Amusement Park
-
మరణించిన టీనేజర్ కుటుంబానికి రూ. 2,624 కోట్ల పరిహారం
న్యూయార్క్: అమెరికాలో అమ్యూజ్మెంట్ పార్క్‌లో నిట్టనిలువుగా కిందకు దూసుకొచ్చే ‘ఫ్రీ ఫాల్ టవర్ డ్రాప్ రైడ్’లో ప్రమాదవశాత్తు పైనుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఒక టీనేజర్ కుటుంబానికి రూ.2,624 కోట్ల భారీ నష్టపరిహారం ఇవ్వాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఐకాన్ పార్క్‌లో ఫన్‌టైమ్ హ్యాండిల్స్ అనే సంస్థ ఈ రైడ్‌ను నిర్వహించింది. 400 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లి గంటకు 112 కిలోమీటర్లవేగంతో కిందకు దూసుకొస్తుంది. 2022 మార్చిలో 14 ఏళ్ల టైర్ శాంప్సన్ తన తోటి ఫుట్‌బాల్ టీమ్‌తో ఈ రైడ్ ఎక్కాడు. ఆరు అడుగుల ఎత్తు 173 కేజీల బరువున్న శాంప్సన్‌ను నిబంధనలకు విరుద్ధంగా రైడ్‌కు అనుమతించారు. వ్యక్తి 129 కేజీలకు మించి బరువుంటే ఈ రైడ్‌కు అనుమతించకూడదు. రెండుసార్లు పైకీ కిందకు సురక్షితంగా వెళ్లొచ్చిన శాంప్సన్ మూడోసారి పట్టుతప్పి 70 అడుగుల ఎత్తులో టవర్ నుంచి వేగంగా కిందకు పడటంతో అక్కడికక్కడే చనిపోయాడు. ‘అధిక బరువు’, సేఫ్టీ సీట్ లాక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు శిక్షగా ఫన్‌టైమ్ హ్యాండిల్స్ సంస్థకు 310 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఈ మొత్తం నుంచి శాంప్సన్ తల్లిదండ్రులకు తలో 155 మిలియన్ డాలర్లు నష్టపరిహారంగా అందజేయాలని కోర్టు ఆదేశించింది. -
గాల్లో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. బిక్కుబిక్కుమంటూ పర్యాటకులు
లండన్: దక్షిణ ఇంగ్లండ్‌లోని ఓ రోలర్ కోస్టర్‌లో ప్రయాణిస్తున్న కొంతమంది పర్యాటకులు ఆ క్యాబిన్ స్ట్రక్ అయిపోవడంతో తలకిందులుగా వేలాడుతూ ఉండిపోయారు. చాలా సేపటి తర్వాత ఆ అమ్యూజ్మెంట్ పార్క్ వారు రంగంలోకి దిగిన తర్వాత అందులోని వారిని సురక్షితంగా కిందకు దించడంతో పెనుప్రమాదం తప్పింది. రోలర్ కోస్టర్ రైడ్ అంటే కొంతమందికి మహా సరదా. ఎత్తు పల్లాల్లో వేగంగా దూసుకుపోయే ఈ రైడ్‌లో ప్రయాణిస్తుంటే ప్రాణం గాల్లో తేలియాడుతూ మహదానందంగా ఉంటుంది. కానీ ఇదే రోలర్ కోస్టర్ రైడ్‌లో ఏదైనా అపశ్రుతి దొర్లితే జరిగే ప్రమాదం ఊహకు కూడా అందదు. అచ్చంగా అలాంటి ప్రమాదానికే అంచుల వరకు వెళ్లి తప్పించుకున్నారు లండన్‌లోని ఓ రోలర్ కోస్టర్‌లో ప్రయాణిస్తున్నవారు. ఈ రోలర్ కోస్టర్ మొదలైనప్పుడు మొదట భూమికి లంబంగా పైకి వెళ్తుంది... ఇక అక్కడి నుండి కిందకి జారుకుంటూ రివ్వున దూసుకుపోతుంది. కానీ ఇది పైకి వెళ్తున్నప్పుడే భూమికి సుమారు 72 అడుగుల ఎత్తులో ఆగిపోయింది. ఇందులో ఒకామె తన ఆరేళ్ళ కుమార్తెతో సహా ఇరుక్కుపోయింది. ఏం జరిగిందో అర్ధంకాక వారు బిక్కుబిక్కుమంటూ గుటకలు మింగుతూ ఉండిపోయారు. ఏదైనా జరగరానిది జరిగి పట్టుతప్పితే వారు కిందకి వచ్చేలోపే వారి ప్రాణాలు పైకి పోతాయి. అదృష్టవశాత్తు ఆ అమ్యూజ్మెంట్ పార్క్ సిబ్బంది సమయానికి స్పందించడంతో అందులో ఇరుక్కున్నవారిని సురక్షితంగా కిందకు దించారు. View this post on Instagram A post shared by @vedhamalhotra ఇది కూడా చదవండి: మనసులు గెలుచుకున్న పారా కరాటే చాంపియన్ -
Roller Coaster: తలకిందులుగా వేలాడుతూ.. 3 గంటలు నరకయాతన..
అమెరికా: అమెరికాలో ఒక అమ్యూజ్మెంట్ పార్కులో జనంతో ఉన్న ఒక రోలర్ కోస్టర్, రైడ్ జరుగుతుండగా సాంకేతిక లోపం తలెత్తి మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో ఉన్న వారు తలకిందులుగా వేలాడుతూ ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని దాదాపు 3 గంటలపాటు నరకయాతన చూశారు. చాలామందికి రోలర్ కోస్టర్ రైడ్ అంటే మహా సరదా. గాల్లో గింగిరాలు తిరుగుతూ చేసే ఈ స్వారీ సాగుతున్నంత సేపు మహదానందాన్ని మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అయితే ఇలాంటి ఒక రోలర్ కోస్టర్ రైడ్ లో ఏదైనా అపశ్రుతి దొర్లితే జరిగే నష్టాన్ని కూడా ఊహించలేము. ముఖ్యంగా యాంత్రికంగా ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు దేవుడిమీద భారం వేయడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. అచ్చంగా అలాంటి భయానకమైన సంఘటన ఒకటి అమెరికాలోని క్రాండన్ పార్క్ ఫారెస్ట్ కౌంటీ ఫెస్టివల్లో చోటు చేసుకుంది. రోలర్ కోస్టర్ రైడ్ జరుగుతుండగా సాంకేతిక సమస్య ఏర్పడటంతో కోచ్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో స్వారీ చేస్తున్నవారు తలకిందులుగా వేలాడుతూ ఊపిరిని బలంగా బిగపట్టి మూడు గంటలపాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆ క్షణంలో పరిస్థితి ఏమాత్రం పట్టు తప్పినా దారుణం జరిగుండేదని సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆగిపోయిన రోలర్ కోస్టర్ లో ఎనిమిది మంది ఉండగా అందులో ఏడుగురు చిన్నారులేనని సహాయక బృందం వెంటనే స్పందించి వారిని సురక్షితంగా కిందకు దించారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి తెలిపారు. మెకానికల్ సమస్య కారణంగానే రోలర్ కోచ్ మధ్యలో ఆగిపోయిందని.. విస్కాన్సిన్ బృందం ఇటీవలే ఇక్కడ తనిఖీలు కూడా చేశారని, అయినా ఇలా ఎందుకు జరిగిందో తెలియడంలేదని, ఇంతకు మించి మా వద్ద ఎటువంటి సమాచారం లేదని ఈ ఫెస్టివల్ నిర్వాహకులు తెలిపారు. Eight people hung upside down for about three hours, stuck in a roller coaster-like attraction. Emergency happened at a festival in American Wisconsin. Local media write that seven of the eight stranded are children. According to preliminary data, everyone got off with fright. pic.twitter.com/OP3Ow3syQZ — Sasha White (@rusashanews) July 4, 2023 ఇది కూడా చదవండి: టైటాన్ విషాదం: నా భర్త, బిడ్డ చివరి రోజులు తలచుకుంటే.. -
విరిగిన రోలర్ కోస్టర్ పిల్లర్.. తప్పిన పెను ప్రమాదం
నార్త్ కరోలినా: అత్యంత ఎత్తులో నిర్మితమైన ఓ రోలర్ కోస్టర్ రైడ్ జరుగుతున్న సమయంలో వీడియో తీశాడు ఓ సందర్శకుడు. వీడియోలో ఒక సన్నివేశం చూసి గగుర్పాటుకు గురై వెంటనే నిర్వాహకులను అప్రమత్తం చేశాడు. ఈ రోలర్ కోస్టర్ తాలూకా బ్రిడ్జి పిల్లర్ ఒకదానికి బీట రావడంతో రైడ్ సమయంలో పక్కకు కదులుతూ ప్రమాదకరంగా కనిపించింది. అలాగే నిర్లక్ష్యంగా దీనిని నిర్వహించి ఉంటే ఎంతటి దారుణం జరిగేదోనని అంటున్నారు నెటిజన్లు. ఫ్యూరీ 325 పేరుతో నడిచే రోలర్ కోస్టర్ కు స్థానికంగా విశేషమైన ప్రజాదరణ ఉంది. ఈ రైడ్ ను జీవితంలో ఒక్కసారి అయినా ఆస్వాదించాలని ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే దీని నిర్వహకులు దీనిలోని ఒక పిల్లర్ కు బీట వచ్చిన విషయాన్ని గమనించలేదు. రోలర్ కోస్టర్ స్థితిగతులను పట్టించుకోకుండా యధావిధిగా నిర్వహిస్తూ కాసులు గడించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక్కడికి విచ్చేసిన ఓ సందర్శకుడు తన మొబైల్ లో రోలర్ కోస్టర్ రైడ్ ను బంధించాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో అతను ఓ ప్రమాదాన్ని పసిగట్టాడు. ఆయన తీసిన వీడియోని నిశితంగా గమనించగా దీని పిల్లర్లలో ఒక పిల్లర్ కు పెద్ద బీటే వచ్చినట్లు కనిపించింది. వీడియోలో బీట వచ్చిన పిల్లర్ గుండా రోలర్ కోస్టర్ వెళ్ళినప్పుడు పిల్లర్ కదులుతున్న దృశ్యం స్పష్టంగా కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుని వెళ్లడంతో ప్రస్తుతానికైతే ఈ రోలర్ కోస్టర్ రైడ్ ను నిలిపివేశారు. మరమ్మత్తులు పూర్తయిన తర్వాతే దీన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ వీడియోని ఆ సందర్శకుడు ట్విట్టర్లో పొందుపరిచాడు. రోలర్ కోస్టర్ ఏ మాత్రం పట్టుతప్పినా అందులో ఉన్నవారి ప్రాణాల సంగతేమి కాను. గాలిలోని ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. సందర్శకుడు ఈ అమ్యూజ్మెంటు సంస్థ మేనేజ్మెంటును అప్రమత్తం చేసి పెను విపత్తునే తప్పించాడని నెటిజన్లు అతడిని అభినందిస్తున్నారు. A visitor at a North Carolina amusement park spotted a large crack on a roller coaster's pillar on Friday. The ride, which was billed as one of the tallest of its kind, has now been closed as crews make repairs. https://t.co/9xqRRgXyWl pic.twitter.com/HTHculBdl9 — The New York Times (@nytimes) July 2, 2023 ఇది కూడా చదవండి: కుక్కను కారులోనే వదిలి తాజ్‌మహల్ చూసి వచ్చారు.. తిరిగొచ్చి చూస్తే.. -
ఎంజాయ్ కోసం వెళ్తే ఊహించని షాక్.. ప్రాణాలు అరచేతితో పట్టుకుని..
