దృఢం | Bouncer jobs are prepared to exercise firm | Sakshi
Sakshi News home page

దృఢం

Published Thu, Jan 1 2015 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM

దృఢం

దృఢం


 
 తిండి కలిగితే కండ కలదోయ్... కండ కలవాడే బౌన్సరోయ్... అని నినదిస్తోంది ఓ పల్లె. న్యూఢిల్లీకి దగ్గర్లోని కుగ్రామమైన అసోలా ఫతేపూర్ బెరిలో  మగాళ్లంతా బౌన్సర్ ఆఫరంటే ఎగిరి గంతేసి మరీ ‘ఎస్సర్’ అంటున్నారు. దీంతో ఈ చిన్న విలేజ్‌కి అత్యధిక సంఖ్యలో బౌన్సర్లను అందిస్తున్న ప్లేస్‌గా మా లావు పేరొచ్చేసింది. లావొక్కింతయు లేనిచో జాబొక్కింతయూ రాదని న మ్మే ఆ ఊరిలో జిమ్‌కు వెళ్లని కుర్రాడు గాని; ఇంజినీరింగ్, మెడిసిన్ కలల్లో తేలిపోయే డ్రీమ్ బాయ్ గాని ఒక్కరూ కనపడరు. ఫిజిక్‌కూ ఫ్యూచర్‌కూ లింకుంది కాబట్టి... సదరు పల్లెలో అబ్బాయిలంతా ఆరోగ్యమే ఉద్యోగభాగ్యం అనుకుంటూ మద్య, మాంసాలకు, చెడు తిరుగుళ్లకు ఆమడదూరంలో ఉంటున్నారు. రోజుకు 2-3 గంటలు వ్యాయామం చేస్తూ... బౌన్సర్ జాబ్స్‌కు సిద్ధం అవుతున్నారు. కాస్తంత చదువు, కొండంత కండ ఉంటే గ్యారెంటీ బౌన్సర్ జాబ్ అంటూ ఆల్రెడీ ఈ జాబ్‌లో ఉన్నవాళ్లంతా తమ పిల్లల్ని కూడా ఇదే జాబ్‌కి ప్రిపేర్ చేసు్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement