kansas
-
కాన్సస్‌లో దిగ్విజయంగా నాట్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. కాన్సస్‌లో తాజాగా బాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించింది. ఈ టోర్నమెంట్ కి విశేష స్పందన లభించింది. స్ప్రింట్ ఇండోర్ జిమ్నాసియం ప్రాంగణంలో జరిగిన ఈ పోటీల్లో 100 మందికి పైగా తెలుగు బాడ్మింటన్ ప్లేయర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు. యూత్ సింగిల్స్, యూత్ డబుల్స్, మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, సినీయర్ మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్, మిక్సుడ్ డబుల్స్ విభాగాల్లో బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. యువతను భాగస్వామ్యం చేస్తూ నిర్వహించిన ఈ పోటీలు ఆద్యంత్యం ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ టోర్నమెంట్ కి ప్రేక్షకులు కూడా భారీగా విచ్చేసి క్రీడాకారులను ఉత్తేజ పరిచారు. పోటాపోటీగా జరిగిన ఈ టోర్నమెంట్స్‌లో గెలిచిన విజేతలకు నాట్స్ మెడల్స్, ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు అందజేసింది.కాన్సస్ నగరంలో నాట్స్ కాన్సస్ కోఆర్డినటర్ ప్రసాద్ ఇసుకపల్లి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ మదన్ సానె, సందీప్ మందుల నేతృత్వంలో ఈ పోటీలు దిగ్విజయంగా నిర్వహించారు. శ్రీనివాస్ దామ, సాయిరాం గండ్రోతుల, నాగార్జున మాచగారి, విజయ్ రంగిణి తదితరులు ఈ టోర్నమెంట్ నిర్వహణలో విశేషంగా కృషి చేశారు. ప్రముఖ రియల్టర్స్ భారతి రెడ్డి, కృష్ణ చిన్నం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సేవలు అందిస్తున్న మంత్రి ఇంక్, స్టాఫింగ్ ట్రీ, పక్షీ ఇంక్ తదితర సంస్థలు స్పాన్సర్స్ గా తమ సహకారం అందించారు.కేసీ దేశీ డాట్కాం మీడియా పరంగా మద్దతు ఇచ్చింది.. ప్రశాంత్ కోడూరు, జగన్ బొబ్బర్ల, మనశ్విని కోడూరు, మూర్తి కాశి, తిరుమలేశ్ , కార్తీక్ అయ్యర్, శ్రీకాంత్ కుప్పిరెడ్డి, మధు జిల్లాల, సురేందర్ చిన్నం, నాట్స్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ వెబ్ రవి కిరణ్ తుమ్మల, నాట్స్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మీడియా మురళీ కృష్ణ మేడిచెర్ల, నాట్స్ సెక్రటరీ రాజేష్ కాండ్రు, నాట్స్ నేషనల్ మార్కెటింగ్ కోఆర్డినేటర్ కిరణ్ మందాడి తదితరులు ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ తమ వంతు సహకారాన్ని అందించారు.నాట్స్ బోర్డు సభ్యులు రవి గుమ్మడిపూడి, నాట్స్ (ఇండియా లైసోన్) నేషనల్ కోఆర్డినేటర్ వెంకట్ మంత్రి నాట్స్ కాన్సస్ కోఆర్డినటర్ ప్రసాద్ ఇసుకపల్లి తదితరులు ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ముగింపు సభలో నాట్స్ తెలుగు వారి కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రముఖ సైంటిస్ట్, సంఘ సేవకులు యువతకు క్రీడా డాక్టర్ ఆనంద్ వొడ్నాల, ఆంధ్రాబ్యాంక్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ మల్లవరపు నరసింహారావు (తిరుపతి) ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపేలా మాట్లాడారు. నాట్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ దిగ్విజయంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.కాన్సస్ బ్యాడ్మింటన్ విజేతల వివరాలు:యూత్ సింగిల్స్దేవ్ దర్శన్ ఆర్బి (విన్నర్స్ 1st), అంకిత అరుణ్ శౌరి (2nd), లాస్య రాపోలు (3rd)యూత్ డబుల్స్:దేవ్ దర్శన్ ఆర్బీ & జస్వంత్ ఆర్బీ (విన్నర్స్ 1st), నిత్య వి & అవంతిక అరున్ష (2nd)ఉమన్ డబుల్స్:భవాని రామచంద్రన్ & ప్రదీప ప్రవీణ్ (విన్నర్స్ 1st), అనురాధా పురుషోత్తం & విద్య (2nd),మెన్స్ సింగిల్స్:స్టాన్లీ (విన్నర్స్ 1st), దివాకర్ చెన్నారెడ్డి (2nd), సతీష్ మీసా (3rd)మెన్స్ డబుల్స్:యశ్ & నందు(విన్నర్స్ 1st), సందీప్ మందుల & మనోజ్సినీయర్ మెన్స్ డబుల్స్:దివాకర్ చెన్నారెడ్డి & సతీష్ మీసా (విన్నర్స్ 1st), మనోజ్ & కార్తీక్ అయ్యర్ (2nd), సిరాజ్ & సందీప్ మందుల (3rd). -
కన్సాస్ సెనేటర్‌గా ఉషా రెడ్డి
హూస్టన్: అమెరికాలోని కన్సాస్ రాష్ట్ర సెనేటర్‌గా భారతీయ అమెరికన్, విద్యావేత్త ఉషా రెడ్డి (57)బాధ్యతలు చేపట్టారు. డెమోక్రాటిక్ పార్టీ తరఫున బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఆమె 2013 నుంచి మన్çహాటన్ సిటీ కమిషన్‌గా కొనసాగుతున్నారు. మేయర్‌గా రెండుసార్లు ఎన్నికయ్యారు. నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ చాప్టర్ ప్రెసిడెంట్‌గానూ ఉన్నారు. ఉషారెడ్డి 8 ఏళ్లప్పుడు ఆమె కుటుంబం ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి అమెరికా వెళ్లింది. -
అబల కాదు.. ఐరన్ లేడీ! ఆమె చేతిలో పడితే చిత్తు చిత్తే!!
Most Apples Crushing Guinness World Record: కోమలమైన అంగములు కలదని స్త్రీని కోమలాంగి, రమణి, లతాంగి.. వంటి అనేక పేర్లతో పిలుస్తారు. ఐతే ఈ వనిత చేసే పనులు చూశారంటే మాత్రం కళ్లు తిరిగి పడిపోతారు. మీరే చూడండి.. లిన్సే లిండ్బర్గ్ అనే మహిళ ‘మామా లూ’ అనే స్టేజ్ నేమ్‌తో అమెరికాలో చాలా ఫేమస్. ఎందుకో తెలుసా.. కేవలం చేతులతోనే దోసెల పెనంను పేపర్‌ను మడిచినట్టు మడిచేయగలదు. ఇనుప వస్తువులను చిత్తుకాగితాల్లా ముక్కలు ముక్కలు చేసేయగలదు. ఇక యాపిల్స్ నైతే మోచేయి మధ్యలో ఉంచి.. పిండిచేసేస్తుంది. ఇలా 10కి పైగా యాపిల్స్‌ను కేవలం ఒక్క నిముషంలోనే ఫట్.. ఫట్.. మని పగులగొట్టి ఏకంగా గిన్నీస్ రికార్డు సొంతం చేసుకుంది. అంతేకాదు ఒక నిమిషంలో 5 డెక్‌ల కార్డ్‌లను చించేసింది. అత్యధిక టెలిఫోన్ డైరెక్టరీలను ఒక నిమిషంలోనే సగానికి చింపిన రికార్డులు కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ స్ట్రాంగెస్ట్ మహిళ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో తలమునకలౌతున్నారు. లక్షల్లో వీక్షణలు, వేలల్లో ప్రశంశలతో ముంచేస్తున్నారు. ‘నేను పెద్దయ్యాక ఆమెలా స్ట్రాంగ్‌గా తయారవుతా’ అని ఒకరు, వావ్..! సూపర్బ్!! అని మరొకరు కామెంట్లు చేశారు. మరి మీరేమంటారు..! చదవండి: Never Too Late: యాహూ! వందకు 89 మార్కులు.. 104 ఏళ్ల బామ్మ సంతోషం!! View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
వైరల్: కూతురి వేళ్లు కొరుక్కుతిన్న తల్లి!
కాన్సాస్ : ‘కూతురి వేళ్లు కొరుక్కుతిన్న తల్లి’ అని చదవగానే ఆ తల్లి ఎంత క్రూరురాలో ఊహించుకుని, మనసులో ఆమెను తిట్టుకుని ఉంటారు కూడా. అయితే ఆ తల్లి నిజంగా తన కూతురి వేళ్లను కొరుక్కుతిన లేదు. కూతురి రియాక్షన్ చూద్దామని తిన్నట్లు నటించిందంతే. వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం అమెరికాలోని కాన్సాస్కు చెందిన ఓ మహిళ తన కూతురు జోషఫైన్ చార్లీ వేళ్లను నోట్లో పెట్టుకుని కొరికి తిన్నట్లు నటించింది. అయితే తన చేతి వేళ్లను చూసుకున్న చార్లీ నిజంగా తల్లి వాటిని తిన్నట్లు ముఖం పెట్టింది. వెక్కివెక్కి ఏడ్చింది. ( మీ కథ చెబితే డబ్బులిస్తాడు ) సదరు మహిళ ఇందుకు సంబంధించిన వీడియో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ‘‘తన వేళ్లు తిన్నందుకు చార్లీ ఇప్పటికీ నాపై కోపంగా ఉంది’’ అంటూ శీర్షికను జోడించింది. డిసెంబర్ 13న షేర్ అయిన ఈ వీడియో వేల సంఖ్యలో వ్యూస్, పదుల సంఖ్యలో కామెంట్లు సంపాదించుకుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు..‘‘ఈ పిల్ల మరీ అమాయకురాలిలా ఉందే!.. నువ్వేం తల్లివి చంటిపిల్లను అలా ఏడిపించొచ్చా?.. పిదప కాలం పిల్లలు.. పిదప కాలం బుద్ధులు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
దోమలతో కరోనా రాదు
వాషింగ్టన్: కోవిడ్–19 వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)ఇప్పటికే ప్రకటించగా ఆ వాదనను తాజాగా శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. కరోనా వైరస్ మనుషుల్లో దోమల ద్వారా సోకదని మొదటిసారిగా ధ్రువీకరించారు. జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ఈ పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి. కోవిడ్–19 వ్యాధికి కారణమయ్యే సార్స్ కోవ్–2 వైరస్‌కు దోమల ద్వారా ఒకరి నుంచి మరొకరి సోకే సామర్ధ్యం లేదని ప్రయోగాత్మకంగా రుజువైందని అమెరికాలోని కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు సీఫెన్ హిగ్స్ వెల్లడించారు. దోమల్లో ప్రధానమైన ఈడిస్ ఈజిప్టై, ఈడిస్ అల్బోపిక్టస్, క్యూలెక్స్ క్విన్క్వెఫాసియాటస్ రకాలపై చేసిన ప్రయోగాల్లో ఈ విషయం తేలిందన్నారు. వైరస్ సోకిన వ్యక్తి నుంచి రక్తాన్ని పీల్చినప్పటికీ ఈ రకం దోమలు ఆరోగ్యవంతుడికి ఈ వ్యాధిని వ్యాప్తి చేయలేక పోయాయని గుర్తించామని వివరించారు. -
నాట్స్ ఆధ్వర్యంలో కోటి రాగాలు
క్యాన్సస్: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) .. క్యాన్సస్ లో కోటి రాగాలు పేరుతో మ్యూజికల్ నైట్ నిర్వహించింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగువారి కోసం నాట్స్ ఈ మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసింది. తెలుగు ప్రముఖ సంగీత దర్శకులు కోటి ఈ మ్యూజికల్ నైట్‌లో తన పాటలతో హోరెత్తించారు. తెలుగువారి చేత చిందేయించారు. మాస్, క్లాస్ బీట్ సాంగ్స్ తో కోటి టీం పాటల ప్రవాహాన్ని కొనసాగించడంతో తెలుగువారికి మధురానుభూతులు పంచింది. చాలా కాలం తర్వాత తెలుగు పాటల ప్రవాహంలో మునిగితేలామని.. అలనాటి రోజులను గుర్తు చేసుకున్నామని క్యాన్సస్ లో ఉండే తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. క్యాన్సస్ నాట్స్ ఛాప్టర్ సమన్వయకర్త రవి గుమ్మడిపూడి, సెక్రటరీ వెంకట్ మంత్రి నేతృత్వంలో చేపట్టిన ఈ మ్యూజికల్ నైట్ ఎంతో ఆహ్లాదంగా సాగింది. ఈ సందర్భంగా నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి మాట్లాడుతూ.. నాట్స్ చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి తెలుగువారి నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని, ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. నాట్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాల గురించి మంచికలపూడి వివరించారు. అమెరికాలో ఉండే తెలుగువారంతా ఇప్పుడు నాట్స్ కుటుంబంలో చేరుతున్నారని... నాట్స్ కుటుంబం అంటే ఒకరికి ఒకరు అండగా ఉండే కుటుంబం..అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా తక్షణం స్పందించే కుటుంబం అనేది నాట్స్ హెల్ప్ లైన్ రుజువు చేసిందన్నారు. కోటి రాగాల కార్యక్రమం అనంతరం సంగీత దర్శకుడు కోటితో పాటు మిగిలిన గాయనీ, గాయకులు సుమంగళి, శ్రీకాంత్ సండుగు, ప్రసాద్ సింహాద్రి తదితరులను నాట్స్ ఘనంగా సత్కరించింది. దాదాపు 500 మందికిపై తెలుగువారు కోటి రాగాలు కార్యక్రమానికి విచ్చేశారు. తెలుగు పాటల మాధుర్యంలో తేలియాడారు. క్యాన్సస్ తెలంగాణ కల్చరల్ అసోషియేషన్ ఈ మ్యూజికల్ నైట్ కు కో స్పాన్సర్ గా వ్యవహారించింది. -
కాన్సాస్‌లో ఘనంగా దసరా సంబరాలు
కాన్సాస్ : కాన్సాస్ తెలుగు సంఘం(టీఏజీకేసీ) ఆధ్వర్యంలో స్థానిక హిందూ దేవాలయంలో దసరా, బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. దాదాపు 1500 మంది పాల్గొన్న ఈ వేడుకలు పూజారీ శ్రీనివాసా చార్య నిర్వహించిన గౌరీ పూజతో ప్రారంభమయ్యాయి. తెలుగు వారందరూ సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలతో రావడంతో అమెరికాలో అచ్చమైన తెలుగు పండగ వాతావరణం కనిపించింది. ఈ కార్యక్రమానికి అదితి బావరాజు, శ్రీకాంత్ లంకలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ వేడుకల్లో బతుకమ్మ తయారు చేయడం, గోరింటాకు అలంకరణలు ప్రత్యేకంగా ఆకర్షించాయి. బతుకమ్మ పాటలతో చిన్న పెద్ద తేడాలేకుండా అందరూ బతుకమ్మ చుట్టూ నృత్యం చేశారు. ఉత్తమ బతుకమ్మలకు పట్టు చీరలను బహుమతిగా అందించారు. తర్వాత సంప్రదాయ బద్దంగా బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కృషి చేసిన వారందరికీ కాన్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు శివ తీయగూర ధన్యవాదాలు తెలిపారు. -
అమెరికా బార్లో కాల్పులు
కాన్సస్: అమెరికాలోని కాన్సస్ పట్టణంలోని టెక్విలా కేసీ బార్లో కాల్పుల కలకలం చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో అయిదుగురు గాయపడ్డారు. పాత కక్షలతోనే కాల్పులు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాల్పులకు ముందు నిందితులు ఇద్దరూ బార్లోనే ఉన్నారు. అయితే నిందితులకు, లోపల ఉన్న వారికి ఏవో భేదాభిప్రాయాలు రావడంతో ఈ ఇద్దరూ బయటకు వెళ్లి, రాత్రి 1.30 గంటలకు తుపాకులతో లోపలికి వచ్చారు. అనంతరం బార్లో ఉన్న వారిపై కాల్పులు జరపడం ప్రారంభించారని పోలీస్ అధికార ప్రతినిధి థామస్ తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో బార్లో 40 మంది వరకూ ఉన్నారని వెల్లడించారు. కాల్పులు ప్రారంభం కాగానే లోపల ఉన్నవారంతా వివిధ మార్గాల గుండా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారని తెలిపారు. కాల్పుల వెనుక జాత్యహంకార విద్వేషం ఉన్నట్లు తాము భావించడం లేదని పోలీసులు తెలిపారు. -
కాన్సాస్‌లో వైఎస్సార్సీపీ విజయోత్సవం
కాన్సాస్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా అమెరికాలో వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాన్సాస్‌లో విజయోత్సవ సభ నిర్వహించారు. గొప్ప విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, వైఎస్సార్సీపీ నాయకులకు, విజయ సారథి వైఎస్ జగన్‌కి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ నిర్వహించిన పాదయాత్ర వలన ప్రజల సమస్యలు పూర్తిగా తెలుసుకోవడమే కాకుండా, ఆయన చూపించిన పరిష్కార మార్గాలు, ప్రజలలో విశ్వాసం కలిగించిందని వైఎస్సార్ కంటే ఒక అడుగు ముందుకేసి పరిపాలిస్తారని ఎన్ఆర్ఐలు అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఎంతో సంతోషానిచ్చిందని వైఎస్సార్సీపీ కాన్సాస్ సిటీ కోర్ కమిటీ సభ్యులు జొన్నల సునీల్ రెడ్డి, సాగర్ సింగారెడ్డి, పి. సుబ్రమణ్యేశ్వరరావు, వంశి సువ్వారి, అశోక్ మేక, శివ తియ్యగూర, అవుతు విజయ్ భాస్కర్ రెడ్డి, చంద్ర యక్కలి, శ్రీనివాస్ ఓరుగంటి, శ్రీనుకుమార్ గాదిరాజు, శ్రీనివాసుల రెడ్డి చేవూరు, నరేంద్ర దుద్దెల, సుదర్శన్ చెమికాల, వెంకట్ మంత్రి, చిర్రారెడ్డి దివాకర్ రెడ్డి, సుమన్ సారెకుక్క, కిరణ్ కుమార్ రెడ్డి బడే తెలిపారు. 