sculpture
-
శిలాశాసనులు ఈ తండ్రీకొడుకులు
తెనాలి: శిలాశాసనులీ తండ్రీ కొడుకులు...వారసత్వంగా వస్తున్న శిల్పకళను ఏడుతరాలుగా కొనసాగిస్తున్న సృజనకారులు. ఫైబర్, కాంస్యం, ఐరన్‌స్క్రాప్, త్రీడీ విగ్రహాలతో తమ సృజనకు టెక్నాజలీని జోడిస్తున్నారు. వైవిధ్యమైన శిల్పాలను రూపొందిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని గడిస్తున్నారు. ఆ క్రమంలో భారత రాజ్యాంగ ఆమోద వజ్రోత్సవాల వేళ ‘భారతరత్న’ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలతో ప్రదర్శన ఏర్పాటుచేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌తో సహా పలు రికార్డుల సాధనకు ప్రయత్నిస్తున్నారు.తెనాలికి చెందిన సూర్య శిల్పశాల అధినేత కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు రవిచంద్ర, శ్రీహర్షలు శిల్పకళను కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. ఫైబర్, కాంస్య విగ్రహాలతో కాటూరి వెంకటేశ్వరరావు రాణిస్తుంటే, కోల్‌కతాలో ఫైనార్ట్స్‌లో పీజీ చేసిన కొడుకు రవిచంద్ర ఆ కళకు మరింత వన్నెలు తెస్తున్నారు. ఇనుప వ్యర్థ్యాలతో భారీ విగ్రహాలను తయారుచేస్తూ దేశవిదేశీయులను ఆకర్షిస్తున్నారు. అతడి సోదరుడు శ్రీహర్ష త్రీడీ టెక్నాలజీలో అతి సూక్ష్మ విగ్రహాల్నుంచి భారీ విగ్రహాల వరకు తీర్చిదిద్దుతున్నారు. వీరి విగ్రహాలు దేశంలోని అనేక నగరాల్లో ప్రతిష్టకు నోచుకోవటమే కాకుండా, విదేశాల్లోనూ కొలువుదీరాయి. తమ విగ్రహాలతో తెనాలిలో కాటూరి ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటుచేసి, తమ కళానైపుణ్యాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నారు.ప్రస్తుతం భారత రాజ్యాంగ ఆమోద వజ్రోత్సవాలను దేశమంతటా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలతో ప్రదర్శన నిర్వహించాలని తలపోశారు. అనుకున్నదే తడవుగా గత కొద్దినెలలుగా తీవ్రంగా శ్రమించారు. యాభై విగ్రహాలతో కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనను బుధవారం సాయంత్రం ఏర్పాటుచేశారు. ఫైబర్, కాంస్య విగ్రహాలు రకరకాల సైజుల్లో ఇందులో కొలువుదీర్చారు. అడుగు ఎత్తు నుంచి 30 అడుగు ఎత్తు వరకు అంబేడ్కర్ విగ్రహాలను ఇందులో చేర్చారు. వీటిలో అడుగు ఎత్తులో ఉన్న బస్ట్ సైజువి త్రీడీ టెక్నాలజీతో రూపొందించారు. వీటితోపాటు కుర్చీలో కూర్చున్న భంగిమ నుంచి నిలుచున్న విగ్రహాలూ రకరకాల సైజుల్లో ఈ ప్రదర్శనలో చోటుచేసుకుని చూపరులను ఆకర్షిస్తున్నాయి. తమ శిల్పకళా నైపుణ్యానికి కాటూరి శిల్పకారులు అభినందనలు అందుకుంటున్నారు.సూర్య శిల్పశాలతో విగ్రహాల రూపకల్పనలో కొనసాగుతున్న కాంటూరి వెంకటేశ్వరరావు ఆ వంశంలో ఆరోతరం వారు. ఏడోతరానికి చెందిన ఆయన ఇద్దరు కుమారులూ, వారసత్వంగా వస్తున్న శిల్పకళనే వృత్తిగా చేసుకోవటం విశేషం! వెంకటేశ్వరరావు తాత చంద్రయ్య సిమెంటు విగ్రహాలు, దేవాలయాల నిర్మాణం, దేవతా విగ్రహాలను తయారుచేసేవారు. తండ్రి కోటేశ్వరరావు రాజకీయ నేతల విగ్రహాలను కేవలం సిమెంటుతోనే చేసేవారు. వెంకటేశ్వరరావు ఆ విగ్రహాలతోనే ఆరంభించి, తన సృజనతో ఫైబర్, కాంస్య విగ్రహాల తయారీని ఆరంభించారు. కొడుకులు అందివచ్చాక నైపుణ్యం పెరిగింది. ఐరన్‌స్క్రాప్ వ్యర్థాలతో భారీ విగ్రహాలను తయారుచేస్తూ రవిచంద్ర, త్రీడీ టెక్నాజీలతో శ్రీహర్షలు తమ శిల్పకళకు ఆధునిక హంగులు అద్దారు. అంతర్జాతీయ గుర్తింపును సాధిస్తున్నారు. తాజా ప్రదర్శనలో ఉంచిన శిల్పాల్లో అధికశాతం హ్యాండ్వర్క్తోనే చేశారు. ఇందుకోసం 50 మందికిపైగా వర్కర్లతో 5–6 నెలలుగా కృషిచేసినట్టు చెబుతున్నారు.గిన్నిస్ బుక్ రికార్డు కోసం...– కాటూరి వెంకటేశ్వరరావు, శిల్పకారుడుశిల్పకళలో తెనాలి ఖ్యాతిని ఇనుమడింపజేయటం...గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాలనే ప్రయత్నంతోనే ఈ ప్రదర్శన ఆరంభించాం. వీడియోలు, ఫొటోలు పంపాం. పరిశీలిస్తున్నట్టు సమాచారం పంపారు. అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ ఆఫ్ రికార్డ్స్ వారు తమ సంసిద్ధతను తెలియజేశారు. త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాం. -
విలువ తెలియక డోర్‌స్టాప్‌గా వాడేశారు.. ఆ పాలరాతి శిల్పం ఖరీదు 27 కోట్లు!
హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన నిజాం ప్రభువు మహబూబ్ అలీఖాన్ గతంలో కొనుగోలుచేసి దురదృష్టంగా భావించి షూలోపల పడేసిన ప్రపంచ ప్రఖ్యాత జాకబ్ వజ్రాన్ని ఆయన కుమారుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ చాన్నాళ్లు తన టేబుల్‌పై పేపర్‌వెయిట్‌గా వాడారని చరిత్ర చెబుతోంది. అది వందల కోట్ల విలువచేస్తుందని ఆయన తెలీదు. అచ్చం అలాగే కోట్లుపలికే పాలరాతి ప్రతిమను చాలా సంవత్సరాలపాటు బ్రిటన్‌లో ఒక పారిశ్రామికవాడలోని షెడ్డు తలుపు మూసుకుపోకుండా అడ్డుగా వాడారు. చివరకు అది ప్రముఖ శిల్పకారుడు ఎడ్మీ బౌచర్డన్ చెక్కిన అద్భుత ప్రతిమ అని తెల్సి ఇప్పుడు ఔత్సాహిక కుబేరుడు కోట్లు పెట్టి కొనేందుకు ముందుకొస్తున్నారు. ఒకాయన ఏకంగా రూ.27 కోట్లు చెల్లించేందుకు సుముఖత చూపడంతో ఈ శిల్పం కథాకమామిషు తెల్సుకునేందుకు అంతా గూగుల్ తల్లి వద్ద సెర్చింగ్లు మొదలుపెట్టారు. ఫ్రాన్స్‌కు చెందిన 15వ లూయిస్ రాజు వద్ద ఆస్థాన శిల్పకారుడైన ఎడ్మీ చౌడర్డన్ 18వ శతాబ్దంలో ఈ ప్రతిమను చెక్కారు. బ్రిటన్‌లో భాగమైన స్కాట్లాండ్లోని హైల్యాండ్స్ కౌన్సిల్ ప్రాంతంలో ఆనాటి భూస్వామి, రాజకీయనాయకుడు జాన్ గార్డన్.. ఎడ్మీతో తన స్వీయ ప్రతిమను చెక్కించుకున్నాడు. తర్వాతి కాలంలో ఆయన ఈ ప్రాంతంలో ఇన్వర్గార్డన్ పట్టణానికి రూపకల్పనచేశారు. తర్వాత 19వ శతాబ్దంలో ఒక కోట తగలబడిన ఘటనలోనూ ఇది చెక్కుచెదరలేదు. ఆ సంఘటన తర్వాత 1930వ సంవత్సరంలో అదే ఇన్వర్గార్డన్ పట్టణ కౌన్సిల్ కేవలం ఐదు పౌండ్లకు కొనుగోలుచేసింది. అయితే తర్వాత అది అదృశ్యమైంది. కేవలం ఐదు పౌండ్ల విలువచేసే శిల్పం ఎక్కడో శిథిలమై ఉంటుందని కౌన్సిల్ సభ్యులు భావించారు. అంతా దానిని మర్చిపోయారు.దశాబ్దాల తర్వాత అంటే 1998లో హైల్యాండ్స్ పారిశ్రామికవాడలోని కర్మాగారం గేటు వద్ద దానిని కౌన్సిల్సభ్యురాలు మాక్సిన్ స్మిత్ చూశారు. తలుపు మూసుకుపోకుండా అప్పుడు అడ్డుగా దానిని వాడుతున్నారు. మిలమిల మెరిసిపోతున్న ఈ ప్రతిమకు ఏదో ప్రత్యేకత ఉండి ఉంటుందని భావించి దానిని హైల్యాండ్ కౌన్సిల్ స్థానిక ప్రభుత్వానికి అప్పజెప్పారు. ప్రభుత్వాధికారులు దానిని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు. తర్వాత దానిని పారిస్ నగరంలోని ‘ది లారీస్’, లాస్ఏంజిల్స్లోని ‘ది గెట్టీ మ్యూజియం’లోనూ ప్రదర్శించారు. ఆనోటా ఈనోట విన్నాక అది ప్రఖ్యాత శిల్పకారుడు చెక్కిన శిల్పమని స్పష్టమైంది. అరుదైనదికావడంతో అది చాలా విలువైనదని గ్రహించి దానిని స్థానిక ప్రభుత్వం అపహరణకు గురికాకుండా లోపల భద్రపరిచింది.సహాయక నిధుల కోసం వేలానికి.. విలువైన వస్తువును దగ్గర పెట్టుకోవడం కంటే దానిని విక్రయిస్తే వచ్చే సొమ్ముతో స్థానికుల సంక్షేమ పథకాలను అమలుచేయొచ్చని స్థానిక ప్రభుత్వం భావించింది. అమ్మడానికి సిద్ధమైంది. వచ్చే నిధులను ఇన్వర్గార్డన్ కామన్‌గుడ్ ఫండ్ కింద ఖర్చుచేస్తామని చాటింపు వేయించింది. చారిత్రక వస్తువును సొంత ఆస్తిగా భావించి వేలం ఎలా వేస్తారని కొందరు కోర్టుకెక్కారు. దీనిపై హైల్యాండ్స్ టెయిన్ షరీఫ్ కోర్టు తాజాగా తీర్పు చెప్పింది. అది వారసత్వ ఆస్తి కాదని తేల్చిచెప్పింది. చదవండి: వెదురుగొట్టం తూనీగ.. పశ్చిమ కనుమల్లో సరికొత్త జాతిఈలోపే గత ఏడాది అక్టోబర్‌లోనే దానిని రూ.27 కోట్లకు కొంటానని ఒక కుబేరుడు ఆసక్తి చూపించారు. తాజాగా కోర్టు తీర్పుతో ప్రతిమ వేలానికి రంగం సిద్ధమైంది. నవంబర్ ఏడోతేదీన తొలిసారిగా వేలానికి పెట్టారు. రోజు రోజుకూ దీనికి బిడ్డింగ్ ధర పెరుగుతోంది. విషయం తెల్సుకున్న ఆనాటి కౌన్సిల్సభ్యురాలు మాక్సిన్ స్మిత్ మీడియాతో మాట్లాడారు. ‘‘నువ్వు తొలిసారి చూసినప్పుడే దానిని మూడో కంటికి తెలీకుండా ఇంటికి పట్టుకుపోతే బాగుండేది. కోటీశ్వరురాలివి అయ్యేదానివి అని నా స్నేహితులు ఇప్పటికీ నన్ను ఆటపట్టిస్తారు’’అని ఆమె అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కోల్‌కతా బాధితురాలి విగ్రహావిష్కరణ.. సోషల్ మీడియాలో చర్చ
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే తాజాగా బాధితురాలికి సంబంధించిన విగ్రహం ఆవిష్కరణపై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హత్యాచార సమయంలో ఆమె అనుభవించిన బాధను ప్రతిబింబించేలా విగ్రహాన్ని అసిత్ సైన్ అనే శిల్పి రూపొందించటం గమనార్హం. ఆ విగ్రహానికి ‘క్రై ఆఫ్ ది అవర్’గా నామకరణం చేశారు. బాధితురాలి విగ్రహాన్ని ప్రిన్సిపల్ ఆఫీసుకు సమీపంలోని పీజీబీ గార్డెన్ ఎదుట ఆవిష్కరించారు.#justiceforAbhya "Cry of the Hour""The Agony, the Pain, the Suffering...A poignant depiction of the unbearable trauma Abhaya enduredToday A #statue erected in memory of the rape and murder victim at R.G. Kar Medical College and Hospital"#MedTwitter #medX #rgkarprotest pic.twitter.com/Pek84iAsNj— Indian Doctor🇮🇳 (@Indian__doctor) October 2, 2024 ‘‘బాధితురాలి విగ్రహం ఆవిష్కరించటం చాలా భావోద్వేగంతో కూడుకున్న విషయం. ఆమె మా సహోద్యోగి. మేము ఆమె కోసం పోరాడుతున్నాం. ఆమె మన హృదయంలో ఉంది. విగ్రహ ఏర్పాటు ద్వారా ఆమెను ఎవరూ మరచిపోరు’ అని జూనియార్ డాక్టర్ అన్నారు.‘‘ ఈ విగ్రహం బాధితురాలిది కాదు, ఆమె అనుభవించిన బాధ, హింస, ఆమె కోసం కొనసాగుతున్న నిరసనలకు ప్రతీక’’ అని మరో జూనియర్ డాక్టర్ పేర్కొన్నారు.అయితే ఈ విగ్రహం మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినప్పటికీ.. తయారు చేసిన విధానం అగౌరవంగా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ‘‘ అత్యాచార బాధితురాలి ఆధారంగా ఇలాంటి విగ్రహాన్ని ఎందుకు సృష్టించారు’’, ‘‘ ఇది మంచి ఆలోచన అని ఎవరు భావించారు? దీన్ని ఎవరు ఆమోదించారు?’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘‘ అగౌరవ పరిచేవిధంగా ఏం లేదు. కొందరు భారతీయ స్త్రీలను కూడా గర్వంగా గుర్తుంచుకోలేరు’’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన జూనియర్ డాక్టర్ల నిరసన కొనసాగుతోంది. ప్రభుత్వం ఈ ఘటనపై నిర్ణయాత్మకంగా వ్యవహరించే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు తేల్చిచెబుతున్నారు.చదవండి: కోల్‌కతా ఘటన.. సీబీఐ విచారణకు టీఎంసీ ఎమ్మెల్యే -
Niyamat Mehta: శిల్పకళకు తను ఒక ‘మెరుపుల మెరాకీ’
నియమత్ మెహతా దిల్లీలో ఏర్పాటు చేసిన ఫస్ట్ సోలో ఎగ్జిబిషన్ ‘మెరాకీ’కి మంచి స్పందన లభించింది. ‘మెరాకీ’ అనేది గ్రీకు పదం. దీని అర్థం మనసుతో చేయడం. ఈ ఎగ్జిబిషన్‌లోని 27 బ్రాంజ్, హైడ్రో రెసిన్ స్కల్ప్చర్లు కళాప్రియులను ఆకట్టుకున్నాయి. మన పౌరాణికాల నుంచి సాల్వడార్ డాలీ, లియోనార్డో డావిన్సీ, లియోనోరా కారింగ్టన్, ఎంఎఫ్ హుసేన్లాంటి మాస్టర్ల కళాఖండాల వరకు స్ఫూర్తి పొంది ఈ శిల్పాలకు రూపకల్పన చేసింది మెహతా. బీథోవెన్ సంగీతం, లార్డ్ బైరన్ పదాల ప్రభావం మెహతా శిల్పకళపై కనిపిస్తుంది. లండన్ నుంచి రోమ్ వరకు తాను చూసిన, పరవశించిన ఎన్నో ఆర్ట్ షోల ప్రభావం ఆమె కళాత్మక ప్రయాణాన్ని ప్రకాశవంతం చేశాయి. ఒక చిన్న శిల్పం తయారుచేయడానికి నెల అంతకుమించి సమయం తీసుకుంటుంది. ఎగ్జిబిషన్లో అత్యంత ఆకర్షణీయమైన ‘మిస్టర్ సినాట్రా’ శిల్పం రూపొందించడానికి ఆమెకు ఎనిమిది వారాలు పట్టింది. ఎరుపు రంగు జాకెట్‌తో కనిపించే ఈ శిల్పం పాత కాలం బ్రిటిష్ పబ్ నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వచ్చిన వ్యక్తిలా కనిపిస్తుంది. ‘మన దేశంలో శిల్పకళకు అత్యంత ఆదరణ ఉంది’ అంటున్న నియమత్ శిల్పకళపై ఆసక్తి ఉన్నవారికి సలహాల రూపంలో తనవంతుగా సహాయం చేస్తోంది. View this post on Instagram A post shared by Niyamat Mehta (@niyamat_mehta) -
Ram Mandir: ‘ భూమ్మీద అత్యంత అదృష్టవంతుడను నేనే’
అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. సర్వాంగ సుందరంగా, నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగింది. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో మహా గంభీరంగా ప్రాణప్రతిష్ట క్రతువు నిర్వహించారు. రామ్ లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ట కర్తగా వ్యవహరించారు. ప్రాణప్రతిష్ట చేసిన బాల రాముడి విగ్రహం జీవకళ ఉట్టిపడుతోంది. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ సుందరంగా చెక్కిన విషయం తెలిసిందే. సోమవారం అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న అరుణ్ యోగిరాజ్ మీడియాతో మాట్లాడారు. ‘నేను ఈ భూమి మీద ఉన్న అదృష్టమైన వ్యక్తిగా భావిస్తున్నాను. భగవాన్ శ్రీ రామ్ లల్లా, మా పూర్వికులు, కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు ఎల్లప్పడూ నాతో ఉంటాయి. ఇప్పటికీ నాకు ఊహాలోకంలో ఉన్నట్లు అనిపిస్తోంది’ అని యోగిరాజ్ పేర్కొన్నారు. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించే రాముని విగ్రహాన్ని ఎంపిక చేయడానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సమావేశంలో ఓటింగ్ నిర్వహించి విషయం తెలిసిందే. ప్రత్యేక శిల్పులు రూపొందించిన మూడు నమూనాల్లో ఒక విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఇందులో యోగి రాజు చెక్కిన బాలరాముని శ్యామవర్ణ విగ్రహం ఎక్కువ ఓట్లు పొందిన అత్యుత్తమ విగ్రహంగా నిలిచింది. రామ్ లల్లా విగ్రహ విశేషాలు.. ► అయోధ్య రామాలయంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ► నల్లరాతిపై చెక్కిన బాల రాముడి ప్రతిమ. నీలమేఘ శ్యాముడంటూ రామాయణంలోని వర్ణనకు అనుగుణంగా ఈ రాతిని ఎంచుకున్నారు. ► రామ్‌లల్లాను చెక్కిన శిల బరువు దాదాపు 200 కిలోలు. ► ఐదేళ్ల బాలుడి రూపంలో రామ్‌లల్లా విగ్రహాన్ని రూపొందించారు. ► ఓ చేతిలో బాణం పట్టుకుని, మరో చేతితో ఆశీర్వాదం ఇస్తున్న రూపంలో విగ్రహాన్ని మలిచారు. ► స్వచ్ఛమైన బంగారంతో విల్లంబులు తయారుచేసి బాల రాముడి చేతిలో అలంకరించారు. ► శ్రీరామ నవమి రోజున గర్భగుడిలో సూర్య కిరణాలు పడేలా ఏర్పాట్లు ► శ్రీరాముడికి సూర్య తిలకంలో కిరణాలు పడేలా ఏర్పాట్లు చదవండి: Ayodhya Ram Mandir: భావోద్వేగానికి లోనైన దిగ్గజ నేతలు -
అయోధ్యలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే!
అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న కొలువుదీరనున్న రాముని విగ్రహం ఖరారయ్యింది. కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌లో ఇలా రాశారు.. ‘రాముడు ఎక్కడ ఉంటాడో, అక్కడ హనుమంతుడు ఉంటాడు. అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠాపన కోసం విగ్రహాన్ని ఎంపిక చేశారు. మన దేశపు ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన రాముని విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్నారు. రాముడు, హనుమంతునికి మధ్యనున్న అవినాభావ సంబంధానికి ఇది మరొక ఉదాహరణ. హనుమంతుని జన్మభూమి అయిన కర్ణాటక నుంచే శ్రీరామునికి సేవా కార్యం జరిగినదనడంలో సందేహం లేదు’ అని పేర్కొన్నారు. అయోధ్య రామాలయ ట్రస్ట్ నేపాల్‌లోని గండకీ నదితో పాటు కర్ణాటక, రాజస్థాన్, ఒరిస్సా నుండి శ్రీరాముని విగ్రహ రూపకల్పనకు మొత్తం 12 నాణ్యమైన రాళ్లను సేకరించింది. ఈ రాళ్లన్నింటినీ పరీక్షించగా కేవలం రాజస్థాన్, కర్ణాటక రాళ్లే విగ్రహాల తయారీకి అనువుగా ఉన్నట్లు గుర్తించారు. కర్ణాటకలో లభించిన శ్యామ శిల, రాజస్థాన్‌లోని మక్రానాకు చెందిన మార్బుల్ రాక్లను ఎంపిక చేశారు. మక్రానా రాయి ఎంతో విశిష్టమైనది. అలాగే కర్నాటకలోని శ్యామ శిల.. శిల్పాలు చెక్కేందుకు అనువుగా ఉంటుంది. ఈ రాళ్ళు నీటి నిరోధకతను కలిగి ఉంటాయి. సుదీర్ఘ జీవితకాలాన్ని కూడా కలిగి ఉంటాయి. ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ శిల్పి కుమారుడు అరుణ్ యోగిరాజ్(37) ఎంబీఏ పూర్తిచేశారు. ఇతను యోగిరాజ్ కుటుంబంలో ఐదో తరం శిల్పి. అరుణ్ యోగిరాజ్ 2008లో ఉద్యోగం మానేసి, పూర్తిస్థాయి శిల్పకారునిగా మారారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అరుణ్ యోగిరాజ్.. మహారాజా జయచామరాజేంద్ర వడయార్‌తో సహా అనేక ప్రముఖుల విగ్రహాలను తయారు చేశారు. కేదార్‌నాథ్‌లో స్థాపించిన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని రూపొందించారు. అలాగే మైసూరులో మహారాజా శ్రీకృష్ణరాజ వడయార్-IV, స్వామి రామకృష్ణ పరమహంస పాలరాతి విగ్రహం మొదలైనవి తీర్చిదిద్దారు. ఇండియా గేట్ దగ్గర కనిపించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం కూడా అరుణ్ యోగిరాజ్ రూపొందించినదే! "ಎಲ್ಲಿ ರಾಮನೋ ಅಲ್ಲಿ ಹನುಮನು" ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಶ್ರೀರಾಮನ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಕಾರ್ಯಕ್ಕೆ ವಿಗ್ರಹ ಆಯ್ಕೆ ಅಂತಿಮಗೊಂಡಿದೆ. ನಮ್ಮ ನಾಡಿನ ಹೆಸರಾಂತ ಶಿಲ್ಪಿ ನಮ್ಮ ಹೆಮ್ಮೆಯ ಶ್ರೀ @yogiraj_arun ಅವರು ಕೆತ್ತಿರುವ ಶ್ರೀರಾಮನ ವಿಗ್ರಹ ಪುಣ್ಯಭೂಮಿ ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಗೊಳ್ಳಲಿದೆ. ರಾಮ ಹನುಮರ ಅವಿನಾಭಾವ ಸಂಬಂಧಕ್ಕೆ ಇದು… pic.twitter.com/VQdxAbQw3Q — Pralhad Joshi (@JoshiPralhad) January 1, 2024 -
కళలతో కోట్లు.. వీరి టర్నోవర్ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..!
రామ్ వి సుతార్ తరహాలో గొప్ప పేరు సంపాదించుకున్న శిల్పకారులు మనదేశంలో చాలామంది ఉన్నారు. వీరు విదేశాలలో కూడా పేరు సంపాదించారు. వీరిలో శిల్పి అనీష్ కపూర్ ఒకరు. వీరి కళాఖండాలు విదేశాలలో కూడా విపరీతంగా అమ్ముడుపోతుంటాయి. తాజా నివేదికల ప్రకారం ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న అనీష్ కపూర్ అత్యధిక ఆదాయం పొందుతున్న భారతీయ శిల్పకారునిగా గుర్తింపు పొందారు. అతని టర్నోవర్ అతని విజయ గాథను తెలియజేస్తుంది. హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఇండియా ఆర్ట్ లిస్ట్ 2023 ప్రకారం 69 ఏళ్ల అనీష్ కపూర్ భారతదేశంలోని అత్యంత విజయవంతమైన 50 మంది శిల్పకళా కళాకారుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అనీష్ టర్నోవర్ ఏడాదికి రూ. 91 కోట్లుగా ఉందని పలు రిపోర్టులు తెలియజేస్తున్నాయి. అత్యధిక ఆదాయం సంపాదిస్తున్నామని చెప్పుకునే నటీనటులకు మించి అనీష్ ఆదాయం ఉంది. అగ్రస్థానంలో అనీష్ కపూర్ లండన్‌లో నివసిస్తున్న అనీష్ కపూర్ శిల్ప హస్తకళాకారునిగా సక్సెస్ అయ్యారు. అతని కళాఖండాలలో ఒకటి 9.27 కోట్ల రూపాయలకు అమ్ముడు పోవడమే దీనికి ఉదాహరణగా నిలిచింది. ఖరీదైన ఆర్ట్‌వర్క్‌ల కారణంగా భారత్ వరుసగా ఐదవ సంవత్సరం కూడా ఆర్ట్ జాబితాలో అగ్రస్థానంలో ఉందని తాజా రిపోర్టు తెలియజేస్తోంది. జులై 31న విడుదల చేసిన ఈ జాబితాను వేలంలో విక్రయించిన కళాఖండాల ఆధారంగా తయారు చేశారు. ఈ జాబితా ప్రకారం భారతదేశపు ప్రఖ్యాత పెయింటర్ అర్పితా సింగ్ రూపొందించిన ఒక కళాఖండం 24.71 కోట్ల రూపాయల టర్నోవర్‌తో 11.32 కోట్ల రూపాయలకు విక్రయమయ్యింది. అనీష్ కపూర్ తర్వాత ఆమె రెండో స్థానంలో నిలిచింది. హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఇండియా ఆర్ట్ లిస్ట్ 2023 ప్రకారం భారతీయ చిత్రకారుడు జోగెన్ చౌదరి మూడవ స్థానంలో ఉన్నారు. కళాకారుడి మొత్తం టర్నోవర్ రూ.19.76 కోట్లు. అతను రూపొందించిన ఏడు అత్యంత ఖరీదైన కళాఖండాలు రూ.4.40 కోట్లకు వేలం వేశారు. అదే విధంగా కళాకారుడు గులాం మహ్మద్ షేక్ టర్నోవర్ రూ.17.88 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. ముంబైకి చెందిన అనీష్ కపూర్ 1972లో బ్రిటన్‌కు వెళ్లారు. అతను చక్కటి కళాఖండాలను రూపొందించడంలో నైపుణ్యం సాధించారు. బ్రిటన్‌లోని టేట్ మోడరన్ టర్బైన్ హాల్‌తో పాటు, చికాగోలోని మిలీనియం పార్క్‌లో కూడా అనిష్ రూపొందించిన శిల్పాలు కనిపిస్తాయి 2018-19 సంవత్సరంలో అనీష్ కపూర్ టర్నోవర్ రూ. 168.25 కోట్లు. 1991 సంవత్సరంలో అనీష్‌కు టర్నర్ ప్రైజ్ లభించింది. ఇది కూడా చదవండి: నకిలీ టీచర్లకు ప్రమోషన్లు.. దర్జాగా విద్యార్థులకు పాఠాలు.. 14 ఏళ్ల ముసుగు తొలగిందిలా! -
తిరుమలలో శిల్పకళా ప్రదర్శనను ప్రారంభించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి
-
అతిపెద్ద హాకీ స్టిక్ సైకత శిల్పంగా ప్రపంచ రికార్డు
దేశంలో పురుషుల హాకీ ప్రపంచకప్ జరుగుతున్నందున ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ అతిపెద్ద సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ మేరకు ఆయన అతి పెద్ధ హాకీ స్టిక్ రూపంలో సైకత శిల్పాన్ని రూపొందించారు. దీన్ని లాభాప్రేక్షలేని సంస్థ వరల్డ్ రికార్డ్స్ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద సైకత హాకీ స్టిక్‌గా గుర్తించింది. ఒడిశాలో కటక్‌లోని మహానది ఒడ్డున సుమారు 5 వేల హాకీ బంతులతో 105 అడుగుల పొడవైన సైకత శిల్పాన్ని పట్నాయక్ రూపొందించారు. ఈ క్రమంలో పట్నాయక్ మాట్లాడుతూ..వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా నుంచి ఈ సర్టిఫికేట్ పొందడం చాలా సంతోషంగా ఉంది. (చదవండి: ప్రయాణికుడు చేసిన తప్పిదం..విమానం టేకాఫ్‌కు ముందే..) -
పైగా టూంబ్స్కు అమెరికా సాయం
సంతోష్ నగర్ (హైదరాబాద్): భవిష్యత్తు తరాల కోసం అమూల్యమైన శిల్ప సంపదను పరిరక్షించాలని అమెరికా చార్జ్ డి అఫైర్స్ ఎలిజబెత్ జోన్స్ చెప్పారు. మంగళవారం ఆమె అమెరికా కాన్సుల్ జెన్నిఫర్ లార్సెన్తో కలిసి సంతోష్ నగర్ ఒవైసీనగర్ కాలనీలోని పైగా టూంబ్స్ (సమాధి)ను సందర్శించారు. 18, 19వ శతాబ్దాల్లో నిర్మించిన పైగా సమాధుల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగమైనందుకు తాము గరి్వస్తున్నామని ఎలిజబెత్ చెప్పారు. ఆరుకు పైగా సమా«ధుల పరిరక్షణ, పునరుద్ధరణకు కోసం అమెరికా ‘అంబాసిడర్స్ ఫండ్స్ ఫర్ కల్చరల్ ప్రిజర్వేషన్ (ఏఎఫ్‌సీపీ)’రూ.2.04 కోట్ల సాయం చేసిందని ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చరల్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రతీష్ నందా తెలిపారు. ఈ ప్రాజెక్టును ఆగాఖాన్ ట్రస్ట్ అమలు చేస్తోందన్నారు. ఇది హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ ద్వారా నిధులు సమకూర్చిన ఐదో ప్రాజెక్టని కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్ చెప్పారు. హైదరాబాద్‌లో కుతుబ్‌షాహీ టూంబ్స్ వద్ద తమ ఏఎఫ్‌సీపీ ప్రాజెక్టుల్లో ఒకదాన్ని ప్రారంభించే అదృష్టం తనకు దక్కిందన్నారు. -
Akunuru Balaji Varaprasad: శాండ్ ఆర్టిస్ట్‌గా అంతర్జాతీయ ఖ్యాతి
సాక్షి, అమరావతి: ఇసుక రేణువులను మునివేళ్లతో తాకుతూ.. అద్భుత శిల్పాలు చెక్కుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు ఏలూరు జిల్లా కైకలూరు మండలం పల్లెవాడకు చెందిన ఆకునూరు బాలాజీ వరప్రసాద్. ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు ఒడిశాలోని కోణార్క్ చంద్రభాగా బీచ్‌లో జరుగుతున్న ‘అంతర్జాతీయ సైకత శిల్పకళోత్సవం –2022’ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొంటున్నాడు. చిత్రకళా పోటీల్లో చిన్ననాటి నుంచే అనేక బహుమతులు అందుకున్న బాలాజీ ఆ కళపై ఆసక్తి పెంచుకున్నాడు. డిగ్రీ చదివే రోజుల్లో సముద్ర తీరంలో స్నేహితులతో కలిసి ఇసుకతో ‘మత్స్య సుందరి’ పేరిట సైకత శిల్పాన్ని రూపొందించడం, అది పత్రికల్లో ప్రచురణ కావడంతో శాండ్ ఆర్ట్‌పైకి దృష్టి మరల్చాడు. ఎంతో సాధన చేసి సైకత శిల్పిగా, పోర్ర్‌టైట్ ఆర్టిస్ట్‌గా, స్పీడ్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు. సైకత కథలకు విశేష స్పందన భారతీయ ఇసుక శిల్పిగా, యానిమేషన్, కథకుడిగా బాలాజీ రూపొందించిన అనేక సైకత శిల్పాలు, సైకతరూపక కథలకు విశేష స్పందన లభిస్తోంది. వాటిని వీడియోలుగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ప్రజలు వీక్షిస్తున్నారు. ఇప్పటివరకు రెండు అంతర్జాతీయ అవార్డులు, 8 జాతీయ అవార్డులు, రెండు పురస్కారాలు (ఉగాది, విశిష్ట వ్యక్తి పురస్కారం), రెండు ప్రపంచ రికార్డులు (అద్భుత ప్రపంచం, మేధావి ప్రపంచ రికార్డులు) సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా అనేక అంశాలపై 250కి పైగా ఇసుక శిల్పాలను చెక్కి ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. (క్లిక్: పిల్లలను లాలిస్తూ పాడిన పాటే.. బాధను మరిపిస్తోంది!) ఇసుక రేణువులతో చైతన్యం చిన్నప్పటి నుంచి డ్రాయింగ్, పెయింటింగ్, కాన్వాసింగ్‌పై మక్కువతో అనేక ప్రయోగాలు చేశాను. సైకత శిల్పాల సృష్టిలోనూ పట్టు సాధించాను. ఎటువంటి సంగీతం, ఇతర పరికరాలు అవసరం లేకుండానే ఇసుక శిల్పాలతో ప్రజలకు అతి తేలిగ్గా అర్థమయ్యే రీతిలో అంశాలను ప్రదర్శిస్తున్నాను. 2018లో జరిగిన అంతర్జాతీయ సైకత కళా పోటీల్లో 28 దేశాల నుంచి 104 మంది సైకత శిల్పులు పాల్గొనగా.. అంతర్జాతీయ ప్రథమ బహుమతి సాధించడం నా జీవితంలో మరిచిపోలేను. ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలో జరుగుతున్న అంతర్జాతీయ పోటీల్లో కచ్చితంగా బహుమతి సాధించాలనే పట్టుదలతో సైకత శిల్పాన్ని రూపొందిస్తున్నాను. – ఆకునూరి బాలాజీ వరప్రసాద్, సైకత శిల్పి -
రిషి తోటలో రూ.12 కోట్ల శిల్పం.. వివాదాస్పదంగా ప్రధాని అధికార నివాసం
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌లోని తన అధికార నివాసం తోటలో దాదాపు రూ.12.83 కోట్ల విలువైన శిల్పాన్ని ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రముఖ శిల్పి హెన్రీ మూర్ రూపొందించిన ఈ శిల్పాన్ని గత నెలలో క్రిస్టీ సంస్థ నిర్వహించిన వేలంలో బ్రిటన్ ప్రభుత్వ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒక వైపు దేశంలో జీవన వ్యయం పెరిగిపోయి, జనం కష్టాలు పడుతున్న వేళ పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్మును ఇలా ఖర్చు చేయడమేంటంటూ విమర్శలు చుట్టుముడుతున్నాయి. -
ఇక్ష్వాకుల కాలం నాటి టెర్రకోట బొమ్మ
సాక్షి, హైదరాబాద్: దాదాపు క్రీస్తుశకం మూడో శతాబ్దానికి చెందిందని భావిస్తున్న టెర్రకోట బొమ్మ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామ శివారు శిథిల గ్రామ పాటిగడ్డమీద లభించింది. మహిళ రూపంతో ఉన్న ఈ టెర్రకోట బొమ్మను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు. ఇది ఇక్ష్వాకుల కాలానికి చెందినదిగా ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. బొమ్మ తలపై ఉన్న మకరిక శిరోజాలంకరణ, నుదుట చూడామణి, చెవులకు కుండలాలు, కనుముక్కుతీరు నాగార్జున కొండ, కొండాపూర్‌లలో దొరికిన టెర్రకోట బొమ్మలను పోలి ఉండటంతో ఇలా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. -
ప్రాణం పోసుకుంటున్న నల్ల రాతి శిలలు!
మనిషిని దేవుడు సృష్టించినట్లు పలువురు విశ్వసిస్తున్నారు. అయితే దేవుడి రూపు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. పేరు తలవగానే ఆ రూపం కళ్లముందు కదలాడే విధంగా శిలా ప్రతిమలను తీర్చిదిద్దుతున్నారు పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం మల్లేల గ్రామానికి చెందిన కళాకారులు. ఈ గ్రామం వద్ద ఉన్న నానుబాయి కొండ ప్రాంతంలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో నల్లటి రాతి శిలలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇవి నాణ్యంగా, దేవతామూర్తుల విగ్రహాల తయారీకి అనువుగా ఉండడంతో పలు ప్రాంతాలకు చెందిన శిల్పులు శిలలను చెక్కి విక్రయిస్తున్నారు. కొందరు బండలాగుడు పోటీలకు పెద్ద బండరాళ్లను ఇక్కడి నుంచే తీసుకెళుతుంటారు. ఇక్కడి శిల్పులు, శిల్పళానైపుణ్యంపై సాక్షి ప్రత్యేక కథనం.. సాక్షి ప్రతినిధి, కడప (వైఎస్సార్ జిల్లా) : తొండూరు మండలం మల్లేలలో ఉన్న వడ్డెర కుటుంబాలు శతాబ్దాలుగా గుట్ట నుంచి రాయిని వెలికి తీయడం వృత్తిగా చేసుకున్నాయి. విగ్రహాలకు రాళ్లు అనువుగా ఉండడంతో ఆ రాళ్లను ఇతర ప్రాంతాల్లోని శిల్పులకు విక్రయిస్తున్నారు. ప్రధానంగా ఆళ్లగడ్డతోపాటు పలు ప్రాంతాల్లోని శిల్పులు ఇక్కడి నుంచే రాయిని తీసుకెళుతున్నారు. స్థానికంగానే కాకుండా ఇతర జిల్లాలలో గుడుల నిర్మాణంతోపాటు గుడుల స్తంభాలు, దేవతామూర్తుల విగ్రహాలు, ఇతర అవసరాల కోసం కూడా తీసుకెళుతుంటారు. రాయిని ఇక్కడి వడ్డెరలు అడుగు చొప్పున విక్రయిస్తున్నారు. ప్రధానంగా నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డకు చెందిన శిల్పులు మల్లేల గ్రామం నానుబాయి కొండ నుంచి ఎక్కువగా రాయిని తీసుకెళుతున్నారు. ఈ రాతితో వినాయకుడు, లక్ష్మిదేవి, సరస్వతిదేవి, శ్రీకృష్ణుడు, సీతారామ, లక్ష్మణుల విగ్రహాలు, గ్రామ దేవతల విగ్రహాలు సైతం తయారు చేసి విక్రయాలు సాగిస్తున్నారు. ఇటీవలే మల్లెల కొండ నుంచి ఆంజనేయస్వామి విగ్రహం కోసం 45 అడుగుల పొడువున్న రాయిని మైసూరుకు చెందిన వారు తీసుకెళ్లారు. దేవతామూర్తుల విగ్రహాలే కాకుండా బండలాగుడు పోటీలకు ఉపయోగించే పెద్ద బండరాళ్లు, కంకల గుండ్లు సైతం ఈ రాయితో ఇక్కడి వడ్డెరలు తయారు చేస్తున్నారు. ఇవేకాకుండా రోళ్లు, విసురు రాళ్లు, రుబ్బు రాళ్లు తదితర వాటిని సైతం తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ గ్రామంలో ఉన్న ఎనిమిది వడ్డెర కుటుంబాలకు ఇదే వృత్తి. పొద్దునే వెళ్లి కొండ గుట్టపై మట్టిని తొలగించి రాళ్లను వెలికి తీస్తున్నారు. వెలికి తీసిన రాళ్లను అడుగు రూ. 75 చొప్పున విక్రయిస్తున్నారు. వడ్డెర మహిళలు సైతం పురుషులకు తోడుగా ఇదే పనిలో ఉంటున్నారు. పెద్ద రాళ్లను విగ్రహాలు, ఇతర వాటికి విక్రయించగా, చిన్న రాళ్లను విసురురాళ్లు, రోళ్లు తదితర వాటిని వీళ్లే మొలిచి అమ్ముకుంటున్నారు. లీజుతో తవ్వకాలు 10 ఎకరాల్లో నానుబాయి కొండను స్థానిక వడ్డెరలే సొసైటీ ద్వారా లీజుకు తీసుకున్నారు. భూమి నుండి ప ది అడుగులలోతు వరకు ఇక్కడ రాతి పొరలు ఉన్నా యి. పూర్వం నుంచి ఇదే వృత్తిలో ఉన్నట్లు వడ్డెరలు చెబుతున్నారు. పెద్దల నుంచి వచ్చిన వారసత్వంగా ఇప్పటికే రాళ్లు తీసి అమ్ముకోవడమే వృత్తిగా బ్రతుకుతున్నట్లు చెప్పారు. తమకు వ్యవసాయ భూములు లేవని, రాయి తీసి అమ్ముకోవడం, చిన్నరాళ్లను మొలిచి విక్రయించుకోవడమే వృత్తిగా బతుకుతున్నట్లు వారు పేర్కొన్నారు. రోజుకు రూ. 400–500లోపు కూలీ మాత్రమే పడుతున్నట్లు తెలిపారు. రాయి నాణ్యంగా ఉండడంతో శిల్పాలకు పనికి వస్తోందని, ఇతర ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి రాయిని తీసుకెళుతున్నట్లు వారు వివరించారు. గ్రామాల్లో గుడులు నిర్మించేవారు, వారికి అవసరమైన రాయిని తరలించుకుని ఇక్కడి నుంచే తీసుకెళుతుంటారని వడ్డెర్లు చెబుతున్నారు. (క్లిక్: లక్షల్లో వేతనాలు వదిలిన జంట.. ‘పంట’ భద్రులైంది!) దేవతా విగ్రహాలకు ఇక్కడి రాయే తీసుకెళతారు దేవతామూర్తుల విగ్రహాలు చేసేందుకు శిల్పులు మా మల్లేల గ్రామం వద్దనున్న నానుబాయి కొండ రాయినే తీసుకు వెళతారు. శిల్పులకు అవసరమైన రాయిని మేము తవ్వితీసి అడుగు లెక్కన విక్రయిస్తాం. చాలామంది గుడులు నిర్మించేవారు కూడా రాయిని తీసుకెళతారు. పెద్దరాళ్లను విక్రయించి చిన్న రాళ్లను రోళ్లు, విసురు రాళ్లు తదితర వాటిని మేమే మొలిచి విక్రయిస్తుంటాం. మా పూర్వీకుల నుండి ఇప్పటివరకు ఇదే వృత్తితో జీవిస్తున్నాము. – కుంచెపు వీరభాస్కర్, మల్లేల గ్రామం పూర్వం నుంచి ఇదే వృత్తి మా పూర్వీకులు ఇక్కడి రాయిని వెలికితీసి దేవతామూర్తుల విగ్రహాల తయారీకి అమ్మేవారు.ప్రస్తుతం మేము అదే చేస్తున్నాం. గ్రామం వద్దనున్న నానుబాయి కొండ ప్రాంతాన్ని లీజు ద్వారా తీసుకుని రాయిని వెలికి తీసి అడుగు చొప్పున విక్రయిస్తుంటాం. ఆళ్లగడ్డ, ఇతర ప్రాంతాలవారు ఇక్కడి నుంచే రాయిని తీసుకెళతారు. ఈ రాయితోనే విగ్రహాలను, రుబ్బురోళ్లు తయారు చేస్తారు. – కుంచెపు చిన్న లింగన్న, మల్లేల గ్రామం -
13వ శతాబ్దానికి చెందిన అతి చిన్న రాతి వినాయక విగ్రహం
సాక్షి, హైదరాబాద్: కాకతీయుల కాలానికి చెందిన వినాయకుడి అతి చిన్న రాతి విగ్రహం వెలుగు చూసింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం, పరడ గ్రామ శివార్లలో గుట్టమీద కొత్త రాతియుగం, ఇనుపయుగపు ఆనవాళ్లు, గుట్ట దిగువన తూర్పు వైపున్న బౌద్ధ స్థూప శిథిలాలను పరిశీలిస్తుండగా ఈ విగ్రహం లభించిందని పురావస్తు శాఖ విశ్రాంత అధికారి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు. ‘కాకతీయుల కాలం 13వ శతాబ్దానికి చెందిన ఈ రాతి విగ్రహం 4 సెంటీమీటర్ల ఎత్తు, 3 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. తలపైన కాకతీయ శైలి జటామకుటం, ఎడమ వైపు తిరిగి ఉన్న తొండం, చేతుల్లో దంతం, మోదకం, బొజ్జమీదుగా నాగయజ్ఞోపవీతం ఉన్న ఈ వినాయకుడు లలితాసన భంగిమలో కూర్చుని ఉన్నాడు. మెత్తడి రాతితో చెక్కిన ఈ విగ్రహం అప్పట్లో ఇళ్లలో పూజలందుకుని ఉంటుంది. నాటి ఊరు కాలగర్భంలో కలిసిపోయాక విగ్రహం కూడా మట్టిలోనే ఉండిపోయింది. గతంలో కర్నూలు జిల్లా వీరాపురంలో క్రీ.శ.3వ శతాబ్దికి చెందిన ఇదే పరిమాణంలో ఉన్న మట్టి వినాయకుడి విగ్రహం, కీసరగుట్టలో 5వ శతాబ్దానికి చెందిన గణేశుడి రాతి శిల్పం బయటపడ్డాయి. ఇప్పుడు కాకతీయ కాలానికి చెందిన ఇప్పటివరకు వెలుగు చూసిన వాటిల్లో అతి చిన్న విగ్రహం గుర్తించాం’అని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. ఔత్సాహిక పరిశోధకులు రాగి మురళితో కలిసి జరిపిన అన్వేషణలో ఈ విగ్రహం కనిపించిందని, వినాయకచవితి ముందురోజే ఈ విగ్రహం వెలుగు చూడటం విశేషమని తెలిపారు. -
The Singing Ringing Tree: ఈ చెట్టు మధురంగా పాడుతుందట..!.. వినాలంటే..
చెట్లు పలికే స్వరమాధుర్యాన్ని ఎప్పుడైనా విన్నారా? చెట్లు పాటలు పాడటమేంటి? ఇదేం పిచ్చి ప్రశ్న అని కోప్పడిపోకండి. చెట్టు పలికే వాయుగీతాన్ని వినాలంటే మీరు ఇంగ్లాండ్ వెళ్లాల్సిందే. అక్కడ లాంకషైర్ కౌంటీలోని బర్న్లీ పట్టణానికి చేరువలో కనిపించే చెట్టు రోజంతా వాయుగీతాలను వినిపిస్తుంది. నెమ్మదిగా పిల్లగాలులు వీచేటప్పుడు మంద్రంగా, గాలులు ఒకమోస్తరుగా వీచేటప్పుడు కాస్త మధ్యమంగా, శరవేగంగా పెనుగాలులు వీచేటప్పుడు తారస్థాయిలోను స్వరాలాపన చేసే ఈ వృక్షం అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే, ఇది సహజమైన వృక్షం కాదు, ఉక్కుతో రూపొందించిన పది అడుగుల లోహ కళాఖండం ఇది. దీనికి కొమ్మల్లా వివిధ పరిమాణాల్లో వేణువు మాదిరి లోహపు గొట్టాలను ఏర్పాటు చేయడంతో, ఈ గొట్టాల గుండా గాలి వెళ్లేటప్పుడల్లా చిత్రవిచిత్రమైన స్వరధ్వనులు వినిపిస్తాయి. మైక్ టాంకిన్, అన్నాలియు అనే లోహశిల్పులు ఈ లోహవృక్షాన్ని స్వరాలు పలికేలా తీర్చిదిద్దారు. బెర్న్‌లీ పట్టణానికి చేరువలోని ఖాళీ మైదానంలో దీనిని 2006లో ఏర్పాటు చేశారు. బీబీసీలో ప్రసారమైన 1960ల నాటి ఫాంటసీ సీరియల్ స్ఫూర్తితో దీనికి ‘ద సింగింగ్ రింగింగ్ ట్రీ’ అనే పేరు పెట్టారు. ఈ లోహవృక్ష రూపకల్పనలో కనపరచిన అమోఘ శిల్పనైపుణ్యానికి గుర్తింపుగా 2007లో దీనిని రూపొందించిన శిల్పులకు రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ ఏటా ఇచ్చే జాతీయ అవార్డు కూడా లభించింది. చదవండి: అవును..!! డబ్బులు చెట్లకు కూడా కాస్తాయి.. మా పెరట్లో.. -
4వ శతాబ్దంనాటి మహిషాసురమర్ధిని విగ్రహం గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: శరన్నవరాత్రి వేడుకలు జరుగుతున్నవేళ అతి పురాతన మహిషాసురమర్ధిని శిల్పం వెలుగు చూసింది. విష్ణుకుండినుల హయాంలో నాలుగో శతాబ్దంలో రూపొందిన ఈ రాతి విగ్రహాన్ని నల్లగొండ జిల్లాలో చరిత్ర పరిశోధకులు గుర్తించారు. కట్టంగూరు రోడ్డులో పానగల్లుకు 3 కిలోమీటర్ల దూరంలో గల దండంపల్లి శివారులో ఓ చెట్టుకింద దీన్ని కనుగొన్నారు. గతంలో పొలానికి కాలువ తవ్వుతుండగా ఇది బయటపడింది. అక్కడి చెట్టుకింద ఉన్న పురాతన వినాయకుడి విగ్రహం ముందు దీన్ని ఉంచారు. కానీ అది నాలుగో శతాబ్దికి చెందిన పురాతన విగ్రహమన్న విషయం స్థానికులకు తెలియదు. తాజాగా ఆ ప్రాంతానికి చెందిన తెలుగు పండితుడు సైదులు ఇచి్చన సమాచారం మేరకు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి, నల్లగొండ చరిత్ర కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ డి.సూర్యకుమార్‌తో కలసి ఆ విగ్రహాన్ని పరిశీలించారు. అక్కడ లభించిన ఇటుకల పరిమాణం ఆధారంగా ఈ విగ్రహాన్ని విష్ణుకుండినుల కాలంనాటిదిగా నిర్ధారణకు వచ్చినట్లు శివనాగిరెడ్డి తెలిపారు. రాతి శిల్పం 10 సెం.మీ. పొడవు, 5 సెం.మీ. వెడల్పు, 2 సెం.మీ. మందంతో ఉందని, అమ్మవారు మహిషరూపంలో ఉన్న రాక్షసుడి మెడపై ఎడమకాలితో తొక్కి పట్టి, ఎడమ చేతితో తోకను పట్టుకుని కుడి చేతిలో శూలం, మిగతా రెండు చేతుల్లో శంఖుచక్రాలతో ఉందని పేర్కొన్నారు. చెవి కుండలాలు, తలపై పాగా తరహా కిరీటం, వెనకవైపు గుండ్రటి ప్రభామండలాలతో తెలుగువారి తొలితరం ప్రతిమాలక్షణాలతో ఉందని తెలిపారు. -
1765కు ముందు గాలి నాణ్యత ఎలా ఉండేదో తెలుసా?
పరిశ్రమలతో ప్రస్తుతం వాతావరణం ఎంతగా కలుషితం అవుతోందో మనకు తెలుసు. ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం రాక ముందు గాలి నాణ్యత ఎలా ఉండేది? అప్పటి పరిస్థితులను తెలుసుకోవడం ఎలా? ఈ ఆలోచనతో కళాకారుడు, రాయల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ పీహెచ్డీ అభ్యర్థి వేన్ బినిటీ గాజుతో కూడిన ఓ శిల్పాన్ని రూపొందించారు. దానిలో 1765కు ముందు గాలిని నింపి త్వరలో స్లాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరగబోయే కాప్–26 సదస్సులో భాగంగా నిర్వహించే ‘పోలార్ జీరో ఎగ్జిబిషన్’లో ప్రదర్శనకు ఉంచనున్నారు. అంటార్కిటికా ఐస్ నుంచి.. శిల్పంలో నింపిన గాలిని అంటార్కిటికా మంచు పొరల నుంచి సేకరించారు. గాలిని సేకరించడానికి బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే (బీఏఎస్) సైంటిస్టులతో కలసి బినిటీ ఐదేళ్ల పాటు ఆ మంచు ఖండంలో డ్రిల్లింగ్ చేశారు. 170 మీటర్ల లోతు వరకూ తవ్వకాలు జరిపి మంచును సేకరించారు. దానిని విశ్లేషించి డబ్బాల్లో నింపి పెట్టారు. పర్యావరణ మార్పులను మంచు పొరల్లో గుర్తిస్తూ 1765కు నాటి పరిస్థితులను అంచనా వేశారు. ఆ పొరల్లోని చిన్ని చిన్ని బుడగల నుంచి గాలిని సేకరించారు. ‘‘నా కళ హిమ ఖండాల భూత, వర్తమాన, భవిష్యత్ పరిస్థితులను తెలుపుతుంది. చదవండి: అమెరికా అణు జలాంతర్గామికి ప్రమాదం.. ఆందోళన వ్యక్తం చేసిన చైనా ధ్రువ ప్రాంతాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తుంది’’ అని బినిటీ అభిప్రాయపడ్డారు. లిక్విడ్ సిలికాన్‌తో నింపిన గాజు సిలిండర్‌లో 1765 నాటి గాలిని నింపి ఆ కళాఖండాన్ని రూపొందించారు. లిక్విడ్ సిలికాన్ మనకు కనిపిస్తుంది. దానిపైన అత్యంత జాగ్రత్తగా సేకరించిన ఆనాటి గాలి నిండి ఉంటుంది. సాంకేతికంగా సవాలుగా నిలిచే ఈ శిల్పాన్ని ఆధునిక ఇంజనీరింగ్ సామర్థ్యాలతో బీఏఎస్ ల్యాబ్‌లో రూపొందిస్తున్నారు. దీన్ని మొత్తాన్ని వీడియో తీసి ఆన్లైన్లో ఉంచనున్నారు. చదవండి: అఫ్గనిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు.. 100 మందికి పైగా మృతి 1765 కీలకమైన సంవత్సరం బీఏఎస్ శాస్త్రవేత్త ముల్వానే మాట్లాడుతూ.. ‘‘మంచు నీటి మాలిక్యూల్స్‌లోని ఐసోటోపిక్ కంపోజిషన్ ద్వారా ఆ మార్పులను గుర్తించవచ్చు. 10 వేల సంవత్సరాల క్రితం నుంచి సుమారు 1765 వరకూ గాలిలో బొగ్గుపులుసు వాయువు స్థాయి దాదాపు ఒకేలా ఉంది. ఆ ఏడాది వరకూ 280 పీపీఎమ్ ఉండేది. ఆ దశకంలో జేమ్స్ వాట్ ఆవిరి యంత్రం రూపొందించాక పారిశ్రామిక విప్లవం మొదలైంది. అప్పటి నుంచే కార్బన్ డైయాక్సైడ్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది మే నెలలో వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు స్థాయి 419 పీపీఎంకు చేరింది. ఇప్పుడు ఈ శిల్పం ప్రజల ఊహకు ఓ ప్రేరణగా నిలుస్తుంది. వాతావరణంలో మార్పులను మంచు పొరలను పరిశీలించడం ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు. -
ఆమె చేయని మంచి పని లేదు, సేవా రంగం లేదు.. ఓ అలుపెరుగని సంచారి!!
ఆమెకు నిరంతరం ఏదో ఒకటి చేయాలనే ఉత్సాహం. ఉత్సాహంగా ఉంటేనే అలసట తెలియదంటారు. యువత కోసం కొత్తకొత్తగా ఆలోచిస్తుంటారు అన్నీ నలుగురికీ చెప్పాలనేదే ఆమె ఆకాంక్ష. చూసిన ప్రతిదీ రాస్తారు, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తారు. ఒంటరిగానే ప్రయాణిస్తారు. సైకిల్ తొక్కాలి, కొండలు ఎక్కాలి అనే ఆలోచనతోనే ఉంటారు.. పాండమిక్ సమయంలోనూ ఎంతో ధైర్యంగా చురుగ్గా పనిచేశారు. యువతను ప్రోత్సహించడానికి గ్యాలరీ తెరిచారు. యువత జీవనానికి కావలసిన విషయాలు ప్రముఖులతో చెప్పిస్తున్నారు. హైదరాబాద్ లో నివసిస్తున్న భార్గవి నిరంతర సంచారి. ఆమె గురించి ఆమె మాటల్లోనే... మాస్టర్స్‌లో గోల్డ్ మెడల్ నేను పుట్టి పెరిగింది హైదరాబాదులోనే. బి.కామ్ వరకు చదువుకున్నాను. ఆ తరవాత వివాహం జరగడం, బాబు పుట్టడం, వాడు స్కూల్ కి వెళ్లటం... అన్నీ సామాన్యంగానే జరిగిపోయాయి. అప్పుడు నాకు ఆర్ట్ నేర్చుకోవాలని కోరిక కలిగింది. చిన్నప్పటి నుంచే నేను బొమ్మలు వేసేదాన్ని. ఏదో కారణంగా అప్పుడు నాకు ఆర్ట్ మీద దృష్టి పెట్టడానికి అవ్వలేదు. అబ్బాయి స్కూల్ కి వెళ్లాక నాకు చాలా సమయం దొరికేది. అప్పుడే నేను నా కలను నిజం చేసుకోవాలనుకున్నాను. నాన్నగారి స్నేహితుడి ప్రోద్బలంతో ఆర్ట్‌లో బ్యాచిలర్స్ డిగ్రీకి అప్లయి చేశాను. నాలుగు సంవత్సరాల కోర్సు పూర్తి చేశాను. డిగ్రీ చదివేటప్పుడు నాతో ఉన్నవారంతా చిన్నపిల్లలు. వాళ్లందరూ మధ్యతరగతివాళ్లు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారు. అప్పటికే వాళ్లు వేసిన పెయింటింగ్స్ తీసుకుని డబ్బులు ఇచ్చేదాన్ని. ఊరికే డబ్బులు ఇస్తే వాళ్లకి డబ్బు విలువ తెలియదని ఎంతో కొంత డబ్బులు ఇచ్చి కొంటూ వాళ్లని ప్రోత్సహించాను. మాస్టర్స్ కోసం సెంట్రల్ యూనివర్సిటీ కి అప్లయి చేసి, జాయిన్ అయ్యాను. గోల్డ్ మెడల్ సాధించాను. మాస్టర్స్ కోర్సు పూర్తయ్యాక కలకత్తా, బరోడా ప్రాంతాలకు వెళ్లాను. ప్రింట్ మేకింగ్ నేను కాలేజీ నుంచి బయటకు వచ్చాక ప్రింట్‌మేకింగ్ స్టూడియో పెట్టాలనుకుంటున్నారు. అప్పటికి హైదరాబాద్‌లో ఆ తరహా స్టూడియో లేదు. నా స్పెషాలిటీ కూడా ప్రింట్మేకింగ్లోనే. ఈ స్టూడియోకి పెద్ద మెషినరీ కావాలి. పెయింటింగ్‌కి కావలసిన రంగులు, జింక్ ప్లేట్లు ఉపయోగించి, పేపర్ మీద ప్రింట్ తీస్తాం. ఈ స్టూడియో నడపడానికి చదువుకున్నవారు చాలామంది కావాలి. నాతో చదువుకున్న వారినే కొందరిని ఇందులోకి తీసుకోవాలనుకున్నాను. ఫైనల్ డిస్ప్లే (ఫైనల్ ఇయర్) కి బరోడా, శాంతినికేతన్లాంటి ప్లేసెస్‌కి వెళ్లేదాన్ని. అక్కడ టీచర్ స్టూడెంట్ పద్ధతి లేదు. గురుకులంలాగ ఉంటుంది. సాయంత్రం దాకా క్లాసెస్ జరుగుతాయి. ఆ తరవాత బడ్డీకొట్టు దగ్గర కూర్చుని ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల గురించి, అన్ని విషయాలు ఒకరితో ఒకరు పంచుకుంటారు. హైదరాబాద్‌లో ఇటువంటి వాతావరణం లేదు. పిల్లలకు టీచర్ అంటే భయం. టీచరే అన్ని విషయాలు చెప్తారు. బరోడా ఒక ఆర్ట్ హబ్ భారతదేశంలో బ్యాచిలర్స్ డిగ్రీ అవ్వగానే బరోడాలో మాస్టర్స్ చేస్తారు. బరోడాలో చాలా స్టూడియోలు, గ్యాలరీలు ఉన్నాయి. ఒక్కో గది ఒక్కో ఆర్టిస్టుకి ఇస్తారు. 20 మంది ఒకచోట కూర్చుని పనిచేసుకునే అవకాశాలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ అలాంటిది లేదు. అటువంటి స్టూడియో ఇక్కడి విద్యార్థుల కోసం ప్రారంభించాలనుకున్నాను. 2014లో ది ఆర్ట్ స్పేస్ అని ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించాను. బాలమురళి, సినారె ప్రారంభోత్సవం చేశారు. థి అనేది సంస్కృత పదం. ఈ పదానికి చాలా అర్థాలున్నాయి. ఈ స్టూడియోలో లైబ్రరీ, పెయింటింగ్ గ్యాలరీ కూడా ప్రారంభించాను. యువతకు ఎవ్వరూ అవకాశాలకు ఇవ్వట్లేదు. ఆ అవకాశం నేను ఇచ్చి వాళ్లని ప్రోత్సహించాలనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటివరకు క్రియేటివ్‌గా ఉన్న యువతను ప్రమోట్ చేస్తూనే ఉన్నాను. అంతర్జాతీయంగా కూడా ఫొటోగ్రఫీ, పెయింటింగ్, స్కల్ప్చర్ అన్నీ చేస్తున్నాను. మంచి విషయాలు ప్రతి సంవత్సరం యువతకు మంచి విషయాలు తెలిసేలా నాలుగు ప్రదర్శనలు చేస్తున్నాం. మోడరన్ ఆర్ట్, కాంటెంపరరీ ఆర్ట్.. అన్నీ చేస్తున్నాం. యువత చాలా బాగా వేసిన పెయింటింగ్స్ కొన్నాను. ఇప్పుడు వాళ్లు అంతర్జాతీయ స్థాయికి చేరారు. వాళ్ల పెయింటింగ్స్‌కి ఇప్పుడు లక్షల రూపాయలు వస్తాయి. పెయింటింగ్స్‌కి క్యూరేటర్ కోర్సు పెట్టి వారిని ప్రోత్సహిస్తున్నాను. బార్గవి చేయని మంచి పని లేదు, చేయని సేవా రంగం లేదు. ఎంతోమందికి భార్గవి ఆదర్శంగా నిలుస్తున్నారు. నిరంతర ప్రయాణాలు ►వైయస్సార్ యూనిర్సిటీ అడ్వయిజరీ బోర్డు మెంబర్ ►ఎన్జీవో సేవలు ►ఆదిలాబాద్ గిరిజనులు, అంధులు, వృద్ధులకు కావలసిన సేవలు ►గ్రామాన్నిదత్తతు చేసుకుని, బాగుచేయటం ►వ్యవసాయానికి భూమి క్లియర్ చేయటం కరోనా సమయంలో.. ►బోనాలు వంటి మన సంప్రదాయం గురించి మనకు తెలీదు. నిపుణులతో వాటి గురించి ఆన్ లైన్ లో చెప్పించటం. ►ఫౌండేషన్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్ (ఫేస్) తరఫున గ్రాంట్స్ ఇవ్వడం ►ఆన్లైన్లో ఎటికేట్ నేర్పటం ►కాలేజీలో నేర్పని విషయాలు బియాండ్ క్లాస్‌రూమ్‌లో నేర్పించటం ►కళాకారులకు ఉండవలసిన క్రమశిక్షణ గురించి నేర్పించటం ►పర్మనెంట్ రెసిడెన్సీకి ఎలా అప్లయి చేయాలి, అక్కడికి వెళితే ఎలా ఉండాలి, ఆర్టిస్టు క్యూరేట్ చేసి ఎలా గుర్తింపు తెచ్చుకోవాలి, ఫౌండేషన్ గ్రాంట్స్ ఎలా తెచ్చుకోవాలి వంటి విషయాల గురించి అవగాహన కల్పించటం ►చరిత్రకారులను పిలిపించి మాట్లాడించటం జ్ఞానాన్ని పంచటం... ఆర్టిస్టులు దేనిని ఎలా నేర్చుకుంటారోననే అంశం మీద ఆధారపడి, కొందరిని సెలక్ట్ చేసుకుని, వారికి ఉచిత తరగతులు (అమౌంట్ ఇస్తాం) నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ గురించి చాలామందికి తెలియని ఎన్నోఉన్నతమైన విషయాలు... అంటే హైదరాబాద్‌లోని దిగుడు బావులు, వైల్డ్ లైఫ్, రాయల్ లైఫ్, చార్మినార్, బేకరీలు, ఆర్జిజాన్లు, గ్లిట్టరింగ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, అత్తరు, ప్రీ మిడీవల్ ... ఇలా ఎన్నో విషయాలను వారికి తెలియచేసే తరగతులు నిర్వహిస్తున్నాం. పఠాన్‌చెరు అతి పురాతన ప్రదేశమని, అది ఒకప్పుడు వ్యాపార కేంద్రమని, కొలోనియల్ టైమ్ పీరియడ్ నాటి ప్రదేశమని, ఉర్దూ భాష మాట్లాడేవారని, అప్పటి జనజీవనం, సింగాడా కాయల గురించి (వాటర్ చెస్ట్నట్) ... ఇలా హైదరాబాద్ గురించినవన్నీ చెప్పాం. సంభాషణ: వైజయంతి పురాణపండ చదవండి: జలియన్‌వాలాబాగ్ దురంతం: ఒక జాతి ఆత్మను తాకిన తూటా.. -
లింగంపల్లిలో అరుదైన ఆత్మార్పణ శిల వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: దేవుడికి తనను తాను నైవేద్యంగా సమర్పించుకుంటే ఆ భక్తిని ఏమనాలి?.. గతంలో ఈ తరహా వీరభక్తి ఉండేదన్న గాథలు అడపాదడపా వింటూనే ఉన్నాం. భక్తితో దేవుడికి తనను తాను ఆత్మార్పణ ద్వారా సమర్పించుకున్న వారి శిల్పాలు అప్పట్లో వేయించారు. అలాంటి ఓ అరుదైన ఆత్మార్పణ శిల తాజాగా వెలుగుచూసింది. అది మహిళది కావడం మరో విశేషం. జనగామ జిల్లా చిల్పూరు మండలం లింగంపల్లిలో కొత్త తెలంగాణ బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ ఈ ‘ఆత్మార్పణ’శిల్పాన్ని గుర్తించినట్లు ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. కర్ణాటక ప్రాంతంలో వీటిని సిడితల వీరగల్లుగా పేర్కొంటారని తెలిపారు. ఈ శిల్పంలోని దృశ్యం రెండంతస్తులుగా ఉంది. దిగువ భాగంలో.. ఓ మహిళ కూర్చుని ఆత్మత్యాగం చేసేందుకు సిద్ధంగా ఉంది. చేతిలో శివలింగం పట్టుకుని ఉంది. తల భాగాన్ని ఎదురు కర్రకు కట్టినట్టు ఉంది. ఓ వెదురుకర్రను వంచి చివరి భాగాన్ని తలకు జుట్టుకు కడతారు. ఆ తర్వాత కత్తితో మెడ నరుక్కోగానే, వెదురు కర్ర తలను వేరు చేస్తూ పైకి లేస్తుంది. ఈ మహిళ ఆ పద్ధతిలో ఆత్మత్యాగం చేసినట్టు శిల్ప దృశ్యం చెబుతోంది. పైఅంతస్తులో చనిపోయిన మహిళ ఆత్మను తోడుకుని ఇద్దరు చామరధారిణులైన అమరాంగనలు దేవలోకానికి వెళ్తున్న దృశ్యం చిత్రించి ఉంది. శిల్పశైలినిబట్టి కాకతీయుల కాలానంతరం చెక్కినట్లుగా ఉందని హరగోపాల్ పేర్కొన్నారు. వీరశైవ భక్తులెక్కువగా ఇలా ఆత్మార్పణ చేసుకునేవారని పేర్కొన్నారు. ఈ శిల్పం ఓ పొలం వద్ద వెలుగుచూసినట్టు వెల్లడించారు. -
ఎండకు ఎండి.. వానకు తడిసి..
ఇవన్నీ కాకతీయుల కాలంలో అద్భుత నైపుణ్యంతో చెక్కిన శిల్పాలు. దాదాపు ఎనిమిది వందల ఏళ్లక్రితం రూపుదిద్దుకున్న అపురూప శిల్పాలు ఇప్పుడు ఇలా అవగాహనలేమితో నిర్లక్ష్యానికి గురై ధ్వంసమవుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుద్దెడ గ్రామంలోని అతి పురాతన శంభుదేవుని ఆలయం ప్రాంగణంలోని శిథిల కోనేరు గట్టునానుకుని వీటిని ఇలా పడేశారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్, నజీరుద్దీన్‌లు ఇచ్చిన సమాచారంతో, వారితో కలిసి పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆదివారం వాటిని పరిశీలించారు. దేవాలయ నిర్వాహకులతో చర్చించి వాటిని ఆలయం మండపంలో ఏర్పాటు చేసి, వాటి కాలానికి సంబంధించిన నామఫలకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అరుదుగా ఉండే రెండంతస్తుల కాకతీయ మండపానికి అనుకుని ఇతర నిర్మాణాలు చేపట్టి దాని చారిత్రక ప్రాశస్త్యం కోల్పేయేలా చేయటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలో బాదామీ చాళుక్యుల కాలం ఏడో శతాబ్దినాటి శివలింగం, నాగ ప్రతిమలు, 11వ శతాబ్ది నాటి పార్శ్వనాథుడి జైన విగ్రహం, 1296 నాటి కాకతీయ ప్రతాపరుద్రుని శాసనం ఉన్నాయి. -
శిల్ప కళాకారుడు అక్కల మంగయ్య మృతి
తెనాలి: శిల్పకళలో తెనాలి కళా నైపుణ్యాన్ని ఖండాంతరాలకు చాటిన అక్కల సోదరుల్లో పెద్దవాడైన అక్కల మంగయ్య(82) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మంగయ్య భౌతికకాయానికి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. 1939లో జన్మించిన మంగయ్య ఎస్ఎస్ఎల్సీ చదివి, తండ్రి రామయ్య స్థాపించిన శిల్పశాలలో శిల్ప విద్యనభ్యసించారు. తండ్రికి చేదోడుగా ఉంటూనే తన ఊహాశక్తిని జోడించి శిల్పకళలో నైపుణ్యాన్ని సాధించారు. వేంకటేశ్వరస్వామి విగ్రహాల తయారీలో జాతీయస్థాయి ఖ్యాతినార్జించారు. అందివచ్చిన ముగ్గురు సోదరులతో కలిసి దేశంలోని వివిధ నగరాలకు శ్రీవారి విగ్రహాలను తయారుచేసి ఇచ్చారు. అమెరికాలోని మిసిసిపి, టెక్సాస్, కాలిఫోర్నియా, లివర్మోర్ సిటీ, ఆఫ్రికా, మారిషస్ దేశాల్లోని తెలుగువారి ఆలయాలకు వేంకటేశ్వరుడు, ఇతర దేవతా విగ్రహాలు, సర్వాంగ ఆభరణాలు, మకరతోరణాలను చేసి ఇచ్చారు. శ్రీవారికి టీటీడీ రూ.3.50 కోట్లతో చేయించిన వజ్రకిరీటం నమూనాతో అమెరికాలోని ఆలయం కోసం నవరత్న ఖచిత కిరీటాన్ని తీర్చిదిద్దిన ఆయన ప్రతిభకు భక్తులు నీరాజనాలర్పించారు. వీటితోపాటు దేశనాయకులు, రాజకీయ ప్రముఖుల కాంస్య, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఫైబర్ విగ్రహాల తయారీలోనూ సిద్ధహస్తులుగా పేరుగడించారు. నాటి ముఖ్యమంత్రులు టి.అంజయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి, మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌శర్మచే మంగయ్య సత్కారం అందుకున్నారు. -
Travel: గిన్నిస్ రికార్డు.. జటాయు పార్కు
రెండు వందల అడుగుల పొడవు. నూట యాభై అడుగుల వెడల్పు. డెబ్బై అడుగుల ఎత్తు... ఇది ఇక్కడ కనిపిస్తున్న పక్షి పరిమాణం. ఆ పరిమాణమే దీనిని గిన్నిస్ బుక్‌లో చేర్చింది. జటాయు నేచర్ పార్క్... కేరళ, కొల్లం జిల్లా, చాదయమంగళం పట్టణంలోని జటాయుపురాలో ఉంది. వెయ్యి అడుగుల ఎత్తులో ఉన్న జటాయు నేచర్ పార్కులో ఉన్న జటాయు పక్షిని శిల్పకారుడు రాజీవ్ ఆంచల్ నిర్మించాడు. అతడు ఫిల్మ్ మేకర్ కూడా. రామాయణంలో జటాయు ప్రధానమైన పాత్ర. సీతాపహరణ సమయంలో తనను అడ్డగించిన జటాయును రావణాసురుడు సంహరించాడని రామాయణంలో ఉంది. ఆ సంఘటన జరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు కేరళవాళ్లు. జటాయు తుదిశ్వాస వదిలిన ప్రదేశంలో పార్కు నిర్మించినట్లు చెబుతారు. మన రాష్ట్రంలో అనంతపురంలోని లేపాక్షిని జటాయువు మరణించిన ప్రదేశంగా మనం చెప్పుకుంటాం. వాస్తవాల అన్వేషణ, అధ్యయనంలోకి వెళ్లకుండా కేరళలోని ఈ పార్కుకు వెళ్తే టూర్ మధురానుభూతికి మినిమమ్ గ్యారంటీ. పక్షిలోపల మ్యూజియం 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులో డిజిటల్ మ్యూజియం ఉంది. లైట్ అండ్ సౌండ్ షోలో రామాయణంలోని జటాయు ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. పక్షి ఆకారంలోని ఈ నిర్మణం లోపల జటాయు కథను తెలిపే ఘట్టాలను చూడవచ్చు. ప్రపంచంలో ‘లార్జెస్ట్ ఫంక్షనల్ స్టాచ్యూ ఆఫ్ ఎ బర్డ్’ కేటగిరీలో ఈ పార్కు గిన్నిస్ రికార్డులో నమోదైంది. ఈ పార్కుకు చేరడానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రోప్‌వే ఉంది. ఈ కొండ మీదకు ట్రెకింగ్, రాక్ క్లైంబింగ్, బైక్ రైడింగ్‌తోపాటు ఆర్చరీ వంటి యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు, యువత, సీనియర్ సిటిజెన్ అందరికీ ఈ టూర్ అందమైన జ్ఞాపకంగా మిగులుతుంది. జటాయు పార్కు సందర్శనలో పర్యాటకులు జటాయుపుర... కేరళ రాజధాని త్రివేండ్రం నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. పునలూర్ రైల్వేస్టేషన్ నుంచి అయితే పాతిక కిలోమీటర్లే. ఇక్కడి నుంచి ట్యాక్సీ సర్వీస్ తీసుకోవచ్చు. సొంతంగా వాహనాన్ని నడుపుకునే ఆసక్తి ఉంటే కొంత కాషన్ డిపాజిట్, వ్యక్తిగత వివరాలు తీసుకుని కారు అద్దెకిస్తారు. -
రోడ్డు విస్తరణ: వెయ్యేళ్ల శిల్పాలను మట్టిలో పూడ్చేసి..
సాక్షి, హైదరాబాద్: ఇవి దాదాపు వెయ్యేళ్ల క్రితం నాటి శిల్పాలు.. దేవతా మూర్తులు, వీరగల్లుల విగ్రహాల సమూహం. రోడ్డు విస్తరణకు అవి అడ్డుగా ఉన్నాయని భావించిన ఓ కాంట్రాక్టర్ వాటి మీదుగా మట్టి వేసి అలాగే రోడ్డు నిర్మాణం ప్రారంభించేశాడు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం పోల్కొంపల్లి గ్రామంలో ఇది జరిగింది. కొందరు గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న విశ్రాంత పురావస్తు అధికారి, బుద్ధవనం ప్రాజెక్టు కన్సల్టెంట్ ఈమని శివనాగిరెడ్డి సోమవారం గ్రామాన్ని సందర్శించారు. వివిధ సందర్భాల్లో వెలుగుచూసిన కళ్యాణి చాళుక్యుల హ యాం క్రీ.శ.11వ శతాబ్దం నాటి దేవతామూర్తుల, స్థానిక వీరుల శిల్పాలు అరుదైనవని ఆయన అంటున్నారు. చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన వాటిని నిర్లక్ష్యంగా పూడ్చేయడం సరికాదని, తక్షణమే శిల్పాలను సురక్షిత ప్రాంతానికి తరలించి పరిరక్షించాలని ఆయన కోరుతున్నారు. ఆయన వెంట నల్లమల నేచర్ ఫౌండేషన్ అధ్యక్షులు పట్నం కృష్ణంరాజు, భూత్పూరు ఆలయ కమిటీ సభ్యుడు అశోక్‌గౌడ్ తదితరులున్నారు. చదవండి: Maoist Party : హిడ్మా, శారద క్షేమమే -
75 వేల ఇనుప వ్యర్థాలతో గాంధీ విగ్రహం
సాక్షి, తెనాలి: శిల్పకళలో ఖండాంతర ఖ్యాతిని కలిగిన గుంటూరు జిల్లా తెనాలి పట్టణం, ఇనుప వ్యర్థాలతో తీర్చిదిద్దిన కళాకృతుల్లోనూ ఘనత వహిస్తోంది. ఇనుప వ్యర్థాలతో జీవం ఉట్టిపడే శిల్పాలను చేస్తూ, విదేశాల్లోనూ ప్రదర్శిస్తోన్న స్థానిక సూర్య శిల్పశాల నిర్వాహకులైన తండ్రీకొడుకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు తాజాగా భారీ ధ్యాన గాంధీ విగ్రహాన్ని రూపొందించారు. 10 అడుగుల ఎత్తుతో తయారు చేసిన ఈ విగ్రహానికి 75 వేల ఇనుప నట్లను వినియోగించారు. గిన్నిస్ బుక్ రికార్డు కోసం చేసిన ఈ విగ్రహాన్ని ఆదివారం తమ శిల్పశాల ఎదుట ప్రదర్శనకు ఉంచారు. చదవండి: ఐఏఎఫ్‌లో ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా ఆటో డ్రైవర్ కుమారుడు కృష్ణానది ఒడ్డున ఘాతుకం: ప్రేమికుడిని బంధించి.. యువతిపై అత్యాచారం -
చేర్యాలలో లజ్జా గౌరీ శిల్పం
సాక్షి,హైదరాబాద్: అమ్మతనానికి ప్రతీకగా భావించే లజ్జా గౌరీ (అమ్మ దేవత) పురాతన శిల్పం చేర్యాల మండల కేంద్రం శివారులో బయల్పడింది. ఎనిమిది అడుగుల ఎత్తున్న గుండుకు చెక్కిన ఈ శిల్పాన్ని ఔత్సాహిక పరిశోధకులు రత్నాకరరెడ్డి ఆదివారం పరిశీలించారు. ఓ వ్యవసాయ పొలంలో ఉన్న ఈ గుండుకు ఓవైపు భైరవుడి రూపం ఉంది. మరోవైపు సన్నగా, విస్తృత కటి భాగంతో నగ్నంగా కూర్చున్నట్లు ఉండే ఈ శిల్పం ప్రసవస్థితిలో ఉన్నట్టుగా ఉంది. లజ్జా గౌరీ రూపం నగ్నంగా ఉంటున్నందున శిరస్సు స్థానంలో పద్మం ఆకృతిని చెక్కుతారు. వివిధ ప్రాంతాల్లో వెలుగు చూసిన శిల్పాలు కూడా ఇదేవిషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. కానీ చేర్యాలలో గుండుకు చెక్కిన రూపంలో పద్మం బదులుగా తలభాగం ఉండటం విశేషం. సాధారణంగా లజ్జా గౌరీ ఆరాధన మనోవికారాన్ని నివారించటంతోపాటు మోహ, ఆధ్యాత్మిక భావనలు కలిగిస్తుందంటారు చరిత్రకారులు. గతంలో లజ్జా గౌరీ ఆరాధన విస్తృతంగా ఉండేదని, కాలక్రమంలో తగ్గిపోయిందని రత్నాకరరెడ్డి తెలిపారు. చేర్యాలలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర విగ్రహాలు కూడా బయల్పడ్డాయి. చదవండి: కరోనా: బూస్టర్ డోస్‌లతో వేరియెంట్లకు చెక్ -
కనిపించని కళాఖండం తయారు చేసి జాక్‌పాట్ కొట్టేశాడు
బ్రసిలియా: ఇటలీకి చెందిన 67 ఏళ్ల సాల్వటోర్ గారౌ కంటికి కనిపించని కళాఖండం తయారు చేశాడు. ఆ కళాఖండం వేలానికి వేయగా అది 15వేల యూరోలకు( ఇండియన్ కరెన్సీలో రూ.13 లక్షలు) అమ్ముడుపోయింది. అలా సాల్వటోర్ కనిపించని కళాఖండంతో జాక్‌పాట్ కొట్టేశాడు. కానీ సాల్వటోర్‌కు ఆ జాక్‌పాట్ దాని వల్ల రాలేదు.. అతని మాటల వల్ల వచ్చింది. విషయంలోకి వెళితే.. సాల్వటోర్ స్వతహాగా మంచి శిల్పి. అతను తయారు చేసే వాటిలో పైకి ఏం కనిపించకపోయినా దానిలో ఒక పరమార్థం ఉంటుంది. తాజాగా అతను ''ఐయామ్'' అనే పేరిట కనిపించని ఒక కళాఖండాన్ని తయారు చేశాడు. కానీ అతను దానిని ప్రదర్శనకు ఉంచినప్పుడు అతను ఏం చూపెట్టాడో అక్కడ ఉన్నవాళ్లకు అర్థం కాలేదు. కాగా సాల్వటోర్ అతను తయారు చేసిన శిల్పం గురించి వివరించాడు. ''నిజానికి నేను అమ్మింది ఒక శూన్యం మాత్రమే.. అంటే ఖాళీదని అర్థం. ప్రపంచంలోని ఏ వస్తువుకు బరువు ఉండదు. నేను చూపించే ఈ వాక్యూమ్‌లోనూ గాలి తప్ప ఇంక ఏం ఉండదు. హైసెన్బర్గ్ సూత్రం ప్రకారం వాక్యూమ్ శక్తితో నిండిన వేగం తప్ప మరొకటి కాదని తెలుసుకున్నా. నా దృష్టి నుంచి చూస్తే విషయం మీకే అర్థమవుతుంది. ఉదాహరణకు మనం నమ్మే దేవుడికి రూపం ఉండడం మీరు గమనించారా.. ఇది అంతే నేను చెక్కిన ఈ శిల్పంలోనూ ఒక రూపం ఉంది. మనసు పెట్టి చూడండి.'' అని చెప్పుకొచ్చాడు. అతను చెప్పిన మాటలకు ఇంప్రెస్ అయిన నిర్వాహకులు అతని శిల్పాన్ని 15వేల యూరోలకు కొన్నారు.కానీ దీనిని టెస్టిఫై చేయాల్సి ఉంటుందని సదరు నిర్వాహకులు సాల్వటోర్‌కు తెలిపారు. చదవండి: 12 అడుగుల భారీ తిమింగళం.. బీచ్ వద్దకు ఎవరు రావొద్దు -
కుర్రారంలో కాలాముఖ దేవాలయం
రాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కుర్రారంలో కాలాముఖ దేవాలయం ఉన్నట్లు పురావస్తు శాస్త్ర పరిశీలకుడు రామోజు హరగోపాల్ తెలిపారు. గురువారం కుర్రారంలోని త్రికూట బసవేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ గ్రామంలో కాకతీయుల కాలంనాటి దేవాలయం ఉందని, కోటగుళ్లలోని శిల్ప విన్యాసం కుర్రారం శివాలయంలో కూడా కనిపిస్తుందని చెప్పారు. కుర్రారం శివాలయం త్రికూటరూపం. శిథిలం కావడంచేత కొంత భాగం శిథిలమైపోయిందని చెప్పారు. దేవాలయానికి ముఖమంటపం, అంతరాళం, గర్భగుడులు ఉన్నాయని తెలిపారు. మంటపంలోని స్తంభాలు కాకతీయశైలి, అంతరాళం ద్వారం శోభాయమానమైన శిల్పాలచేత అలంకృతమై ఉందన్నారు. ద్వారానికి రెండు వైపులా శైవ ద్వారపాలకులు ఇద్దరిద్దరు పరివారంతో వున్నారని చెప్పారు. గడపకు ముందు శైవమూర్తుల శిల్పాలు ఉన్నాయన్నారు. ఇవి కుర్రారం దేవాలయం కాలాముఖుల ఆరాధనాక్షేత్రమని చెబుతున్నాయని వివరించారు. దేవాలయం ముందర రామప్ప, వేయిస్తంభాల గుడుల పద్ధతిలో నందికి ప్రత్యేక మంటపం వుంది. గుడిలోపల కనిపించే విడివిగ్రహాలలో చాళక్యశైలి పార్వతి శిల్పముందని పేర్కొన్నారు. -
TS: ఆకునూరులో గ్రీకువీరుడు!
సాక్షి, హైదరాబాద్: ఈ శిల్పాన్ని చూడగానే గ్రీకువీరుడిలా అనిపిస్తుంది. కానీ ఇది ఓ యోధుడి స్మృతిశిల. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామశివారులోని సోమరాజుల కుంటలో బయటపడింది. రాష్ట్రకూటుల హయాంలో 9వ శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఆకునూరు ప్రాంతం అప్పట్లో ఓ యుద్ధ క్షేత్రం. రాష్ట్రకూటులకు, ఇతర సామ్రాజ్యాల రాజు లకు తరచూ యుద్ధాలు జరిగేవి. యుద్ధంలో వీరమరణం పొందిన యోధులను గుర్తు చేసుకునేలా ఇలా శిల్పాలు చెక్కి ప్రతిష్టించటం ఆనవాయితీ. వాటినే వీరగల్లులుగా పేర్కొంటారు. ఈ వీరగల్లును కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు. దీనితోపాటు మరొక వీరగల్లు, కాలభైరవ శిల్పం, నాగముచిలింద పోలికలున్న నాగవిగ్రహం బయటపడ్డాయి. ‘మొదటి వీరగల్లుపై సర్వాభరణాలున్నాయి. కుడి చేతిలో బాణం, ఎడమచేతిలో విల్లు ఉంది. నడి నెత్తిన కొప్పు, మూపున వీరశృంఖల, నడుమున పట్టాకత్తి ఉన్నాయి. వీరమరణం పొందాడనడానికి గుర్తు గా రెండుపక్కల అప్సరాంగణలు వింజామరలు వీస్తున్నట్టు చెక్కారు. శిల నిండా శిల్పి ప్రత్యేకతలు కనిపిస్తున్న ఇలాంటి చిత్రం అరుదు’అని కొత్త తెలంగాణ చరిత్ర బృందం ప్రధాన ప్రతినిధి శ్రీరామోజు హరగోపాల్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. కాగా,వీరగల్లులపై పరిశోధన జరపాల్సిన అవసరం ఉందని ఈ బృందం నిర్ణయించింది. చదవండి: ధాన్యం తగులబెట్టి.. రోడ్డుపై బైఠాయించి ధర్నా -
వృక్షాలపై ఔరా చిత్రకళా ‘కాండము’లు
కంచిలి (శ్రీకాకుళం): వృక్షాలే ఆయన కాన్వాస్. చెట్ల కాండలు కనిపిస్తే ఆయన తన మెదడుకు పదును పెడతాడు.. అద్భుతమైన బొమ్మ దింపేస్తాడు. ఆ విధంగా వృక్షాలను అందంగా తీర్చిదిద్దుతున్నాడు శ్రీకాకుళం జిల్లా కంచిలికి చెందిన ఉపాధ్యాయుడు గొర్లె దుర్గారావు. తన రెగ్యులర్ విధులతోపాటు, తనకిష్టమైన చిత్రకళ సరికొత్త పద్ధతుల్లో ప్రదర్శిస్తున్నారు. కంచిలిలో ఏపీ బాలయోగి గురుకుల పాఠశాల, కళాశాలలో ఆర్ట్స్ టీచర్‌గా గొర్లె దుర్గారావు విధులు నిర్వర్తిస్తున్నాడు. వృక్ష కాండములో కళాఖండాలు సృష్టించడం ఆయన ప్రత్యేకత. గురుకుల విద్యాలయ ఆవరణలో తిత్లీ తుఫాను వలన చెట్లు కూలిపోయాయి. ఈ సమయంలో ఒక టేకు చెట్టు పాఠశాల ఆవరణలో ఉండిపోయింది. పలుచగా.. పెద్ద సైజులో ఆ వృక్షం కాండం ఉండడంతో దుర్గారావు దానిపై తన కళను ప్రదర్శించాలని అనుకున్నాడు. ఈ విధంగా ఆ వృక్షంపై వీలు చిక్కినప్పుడల్లా వివిధ దేవతామూర్తుల ఆకారాలను చెక్కడం ప్రారంభించారు. ఈ విధంగా చెక్కుతూ ఇప్పటికీ 7 ప్రతిమలను చెక్కారు. గౌతమబుద్ధుడు, రాధాకృష్ణులు, వినాయకుడు, పరశురాముడు, వరాహావతారం, మత్య్సావతారం, కూర్మావతారం ప్రతిమలను చెట్లపై చెక్కారు.ఇవి చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పాఠశాల ఆవరణలో తరగతి గదుల సమీపంలో ఉన్న ఒక చెట్టు మొదలు మీద వినాయకుని ప్రతిమను చెక్కారు. అలాగే పాఠశాల చుట్టూ పలువురు దేశ నాయకుల ఫొటోలు, ఇతర చిత్రాలను గీశారు. ఇతని పనితీరు, శ్రద్ధను ప్రిన్సిపాల్ హెచ్. సింహాచలంతోపాటు, మిగతా ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు. -
16 ఏళ్లుగా భార్య శవంతో బెడ్‌పై..
సాక్షి,న్యూఢిల్లీ: భార్యపై ప్రేమతో ‘తాజ్‌మహల్’ లాంటి ప్రేమ సౌధాన్ని నిర్మించలేదు. గుడి కట్టి దేవతనూ చేయలేదు. కానీ తనకు శాశ్వతంగా దూరమైన భార్య శవంతోనే 16 ఏళ్లుగా కాలం గడుపుతున్న కథనం ఒకటి తాజాగా వెలుగు చూసింది. ఈ అభినవ షాజహాన్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. వివరాలను పరిశీలిస్తే.. వియత్నాంకు చెందిన లీవాన్, 1975లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఏడుగురు పిల్లలు ఉన్నారు. అయితే 2003లో అకస్మాత్తుగా వాన్ భార్య చనిపోయింది. దీంతో భార్యపై అమితమైన ప్రేమను చంపుకోలేక, భార్యనువిడిచి ఉండలేక ఎవరూ చేయని సాహసానికి పూనుకున్నాడు. రోజూ శ్మశానానికి వెళ్లి ఆమె సమాధిపైనే నిద్రించేవాడు. అలా నెలలు తరబడి అక్కడే గడిపేవాడు. ఒక రోజు వర్షం కురవడంతో ఆందోళన చెందిన వాన్, ఏం చేయాలా అని ఆలోచించాడు. భార్యకు దగ్గరగా ఉండటానికి ఏం చేయాలా తపన పడ్డాడు. ఆమె సమాధి పక్కన ఒక సొరంగం తవ్వి, అక్కడే ఆమె పక్కనే పడుకోవచ్చని అదే ఉత్తమమైన మార్గం అని నిర్ణయించు కున్నాడు. అయితే ఈ నిర్ణయాన్ని వాన్ సంతానం తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ అతని మనసు శాంతించలేదు.. భార్యపై ఉన్న ప్రేమ ఏమాత్రం చావలేదు. అందుకే రాత్రికి రాత్రి భార్య సమాధిని తవ్వి, అవశేషాలన్నింటినీ ఇంటికి తెచ్చేసుకున్నాడు. అయితే కుళ్లి, పాడైపోయిన స్థితిలో ఉన్న భార్య అస్థికలను భద్రంగా ఎలా దాచాలా అని మధనపడ్డాడు. ఇక్కడే అతని బుర్రలో మరో ఆలోచన వచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ పారీస్, సిమెంటు, జిగురు, ఇసుకల మిశ్రమంతో ఒక మహిళ బొమ్మను తయారు చేసి, అందులో తన భార్య అస్థికలను పొందికగా అమర్చాడు. అలా ఆ బొమ్మను కాదు కాదు.. తన భార్యను తన పడకగదిలో పెట్టుకుని నిశ్చింతగా నిద్రపోతూ కాలం వెళ్లదీస్తున్నాడు. -
వేటాడుతూ.. నేలకొరుగుతూ..!
సాక్షి, హైదరాబాద్: ఓ కథ.. ఓ శిల్పం.. అందులో కథనం.. ఇతివృత్తంలోని ఘట్టాలను వరుసగా పేర్చిన దృశ్య రూపం. పై నుంచి చూస్తూ వస్తే నాలుగు వరుసల్లో దృశ్య మాలిక. రెండు అడుగుల శిల్పం.. ఓ వీరగల్లు కథను చెప్పేసింది. స్పష్టమైన చిత్రాలు.. అవి పలికించిన భావాలు.. అందునా భావోద్వేగాలు. దాదాపు వెయ్యేళ్ల నాటి ఓ అద్భుత శిల్ప సౌందర్యం. చక్రవర్తుల రాచరికపు దర్పం మనకు ఎన్నో శిల్పాల్లో కనిపిస్తుంది. వాటికి సమాంతరంగా వీరగల్లుల వీరోచితం కూడా ప్రస్ఫుటమవుతుంది. యుద్ధంలోనో, వేటలోనో చనిపోయిన వారి పోరాటాన్ని వారి గుర్తుగా శిల్పంలో పాదుకొల్పటం నాటి ఆనవాయితీ. ఈ శిల్పాన్ని వీరగల్లు అంటారు. వారికి గుర్తుగా వేయించిన ఎన్నో శిల్పాలు వెలుగుచూస్తూనే ఉంటాయి. అలా ఓ వీరగల్లు శిల్పం ఇప్పుడు కొత్తగా కనిపించింది. తాజాగా దొరికిన శిల్పంలో ఓ కథను చెబుతున్నట్లు నాలుగు వరుసల్లో వేట దృశ్యాలను నిక్షిప్తం చేసిన తీరు ఆకట్టుకుంటోంది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట్ట ప్రాంతంలో ఎక్కడ చూసినా అలనాటి చరిత్రకు సాక్ష్యాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ ఊరి పొలిమెరలో ఉన్న శిల్పం తాజాగా వెలుగు చూసింది. దాన్ని ఓ దేవుడి విగ్రహం తరహాలో స్థానికులు ఆరాధిస్తున్నారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ ఇటీవల దాన్ని పరిశీలించి వీరగల్లు శిల్పంగా గుర్తించారు. దాన్ని ఔత్సాహిక పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ పరిశీలించి వీరగల్లుగా నిర్ధారించారు. వేటాడుతూ.. నేలకొరుగుతూ..! ఓ వీరుడు తన సహాయకులు, వేట కుక్కలతో కలసి వేటకు వెళ్లటం, అడవి పందులను వేటాడే క్రమంలో గాయపడటం, ఆ తర్వాత నేలకొరగటం, అతడిని బతికించాలన్నట్లు ఓ మహిళ (భార్య కావొచ్చు) అమ్మ వారిని వేడుకోవటం, ఆ తర్వాత భటులు అడవి పందులపై విరుచుకుపడి వాటిని వధించటం.. ఇలా వరుసగా చిత్రాలు ఆ శిల్పంలో కనిపిస్తున్నాయి. నాలుగు వరసల్లో ఉన్న ఆ చిత్రాలను చూస్తే ఈ గాథ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఆ కథకు ఎలాంటి ఆధారం లేకున్నా.. ఆ చిత్రాలు దాన్ని చెబు(చూపు)తున్నాయి. ఆ చిత్రాల్లోని కొన్ని గుర్తులు అవి జైన మతానికి సంబంధించినవన్న అభిప్రాయం కలుగుతోందని, ఈ శిల్పం దాదాపు 11వ శతాబ్దం నాటిది అయి ఉంటుందని హరగోపాల్ అంటున్నారు. ఈ ప్రాంతంలో జైనం వర్ధిల్లిన దాఖలాలుండటం కూడా దీనికి బలం చేకూరుస్తోందన్నది ఆయన మాట. గతంలో వీరగల్లు శిల్పాలు దొరికినా.. ఇలా ఓ కథ చెబుతున్నట్టు వరుసలుగా చిత్రాలుండటం మాత్రం అరుదేనని పేర్కొన్నారు. గుర్రంపై వేటకు బయల్దేరిన వీరుడు పైవరుసలో దర్పంగా కనిపిస్తున్నాడు. ఆ వెనక ఛత్రం పట్టుకున్న సైనికుడు, కింద వేట కుక్కలు లంఘిస్తున్న తీరు కనిపిస్తున్నాయి. అతడు ఓ పక్కకు ఒరుగుతున్న చిత్రం, ఆ పక్కనే ఓ మహిళ తన ఎడమ చేతిని నడుముపై ఉంచుకుని కుడి చేతితో దేవతకు ఏదో అర్పిస్తున్న చిత్రం, రెండు చేతుల్లో ఫలాలు పట్టుకుని, తలపై సర్పాకృతి ఉన్న దేవత రూపం, పక్కన వేట కుక్క, అడవిపందిపై కుక్క దాడి రెండో వరుసలో ఉన్నాయి. మూడో వరసలో.. చెట్టెక్కిన భటుడు, అతడి పక్కన విల్లంభులతో మరొకరు, ముందు లేడి, దానిపక్కన అడవి పందిపై వేటకుక్కల దాడి చిత్రాలున్నాయి. నాలుగో వరుసలో నాలుగు కుక్కలు ఓ అడవి పందిని చుట్టుముట్టిన చిత్రముంది. -
రామతీర్థంలో కొలువుకు సీతారాములు సిద్ధం
తిరుపతి ఎడ్యుకేషన్: ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో ధ్వంసమైన విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను తయారు చేయాలని విజయనగరం జిల్లా దేవదాయ శాఖ అధికారులు టీటీడీకి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో తిరుపతిలోని టీటీడీ శిలా శిల్ప ఉత్పత్తి కేంద్రంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని విగ్రహాలను శిల్పులు తయారు చేశారు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు విగ్రహాలను పీఠంతో కలిపి వేర్వేరుగా కృష్ణశిల రాతితో వీటిని మలిచారు. శుక్రవారం ఈ విగ్రహాలను విజయనగరం జిల్లా దేవదాయ శాఖ అధికారులకు అప్పగించనున్నారు. శిల్పారామం అభివృద్ధికి రూ. 9.50 కోట్లు సాక్షి, అమరావతి: పులివెందులలో ఉన్న శిల్పారామంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు గురువారం రూ.9.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 11 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన శిల్పారామం పార్కు శిథిలావస్థకు చేరుకోవడంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధితో పనులతో పాటు మౌళిక సదుపాయాలు కల్పించేందుకుగాను నిధులు విడుదల చేసింది. -
రైలును ప్రమాదం నుంచి కాపాడిన తిమింగలం!
ఆమ్స్టర్ డ్యామ్: నెదర్లాండ్‌లో ఒక సబ్వే రైలు ప్రమాదానికి గురి కాకుండా తృటిలో తప్పించుకుంది. సోమవారం తీసిన వైమానిక ఫోటోలో ఆ రైలును చూడవచ్చు. డి అక్కర్స్ మెట్రో స్టేషన్ వద్ద అదుపు తప్పిన రైలు నేరుగా రైలింగ్‌ను ఢీకొట్టి ముందుకెళ్లిపోయింది. అయితే పట్టాలను అనుకొని ఉన్న భారీ తిమింగలం తోక మీద ఆగింది. రోటర్ డామ్ మెట్రోకు దక్షిణంగా ఉన్న స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆర్కిటెక్ట్ స్ట్రూయిజ్స్ అనే వ్యక్తి 20 ఏళ్ల క్రితం తిమింగలాలు వంటి శిల్పాలను అక్కడ నిర్మించారు. ఈ సంఘటన గురించి స్ట్రూయిజ్ మాట్లాడుతూ, నేను ఆశ్చర్యపోయాను ఇలాంటి ఘటనను అసలు ఊహించలేదు. అయితే ఈ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నా అని అన్నారు. అదృష్టవశాత్తు రైలును పార్క్ చేయడానికంటే ముందే ప్రయాణికులందరూ దిగేశారు. ఆ సమయంలో లోకో పైలెట్ ఒక్కడే ఉన్నాడు. ఈ ప్రమాదంలో అతను ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. ఈ ప్రమాదం 30 అడుగుల ఎత్తులో జరిగింది. ఒక వేళ తిమింగలం తోక కనుక అక్కడ లేకపోతే పెను ప్రమాదమే జరిగేది. రైలును అక్కడ నుంచి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: పాపకి ఊహించని గిఫ్ట్.. డాడీ అంటూ.. -
పులిని పట్టుకోడానికి వెళ్లిన పోలీసులకు షాక్
లండన్: సెవనోక్స్లోని ఇఘ్తామ్ ప్రాంతంలో పులి సంచరిస్తోందని వార్తలు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే సాయుధ దళానికి చెందిన పదిమంది పోలీసులను ఆ ప్రాంతానికి పంపించారు. తీరా ఆ ప్రాంతాన్ని గాలింపు చేపట్టడానికి వెళ్లిన పోలీసులకు పెద్ద షాక్ తగిలినట్లైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇఘ్తామ్ గ్రామంలో పులి కనిపించిందంటూ వార్తలు రావడంతో పోలీసులు శనివారం నాడు రంగంలోకి దిగారు. ఇంతలో ఓ ఇంటి ముందు పులి కనిపించింది. ఇంకేముందీ.. వెంటనే దాన్ని పట్టుకునేందుకు ఆ ఇంటిపైనే హెలికాప్టర్లలో చక్కర్లు కొట్టారు. అయితే పులిలో కాస్తైనా కదలిక లేకపోవడంతో దగ్గరగా వచ్చి పరిశీలించిన పోలీసులకు షాక్ తగిలినట్టైంది. (ట్రాక్టర్‌పై పెద్ద పులితో పోరాడి..) ఎందుకంటే అక్కడ ఉన్నది పులీ కాదు పిల్లీ కాదు.. ఉట్టి పులి బొమ్మ. ఇంతలో హెలికాప్టర్ల శబ్ధంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన జూలియట్ సింప్సన్ అనే బామ్మ పోలీసులు ఇంటిని ముట్టడించడం చూసి నవ్వాపుకోలేకపోయింది. అనంతరం తాను తయారు చేసిన పులి బొమ్మను వారికి పరిచయం చేసింది. అది బొమ్మలా లేదని నిజమైన పులిలా కనిపిస్తోందని వారు చెప్పుకొచ్చారు. దీని కోసమేనా ఇంతలా ప్రయత్నించింది అని నవ్వుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇక ఆ ప్రదేశాన్ని పూర్తిగా గాలించిన తర్వాత అక్కడ ఎలాంటి జంతువు లేదని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ఇక ఈ విషయాన్ని ఆ ఇంట్లోని యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.(ఆడతోడు కోసమేనా..?) -
900 ఏళ్ల క్రితమే అవి ఉన్నాయి..!
న్యూఢిల్లీ : సోషల్ మీడియా విస్తృతి పెరడంతో సమాచార మార్పిడి వేగంగా జరుగుతోంది. ఏదైనా వింత, విశేషం, స్ఫూర్తిమంతమైన కథలకు ట్విటర్లో మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా తమిళనాడుకు చెందిన వి.గోపాలన్ అనే వ్యక్తి చేసిన ఓ పోస్టు ఆసక్తిగొలిపేదిగా ఉంది. దాదాపు 900 ఏళ్ల క్రితమే ప్రాచీన పురుషులు నేటి బాటా చెప్పులని పోలిన పాదరక్షలు వాడారని ఆయన ట్విటర్ ఓ శిల్పం ఫొటో షేర్ చేశాడు. అది తమిళనాడులోని అవుదయార్‌కోయిల్ ఆలయంలోనిదని ఆయన పేర్కొన్నాడు. ‘మన ప్రాచీనులు చాలా ఫ్యాషనబుల్. ఎన్నో వందల ఏళ్ల క్రితమే వారు శాండల్స్ ధరించారు. అవి ఎలా ఉన్నాయంటే.. బాటా పాదరక్షలను పోలి ఉన్నాయి. కావాలంటే ఫొటోను జూమ్ చేసి చూడండి’ అని క్యాప్షన్ పెట్టాడు. కాగా, గోపాలన్ ట్వీట్‌పై స్పందించిన ఓ యూజర్.. ‘ప్రాచీన కాలంలో.. దాదాపు 1400 ఏళ్ల క్రితం స్త్రీలు కూడా హీల్స్ వేసుకునేవారు. కంచిలోని కైలాసనాథర్ ఆలయంలోని ఈ శిల్పం ఫొటో చూడండి’ అని పేర్కొన్నాడు. వందల ఏళ్ల క్రితమే మహిళలు హై హీల్స్ వేసుకునేవారని మరో యూజర్ శాండల్స్ ధరించి ఉన్న శిల్పం ఫొటో షేర్ చేశాడు. ఇక అవుదయార్‌కోయిల్ ఆలయం 900 ఏళ్ల చరిత్ర కలిగి ఉందని ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు గోపాలన్ సమాధనమిచ్చాడు. రోమ్‌నగరం, ఏథెన్స్ నగరాలు ఉనికిలోకి రాకమునుపే మన కాశీ నగరం బాగా అభివృద్ధి చెందిందని మరొక యూజర్ రాసుకొచ్చారు. Ancient Indian men were very fashionable centuries back! They were wearing sandals thousand years back - the same model which BATA INDIA sells today! Zoom in to the pictures to see the similarity! Avudayar Koil, TN #IndianHeritage pic.twitter.com/gPeDoXOor7 — V Gopalan (@TheGopalan) January 4, 2020 -
శిలలపై శిల్పాలు చెక్కాడు
బొమ్మలను ఎవరైనా పేపర్, చార్ట్, వైట్ క్లాత్‌లపై వేస్తారు. కానీ, రాళ్లపై చిత్రాలు గీసే వారు అరుదుగా కనిపిస్తారు. పాఠశాలకు వెళ్తూ వెళ్తూ రోడ్డు పక్కన రాళ్లపై బొమ్మలు చెక్కుతున్నవారిని చూసి, అలా తాను చెక్కాలనుకుని, అదే కళను నేర్చుకుని, ఇప్పుడు దానిని జీవనోపాధిగా మల్చుకుని రాణిస్తున్నాడు ఆ యువకుడు. అలా శిలలపై చిత్రాలు చెక్కే అతని కళకు దాసోహమంటున్నారు ప్రజలు. అతడి కళాఖండాలు విదేశాలకు కూడా వెళ్తున్నాయి. అంతేకాకుండా పాఠశాలలకు ఉచితంగా సరస్వతిదేవి చిత్రాలను అందిస్తూ తనలోని దాతృత్వాన్నీ చాటుతున్నాడు ఖమ్మం వాసి ఉమేశ్‌చంద్ర. సాక్షి, ఖమ్మం: శిలలపై అతడి చేతులు అలవోకగా చిత్రాలు గీస్తాయి. అతి తక్కువ సమయంలోనే శిలపై అందమైన రూపం సంతరించుకుంటుంది. చదువుకునే సమయంలోనే ఈ కళపై ఏర్పడిన మక్కువ అతడికి జీవనోపాధిని కూడా కల్పిస్తోంది. ఇప్పుడు జిల్లాలోనే కాదు.. తెలంగాణ రాష్ట్రంలోనే ఏడు జిల్లాలకు శిలాఫలకాలపై చిత్రాలను గీయడం, ప్రారంభోత్సవాలు తదితర కార్యక్రమాలకు శిలాఫలకాలను పంపించడం వంటివి చేస్తున్నాడు. ఇంతగా తనకు నేర్పిన కళకు గుర్తుగా సరస్వతిదేవి బొమ్మలను చెక్కి పాఠశాలలకు వితరణగా అందిస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలో ఉమేశ్‌చంద్ర జన్మించారు. ఉపాధి కోసం అతడి తల్లిదండ్రులు 20 ఏళ్ల కిందట ఖమ్మానికి వచ్చారు. దీంతో ఖమ్మంలోనే ఉమేశ్‌చంద్ర విద్యాభ్యాసం సాగింది. చదువుకుంటున్న సమయంలో.. పాఠశాల కు వెళ్లే దారిలో ఉపేంద్రాచారి, కిరీటి అనే కళా కారులు ఇలా శిలాఫలకాలపై చిత్రాలను గీస్తుండటాన్ని ఉమేశ్‌చంద్ర గమనించాడు. వారు చిత్రాలను గీస్తున్న తీరు చూసి ఇతడి మనసంతా పులకరించిపోయింది. తాను కూడా అలా గీయాలని తపన పడ్డాడు. సొంతంగా చిత్రాలను గీయడం మొదలు పెట్టాడు. 2003లో పెయింటింగ్ వేయడం ప్రారంభించాడు. ఉపేంద్రాచారి, కిరీటీలకు ఏకలవ్య శిష్యుడిగా మారి.. పెయింటింగ్‌తోపాటు రాతిపై శిల్పాలు గీస్తూ తన కళను మెరుగు పరుచుకున్నాడు. మొట్టమొదటిగా రాతిబండపై అంబేడ్కర్ చిత్రాన్ని అద్భుతంగా గీయడంతో అతడి కళకు గుర్తింపు లభించింది. అనంతరం మరింతగా శ్రమించి శిలలపై చెక్కడం నేర్చుకున్నాడు. ఇప్పుడు అలవోకగా.. చిత్రాలను రాతిబండపై గీస్తూ రాష్ట్రస్థాయిలోనే కాకుండా.. విదేశాలకు కూడా తన కళాఖండాలను ఎగుమతి చేస్తూ బిజీగా ఉన్నాడు. కళాఖండమంటే ఉమేశ్‌చంద్ర.. రాష్ట్రవ్యాప్తంగా ఉమేశ్‌చంద్ర కళాఖండాలు గుర్తింపు పొందాయి. విదేశీయులు కూడా తమ మిత్రుల ద్వారా ఉమేశ్‌చంద్ర నుంచి తమకు కావాల్సిన కళాఖండాలను గీయించుకుని వెళ్తుంటారు. ఖమ్మం నగరంలో ఉన్న పలు షాపుల వారు కూడా ఉమేశ్‌చంద్రకు ఆర్డర్లు ఇచ్చి శిలాఫలకాలపై చిత్రాలను గీయించుకుంటుంటారు. జాతీయ నేతల చిత్రపటాల నుంచి అపురూప చిత్రాలను, ప్రకృతి దృశ్యాలను, ప్రారంభోత్సవాలు, ఇతర కార్యక్రమాలకు శిలాఫలకాలను అందజేస్తుంటారు. అంబేడ్కర్, అబ్దుల్ కలాం, రాజకీయ నాయకులు, సినీనటులు, గిరిజన నేపథ్యం కలిగిన కళాఖండాలను, సామాజిక స్పృహను కలిగించే చిత్రాలను గీస్తుంటాడు. రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ఆయన కళాఖండాలు అందజేస్తుంటాడు. అమ్మ పేరుతో కళాసేవా సమితి అమ్మ పద్మావతి పేరుతో కళాసేవా సమితి ట్రస్టును ప్రారంభించి ఏడాదిన్నరగా ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా శిలాఫలకాలపై సరస్వతి దేవి చిత్రాలను గీసి అందిస్తున్నాను. చిన్ననాటి నుంచే నాకు పెయింటింగ్‌పై ఉన్న ఆసక్తితో ఈ రంగాన్ని ఎంచుకుని జీవనాన్ని సాగిస్తున్నాను. ఏటా ఖమ్మంలో జరిగే ఎగ్జిబిషన్లలో నా శిల్పకళలను ప్రదర్శనకు పెడతాను. ఖమ్మం జిల్లాతో పాటు ఇతర జిల్లాలు, ఇటలీ దేశస్తులు కూడా వారికి కావాల్సిన కళారూపాలను ఫోన్ ద్వారా తెలిపి గీయించి తీసుకెళ్తుంటారు. –ఉమేశ్‌చంద్ర, కళాకారుడు -
న్యూయార్క్‌కు ఫణిగిరి శిల్పం
సాక్షి, హైదరాబాద్: అది నాలుగు అడుగుల శిల్పం. వయసు దాదాపు 1800 సంవత్సరాలు. బుద్ధుడి జీవితాన్ని మూడు ఘట్టాలుగా విభజించి అద్భుతంగా చెక్కిన కళాఖండం. సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో లభించిన ఈ శిల్పం ఇప్పుడు ఆమెరికా గడ్డమీద అంతర్జాతీయ పర్యాటకులకు కనువిందు చేయబోతోంది. దేశంలోనే గొప్ప బౌద్ధ స్థూపమున్న ప్రాంతాల్లో ఒకటిగా వెలుగొందుతున్న సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో లభించిన క్రీ.శ. రెండో శతాబ్దం నాటి సున్నపురాయి శిల్పాన్ని విదేశీ ఎగ్జిబిషన్లకు ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం ఎంపిక చేసింది. ‘ది మెట్రోపాలిటన్ మ్యూజియమ్స్ ఆఫ్ ఆర్ట్ (ది మెట్)’150వ వార్షికోత్సవాన్ని అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్వహిస్తోంది. స్థానిక మెట్రోపాలిటన్ మ్యూజియంలో వచ్చే ఏడాది జరగబోయే ఈ వేడుకలో ‘ట్రీ అండ్ సర్పెంట్’పేరుతో బుద్ధుడి ఇతివృత్తంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ మ్యూజియాల్లో ఉన్న బుద్ధుడికి సంబంధించిన అరుదైన కళాఖండాలను ఇందులో ప్రదర్శనకు ఉంచాలని నిర్ణయించింది. ఈమేరకు మన దేశం నుంచి కొన్నింటిని ఎంపిక చేయాల్సిందిగా ఆ సంస్థ ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంను కోరింది. దీంతో రంగంలోకి దిగిన నేషనల్ మ్యూజియం.. ఏరికోరి హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో ఉన్న బుద్ధుడి జీవితగాథను ప్రతిబింబించే శిల్పాన్ని ఎంపిక చేసింది. ఈ పురాతన విగ్రహాన్ని న్యూయార్క్‌కు పంపేలా ఏర్పాట్లు చేయమని హెరిటేజ్ తెలంగాణకు సూచించింది. దీంతో హెరిటేజ్ అధికారులు అనుమతి కోరుతూ రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డిసెంబరులో ఈ శిల్పాన్ని న్యూయార్క్‌కు పంపనున్నారు. విదేశీ నిపుణులతో పూర్వ వైభవం! నాలుగు అడుగుల ఎత్తున్న ఈ శిల్పాన్ని ఇక్ష్వాకుల కాలంలో రూపొందించారు. ఫణిగిరి బౌద్ధ స్థూపం పరిసరాల్లో 2001లో చేపట్టిన తవ్వకాల్లో ఇది వెలుగు చూసింది. సున్నపురాయితో రూపుదిద్దుకున్న ఈ శిల్పం బుద్ధుడి జీవిత పరమార్థాన్ని 3విభాగాలుగా వివరిస్తూ రూపొందింది. రాజమందిరంలో ఉండటం సరికాదని నిర్ధారించుకుని సిద్ధార్థుడు అడవికి వెళ్లిపోవటం, బుద్ధుడిగా మారి జీవిత పరమార్థాన్ని వివరిస్తూ తన బోధనలను విశ్వవ్యాప్తం చేయటం, తుదకు స్వర్గానికి చేరుకోవటం. శిల్పుల పనితీరు కూడా అద్భుతంగా ఉండటంతో అదిసాధారణ శిల్పం కాదని అప్పట్లోనే తేలిపోయింది. దీంతో దీనిపై స్మగ్లర్ల దృష్టి పడింది. అది లభించిన చోటే తాత్కాలికంగా ప్రదర్శనకు ఉంచటంతో, రాత్రి వేళ కొందరు స్మగ్లర్లు ఆ విగ్రహాన్ని అపహరించారు. గోనెపట్టాల్లో చుట్టి లారీలో సూర్యాపేట మీదుగా దాచేపల్లి తరలించి ఓ ఇంట్లో డ్రైనేజీ సంపులో దాచారు. ఈ క్రమంలో అది మూడు ముక్కలైంది. అప్పట్లోనే ఈ శిల్పం ఖ్యాతి అంతటా వ్యాపించడంతో.. ఈ చోరీ అంశాన్ని నాటి రాష్ట్రపతి కార్యాలయం కూడా తీవ్రంగా పరిగణించింది. దీంతో 2004లో నాటి రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని దొంగల వేట ప్రారంభించి చివరకు పట్టుకుంది. హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో.. తర్వాత ఆ శిల్పానికి స్థానిక పద్ధతులతో మరమ్మతు చేయించి హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టింది. రెండేళ్లక్రితం ప్రధాని నరేంద్ర మోదీ లండన్ పర్యటన సమయంలో.. బ్రిటిష్ మ్యూజియం ప్రతినిధులు ఆయనతో భేటీ అయ్యారు. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 7దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా అంతర్జాతీయ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ముంబై ఛత్రపతి శివాజీ మ్యూజియం, ఢిల్లీ నేషనల్ మ్యూజియంలతో కలిసి సంయుక్తంగా మూడు ప్రాంతాల్లో ఈ ప్రదర్శన ఏర్పాటుకు అనుమతి కోరారు. దీనికి మోదీ సరేననడంతో 2017 నవంబరులో ముంబైలో 3నెలల పాటు, గతేడాది ఢిల్లీలో 3నెలల పాటు ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శన కోసం ఫణిగిరి శిల్పాన్ని ఎంపిక చేశారు. కానీ విరగడంతో తిరిగి అతికించినట్టు స్పష్టంగా కనిపించటంతో శిల్పంలో లోపం స్పష్టంగా కనిపించింది. భవిష్యత్తులో అది లండన్, న్యూయార్క్‌ల్లో ప్రదర్శనకు తరలేందుకు అవకాశం ఉండడంతో.. ఆ విగ్రహానికి అంతర్జాతీయ ప్రమాణాలతో మరమ్మతు చేయించాలని నిర్ణయించారు. దీంతో ఈ మధ్యే ముంబైలో విదేశీ పరిజ్ఞానంతో నిపుణులు అందంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం దానిపై ఎక్కడా వెంట్రుక మందంలో కూడా గీతలు కనిపించకుండా పూర్వవైభవం కల్పించారు. రూ.3 కోట్లకు బీమా ఇటీవల దాన్ని ముంబైకి అక్కడి నుంచి ఢిల్లీకి తరలించే క్రమంలో హెరిటేజ్ తెలంగాణ ఈ విగ్రహానికి రూ.2 కోట్లకు బీమా చేయించింది. ఇప్పుడు న్యూయార్క్‌కు తీసుకెళ్లేక్రమంలో రూ.3 కోట్లకు బీమా చేయించనున్నట్టు సమాచారం. కిందపడ్డా విరగకుండా దాన్ని ప్రత్యేకంగా ప్యాక్ చేయించనున్నట్టు ఢిల్లీ మ్యూజియం అధికారులు పేర్కొన్నారు. -
విశిష్ట దైవం... విశ్వకర్మ
సృష్టిలో ఏదైనా ఒక విశేషమైన శిల్పం చూసినా, ఒక నిర్మాణం కనిపించినా విశ్వకర్మ సృష్టి అంటుంటాం. వేదవిదులు ఆయనను సకల జగత్ సృష్టికర్త అంటారు. పౌరాణికులు మాత్రం సకల లోకాలనూ నిర్మించే దేవశిల్పి అంటారు. ఋగ్వేదంలో సృష్టి సూక్తాలు పేరిట కనిపించే నాలుగు సూక్తాలలో విశ్వకర్మ సూక్తం ఒకటి. ఈ సూక్తమే ఆయనను సకలలోక అధిష్ఠాత అని పిలిచింది. వేదదేవతలలో ఒకడిగా పరిగణించబడిన ఈ స్వామి పురాణాలలో పంచముఖుడిగా దర్శనమిస్తాడు. ఆయన ఐదుముఖాల నుండి ఐదుగురు మహర్షులు ఆవిర్భవించారు. వారే మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞలు. ఈ ఐదుగురికి ఐదు రకాలైన శిల్పకార్యాలను ఉపదేశించి సృష్టిని వృద్ధి చేయమని ఆదేశించాడు. విశ్వకర్మ శిల్పాలు, ఆలయాలు దేశమంతా ఉన్నా అక్కడక్కడా అరుదైన విగ్రహాలు కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో వెలసిన లేపాక్షి ఆలయంలో నిలుచున్న భంగిమలో ఉన్న విశ్వకర్మ శిల్పం స్తంభంపై చెక్కి ఉంది. ఐదు ముఖాలతో, పది చేతులతో దర్శనమిస్తాడు విశ్వకర్మ. నిజహస్తాలలో అభయ–వరదముద్రలతో, పరహస్తాలలో శంఖం, చక్రం, విల్లు, బాణం, త్రిశూలం, డమరుకం, టంకం (సుత్తి), నాగం దర్శన మిస్తాడు. కాగా కేరళ రాష్ట్రంలోని కాన్యంగాడులో పరశివ విశ్వకర్మ ఆలయం అతి పురాతనమైనది. విశ్వకర్మ దర్శనంతో సకల బంధనాలనుండీ విడివడతారనీ, ఈయన వా(క్ప)చస్పతి కనుక విద్య చక్కటి విద్య, సకలైశ్వర్యాలు కలుగుతాయని, ఇహంలో సుఖం, పరంలో మోక్షం లభిస్తాయని పురాణ వచనం. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
సీఎం సైకత శిల్పం
కురవి: సీఎం కేసీఆర్ ఎన్నికల్లో సాధించిన విజయానికి గుర్తుగా ఓ కళాకారుడు ఆయన సైకత శిల్పాన్ని రూపొందించాడు. సైకత శిల్పాలు తయారు చేయడంలో దిట్ట అయిన మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన కళాకారుడు, లిమ్కాబుక్ ఆఫ్ రికార్డు గ్రహీత నీలం శ్రీనివాసులు ఎన్నికల్లో కేసీఆర్ 88 సీట్లు సాధించడంతో ‘కేసీఆర్ ద సన్ ఆఫ్ తెలంగాణ ఎట్ ద రేట్ ఆఫ్ 88 ’అనే టైటిల్‌తో ఈ సైకత శిల్పాన్ని తయారు చేశాడు. దీని తయారీకి 40 గంటల సమయం పట్టిందని శ్రీనివాసులు తెలిపారు. ఈ సైకత శిల్పాన్ని ఎలాగైనా కేసీఆర్‌కు అందించేందుకు ప్రయత్నిస్తానన్నారు. సైకత శిల్పాన్ని తయారు చేసిన శ్రీనివాసులును గ్రామస్తులు అభినందించారు. -
నాకూ ఓ మనసుంది
అంత అందమైన అమ్మాయిని చూడటం అదే మొదటిసారి. అంటే ఇంతకు ముందు అందమైన అమ్మాయిల్ని చూళ్లేదని కాదు, కానీ ఇంత అందంగా, అద్భుతమైన శిల్పం చెక్కినట్టు, ఎక్కడా అంగుళంలో వెయ్యోవంతు కూడా కొలత తప్పకుండా... అప్సరసలు కూడా ఇంత అందంగా ఉండరేమో! సాయం సంధ్యలో సముద్రపు ఒడ్డున కూచుని ఎగసిపడే అలల్ని చూస్తూ... పక్కనే ఎవరో కూచోవడంతో తల తిప్పి చూసి... తర్వాత తల తిప్పుకోలేక... ఎంత అవస్థో కదా! ఓవైపు ఆడపిల్ల మొహం వైపు తదేకంగా చూడకూడదన్న సంస్కారం వెనక్కి లాగుతుంటే మరోవైపు ఈ అతిలోక సౌందర్యాన్ని వీక్షించడంలో ఓ క్షణం కోల్పోయినా జీవితం వృథా అనిపిస్తోంది. ఆమె కూడా తల తిప్పి నావైపు చూసింది. తిడుతుందేమోనన్న భయంతో చూపులు మరల్చబోతూ ఆమె పెదవుల మీద పూసిన మనోహరమైన నవ్వు చూసి ఆగిపోయాను. ‘‘హలో... ఏమిటలా చూస్తున్నారు? అబద్ధం చెప్పకండి. నాకు తెలుసు మీరెందుకలా చూశారో’’ అంది. ఓవైపు గొంతు తడారిపోయి తొట్రుపాటు... మరోవైపు తనే పలకరించినందుకు ఒంట్లో అలల్లా కదులుతున్న పులకింత. ‘‘మీకు తెలుసున్నారుగా... ఇంకా చెప్పడం దేనికి?’’ అన్నాను. ‘‘మీరేం చెప్తారో విందామని’’ ‘‘రోజూ మీరు అద్దంలో మీ ముఖాన్ని చూసుకున్నప్పుడల్లా మీరనుకునేదే నా జవాబు కూడా’’ ‘‘అదే సమస్య. అద్దం మాట్లాడదుగా... దానికే మాటలు వస్తే ఎంత బాగుండేదో కదా. మీకొచ్చుగా... చెప్పండి’’ ‘‘పొగడ్తలు వినడం చాలా ఇష్టంలా ఉందే’’ ‘‘పొగడ్తలంటే ఇష్టపడని అమ్మాయిలు కూడా ఉంటారా?’’ అంటూ మరోసారి నవ్వింది. ప్రతి ఆదివారం సాయంత్రం ఈ బీచ్ ఒడ్డున కూచుని సముద్రంలో పొంగుతున్న అలల్ని చూడటం ఓ ఏడాది నుంచి నా అలవాటు. కానీ ఈ అమ్మాయిని ఎప్పుడూ చూసినట్టు గుర్తు లేదు. ‘‘మీరీ బీచ్‌కి రెగ్యులర్‌గా వస్తుంటారా?’’ అని అడిగాను.‘‘లేదు. ఇదే మొదటిసారి రావడం’’‘‘అలానా... అయితే నేను చాలా అదృష్టవంతుణ్ణి. మీరు బీచ్‌కి వచ్చిన మొదటి రోజే మీ పరిచయభాగ్యం కలిగింది. ఇంతకూ మీ పేరేమిటో చెప్పలేదు’’‘‘మీరడగలేదుగా’’ అంటూ నవ్వింది. ‘‘నా పేరు లిఖిత’’‘‘స్వీట్ నేమ్. నా పేరు సునీల్. ఇక్కడే యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ని. మరి మీరు?’’‘‘అన్నప్రాశననాడే ఆవకాయ తినిపిస్తారా ఏమిటి?’’ తొందరెందుకు? మళ్లీ కలుస్తాంగా’’‘‘ఎప్పుడు?’’‘‘వచ్చే ఆదివారం. ఇక్కడే’’ ఆమె లేచి కదుల్తున్న అలలా వెళ్లిపోయింది.ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఆరాటం... సోమవారం తర్వాత ఆదివారం వస్తే ఎంత బావుండునో కదా అనే ఆశ. నిజంగానే వస్తుందా... ఒకవేళ రాకపోతేనో అనే అనుమానాలు... ఆదివారం రానే వచ్చింది. అప్పటి వరకు రోజులు యుగాల్లా గడిపితే ఈ రోజు మాత్రం నిమిషాలే యుగాల్లా సుదీర్ఘంగా సాగి బాధిస్తున్నాయి. బీచ్‌లో ఎదురుచూస్తూ కూచున్నప్పుడు క్షణాలు యుగాల్లా... లిఖిత వచ్చింది. ఎన్ని కబుర్లో. ఆమె అందమైన నవ్వుల్ని మధ్య మధ్యలో ఆస్వాదిస్తూ... అలాంటి ఎన్ని ఆదివారాలు అందమైన అలల్లా వచ్చి వెళ్లాయో... లిఖితను చూడకుండా ఉండలేని పరిస్థితి. రోజులో అధికభాగం లిఖితను కలవరిస్తూ... పలవరిస్తూ... నేను ప్రేమలో పడ్డానని అర్థమైంది. మొదట నన్నాకర్షించింది ఆమె అందమే అయినా నన్ను కట్టి పడేసింది మాత్రం ఆమె తెలివి, వాక్చాతుర్యం.‘‘మనం పెళ్లి చేసుకుందాం’’ అన్నానో రోజు.‘‘సారీ, నేను పెళ్లికి యోగ్యురాల్ని కాను’’ లిఖిత మొహంలో సముద్రమంత ఉదాసీనత... ‘‘నీకేం తక్కువ? ఎందుకలా అనుకుంటున్నావు?’’ అన్నాను ఆశ్చర్యపోతూ.‘‘నేను తల్లిని కాలేను. ఓ బిడ్డకు జన్మనివ్వడానికి అవసరమైన యుటెరస్, ఓవరీస్, ఫాలోపియన్ ట్యూబ్స్ లాంటి అవయవాలు నాలో లేవు’’‘‘నీకెలా తెలుసు? డాక్టర్లు చెప్పారా? ఎప్పుడు చెకప్ చేయించుకున్నావు? పెళ్లి కాకముందే పిల్లల గురించి ఎందుకు డాక్టర్లని కన్సల్ట్ చేశావు?’’ అని అడిగాను.విషాదంగా నవ్వి ‘‘డాక్టర్లు చెప్పలేదు. నాకు తెలుసు’’ అంది.‘‘అదే ఎలా తెలుసు?’’ కొద్దిగా చిరాగ్గా అడిగాను.‘‘నన్నడగొద్దు. ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను’’ అంటూ నేను పిలుస్తున్నా వినకుండా ఇసుకలో లుప్తమైపోతున్న అలలా వేగంగా వెళ్లిపోయింది.నేనీ విషయం గురించి తీవ్రంగా ఆలోచించాను. ప్రేమంటే ఆమెలోని ఉత్తమ లక్షణాల్ని ఇష్టపడటమే కాదు, లోపాల్ని కూడా అంగీకరించాలి కదా. పిల్లలు లేకున్నా పర్లేదు. కంటేనే పిల్లలా... పెంచినామన పిల్లలవుతారు. ఏ అనాథాశ్రమం నుంచో ఓ ఆడపిల్లని తెచ్చి పెంచుకుంటే చాలు. మాకు పిల్లలు లేని లోటు తీరటంతో పాటు ఆ పిల్లకు తల్లి ప్రేమనూ తండ్రి ప్రేమనూ అందించవచ్చు.ఆదివారం కలుసుకున్నప్పుడల్లా ‘‘పిల్లలు పుట్టకున్నా పర్లేదు. మనం పెళ్లి చేసుకుందాం’’ అన్నాను.లిఖిత నావైపు ఆరాధనగా చూసింది. ‘‘మీ వాళ్లతో వచ్చి మాట్లాడనా? మన మధ్య ప్రేమ చిగురించి ఇన్ని నెలలైనా నువ్విప్పటి వరకు మీ ఫ్యామిలీ గురించి ఏమీ చెప్పలేదు. మీ నాన్నగారు ఏం చేస్తారు? మీ ఇల్లెక్కడ?’’ అని అడిగాను. ‘‘సారీ... ఇంత క్రితం కూడా నువ్వు చాలాసార్లు అడిగావు. నేను చెప్పలేదు. చెప్పలేను కూడా’’‘‘అనాథవా?’’‘‘ఓ రకంగా అంతే. మరో రకంగా కాదు’’‘‘అర్థంకాని ప్రహేళికలా మాట్లాడతావెందుకు?’’‘‘నేను నిజంగానే ఓ పజిల్ని కాబట్టి’’‘‘సరే, అవన్నీ నీ వ్యక్తిగత విషయాలు. ఇప్పుడు మన పెళ్లి జరగాలంటే నీ వైపు బంధువులెవరైనా ఉండాలిగా’’‘‘బంధువులు ఎవ్వరూ లేరు. మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందామో చెప్పు.తప్పించుకుని వచ్చేస్తా’’‘‘తప్పించుకుని రావడమేంటి? అంటే ఎవరైనా నిన్ను నిర్బంధించారా? అదే నిజమైతే ఇలా ప్రతి ఆదివారం బయటికి స్వేచ్ఛగా ఎలా రాగలుగుతున్నావు?’’లిఖిత మొహంలో దిగులుఅరణ్యంలా విస్తరించడం గమనించాను. ఓసారి తల తిప్పి వెనక్కి చూసింది. ఆమె కళ్లలో బెదురు...‘‘నేను స్వేచ్ఛగా తిరుగుతున్నానని అనుకుంటున్నావా? లేదు. నాకు స్వేచ్ఛ లేదు. బందీని. నా ప్రతికదలికనీ రెండు జతల కళ్లు గమనిస్తూ ఉంటాయి. స్వేచ్ఛ కోసం పరితపిస్తున్న పంజరంలో పక్షిని నేను’’ ఆమె సన్నగా ఏడుస్తోంది.‘‘నాకు అర్థమయ్యేలా చెప్పు. అవసరమైతే పోలీసుల సాయం తీసుకుందాం.నువ్వు గూండాల చెరలో ఉన్నావా? మాఫియా గ్యాంగ్ ఏదైనా నిన్ను తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తోందా?’’‘‘లేదు. అలాగని నేను స్వతంత్రురాల్ని కూడా కాదు’’‘‘అబ్బా... మళ్లీ పజిల్’’‘‘దయచేసి ఇంక నన్నేమీ అడక్కు. పెళ్లి ఎప్పుడు చేసుకుందామో చెప్పు. ఎలా రావాలో ఎవరి దృష్టి నుంచి తప్పించుకు రావాలో అదంతా నా సమస్య’’ అంది స్థిరంగా.‘‘సరే. నిన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలేవీ వేయను. వచ్చే ఆదివారం ఉదయం నా గదికి వచ్చేయి. పెళ్లి చేసుకుందాం. నా అడ్రస్ కాగితం మీద రాసిస్తాను’’ అంటూ పెన్ను తీయబోతుంటే లిఖిత వారించింది.‘‘వద్దు. చెప్పు చాలు. గుర్తు పెట్టుకుంటాను’’ మళ్లా వెనక్కి తిరిగి భయం భయంగా చూస్తూ అంది.నేనూ వెనక్కి తిరిగి చూశాను. ఆదివారం కాబట్టి గుంపులు గుంపులుగా మనుషులు ఉన్నారు. ఎవరి ధ్యాసలో వాళ్లున్నారు తప్ప మావైపు పత్తేదారు కళ్లతో చూస్తున్న శాల్తీలెవ్వరూ కనిపించలేదు.అడ్రస్ చెప్పాక ‘‘తప్పకుండా వస్తాను’’ అనేసి వెళ్లిపోయింది.ఆదివారం రోజు... ఉదయం నుంచి ఉత్కంఠ... నిన్న రాత్రి నిద్రపడితే ఒట్టు. ఎడతెరిపిలేని ఆలోచనలు... ఉదయం ఐదింటికే లేచి కూచున్నా. సమయం ముందుకు కదలడం లేదన్న అసహనం. అశాంతిగా గదంతా ఏ వందసార్లు తిరిగుంటానో.పదయింది... పదకొండు... పన్నెండు... లిఖిత జాడ లేదు. నేను అడ్రస్ రాసివ్వకుండా చెప్పి తప్పు చేశానేమో! ఒకట్రెండు కొండ గుర్తులైనా చెప్పి ఉండాల్సింది. డోర్ నంబర్లో చాలా అంకెలున్నాయి. మర్చిపోయిందో ఏమో! వీధిలోకొచ్చి నిలబడ్డాను. కాళ్లు నొప్పెడుతున్నాయి. ఎన్ని గంటల నుంచి నిలబడి ఉన్నానోఏమో... మెల్లగా చీకట్లు కమ్ముకోసాగాయి. లిఖిత రాలేదు.తన దగ్గర మొబైల్ ఫోన్ లేదు. ఓ రోజు నేను కొనిస్తానన్నా విన్లేదు. తనకిష్టం ఉండదని చెప్పింది. ఇప్పుడు తను రాకపోవడానికి కారణమేమిటో తెలిసే అవకాశం లేదు. ఆదివారం వరకు ప్రాణాల్ని ఉగ్గబట్టుకుని ఎదురు చూశాను. ఆదివారం సాయంత్రం బీచ్‌లో తన కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూశాను. రాలేదు. ఆ ఆదివారమే కాదు, ఆ తర్వాత వచ్చిన ఆదివారాలప్పుడు కూడా లిఖిత బీచ్‌కి రాలేదు. చిక్కని చీకటిలాంటి నిరాశ. ఇంక ఎప్పటికీ వెల్తురనేదే కనిపించదా అనే నిస్పృహ... దుఃఖం దట్టమైన కీకారణ్యంలా నన్ను తనలోకి లాక్కుంటోంది. లిఖిత ఏమైంది? మెరుపులా మెరిసి మరుక్షణంలో మాయమైపోయినట్టు... మోసం చేసిందా? లేదు. చాలా అమాయకమైన పిల్ల. స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి. తన ప్రేమ నిజమైనది. మరి ఎందుకు రాలేదు? ఎవరో తనను గమనిస్తూ ఉంటారని చెప్పిందిగా.వాళ్లేమైనా కట్టడి చేశారా? లిఖిత క్షేమంగా ఉందా? అసలీ ఊళ్లోనే ఉందా లేక ఎక్కడికైనా తీసుకెళ్లిపోయారా? నిరంతరం ఇవే ఆలోచనలు... మనశ్శాంతి కరువైంది. ఆదివారం సాయంత్రాలు బీచ్ ఒడ్డున పిచ్చోడిలాతిరగటం మాత్రం మానలేదు.ఓ ఆదివారం ఉదయం ఉరుములేని మెరుపులా లిఖిత నా రూమ్‌లో ప్రత్యక్షమైంది. భుజాల చుట్టూ గులాబి పూల డిజైన్ ఉన్న షాల్ కప్పుకుని... అందంగా ఉండే మొహం నిండా ఆందోళన...‘‘ఇన్నాళ్లూ ఏమైపోయావు?’’ అంటూ ఉద్విగ్నంగా అడిగాను.‘‘అవన్నీ చెప్పేంత సమయం లేదు. తొందరగా బయల్దేరు. మనం ఈ ఊరు విడిచిపెట్టి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోదాం’’ అంది.ఆమె కళ్లలో భయం నగ్నంగా...‘‘ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లగలం? ఎక్కడికని వెళ్లగలం?’’‘‘నాకు తెలియదు. కానీ వెళ్లిపోక తప్పదు. నా కోసం వెతుకులాట మొదలైంది. నేను కనిపిస్తే బతకనివ్వరు.చంపేస్తారు.’’‘‘ఎవరు వాళ్లు?’’ మనం పోలీస్ స్టేషన్కెళ్దాం.’’‘‘లాభం లేదు. లీగల్‌గా నేను వాళ్ల ప్రాపర్టీ. వాళ్లు నన్ను ఏమైనా చేసుకునే అధికారం ఉంది. చంపినా ముక్కలు ముక్కలుగా నరికినా పోలీసులు కూడా జోక్యం చేసుకోలేరు’’‘‘మనం ఉంటున్నది సభ్య సమాజంలో... అడవిలో కాదు. నువ్వు మేజర్‌వి. నీ ఇష్టమొచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు నీకుంది. దాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరు.’’‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు నన్ను గమనించడానికి నియమించబడ్డ వ్యక్తికి తెలిసిపోయింది. మనం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం కూడా అతను స్పష్టంగా విన్నాడు. అందువల్లనే మరునాడు నన్ను గదిలోంచికదలనీయకుండా బంధించారు.’’‘‘అదెలా సంభవం? మనం ఆ రోజు పెళ్లి గురించి మాట్లాడుకున్న సమయంలో చుట్టుపక్కల కొన్ని మీటర్ల దూరం వరకు ఎవ్వరూ లేరుగా’’ అన్నాను.‘‘నాకు తెలియకుండా నా జడపిన్నులో మైక్రో ట్రాన్స్‌మీటర్ అమర్చారు. నన్ను బంధించిన రోజు నా రక్షకుడితో బాగా గొడవ పడ్డాను. నాకు ప్రేమించే హక్కు లేదా అని అడిగాను. లేదన్నాడు. నన్ను నీకు దగ్గర చేయడంలో ఉద్దేశం నేను మానసికంగా పరిపక్వత సాధించానా లేదా, శారీరకంగా పరిపూర్ణతను పొందానా లేదా అనేది నిర్ధారించుకోవడానికి పెట్టిన పరీక్ష మాత్రమేనట. నేను మగవాళ్లని ఎంత త్వరగా ప్రేమలో పడేయగలిగితే అంత గొప్పగా సఫలీకృతురాలినైనట్టు లెక్క. వాళ్లు చేస్తున్న ప్రయోగాల్లో ఆఖరి మజిలీని నేను’’‘‘అదేం పరీక్ష? ఏం ప్రయోగాలు? నాకర్థం కావడంలేదు. మీ నాన్న ఏమైనా సైకాలజీ ప్రొఫెసరా? ఆడపిల్లల మనస్తత్వం మీద రీసెర్చ్ చేస్తున్నాడా?’’‘‘నాన్న కాదు. రక్షకుడు.. నేను నిన్ను ప్రేమలో పడేయాలి తప్ప నేను ప్రేమలో పడకూడదట. పెళ్లి మాటే తల్చుకోకూడదట. నేను పారిపోతానేమోనని కుర్చీకితాళ్లతో కట్టేసి, గదిలో పెట్టి తలుపేశారు.ఎలాగోలా తాళ్లు విప్పదీసుకుని, తలుపు తెరుచుకున్న వెంటనే అతన్ని పక్కకు నెట్టేసి బయటికి పరుగెత్తాను. కొంత మంది నా వెంట పడ్డారు. వాళ్లకు దొరక్కూడదని చాలా వేగంగా పరుగెత్తాను. అందులో ఒకడు నా మీదికి కత్తి విసిరాడు.’’ నాకు చప్పున భయమేసింది. ‘‘కత్తి విసిరాడా? ఎంతటి దుర్మార్గుడు... నీకు తగల్లేదు కదా’’ అన్నాను కంగారుపడుతూ.‘‘నా మెడకు గురిచూసి విసిరాడు. అదృష్టం. గురి తప్పింది. లేకపోతే మెడ తెగి పడిపోయి ఉండేది’’ విషాదంగా నవ్వింది.‘‘వాళ్లు ఆ రోజు మనం మాట్లాడుకున్న మాటల్ని మైక్రో ట్రాన్స్‌మీటర్ ద్వారా విని ఉంటే నా గది ఎక్కడో తెలిసిపోయి ఉండాలిగా’’‘‘తెలుసు... ఒకసారి ఎవర్నో పంపించి నీ అడ్రస్ కరెక్టో కాదో సరిచూసుకున్నారు కూడా. అందుకే చెప్పేది. మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్లిపోవాలి. వాళ్లు ఏ క్షణమైనా ఈ గదికి రావొచ్చు’’‘‘రానీయ్. వాళ్ల సంగతేంటో తేల్చుకుంటాను. చుట్టుపక్కల ఉన్న వాళ్లందర్నీమనకు రక్షణగా పిలుస్తాను. నీ మీద కత్తి విసిరిన దుర్మార్గుడి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి జైల్లో తోయిస్తాను’’ అన్నాను ఆవేశంగా.‘‘లాభం లేదు. నా విషయంలో ఈ చట్టాలు వర్తించవు. ప్రభుత్వం మాలాంటి వాళ్ల రక్షణ కోసం కొత్త చట్టాలు చేసే వరకు వాళ్లను ఎవ్వరూ ఏమీ చేయలేరు.’’‘‘మళ్లా పజిల్ భాషలో మాట్లాడుతున్నావు. వాళ్లేమైనా దివి నుంచి దిగొచ్చినా దేవతలా లేక వేరే గ్రహం నుంచి మన భూమి పైకొచ్చిన ఏలియన్సా?’’‘‘రెండూ కాదు. వాళ్ల ఉద్దేశంలో నాకు తెలివుండాలి కాని మనసుండకూడదు. అందులో ప్రేమలాంటి అనుభూతులు ఉండకూడదు’’‘‘నిన్నేమైనా మరబొమ్మనుకుంటున్నారా?’’‘‘మాటల్తో సమయం వృథా చేయకుండా నన్నిక్కడి నుంచి తీసుకెళ్లిపో. దూరంగా.. వీళ్లకు అందనంత దూరంగా... ప్లీజ్... బయల్దేరు. నీ వాదనలు నా విషయంలో పనికి రావు’’ అంటూనే ఆమె ఓ చేత్తో నా బట్టల్ని సూట్‌కేసులో సర్దసాగింది.‘‘ఎందుకు పనికి రావు? నువ్వూ మనిషివే. వస్తువు కాదు’’ అన్నాను కోపంగా.ఆమె భుజాల్ని కప్పి ఉన్న షాల్ కిందికి జారిపోయింది. అప్పుడు గమనించాను. ఆమెకు కుడిచేయి లేదు.ఎవరో తెగ్గొట్టేశారు. కానీ రక్తం కారటం లేదు. భుజంలోంచి ఏవో వైర్లు తెగిపోయి వేలాడుతున్నాయి. వాటి వైపు ఆశ్చర్యంతో అపనమ్మకంతో చూస్తున్న నా వైపు తిరిగి లిఖిత అంది. ‘‘ఎందుకంటే నేను మనిషిని కాదు కాబట్టి. నేను ఆండ్రాయిడ్ మరబొమ్మనే, కానీ హృదయం ఉన్న మరబొమ్మని’’ మళ్లా షాల్ని తన తెగిపోయిన చేయి కన్పించకుండా భుజాల చుట్టూ కప్పుకుని ఒంటి చేత్తో సామన్లు సర్దడంలో లీనమైపోయింది. ∙ -
ఉగ్రదీప్తి... శరభమూర్తి
ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం చాలా ప్రసిద్ధమైనది.ఇక్కడ స్వామి అమ్మవార్లు ప్రత్యేక దేవస్థానాలలో కొలువు తీరి ఉన్నారు. మల్లేశ్వరస్వామిదేవాలయం విమానగోపురం ప్రాచీన తెలుగు శిల్పకళకు తార్కాణంగా నిలుస్తుంది. ఈ ఆలయ విమానం పడమటి వైపు అద్భుతమైన శిల్పం దర్శనమిస్తుంది. రెండు సింహపు శరీరాలు కంఠం వరకు విడివిడిగా అక్కడి నుండి కలిసి మధ్యలో నడుము నుండి మానవశరీరంతో ఉగ్రమైన సింహముఖంతో, రెండు రెక్కలతో రెండు వైపులా కూర్చున్న రాక్షసులతో మెడలో కపాల(పుర్రె) మాలతో ఆరు చేతులలో ఒక శిల్పం కనిపిస్తుంది. అది ఏ దేవుడి శిల్పం? అక్కడ ఎందుకు ఉంది? అనే ప్రశ్న భక్తుల మనసులో మెదులుతుంది. అది మరెవరి శిల్పమో కాదు. సాక్షాత్తూ శివరూపమే. శివుడు ధరించిన అనేక లీలా రూపాలలో ఇరవై ఐదు ప్రముఖమైనవి కాగా వాటిలో శరభమూర్తి రూపం ఒకటి. ఈ రూపం దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామి అవతారసమాప్తి కోసం వీరభద్రుడు ధరించింది. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఉగ్రతను తగ్గించక ప్రజలు భయపడుతుండటంతో శివుడు వీరభద్రుని పంపి ఉగ్రత్వాన్ని తగ్గించుకోమని చెబుతాడు. అయినా వినక శివనింద చేస్తాడు. అప్పుడు వీరభద్రస్వామి శరభావతారం ధరిస్తాడు. సూర్య చంద్ర అగ్నులే అయన కళ్లు. ఆయన నాలుక బడబానలం. కడుపు కాలాగ్ని. గోళ్లు ఇంద్రుని వజ్రాయుధం కంటే బలమైనవి. ఆయన రెండు రెక్కలలో కాళీ–దుర్గా అనే దేవతలు, ఆయన రెండు తొడలలో కాలుడు–మృత్యువులుంటారు. హృదయంలో భైరవుడుంటాడు. చండమారుతవేగంతో శత్రువులను చీల్చి చెండాడుతాడు. ఆరు చేతులతో కత్తి–డాలును, అంకుశం–హరిణాన్ని, పాశం–రక్తపాత్రను పట్టుకుని ఉంటాడు. శత్రుబాధలున్నవారు ఈయనను ప్రతిష్టించి పూజిస్తే ఆ బాధలు పోతాయి. యుద్ధంలో గెలుపు, ఋణ విముక్తి, అనారోగ్యం నుండి ఉపశమనం, సకలశుభాలు కలుగుతాయని శైవాగమాలు చెబుతున్నాయి. శర అంటే ఆత్మ. భ అంటే ప్రకాశం. ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తాడు గనుక ఆయన శరభమూర్తి. ఈయనను శివాలయంలో విమానగోపురంపై గానీ, కోష్ఠ దేవతగా గాని ప్రతిష్టించి పూజించాలని ఆగమ శిల్పశాస్త్రాలు చెప్పాయి. మారీచం, మశూచి, రాచపుండు, క్షయవంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడే దేవత కనుక లోకక్షేమం కోసం ఈ శిల్పాన్ని అక్కడ ప్రతిష్టించి పూజిస్తున్నారు. ఈయనకే అష్టపాదమూర్తి, సింహఘ్నమూర్తి, శరభేశమూర్తి, శరభసాలువ పక్షిరాజం అనే పేర్లు కూడా ఉన్నాయి. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
కౌగిలింత ఖరీదు 90 లక్షల రూపాయలు
కన్సాస్: అమెరికాలో ఓవర్‌ల్యాండ్ పార్క్, టోమాహాక్ రిడ్జ్ కమ్యూనిటీ సెంటర్లో ఒక ఐదేళ్ల పిల్లవాడు తెలియక చేసిన చిన్న తప్పిదానికి దాదాపు 90 లక్షల రూపాయల మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కమ్యూనిటీ సెంటర్లోని సర్వేలైన్ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ప్రకారం సారా గాడ్మాన్ కొడుకు, ఐదేళ్ల పసివాడు అక్కడే ఉన్న ఓ విగ్రహాన్ని కౌగిలించుకుని, ఆడుకుంటున్నాడు. అయితే అనుకోకుండా ఆ విగ్రహం కాస్తా కింద పడి పగిలిపోయింది. అదృష్టవశాత్తు పిల్లవానికి ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న సారా వెంటనే అక్కడకు వెళ్లి తన కుమారున్ని ఇంటికి తీసుకొచ్చింది. పగిలిపోయిన విగ్రహం ఖరీదు మహా అయితే ఓ 800 డాలర్లు (ఇండియా కరెన్సీ ప్రకారం 55,076 రూపాయలు) ఉంటుంది. ఆ మొత్తాన్ని కట్టేస్తే గొడవ ఉండదని అనుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత కమ్యూనిటీ సెంటర్ నుంచి సారాకు ఒక ఉత్తరం వచ్చింది. దానిలో తన కుమారుడు పగలకొట్టిన విగ్రహం ఖరీదు చూసిన సారాకు గుండె ఆగినంత పనయ్యింది. ఓ 800 డాలర్లు ఉంటుందనుకున్న విగ్రహం విలువ కాస్తా ఏకంగా 1,32,000 డాలర్లు (అంటే మన కరెన్సీ ప్రకారం 90,87,540 రూపాయలు) గా ఉంది. ముందు ఆ ఉత్తరం చూసి ఆశ్చర్యపోయిన సారా, తెరుకుని కమ్యూనిటీ సెంటర్ వారిని తిట్టడం ప్రారంభించింది. ‘అంత ఖరీదైన విగ్రహాన్ని ఎలాంటి రక్షణ లేకుండా, కనీసం తాకకూడదనే హెచ్చరిక కూడా లేకుండా ఇలా జనాలు తిరిగే ప్రదేశంలో ఎలా ఉంచుతార’ని ప్రశ్నించింది. అంతేకాక డబ్బు చెల్లించనని తేల్చి చెప్పింది. దాంతో కమ్యూనిటీ సెంటర్ అధికారులు ‘ఆ విగ్రహాన్ని సందర్శన నిమిత్తం ఇక్కడకు తీసుకొచ్చాము. అయినా ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంద’ని తెలిపారు. విగ్రహం ఖరీదు చెల్లించనని చెప్పిన సారా, కంపెనీ వారు తీసుకునే చట్టపరమైన చర్యలను ఎదుర్కొడానికి సిద్దపడింది. కానీ ఇంతలో కమ్యూనిటీ సెంటర్ అధికారి రైలీ ‘మా ఇన్సూరెన్స్ కంపెనీ పొరపాటున బిల్లు చెల్లించమనే ఉత్తరాన్ని సారాకు పంపింది. కానీ మేము ఆ బిల్లును సారా కుటుంబం నుంచి వసూలు చేయాలనుకోవడం లేదు. ఆమె ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి ఈ వ్యవహారాన్ని ముగిస్తామ’ని తెలిపారు. సారా కొడుకు పగలకొట్టిన విగ్రహం స్థానిక శిల్పి బిల్ లియన్స్ రూపొందించిన ‘ఆఫ్రొడైట్ డి కాన్సాస్ సిటి’ అనే శిల్పం. -
శిల్పం పడేశారు.. 89 లక్షలు కట్టండి!
కన్సాస్: అమెరికాలోని కన్సాస్‌లో పట్టణంలో ఓ కుటుంబానికి ఇన్సూరెన్స్ కంపెనీ షాకిచ్చింది. ఓ చిన్నారి(5) కారణంగా ఇక్కడి కమ్యూనిటీ సెంటర్లో ఏర్పాటుచేసిన శిల్పం తీవ్రంగా దెబ్బతినడంతో రూ.89 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని అతని కుటుంబానికి నోటీసులు జారీచేసింది. కన్సాస్‌లోని ఓవర్లాండ్ పార్క్‌కు చెందిన సారా గుడ్‌మెన్ కుటుంబం మే 19న స్థానిక కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైంది. ఈ సందర్భంగా సారా కుమారుడు అక్కడ ఏర్పాటుచేసిన గాజు శిల్పాన్ని కదిలించేందుకు యత్నించాడు. దీంతో ఆ శిల్పం కిందపడిపగిలిపోయింది. ఈ ఘటనలో సారా కుమారుడికి కూడా గాయాలయ్యాయి. దీంతో బాలుడి విషయంలో నిర్లక్ష్యం వహించారంటూ ఆ కుటుంబానికి బీమా కంపెనీ నోటీసులు జారీచేసిందన్నారు. నోటీసులు అందుకున్న సారా స్పందిస్తూ.. నిర్వాహకులు ఆ శిల్పానికి తగిన రక్షణ ఏర్పాట్లు చేయకుండా వదిలేశారని ఆరోపించారు. -
ముంబైలో ఘోరం
సాక్షి, ముంబై: అది ముంబై, లోయర్‌పరేల్ ప్రాంతంలోని కమలామిల్స్ కాంపౌండ్‌లో ఉన్న ఓ భవనంలోని రూఫ్‌టాప్ పబ్ ‘1 అబవ్’.. సమయం రాత్రి 12 గంటలు దాటింది. అక్కడంతా సందడిగా ఉంది. ఓ బర్త్‌డే పార్టీ సందర్భంగా పండగ వాతావరణం నెలకొని ఉంది. బర్త్‌డే గర్ల్ ఖుష్బూ బన్సాలీ అప్పుడే కేక్ కట్ చేసి ఆత్మీయులతో పంచుకుంటోంది. క్షణాల్లో పరిస్థితి మారింది. అకస్మాత్తుగా ఎక్కడో చిన్నగా ప్రారంభమైన మంటలు.. క్షణాల్లో పబ్ అంతా వ్యాపించాయి. చూస్తుండగానే భవనాన్ని చుట్టుముట్టాయి.. ఓవైపు మంటలు, మరోవైపు కమ్ముకుంటున్న పొగతో పబ్‌లో భీతావహ వాతావరణం నెలకొంది. ప్రాణభయం.. హాహాకారాలు.. ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు వెళ్లే ఇరుకైన మార్గాల వద్ద తొక్కిసలాట. మంటల నుంచి తప్పించుకునేందుకు వాష్‌రూమ్‌ల్లో దాక్కున్న వారికి పొగతో ఊపిరాడని పరిస్థితి నెలకొంది. ఈ దుర్ఘటనలో అప్పుడే పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఖుష్బూ సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది మహిళలున్నారు. మరో 21 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ విచారణకు ఆదేశించారు. తప్పుచేసినవారు ఎంతవారైనా వదిలిపెట్టబోమన్నారు. నలుగురు అగ్నిమాపక సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇదే భవనంలో ఉన్న పలు చానెళ్ల కార్యాలయ ఉద్యోగులు ప్రాణాలతో బయటపడ్డారు. అసలేం జరిగింది? లోయర్ పరేల్‌లోని కమలా మిల్స్ కాంపౌండ్‌లోని ఓ భవనం పై అంతస్తు రూఫ్‌టాప్‌లో 1 అబవ్ అనే పబ్ ఉంది. గురువారం రాత్రి ఖుష్బూ బన్సాలీ అనే యువతి తన 29వ పుట్టినరోజు జరుపుకునేందుకు 10 మంది స్నేహితురాళ్లతో కలిసి వచ్చారు. వేరే వాళ్లు కూడా ఇదే సమయంలో పబ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. సంగీతం హోరు.. అదే భవంతిలో కింద ఉన్న సంస్థల్లోకి వినబడుతోంది. ఇంతలోనే పబ్‌లో మంటలంటుకుని క్షణాల్లోనే విస్తరించాయి. మంటలు ఎగిసిపడటం, దట్టమైన పొగ వ్యాపించటంతో అక్కడున్న వారికి ఏం జరిగిందో అర్థంకాలేదు. ప్రాణాలు కాపాడుకునేందుకు తలోదిక్కు పరుగులు తీశారు. మెట్లకు దగ్గరగా ఉన్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారు పరుగులు తీస్తుండగానే.. అగ్నికీలలు ఎగిసి పడ్డాయి. వెంటనే మూడో అంతస్తులో ఉన్న మోజో పబ్‌కూ ఈ మంటలు విస్తరించాయి. ప్రమాదం నుంచి తప్పించుకునే సమయంలో చాలా మంది అక్కడే ఉన్న టాయిలెట్స్‌లోకి వెళ్లారు. బాధితుల్లో చాలా మంది కాలిన గాయాలకంటే ఊపిరాడకే చనిపోయారని.. బాధితులను తరలించిన కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఖుష్బూ స్నేహితురాళ్లతోపాటు ఈ వేడుకకు వచ్చిన అమెరికాకు చెందిన భారత సంతతి సోదరులిద్దరు, వారి బంధువు కూడా అగ్నికి ఆహుతయ్యారు. పబ్‌లోని వెదురుతో నిర్మించిన కనోపీ వద్ద ఘటన జరగటంతో మంటలు వేగంగా విస్తరించినట్లు తెలుస్తోంది. ప్రాణాలు కాపాడుకునేందుకు మెట్లవైపు పరుగులు తీసే క్రమంలో తొక్కిసలాట జరిగింది. నిలువెల్లా నిర్లక్ష్యం! ఈ భవనం మొత్తంమీద సరైన భద్రతా ప్రమాణాల్లేవు. దీనికి తోడు.. మూడు, నాలుగు అంతస్తుల్లో ఉన్న మోజో, 1 అబవ్ పబ్బుల నిర్వాహకులు పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. మంటలను ఆర్పే పరికరాలు లేకపోవటంతోనే ప్రమాదం తీవ్రత పెరిగింది. కిందకు వెళ్లే అత్యవసరమార్గాలన్నీ మూసే ఉన్నట్లు తెలిసింది. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది మరో మార్గంలో కొందరిని తరలించి ఉండకపోతే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేది. అటు ఇలాంటి పబ్బులపై కఠినమైన చర్యలు తీసుకోవటంలో బీఎంసీ వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనబడుతోంది. 1 అబవ్ పబ్‌కు మూడుసార్లు హెచ్చరికలు జారీ చేశామని అధికారులు చెబుతున్నారు. అధికారులకు మామూళ్లు ముడుతున్నందునే వీరిపై చర్యలు తీసుకోలేదని ముంబై వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా మేల్కొన్న అగ్నిమాపక దళాలు తేరుకుని 10 ఫైరింజన్లు, 18 ట్యాంకర్లతో మంటలార్పేందుకు నాలుగు గంటలు పట్టింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ‘నేను రాత్రి షిప్టులో ఉన్నాను. పబ్ ఫ్లోర్ నుంచి అరుపులు వినిపించాయి. బయటకు వచ్చి చూడగానే 1 అబవ్ ఫ్లోర్ పూర్తిగా కాలిపోయింది. మంటల కారణంగా మా కార్యాలయం ప్రధాన ద్వారాన్ని మూసేశారు’ అని చానెల్ ఉద్యోగి ఒకరు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో 1 అబవ్ రెస్టారెంట్లో ఉన్న డాక్టర్ సులభా అరోరా.. ఇంకా షాక్‌నుంచి తేరుకోలేదు. తను ప్రాణాలతో బయటపడతాననుకోలేదని ఘటనను గుర్తుచేసుకుంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. నిర్వాహకులపై కేసులు 1 అబవ్ యజమానులు హ్రతేశ్ సంఘ్వీ, జిగర్ సంఘ్వీ, అభిజిత్ మకా సహా పలువురిపై ఐసీపీ 337 (ఇతరుల భద్రతను, ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం), 338 (తీవ్ర నష్టాన్ని కలిగిస్తూ ప్రాణాలకు హాని కల్గించటం) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కలసిరాని ‘29’ ముంబై: దేశ ఆర్థిక రాజధానికి 29వ తేదీ కలిసిరాలేదు. ఈ ఏడాదిలో 29వ తేదీన మూడు ఘోర ప్రమాదాలు ముంబైని వణికించాయి. ఆగస్టు 29న కుండపోత వర్షం కురవడంతో ముంబైలోని రవాణా మార్గాలన్నీ స్తంభించిపోయాయి. ఈ వర్షాలకు దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. నెలరోజుల తర్వాత మళ్లీ 29వ తేదీనే ముంబైలోని ఎల్ఫిన్‌స్టోన్ రోడ్డు– పరేల్ రైల్వేస్టేషన్లను కలిపే పాదచారుల బ్రిడ్జీపై జరిగిన తొక్కిసలాటలో 23 మంది చనిపోయారు. తాజాగా డిసెంబర్ 29న 1 అబవ్ పబ్ అగ్ని ప్రమాదంలో 14 మంది దుర్మరణం చెందారు. 29న 29 ఏళ్లకే.. 1 అబవ్ పబ్‌లో సంగీతాన్ని ఆస్వాదిస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఖుష్బూ చాకోలెట్ కేక్‌ను కట్‌చేసింది. ఖుష్బూ వీడియాను ఆమె స్నేహితులు ఫేస్బుక్లో ఉంచారు. ‘హ్యాపియెస్ట్ బర్త్‌డే ఖుష్బూ’ అని క్యాప్షన్ జతచేశారు. కానీ విధి వక్రించింది. కొన్ని క్షణాలకే పబ్‌ను మంటలు చుట్టుముట్టాయి. ఇందులో ఖుష్బూ సహా 14 మంది చనిపోయారు. సెల్ఫీలు, మద్యంతో పెరిగిన తీవ్రత పబ్‌లో మంటలు చెలరేగినప్పుడు అతిథుల్లో కొందరు సెల్ఫీలు తీసుకుంటూ, మరికొందరు తప్పతాగి ఉండటంతో సహాయక చర్యలు ఆలస్యమయ్యాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ భవన సెక్యూరిటీగాఉన్న మహేశ్ సబ్లే మాట్లాడుతూ..‘రాత్రి 12.30 సమయంలో పెద్దఎత్తున గందరగోళం చెలరేగడంలో నేను టెర్రస్‌పైనున్న ఆఫీస్ నుంచి బయటికొచ్చాను. తీవ్ర ఆందోళనలతో ఉన్న ప్రజలు నావైపు పెద్దసంఖ్యలో దూసుకొచ్చారు. దీంతో 150 నుంచి 200 మందికి కిందకు వెళ్లడానికి దారిచూపించాను. వీరందర్ని కిందకు పంపాక టాయిలెట్లలో ఉండిపోయిన మరో 10 మందిని బయటకు తీసుకొచ్చాను. వీరందరికీ స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి. మంటలు ఎక్కువ కావడంతో మరోసారి నేను లోపలకు వెళ్లలేకపోయాను’ అని తెలిపారు. -
నాటక శిల్పం.. రస రమ్యం
- అలరించిన నందినాటకోత్సవాలు - ముగిసిన సాంఘిక నాటకాలు - నేటి నుంచి పద్యనాటికలు మొదలు కర్నూలు(హాస్పిటల్): నంది నాటకోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సాంఘిక నాటికలు ప్రేక్షకులను అలరించాయి. సాంఘిక దురాచారాలు, కుటుంబ కలహాలు, డబ్బు వ్యామోహం, గిరిజనులపై జరుగుతున్న దాడులను తెలిపే ఇతివృత్తాలతో నాటకాలు నడిచాయి. ఈ నెల 18వ తేదీ నుంచి గురువారం వరకు సాంఘిక నాటకాలతో అలరించిన నందినాటకోత్సవాలు శుక్రవారం నుంచి పద్యనాటికలతో ఆకట్టుకోనున్నాయి. డబ్బుకోసం భర్తను కోర్టుకీడ్చే భార్య కథ ‘సైకతశిల్పం’ నంద్యాల కళారాధన వారి ‘సైకతశిల్పం’అనే సాంఘిక నాటికను తాళా బత్తుల వెంకటేశ్వరరావు రచించగా, డాక్టర్ జి. రవికృష్ణ దర్శకత్వం వహించారు. డబ్బుపై వ్యామోహంతో భర్తను, కుటుంబాన్ని కోల్పోయిన ఓ మహిళ కథే ఇది. వరప్రసాద్, సుధాకర్, తాళాబత్తుల వెంకటేశ్వరరావు, ఎస్ఎం బాషా, డీసీపీ శర్మ, సురభిప్రభావతి, జ్యోతి, పి. నాగలింగేశ్వరి నటించారు. ఏకాకిగా బతుకుతున్న వృద్దుడికి కథే ‘ఒయాసిస్’ ప్రొద్దుటూరు కళాభారతి వారి ‘ఒయాసిస్’ సాంఘిక నాటకను.. వైజి ప్రకాశ్ రచించి, దర్శకత్వం వహించారు. వృద్ధాప్యం ఎడారిలో ప్రయాణం లాంటిది. గుక్కెడు నీటి కోసం జానెడు నీడకోసం తల్లడిల్లిపోతూ అన్వేషించడం లాంటిది. అలాంటి పరిస్థితుల్లో ఒయాసిస్సు కనిపిస్తే ఇక అతడు దాన్ని వదిలి వెళ్లగలడా..? అనేదే ఈ నాటిక వృత్తాంతం. కడుపున పుట్టిన కొడుకు నిరాదరణతో ఒంటరిగా బతుకునీడుస్తున్న ఓ వృద్ధుడి జీవిత గాథ ఇది. నవీన, వైజి ప్రకాష్, కె. సుభాష్ చంద్రబోస్, ఎం. నరసింహాచార్లు, ఎ. కృష్ణారావు, కె. శ్రీను నటించారు. గిరిజనుల దోపిడికి నిదర్శనం ‘రేలపూలు’ హైదరాబాద్ సిరిమువ్వ కల్చరల్స్ వారి రేలపూలు సాంఘిక నాటకంను రావినూతల ప్రేమకిశోర్ రచించగా, ఎం. భజారప్ప దర్శకత్వం వహించారు. ఈ కథంతా గిరిజనుల చుట్టూ సాగుతుంది. అందమైన రేలపూలతో అలరారుతున్న అడవిలో నివసిస్తున్న అమాయక గిరిజనులు సంతోషంగా జీవిస్తుంటారు. ఈ సమయంలో పల్లపోళ్ల రాకతో అడవి సంపద మాయమై ఆ గిరిజన బతుకులు దోపిడికి గురై పరాయీకరణ చెందుతాయి. ఆడకూనల ఉసురు తీస్తున్న నెత్తుటి కోనలో కడుపు పంటలను కబళిస్తున్న వైనాన్ని చక్కగా ప్రదర్శించారు. ఈ రేలపూల గాయాలకు సూత్రదారులెవరు..?, ఈ కమురు వాసనల కాలానికి కారణభూతులెవ్వరు..?, అనే ప్రశ్నలకు సమాధానమే ఈ నాటిక. ఇందులో పాత్రదారులుగా మంజునాథ్, రామశాస్త్రి, రాధాకృష్ణ, రామకృష్ణ, శివరామకృష్ణ, ప్రసాద్, సుసర్ల కామేశ్వరశర్మ,కె. కోటేశ్వరరెడ్డి, కళానవీన్, హరిశ్చంద్రప్రసాద్, సురభిప్రభావతి నటించారు. వరకట్న వేదింపులకు సమాధానం ‘తర్జని’ ఉయ్యూరు, కళావర్షిణి వారి తర్జని సాంఘిక నాటిక వరకట్న వేధింపులపై కొనసాగుతుంది. ఈ నాటికను ఇసుకపల్లి మోహన్‌రావు రచించగా, జెట్టి హరిబాబు దర్శకత్వం వహించారు. ఇందులో జీఎస్ చలపతి, జె.హరిబాబు, డి. జార్జి, డి. శివాజీరావు, ఎన్.నవీన నటించారు. నాటకమే తన జీవితమని చెప్పే ‘రసరాజ్యం’ ఇప్పటికే వందకు పైగా ప్రదర్శనలు పూర్తి చేసుకున్న గుంటూరు శాస్త్రీయం వారి రసరాజ్యం నాటకంలో కిరీటి పాత్రలో ప్రముఖ సినీనటుడు కోట శంకరరావు జీవించారు. ఇతర పాత్రదారులుగా జ్యోతి, జయశ్రీతేజ, రాజర్షి, కార్తీక్ జీవం పోశారు. నాటకరంగానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఓ మహానటుడు కిరిటీ పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. ఆలోచనాత్మకం.. ‘పుట్టలోని చెదలు’ తిరుపతిలోని అక్కల ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘పుట్టలోని చెదలు’ అనే సాంఘిక నాటికను అక్కల తామేశ్వరయ్య రచించగా, టీఎస్ఎన్విపి మూర్తి దర్శకత్వం వహించారు. తన తండ్రి ఉద్యోగం తనకు వీఆర్ఎస్ ద్వారా ఇమ్మని ఒత్తిడి చేసే కొడుకు కథే ఇది. తండ్రి ససేమిరా అనడంతో తండ్రీకొడుకులు ఘర్షణపడతారు. చివరకు తండ్రిని చంపడానికి సైతం కుమారుడు సిద్ధపడతాడు. ఈ నేపథ్యంతో తన కొడుకును పంపిస్తాడు తండ్రి. పాత్రదారులుగా టీఎస్ఎన్విపి మూర్తిరాజు, యశోద, ఎం. సహాశిత్, అక్కల తామేశ్వరయ్య, ఆనంద్, కె. వాసుదేవాచారి, అడివి శంకరరావు నటించారు. నేటి నుంచి పద్యనాటికలు ఇప్పటి వరకు ఎనిమిదిరోజుల పాటు సాంఘిక నాటికలతో అలరించిన నందినాటకోత్సవాల్లో శుక్రవారం నుంచి పద్యనాటికలు ఉర్రూతలూగించనున్నాయి. ఉదయం 9 గంటలకు శ్రీ మైత్రి కళాపరిషత్ వారి శ్రీ కృష్ణాంజనేయయుద్ధం, మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ వంశీ కళాక్షేత్రం వారి రావణబ్రహ్మ, రాత్రి 6.30 గంటలకు మేకా ఆర్ట్స్ వారి హరిశ్చంద్ర పద్య నాటక ప్రదర్శనలు ఉంటాయి. -
శిల్పసంపద అద్భుతం
గణపురం : గణపేశ్వరాలయ శిల్పాలు అద్భుతంగా ఉన్నాయని ఫ్రాన్స్‌కు చెందిన మార్టిమ్ విలియమ్ అన్నారు. బుధవారం ఆమె ఆలయాన్ని సందర్శించారు. జిల్లాలో పలు చోట్ల కాకతీయుల కట్టడాలను చూశానని, 21 రోజుల పాటు తెలంగాణలో తిరిగి పలు ప్రాచీన దేవాలయాలను సందర్శిస్తున్నామని తెలిపారు. అన్ని దేవాలయాల్లోనూ అపురూపమైన శిల్పసంపద ఉందని, ఇవి ధ్వంసం కాకుండా చూడాలని అన్నారు. వరంగల్‌లోని కట్టడాలు, రామప్ప దేవాలయాన్ని కూడా సందర్శించినట్లు తెలిపారు. అనంతరం గణపేశ్వరునికి పూజలు నిర్వహించారు. -
శిల్ప సంపద అద్భుతం
గణపురం : గణపేశ్వరాలయ శిల్పాలు అద్భుతం, అపూర్వమని అమెరికాకు చెందిన సందర్శకుల బృందం స్పష్టం చేసింది. జిల్లాలో పలు చోట్ల కాకతీయుల కట్టడాలను చూడడం జరిగిందని వారు తెలిపారు. అన్ని దేవాలయాల్లో శిల్పసంపద ఉంది. అపరూపమైన శిల్పాలను ధ్వంసం కాకుండా చూడాలని సూచించారు. గణపేశ్వరునికి పూజలు నిర్వహించారు. దేవాలయాలను నిర్మించిన కాకతీయుల గూర్చి అడిగి తెలుసుకున్నారు. -
కాకతీయుల వైభవాన్ని ప్రపంచానికి చాటాలి
ఖిలా వరంగల్ : కాకతీయుల కళా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయూలని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, ఇన్టాక్ కన్వీనర్ పాండురంగారావు, రాష్ట్ర ఇన్టాక్ కోకన్వీనర్ అనురాధారెడ్డి అన్నారు. వారసత్వ సంపదను ప్రపంచానికి తెలియజేయడంతోపాటు ప్రజలకు అవగాహన కల్పించేం దుకు ఖిలావరంగల్ మధ్యకోటలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, ఇన్టాక్, గో హెరిటేజ్ రన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం 5కే, 10కే, 21కే రన్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి వరంగల్, హైదరాబాద్, బెంగళూరు, మహరాష్ట్ర, పుణే, కర్నాటకతోపాటు పలు రాష్ట్రాల నుంచి 600 మంది పర్యాటకులు హాజ రయ్యూరు. తొలుత గో హెరిటేజ్ రన్ కన్వీనర్ అజయ్‌రెడ్డి జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. అనంతరం పాండురంగారావు, అనురాధారెడ్డిలు మాట్లాడుతూ కాకతీయుల కళా సంపదను ప్రపంచ వారసత్వంలోకి తీసుకెళ్లడంతోపాటు రామప్పను యునెస్కోలోకి పంపించేందుకే గోహెరిటేజ్ రన్‌ను నిర్వహించినట్లు చెప్పారు. ర న్ ద్వారా ఆరోగ్యంతోపాటు కాకతీయుల సంపదపై అవగాహన ఏర్పడుతుందన్నారు. కార్పొరేటర్లు బైరబోయిన దామోదర్, బిల్ల కవిత మాట్లాడుతూ వరంగల్‌కు యునెస్కో గుర్తింపు వచ్చే విధంగా కాకతీయ హెరిటేజ్, ఇన్టాక్, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక రన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆకట్టుకున్న రన్.. గో హెరిటేజ్ రన్లో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఖిలా వరంగల్ రాతికోట, మధ్యకోట, ఖుషిమహాల్ నుంచి హన్మకొండలోని వేరుు స్తంభాల ఆలయం వరకు 5కే, 10కే రన్ నిర్వహించారు. అలాగే 21కే రన్‌ను మధ్యకోట ఖుషిమ హాల్ నుంచి హన్మకొండ వరకు చేపట్టారు. కాగా, వివిధ కేటగిరీల్లో రన్ చేసిన వివిధ రాష్ట్రాల పర్యాటకులకు మెడల్స్‌తోపాటు వరంగల్ గో యునెస్కో హెరిటేజ్‌తో ముద్రించిన సర్టిఫికెట్లు అందజేశారు. ఇదిలా ఉండగా, రన్లో పాల్గొన్న పర్యాటకులకు డాక్టర్లు కూరపాటి రమేష్, రాధిక వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, జ్యూస్ అం దజేశారు. కార్యక్రమంలో మిల్స్‌కాలనీ సీఐ వేణు, ఎస్సైలు రవీందర్, శ్రీదేవి, కేంద్ర పురావస్తుశాఖ కోఆర్డినేటర్ శ్రీకాం త్, సిబ్బంది కుమారస్వామి, పర్యాటకశాఖ గైడ్ దేనబోయిన రవి, తదితరులు పాల్గొన్నారు. కాకతీయుల శిల్ప సంపద అద్భుతం.. మా స్వస్థలం వరంగల్. వృత్తిరీత్యా మానాన్న డాక్టర్ కావడంతో కొన్నేళ్ల నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నాం. కాకతీయుల రాజ ధాని కోటను మొదటిసారిగా చూశాను. రాతికోట అందాలను తిలకిస్తూ 5కే రన్‌ను సుల భంగా పూర్తి చేశాను. కాకతీయుల శిల్ప సంపద, నాటి శి ల్పులు నల్లరాతిలో చెక్కిన కళా ఖండాలు అద్భుతంగా ఉన్నాయి. అమ్మనాన్నలతో కలిసి మరోసారి ఇక్కడికి వచ్చి శిల్పాలను చూస్తా. -దివ్య, హైదరాబాద్ రన్లో పాల్గొనడం ఆనందంగా ఉంది.. కాకతీయుల చారిత్రక కట్టడాలను భావి తారాలకు అందించేందుకు ప్రతి ఒక్క రూ కృషి చేయూలి. హెరిటేజ్ 10కే రన్లో పాల్గొనడం ఆనందంగా ఉం ది. గో హెరిటేజ్ రన్‌ను ఏ రాష్ట్రం లో నిర్వహించిన ఉత్సాహంగా పాల్గొంటా. వృత్తిరీత్యా డాక్టర్ అరుునప్పటికీ ప్రతిరోజు ఉదయం 5 నుంచి 7 గంటల వరకు రన్నింగ్, వాకింగ్ చే స్తా. - డాక్టర్ నవీన, హైదరాబాద్ -
పంచపాండవుల ఆలయం
తెలుసుకుందాం శ్రీకృష్ణుడి ఆలయాలు దేశం నలుచెరగులా ఉన్నా, పంచపాండవుల ఆలయాలు మాత్రం బహు అరుదు. తమిళనాడులోని మహాబలిపురంలో ఇలాంటి అరుదైన ఆలయం ఉంది. కొండగుహలో నిర్మించిన పురాతన ఆలయం ఇది. చెన్నై నుంచి 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. పల్లవుల నాటి శిల్పకళా వైవిధ్యానికి నిదర్శనంగా నేటికీ నిలిచి ఉన్న ఈ ఆలయాన్ని క్రీస్తుశకం ఏడో శతాబ్దిలో నిర్మించారు. యాభై అడుగుల పొడవున ఉన్న కొండగుహ వెలుపల నిర్మించిన రాతి స్తంభాలు, వాటి అడుగున తీర్చిదిద్దిన సింహాల ప్రతిమలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఈ ఆలయం లోపల నిర్మించిన పంచపాండవుల మండపం, రాతిగోడపై శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గోపాలకులను రక్షిస్తున్నట్లుగా చెక్కిన శిల్పం నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. -
శిల్పం.. సూక్ష్మం
లండన్ : ఈ బుల్లి శిల్పాన్ని చిన్న చీమ తల మీద నిల్చోబెట్టవచ్చు. వెంట్రుక మీద బ్యాలెన్సింగ్ చేయించవచ్చు. ఫొటో చూడండి. సూది బెజ్జంతో దీన్ని పోల్చినా.. ఎంత చిన్నదిగా ఉందో చూశారుగా.. వీటి సృష్టికర్త లండన్‌కు చెందిన నానో శిల్పకారుడు జాంటీ హర్విట్జ్. ఇలాంటివి మొత్తం ఏడింటిని రూపొందించారు. వీటిలో అతి పెద్దది మన వెంట్రుక మందముంటే.. మిగతావి అందులో సగం కన్నా చిన్నవేనట! 10 నెలల కృషి అనంతరం జాంటీ వీటిని తయారుచేశారు. వీటిని చూడటానికి కేన్సర్ కణాలను పరిశీలించడానికి వాడే అత్యాధునిక మైక్రోస్కోప్‌ను ఉపయోగించారు. తయారీ ఇలా..: ముందుగా ఓ మోడల్‌ను ఫొటోలు తీశారు. ఆమెకు అన్ని వైపులా మొత్తం 250 కెమెరాలు పెట్టి.. అణువణువు క్లిక్‌మనిపించారు. తర్వాత వాటిని అత్యధిక సామర్థ్యమున్న కంప్యూటర్లో ఫీడ్ చేసి.. డిజిటల్ బొమ్మను రూపొందించారు. అనంతరం త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి.. ఈ అద్భుత నానో శిల్పాలను రూపొందించారు. ఇంతకీ వెంట్రుక ఎంత మందముంటుందో తెలుసా? 40 నుంచి 50 మైక్రాన్లు. మైక్రాన్ అంటే మిల్లీ మీటర్లో వెయ్యో వంతు. దాని లెక్కన అంచనా వేసుకోండి. ఇవి ఎంత చిన్నగా ఉన్నాయో.. యాంటీ క్లైమాక్స్.. జాంటీ గొప్పతనమంతా విన్నాం. అయితే.. ఆ శిల్పాలను మనం చూడాలంటే.. ప్రస్తుతం ఇలాంటి ఫొటోలే గతి. ఎందుకంటే.. వీటిని తయారుచేసిన కొన్ని గంటలకు జాంటీ సహచరుడొకడు.. వీటిని వేరే యాంగిల్లో చూడాలనే ఉత్సాహంతో మైక్రోస్కోప్ కింద ఉన్న అద్దాన్ని కదిలించాడు. అవి కింద పడ్డాయి. ఏంటీ.. మైక్రోస్కోప్‌లో కనిపించడం లేదంటూ ఆందోళన చెందాడు. ఈ తడబాటులో అతడి చిటికెన వేలు అద్దం పక్కన యథాలాపంగా ల్యాండ్ అయింది. అంతే.. సర్వనాశనం.. 7 నానో శిల్పాలు చరిత్రలో కలిసిపోయాయి. -
బ్రహ్మానందంలో బయటపడిన రెండోకోణం
బ్రహ్మానందం అనగానే గతంలో తెలుగు లెక్చరర్ అని, ప్రస్తుతం హాస్యనటుడని మాత్రమే మనందరికీ తెలుసు. అయితే, ఆయనలో మనందరికీ తెలియని మరో కోణం కూడా ఉంది. కేవలం హాస్య కళ మాత్రమే కాక.. శిల్పాలు చేయడం కూడా మన బ్రహ్మానందానికి వచ్చు! ఈ విషయం ఇన్నాళ్ల పాటు ఎప్పుడూ వెలుగులోకి రాలేదు. తాజాగా ఆయన బంకమట్టితో ఓ విగ్రహాన్ని రూపొందించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మను ఆయన జీవం ఉట్టిపడేలా తయారు చేశారు. ఈ విగ్రహాన్ని తయారుచేసే క్రమంలో ఉన్న ఫొటోలను కూడా బ్రహ్మానందం తన ఫేస్బుక్ పేజీలో అభిమానులందరికీ షేర్ చేశారు. దాంతో ఆయనలో్ ఉన్న రెండో కోణం కూడా అభిమానులకు తెలిసింది.