది. బై లైన్ నుంచి పెరూ ఆటగాడు ఆండీ పోలో ఇచ్చిన క్రాస్‌ను రౌల్ రూడియాజ్ గోల్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలో బంతి అతడి చేతిని తాకి గోల్‌పోస్టులోకి వెళ్లింది. అనూహ్యంగా ఉరుగ్వేకు చెందిన రిఫరీ ఆండ్రెస్ కున్హా దీన్ని గోల్‌గా ప్రకటించడంతో బ్రెజిల్ ఆటగాళ్లు నిశ్చేష్టులయ్యారు. రిఫరీతో వాగ్వాదానికి దిగి తమ నిరసన వ్యక్తం చేశారు. రీప్లేలోనూ ఈ విషయం స్పష్టంగా కనిపించినప్పటికీ రిఫరీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇంజ్యూరీ సమయం (90+2)లో బ్రెజిల్‌కు స్కోరును సమం చేసే అవకాశం వచ్చినా విఫలమైంది. గ్రూప్‌లో టాపర్‌గా నిలిచిన పెరూ క్వార్టర్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌కు ముందు బ్రెజిల్ ఆడిన రెండింటిలో ఒకటి గెలిచి, ఒకటి డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా క్వార్టర్స్‌కు చేరేది. కానీ ఓటమితో టోర్నీ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. క్వార్టర్స్‌కు చేరిన ఈక్వెడార్ ఈస్ట్ రూథర్‌ఫోర్డ్ (యూఎస్): గ్రూప్ ‘బి’లోనే జరిగిన మరో మ్యాచ్‌లో ఈక్వెడార్ 4-0తో హైతీని ఓడించింది. ఎన్నెర్ వాలెన్సియా (11), అయోవి (20), నొబోవా (57), ఆంటోనియో వాలెన్సియా (78) గోల్స్ చేశారు. దీంతో ఈ గ్రూపులో రెండో స్థానం పొందిన ఈక్వెడార్ క్వార్టర్స్‌లో 16న అమెరికాతో తలపడనుంది. -
లక్ష్యమే కాదు... లక్ష్యశుద్ధి కూడా ఉండాలి!
విద్య - విలువలు లోకంలో ‘లక్ష్యం’ అన్న మాట వింటూంటాం. దీనిని సంకల్పం అని కూడా అంటాం. ప్రతివారి జీవితంలో కూడా ఒక లక్ష్యమనేది ఉండాలి. లక్ష్యం ఏర్పడడానికి నేపథ్యం - అసలు మనకు కావలసిన బలం పరిపుష్ఠం కావడం, సంస్కార బలమున్న, పరిపుష్ఠమైన మనసు నుండి తప్పని సరైన సంకల్పాలు ఉత్పన్నం కావు. భగవంతుడు అందరికీ ఇంద్రియాలు ఇస్తాడు, మనసు ఇస్తాడు, బుద్ధి ఇస్తాడు. మనుష్య ప్రాణికి సంబంధించినంత వరకు ఒక సత్సంకల్పం కలగాలి. అది కలగాలంటే సంస్కార బలం ఉండాలి. ఆ సంకల్పం, ఆ సంస్కారం, ఆ లక్ష్యశుద్ధి అంత బలంగా ఉండబట్టే ఒక్కొక్క మహాత్ముడి నుండి వచ్చిన ఒక్కొక్క సత్సంకల్పం ఆయనను కొన్ని శతాబ్దాల పాటూ, కొన్ని వేల సంవత్సరాల పాటు కీర్తి శరీరుణ్ని చేసింది. మనసు ఇంద్రియాల చేత ప్రభావితమౌతుంది. కంటితో దేన్ని చూస్తున్నానో దాన్నిబట్టి నా మనసు ప్రభావితమౌతుంది. నేనలా వెడుతుండగా ఒక కుక్కపిల్ల నా వాహనం కిందపడి గిలగిలా తన్నుకుని తరువాత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందనుకుందాం. అది క్షేమంగా వెళ్లిపోయినా కూడా ఆ తరువాత ఓ పది నిమిషాలు నా మనసు ఉద్విగ్నత పొందుతుంది. ‘అయ్యయ్యో ఏమిటిలా జరిగిందే’ అని నా మనసు ఆవేదన చెందుతుంది. కంటితో చూసిన దానిచేత, చెవితో విన్నదాని చేత, ముక్కుతో వాసన చూసినదాని చేత, నాలుకతో తిన్నదాని చేత, చర్మంతో స్పృశించినదాని చేత మనసు నిరంతరం ప్రభావితమౌతుంటుంది. కేవలం నోటితో చెప్పినంత మాత్రం చేత మనసు సంస్కారాన్ని పొందదు. మనసుకు అందించే, అందించడానికి సిద్ధంగా ఉంచే వస్తువును బట్టే అది సంస్కారాన్ని గడిస్తుంది. నేను ఎప్పుడూ శంకర భగవత్పాదుల వాఙ్మయాన్ని, కామకోటి పీఠానికి ఆధిపత్యం వహించిన శ్రీ చంద్రశేఖరేంద్రస్వామివారి వాఙ్మయాన్ని, లేదా రామాయణ, భారత, భాగవతాలను చదువుతుంటాననుకోండి. నా మనసు శాంతిని పొంది ఉంటుంది, ఉద్విగ్నత పొందదు. అలాగే మనకు కష్టసుఖాలు ఏర్పడుతుంటాయి. నిస్పృహ, శోకం కలుగుతుంటాయి. వాటి నుంచి బయటపడాలంటే- నాకన్నా కష్టాలు పడినవారు, పడుతున్నవారు లోకంలో ఎందరో ఉన్నారు, వారి కష్టం ముందు నా కష్టం ఏపాటిది కనుక అన్న భావన ఓదార్పునిస్తుంది. మనిషిని నిలబడేటట్లు చేస్తుంది. ఇది జరగాలంటే ఆ స్థితి నుండి బయటపడాలంటే రామాయణ. భారత, భాగవతాది గ్రంథాలను ఆలంబనగా, ఆసరాగా చేసుకోవాలి. రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు... ‘‘సీతాదేవి అయోనిజ, రామచంద్ర ప్రభువు ధర్మపత్ని, లక్ష్మణస్వామి వారి వదిన, సాక్షాత్తూ మహాజ్ఞాని అయిన జనకునికి కుమార్తె, దశరథ మహారాజుగారి పెద్దకోడలు. ఎండ కన్నెరగని ఇల్లాలు... కట్టుకున్న వస్త్రాన్ని మార్చకుండా, అదే వస్త్రం... అది పూర్తి వస్త్రం కూడా కాదు, వస్త్రఖండం. ఎందుకంటే.. పమిటకొంగు చించి నగలు మూటకట్టి జారవిడిచింది కదా. అందువల్ల ఆ వస్త్రఖండంతోనే ఒక చెట్టుకింద 10 నెలల పాటు చుట్టూ క్రూరులైన రాక్షస స్త్రీలు చేరి అనరాని మాటలు అంటుండగా... భరించింది... మౌనంగా సహించింది. ప్రపంచంలో కష్టానికి పరాకాష్ఠ ఏమిటంటే మనకు కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి మరో మనిషి లేకపోవడమే పెద్ద కష్టం. ఇక రాముడికి తన కష్టం చెప్పుకోవడానికి చుట్టూ లక్ష్మణ స్వామి ఉన్నారు, హనుమ ఉన్నాడు, సుగ్రీవుడున్నాడు... చాలామంది ఉన్నారు... కానీ సీతమ్మకెవరున్నారు. పది నెలలు ఆమె పడిన క్షోభతో పోల్చుకుంటే నా కష్టం పెద్ద కష్టం కాదన్న భావన మనసును తేలికపరుస్తుంది. అలాగే ముత్తుస్వామి దీక్షితార్ చేసిన కీర్తనలు, త్యాగరాజస్వామివారు మనసుకు చెప్పుకున్న ప్రబోధాలు... ఆయన తన కష్టసుఖాలు వేరెవరికో చెప్పుకోలేదు, చాలా భాగం ‘ఓ మనసా’ అంటూ తన మనసుకే చెప్పుకున్నారు. అదెప్పుడు గాడి తప్పితే అప్పుడు దానిని నిందించారు. ఎప్పుడు తన మాట వింటే అప్పుడు పట్టాభిషేకం చేశారు. ఇటువంటి వాటిని మనసుకు ఆసరాగా నిలబెట్టాలి. ఇటువంటి వస్తువులు లోపలికి వెళ్లడానికి అవకాశమిచ్చి ఎవడు వీటిని పుచ్చుకుంటున్నాడో వాడి మనసు పరిపుష్ఠమౌతుంది. వాడు సాత్వికమైన ధృతిని పొందుతాడు. అటువంటి మనసులోంచి వచ్చే సంకల్పాలకు, లక్ష్యాలకు భగవంతుని అనుగ్రహం ఉంటుంది. అవి కేవలం వారికి మాత్రమే పనికి వచ్చే సంకల్పాలు కావు. పదిమంది సంతోషానికి పనికి వచ్చే సంకల్పాలు. అటువంటి వారి మనసులలోకి వస్తాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్ష పదవినలంకరించిన శ్రీనివాస్ అయ్యంగార్ గారికి 70వ ఏట ఒక కంటిలో నరం చిట్లిపోయి ఆ కన్ను చూడడం మానేసింది. కానీ అలా ఒక కన్నుతోనే ఆయన చూసి చదువుతూంటే కుమార్తె ప్రేమానంద్ కుమార్ వచ్చి ‘నాన్నగారూ, 70 ఏళ్ల వయసులో కూడా ఇంకా ఎందుకండీ చదువుతారు’’ అని అడిగితే.. ఆయన ఇచ్చిన సమాధానం- ’రెండో కన్ను ఉందిగా...’’. అదీ ధృతి అంటే! ధృతి అంటే ధైర్యం. దాన్ని ఉపయోగించుకుని ఈ శరీరాన్ని సాధనంగా చేసుకుని నేను గట్టెక్కాలి. భగవంతుడిచ్చిన దీనిని ఆఖరి నిమిషం వరకు పదిమంది కోసం ఉపయోగించాలి. శరీరం పడిపోక తప్పదు, కానీ ఉన్నన్నాళ్లూ ఆ శరీరంతో చెయ్యదగిన సత్కర్మలే చేద్దాం అన్న తాపత్రయం, ధైర్యం దేనివల్ల వస్తాయంటే, సంస్కారాన్ని పొందడానికి ఏ వస్తువులను మనం యోగ్యంగా స్వీకరిస్తున్నామో వాటివల్ల మంచి సంకల్పాలు, మంచి లక్ష్యాలు వస్తాయి. అంతే తప్ప వాతావరణం అపరిశుభ్రమైనవి, చూడకూడనివన్నీ చూస్తూ, వినకూడనివన్నీ వింటూ, ముట్టుకోకూడనివన్నీ ముట్టుకుంటూ, తినకూడనివన్నీ తింటూ, వాసన చూడకూడనివన్నీ చూస్తూ మన సంకల్పం, మన లక్ష్యం శుద్ధంగా ఉండాలి అంటే ఒక్కనాటికీ ఉండదుగాక ఉండదు. అందువల్ల మన సంస్కారాన్ని పొందడానికి కావలసిన వస్తువులను మాత్రమే దానికి అందించాలి. అది జరిగిననాడు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే, ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎదురొడ్డి నిలబడగలిగేటటువంటి ధృతి కలుగుతుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
హ్యుమే హ్యాట్రిక్: కోల్‌కతా విజయం
ముంబై: స్టార్ స్ట్రయికర్ ఇయాన్ హ్యుమే హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగడంతో డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికోడి కోల్‌కతా ఘనవిజయం సాధించింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్లో భాగంగా ఆదివారం ముంబై సిటీ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 4-1 తేడాతో నెగ్గింది. 34వ నిమిషంలో హ్యుమే తొలి గోల్‌తో పాటు 45వ నిమిషంలో పెనాల్టీ కిక్‌తో రెండో గోల్ అందించాడు. ఆ తర్వాత 71వ నిమిషంలో ముంబై తరఫున బెనచౌర్ ఏకైక గోల్ సాధించాడు. 77వ నిమిషంలో ఫెర్నాండెజ్ కోల్‌కతా ఆధిక్యం మరింత పెంచగా 82వ నిమిషంలో హ్యుమే హ్యాట్రిక్ గోల్‌తో జట్టుకు తిరుగులేని విజయం దక్కింది. నేడు (సోమవారం) ఐఎస్ఎల్కు విశ్రాంతి దినం. -
సెక్యూరిటీ గార్డ్స్ అయినా లక్ష్యం వెంటే..
హర్యానా/ముంబయి: ఆ రోజు రక్షా బంధన్.. హర్యానాలోని ఓ ఎటీఎం వద్దకు హర్షవత్ అనే వ్యక్తి డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లాడు. అది రాత్రి సమయం కూడా. ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డుగా బైలిందర్ సింగ్ అనే యువకుడు విధుల్లో ఉన్నాడు. అయితే, అతడి చేతిలో కర్రకు బదులు పుస్తకం ఉంది. చక్కగా ఏటీఎం ముందు కూర్చొని వీధిలైటుకింద చదువుకుంటున్నాడు. ఈరోజుల్లో ఇలాంటి యువకుడా అని హర్షవత్కు ఆశ్చర్యం వేసి దగ్గరికి వెళ్లి ప్రశ్నించాడు. దీనికి అతడిచ్చిన సమాధానం త్వరలో తనకు ఓ ప్రవేశ పరీక్ష ఉందని, దానికి ప్రిపేర్ అవుతున్నానని చెప్పాడు. లోపల ఏసీలో కూర్చొని చదువుకోవచ్చుగా అంటే తనకు బయట కూర్చున్నాననే ఆలోచనే రాలేదని, తనకు ఏటీఎం లోపల అసౌకర్యంగా ఉంటుందని చెప్పాడు. ఆ సీన్ చూసి వెంటనే హర్షవత్ ఫేస్ బుక్‌లో అతడి ఫొటోలతో సహా పెట్టాడు. బైలిందర్ సింగ్ చేస్తున్న పనిని హర్షించాడు. చాలామంది తమకు క్లిష్ట సమయాల వల్ల లక్ష్యం చేరుకోలేకపోతున్నామని చెప్తుంటారని, అలాంటివారికి బైరిందర్ ఒక స్ఫూర్తి అని, లక్ష్య సాధనకు ఎలాంటి పరిస్థితిని అయినా ఉపయోగించుకోవచ్చని తెలియజేస్తోందని అన్నారు. ఈ పోస్ట్‌ను దాదాపు పదివేలమంది షేర్ చేసుకున్నారు. ఇక బైలిందర్ మాదిరిగానే సాగర్ అశోక్ రావు భగత్ ముంబయిలోని చాందివలిలోగల వుడ్ లాండ్ హైట్స్ లో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. అతడు బీఈ డిగ్రీ చదువుతున్నాడని, జావా ప్రోగ్రామింగ్ పుస్తకాన్ని చదువుతూ కనిపించాడు. సంబంధిత సబ్జెక్టులో నిపుణుడిగా ఎదగడం తన లక్ష్యమని శ్రీజేష్ కృష్ణన్‌కు తెలిపాడు. ఈ విషయం కూడా శ్రీజేష్ను కదిలించి అతడి ఫొటోలను ఫేస్ బుక్‌లో పెట్టగా వేలమంది షేర్ చేసుకున్నారు. -
'గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండి'
హబ్సిగూడ (హైదరాబాద్): రానున్న గ్రేటర్ ఎన్నికలలో కలసి కట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపునకు నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. ఆదివారం హబ్సీగూడాలో ఏర్పాటుచేసిన ఉప్పల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ మేరకు పార్టీ కార్యకర్తలను కార్యోన్ముఖుల్ని చేసేందుకు ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి ఎమ్మెల్యే డి.కే.అరుణ, ఎమ్మెల్సీ ఆకుల లలిత ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పూటకొక మాట మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసగిస్తున్నారని పొన్నాల విమర్శించారు. మాజీ మంత్రి డికే.ఆరుణ మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని ఆయనకు ప్రజా సంక్షేమం పట్టడం లేదని ఆరోపించారు. -
కోటిన్నర ఎకరాల్లో సాగు లక్ష్యం
2015-16 వ్యవసాయ ప్రణాళిక సిద్ధం గత సీజన్ కంటే 20 లక్షల ఎకరాలు అదనం 115 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం లక్ష్యం ఘనం.. వాతావరణ పరిస్థితులపైనే భారం హైదరాబాద్: వచ్చే ఖరీఫ్, రబీ సీజన్లలో 1.52 కోట్ల ఎకరాల్లో పంటలను సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 115.7 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పండించాలని నిర్దేశించుకుంది. ఈ మేరకు 2015-16 వ్యవసాయ ప్రణాళికను వ్యవసాయ శాఖ రూపొందించింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. త్వరలోనే దీనిని అధికారికంగా విడుదల చేయనున్నారు. సీజన్లవారీగా చూస్తే గత ఖరీఫ్‌లో కోటి ఎకరాల్లో సాగును లక్ష్యంగా పెట్టుకోగా.. వచ్చే ఖరీఫ్‌లో ఏకంగా 1.15 కోట్ల ఎకరాల్లో పంటల సాగు చేపట్టాలని నిర్ణయించారు. అంటే 15 లక్షల ఎకరాలు అదనం. ఇక గత రబీలో 32.72 లక్షల ఎకరాల్లో పంటల సాగును లక్ష్యంగా నిర్దేశించుకోగా.. వచ్చే రబీలో 37.5 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. అంటే అదనంగా 4.78 లక్షల ఎకరాలు. మొత్తంగా గతేడాది కంటే వచ్చే వ్యవసాయ సీజన్లో ఖరీఫ్, రబీ కలిపి అదనంగా 19.78 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 107 లక్షల టన్నులు కాగా.. వచ్చే వ్యవసాయ సీజన్లో 115.7 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించాలని నిర్దేశించుకున్నారు. ఇందులో 68 లక్షల టన్నుల్లో వరి ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. పరిస్థితులు అనుకూలిస్తేనే..! గత వ్యవసాయ సీజన్లో వర్షాభావం కారణంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా పంటల సాగు 96 శాతం వరకు ఉన్నా.. ముఖ్యమైన వరి, పప్పుధాన్యాల సాగు మాత్రం 83 శాతానికే పరిమితమైంది. దీనికితోడు సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో ఖరీఫ్‌లో ఆహార ధాన్యాల ఉత్ప త్తి దాదాపు 33 శాతం పడిపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే వ్యవసాయ సీజన్ లక్ష్యాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకవేళ గత ఏడాది మాదిరిగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటే ప్రత్యామ్నాయ ప్రణాళికను కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిసింది. వ్యవసాయశాఖ, జయశంకర్ వ్యవసాయ వర్సిటీ కలిసి రూపొందించిన ఈ ప్రణాళిక ప్రకారం మూడు విడతల కంటింజెన్సీ ప్రణాళిక ఉండే అవకాశం ఉంది. జూలై 15లోపు సాధారణ స్థాయిలో వర్షాలు పడకుంటే ఒక ప్రణాళిక, జూలై 31లోపు వర్షాలు పడకుంటే రెండో ప్రణాళిక, ఆగస్టు 15 వరకు కూడా వర్షాలు కురవకుంటే మూడో ప్రణాళిక అమలు చేస్తారు. తక్కువ కాలపరిమితి పంటలు పండించే విధంగా రైతులను సిద్ధం చేస్తారు. -
నా లక్ష్యం నంబర్‌వన్: సైనా
హైదరాబాద్: ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకోవడమే ప్రస్తుతం తన లక్ష్యమని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తెలిపింది. అయితే దానికి నిర్ణీత కాలాన్ని గడువుగా పెట్టుకోలేదని, నంబర్‌వన్ ర్యాంక్ చేరుకోవడానికి కష్టపడతానని చెప్పింది. ‘ప్రస్తుతం నాలుగో ర్యాంక్‌కి చేరుకున్నందుకు సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరి లక్ష్యం నం.1 ర్యాంకు చేరుకోవడమే. దాని కోసం కష్టపడతాను. చైనా క్రీడాకారిణులతో పోటీ ఉన్నా ప్రయత్నిస్తాను’ అని చెప్పింది. తను ఎవరి వద్ద కోచింగ్ తీసుకుంటాననే విషయం కంటే, సాధించే పతకాలపై ప్రజలు దృష్టి పెట్టాలని సూచించింది. ‘నా ప్రదర్శన, సాధించిన పతకాలపై ప్రజలు దృష్టి సారించాలి. కోచింగ్ ఎవరి వద్ద తీసుకుంటాననేది నాకు సంబంధించిన విషయం. ప్రపంచ చాంపియన్‌షిప్ ఆడుతున్నప్పుడు నేను కొన్ని విషయాల్లో మెరుగుపడాలని అక్కడే ఉన్న విమల్ సర్ చెప్పారు. చైనా ఓపెన్‌కు ముందు విమల్ సర్ అధ్వర్యంలో నా బలహీనతలను సరిదిద్దుకున్నాను’ అని చెప్పింది. -
పేదరికంపై పవర్ పంచ్
లక్ష్యం వారి కుటుంబాల నేపథ్యం సాధారణం.. అమ్మానాన్నలది కాయకష్టం.. కుటుంబ పోషణ కూడా వారికి కనాకష్టం... అయినా ఆ ఇద్దరమ్మాయిలు కష్టాలనే ఇష్టాలుగా మలుచుకుని పవర్ లిఫ్టింగ్‌లో ప్రతిభ చూపిస్తున్నారు. పతకాలు సాధిస్తున్నారు. ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడే బీజం పడ్డ వారి ఉన్నత లక్ష్యాన్ని ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా తమకు చేతనైనంతగా ప్రోత్సాహం అందించారు అమ్మానాన్నలు. పవర్ లిఫ్టింగ్‌లో శిక్షణ పొందేందుకు నడుంకట్టిన ఈ అమ్మాయిలు ఎనిమిదేళ్లుగా కఠోర సాధన చేస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ఆ అమ్మాయిలే మంగళగిరికి చెందిన నగీనా, సలోమీలు. స్నేహితులైన ఈ ఇద్దరూ పవర్ లిఫ్టింగ్వైపు ఎలా అడుగులు వేశారంటే... నగీనా తండ్రి సుభాని మెకానిక్. అమ్మ అమీరున్నీసా గృహిణి. ముగ్గురు ఆడపిల్లల్లో రెండో అమ్మాయి నగీనా. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న నగీనాకు పవర్ లిఫ్టింగ్‌పై ఆసక్తి ఎలా కలిగిందో ఆమె మాటల్లోనే... సీకే గరల్స్ హైస్కూల్లో నా సీనియర్ మట్టుకొయ్య సలోమి, మరికొందరు... అంతర్జాతీయ పవర్ లిఫ్టర్, కోచ్ షేక్ సందాని వద్ద శిక్షణ పొందుతున్నారు. వారిని చూసి నాకు కూడా వెళ్లాలనిపించింది. ఇదే విషయం ఇంట్లో చెప్పా! అమ్మ ప్రోత్సహించడంతో ఎనిమిదో తరగతి (2006)లో ఉండగా పవర్ లిఫ్టింగ్ కోచింగ్‌కు వెళ్లడం మొదలుపెట్టా. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మధ్యలో కొన్నాళ్లు మానుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలలో బీకాం (2010-13) చదువుతూ శిక్షణను కొనసాగించాను. ఏమి సాధించిందంటే... కృష్ణా యూనివర్సిటీ తరపున గుడివాడలో, విజయవాడ లయోల కళాశాలలో జరిగిన అంతర్ కళాశాలల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 63 కేజీల కేటగిరీలో స్వర్ణపతకం, వర్సిటీ స్ట్రాంగ్ ఉమెన్ అవార్డు; గత జనవరిలో నిమ్రా కాలేజ్‌లో జరిగిన జేఎన్టీయూకే పరిధిలోని అంతర్ కళాశాలల పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లోనూ గోల్డ్‌మెడల్; సౌత్ ఇండియా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో సీనియర్స్ విభాగం 63 కేజీల కేటగిరీలో గోల్డ్‌మెడల్. ఇక మట్టుకొయ్య సలోమీది మంగళగిరి మండలం మక్కెవారిపేట. తండ్రి చిన్నవెంకయ్య రాడ్ బెడ్డింగ్ పనిచేస్తారు. అమ్మ వరదానం గృహిణి. ఇబ్రహీంపట్నం నిమ్రా కాలేజీలోనే ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న సలోమి సీకే గరల్స్ హైస్కూల్లో చదివేటప్పుడు పీఈటీ ప్రోత్సాహంతో కోచ్ సందాని వద్ద చేరింది. అక్కడ తీసుకున్న శిక్షణతో 2008లో మిజోరాంలో జరిగిన జాతీయస్థాయి గ్రామీణ వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత పవర్ లిఫ్టింగ్‌పై ఆసక్తి కలగడంతో ఆ దిశగా సాధన చేస్తోంది. సలోమీ ఏమి సాధించిందంటే... ఏఎన్‌యూ అంతర కళాశాలల పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లలో 72 కేజీల కేటగిరీలో మూడేళ్లు వరుసగా బంగారు పతకాలు; సౌత్ ఇండియా స్థాయిలో కోయంబత్తూరు (2011)లో జరిగిన పవర్ లిఫ్టింగ్ టోర్నీలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్, హైదరాబాద్ (2012), కేరళ రాష్ట్రం (2013)లలో జరిగిన టోర్నమెంట్స్‌లో జూనియర్స్ విభాగంలో గోల్డ్ మెడల్స్, సీనియర్స్ విభాగంలో సిల్వర్ మెడల్స్. గత జనవరిలో నిమ్రా కాలేజ్‌లో జరిగిన జేఎన్టీయూకే పరిధిలోని అంతర కళాశాలల పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో గోల్డ్‌మెడల్. ఇటువంటి మట్టిలో మాణిక్యాలు రాష్ర్టంలో మరెందరో ఉన్నారు. వీరికి ప్రభుత్వ ప్రోత్సాహం, పెద్దల సహాయసహకారాలు లభిస్తే, ఎన్నో సంచలనాలు సృష్టించి, రాష్ట్రానికి వన్నె తెస్తారనడంలో సందేహం లేదు. - అవ్వారు శ్రీనివాసరావు, సాక్షి, గుంటూరు - ఫొటో: నందం బుజ్జి, మంగళగిరి -
విజయం వెనుక
లక్ష్యం అందుకోవడం వెనుక ఉన్న శ్రవు పది వుందికి ప్రోత్సాహాన్నిస్తుంది. ఒకరి విజయు క్షణాలు వురెందరినో కంకణబద్ధులను చేస్తుంది. అలాంటి ఫొటో ప్రదర్శనే చిక్కడపల్లి మారియట్ హోటల్లోని మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో ఆదివారం నిర్వహించారు. ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఎం. పూర్ణ, ఎస్.ఆనంద్ కుమార్ల శిక్షణ, ఎవరెస్ట్ యాత్రకు సంబంధించిన చిత్రాలను ‘ఓపీ ఎవరెస్ట్’ పేరుతో ప్రదర్శనలో ఉంచారు. భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్న దృశ్యం నుంచి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి భారత జాతీయు పతాకాన్ని రెపరెపలాడించడం వరకు ప్రతి ఘట్టాన్నీ ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శనకు ఐపీఎస్ ప్రవీణ్‌కువూర్, హీరో హర్షవర్ధన్ రాణే, నటి శ్రావ్యారెడ్డి తదితరులు హాజరయ్యారు. - కవాడిగూడ -
ఇరవైల్లో ఉన్నారా? ఇది చదవండి....
- చేతన్ భగత్, రచయిత భవిష్యత్‌లో ఏం కావాలనుకుంటున్నానో ఒక పట్టాన తేల్చుకోలేకపోయేవాడిని. ఇరవై ఏళ్ల వయసులో ఆలోచనలన్నీ కలగాపులగంగా ఉంటాయి. దేని మీదా మనసు స్థిరంగా నిలవదు. మీరు అలా కాకుండా ఒక నిర్ణయానికి రండి. డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, రచయిత కావచ్చు. లక్ష్యం విషయంలో మీకు స్పష్టత ఉంటే, దానికి చేరువ కావడం కష్టమేమీ కాదు. ఇరవైల్లో ఉన్నవాళ్లు ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను పెద్దగా పట్టించుకోరు. ఆ వయసులో ఆ ఆలోచనేదీ రాదు. వయసు పెరుగుతున్న కొద్దీ వాటి విలువ ఏమిటో తెలుస్తుంది. మరి అదేదో ముందే జాగ్రత్త పడితే మంచిది కదా! ఆరోగ్యస్పృహతో ఆరోగ్యకరమైన తిండి తినడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ముప్ఫయ్యో ఏట గాని నేను నా ఆరోగ్యం పై దృష్టి పెట్టలేకపోయాను. మనం ఆరోగ్యంగా ఉంటేనే, మనసు ఆరోగ్యంగా ఉంటుంది. మనసు ఆరోగ్యంగా ఉంటేనే లక్ష్యం సిద్ధిస్తుంది. ఈ సమాజంలో ఏదీ సవ్యంగా జరగడం లేదు. అంతమాత్రాన ఎప్పుడూ కోపంతో మండిపడాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్న విషయానికీ కళ్లెర్ర చేసి గుండెల్లో రక్తం వేగాన్ని పెంచుకోవాల్సిన పనిలేదు. మనం ఆగ్రహంగా ఉన్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. కోపానికి దూరంగా జరగండి. ప్రశాంతంగా ఉండండి. ఇరవై సంవత్సరాల వయసులో మనం వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెడతాం. చదువులో నిండా మునిగిపోయి స్నేహితులను మరచిపోతాం. అలా ఎప్పుడూ జరగనివ్వకూడదు. ప్రైమరీ స్కూల్ ఫ్రెండ్స్‌తో సహా నిన్న మొన్నటి ఫ్రెండ్స్ వరకు అందరితో టచ్‌లో ఉండండి. స్నేహంలోని మాధుర్యాన్ని అనుభవించండి. కలుసుకొనలేనంత దూరంలో ఉంటే ఫేస్బుక్ ద్వారానైనా టచ్‌లో ఉండండి. పెద్దగా మీ దగ్గర డబ్బు ఉండదనే విషయం తెలుసు. అయితే తక్కువ డబ్బుతో కూడా ప్రయాణాలు చేయవచ్చు. ప్రయాణాల ద్వారా మన మానసిక పరిధి విస్తరిస్తుంది. ఒక్కసారి భద్రమైన జీవితం (కంఫర్ట్‌జోన్)నుంచి బయటకు వచ్చి లోకాన్ని చూడండి. పుస్తకాలు చదవడాన్ని మీ జీవన విధానంలో భాగంగా చేసుకోండి. పుస్తకాలు చదవడం వల్ల పరిపూర్ణ జీవితం పరిచయం అవుతుంది. మీ సైన్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌ల నుంచి బయటికి వచ్చి సాహిత్య వీధుల్లో తిరగాడండి. లేటుగా నిద్ర పోవడం వల్ల లేటుగా నిద్ర లేస్తాం. ఇదొక సర్కిల్. కొందరు రాత్రంతా ఏదో పని చేస్తూ గడుపుతారు. అలాంటి వారి ఆరోగ్యం అంతంత మాత్రమే అని గ్రహించాలి. ‘క్రమశిక్షణతో కూడిన జీవితం’ సౌకర్యంగా, సుఖంగా అనిపించకపోవచ్చు. కానీ అది మన అవసరం... వేళకు నిద్ర, వేళకు లేవడం అనేది క్రమశిక్షణతో కూడిన జీవితంలో భాగం అనే విషయం గ్రహించాలి. {పేమ అనేది ఎంత ముఖ్యం? డబ్బు ఎంత ముఖ్యం? ఈ రెండింట్లో మీకు ఏది ముఖ్యం? దీని గురించి ఆలోచించండి. ఇరవై ఏళ్ల వయసులో మంచి చెడు గురించి పెద్దగా ఆలోచించం. మనకు తెలియకుండానే ఇతరులను మాటలతో గాయపరుస్తుంటాం. మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం? అనేదాన్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని ఉండండి. వేరేవాళ్ల హృదయాలను గాయపరచకండి. దయతో ప్రవర్తించండి. అసంతృప్తిని అవతలకు నెట్టి సంతృప్తిగా జీవించండి. ‘క్రమశిక్షతో కూడిన జీవితం’ సౌకర్యంగా, సుఖంగా అనిపించవకపోవచ్చు. కానీ అది మన అవసరం. వేళకు నిద్ర, వేళకు లేవడం అనేది క్రమశిక్షణతో కూడిన జీవితంలో భాగం అనే విషయం గ్రహించాలి. -
ఏకైక లక్ష్యం.. సేఫ్ సిటీ :నాయిని నర్సింహారెడ్డి
అందరి భద్రత.. మా బాధ్యతే త్వరలో మరిన్ని కొత్త పోలీస్ స్టేషన్లు పదివేల సీసీ కెమెరాలు ఏర్పాటు సాక్షి ఇంటర్వ్యూలో హోంమంత్రి నాయిని వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: ‘హైదరాబాద్ మహానగరాన్ని సేఫ్ సిటీగా మార్చటమే మా ఏకైక లక్ష్యం. నగరంలో స్థిరపడ్డ వారందరికీ భద్రత కల్పించటం మా కర్తవ్యం. ఆ దిశగా అవసరమైన మేర పోలీస్ వ్యవస్థను పటిష్టపర్చటం, పోలీస్ కానిస్టేబుల్ మొదలుకుని కమిషనర్ వరకు జవాబుదారీతనంతో వ్యవహరించే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుంది’ అని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రజాభద్రతే మా ధ్యేయం నగర జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచ దేశాలతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ మహానగరంలో జీవిస్తున్నారు. అందరికీ భద్రత కల్పిస్తూ నేర నివారణ, నేర పరిశోధనకు ప్రాధాన్యతనిస్తాం. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారి విషయంలో పోలీసులు ప్రవర్తించే తీరులో మార్పు తీసుకువస్తాం. పోలీస్స్టేషన్లు బలహీనులకు ఓ అండనివ్వాలి. అందుకే కొత్త పోలీస్స్టేషన్ల ఏర్పాటు, సిబ్బంది నియామకాలను చేపడతాం. మారుతున్న నేరాలకు అనుగుణంగా పోలీస్ యంత్రాంగానికి అవసరమైన శిక్షణ ఇస్తాం. లండన్ తరహాలో మెగాసిటీ పోలీస్ పథకం కింద హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో సుమారు పదివేల సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తాం. సీసీ కెమెరాల ఏర్పాటుతో లండన్‌లో నేరాల శాతం గణనీయంగా తగ్గిపోయింది. పోలీస్స్టేషన్ల నిర్వహణ వ్యయం పెంచటంతో పాటు అవసరమైన వాహనాలు సమకూర్చాలని నిర్ణయించాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత ఊపుతో ముందుకు తీసుకువెళ్లే దిశగా పోలీస్ యంత్రాంగం తప్పక కృషి చేస్తుంది. సర్వమత సమ్మేళనంగా సిటీని తీర్చిదిద్దుతాం హైదరాబాద్ సర్వమత సమ్మేళనం. అన్ని మతాలు మాకు సమానమే. ముఖ్యంగా హిందూ ముస్లింలు గతంలో మాదిరిగా అన్ని పండుగలు కలిసి చేసుకునే సంస్కృతి (గంగాజమున తైజీబ్)ని ముందుకు తెస్తాం. పండుగలు, సామాజిక ఉత్సవాలకు ప్రభుత్వమే అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ ఏర్పాటైన అనంతరం పలువురు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి 2001 నుంచి టీఆర్ఎస్ ఉద్యమం చేసినా నగరంలో ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టలేదు. ఎవరి వ్యాపారాలనూ అడ్డుకోలేదు. ఉద్యమ హోరులోనూ హైదరాబాద్ ముందుకు వెళ్లగలిగింది. మున్ముందూ ఇదే పంథా కొనసాగుతుంది. విద్య, ఉపాధి, వ్యాపారాల కోసం వచ్చేవారికి మా ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరుస్తుంది. నగారాభివృద్ధికి నిపుణుల కమిటీ ఏర్పాటు నగరంలో ఇప్పటికే వివిధ స్వచ్చంద సంస్థలు పలు అంశాలపై పనిచేస్తున్నాయి. అయితే ఆయా రంగాల్లో హైదరాబాద్‌ను మరింత ముందుకు వెళ్లే దిశగా తరచూ ఆయా రంగాల ఎక్స్‌పర్ట్స్‌తో సమావేశ మవ్వాలని భావిస్తున్నాం. ఇందు కోసం ఓ కమిటీ ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో మేధావుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని భావిస్తున్నాం. -
గోల్‌గా గర్జించేది ఎవరు?!
ఒక్కో సాకర్ వరల్డ్ కప్‌లో ఒక్కో యువతరంగం ఎగసింది... గోల్ అయ్యి గర్జించింది. సంచలనమై నిలిచింది... ప్రపంచ సాకర్ చరిత్రలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొంది... మరి ఇప్పుడు మరో ప్రపంచ కప్ వచ్చింది. ఈ సారి ఎగసే యువతరంగం ఎవరు?! అది ప్రపంచంలోని ఏ మూల నుంచి? ఏ స్థాయిలో?! 1958 సాకర్ వరల్డ్ కప్‌లో 17 యేళ్ల వయసున్న పీలే మొదలు మొన్నటి దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ కప్‌లో మెరిసిన థామస్ ముల్లర్ వరకూ ఆయా ప్రపంచ కప్‌లలో ఎంతోమంది టీనేజర్లు తమ అద్వితీయ ప్రతిభతో అంతర్జాతీయ గుర్తింపు సొంతం చేసుకొన్నారు. ఇప్పుడు మరోసారి ప్రపంచ కప్ వచ్చేసింది. ఈ సారి ఏ యువ ఆటగాడు సంచలనమై నిలుస్తాడు? స్ఫూర్తిమంతమైన ఆటను కనబరుస్తూ అభిమానులను సంపాదించుకొంటాడు?! అలాంటి అవకాశం ఉన్న కొంతమంది ఆటగాళ్లు వీళ్లు... వీళ్లలో మెరిసి మురిపించేది ఎవరు?! జూలియన్ డ్రాక్సలర్ - జర్మనీ జర్మన్ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక స్థాయి గోల్స్ చేసిన ఆటగాడు మైఖేల్ బల్లాక్. ఆ లెజెండరీ ప్లేయర్‌తో పోలిక పెట్టగ ల స్ట్రైకర్ జూలియన్ డ్రాక్సలర్. గత ప్రపంచకప్‌లో ఉత్తమ ఆటగాడిగా అవార్డును అందుకొన్న థామస్ ముల్లర్‌తో సహా అనేక మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నా జర్మన్ ఫుట్‌బాల్ టీమ్ మేనేజర్ మాత్రం జూలియన్‌ను తమ తురుపు ముక్క అంటున్నాడు. మరి ఈ యువ ఆటగాడు ఏ మేరకు సంచలనంగా నిలుస్తాడో వేచి చూడాలి! మౌరో ఇకార్డీ - అర్జెంటీనా ఇంటర్మిలన్ ఫుట్‌బాల్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఆటగాడికి తమ తమ జాతీయ జట్టుకు ఆడమని ఇటలీ, స్పెయిన్, అర్జెంటీనాల దేశాల నుంచి ఆహ్వానం వచ్చింది. అర్జెంటీనాకు చెందిన ఇకార్డీకి ఇటలీ పాస్‌పోర్ట్ ఉంది. స్పెయిన్ ఫుట్‌బాల్ క్లబ్‌కు ప్రాతనిధ్యం వహిస్తున్నాడు. దీంతో ఆ దేశాల వాళ్లంతా ఇతడి ఆటకు ముగ్ధులై తమ దేశం తరపున ఆడాలని ప్రతిపాదన పంపించారు. అయితే ఇకార్డీ మాత్రం తను పుట్టింది అర్జెంటీనాలో కాబట్టి ఆ దేశానికే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ఫార్వర్డ్ ఆటగాడు మెస్సీ స్థాయి వాడని అర్జెంటీనా టీమ్ మేనేజర్ అంటున్నారు. లారెంజో ఇన్సైన్ - ఇటలీ ఈ ఇటాలియన్ ఫార్వర్డ్ ప్లేయర్ పొట్టివాడైనా చాలా గట్టివాడు. ఐదడుగుల రెండంగుళాల ఎత్తు ఉండే లారెంజోపై ఇటలీ టీమ్ ఎన్నో ఆశలు పెట్టుకొంది. అండర్ 21 టీమ్‌కు ఆడుతున్న సమయం నుంచే ఇతడిపై అంచనాలు పెరిగిపోయాయి. మరి అలాంటి అంచనాల నేపథ్యంలో లారెంజో ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. కొకే - స్పెయిన్ ఇప్పుడు ప్రపంచ కప్‌లో పాల్గొంటున్న జట్ల బలాబలాలను చూస్తే మిడ్ ఫీల్డర్ల విషయంలో స్పెయిన్‌కు పటిష్టమైన జట్టుగా పేరుంది. డిఫెండింగ్ చాంఫియన్ అయిన స్పెయిన్‌కు మిడ్ ఫీల్డ్ క్షేత్రంలో మెరుస్తుంటాడు కొకే. ఈ 21 యేళ్ల ఆటగాడు స్పెయిన్ దిగ్గజాలకు సరితూగుతున్నాడు. గత ప్రపంచ కప్ విజేత అయిన టీమ్‌ను తిరిగి విజేతగా నిలపగలమనే ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. క్లెమెంట్ గ్రెనియర్ - ఫ్రాన్స్ 2006 ఫీఫా వరల్డ్ కప్‌లో త్రుటిలో ట్రోఫీని కోల్పోయింది ఫ్రాన్స్. ఆ తర్వాత జిదాన్ వంటి ఆటగాడు నిష్ర్కమించాడు. ఈ సారి ఫ్రాన్స్తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న క్లెమెంట్ కూడా జిదాన్ స్థాయి ఆటగాడే అంటున్నారు. అండర్ 21 ఛాంపియన్ షిప్లో ఇతడు కొట్టిన కొన్ని మ్యాజిక్ గోల్స్ ఇతడిపై ఫ్రెంచ్ అభిమానుల ఆశలను, ఫుట్‌బాల్ ప్రియుల అంచనాలను అమాంతం పెంచేశాయి. వాటిని ఏ మేరకు అందుకొంటాడో! వీరు మాత్రమే కాదు... వెటరన్ ఫుట్‌బాల్ ప్లేయర్లకు ధీటుగా ఈ సారి అనేక మంది యువ ఆటగాళ్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. హాలెండ్‌కు చెందిన మెంఫిస్ డిపే, ఇదే టీమ్‌కు చెందిన మిడ్ ఫీల్డర్ కెవిన్ స్ట్రూట్మన్, ఫ్రాన్స్‌కు చెందిన సెంటర్ బ్యాక్ ప్లేయర్ కుర్ట్ జౌమా, ఆస్ట్రియన్ లెఫ్ట్బ్యాక్ ప్లేయర్ డేవిడ్ అలబా తదితర యువ, ఇప్పుడిప్పుడే టీనేజ్‌ను దాటిన ఈ ఆటగాళ్లు, బ్రెజిల్లో జరగనున్న సాకర్ ప్రపంచ కప్‌కు ఆకర్షణగా మారారు. మరి ఈ ప్రపంచకప్‌తో వీళ్లలో ఎవరు తమ ప్రదర్శనతో స్టార్ ఇమేజ్ను సంపాదించుకొంటారో! - జీవన్‌రెడ్డి. బి -
వికాసం: ఈ ముగ్గురిలో ఎవరు మీరు?
అతడికి గమ్యం తప్ప మరేమీ కనపడలేదు. అతడు అయిదో రౌండులో గీత చేరుకుంటూండగా ప్రేక్షకుల నుంచి జయజయ ధ్వానాలు వినిపించాయి. తనకన్నా ముందే నలుగురు లైను దాటడం గమనించి, అతడు కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు. ఒక ఊళ్లో రామ్, రాబర్ట్, రహీమ్ అనే ముగ్గురు వ్యక్తులు వేరువేరుగా చెప్పుల షాపులు స్థాపించారు. రామ్‌కి ఒక అద్భుతమైన కళ ఉన్నది. చెప్పును చూసి సరిగ్గా మన్నుతుందో లేదో చెప్పగలడు. చెప్పులు కుట్టేవాళ్లని కొంతమందిని పిలిచి, వాళ్లలో తనకి సంతృప్తికరంగా కుట్టినవారికి కాంట్రాక్ట్ ఇచ్చాడు. వారు తయారుచేసి తీసుకొచ్చిన చెప్పుల మీద తన సొంత బ్రాండ్ పేరు ముద్రిస్తాడు. అంతే. అది బాటా, పాపులర్, అడిడాస్, నైకీ, ఉడ్‌ల్యాండ్స్ లాంటిది ఏదైనా కావొచ్చు. కేవలం తన బ్రాండ్ పేరు వల్ల యాభై రూపాయలు ఖరీదు చేసే చెప్పుని అతడు రెండు వందలకి అమ్ముతాడు. అతని బ్రాండ్‌కి మన్నిక గ్యారెంటీ. కేవలం షాపు డెకరేషన్‌కే అతడు కొన్ని లక్షలు ఖర్చుపెట్టాడు. అక్కడ షాపింగ్ చేయటం ఆ ఊళ్లో వాళ్లకి ప్రిస్టేజి. సంవత్సరం తిరిగే సరికల్లా అతడు కోటి రూపాయలు సంపాదించాడు. రాబర్ట్‌కి స్కిల్ ఉంది. అద్భుతంగా చెప్పులు కుడతాడు. అతడు కుట్టిన చెప్పులు వేసుకుంటే మేఘాల మీద నడుస్తున్నట్టు ఉంటుంది. చిన్న గదిలో కూర్చుని రోజుకి కేవలం అయిదు జతల చెప్పులు మాత్రమే కుడతాడు. ఒక్కొక్కదాని ఖరీదు దాదాపు వెయ్యి రూపాయలు ఉంటుంది. కేవలం రాజాలు, కోటీశ్వరులు అతని చెప్పులు కొనగలరు. సంవత్సరంలో అతడూ కోటి రూపాయలు సంపాదించాడు. రహీమ్ కొన్ని వేల చెప్పులు కొని ఒక గోడౌన్ లాంటి షాపులో పెట్టాడు. అక్కడ చెప్పుల జత కేవలం పాతిక రూపాయలకే దొరుకుతుంది. అయితే కుడి కాలి చెప్పు దొరికితే, ఎడమ కాలి చెప్పు కోసం దాదాపు అరగంట వెతుక్కోవాలి. అక్కడ తరచూ వినిపించే పదం ‘చౌక’. ఏడాదిలో అతడి లాభం కోటి దాటింది. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తీ గెలవాలనుకుంటాడు. కానీ కొందరు ఓడిపోతూంటారు. దీనికి కారణం వాళ్లు తమలో ఎటువంటి శక్తి ఉన్నదో సరిగ్గా గుర్తించలేకపోవటమే. ఒక మంచి నటుడు గొప్ప రాజకీయవేత్త కాలేకపోవచ్చు. ఒక గొప్ప క్రికెట్ ఆటగాడు మంచి నటుడు కాలేకపోవచ్చు. జీవితంలో గెలవాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా కావలసింది మనిషి తన ‘అంతర్గత కళ’ని గుర్తించటం. ఒక వ్యాపారంలో గాని, వృత్తిలో గాని ప్రవేశించబోయేముందు అదే వృత్తిలో విఫలమైన వ్యక్తుల్ని పరిశీలించాలి. సక్సెస్ అయినవారి గెలుపు వెనుక కారణాన్ని పట్టుకోవాలి. దానికన్నా ముఖ్యంగా తనలో రామ్, రాబర్ట్, రహీమ్ లాంటి వ్యక్తి ఎవరున్నారో గుర్తించాలి. రహీమ్‌లు ట్రేడర్లు. కేవలం వ్యాపారం చేస్తారు. రాబర్ట్‌లు స్కిల్డ్ వర్కర్స్. రాబర్ట్‌లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లవుతే రిటైర్ అయ్యేవరకు రాత్రింబవళ్లు కంప్యూటర్ మీద పనిచేస్తూనే ఉంటారు. రామ్‌లు వారితో పని చేయించుకొంటారు. చేస్తున్న పనిమీద ఉత్సాహం, కృషి ఉంటే బిల్‌గేట్స్, స్టీవ్జాబ్స్లు తయారవుతారు. కావల్సింది కృషి. అది ఉంటే విజయం దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది. ఒక కుర్రవాడు రాత్రింబవళ్లు కృషి చేసి వెయ్యి మీటర్ల రేసుకి తయారయ్యాడు. పిస్టల్ సౌండు వినపడగానే గుండెల్లోకి గాలి, కళ్లలోకి బలం తీసుకొని పరిగెత్తటం ప్రారంభించాడు. అతడికి గమ్యం తప్ప మరేమీ కనపడలేదు. అతడు అయిదో రౌండులో గీత చేరుకుంటూండగా ప్రేక్షకుల నుంచి జయజయ ధ్వానాలు వినిపించాయి. తనకన్నా ముందే నలుగురు లైను దాటడం గమనించి, అతడు కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు. ఇంతలో పోటీ నిర్వాహకులు తనవైపు వేగంగా రావటం గమనించాడు. వాళ్లు కంగ్రాట్స్ చేస్తూంటే, ‘‘కానీ వాళ్లు నా కన్నా ముందే వెళ్లారుగా’’ అన్నాడు దిగులుగా. నిర్వాహకులు అటు చూసి, ‘‘లేదు లేదు. వాళ్లింకా నాలుగో రౌండు దాటుతున్నారు. ఆ చప్పట్లు మీకోసం’’ అన్నారు. ప్రస్తుతం మన యువత అమెరికా వెళ్లటానికి కలలు కంటోంది. రామ్‌లు పెరిగేకొద్దీ, అమెరికన్లు ఇండియాలో ఉద్యోగం చేయటానికి కలలు కంటారు. అందుకే దేశానికి నారాయణమూర్తి, రతన్‌టాటా లాంటి రామ్‌ల అవసరం చాలా ఉంది. - యండమూరి వీరేంద్రనాథ్