రానున్న గ్రేటర్ ఎన్నికలలో కలసి కట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపునకు నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు.
హబ్సిగూడ (హైదరాబాద్): రానున్న గ్రేటర్ ఎన్నికలలో కలసి కట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపునకు నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. ఆదివారం హబ్సీగూడాలో ఏర్పాటుచేసిన ఉప్పల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ మేరకు పార్టీ కార్యకర్తలను కార్యోన్ముఖుల్ని చేసేందుకు ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి ఎమ్మెల్యే డి.కే.అరుణ, ఎమ్మెల్సీ ఆకుల లలిత ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పూటకొక మాట మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసగిస్తున్నారని పొన్నాల విమర్శించారు. మాజీ మంత్రి డికే.ఆరుణ మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని ఆయనకు ప్రజా సంక్షేమం పట్టడం లేదని ఆరోపించారు.