మరణించిన టీనేజర్‌ కుటుంబానికి రూ. 2,624 కోట్ల పరిహారం | Rs. 2,624 crore compensation to the family of a teenager on amusement park ride | Sakshi
Sakshi News home page

మరణించిన టీనేజర్‌ కుటుంబానికి రూ. 2,624 కోట్ల పరిహారం

Published Sun, Dec 8 2024 5:54 AM | Last Updated on Sun, Dec 8 2024 8:48 AM

Rs. 2,624 crore compensation to the family of a teenager on amusement park ride

అమెరికా కోర్టు సంచలన తీర్పు

న్యూయార్క్‌: అమెరికాలో అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లో నిట్టనిలువుగా కిందకు దూసుకొచ్చే ‘ఫ్రీ ఫాల్‌ టవర్‌ డ్రాప్‌ రైడ్‌’లో ప్రమాదవశాత్తు పైనుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఒక టీనేజర్‌ కుటుంబానికి రూ.2,624 కోట్ల భారీ నష్టపరిహారం ఇవ్వాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఐకాన్‌ పార్క్‌లో ఫన్‌టైమ్‌ హ్యాండిల్స్‌ అనే సంస్థ ఈ రైడ్‌ను నిర్వహించింది. 400 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లి గంటకు 112 కిలోమీటర్లవేగంతో కిందకు దూసుకొస్తుంది. 2022 మార్చిలో 14 ఏళ్ల టైర్‌ శాంప్సన్‌ తన తోటి ఫుట్‌బాల్‌ టీమ్‌తో ఈ రైడ్‌ ఎక్కాడు. 

ఆరు అడుగుల ఎత్తు 173 కేజీల బరువున్న శాంప్సన్‌ను నిబంధనలకు విరుద్ధంగా రైడ్‌కు అనుమతించారు. వ్యక్తి 129 కేజీలకు మించి బరువుంటే ఈ రైడ్‌కు అనుమతించకూడదు. రెండుసార్లు పైకీ కిందకు సురక్షితంగా వెళ్లొచ్చిన శాంప్సన్‌ మూడోసారి పట్టుతప్పి 70 అడుగుల ఎత్తులో టవర్‌ నుంచి వేగంగా కిందకు పడటంతో అక్కడికక్కడే చనిపోయాడు. ‘అధిక బరువు’, సేఫ్టీ సీట్‌ లాక్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు శిక్షగా ఫన్‌టైమ్‌ హ్యాండిల్స్‌ సంస్థకు 310 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది. ఈ మొత్తం నుంచి శాంప్సన్‌ తల్లిదండ్రులకు తలో 155 మిలియన్‌ డాలర్లు నష్టపరిహారంగా అందజేయాలని కోర్టు ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement