వేన్ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్ నిషేధం
మితిమీరి మద్యం తాగి వాహనం నడిపినందుకు ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ వేన్ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్ నిషేధం విధించారు. అలాగే స్వచ్ఛందంగా 100 గంటల సామాజిక సేవ కూడా చేయాలని స్థానిక మెజిస్ట్రేట్స్ కోర్టు ఆదేశించింది. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో ఎవర్టన్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 31 ఏళ్ల రూనీ ఈ నెల 1న అధిక స్థాయిలో మద్యం సేవించి పోలీసులకు పట్టుబడ్డాడు.
ఇంగ్లండ్ నిబంధనల ప్రకారం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆల్కహాల్ స్థాయి 35 మైక్రోగ్రామ్‌లు ఉండాల్సి ఉండగా... రూనీకి మాత్రం బ్రీత్ ఎనలైజర్ టెస్టులో అది 104 మైక్రోగ్రామ్‌లుగా తేలింది.