కదలకుండా ఒకేచోట గంటల తరబడి కూర్చోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలొస్తాయని, ప్రాణానికే ముప్పు అని గతంలో అనేక పరిశోధనలు తేల్చి చెప్పాయి. అయితే తాజా అధ్యయనం మాత్రం దీనికి ఒక పరిష్కారాన్ని సూచిస్తోంది. అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. నిజానికి ఇలాంటి అధ్యయనం చేయడం ఇదే తొలిసారి. విషయమం ఏమిటంటే.
కూర్చోవడం వల్ల మరణ ప్రమాదాన్ని కాఫీ తగ్గిస్తుందట. నిశ్చల జీవనశైలి వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలకు కాఫీ ఆశ్చర్యకరమైన ఆయుధంగా ఉంటుందని కొత్త అధ్యయనం సూచిస్తుంది. కాఫీ తాగని వారితో పోలిస్తే ఎక్కువ సేపు కూర్చుని రోజూ కాఫీ తాగే వారు వివిధ కారణాల వల్ల చనిపోయే అవకాశం తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.
కూర్చోవడం వల్ల కలిగే ప్రమాదాలను కాఫీ ఎలా ఎదుర్కొంటుంది అనే అంశంపై 10 వేల మందిపై ఈ అధ్యయనం సాగింది. ఆసక్తికరంగా, ఎక్కువసేపు కూర్చొనే వ్యక్తుల్లో ఎంత కాఫీ తాగినా గుండె జబ్బులతో మరణించే ప్రమాదం తక్కువట. ఎక్కువసేపు కూర్చున్న కాఫీ తాగని వారితో పోలిస్తే ఎక్కువ కాఫీ (రోజుకు 2.5 కప్పుల కంటే ఎక్కువ) తీసుకునే వారు కూడా మొత్తం మరణాల ప్రమాదాన్ని తగ్గిందని ఈ స్టడీ ద్వారా తెలుస్తోంది. ఇదే అధ్యయనంలో మరో ఆసక్తికరమైన విషయమం ఏమిటంటే తీసుకోవాల్సిన లిమిట్ 3-5 కప్పులు. ఐదు కప్పులు దాటితే ప్రయోజనాలు తగ్గి పోతాయట. ఈ పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయని అయితే సరైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎంత మోతాదు తీసుకోవాలనేదానిపై మరింత పరిశోధనఅవసరం అంటున్నారు పరిశోధకులు.ఈ అధ్యయనం బీఎంసీ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడింది.
గతంలో కూడా కాఫీ ద్వారా సుదీర్ఘ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడవపచ్చని అధ్యయనాలు చెప్పాయి. అలాగే కెఫీన్ ద్వారా టైప్ -2 మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నాయి. కొలొరెక్టల్ కేన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులు ప్రతిరోజూ కనీసం ఐదు కప్పులు తాగేవారు తక్కువ తాగే వారితో పోలిస్తే పునరావృతమయ్యే అవకాశం గణనీయంగా తగ్గింది. కాఫీలో కూడా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి వాపును తగ్గిస్తాయి. కొన్ని కాఫీ భాగాలు మెదడును క్షీణించిన వ్యాధుల నుండి కూడా రక్షిస్తాయని కూడా తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment