Kakatiya Heritage Trust
-
పాపారావుగారి వ్యాఖ్యలు బాధాకరం : శివాజీ రాజా
కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి ఇటీవల మోహన్ బాబుకు విశ్వ నట సార్వభౌమ బిరుదును ప్రధానం చేస్తూ సన్మానించిన సంగతి తెలిసిందే. కాకతీయ కళావైభవోత్సవాలు పేరుతో జరిగిన కార్యక్రమంలో ఈ సన్మానం చేయటాన్ని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కు చెందిన పాపారావు తప్పుపట్టారు. ఈ విషయంపై ఆర్టిస్టు, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షులు శివాజీ రాజా స్పందించారు. ‘సినిమా, సమాజం ఎప్పుడూ వేరు వేరు కాదు. ప్రజలతో మమేకమైన కళ సినిమా.. సినిమా కళాకారులు తొలినాళ్ల నుండి ప్రజల పట్ల స్పందిస్తూ సహాయమందించడం తెలియని విషయం కాదు. అలాంటి గొప్ప సినిమా రంగానికి సంబంధించిన సినీ నిర్మాత డా॥టి. సుబ్బిరామిరెడ్డిగారు సినిమా నటీనటులని సన్మానించే భాగంలో తొలుతగా డా॥మోహన్‌బాబు గారిని సన్మానించారు. ఇంకా ఎన్నో చోట్ల ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి. ఈ సమయంలో శ్రీ పాపారావుగారు ‘సినిమా నటీనటులను సన్మానించకూడదు’ అని వ్యాఖ్యానిస్తూ హెచ్చరించడం బాధాకరం. ఒకవైపు మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్రావుగారు తెలుగు భాషకి మరింత గౌరవాన్ని తెచ్చే విధంగా ‘ప్రపంచ తెలుగు మహా సభలు’ జరిపి తనదైన ఔన్నత్యాన్ని చాటి భాషకు ఎల్లలు లేవు. కళకు సరిహద్దులు, భాషా బేధం లేదు అన్న రీతిలో తెలుగు సినీ నటీనటులను ఆహ్వనించి ఎంతో గొప్పగా ఘనంగా సన్మానించారు. శ్రీ కె.టి.ఆర్ గారు కూడా ప్రతీ నటిని, నటున్ని పేరు పేరున పలకరిస్తూ తనదైన అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రి శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్‌గారు కూడా సినీ పరిశ్రమ పట్ల, నటీనటుల పట్ల తనదైన స్నేహభావాన్ని ప్రకటిస్తూ.. ఏ సహాయానికైనా వెనుకాడకుండా ఆదరిస్తున్నారు. మొన్నటికి మొన్న తెలుగు సినిమా నటుడు శ్రీ గుండు హన్మంతరావు అనారోగ్య పరిస్థితులు తెలుసుకుని వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 5లక్షల రూపాయలు అందించారు కె.టి.ఆర్ గారు. సినిమా నటీనటుల పట్ల తనదైన గౌరవాన్ని చాటుకున్న శ్రీ కె.సి.ఆర్ గారి పరిపాలనకి కృతజ్ఞతలు. ఇలాంటి సమయంలో శ్రీ పాపారావుగారు ‘సినిమా నటీనటులను సన్మానించకూడదు’ అని హెచ్చరించడం ఎంత వరకు సబబు అన్నది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం.. ఇలాంటి వ్యాఖ్యలను ప్రభుత్వం కూడా సమర్థించదని అనుకుంటున్నాం’. అంటూ పాపారావు వ్యాఖ్యలను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. -
సినీ రంగాన్ని చొప్పిస్తే సహించం
సాక్షి, హైదరాబాద్: కాకతీయ కళా వైభవం పేరుతో నటులను సన్మానిస్తే సహించబోమని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు.. మాజీ ఎంపీ టి. సుబ్బరామిరెడ్డిని హెచ్చరించింది. ఈ పేరుతో స్థానిక కళలు, కళాకారుల పురోగతికి తోడ్పడితే స్వాగతిస్తామంది. శుక్రవారం కాకతీయ హెరిటేజ్ వ్యవస్థాపక సభ్యుడు పాపారావు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి సినిమా రంగం తీవ్ర నష్టం చేసిన సంగతి గుర్తించాలన్నారు. సినిమా సంస్కృతిని బుద్ధిస్ట్ హెరిటేజ్‌కు ముడిపెట్టే ప్రయత్నం చేయటం తగదన్నారు. ఇలాంటి చర్యలను ముందుగానే అడ్డుకోవాలన్నారు. రెండు రోజుల క్రితం సుబ్బిరామిరెడ్డి నగరంలోని శిల్పకళావేదికలో నటుడు మోహన్‌బాబును సన్మానించి బిరుదు ప్రదానం చేసిన విషయం తెలిసిందే. -
కాకతీయుల వైభవాన్ని ప్రపంచానికి చాటాలి
ఖిలా వరంగల్ : కాకతీయుల కళా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయూలని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, ఇన్టాక్ కన్వీనర్ పాండురంగారావు, రాష్ట్ర ఇన్టాక్ కోకన్వీనర్ అనురాధారెడ్డి అన్నారు. వారసత్వ సంపదను ప్రపంచానికి తెలియజేయడంతోపాటు ప్రజలకు అవగాహన కల్పించేం దుకు ఖిలావరంగల్ మధ్యకోటలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, ఇన్టాక్, గో హెరిటేజ్ రన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం 5కే, 10కే, 21కే రన్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి వరంగల్, హైదరాబాద్, బెంగళూరు, మహరాష్ట్ర, పుణే, కర్నాటకతోపాటు పలు రాష్ట్రాల నుంచి 600 మంది పర్యాటకులు హాజ రయ్యూరు. తొలుత గో హెరిటేజ్ రన్ కన్వీనర్ అజయ్‌రెడ్డి జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. అనంతరం పాండురంగారావు, అనురాధారెడ్డిలు మాట్లాడుతూ కాకతీయుల కళా సంపదను ప్రపంచ వారసత్వంలోకి తీసుకెళ్లడంతోపాటు రామప్పను యునెస్కోలోకి పంపించేందుకే గోహెరిటేజ్ రన్‌ను నిర్వహించినట్లు చెప్పారు. ర న్ ద్వారా ఆరోగ్యంతోపాటు కాకతీయుల సంపదపై అవగాహన ఏర్పడుతుందన్నారు. కార్పొరేటర్లు బైరబోయిన దామోదర్, బిల్ల కవిత మాట్లాడుతూ వరంగల్‌కు యునెస్కో గుర్తింపు వచ్చే విధంగా కాకతీయ హెరిటేజ్, ఇన్టాక్, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక రన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆకట్టుకున్న రన్.. గో హెరిటేజ్ రన్లో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఖిలా వరంగల్ రాతికోట, మధ్యకోట, ఖుషిమహాల్ నుంచి హన్మకొండలోని వేరుు స్తంభాల ఆలయం వరకు 5కే, 10కే రన్ నిర్వహించారు. అలాగే 21కే రన్‌ను మధ్యకోట ఖుషిమ హాల్ నుంచి హన్మకొండ వరకు చేపట్టారు. కాగా, వివిధ కేటగిరీల్లో రన్ చేసిన వివిధ రాష్ట్రాల పర్యాటకులకు మెడల్స్‌తోపాటు వరంగల్ గో యునెస్కో హెరిటేజ్‌తో ముద్రించిన సర్టిఫికెట్లు అందజేశారు. ఇదిలా ఉండగా, రన్లో పాల్గొన్న పర్యాటకులకు డాక్టర్లు కూరపాటి రమేష్, రాధిక వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, జ్యూస్ అం దజేశారు. కార్యక్రమంలో మిల్స్‌కాలనీ సీఐ వేణు, ఎస్సైలు రవీందర్, శ్రీదేవి, కేంద్ర పురావస్తుశాఖ కోఆర్డినేటర్ శ్రీకాం త్, సిబ్బంది కుమారస్వామి, పర్యాటకశాఖ గైడ్ దేనబోయిన రవి, తదితరులు పాల్గొన్నారు. కాకతీయుల శిల్ప సంపద అద్భుతం.. మా స్వస్థలం వరంగల్. వృత్తిరీత్యా మానాన్న డాక్టర్ కావడంతో కొన్నేళ్ల నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నాం. కాకతీయుల రాజ ధాని కోటను మొదటిసారిగా చూశాను. రాతికోట అందాలను తిలకిస్తూ 5కే రన్‌ను సుల భంగా పూర్తి చేశాను. కాకతీయుల శిల్ప సంపద, నాటి శి ల్పులు నల్లరాతిలో చెక్కిన కళా ఖండాలు అద్భుతంగా ఉన్నాయి. అమ్మనాన్నలతో కలిసి మరోసారి ఇక్కడికి వచ్చి శిల్పాలను చూస్తా. -దివ్య, హైదరాబాద్ రన్లో పాల్గొనడం ఆనందంగా ఉంది.. కాకతీయుల చారిత్రక కట్టడాలను భావి తారాలకు అందించేందుకు ప్రతి ఒక్క రూ కృషి చేయూలి. హెరిటేజ్ 10కే రన్లో పాల్గొనడం ఆనందంగా ఉం ది. గో హెరిటేజ్ రన్‌ను ఏ రాష్ట్రం లో నిర్వహించిన ఉత్సాహంగా పాల్గొంటా. వృత్తిరీత్యా డాక్టర్ అరుునప్పటికీ ప్రతిరోజు ఉదయం 5 నుంచి 7 గంటల వరకు రన్నింగ్, వాకింగ్ చే స్తా. - డాక్టర్ నవీన, హైదరాబాద్