![Viral Video: Visually Impaired Girl Scored Goal At Basketball Match - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/26/Basket%20ball.jpg.webp?itok=25TudWA3)
Basketball game in viral video: చాలా మంది తమ వైకల్యాన్ని ప్రతికూలమైన అంశంగా భావించకుండా తమ శక్తి యుక్తులతో విజేతలగా మారారు. అంతేందుకు ప్రతికూలంగా ఉన్నదాన్ని సైతం అనుకూలంగా మార్చుకుని ఎదురు నిలిచిని వాళ్లు ఉన్నారు. మేము డిసేబుల్డ్ కాదు డిఫరెంట్‌గా చేసేవాళ్లం అని చాటి చెప్పి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వారెందరో ఉన్నారు. అచ్చం ఆ కోవకే చెందిందే జూల్స్ హూగ్లాండ్ అనే ఏళ్ల అమ్మాయి. ఇంతకీ ఆమె ఏం చేసిందనే కదా!
వివరాల్లోకెళ్తే...జూల్స్ హూగ్లాండ్ అనే 17 ఏళ్ల అమ్మాయి దివ్యాంగురాలు. అమెకు కళ్లు కనిపించావు. అయితే ఆమె బాస్కట్ బాల్ కోర్టులో గోల్ చేస్తున్నసమయంలో అక్కడున్న ప్రేక్షకులంతా చాలా నిశబ్దంగా ఉన్నారు. ఆమె గోల్ చేస్తుందా లేదా అన్నట్లుగా చాలా ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే ఆమె ఒక హూప్ సాయంతో గోల్ చేయాల్సిన లక్ష్యాన్ని విని, తదనంతరం గోల్ వేస్తుంది. అయితే అక్కడ ఉన్నవారందరిలో ఒకటే ఆత్రుత ఆమె ఎలా వేస్తుందా అని. కానీ ఇంతలో ఆమె బాస్కట్ బాల్‌ని చాలా కరెక్ట్‌గా గోల్ చేసింది. అంతే అక్కడున్నవారంతా ఒక్కసారిగా అరుపులు, కేకలతో సందడి చేశారు. యుఎస్‌లోని జీలాండ్ ఈస్ట్ హైస్కూల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
(చదవండి: ఉక్రెయిన్‌లో దయనీయ పరిస్థితి..!)
Comments
Please login to add a commentAdd a comment