డ్రాగన్ కంట్రీ చైనాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎంజాయ్మెంట్ కోసమని అమ్యూజ్‌మెంట్‌కు వెళ్లిన పర్యాటకులకు ఊహించని షాక్ తగిలింది. అమ్యూజ్మెంట్ పార్క్‌లో పెండ్యులంపై రైడ్ చేస్తున్న క్రమంలో రాడ్ విరిగిపోవడం వారంతా తలక్రిందులుగా వేలాడారు. దీంతో, వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయినంత పనైపోయింది. వివరాల ప్రకారం.. చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లోని ఫుయాంగ్ నగరంలో అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. దీన్ని సందర్శించేందుకు కొందరు పర్యాటకులు పార్క్‌కు వచ్చారు. ఈ క్రమంలో అక్కడున్న గేమ్ ఆడేందుకు పర్యాటకులు ఆసక్తి చూపించారు. ఇందులో భాగంగానే పార్క్‌లో ఉన్న పెండ్యులంపై రైడ్ చేసేందుకు కొందరు పర్యాటకులు ముందుకు వచ్చారు. దీంతో, పార్క్ సిబ్బంది పెండ్యులం రైడ్‌ను ప్రారంభించిన కొద్దిసేపటికే దాని పెద్ద రాడ్ విరిగిపోయింది. దీంతో, దానిపై ఉన్న వారంతా ఒక్కసారిగా తలకిందులుగా వేలాడుతూ గట్టిగా అరుస్తూ భయాందోళనకు గురయ్యారు. ఇలా దాదాపు 10 నిమిషాల పాటు గాలిలోనే ఉన్నారు. రాడ్ విరిగిన సమయంలో పెండ్యులం చాలా ఎత్తులో ఉన్నది. దీంతో షాకైన సిబ్బంది వెంటనే అప్రమతమయ్యారు. అనతంరం, రైడ్‌ను సరిసేందుకు సిబ్బంది నానా కష్టాలు పడ్డారు. ఎంతకీ సరికాకపోవడంతో తలలు పట్టుకున్నారు. తర్వాత ఒక వ్యక్తి ఆ రైడ్ పైభాగానికి వెళ్లి దానిని సరిచేశాడు. దీంతో, పర్యాటకులు కిందకు దిగారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఎక్కువ మంది ఎక్కడం వల్లనే ఈ సమస్య వచ్చిందని అమ్యూజ్మెంట్ పార్క్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో అనారోగ్యానికి గురైన వారికి వైద్య ఖర్చులపరంగా సహాయం చేస్తామని వెల్లడించారు. ఇక, ఈ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
అఫీషియల్: జిమ్‌లు, పార్కుల్లో మహిళలకు నో ఎంట్రీ
కాబూల్: మహిళా హక్కులను, స్వేచ్ఛను హరిస్తూ అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని జిమ్‌లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించింది. ఈ వారం నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించకపోవడం, పార్కులు, జిమ్‌లలో మహిళలు, పురుషులు విభజనను పాటించకపోవడం వల్లే తాజాగా ఈ ఆంక్షలను తీసుకువచ్చినట్లు ప్రభుత్వ ప్రతినిధి గురువారం చెప్పారు. 2021 ఆగస్ట్‌లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. మాధ్యమిక, ఉన్నత విద్యా పాఠశాలల్లో బాలికల ప్రవేశాన్ని నిషేధించారు. అనేక రంగాల్లో మహిళా ఉద్యోగులను తొలగించారు. బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా ధారణ తప్పనిసరి చేశారు. -
కృత్రిమ మొసలి అనుకుని సెల్ఫీకి యత్నం... ఇక అంతే చివరికి
ఇటీవలకాలంలో ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఈ సెల్ఫీ మోజు మాములుగా లేదు. వేగంగా వెళ్లుతున్న బస్సు లేక రైలు పక్కన సెల్ఫీలు దిగడం వంటివి చేస్తున్నారు. అయితే ఈ పిచ్చి ఎంత దారుణంగా ఉందంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారంటే ఏమని అనాలో కూడా అర్థంకాదు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి సెల్ఫీ మోజుతో ఎంత పిచ్చి పని చేశాడో చూడండి. (చదవండి: ఏడాదిగా షాప్‌కు వస్తున్న ప్రమాదకరమైన పక్షి!) అసలు విషయంలోకెళ్లితే...ఫిలిప్పీన్స్‌లోని నెహెమియాస్ చిపాడా అనే 60 ఏళ్ల వ్యక్తి తన కుటుంబంతో సహా కాగయన్ డి ఓరో సిటీలోని అమయా వ్యూ అమ్యూజ్మెంట్ పార్క్‌ను సందర్శించడానికి వెళ్లాడు. అయితే ఆ వ్యక్తి ఆ కొలనులో కృత్రిమ మొసళ్లు ఉంటాయనుకుని వాటితో సెల్ఫీకోసం అక్కడ ఉన్న థీమ్ పార్క్‌లోని కొలనులోనికి దిగిపోయాడు. ఇక అంతే అతను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని మొసలితో సెల్ఫీ తీసేందుకు ప్రయత్నిస్తుండగా వెంటనే ఆ మొసలి అతని పై దాడి చేసి గట్టిగా ఎడమచేయి పట్టుకుని లాగుతుంది. అయితే చిపాడ పాపం ఏదోరకంగా ఆ చెయ్యిని విడిపించుకుని బయటపడతాడు. దీంతో చిప్పాడను అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడంతో డాక్టర్లు అతని ఎడమ చేతికి శస్త్రచికిత్స కూడా చేశారు. ప్రస్తుతం అతను బాగానే కోలుకుంటున్నాడు. అంతేకాదు అతను కుటుంబసభ్యులు ఆ కొలనులోని దిగవద్దని హెచ్చరిక బోర్డులు లేవు అందువల్ల అతను దిగాడంటూ ఆ పార్క్వాళ్లపై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు . ఈ మేరకు అమయా వ్యూ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కాండీ ఉనాబియా ఈ ఆరోపణలను ఖండించారు. అంతేకాదు మొసలి కూడా కృత్రిమమైనదని వారు భావించడం వల్లే ఇలా జరిగిందని అన్నారు. పైగా తాము తమ పార్క్ టూర్ గైడ్లో ముందుగానే ఆ ప్రాంతాన్ని పరిమితులకు లోబడే సందర్శించాలనే విషయాలను పర్యాటకులకు చెబుతామని అన్నారు. అయితే చివరికి అమయా వ్యూ పార్క్ అధికారులు చిపడా వైద్యా ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం గమనార్హం. (చదవండి: ఘోర బస్సు ప్రమాదం...19 మంది దుర్మరణం) -
అమ్యూజ్మెంట్ పార్కులో తాలిబన్ల ఎంజాయ్
-
అమ్యూజ్మెంట్ పార్కులో తాలిబన్ల ఎంజాయ్
కాబూల్: అఫ్గనిస్తాన్ మళ్లీ తాలిబన్ల హస్తగతం కావడంతో అక్కడి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు వారి చేతుల్లో అనుభవించబోయే ప్రత్యక్ష నరకాన్ని తలుచుకుని రోదిస్తున్నారు. ఓ వైపు తాలిబన్ల రాక్షసపాలనకు భయపడి అక్కడ ఉండలేక దేశాన్ని విడిచిపోయేందుకు జనాలు ఇబ్బడిముబ్బడిగా విమానాశ్రాయాలు, రోడ్ల మీదకు చేరుకున్న దృశ్యాలు కనిపిస్తుండగా.. మరోవైపు ఇందుకు పూర్తిగా భిన్నమైన దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాబూల్‌ని ఆక్రమించిన తర్వాత తాలిబన్ల గుంపు తీరిగ్గా అమ్యూజ్మెంట్ పార్క్‌లో ఎంజాయ్ చేస్తోన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్నాయి. ఆ వివరాలు.. కాబూల్ నగరాన్ని ఆక్రమించుకున్న అనంతరం తాలిబన్లు ఈ సిటీలోని అమ్యూజ్మెంట్ పార్కుల్లో చేరి ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. భుజాలపై రైఫిళ్లను అలానే పెట్టుకుని ఈ పార్కుల్లోని ఎలెక్ట్రిక్ బంపర్ కార్లలో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఇదే పార్కులో పిల్లలు ఆడుకునే చిన్నపాటి బొమ్మ గుర్రాలపై స్వారీ చేస్తూ ఎంజాయ్ చేశారు తాలిబన్లు. వీరిలో కొందరు ఫైటర్లు దేశంలో చిక్కుబడిన అమెరికన్ల తరలింపులో అమెరికా సైనిక దళాలకు సాయపడ్డారట. భాషా సమస్య వచ్చినప్పుడు కొంతమంది ట్రాన్స్ లేటర్లుగా మారి ఆ సమస్యను తీర్చారట. ఇలా ఉండగా కాబూల్‌లోని పార్లమెంట్ భవనంలో తాలిబన్లు తిష్ట వేసిన దృశ్యాల వీడియోలు, మజారే షరీఫ్‌లో మాజీ అఫ్గన్ సైనికాధికారి హిబాతుల్లా అలీ జాయ్ విలాసవంతమైన నివాసంలో వీరు తిరుగాడుతున్న ఫోటోలు.. వీడియోలు వైరల్ అవుతున్నాయి. -
వండర్లా లాభం రూ.25.96 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమ్యూజ్మెంట్ పార్క్‌ల నిర్వహణలో ఉన్న వండర్లా హాలిడేస్ లిమిటెడ్ 2017–18 తొలి త్రైమాసికంలో రూ.25.96 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే సమయానికి పన్ను తర్వాత లాభం రూ.22.43 కోట్లగా ఉంది. అంటే ఏడాదిలో 16 శాతం వృద్ధిని నమోదు చేసిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2017 క్యూ1లో మొత్తం ఆదాయం 17 శాతం వృద్ధి రేటుతో రూ.105.43 కోట్లు. గతేడాది ఇదే సమయానికి రూ.90.43 కోట్లు. గతేడాది క్యూ1లో బెంగళూరు, కోచి, హైదరాబాద్‌లోని పార్క్‌ల ఆదాయం రూ.86.89 కోట్లు కాగా.. ఈ ఏడాది క్యూ1లో 18 శాతం వృద్ధితో 102.21 కోట్లని నమోదు చేసిందని కంపెనీ పేర్కొంది. ఇదిలా ఉంటే గతేడాది క్యూ1తో పోలిస్తే కోచిలోని పార్క్‌కు కస్టమర్ల రాక 6 శాతం వృద్ధిని నమోదు చేస్తే.. బెంగళూరులో 4 శాతం, హైదరాబాద్‌లో 5 శాతం కస్టమర్ల రాక తగ్గిందని సంస్థ ఎండీ అరున్ కే చిట్టిలపిళై ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కస్టమర్ల రాక తగ్గడానికి ప్రధాన కారణం ఏప్రిల్ 2016లో పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆఫర్లను విడుదల చేయటమేనని ఆయన తెలిపారు. చెన్నై తిరుప్పొరూర్లో 57 ఎకరాల్లో రానున్న పార్క్ స్థల సమీకరణ పూర్తయిందని, మరో 3 నెలల్లో నిర్మాణ పనులను ప్రారంభిస్తామని 2019–20 ఆర్ధిక సంవత్సరానికి పార్క్ వినియోగంలోకి తీసుకొస్తామని ఆయన వివరించారు. -
సెలవులకు కొత్త ‘థీమ్’!
దేశంలో థీమ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ.. ♦ గతేడాది అమ్యూజ్మెంట్ పార్క్‌ల ఆదాయం రూ. 2,930 కోట్లు! ♦ ఏటా 5 కోట్ల మంది సందర్శన; 10–15 శాతం వృద్ధి ♦ వచ్చే మూడేళ్లలో రూ.4వేల కోట్ల ఆదాయంపై దృష్టి ♦ హైదరాబాద్‌లో డిస్నీల్యాండ్, యాడ్‌ల్యాబ్స్ ఇమాజికా? హైదరాబాద్, బిజినెస్ బ్యూరో రోలర్ కోస్టర్, ఫ్లై థీమ్ స్పేస్, ఫ్లాట్ రైడ్స్, ఫెర్సీస్ వీల్స్, వెట్–ఓ–వైల్డ్, డ్రాప్ టవర్... ఇవి హాలీవుడ్ సినిమా పేర్లనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇవన్నీ వినోదభరిత క్రీడల పేర్లు. గతేడాది ఈ క్రీడలపై పెట్టిన ఖర్చు ఏకంగా రూ.2,930 కోట్లు! సినిమా అయితే రెండున్నర గంటల్లో పూర్తవుతుంది. ఇవి మాత్రం రోజంతా... ఇంకా చెప్పాలంటే మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించే ప్రాంతాలు. ఈ అమ్యూజ్మెంట్, థీమ్ పార్క్‌లు వినోద, ఆహ్లాదభరితమైన ప్రాంతాలే కాదు.. కాసులు కురిపించే భారీ పరిశ్రమలు కూడా!!. రూ.2,930 కోట్లకు పరిశ్రమ.. ప్రపంచవ్యాప్తంగా అమ్యూజ్మెంట్, థీమ్ పార్క్ పరిశ్రమ విలువ రూ.2.7 లక్షల కోట్లుగా ఉంది. మన దేశంలో 2015లో రూ.2,660 కోట్లుకు చేరిన పరిశ్రమ 2016 నాటికి రూ.2,930 కోట్లకు వృద్ధి చెందినట్లు ‘ది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్మెంట్ పార్క్ అండ్ ఇండస్ట్రీస్‘ (ఐఏఏపీఐ) చెబుతోంది. వచ్చే మూడేళ్లలో ఏటా 17.5 శాతం వృద్ధితో రూ.4 వేల కోట్లను అధిగమిస్తుందని పేర్కొంది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 80 వేల మంది, పరోక్షంగా 1.5 లక్షల మంది ఉపాధిని పొందుతున్నారు. ఏటా 5 కోట్ల మంది సందర్శన.. ప్రస్తుతం దేశంలో 125 అమ్యూజ్మెంట్, థీమ్ పార్క్‌లున్నాయి. యాడ్‌ల్యాబ్స్ ఇమాజికా, ఎస్సెల్ వరల్డ్, నిక్కో పార్క్, వండర్లా, కిష్కింద వంటివి బాగా ప్రసిద్ధి చెందాయి. శరవేగంగా జరుగుతున్న నగరీకరణ, చిన్న కుటుంబాలు, మిగులు ఆదాయం వంటివి అమ్యూజ్మెంట్ పార్క్‌ల సందర్శకుల్లో వృద్ధికి కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏటా దేశంలో 5 కోట్ల మంది పార్క్‌లను ఈ సందర్శిస్తున్నారని.. ఏటా 10–15 శాతం వృద్ధి నమోదవుతోందని వండర్లా హాలిడేస్ లిమిటెడ్ ఎండీ అరుణ్ కె చిట్టిలపిల్లి చెప్పారు. పరిశ్రమకు 55 శాతం ఆదాయం టికెట్ల అమ్మకాల ద్వారా, 35 శాతం ఆదాయం ఫుడ్ అండ్ బేవరేజెస్ (ఎఫ్అండ్బీ), మిగిలింది బ్రాండింగ్ ద్వారా వస్తోంది. ద్వంద్వ పన్నులే అడ్డు.. ప్రస్తుతం అమ్యూజ్మెంట్ పార్క్ పరిశ్రమ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్‌లు రెండింటినీ చెల్లించాల్సి వస్తోంది. మలేíసియా, థాయ్‌ల్యాండ్, సింగపూర్, చైనా, జపాన్ వంటి దేశాల్లో ఈ పరిశ్రమకు పన్నులు 10 శాతం కంటే తక్కువుంటాయి. మన దేశంలో మాత్రం 25–50 శాతం వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ ద్వంద్వ పన్ను విధానమే పరిశ్రమ వృద్ధికి అడ్డుగా మారుతోందని ఐఏఏపీఐ జనరల్ సెక్రటరీ అనిల్ పద్వాల్ తెలిపారు. వాస్తవానికి అమ్యూజ్మెంట్ పార్క్ పరిశ్రమ పర్యాటక రంగంలో భాగం. ఆయా పార్క్‌లతో విదేశీ పర్యాటకులు మన దేశానికొస్తున్నారు. ఏటా టూరిజం వృద్ధి చెందుతోంది కూడా. అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటుకు ప్రధానంగా కావాల్సింది భూమి, యంత్ర సామాగ్రి, జల వనరులు, రవాణా సౌకర్యం. ప్రధాన నగరాల్లో భూముల విలువలు పెరగడం, పూర్తిగా యంత్ర సామగ్రిపై ఆధారపడటంతో పార్క్‌ల ఏర్పాటు ప్రారంభ పెట్టుబడులు అధికంగా ఉంటాయని అందుకే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థల కేటాయింపులు, పన్ను ప్రోత్సాహకాలు కల్పించాలని ఆయన కోరారు. త్వరలో అమలులోకి రానున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తో ఈ రంగంలో పారదర్శకత నెలకొని, పెట్టుబడులు మరింత వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాణంలో మరో 12 పార్క్‌లు.. వచ్చే ఐదేళ్లలో దేశంలో కొత్తగా మరో 12 అమ్యూజ్మెంట్ పార్క్‌లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వండర్లా, అట్లాంటా, ల్యాండ్‌మార్క్ వంటి కంపెనీలు స్థల సమీకరణ పూర్తి చేసి పార్క్ నిర్మాణ పనులు జరుపుతుంటే.. డిస్నీల్యాండ్, య్యాడ్ల్యాబ్స్ ఇమాజికా వంటి సంస్థలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రాథమిక చర్చల్లో ఉన్నాయి. హైదరాబాద్‌లో డిస్నీల్యాండ్.. ప్రస్తుతం హైదరాబాద్‌లో వండర్లా, ఓషన్ వరల్డ్, మౌంట్ ఓపెరా వంటి అమ్యూజ్మెంట్ పార్క్‌లున్నాయి. ఏటా వీటిని 10 లక్షల మంది సందర్శిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొత్తగా నగరంలో యాడ్‌ల్యాబ్స్ ఇమాజికా, డిస్నీల్యాండ్ సంస్థలు థీమ్ పార్క్‌లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. రూ.25 వేల కోట్లతో 1,300 ఎకరాల్లో డిస్నీ థీమ్‌పార్క్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. స్థల సమీకరణ కోసం రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలను పరిశీలిస్తోంది. యాడ్‌ల్యాబ్స్ ఇమాజికా నగర శివారులో స్థల సమీకరణ కూడా పూర్తి చేసిందని.. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించనుందని తెలిసింది. భలే పార్క్‌లు, బోలెడన్ని రైడ్లు ⇔ వండర్లా హాలిడేస్ లిమిటెడ్‌కు కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్‌లో అమ్యూజ్మెంట్ పార్క్‌లున్నాయి. 35 ఎకరాల్లోని కొచ్చి పార్క్‌లో 58 రైడ్స్, 82 ఎకరాల్లోని బెంగళూరు పార్క్‌లో 62 రైడ్స్, 50 ఎకరాల్లోని హైదరాబాద్ పార్క్‌లో 43 రైడ్స్ ఉన్నాయి. ఏటా వీటిని 26 లక్షల మంది సందర్శిస్తున్నారు. ⇔ ఎస్సెల్ గ్రూప్ పాన్ ఇండియా పర్యాటన్ ప్రైవేట్ లిమిటెడ్ (పీఐపీపీఎల్) పేరుతో అమ్యూజ్మెంట్ పార్క్‌లను నిర్వహిస్తోంది. ఈ సంస్థకు ముంబైలో 64 ఎకరాల్లో ఎస్సెల్ వర ల్డ్, 22 ఎకరాల్లో వాటర్ కింగ్డమ్ థీమ్ పార్క్‌లున్నాయి. ఎస్సెల్ వరల్డ్‌లో 90 రైడ్స్ ఉన్నాయి. ఏటా 18 లక్షల మంది సందర్శిస్తున్నారు. వాటర్ కింగ్ డమ్‌లో 30 రైడ్స్ ఉన్నాయి. దీన్ని ఏటా 11 లక్షల మంది సందర్శిస్తున్నారు. ⇔ నిక్కో పార్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ (ఎన్పీఆర్ఎల్) కోల్‌కతాలో నికోపార్క్ను నిర్వహిస్తోంది. 40 ఎకరాల్లో ఉన్న ఈ పార్క్‌లో 35 రకాల రైడ్స్ ఉన్నాయి. ఏటా 15 లక్షల మంది విజిట్ చేస్తున్నారు. ⇔ మహారాష్ట్ర రాయ్‌ఘడ్‌లోని ఖోపొలి ప్రాంతంలో 300 ఎకరాల్లో యాడ్‌ల్యాబ్స్ ఇమాజికా థీమ్ పార్క్ ఉంది. ఇందులో థీమ్, వాటర్, స్నో పార్క్ మూడు కలిపి ఉండటం దీని ప్రత్యేకత. ఏటా ఈ పార్క్‌ను 12 లక్షల మంది సందర్శిస్తున్నారు. -
ఐదేళ్లలో 4 వండర్లా కొత్త పార్క్‌లు
⇒ రూ.350 కోట్లతో చెన్నైలో 56 ఎకరాల్లో ప్రారంభం ⇒ శరవేగంగా నిర్మాణ పనులు; రెండేళ్లలో అందుబాటులోకి ⇒ ఆ తర్వాత గోవా, మహారాష్ట్ర, గుజరాత్లో కూడా.. ⇒ ఏడాదిలో 6.2 లక్షలకు హైదరాబాద్ పార్క్ సందర్శకులు ⇒ వండర్లా హాలిడేస్ లిమిటెడ్ ఎండీ అరుణ్ కె చిట్టిలపిల్లి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమ్యూజ్మెంట్ పార్క్‌ల నిర్వహణలో ఉన్న వండర్లా దేశంలో వచ్చే ఐదేళ్లలో కొత్తగా 4 అమ్యూజ్మెంట్ పార్క్‌లను ఏర్పాటు చేయనుంది. ముందుగా రూ.350 కోట్ల పెట్టుబడులతో చెన్నైలో ప్రారంభించనుంది. పాత మహాబలిపురంలో రోడ్డులో 56 ఎకరాల్లో పార్క్‌ను నిర్మిస్తున్నామని, రెండేళ్లలో పార్క్‌ను అందుబాటులోకి వస్తుందని వండర్లా హాలిడేస్ లిమిటెడ్ ఎండీ అరుణ్ కె చిట్టిలపిల్లి తెలిపారు. ఆ తర్వాత గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో పార్క్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. మంగళవారమిక్కడ వండర్లా కొత్త లోగోను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 2018 ఆర్ధిక సంవత్సరంలో మార్కెటింగ్ కోసం రూ.26 కోట్లు కేటాయించామని ఇందులో భాగంగా కొత్త లోగోను డిజైన్ చేశామని చెప్పారు. ప్రస్తుతం కోచి, బెంగళూరు, హైదరాబాద్‌లో పార్క్లుండగా.. 26 లక్షల మంది సందర్శించారని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఇది 30 శాతం వృద్ధిని పేర్కొన్నారు. ‘‘హైదరాబాద్‌లో పార్క్‌ను ప్రారంభించి నేటితో ఏడాది. తొలి సంవత్సరంలో 6.2 లక్షల మంది సందర్శించారు. ఈ ఏడాది 8 లక్షలు, మూడేళ్లలో 10 లక్షల సందర్శకులు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ తర్వాతే హైదరాబాద్‌లోనూ రిసార్ట్ ఏర్పాటు యోచన చేస్తామని తెలియజేశారు. కొత్త కస్టమర్లనే కాకుండా పాత కస్టమర్లనూ అకర్షించేందుకు ప్రతి ఏటా రూ.30–40 కోట్ల పెట్టుబడులతో కొత్త కొత్త రైడ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇందులో భాగంగానే ఈ వేసవిలో హైదరాబాద్ పార్క్‌లో స్కై వీల్‌ను, సెప్టెంబర్‌లో ఫ్లై థీమ్ స్పేస్ థియేటర్‌ను, కోచిలో రోలర్ కోస్ట్, బెంగళూరులో ఫ్యామిలీ రైడ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వివరించారు. ఏపీలో పార్క్ ప్రాథమిక స్థాయిలోనే.. ఆంధ్రప్రదేశ్‌లో పార్క్ ఏర్పాటు ఒప్పందం గురించి ప్రశ్నించగా.. ‘‘రూ.350 కోట్ల పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్‌లో అమ్యూజ్మెంట్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. రెండేళ్ల క్రితమే ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాం. కానీ, అదింకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. స్థల ఎంపిక, రాయితీలపై స్పష్టత వచ్చాకే పార్క్ ఏర్పాటుపై ముందడుగేస్తామని ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు సమాధానమిచ్చారు. ప్రస్తుతం కోచి, బెంగళూరు, హైదరాబాద్‌లో పార్క్‌లున్నాయి. ఇప్పటివరకు 3 కోట్ల మంది సందర్శించారు. -
విహార స్థలంగా జవహర్ బాగ్!
మథుర: హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న మథురలోని జవహర్ బాగ్ ను విహారయాత్ర స్థలంగా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకున్న 270 ఎకరాల్లోని కొంత స్థలంలో అమూజ్మెంట్ పార్క్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జూన్ 2న జవహర్ బాగ్ లో కబ్జాదారులకు, పోలీసులకు మధ్య మథురలో జరిగిన యుద్ధంలో ఇద్దరు పోలీసు అధికారులతో సహా 24 మంది మృతి చెందారు. సీఎం అఖిలేశ్ యాదవ్ రెండు రోజుల క్రితం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ క్రమంలోనే పార్క్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన మొగ్గ తొడినట్టు తెలుస్తోంది. ముందుగా 100.22 ఎకరాల స్థలాన్ని ఉద్యాన శాఖ అప్పగించి పార్క్ అభివృద్ధి చేయాలని సర్కారు భావిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. పార్క్ డిజైన్ కోసం ప్రైవేటు ఆర్కిటెక్ ను బుధవారం ప్రభుత్వం సంప్రదించిందని తెలిపాయి. -
రెండేళ్లకు ఒక అమ్యూజ్మెంట్ పార్క్
♦ 50 లక్షల జనాభా ఉన్నచోట ఏర్పాటు ♦ ఏప్రిల్ నుంచి హైదరాబాద్ పార్క్ రెడీ ♦ కంపెనీ ఎండీ అరుణ్ చిట్టిలపిల్లి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమ్యూజ్మెంట్ పార్క్‌ల నిర్వహణలో ఉన్న వండర్లా హాలిడేస్ భారీగా విస్తరిస్తోంది. రెండేళ్లకు ఒక పార్క్‌ను నెలకొల్పాలన్నది సంస్థ లక్ష్యం. 50 లక్షల జనాభా ఉన్న నగరాల్లో ఏర్పాటు చేస్తామని వండర్లా ఎండీ అరుణ్ కె చిట్టిలపిల్లి మంగళవారమిక్కడ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. గుజరాత్‌తోపాటు మహారాష్ట్రలో 2018లోగా అడుగు పెడతామని చెప్పారు. చెన్నైలో 65 ఎకరాల్లో రూ.350 కోట్లతో భారీ పార్క్ మూడేళ్లలో సిద్ధమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలో పార్కు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు. ఒక్కో ప్రాజెక్టుకు రూ.250 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. బెంగళూరు, కొచ్చిలో విజయవంతంగా పార్క్‌లను నిర్వహిస్తున్న వండర్లా తాజాగా హైదరాబాద్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసింది. రిసార్టుల ఏర్పాటు.. వండర్లా హాలిడేస్ బెంగళూరులో రిసార్టును నిర్వహిస్తోంది. హైదరాబాద్ అమ్యూజ్మెంట్ పార్కు వద్ద ఇటువంటిది రెండేళ్లలో నెలకొల్పాలని సంస్థ కృతనిశ్చయంతో ఉంది. రిసార్టుకు రూ.50 కోట్ల దాకా వ్యయం అవుతుందని కంపెనీ అడ్మినిస్ట్రేషన్ డెరైక్టర్ ప్రియ జోసెఫ్ మీడియాకు తెలిపారు. ‘బెంగళూరు, కొచ్చి అమ్యూజ్మెంట్ పార్క్‌లకు ఏటా 25 లక్షల మంది సందర్శిస్తున్నారు. ఈ పార్కుల విస్తరణకు రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పార్కులో రైడ్స్ అన్నీ ఉచితమే. ఈ అంశమే అందరినీ ఆకట్టుకుంటోంది’ అని వివరించారు. హైదరాబాద్ పార్కుకు తొలి ఏడాది 7 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా. తద్వారా రూ.60 కోట్లు సమకూరతాయని సంస్థ భావిస్తోంది. ఏప్రిల్ నుంచి రెడీ.. హైదరాబాద్ పార్క్‌ను ఏప్రిల్ 2 నుంచి ప్రారంభిస్తున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు ఎక్సిట్ నంబరు 13 వద్ద 50 ఎకరాల్లో ఇది నెలకొంది. రూ.250 కోట్లు ఖర్చు చేశారు. 43 రకాల ల్యాండ్, వాటర్ ఆధారిత రైడ్స్ అలరించనున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఒకే రోజు 10,000 మందికి ఆతిథ్యం ఇచ్చే సామర్థ్యం ఉంది. టికెట్ ధర సాధారణ రోజుల్లో రూ.900, వారాంతాలు, పండుగలకు రూ.1,000 ఉండే అవకాశం ఉంది. పిల్లలకు ఎత్తునుబట్టి టికెట్ ధరలు ఉంటాయని వండర్లా సీఈవో దీపిందర్జిత్ సింగ్ సచ్‌దేవా తెలిపారు. దేశంలో మొదటిసారిగా రివర్స్ లూపింగ్ రోలర్ కోస్టర్ ఇక్కడ ఏర్పాటైంది. ఒక మెగావాట్ సౌర విద్యుత్ వ్యవస్థా నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో ఇది మొదటి అమ్యూజ్మెంట్ పార్క్. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో తక్కువ సమయంలో 15 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసినట్లు ప్రమోటర్లు తెలిపారు. -
ఏపీలో వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్
50 ఎకరాల్లో.. 250 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న వండర్లా హాలిడేస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్‌లోనూ అమ్యూజ్మెంట్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో అమ్యూజ్మెంట్ పార్క్, రిసార్ట్ రానుందని సంస్థ ఎండీ అరుణ్ కె. చిట్టిలపిళ్లి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నామని.. తొలి దశను 2019 నాటికి, రెండో దశను 2020 నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్ట్‌తో 700 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.