సీఎం సైకత శిల్పం | kcr saikata sculpture | Sakshi
Sakshi News home page

సీఎం సైకత శిల్పం

Published Fri, Dec 14 2018 12:47 AM | Last Updated on Fri, Dec 14 2018 12:47 AM

kcr saikata sculpture - Sakshi

కురవి: సీఎం కేసీఆర్‌ ఎన్నికల్లో సాధించిన విజయానికి గుర్తుగా ఓ కళాకారుడు ఆయన సైకత శిల్పాన్ని రూపొందించాడు. సైకత శిల్పాలు తయారు చేయడంలో దిట్ట అయిన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన కళాకారుడు, లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డు గ్రహీత నీలం శ్రీనివాసులు ఎన్నికల్లో కేసీఆర్‌ 88 సీట్లు సాధించడంతో ‘కేసీఆర్‌ ద సన్‌ ఆఫ్‌ తెలంగాణ ఎట్‌ ద రేట్‌ ఆఫ్‌ 88 ’అనే టైటిల్‌తో ఈ సైకత శిల్పాన్ని తయారు చేశాడు. దీని తయారీకి 40 గంటల సమయం పట్టిందని శ్రీనివాసులు తెలిపారు. ఈ సైకత శిల్పాన్ని ఎలాగైనా కేసీఆర్‌కు అందించేందుకు ప్రయత్నిస్తానన్నారు. సైకత శిల్పాన్ని తయారు చేసిన శ్రీనివాసులును గ్రామస్తులు అభినందించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement