Biceps
-
అబల కాదు.. ఐరన్ లేడీ! ఆమె చేతిలో పడితే చిత్తు చిత్తే!!
Most Apples Crushing Guinness World Record: కోమలమైన అంగములు కలదని స్త్రీని కోమలాంగి, రమణి, లతాంగి.. వంటి అనేక పేర్లతో పిలుస్తారు. ఐతే ఈ వనిత చేసే పనులు చూశారంటే మాత్రం కళ్లు తిరిగి పడిపోతారు. మీరే చూడండి.. లిన్సే లిండ్బర్గ్ అనే మహిళ ‘మామా లూ’ అనే స్టేజ్ నేమ్‌తో అమెరికాలో చాలా ఫేమస్. ఎందుకో తెలుసా.. కేవలం చేతులతోనే దోసెల పెనంను పేపర్‌ను మడిచినట్టు మడిచేయగలదు. ఇనుప వస్తువులను చిత్తుకాగితాల్లా ముక్కలు ముక్కలు చేసేయగలదు. ఇక యాపిల్స్ నైతే మోచేయి మధ్యలో ఉంచి.. పిండిచేసేస్తుంది. ఇలా 10కి పైగా యాపిల్స్‌ను కేవలం ఒక్క నిముషంలోనే ఫట్.. ఫట్.. మని పగులగొట్టి ఏకంగా గిన్నీస్ రికార్డు సొంతం చేసుకుంది. అంతేకాదు ఒక నిమిషంలో 5 డెక్‌ల కార్డ్‌లను చించేసింది. అత్యధిక టెలిఫోన్ డైరెక్టరీలను ఒక నిమిషంలోనే సగానికి చింపిన రికార్డులు కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ స్ట్రాంగెస్ట్ మహిళ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో తలమునకలౌతున్నారు. లక్షల్లో వీక్షణలు, వేలల్లో ప్రశంశలతో ముంచేస్తున్నారు. ‘నేను పెద్దయ్యాక ఆమెలా స్ట్రాంగ్‌గా తయారవుతా’ అని ఒకరు, వావ్..! సూపర్బ్!! అని మరొకరు కామెంట్లు చేశారు. మరి మీరేమంటారు..! చదవండి: Never Too Late: యాహూ! వందకు 89 మార్కులు.. 104 ఏళ్ల బామ్మ సంతోషం!! View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
సినిమాలు చూసి ఎంతపని చేశాడు!
'ప్రపంచంలోనే పెద్దకండల వీరుడా?' అన్నట్లు కనిపిస్తోన్న ఇతని పేరు వాల్దిర్ సెగాటో. వయసు 48, ఊరు బ్రెజిల్ లోని సావొ పాలో. కూలినాలి చేసుకుంటూ సాధారణ జీవితం గడిపే వాల్దిర్ ది అసాధారణ లక్ష్యం. అది సాధించడానికి అతను ఎంచుకున్న మార్గం కూడా అత్యంత ప్రమాదకరం. గడిచిన కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తోన్న వాల్దిర్.. తన బైసెప్(చేతి కండల) సైజును 23 ఇంచులకు పెంచాడు. సాధారణంగా 12 ఇంచుల సైజుండే చేతికండలు ఇంతలా పెంచడం గొప్పే కానీ ప్రపంచ రికార్డు మాత్రం కాదు.(ఈజిప్టుకు చెందిన ముస్తఫా ఇస్మాయిల్ అనే మహాబలుడి బైసెప్ సైజు 31 ఇంచులు). కనీసం 27 ఇంచుల సైజుతో అమెరికా ఖండంలోనే అతిపెద్ద బైసెప్ సాధించిన వ్యక్తిగా నిలవాలనేది వాల్దిర్ కల. మొదట్లో సాధారణ వ్యాయామాలు చేసిన ఇతను తొందరగా కండలు పెరిగేందుకు 'synthol'అనే ఆయిల్ ను వినియోగించడం మొదలుపెట్టాడు. ప్రమాదకరమైన ఆ ఆయిల్ ను వాల్దిర్ ఇంజక్షన్ల ద్వారా నేరుగా కండల్లోకి ఎక్కించుకుంటున్నాడు. 'నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లేటప్పుడు జనం నన్ను 'హీ మ్యాన్'.. 'ఆర్నాల్ట్ ష్వార్జ్ నెగర్'.. 'హల్క్'.. అంటూ రకరకాలుగా పిలుస్తారు. ఆ పేర్లు విన్నప్పుడల్లా నా ఛాతి విచ్చుకుంటుంది. ఎందుకంటే నేను కండలు పెంచాలనుకోవడానికి కారణం.. స్ఫూర్తి.. సినిమాలే! తెరపై ష్కార్జ్ నెగర్ ను చూసి ఆయనలా కావాలనుకున్నా. 'హల్క్' చూసి మహాబలుడిగా ఎదగాలనుకున్నా. నేను వాడే ఆయిల్ ప్రమాదకరమైందని తెలుసు. కానీ అలా మారడం నా కల. దాని కోసం ఎన్ని ప్రమాదాలు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నా. 'నని వాల్దీర్ అంటున్నాడు. చిన్నతనంలోనే వాల్దీర్ డ్రగ్స్ బారినపడ్డాడని, కొన్నేళ్ల కిందట వాటిని మానేసి జిమ్ కు వెళ్లడం మొదలుపెట్టాడని అతని స్నేహితుడు ఫెర్నాండో డిసిల్వ పేర్కొన్నాడు. చేస్తేగీస్తే ఎక్సర్ సైజ్ తో కండలు పెంచాలిగానీ ఆయిల్ ఇంజెక్ట్ చేసుకుని పెంచకూడదని వాల్దీర్ కు ఎన్నోసార్లు చెప్పా. కానీ అతనికి అలాగే ఇష్టం. తొందరగా ఆ రికార్డేదో సాధించిన తర్వాతైన ఆ ఆయిల్ వాడకాన్ని ఆపించాలి. అప్పటిదాకా వాడు బతికుండాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా' అని ఫెర్నాడో చెప్పుకొచ్చాడు. -
దృఢం
తిండి కలిగితే కండ కలదోయ్... కండ కలవాడే బౌన్సరోయ్... అని నినదిస్తోంది ఓ పల్లె. న్యూఢిల్లీకి దగ్గర్లోని కుగ్రామమైన అసోలా ఫతేపూర్ బెరిలో మగాళ్లంతా బౌన్సర్ ఆఫరంటే ఎగిరి గంతేసి మరీ ‘ఎస్సర్’ అంటున్నారు. దీంతో ఈ చిన్న విలేజ్‌కి అత్యధిక సంఖ్యలో బౌన్సర్లను అందిస్తున్న ప్లేస్‌గా మా లావు పేరొచ్చేసింది. లావొక్కింతయు లేనిచో జాబొక్కింతయూ రాదని న మ్మే ఆ ఊరిలో జిమ్‌కు వెళ్లని కుర్రాడు గాని; ఇంజినీరింగ్, మెడిసిన్ కలల్లో తేలిపోయే డ్రీమ్ బాయ్ గాని ఒక్కరూ కనపడరు. ఫిజిక్కూ ఫ్యూచర్కూ లింకుంది కాబట్టి... సదరు పల్లెలో అబ్బాయిలంతా ఆరోగ్యమే ఉద్యోగభాగ్యం అనుకుంటూ మద్య, మాంసాలకు, చెడు తిరుగుళ్లకు ఆమడదూరంలో ఉంటున్నారు. రోజుకు 2-3 గంటలు వ్యాయామం చేస్తూ... బౌన్సర్ జాబ్స్‌కు సిద్ధం అవుతున్నారు. కాస్తంత చదువు, కొండంత కండ ఉంటే గ్యారెంటీ బౌన్సర్ జాబ్ అంటూ ఆల్రెడీ ఈ జాబ్‌లో ఉన్నవాళ్లంతా తమ పిల్లల్ని కూడా ఇదే జాబ్‌కి ప్రిపేర్ చేసు్తున్నారు.