కోల్‌కతా: నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో ఇంజ్యూరీ సమయంలో గోల్ చేసిన అట్లెటికో డి కోల్‌కతా డ్రాతో గట్టెక్కింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో భాగంగా గురువారం జరిగిన ఈ మ్యాచ్ ఐదో నిమిషంలోనే నార్త్‌ఈస్ట్ కు వెలెజ్ గోల్ అందించాడు.
ఆ తర్వాత దాదాపు మ్యాచ్ చివరి వరకు తమ ఆధిక్యాన్ని కాపాడుకున్న ఈ జట్టుకు ఇయాన్ హ్యుమే షాకిచ్చాడు. ఇంజ్యూరీ (90+) టైమ్‌లో అత్యంత సమీపం నుంచి బంతిని గోల్‌పోస్టులోకి పంపి సొంత గడ్డపై అభిమానులను మురిపించాడు.