లండన్: భారత అక్రమ వలసదారులకు ఇంగ్లాండ్‌లో ఎలాగోలా ఆశ్రయం కల్పించేందుకు బ్రిటీష్ లాయర్లలో కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. వీరంతా మాఫియాలా ఏర్పడి బాధితుల నుండి నగదు వసూలు చేసి బదులుగా ఖలిస్తానీలుగానూ, స్వలింగ సంపర్కులగానూ చెప్పి భారత్‌లో తమ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు కోర్టుకు చెప్పమని చెబుతున్నట్టు ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. ఓ స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రిటన్ ప్రధాని తీవ్రస్థాయిలో స్పందించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భారత్ నుంచి ఇంగ్లాండ్ వలసవచ్చే వారిలో ఎవరైనా సరైన డాక్యుమెంట్లు లేకుండా అక్కడ అడుగుపెట్టారా.. వారు అక్కడి లాయర్ల చేతికి చిక్కినట్లే. పడవల్లో వలస వచ్చే భారతీయులే ఈ లాయర్ల ప్రధాన లక్ష్యం. వీరికి ఇంగ్లాండ్‌లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే మతాంతర వివాహం చేసుకున్నామని, స్వలింగ సంపర్కులమని, ఖలిస్తానీ మద్దతుదారులమని చెప్పమంటున్నారు.
మీరు కోర్టుకి ఈ మాట చెబితే చాలు మీ ప్రాణానికి భారత్‌లో ప్రాణహాని ఉందని కోర్టుని నమ్మిస్తానని దీనికోసం 5500 యూరో పౌండ్లను సిద్ధం చేసుకోవాలని ఒక రిపోర్టర్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో లాయర్ చెబుతుండగా వీడియో తీశారు. ఈ వీడియో ప్రధాని రిషి సునాక్ కు చేరడంతో ఆయన ఈ వ్యవహారంపై చాలా సీరియస్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి కార్యకలాపాలకు మేమెప్పుడూ వ్యతిరేకమే. ప్రతిపక్ష లేబర్ పార్టీవారు, కొంతమంది లాయర్లు, క్రిమినల్ గ్యాంగులు వారి జేబులు నింపుకోవడం కోసం అక్రమ వలసదారులకు చట్టవ్యతిరేక మార్గంలో సహాయపడుతున్నారు. దీన్ని ఎలా ఆపాలో నాకు తెలుసనీ అన్నారు.
This is what we’re up against.
— Rishi Sunak (@RishiSunak) July 25, 2023
The Labour Party, a subset of lawyers, criminal gangs - they're all on the same side, propping up a system of exploitation that profits from getting people to the UK illegally.
I have a plan to stop it.
Here’s how 🧵https://t.co/ez3rYIU0uQ
ఇది కూడా చదవండి: ఏకాంతంగా బ్రతకాలనుకున్నారు.. చివరికి...
Comments
Please login to add a commentAdd a comment