లండన్: దక్షిణ ఇంగ్లండ్‌లోని ఓ రోలర్ కోస్టర్‌లో ప్రయాణిస్తున్న కొంతమంది పర్యాటకులు ఆ క్యాబిన్ స్ట్రక్ అయిపోవడంతో తలకిందులుగా వేలాడుతూ ఉండిపోయారు. చాలా సేపటి తర్వాత ఆ అమ్యూజ్‌మెంట్ పార్క్ వారు రంగంలోకి దిగిన తర్వాత అందులోని వారిని సురక్షితంగా కిందకు దించడంతో పెనుప్రమాదం తప్పింది.
రోలర్ కోస్టర్ రైడ్ అంటే కొంతమందికి మహా సరదా. ఎత్తు పల్లాల్లో వేగంగా దూసుకుపోయే ఈ రైడ్‌లో ప్రయాణిస్తుంటే ప్రాణం గాల్లో తేలియాడుతూ మహదానందంగా ఉంటుంది. కానీ ఇదే రోలర్ కోస్టర్ రైడ్‌లో ఏదైనా అపశ్రుతి దొర్లితే జరిగే ప్రమాదం ఊహకు కూడా అందదు.
అచ్చంగా అలాంటి ప్రమాదానికే అంచుల వరకు వెళ్లి తప్పించుకున్నారు లండన్‌లోని ఓ రోలర్ కోస్టర్‌లో ప్రయాణిస్తున్నవారు. ఈ రోలర్ కోస్టర్ మొదలైనప్పుడు మొదట భూమికి లంబంగా పైకి వెళ్తుంది... ఇక అక్కడి నుండి కిందకి జారుకుంటూ రివ్వున దూసుకుపోతుంది. కానీ ఇది పైకి వెళ్తున్నప్పుడే భూమికి సుమారు 72 అడుగుల ఎత్తులో ఆగిపోయింది.
ఇందులో ఒకామె తన ఆరేళ్ళ కుమార్తెతో సహా ఇరుక్కుపోయింది. ఏం జరిగిందో అర్ధంకాక వారు బిక్కుబిక్కుమంటూ గుటకలు మింగుతూ ఉండిపోయారు. ఏదైనా జరగరానిది జరిగి పట్టుతప్పితే వారు కిందకి వచ్చేలోపే వారి ప్రాణాలు పైకి పోతాయి. అదృష్టవశాత్తు ఆ అమ్యూజ్‌మెంట్ పార్క్ సిబ్బంది సమయానికి స్పందించడంతో అందులో ఇరుక్కున్నవారిని సురక్షితంగా కిందకు దించారు.
ఇది కూడా చదవండి: మనసులు గెలుచుకున్న పారా కరాటే చాంపియన్
Comments
Please login to add a commentAdd a comment