roller coaster bridge
-
గాల్లో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. బిక్కుబిక్కుమంటూ పర్యాటకులు
లండన్: దక్షిణ ఇంగ్లండ్‌లోని ఓ రోలర్ కోస్టర్‌లో ప్రయాణిస్తున్న కొంతమంది పర్యాటకులు ఆ క్యాబిన్ స్ట్రక్ అయిపోవడంతో తలకిందులుగా వేలాడుతూ ఉండిపోయారు. చాలా సేపటి తర్వాత ఆ అమ్యూజ్మెంట్ పార్క్ వారు రంగంలోకి దిగిన తర్వాత అందులోని వారిని సురక్షితంగా కిందకు దించడంతో పెనుప్రమాదం తప్పింది. రోలర్ కోస్టర్ రైడ్ అంటే కొంతమందికి మహా సరదా. ఎత్తు పల్లాల్లో వేగంగా దూసుకుపోయే ఈ రైడ్‌లో ప్రయాణిస్తుంటే ప్రాణం గాల్లో తేలియాడుతూ మహదానందంగా ఉంటుంది. కానీ ఇదే రోలర్ కోస్టర్ రైడ్‌లో ఏదైనా అపశ్రుతి దొర్లితే జరిగే ప్రమాదం ఊహకు కూడా అందదు. అచ్చంగా అలాంటి ప్రమాదానికే అంచుల వరకు వెళ్లి తప్పించుకున్నారు లండన్‌లోని ఓ రోలర్ కోస్టర్‌లో ప్రయాణిస్తున్నవారు. ఈ రోలర్ కోస్టర్ మొదలైనప్పుడు మొదట భూమికి లంబంగా పైకి వెళ్తుంది... ఇక అక్కడి నుండి కిందకి జారుకుంటూ రివ్వున దూసుకుపోతుంది. కానీ ఇది పైకి వెళ్తున్నప్పుడే భూమికి సుమారు 72 అడుగుల ఎత్తులో ఆగిపోయింది. ఇందులో ఒకామె తన ఆరేళ్ళ కుమార్తెతో సహా ఇరుక్కుపోయింది. ఏం జరిగిందో అర్ధంకాక వారు బిక్కుబిక్కుమంటూ గుటకలు మింగుతూ ఉండిపోయారు. ఏదైనా జరగరానిది జరిగి పట్టుతప్పితే వారు కిందకి వచ్చేలోపే వారి ప్రాణాలు పైకి పోతాయి. అదృష్టవశాత్తు ఆ అమ్యూజ్మెంట్ పార్క్ సిబ్బంది సమయానికి స్పందించడంతో అందులో ఇరుక్కున్నవారిని సురక్షితంగా కిందకు దించారు. View this post on Instagram A post shared by @vedhamalhotra ఇది కూడా చదవండి: మనసులు గెలుచుకున్న పారా కరాటే చాంపియన్ -
Roller Coaster: తలకిందులుగా వేలాడుతూ.. 3 గంటలు నరకయాతన..
అమెరికా: అమెరికాలో ఒక అమ్యూజ్మెంట్ పార్కులో జనంతో ఉన్న ఒక రోలర్ కోస్టర్, రైడ్ జరుగుతుండగా సాంకేతిక లోపం తలెత్తి మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో ఉన్న వారు తలకిందులుగా వేలాడుతూ ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని దాదాపు 3 గంటలపాటు నరకయాతన చూశారు. చాలామందికి రోలర్ కోస్టర్ రైడ్ అంటే మహా సరదా. గాల్లో గింగిరాలు తిరుగుతూ చేసే ఈ స్వారీ సాగుతున్నంత సేపు మహదానందాన్ని మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అయితే ఇలాంటి ఒక రోలర్ కోస్టర్ రైడ్ లో ఏదైనా అపశ్రుతి దొర్లితే జరిగే నష్టాన్ని కూడా ఊహించలేము. ముఖ్యంగా యాంత్రికంగా ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు దేవుడిమీద భారం వేయడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. అచ్చంగా అలాంటి భయానకమైన సంఘటన ఒకటి అమెరికాలోని క్రాండన్ పార్క్ ఫారెస్ట్ కౌంటీ ఫెస్టివల్లో చోటు చేసుకుంది. రోలర్ కోస్టర్ రైడ్ జరుగుతుండగా సాంకేతిక సమస్య ఏర్పడటంతో కోచ్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో స్వారీ చేస్తున్నవారు తలకిందులుగా వేలాడుతూ ఊపిరిని బలంగా బిగపట్టి మూడు గంటలపాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆ క్షణంలో పరిస్థితి ఏమాత్రం పట్టు తప్పినా దారుణం జరిగుండేదని సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆగిపోయిన రోలర్ కోస్టర్ లో ఎనిమిది మంది ఉండగా అందులో ఏడుగురు చిన్నారులేనని సహాయక బృందం వెంటనే స్పందించి వారిని సురక్షితంగా కిందకు దించారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి తెలిపారు. మెకానికల్ సమస్య కారణంగానే రోలర్ కోచ్ మధ్యలో ఆగిపోయిందని.. విస్కాన్సిన్ బృందం ఇటీవలే ఇక్కడ తనిఖీలు కూడా చేశారని, అయినా ఇలా ఎందుకు జరిగిందో తెలియడంలేదని, ఇంతకు మించి మా వద్ద ఎటువంటి సమాచారం లేదని ఈ ఫెస్టివల్ నిర్వాహకులు తెలిపారు. Eight people hung upside down for about three hours, stuck in a roller coaster-like attraction. Emergency happened at a festival in American Wisconsin. Local media write that seven of the eight stranded are children. According to preliminary data, everyone got off with fright. pic.twitter.com/OP3Ow3syQZ — Sasha White (@rusashanews) July 4, 2023 ఇది కూడా చదవండి: టైటాన్ విషాదం: నా భర్త, బిడ్డ చివరి రోజులు తలచుకుంటే.. -
ఈ బ్రిడ్జి డిజైన్ చూస్తే కళ్లు చెదరాల్సిందే!
-
ఈ బ్రిడ్జి డిజైన్ చూస్తే కళ్లు చెదరాల్సిందే!
చైనా ఎంతైనా ఘటికురాలే. అందుకే 2022లో నిర్వహించనున్న వింటర్ ఒలింపిక్స్ కోసం భారీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా రోలార్ కోస్టర్ తరహాలో ఉండే భారీ నాటకీయ బ్రిడ్జీను నిర్మిస్తామని ఆ దేశానికి చెందిన ఓ నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది. బీజింగ్, దాని సమీపంలో ఉన్న జాంగ్జియాకౌ నగరాలను కలుపుతూ 1482 అడుగుల పొడవున్న వంతెనను నిర్మించేందుకు "పెండా' కంపెనీ ముందుకొచ్చింది. ఈ రెండు నగరాలు వింటర్ ఒలింపిక్స్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ వంతెన కోసం కళ్లు చెదిరే రీతిలో ఒలింపిక్స్ రింగులను తలపించేలా, డీఎన్ఏ కణాలను ప్రతిబింబించేలా డిజైన్ ను ఆ కంపెనీ ప్రభుత్వానికి సమర్పించింది. 278 అడుగుల వెడల్పుతో నిర్మించనున్న ఈ బ్రిడ్జికి సంబంధించిన కంప్యూటర్ ఇమేజ్ డిజైన్లను 'పెండా' కంపెనీ విడుదల చేసింది. భవిష్యత్తులో రానున్న అద్భుతమైన వంతెనలకు ఈ డిజైన్లు అద్దం పడుతున్నాయని పీపుల్స్ డైలీ ఆన్ లైన్ వీటిని ప్రచురించింది. అవి ఇవే..