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లను గెలుచుకోవడం ప్రజావిజయమని పేర్కొన్నారు. ప్రజా నాయకుడు వైఎస్ జగన్‌కు పట్టంకట్టినందుకు ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాగుంట శ్రీనివాసలు రెడ్డి (ఎంపీ, ఒంగోలు), మేకపాటి గౌతమ్ రెడ్డి (మినిస్టర్ ఆఫ్ ఐటీ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, ఆత్మకూరు), బియ్యపు మధుసూదన్ రెడ్డి (ఎమ్మెల్యే , శ్రీకాళహస్తి ), మద్దిశెట్టి వేణుగోపాల్ (ఎమ్మెల్యే , దర్శి), కంగట్టి శ్రీదేవి (ఎమ్మెల్యే, పత్తికొండ), శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి (ఎమ్మెల్యే, నంద్యాల), గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి (ఎమ్మెల్యే, నర్సరావుపేట), బొత్స అప్పల నరసయ్య (ఎమ్మెల్యే, గజపతినగరం), ఆళ్ళ రామి రెడ్డి (వైఎస్సార్ ఫౌండేషన్)లు వైఎస్సార్సీపీ అభిమానులని ఉద్దేశించి మాట్లాడిన వీడియోలని ప్రదర్శించారు. కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి ముగిసే వరకు జై జగన్... జోహార్ వైఎస్సార్ నినాదాలతో హోరెత్తించారు. అతిథులందరికీ రుచికరమైన ఆహారాన్ని అందించిన గోదావరి రెస్టారెంట్ బృందానికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. -
కారు బోల్తా.. భారతసంతతి మహిళ మృతి
నార్త్ కరోలినా : అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో భారతసంతతికి చెందిన ఓ మహిళ మృతిచెందారు. మిస్సోరీ స్టేట్ హైవే పెట్రోల్ పోలీసుల కథనం ప్రకారం.. మిన్నెసొటాలోని ఎడెన్ ప్రైరీకి చెందిన బాబు సెల్వం తన భార్య, కూతురుతో కలిసి నిస్సాన్ రోగ్ కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. అతివేగంగా నడపడం వల్ల కారు అదుపుతప్పి ఎమర్జెన్సీ క్రాస్ ఓవర్‌ను ఢీకొట్టి గాల్లో ఎగిరి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో బాబు సెల్వం భార్య రమ్యభారతి మోహన్(34) మృతిచెందారు. సీటు బెల్టు ధరించకపోవడం వల్ల పల్టీలు కొడుతున్న కారులో నుంచి బయట పడటంతో అక్కడికక్కడే ఆమె మృతిచెందారు. కెమెరూన్‌కు 11 మైళ్ల దూరంలోని డేవీస్ కౌంటీలో ఇంటర్‌స్టేట్ 35 (ఐ-35) జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్వల్పగాయాలైన తియారా(1)ను కాన్సాస్‌లోని చిల్డ్రన్స్ మెర్సీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. -
టీఏజీకేసీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగ
కాన్సాస్ : అమెరికాలోని కాన్సాస్‌లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటి (టీఏజీకేసీ) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానిక బ్లూవ్యాలీ నార్త్ వెస్ట్ హైస్కూల్లో జరిగిన ఈ వేడుకల్లో దాదాపు వెయ్యి మంది తెలుగు వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇండియా నుండి వచ్చిన రఘు వేముల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సూపర్ సింగర్ ఫేమ్ అంజనా సౌమ్య, కాన్సాస్ సిటి స్థానిక సింగర్ శ్రియ పొందుర్తిలు తమ గాత్రంతో ఊర్రూతలూగించారు. స్థానిక దేవాలయ పూజారి నిర్వహించిన బతుకమ్మ, అమ్మ వారి పూజలతో కార్యక్రమం ప్రారంభమయింది. నగరంలోని తెలుగు వారు అందరు సాంప్రదాయ వేషధారణలో తాము చేసిన బతుకమ్మలను తీసుకోని రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సాంస్కృతిని ప్రతిభింబించే జానపద, బతుకమ్మ పాటలను మహిళలు, యువతులు ఆడిపాడారు. బతుకమ్మలన్నింటిలో మంచి బతుకమ్మలను న్యాయ నిర్ణేతలు నిర్ణయించి, వారికి స్పాన్సర్స్ ద్వారా బహుమతులు అందజేశారు. అనంతరం బతుకమ్మలను తీసుకొని వెళ్లి నిమజ్జనం చేసి, ప్రసాదాలు పంచారు. కార్యక్రమం విజయవంతం కావటానికి కృషి చేసిన అందరికి టీఏజీకేసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ధన్యవాదాలు తెలిపింది. -
శరత్ హంతకుడి కాల్చివేత
వాషింగ్టన్/హైదరాబాద్: తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శరత్ కొప్పు(25)ను హత్యచేసిన కేసులో పరారీలో ఉన్న నిందితుడ్ని అమెరికా పోలీసులు ఆదివారం కాల్చిచంపారు. అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై దుండగుడు కాల్పులు జరపడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఎదురు కాల్పులు జరిపారు. దీంతో నిందితుడు ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శరత్ మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లారు. అక్కడే మిస్సోరీ రాష్ట్రంలోని కాన్సస్‌లో ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న శరత్‌పై జూలై 6న దొంగతనానికి వచ్చిన ఓ దుండగుడు కాల్పులు జరిపి పరారయ్యాడు. వారంపాటు మాటువేసిన పోలీసులు ఆదివారం నిందితుడ్ని గుర్తించారు. మఫ్టీలో ఉన్న ఇద్దరు పోలీసులు నిందితుడ్ని ఓ రెస్టారెంట్ వరకూ కారులో వెంబడించారు. చివరకు తనను సమీపిస్తున్న పోలీసుల్ని గుర్తుపట్టిన దుండగుడు వారిపై కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించాడు. దీంతో మఫ్టీలో ఉన్న అధికారులు సైతం ఎదురుకాల్పులు జరిపారు. ఇంతలోనే అదనపు బలగాలు అక్కడకు చేరుకుని ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. శరత్‌ను పొట్టనపెట్టుకున్న దుండగుడ్ని పోలీసులు కాల్చిచంపడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ‘శరత్ హంతకుడ్ని పోలీసులు కాల్చి చంపడం మంచివార్తే. అయితే ఆ దుండగుడ్ని చట్టం ముందు నిలబెట్టి అమాయకుడ్ని చంపినందుకు కుమిలికుమిలి బాధపడేలా శిక్షను విధించాల్సింది’ అని శరత్ బాబాయ్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. -
కౌగిలింత ఖరీదు 90 లక్షల రూపాయలు
కన్సాస్: అమెరికాలో ఓవర్‌ల్యాండ్ పార్క్, టోమాహాక్ రిడ్జ్ కమ్యూనిటీ సెంటర్లో ఒక ఐదేళ్ల పిల్లవాడు తెలియక చేసిన చిన్న తప్పిదానికి దాదాపు 90 లక్షల రూపాయల మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కమ్యూనిటీ సెంటర్లోని సర్వేలైన్ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ప్రకారం సారా గాడ్మాన్ కొడుకు, ఐదేళ్ల పసివాడు అక్కడే ఉన్న ఓ విగ్రహాన్ని కౌగిలించుకుని, ఆడుకుంటున్నాడు. అయితే అనుకోకుండా ఆ విగ్రహం కాస్తా కింద పడి పగిలిపోయింది. అదృష్టవశాత్తు పిల్లవానికి ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న సారా వెంటనే అక్కడకు వెళ్లి తన కుమారున్ని ఇంటికి తీసుకొచ్చింది. పగిలిపోయిన విగ్రహం ఖరీదు మహా అయితే ఓ 800 డాలర్లు (ఇండియా కరెన్సీ ప్రకారం 55,076 రూపాయలు) ఉంటుంది. ఆ మొత్తాన్ని కట్టేస్తే గొడవ ఉండదని అనుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత కమ్యూనిటీ సెంటర్ నుంచి సారాకు ఒక ఉత్తరం వచ్చింది. దానిలో తన కుమారుడు పగలకొట్టిన విగ్రహం ఖరీదు చూసిన సారాకు గుండె ఆగినంత పనయ్యింది. ఓ 800 డాలర్లు ఉంటుందనుకున్న విగ్రహం విలువ కాస్తా ఏకంగా 1,32,000 డాలర్లు (అంటే మన కరెన్సీ ప్రకారం 90,87,540 రూపాయలు) గా ఉంది. ముందు ఆ ఉత్తరం చూసి ఆశ్చర్యపోయిన సారా, తెరుకుని కమ్యూనిటీ సెంటర్ వారిని తిట్టడం ప్రారంభించింది. ‘అంత ఖరీదైన విగ్రహాన్ని ఎలాంటి రక్షణ లేకుండా, కనీసం తాకకూడదనే హెచ్చరిక కూడా లేకుండా ఇలా జనాలు తిరిగే ప్రదేశంలో ఎలా ఉంచుతార’ని ప్రశ్నించింది. అంతేకాక డబ్బు చెల్లించనని తేల్చి చెప్పింది. దాంతో కమ్యూనిటీ సెంటర్ అధికారులు ‘ఆ విగ్రహాన్ని సందర్శన నిమిత్తం ఇక్కడకు తీసుకొచ్చాము. అయినా ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంద’ని తెలిపారు. విగ్రహం ఖరీదు చెల్లించనని చెప్పిన సారా, కంపెనీ వారు తీసుకునే చట్టపరమైన చర్యలను ఎదుర్కొడానికి సిద్దపడింది. కానీ ఇంతలో కమ్యూనిటీ సెంటర్ అధికారి రైలీ ‘మా ఇన్సూరెన్స్ కంపెనీ పొరపాటున బిల్లు చెల్లించమనే ఉత్తరాన్ని సారాకు పంపింది. కానీ మేము ఆ బిల్లును సారా కుటుంబం నుంచి వసూలు చేయాలనుకోవడం లేదు. ఆమె ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి ఈ వ్యవహారాన్ని ముగిస్తామ’ని తెలిపారు. సారా కొడుకు పగలకొట్టిన విగ్రహం స్థానిక శిల్పి బిల్ లియన్స్ రూపొందించిన ‘ఆఫ్రొడైట్ డి కాన్సాస్ సిటి’ అనే శిల్పం. -
‘ఎఫ్’ నుంచి ‘ఏ’ గ్రేడ్‌కు!
కన్సాస్: ఎక్కువ మార్కుల కోసం తల్లిదండ్రులు పిల్లలపై తెస్తున్న ఒత్తిడి ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో చెప్పడానికి తాజా ఉదాహరణే ఇది. భారత సంతతికి చెందిన వరుణ్ సార్జా(20) అనే విద్యార్థి అమెరికాలోని కాన్సాస్ యూనివర్సిటీలో 2016లో ఇంజనీరింగ్‌లో చేరాడు. అయితే మొదటి సంవత్సరం పరీక్షల్లో మార్కులు తక్కువగా రావడంతో ఇంట్లో తల్లిదండ్రులు తిడతారని భయపడ్డ వరుణ్ అడ్డదారి తొక్కాడు. కీస్ట్రోక్ లాగర్ అనే హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి తన గణితం ప్రొఫెసర్ కంప్యూటర్ను హ్యాక్ చేశాడు. అనంతరం పరీక్షల్లో తనకు వచ్చిన ‘ఎఫ్’ గ్రేడ్‌ను ‘ఏ’ గ్రేడ్‌గా మార్చుకున్నాడు. ఇదే తరహాలో మిగిలిన 9 సబ్జెక్టుల్లోనూ ఏ గ్రేడ్ వచ్చినట్లు హ్యాక్ చేయగలిగాడు. అయితే గణితంలో ఎన్నడూ మంచిమార్కులు తెచ్చుకోని సార్జాకు ఏకంగా ‘ఏ’ గ్రేడ్ రావడంపై అకడమిక్ అడ్వైజర్‌కు అనుమానం వచ్చి మార్కుల్ని తనిఖీ చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో సార్జాకు ఇక్కడి కోర్టు 18 నెలల జైలుశిక్ష విధించింది. -
శిల్పం పడేశారు.. 89 లక్షలు కట్టండి!
కన్సాస్: అమెరికాలోని కన్సాస్‌లో పట్టణంలో ఓ కుటుంబానికి ఇన్సూరెన్స్ కంపెనీ షాకిచ్చింది. ఓ చిన్నారి(5) కారణంగా ఇక్కడి కమ్యూనిటీ సెంటర్లో ఏర్పాటుచేసిన శిల్పం తీవ్రంగా దెబ్బతినడంతో రూ.89 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని అతని కుటుంబానికి నోటీసులు జారీచేసింది. కన్సాస్‌లోని ఓవర్లాండ్ పార్క్‌కు చెందిన సారా గుడ్‌మెన్ కుటుంబం మే 19న స్థానిక కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైంది. ఈ సందర్భంగా సారా కుమారుడు అక్కడ ఏర్పాటుచేసిన గాజు శిల్పాన్ని కదిలించేందుకు యత్నించాడు. దీంతో ఆ శిల్పం కిందపడిపగిలిపోయింది. ఈ ఘటనలో సారా కుమారుడికి కూడా గాయాలయ్యాయి. దీంతో బాలుడి విషయంలో నిర్లక్ష్యం వహించారంటూ ఆ కుటుంబానికి బీమా కంపెనీ నోటీసులు జారీచేసిందన్నారు. నోటీసులు అందుకున్న సారా స్పందిస్తూ.. నిర్వాహకులు ఆ శిల్పానికి తగిన రక్షణ ఏర్పాట్లు చేయకుండా వదిలేశారని ఆరోపించారు. -
కాన్సస్‌లో ఉగాది వేడుకలు
కాన్సస్ : అమెరికాలోని కాన్సస్ సిటీలో తెలుగు అసొసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సస్ సిటీ(టీఏజీకేసీ) ఆధ్వర్యంలో శ్రీ విళంభి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఓవర్ ల్యాండ్ పార్క్‌లోని బ్లూ వ్యాలీ నార్త్ వెస్ట్ హై స్కూల్లో జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 800 మందికి పైగా తెలుగు వాళ్లు పాల్గొన్నారు. దేవాలయ పూజారి శ్రీనివాసాచార్యులు పంచాంగ శ్రవణం చేశారు. ప్రొగ్రామ్ కమిటీ ఛైర్ విశేషు రేపల్లె అతిథులందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రావణి మేక, దీప్తి జొన్నలగడ్డలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. పిల్లలు ప్రదర్శించిన శాస్త్రీయ, సినిమా పాటల నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. టీఏజీకేసీ అధ్యక్షులు సురేష్ గుండు తన కార్యవర్గ సభ్యులను పాట ద్వారా వేడుకపైకి ఆహ్వానించారు. తెలుగు సాహితి, సంస్కృతిలను కాపాడుతూ, ముందు తరాలవారికి అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సురేష్ పేర్కొన్నారు. మానవ సేవే మాధవ సేవ కనుక ఎవరికి తోచిన విధంగా ఇతరులకు సహాయం చేయాలని కోరారు. టీఏజీకేసీ ట్రస్ట్ బోర్డ్ ఛైర్ శిరీష మంచెల్ల ట్రస్ట్ బోర్డ్ కార్యవర్గాన్ని అందరికి పరిచయం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా తెలుగు సంఘానికి సేవలు చేసిన వారికి జ్ఞాపికలు అందజేశారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ముగ్గులపోటీలు, చెస్, క్యారం బోర్డ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యక్షులు శివ తియాగుర కార్యక్రమ విజయానికి సహాయం అందించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. -
రచ్చ రచ్చ చేసి ఇలా దొరికిపోయారు
-
రచ్చ రచ్చ చేసి ఇలా దొరికిపోయారు
కాన్సాస్ : సినిమాను తలపించే రేంజ్లో చేజ్ జరిగింది. అయితే, అదెదో దొంగలనో.. ఉగ్రవాదులనో కాదు.. డ్రగ్స్ మత్తులో తూలుతున్న ముగ్గురు యువకులను. కళ్లు చెదిరే హైస్పీడ్ డ్రైవింగ్‌తో ఏ వాహనాలను దాటవేసుకుంటూ వెళుతున్నామో అనే అంశాన్ని కూడా లెక్కచేయకుండా చూసేవారికి ఒళ్లు జలదరించేంత వేగంతో వెళుతున్న వారిని పోలీసులు తరిమారు. దాదాపు పన్నెండు నిమిషాలపాటు ఈ వేట కొనసాగింది. చివరకు పోలీసుల ధాటికి తట్టుకోలేక వారు లొంగిపోయారు. ఎక్కడ తమవైపు బుల్లెట్లు దూసుకొని వస్తాయో అని వెంటనే కారు డోర్లు తీసి నేలపై పడుకున్నారు. దీంతో ఒకరు కాదు ఇద్దరు కాదు బృందాలుగా వచ్చిన పోలీసులు వారిని మొకాళ్లతో తొక్కిపట్టి చేతులు వెనక్కి విరిచి చేతులకు బేడీలు తగిలించారు. ఈ దృశ్యాలు కాన్సాస్‌లో రోడ్లపై నమోదయ్యాయి. పోలీసులు వివరాల ప్రకారం ఆ యువకులంతా కూడా ఫుల్లుగా మత్తులో ఉన్నారు. డ్రైవింగ్ చేసే క్రమంలో కొన్నివాహనాలను ఢీకొట్టారు. మధ్యలో మూడు చోట్ల డ్రగ్స్ ప్యాకెట్లు పడేశారు. చేజింగ్ ఎలా చేశారో ఈ వీడియోలో మీరే చూడండి. -
తూటాలకు ఎదురెళ్లి.. నేడు ఘన సత్కారాలు
-
తూటాలకు ఎదురెళ్లి.. నేడు ఘన సత్కారాలు
హ్యూస్టన్ : నాడు అమెరికాలో జరిగిన కాల్పుల్లో తుటాలకు ఎదురెళ్లి భారతీయుడిని కాపాడిన కాన్సాస్కు చెందిన అమెరికన్ పౌరుడు ఇయాన్ గ్రిల్లాట్‌కు ఘన సన్మానం జరిగింది. 5 హీరోస్ హు గేవ్ అస్ హోప్ ఇన్ 2017' అనే పేరిట టైమ్ మేగజీన్ సత్కారం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కాన్సాస్‌లోని ఓ బార్లో పెద్ద ఎత్తున కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. నేవీలో పనిచేసిన ఓ మాజీ అధికారి భారతీయులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడ్డాడు. ఆ సమయంలో గ్రిల్లాట్(24) ఆ కాల్పులు జరుపుతున్న వ్యక్తికి అడ్డుపడ్డాడు. అప్పటికీ తెలుగువాడైన శ్రీనివాస్ కూచిబొట్ల ప్రాణాలు కోల్పోగా అలోక్ మాదసాని తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా గ్రిల్లాట్ అడ్డుకోగలిగాడు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా గ్రిల్లాట్‌ను ఇండియన్ అమెరికన్ల కమ్యూనిటి హ్యూస్టన్‌లో ఏ ట్రూ అమెరికన్ హీరో అంటే పెద్ద సత్కారం చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో కాన్సాస్‌లో అతడు ఓ ఇళ్లు కొనుగులో చేసుకునేందుకు లక్ష డాలర్లు బహుమతిగా కూడా ఇచ్చారు. -
‘భారతీయులు మాకు చాలా ముఖ్యం’
న్యూయార్క్: భారతీయులు తమ పట్టణానికి చాలా ముఖ్యమైన వారని అమెరికాలోని కాన్సాస్ గవర్నర్ శ్యామ్ బ్రౌన్ బ్యాక్ అన్నారు. వారికి తమ నగరంలోకి అన్ని వేళలా స్వాగతం పలుకుతామని చెప్పారు. ఇటీవల కాన్సాస్ నగరంలోని ఆస్ట్రిచ్ బారులో తెలుగువారిపై ఓ తెల్లజాతి దురహంకారి కాల్పులు జరపడంతో శ్రీనివాస్ కూచిబొట్ల అనే ఇంజినీర్ చనిపోగా.. మరో తెలుగువాడు అలోక్ మాదసాని గాయపడ్డాడు. వీరిని రక్షించే క్రమంలో అమెరికన్ కూడా గాయపడ్డాడు. ట్రంప్ తీసుకున్న వలస దారుల వ్యతిరేక నిర్ణయాల అనంతరం జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో కాన్సాస్ గవర్నర్ ప్రత్యేకంగా భారతీయ దౌత్యాధికారులు, భారత కమ్యూనిటీకి చెందిన ముఖ్యులతో ప్రత్యేకంగా సమావేశమై భరోసా ఇచ్చారు. ఎన్నో దేశాల నుంచి తమ పట్టణానికి వస్తుంటారని, కానీ, భారతీయులు తమకు చాలా ముఖ్యమైన వారని ఆయన అన్నారు. అలాంటివారిపై జాతి విచక్షణ పేరుతో హింస జరగడాన్ని తాము అంగీకరించబోమని, మొన్న జరిగిన ఘటనకు సిగ్గుపడుతున్నామని అన్నారు. ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్న తాము ఇండియన్స్‌కు అందిస్తామని చెప్పారు. ఇక భారతీయ కాన్సులేట్ తరుపున పనిచేసే కాన్సుల్ జనరల్ అనుపమ్ రాయ్ మాట్లాడుతూ గన్‌మేన్ నుంచి భారతీయులను కాపాడేందుకు అసమాన ధైర్యం చూపించి తీవ్రంగా గాయపడిన ఇయాన్ గ్రిల్లాట్‌ను గురువారం కలుసుకోబోతున్నానని చెప్పారు. అలాంటి వ్యక్తిని ఇప్పటి వరకు నా జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదన్నారు. మరో వ్యక్తి కోసం బుల్లెట్‌కు ఎదురెళ్లిన గొప్ప సాహసి అని అన్నారు. సంబంధిత వార్తా కథనాలకై చదవండి.. రక్షించేందుకు కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే ‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’ శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు శ్రీనివాస్ కుటుంబానికి ఎన్ఆర్ఐల బాసట -
వర్ణవివక్షకు తావులేదు
కాన్సస్ ఘటనను ఖండించిన భారతీయ–అమెరికన్లు ► ఘటన విద్వేషపూరితమే: కాంగ్రెస్ సభ్యుడు అమీ బెరా ► మరో కూచిభొట్ల చనిపోకముందే మేల్కొందామన్న బార్ అసోసియేషన్ వాషింగ్టన్ : అమెరికాలోని కాన్సస్‌లో బుధవారం రాత్రి భారత ఇంజనీర్లపై జరిగిన కాల్పుల ఘటనను భారత–అమెరికన్ సమాజం ముక్తకంఠంతో ఖండించింది. అమెరికాలో వర్ణవివక్ష, విదేశీయులంటే భయం వంటి వాటికి తావులేదని.. భారత అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు అమీ బెరా తెలిపారు. ‘కాన్సస్ దుర్ఘటనకు సంబంధించి విచారణ సంస్థలు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడిస్తాయని భావిస్తున్నాను. అమెరికాలో విదేశీయులంటే భయం, వర్ణవివక్షలకు చోటులేదు. ఇప్పటివరకు వెల్లడైన వివరాల ప్రకారం.. విద్వేషపూరితంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇది అమెరికన్లందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది’ అని అమీ బెరా వెల్లడించారు. వలసవాదుల దేశంగా ఉన్న అమెరికాలో.. వ్యక్తుల రంగు, వారి రూపురేఖల ఆధారంగా దాడి చేయటం అమానుషమని ఆయన అన్నారు. మృతుడు శ్రీనివాస్ కూచిభొట్ల కుటుంబానికి అండగా నిలబడతామని అమీ బేరా తెలిపారు. మూడుసార్లు కాలిఫోర్నియా నుంచి కాంగ్రెస్‌కు ఎన్నికైన అమీ బెరా.. భారతీయ అమెరికన్లపై అమెరికా కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. విద్వేషపు తూటా! నోర్మూసుకుని కూర్చోవద్దు: సాబా కాన్సస్ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరగాలని బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం జరగాలని దక్షిణాసియా బార్ అసోసియేషన్ (ఎస్ఏబీఏ–సాబా) డిమాండ్ చేసింది. అమెరికాలో మైనారిటీల హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వమే తీసుకుని పక్కాగా అమలుచేయాలని ఓ ప్రకటనలో కోరింది. ‘ఈ ఘటనపై మనం నోర్మూసుకుని కూర్చోవద్దు. ఎవరినీ క్షమించొద్దు. నిరాశ చెందొద్దు. మన దేశం (అమెరికా)లో వేళ్లూనుకుపోయిన విద్వేషం, విడగొట్టి చూసే ఆలోచనలను కూకటివేళ్లతో పెకిలించివేయాలి. మరో కూచిభొట్ల శ్రీనివాస్ తన ప్రాణాన్ని కోల్పోకముందే మేల్కొనాలి’ అని పేర్కొంది. కాన్సస్ ఘటన దురదృష్టకరమని.. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని కాన్సస్, మిస్సోరీ రాష్ట్రాల గవర్నర్లు చెప్పారు. ట్రంప్‌తో భారత రాయబారి భేటీ అమెరికాలోని భారత రాయబారి నవతేజ్ సర్నా వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక సర్నా ఆయనను కలుసుకోవడం ఇదే తొలిసారి. అమెరికాలో భారతీయులు సహా పలువురు విదేశీయులపై విద్వేష దాడులు జరుగుతున్న నేపథ్యంలో సర్నా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
అమ్మో అమెరికా !
-
అలోక్ మాదసానికి పరామర్శ
హ్యూస్టన్: అమెరికాలో జాతివివక్ష దాడికి గురైన అలోక్ మాదసానిని శుక్రవారం హ్యూస్టన్‌లో భారత కాన్సులేట్ జనరల్ ఆర్డీ జోషి పరామర్శించారు. బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం అలోక్ కోలుకుంటున్నాడని, ప్రమాదమేమీ లేదని కాన్సుల్ జనరల్ జనరల్ అనుపమ్ రే వెల్లడించారు. కన్సాస్ రాష్ట్రం ఒలాతేలో బుధవారం రాత్రి ఓ బార్లో చోటుచేసుకున్న కాల్పుల్లో శ్రీనివాస్ కూచిబొట్ల మృతిచెందగా.. అలోక్ గాయపడిన విషయం తెలిసిందే. జాతివివక్షత నేపథ్యంలో జరిగిన ఈ కాల్పుల ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. -
భార్యను పొడిచి జైలు శిక్ష నుంచి తప్పించుకున్నాడు!
హూస్టన్: భార్యపై హత్యాయత్నం చేసిన భారత అమెరికన్ జైలు శిక్ష నుంచి మినహాయింపు పొందిన అరుదైన సంఘటన ఇది. హిందూ సంస్కృతి, సంప్రదాయాలే ఆయన్ను కాపాడాయి. కాన్కాస్ నివాసి నవీన్‌కుమార్ పటేల్(46) భార్య పప్పు తృణ ధాన్యాలు తిన్నదని తను నడుపుతున్న హోటల్లోనే చిన్న కత్తితో పొత్తి కడుపులో రెండు సార్లు పొడిచాడు. ఆమె లావుగా ఉన్నందునే అలా చేశానని పోలీసుల వద్ద అంగీకరించాడు. హిందూ సంస్కృతి ప్రకారం... భర్తను అరెస్టు చేస్తే అతని భార్య, పిల్లలను పటేల్ వర్గం బహిష్కరిస్తుందని అతని తరపు లాయర్ జాన్ కెర్న్స్ డగ్లస్ కౌంటీ జడ్జి రాబర్ట్ ఫేర్చైల్డ్కి విన్నవించారు. హిందూ సంప్రదాయాలు అతనికి శిక్ష విధించడంలో అడ్డంకిగా మారాయని జడ్జి అన్నారు. ప్రస్తుతానికి పటేల్‌కు ప్రొబేషన్ విధించారు. నేరాలకు తిరిగి పాల్పడకుండా నిరోధించే ప్రణాళికలు తయారుచేసే వరకు తాత్కాలికంగా జైలుకు పంపారు. పటేల్ మద్యానికి బానిసై ‘బైపోలార్ డిసార్డర్’ అనే రుగ్మత వల్లే ఇలా విపరీతంగా ప్రవర్తిస్తున్నాడని ఆయన్ను పరీక్షించిన వైద్యుడు చెప్పారు. తాగడం మాని వైద్యాన్ని కొనసాగిస్తే నేరాలకు పాల్పడే అవకాశం తగ్గుతుందని సూచించారు. విచారణ సమయంలో భార్యతో పాటు కుటుంబ సభ్యులు పటేల్‌కు మద్దతుగా నిలిచారు. తేలికపాటి శిక్ష విధించాలని జడ్జికి ఉత్తరాలు కూడా అందాయి. ఇకపై పటేల్ తాగకుండా జాగ్రత్తపడతామని కుటుంబ సభ్యులు జడ్జికి హామీ ఇచ్చారు. -
అమెరికాలో కాల్పులు: ఏడుగురి మృతి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా కాల్పుల ఘటనతో మరోసారి ఉలిక్కిపడింది. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రంలో తాను పనిచేస్తున్న ఫ్యాక్టరీలోనే ఓ పెయింటర్ కాల్పులు జరపడంతో ఏడుగురు మరణించారు. దాదాపు 30 మంది వరకు గాయపడ్డారు. సెడ్రిక్ ఫోర్డ్ ఎక్సెల్ ఇండస్ట్రీస్‌లో పెయింటర్‌గా పనిచేస్తాడు. అతడు ఫేస్బుక్లో అసాల్ట్ రైఫిల్‌తో ఉన్న తన ఫొటోను పోస్ట్ చేశాడని స్థానికులు తెలిపారు. అతడు ముందుగా తన కంపెనీ పార్కింగ్ లాట్లో ఓ మహిళను కాల్చాడు. తర్వాత అసెంబ్లీ ఏరియాలోకి ప్రవేశించి, విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడు. అయితే, మరో ఇద్దరిని మాత్రం ఇంకా ఫ్యాక్టరీలోకి రాకముందే కాల్చాడని హార్వే కౌంటీ ఆఫీస్ సూపర్ వైజర్ షెరీఫ్ వాల్టన్ స్థానిక మీడియాకు వెల్లడించారు. తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిపిన కాల్పుల్లో సెడ్రిక్ ఫోర్డ్ కూడా మరణించాడు. విషయం తెలియగానే ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ల బంధువులు అక్కడకు తరలి వెళ్లారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. తన మేనల్లుడిని వీపులో నాలుగుసార్లు కాల్చాడని ఓ వ్యక్తి చెప్పారు. సెడ్రిక్ వద్ద ఒక ఏకే 47 తుపాకితో పాటు 9ఎంఎం గన్ కూడా ఉందని అంటున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. -
యూఎస్ లోని రెండు రాష్ట్రాల్లో భూప్రకంనలు!
వాషింగ్లన్: అమెరికాలోని కన్సాస్, ఓక్లహామా రాష్ట్రాలను భూప్రకంపనలు వణికించాయి. భూప్రకంపనాల తీవ్రత రిక్టర్ స్ట్కేల్ పై 4.8గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.40 గంటల ప్రాంతంలో కన్సాస్ లోని కాన్ వే కు సమీపంలో సంభవించినట్టు సమాచారం. యూఎస్ లో సాధారణంగా భూకంప సంఘటనలు అరుదుగా కనిపిస్తాయి. భూకంప సమాచారాన్ని స్థానికులు ట్విటర్ లో కుప్పలుతెప్పలుగా పోస్ట్ చేశారు. భూప్రకంపనాలు ఇంత భయంకరంగా ఉంటుందని అనుకోలేదని కొందరు నెటిజన్లు ట్వీట్ చేశారు. అమెరికాలో ఎక్కువగా టోర్నాడోలు స్థానికులు భయభ్రాంతులకు గురిచేస్తాయి. తాజా అరుదైన భూప్రకంపనలు స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. -
స్వలింగ వివాహాలకు అమెరికా కోర్టు ఓకే!
కాన్సాస్ రాష్ట్రంలో స్వలింగ వివాహాలకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. దాంతో అక్కడున్న మొత్తం 50 రాష్ట్రాలలో ఇలా స్వలింగ వివాహాలను ఆమోదించిన 33వ రాష్ట్రంగా నిలిచింది. తమ రాష్ట్రంలో ఇలాంటి పెళ్లిళ్లను ఆమోదించవద్దంటూ అక్కడ కొంతమంది ప్రజలు చేసిన విజ్ఞప్తులను కోర్టు తిరస్కరించింది. న్యాయమూర్తులలో ఆంటోనిన్ స్కాలియా, క్లారెన్స్ థామస్ అనే ఇద్దరు మాత్రమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మిగిలిన వాళ్లంతా ఓకే చెప్పారు. ఆరు రాష్ట్రాల్లో కూడా స్వలింగ వివాహాలను ఆమోదిస్తున్నట్లు అధ్యక్షుడు బరాక్ ఒబామా గత నెలలో ప్రకటించడంతో అప్పటివరకు 26గా ఉన్న ఈ రాష్ట్రాల సంఖ్య 32కు పెరిగింది. ఇప్పుడు కాన్సాస్ 33వ రాష్ట్రం అయ్యింది. త్వరలోనే దక్షిణ కరొలినా రాష్ట్రం కూడా దీన్ని ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. స్వలింగ వివాహాలను రద్దు చేయాలనడం రాజ్యాంగ విరుద్ధమని అక్కడి న్యాయమూర్తి ఒకరు వ్యాఖ్యానించారు. దానిపై అప్పీలు జరగనుంది. -
యూఎస్ లో టోర్నాడో విధ్వంసం!