బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్‌లోనూ అమ్యూజ్‌మెంట్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది
50 ఎకరాల్లో.. 250 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్‌లోనూ అమ్యూజ్‌మెంట్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో అమ్యూజ్‌మెంట్ పార్క్, రిసార్ట్ రానుందని సంస్థ ఎండీ అరుణ్ కె. చిట్టిలపిళ్లి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నామని.. తొలి దశను 2019 నాటికి, రెండో దశను 2020 నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్ట్‌తో 700 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.