శిల్పం పడేశారు.. 89 లక్షలు కట్టండి! | Kansas woman says city wants $132K for toppled sculpture | | Sakshi
Sakshi News home page

శిల్పం పడేశారు.. 89 లక్షలు కట్టండి!

Published Mon, Jun 18 2018 6:16 AM | Last Updated on Mon, Jun 18 2018 6:16 AM

Kansas woman says city wants $132K for toppled sculpture | - Sakshi

కన్సాస్‌: అమెరికాలోని కన్సాస్‌లో పట్టణంలో ఓ కుటుంబానికి ఇన్సూరెన్స్‌ కంపెనీ షాకిచ్చింది. ఓ చిన్నారి(5) కారణంగా ఇక్కడి కమ్యూనిటీ సెంటర్‌లో ఏర్పాటుచేసిన శిల్పం తీవ్రంగా దెబ్బతినడంతో రూ.89 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని అతని కుటుంబానికి నోటీసులు జారీచేసింది. కన్సాస్‌లోని ఓవర్‌లాండ్‌ పార్క్‌కు చెందిన సారా గుడ్‌మెన్‌ కుటుంబం మే 19న స్థానిక కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైంది. ఈ సందర్భంగా సారా కుమారుడు అక్కడ ఏర్పాటుచేసిన గాజు శిల్పాన్ని కదిలించేందుకు యత్నించాడు. దీంతో ఆ శిల్పం కిందపడిపగిలిపోయింది. ఈ ఘటనలో సారా కుమారుడికి కూడా గాయాలయ్యాయి. దీంతో బాలుడి విషయంలో నిర్లక్ష్యం వహించారంటూ ఆ కుటుంబానికి బీమా కంపెనీ నోటీసులు జారీచేసిందన్నారు. నోటీసులు అందుకున్న సారా స్పందిస్తూ.. నిర్వాహకులు ఆ శిల్పానికి తగిన రక్షణ ఏర్పాట్లు చేయకుండా వదిలేశారని ఆరోపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement