28 ఏళ్లలో ఇంగ్లాండ్ కు ఇదే తొలిసారి! | Italy keep England at bay, win crucial Group D match 2-1 | Sakshi
Sakshi News home page

28 ఏళ్లలో ఇంగ్లాండ్ కు ఇదే తొలిసారి!

Published Sun, Jun 15 2014 8:56 AM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM

28 ఏళ్లలో ఇంగ్లాండ్ కు ఇదే తొలిసారి! - Sakshi

28 ఏళ్లలో ఇంగ్లాండ్ కు ఇదే తొలిసారి!

మానస్ (బ్రెజిల్): ప్రపంచ కప్ పుట్ బాల్ టోర్నిలో గ్రూప్ డి విభాగంలో జరిగిన కీలక మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఇటలీ విజయం సాధించింది. క్లాడియో మార్చిసియో, మారియో బాలోటెల్లీ చెరో గోల్ సాధించడంతో ఇంగ్లాండ్ ను 2-1 స్కోర్ తేడాతో ఇటలీ కంగు తినిపించింది. 
 
కెప్టెన్ జియలుగీ బుఫాన్ గాయం కారణంగా మ్యాచ్ కు కొద్ది గంటల ముందు తప్పుకోవడంతో ఇటలీకి పెద్ద దెబ్బ తగిలింది. కానీ సాల్వతోరే సిరిగు అద్బుతంగా రాణించడంతో ఇటలీ విజయం సాధించింది. 
 
గ్రూప్ మ్యాచ్ లో తొలిరౌండ్ లోనే ఇంగ్లాండ్ ఓటమి పాలు కావడం గత 28 ఏళ్లలో ఇదే తొలిసారి.  1977 నుంచి ఇప్పటి వరకు ఇటలీపై ఇంగ్లాండ్ విజయం సాధించలేకపోయింది. ఇంగ్లాండ్ జట్టులో రూనీ తడబాటుకు గురైనా.. 62 నిమిషంలో లీటాన్ బెయినెస్ అందించిన పాస్ ను గోల్ గా మలిచాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement