Wayne Rooney
-
తండ్రి అడుగుజాడల్లో తనయుడు
మాంచెస్టర్: ఇంగ్లండ్ ఫుట్‌బాల్ స్టార్ వేన్ రూనీ అడుగుజాడల్లోనే తన కుమారుడు పయనిస్తున్నాడు. 11 ఏళ్ల కాయ్ రూనీ ప్రతిష్టాత్మక మాంచెస్టర్ యునైటెడ్ అకాడమీలో చేరేందుకు సంతకం చేశాడు. మాంచెస్టర్ యునైటెడ్ తరఫున 2003 నుంచి 2017 వరకు ఆడి రికార్డుస్థాయిలో 183 గోల్స్ చేసిన 35 ఏళ్ల రూనీ తన పుత్రోత్సాహాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘నేను గర్వపడే రోజు ఇది. నా కుమారుడు కాయ్ మాంచెస్టర్‌తో జతకట్టాడు. కాయ్ నువు చాలా కష్టపడాలి. మరెంతో ఎదగాలి. ఆల్ ది బెస్ట్’ అని ఇంగ్లండ్ తరఫున 120 మ్యాచ్‌లు ఆడి 53 గోల్స్ చేసిన రూనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. రూనీ భార్య, కాయ్ తల్లి కొలీన్ కూడా తన సంతోషాన్ని వెలిబుచ్చింది. ‘ఇది మాకెంతో ప్రత్యేకం. అభినందనలు కాయ్. అత్యుత్తమంగా రాణించేందుకు కృషి చేయాలి’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. రూనీ–కొలీన్ దంపతులకు నలుగురు కుమారులు కాగా... కాయ్ అందరికంటే పెద్దవాడు. -
68 గజాల దూరం నుంచి గోల్
-
ఎవరూ కలలో కూడా ఊహించని విధంగా..
లండన్: ఫుట్‌బాల్ ఆటలో గోల్ కొట్టడం మామూలు విషయం కాదు. ఒక్కోసారి గోల్‌పోస్ట్‌కు అత్యంత సమీపంలో ఉన్నా కూడా గోల్ కొట్టడం సాధ్యం కాదు. అలాంటిది ఏకంగా 68 గజాల దూరం నుంచి బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపాడు వేన్ రూనీ. ఒకప్పుడు ఇంగ్లండ్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ఆడిన రూనీ రిటైరయ్యాక క్లబ్బులు, లీగ్‌ల్లో ఆడుతున్నాడు. ప్రస్తుతం మేజర్ లీగ్ సాకర్‌లో డీసీ యునైటెడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తాజాగా లాస్ ఏంజెల్స్‌లో ఓర్లాండో సిటీతో జరిగిన మ్యాచ్‌లో రూనీ దాదాపు 68 గజాల దూరం నుంచి బంతిని ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. ఆ సమయంలో ఓర్లాండో ఆటగాళ్లంతా డీసీ కోర్టులోనే ఉన్నారు. ప్రత్యర్థి గోల్ కీపర్ బ్రియన్ రోవె సైతం గోల్‌పోస్ట్‌కు దూరంగా ఉన్నాడు. ఇదంతా గమనించిన రూనీ తెలివిగా చాలాదూరం నుంచి గోల్ కొట్టాడు. డీసీ గెలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఇక ఈ గోల్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. -
వేన్ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్ నిషేధం
మితిమీరి మద్యం తాగి వాహనం నడిపినందుకు ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ వేన్ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్ నిషేధం విధించారు. అలాగే స్వచ్ఛందంగా 100 గంటల సామాజిక సేవ కూడా చేయాలని స్థానిక మెజిస్ట్రేట్స్ కోర్టు ఆదేశించింది. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో ఎవర్టన్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 31 ఏళ్ల రూనీ ఈ నెల 1న అధిక స్థాయిలో మద్యం సేవించి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇంగ్లండ్ నిబంధనల ప్రకారం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆల్కహాల్ స్థాయి 35 మైక్రోగ్రామ్‌లు ఉండాల్సి ఉండగా... రూనీకి మాత్రం బ్రీత్ ఎనలైజర్ టెస్టులో అది 104 మైక్రోగ్రామ్‌లుగా తేలింది. -
మారో... యూరో
► ఫేవరెట్‌గా జర్మనీ ► హ్యాట్రిక్‌పై స్పెయిన్ గురి ► నేటి నుంచి ఫ్రాన్స్‌లో టోర్నీ దశాబ్దాల కాలంగా యూరోపియన్ జట్లలో పేరుకు పెద్దదే అయినా... ఇంగ్లండ్ ఇప్పటి వరకు ఒక్క యూరో టైటిల్ కూడా నెగ్గలేకపోయింది. ప్రపంచాన్ని ఊపేసే స్టార్లు ఉన్నా పోర్చుగల్ ప్రదర్శన కూడా అంతంత మాత్రమే. ఇక మాజీ చాంపియన్లు జర్మనీ, ఫ్రాన్స్‌ల మధ్య నువ్వా, నేనా అనే స్థాయిలో చాలా కాలంగా పోటీ సాగుతుండగా... గత రెండు సార్లు స్పెయిన్ ఈ వేదికపై హవా నడిపించింది. ప్రపంచకప్ తర్వాత ఆ స్థాయి టోర్నీలో తమ సత్తా చాటేందుకు ఈ జట్లకు మరో అవకాశం వచ్చింది. ప్రతిష్టాత్మక యూరో కప్ నేటి నుంచి జరుగుతుంది. సాక్షి క్రీడా విభాగం:- క్రిస్టియానో రొనాల్డో, వేన్ రూనీ... ఫుట్‌బాల్ ప్రపంచంలో స్టార్లుగా చెలామణీ అవుతున్నా ఇప్పటి వరకు తమ దేశం తరఫున చెప్పుకోదగ్గ టోర్నీ విజయంలో భాగం కాలేదు. అది ప్రపంచకప్ అయినా, దాదాపు అదే స్థాయిలో పోటీ ఉండే యూరో అయినా. ఇప్పుడు కెరీర్ చివరి దశలో వీరిద్దరు దానిని అందుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ప్రతిష్టాత్మక యూరో టోర్నీలో వారిలో ఎవరైనా దానిని సాధించగలరా, లేక మళ్లీ నిరాశతోనే కెరీర్‌ను ముగిస్తారా చూడాలి. 24 జట్లు పోటీ పడుతున్న యూరో కప్-2016 నేడు అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మొత్తం ఆరు గ్రూప్‌లలోని జట్లకు ఉన్న అవకాశాలు, అంచనాలను విశ్లేషిస్తే... గ్రూప్ ఎ: ఫ్రాన్స్‌కే ఓటు మాజీ చాంపియన్ ఫ్రాన్స్ ఈ గ్రూప్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. సొంతగడ్డపై 2008లో కెప్టెన్‌గా జట్టును ప్రపంచ విజేతగా నిలిపిన దీదియ ర్ డెస్చాంప్స్ ఇప్పుడు కోచ్‌గా ఉన్నాడు. పోగ్బా, గ్రీజ్మన్, బ్లెయిజ్లతో జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్స్ దశకు చేరిన రికార్డు స్విట్జర్లాండ్‌కు ఉంది. అర్హత పోటీల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా రొమేనియా క్వాలిఫై అయినా అంచనాలు లేవు. తొలి సారి ఆల్బేనియా యూరో బరిలోకి దిగుతోంది. గ్రూప్ బి: ఇంగ్లండ్‌కు అవకాశం కొత్త మేనేజర్ రాయ్ హడ్సన్ కుర్రాళ్లతో ఇంగ్లండ్ జట్టును నింపేశాడు. స్టార్ రూనీకి ఇది ఆఖరి అవకాశం. కుర్రాళ్లు బాగా ఆడుతుండటం, క్వాలిఫయింగ్‌లో అన్ని మ్యాచ్‌లు గెలిచిన ఫామ్ ఇంగ్లండ్‌ను ఫేవరెట్లలో ఒకటిగా చేస్తున్నాయి. జట్టులో కోచ్ మొదలు ఆటగాళ్ల వరకు అంతర్గత సమస్యలతో ఉన్నందున రష్యా ప్రభావం చూపే అవకాశం లేదు. స్లొవేకియాకు ఇది రెండో అంతర్జాతీయ టోర్నీ మాత్రమే. రియల్ మాడ్రిడ్ సూపర్ స్టార్ గారెత్ బాలే అండగా ఉన్న వేల్స్ జట్టు తమను తాము నిరూపించుకోవాలని పట్టుదలగా ఉంది. గ్రూప్ సి: రికార్డుపై జర్మనీ గురి గతంలో ఫ్రాన్స్ మాత్రమే ప్రపంచకప్ తర్వాత యూరో గెలిచింది. ఇప్పుడు జర్మనీ దానిని సాధించడంతో పాటు నాలుగో సారి యూరో విజేతగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముల్లర్, పొడోల్‌స్కీ కీలక ఆటగాళ్లు. పోలండ్ డార్క్‌హార్స్‌గా ఆడనుంది. లెవాన్‌డోస్కీ టోర్నీలోనే బెస్ట్ సెంటర్ఫార్వర్డ్. ఉక్రెయిన్, నార్తర్న్, ఐర్లాండ్లనుంచి ఎలాంటి ప్రమాదం లేదు. గ్రూప్ డి: స్పెయిన్ హ్యాట్రిక్ ఆశ స్పెయిన్ టైటిల్ గెలిస్తే యూరోలో హ్యట్రిక్ సాధించిన తొలి జట్టు అవుతుంది. చివరి టోర్నీ ఆడుతున్న దిగ్గజం డెల్ బాస్క్యూకు గెలుపుతో ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని భావిస్తున్న స్పెయిన్ ఫామ్‌లో ఉంది. కనీసం సెమీస్ చేరవచ్చు. గతంలో రెండు ప్రపంచకప్‌లలో క్వార్టర్స్ చేరిన క్రొయేషియా, టర్కీ, చెక్ రిపబ్లిక్ కూడా గట్టి పోటీనివ్వగలవు. గ్రూప్ ఇ: బెల్జియంకు అవకాశం స్టార్ ఆటగాళ్లంతా వరుసగా గాయాల బారిన పడటంతో టోర్నీకి ముందు బెల్జియంకు షాక్ తగిలింది. ఆ జట్టు లుకాకు, డి బ్రూయిన్పై ఆధారపడుతోంది. 2012లో రన్నరప్ ఇటలీ ఆ తర్వాత ఫామ్ కోల్పోయింది. క్వాలిఫయింగ్‌లో 10 మ్యాచ్‌లలో 16 గోల్స్ మాత్రమే చేసింది. ఇబ్రహీమోవిచ్ను మినహాయిస్తే స్వీడన్ సున్నా. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌పై కూడా ఆశలు లేవు. గ్రూప్ ఎఫ్: రొనాల్డోపైనే దృష్టి కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న దశలో యూరోలో అడుగు పెడుతున్న రొనాల్డో ఈ సారైనా తన పూర్తి శక్తిసామర్థ్యాలు వినియోగించి పోర్చుగల్‌ను ముందంజలో నిలపాలని పట్టుదల గా ఉన్నాడు. స్ట్రైకర్ మార్క్ జంకోపై ఆస్ట్రియా ఆ శలు పెట్టుకుంది. క్వాలిఫయింగ్‌లో నెదర్లాం డ్స్‌ను ఓడించిన ఐస్లాండ్ మరో సంచలనం కోసం చూస్తుండగా, అదృష్టం కొద్దీ అర్హత సాధించిన హంగేరీ 1986 ప్రపంచకప్ తర్వాత తొలి టోర్నీ ఆడుతోంది. వింబుల్డన్‌కు నాదల్ దూరం లండన్: మణికట్టు గాయంతో బాధపడుతున్న టెన్నిస్ స్టార్ నాదల్ వింబుల్డన్ ఆడటం లేదని ప్రకటించాడు. గాయంతో ఫ్రెంచ్ ఓపెన్ మధ్యలో నాదల్ తప్పుకున్నాడు. నా మద్దతు జర్మనీకే ‘యూరోలో నేను జర్మనీ వైపు. మరి మీ మద్దతు ఎవరికి’ అని కోహ్లి జర్మనీ జెర్సీతో ట్వీట్ చేశాడు. -
వేన్ రూనీ కూడా వస్తున్నాడు: గంగూలీ
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ మ్యాచ్‌లను తిలకించేందుకు బ్రెజిల్ దిగ్గజం పీలేతోపాటు ఇంగ్లండ్ సూపర్ స్టార్ వేన్ రూనీ కూడా కోల్‌కతాకు వస్తున్నాడని అట్లెటికో డి కోల్‌కతా క్లబ్ సహ యజమాని సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఐఎస్ఎల్ రెండో సీజన్ అక్టోబరు 3 నుంచి డిసెంబరు 6 వరకు జరుగుతుంది. -
రూనీ రికార్డు
లండన్ : ఇంగ్లండ్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు వేన్ రూనీ తమ జట్టు చరిత్రలో కొత్త ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక గోల్స్ స్కోర్ చేసిన (50) ఆల్‌టైమ్ రికార్డు రూనీ నెలకొల్పాడు. గతంలో బాబీ చార్ల్టన్ (49) పేరిట ఉన్న రికార్డును రూనీ సవరించాడు. యూరో క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ 84వ నిమిషంలో ఈ రికార్డు గోల్ సాధించాడు. -
యూరో కప్‌కు ఇంగ్లండ్ అర్హత
పారిస్ : వచ్చే ఏడాది జరిగే యూరో కప్‌లో ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు తొలి బెర్త్ దక్కించుకుంది. యూరో క్వాలిఫయింగ్‌లో భాగంగా గ్రూప్ ‘ఇ’లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6-0తో సాన్ మారినోను చిత్తు చేసింది. స్టార్ ఫుట్‌బాలర్ వేన్ రూనీ 13వ నిమిషంలో చేసిన గోల్‌తో తమ దేశం తరఫున అత్యధిక గోల్స్ (49) చేసిన ఆటగాడిగా బాబీ చార్ల్టన్ సరసన నిలిచాడు. -
బాగా ఆడుతున్నాడు..!
గత వారం ప్రపంచంలోనే ఖరీదైన టీనేజ్ ఆటగాడిగా రికార్డులకెక్కిన ఆంటోనీ మార్టియల్ కి కెప్టెన్ రూని సపోర్ట్ దొరికింది. ఈ 19ఏళ్ల మంచెస్టర్ యునేటెడ్ ఆటగాడికి కెప్టెన్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. డీల్ గురించి మాట్లాడిన రూనీ, డీల్ కు సంబంధించి తనకు పెద్దగా సమాచారం తెలీదని.. కానీ.. గత సీజన్ లో ఆర్సనల్ టీమ్ పై అతడి ఆటన చూశానని చెప్పాడు. ఆంటోనీ చాలా ప్రతిభావంతుడని.. తమ జట్టు తరఫున అతను అత్యున్నత ప్రదర్శన ఇస్తాడని ఆశించాడు. గత వారంలో భారీగా 36 మిలియన్ పౌండ్ల డీల్ కొట్టేసిన సంగతి తెలిసిందే. లీగ్ చరిత్రలోనే మూడో అతిపెద్ద డీల్ ఇదే కావడం విశేషం. -
28 ఏళ్లలో ఇంగ్లాండ్ కు ఇదే తొలిసారి!
మానస్ (బ్రెజిల్): ప్రపంచ కప్ పుట్ బాల్ టోర్నిలో గ్రూప్ డి విభాగంలో జరిగిన కీలక మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఇటలీ విజయం సాధించింది. క్లాడియో మార్చిసియో, మారియో బాలోటెల్లీ చెరో గోల్ సాధించడంతో ఇంగ్లాండ్ ను 2-1 స్కోర్ తేడాతో ఇటలీ కంగు తినిపించింది. కెప్టెన్ జియలుగీ బుఫాన్ గాయం కారణంగా మ్యాచ్ కు కొద్ది గంటల ముందు తప్పుకోవడంతో ఇటలీకి పెద్ద దెబ్బ తగిలింది. కానీ సాల్వతోరే సిరిగు అద్బుతంగా రాణించడంతో ఇటలీ విజయం సాధించింది. గ్రూప్ మ్యాచ్ లో తొలిరౌండ్ లోనే ఇంగ్లాండ్ ఓటమి పాలు కావడం గత 28 ఏళ్లలో ఇదే తొలిసారి. 1977 నుంచి ఇప్పటి వరకు ఇటలీపై ఇంగ్లాండ్ విజయం సాధించలేకపోయింది. ఇంగ్లాండ్ జట్టులో రూనీ తడబాటుకు గురైనా.. 62 నిమిషంలో లీటాన్ బెయినెస్ అందించిన పాస్ ను గోల్ గా మలిచాడు.