వేన్ రూనీ కూడా వస్తున్నాడు: గంగూలీ
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ మ్యాచ్‌లను తిలకించేందుకు బ్రెజిల్ దిగ్గజం పీలేతోపాటు ఇంగ్లండ్ సూపర్ స్టార్ వేన్ రూనీ కూడా కోల్‌కతాకు వస్తున్నాడని అట్లెటికో డి కోల్‌కతా క్లబ్ సహ యజమాని సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఐఎస్‌ఎల్ రెండో సీజన్ అక్టోబరు 3 నుంచి డిసెంబరు 6 వరకు జరుగుతుంది.