Shocking: Woman Creates Guinness Record By Crushing Most Apples With Biceps - Sakshi
Sakshi News home page

Guinness World Record: అబల కాదు.. ఐరన్‌ లేడీ! ఆమె చేతిలో పడితే చిత్తు చిత్తే!!

Published Tue, Nov 16 2021 1:13 PM | Last Updated on Tue, Nov 16 2021 2:57 PM

Woman Creates Guinness World Record By Crushing Most Apples In A Minute - Sakshi

లిన్సే లిండ్‌బర్గ్

Most Apples Crushing Guinness World Record: కోమలమైన అంగములు కలదని స్త్రీని కోమలాంగి, రమణి, లతాంగి.. వంటి అనేక పేర్లతో పిలుస్తారు. ఐతే ఈ వనిత చేసే పనులు చూశారంటే మాత్రం కళ్లు తిరిగి పడిపోతారు. మీరే చూడండి..

లిన్సే లిండ్‌బర్గ్ అనే మహిళ ‘మామా లూ’ అనే స్టేజ్‌ నేమ్‌తో అమెరికాలో చాలా ఫేమస్‌. ఎందుకో తెలుసా.. కేవలం చేతులతోనే దోసెల పెనంను పేపర్‌ను మడిచినట్టు మడిచేయగలదు. ఇనుప వస్తువులను చిత్తుకాగితాల్లా ముక్కలు ముక్కలు చేసేయగలదు. ఇక యాపిల్స్‌ నైతే మోచేయి మధ్యలో ఉంచి.. పిండిచేసేస్తుంది. ఇలా 10కి పైగా యాపిల్స్‌ను కేవలం ఒక్క నిముషంలోనే ఫట్‌.. ఫట్‌.. మని పగులగొట్టి ఏకంగా గిన్నీస్‌ రికార్డు సొంతం చేసుకుంది. అంతేకాదు ఒక నిమిషంలో 5 డెక్‌ల కార్డ్‌లను చించేసింది. అత్యధిక టెలిఫోన్ డైరెక్టరీలను ఒక నిమిషంలోనే సగానికి చింపిన రికార్డులు కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోను గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ స్ట్రాంగెస్ట్‌ మహిళ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. 

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో తలమునకలౌతున్నారు. లక్షల్లో వీక్షణలు, వేలల్లో ప్రశంశలతో ముంచేస్తున్నారు.

‘నేను పెద్దయ్యాక ఆమెలా స్ట్రాంగ్‌గా తయారవుతా’ అని ఒకరు, వావ్‌..! సూపర్బ్‌!! అని మరొకరు కామెంట్లు చేశారు. మరి మీరేమంటారు..!

చదవండి: Never Too Late: యాహూ! వందకు 89 మార్కులు.. 104 ఏళ్ల బామ్మ సంతోషం!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement