
స్నేహితురాలు మాట్లాడటం లేదని..
రంగారెడ్డి: స్నేహితురాలు మాట్లాడటం లేదని ఓ విద్యార్థిని స్పిరిట్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన షాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఆమనగల్లు గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శ్రీజ.. స్నేహితురాలు తనతో మాట్లాడటం లేదన్న మనస్తాపంతో స్పిరిట్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
ఇది గమనించిన ఉపాధ్యాయురాలు.. బాలికను చికిత్స నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి నగరంలోని ఉస్మానియాకు తరలించారు. ప్రస్తుతంవిద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న షాద్‌నగర్ డివిజన్ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి, మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్‌నాయక్, సీఐ కాంతారెడ్డి, ఎస్‌ఐ రమేష్‌లు పాఠశాలకు వెళ్లారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment