1.5 Million Pound Sculpture at UK PM Rishi Sunak's Garden Sparks Row - Sakshi
Sakshi News home page

రిషి తోటలో రూ.12 కోట్ల శిల్పం.. వివాదాస్పదంగా ప్రధాని అధికార నివాసం

Published Mon, Nov 28 2022 6:05 AM | Last Updated on Mon, Nov 28 2022 10:27 AM

1. 5Million Pound Sculpture At UK PM Rishi Sunak Garden Sparks Row - Sakshi

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ లండన్‌లోని డౌనింగ్‌ స్ట్రీట్‌లోని తన అధికార నివాసం తోటలో దాదాపు రూ.12.83 కోట్ల విలువైన శిల్పాన్ని ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రముఖ శిల్పి హెన్రీ మూర్‌ రూపొందించిన ఈ శిల్పాన్ని గత నెలలో క్రిస్టీ సంస్థ నిర్వహించిన వేలంలో బ్రిటన్‌ ప్రభుత్వ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఒక వైపు దేశంలో జీవన వ్యయం పెరిగిపోయి, జనం కష్టాలు పడుతున్న వేళ పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్మును ఇలా ఖర్చు చేయడమేంటంటూ విమర్శలు చుట్టుముడుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement