జాను శీర్షాసనం.. తల నుంచి మోకాలి వరకు! | Health Benefits Of Janu Shirshasana Exercise | Sakshi
Sakshi News home page

జాను శీర్షాసనం.. తల నుంచి మోకాలి వరకు!

Published Wed, Jul 31 2024 8:58 AM | Last Updated on Wed, Jul 31 2024 9:10 AM

Health Benefits Of Janu Shirshasana Exercise

తల నుంచి మోకాలి వరకు ఉండే ఈ భంగిమను జాను శీర్షాసన అంటారు. ‘జాను’ అంటే మోకాలు ‘శీర్ష’ అంటే తల. ఈ ఆసనాన్ని వేసే ముందు మ్యాట్‌ పైన సుఖాసనంలో కూర్చోవాలి.

ఒక కాలును ముందుకు చాపి, చేతులతో ఆ కాలిపాదాన్ని పట్టుకోవాలి. తలను మోకాలి మీదుగా ఉంచాలి. మడిచి ఉన్న రెండవ కాలుపాదం మరొక కాలును తాకినట్టుగా, ΄÷ట్ట దగ్గరగా ఉండాలి. ఈ ఆసనంలో ఎక్కువ సేపు ఉండటం వల్ల వెన్నెముక సాగినట్టుగా, దిగువ శరీరం అంతా రిలాక్స్‌ అయినట్టుగా అనిపిస్తుంది. జీర్ణక్రియ, శ్వాసకోశ పనితీరును మెరుగుపరుస్తుంది. నడుము నొప్పి, ఒత్తిడి, నిరాశ, అలసటపై ప్రభావం చూపుతుంది.

అధిక బరువుకు:
మొదట్లో ఈ ఆసనం వేస్తున్నప్పుడు కొంత సవాల్‌గా అనిపిస్తుంది. ఎక్కువ ఒత్తిడి లేకుండా మెల్లగా ప్రయత్నించడం వల్ల ఈ భంగమను సాధన చేయవచ్చు. ఒక కాలును ఒకసారి రెండవ కాలును మరొకసారి 5 సార్లు మార్చుతూ చేయాలి. రోజూ పరగడపున పది సార్లు ఈ ఆసనం వేయడం వల్ల అధికబరువు, గ్యాస్ట్రిక్, మధుమేహం సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది. రోజులో ఉండే ఒత్తిడి నుంచి కూడా త్వరగా రిలాక్స్‌ అవుతారు.

సూచన:
గర్భిణులు, హెర్నియా, ఆస్తమా, స్పాండిలోసిస్, స్లిప్డ్‌ డిస్క్‌ వంటి సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు లేదా యోగా నిపుణుల ఆధ్వర్యంలో మాత్రమే సాధన చేయాలి.


– జి. అనూషా రాకేష్, యోగా ట్రైనర్‌

ఇవి చదవండి: నైట్‌ బ్రషింగ్‌ తప్పనిసరి.. లేదంటే ఈ సమస్యలు రావచ్చు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement