ఈ బ్రిడ్జి డిజైన్ చూస్తే కళ్లు చెదరాల్సిందే! | Architecture firm designs futuristic roller coaster bridge for 2022 Winter Olympics | Sakshi
Sakshi News home page

ఈ బ్రిడ్జి డిజైన్ చూస్తే కళ్లు చెదరాల్సిందే!

Published Fri, Aug 12 2016 10:52 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

ఈ బ్రిడ్జి డిజైన్ చూస్తే కళ్లు చెదరాల్సిందే!

ఈ బ్రిడ్జి డిజైన్ చూస్తే కళ్లు చెదరాల్సిందే!

చైనా ఎంతైనా ఘటికురాలే. అందుకే 2022లో నిర్వహించనున్న వింటర్ ఒలింపిక్స్ కోసం భారీ సన్నాహాలు చేస్తోంది.

చైనా ఎంతైనా ఘటికురాలే. అందుకే 2022లో నిర్వహించనున్న వింటర్ ఒలింపిక్స్ కోసం భారీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా రోలార్ కోస్టర్ తరహాలో ఉండే భారీ నాటకీయ బ్రిడ్జీను నిర్మిస్తామని ఆ దేశానికి చెందిన ఓ నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది.

బీజింగ్, దాని సమీపంలో ఉన్న జాంగ్జియాకౌ నగరాలను కలుపుతూ 1482 అడుగుల పొడవున్న వంతెనను నిర్మించేందుకు "పెండా' కంపెనీ ముందుకొచ్చింది. ఈ రెండు నగరాలు వింటర్ ఒలింపిక్స్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ వంతెన కోసం కళ్లు చెదిరే రీతిలో ఒలింపిక్స్ రింగులను తలపించేలా, డీఎన్ఏ కణాలను ప్రతిబింబించేలా డిజైన్ ను ఆ కంపెనీ ప్రభుత్వానికి సమర్పించింది.

278 అడుగుల వెడల్పుతో నిర్మించనున్న ఈ బ్రిడ్జికి సంబంధించిన కంప్యూటర్ ఇమేజ్ డిజైన్లను 'పెండా' కంపెనీ విడుదల చేసింది. భవిష్యత్తులో రానున్న అద్భుతమైన వంతెనలకు ఈ డిజైన్లు అద్దం పడుతున్నాయని పీపుల్స్ డైలీ ఆన్ లైన్ వీటిని ప్రచురించింది. అవి ఇవే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement