లండన్: ఫుట్‌బాల్ ఆటలో గోల్ కొట్టడం మామూలు విషయం కాదు. ఒక్కోసారి గోల్‌పోస్ట్‌కు అత్యంత సమీపంలో ఉన్నా కూడా గోల్ కొట్టడం సాధ్యం కాదు. అలాంటిది ఏకంగా 68 గజాల దూరం నుంచి బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపాడు వేన్ రూనీ. ఒకప్పుడు ఇంగ్లండ్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ఆడిన రూనీ రిటైరయ్యాక క్లబ్బులు, లీగ్‌ల్లో ఆడుతున్నాడు. ప్రస్తుతం మేజర్ లీగ్ సాకర్‌లో డీసీ యునైటెడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తాజాగా లాస్ ఏంజెల్స్‌లో ఓర్లాండో సిటీతో జరిగిన మ్యాచ్‌లో రూనీ దాదాపు 68 గజాల దూరం నుంచి బంతిని ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. ఆ సమయంలో ఓర్లాండో ఆటగాళ్లంతా డీసీ కోర్టులోనే ఉన్నారు. ప్రత్యర్థి గోల్ కీపర్ బ్రియన్ రోవె సైతం గోల్‌పోస్ట్‌కు దూరంగా ఉన్నాడు. ఇదంతా గమనించిన రూనీ తెలివిగా చాలాదూరం నుంచి గోల్ కొట్టాడు. డీసీ గెలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇక ఈ గోల్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment