ఖిలా వరంగల్ : కాకతీయుల కళా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయూలని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, ఇన్‌టాక్ కన్వీనర్ పాండురంగారావు, రాష్ట్ర ఇన్‌టాక్ కోకన్వీనర్ అనురాధారెడ్డి అన్నారు. వారసత్వ సంపదను ప్రపంచానికి తెలియజేయడంతోపాటు ప్రజలకు అవగాహన కల్పించేం దుకు ఖిలావరంగల్ మధ్యకోటలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, ఇన్‌టాక్, గో హెరిటేజ్ రన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం 5కే, 10కే, 21కే రన్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి వరంగల్, హైదరాబాద్, బెంగళూరు, మహరాష్ట్ర, పుణే, కర్నాటకతోపాటు పలు రాష్ట్రాల నుంచి 600 మంది పర్యాటకులు హాజ రయ్యూరు. తొలుత గో హెరిటేజ్ రన్ కన్వీనర్ అజయ్‌రెడ్డి జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు.
అనంతరం పాండురంగారావు, అనురాధారెడ్డిలు మాట్లాడుతూ కాకతీయుల కళా సంపదను ప్రపంచ వారసత్వంలోకి తీసుకెళ్లడంతోపాటు రామప్పను యునెస్కోలోకి పంపించేందుకే గోహెరిటేజ్ రన్‌ను నిర్వహించినట్లు చెప్పారు. ర న్ ద్వారా ఆరోగ్యంతోపాటు కాకతీయుల సంపదపై అవగాహన ఏర్పడుతుందన్నారు. కార్పొరేటర్లు బైరబోయిన దామోదర్, బిల్ల కవిత మాట్లాడుతూ వరంగల్‌కు యునెస్కో గుర్తింపు వచ్చే విధంగా కాకతీయ హెరిటేజ్, ఇన్‌టాక్, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక రన్ నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఆకట్టుకున్న రన్..
గో హెరిటేజ్ రన్‌లో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఖిలా వరంగల్ రాతికోట, మధ్యకోట, ఖుషిమహాల్ నుంచి హన్మకొండలోని వేరుు స్తంభాల ఆలయం వరకు 5కే, 10కే రన్ నిర్వహించారు. అలాగే 21కే రన్‌ను మధ్యకోట ఖుషిమ హాల్ నుంచి హన్మకొండ వరకు చేపట్టారు. కాగా, వివిధ కేటగిరీల్లో రన్ చేసిన వివిధ రాష్ట్రాల పర్యాటకులకు మెడల్స్‌తోపాటు వరంగల్ గో యునెస్కో హెరిటేజ్‌తో ముద్రించిన సర్టిఫికెట్లు అందజేశారు. ఇదిలా ఉండగా, రన్‌లో పాల్గొన్న పర్యాటకులకు డాక్టర్లు కూరపాటి రమేష్, రాధిక వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, జ్యూస్ అం దజేశారు. కార్యక్రమంలో మిల్స్‌కాలనీ సీఐ వేణు, ఎస్సైలు రవీందర్, శ్రీదేవి, కేంద్ర పురావస్తుశాఖ కోఆర్డినేటర్ శ్రీకాం త్, సిబ్బంది కుమారస్వామి, పర్యాటకశాఖ గైడ్ దేనబోయిన రవి, తదితరులు పాల్గొన్నారు.
కాకతీయుల శిల్ప సంపద అద్భుతం..
మా స్వస్థలం వరంగల్. వృత్తిరీత్యా మానాన్న డాక్టర్ కావడంతో కొన్నేళ్ల నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నాం. కాకతీయుల రాజ ధాని కోటను మొదటిసారిగా చూశాను. రాతికోట అందాలను తిలకిస్తూ 5కే రన్‌ను సుల భంగా పూర్తి చేశాను. కాకతీయుల శిల్ప సంపద, నాటి శి ల్పులు నల్లరాతిలో చెక్కిన కళా ఖండాలు అద్భుతంగా ఉన్నాయి. అమ్మనాన్నలతో కలిసి మరోసారి ఇక్కడికి వచ్చి శిల్పాలను చూస్తా. -దివ్య, హైదరాబాద్
రన్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది..
కాకతీయుల చారిత్రక కట్టడాలను భావి తారాలకు అందించేందుకు ప్రతి ఒక్క రూ కృషి చేయూలి. హెరిటేజ్ 10కే రన్‌లో పాల్గొనడం ఆనందంగా ఉం ది. గో హెరిటేజ్ రన్‌ను ఏ రాష్ట్రం లో నిర్వహించిన ఉత్సాహంగా పాల్గొంటా. వృత్తిరీత్యా డాక్టర్ అరుునప్పటికీ ప్రతిరోజు ఉదయం 5 నుంచి 7 గంటల వరకు రన్నింగ్, వాకింగ్ చే స్తా.
- డాక్టర్ నవీన, హైదరాబాద్
కాకతీయుల వైభవాన్ని ప్రపంచానికి చాటాలి
Published Mon, Mar 14 2016 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM
Advertisement
Advertisement