risk
-
రిస్క్‌లో కుంభమేళా మోనాలిసా?
యూపీలోని జరుగుతున్న కుంభమేళా నేపధ్యంలో చాలామంది వైరల్‌గా మారారు. అయితే వీరందరిలో ప్రయాగ్‌రాజ్‌కు పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మోనాలినా భోంస్లే ప్రముఖంగా నిలిచారు. ఆమె రాత్రికిరాత్రే సోషల్ మీడియా క్వీన్‌గా మారిపోయారు. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ నీలికళ్ల సుందరి రిస్క్‌లో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై మోనాలిసా వివరణ ఇచ్చింది.కుంభమేళా మోనాలిసాను చూసిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమె ఇంటికి వచ్చి సినిమా ఆఫర్ ఇచ్చారు. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ పేరుతో కుంభమేళా మోనాలిసా హీరోయిన్గా సినిమా తీయనున్నట్లు ప్రకటించారు. దీనిని విన్నవారంతా ఇక మోనాలిసా దశ తిరిపోయిందంటూ వ్యాఖ్యానించారు. ఇదే తరుణంలో ఆమె న్యూలుక్‌కు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. అలాగే ఆమె నటన నేర్చుకోవడంతో పాటు, చదువుకున్నదంటూ పలు వార్తలు వినిపించాయి. తాజాగా మోనాలిసా ఒక బ్రాండ్ ప్రమోషన్లో కూడా పాల్గొంది.తాజాగా ప్రొడ్యూసర్ జితేంద్ర నారాయణ్ కుంభమేళా గర్ల్ మోనాలిసా రిస్క్‌లో పడిందంటూ వ్యాఖ్యానించారు. ఆమె దర్శకుడు సనోజ్ మిశ్రా ట్రాప్‌లో పడిందంటూ ఆరోపించారు. సనోజ్ దగ్గర సినిమాను నిర్మించేందుకు సరిపడినంత డబ్బులు లేవని, అయితే లైమ్ లైట్లో ఉండేందుకే ఆయన మోనాలిసాను తన వెంట తీసుకువెళుతున్నారని ఆరోపించారు. అయితే దీనిపై తాజాగా మోనాలిసా వివరణ ఇచ్చింది.ఇన్‌స్టాగ్రామ్‌లో మోనాలిసా షేర్ చేసిన ఒక వీడియోలో ఆమె మాట్లాడుతూ సనోజ్ మిశ్రాపై వస్తున్న విమర్శల్లో నిజం లేదని పేర్కొంది. తానేమీ అతని ట్రాప్‌లో పడలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను మధ్యప్రదేశలో ఉన్నానని, యాక్టింగ్ నేర్చుకుంటున్నానని, తన సోదరి, తన పెదనాన్న తనతోనే ఉన్నారని, తానేమీ ఎవరి వలలోనూ పడలేదని పేర్కొంది. సనోజ్ మిశ్రా తనను కుమార్తెలా చూసుకుంటున్నారని, ఆయన చాలా మంచి మనిషి అని, మా సినిమా సవ్యంగా సాగేందుకు అందరూ సహకరించాలని ఆమె కోరింది. ఇది కూడా చదవండి: ‘మహాకుంభ్’ ఖర్చెంత? లాభమెంత? -
పెద్దపేగు కేన్సర్ నివారణకు...
గతంలో పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా కనిపించే పెద్దపేగు (కోలన్) కేన్సర్ ఇప్పుడు మన దేశంలోనూ కనిపిస్తుంది. చిన్నపాటి జాగ్రత్తలతోనే దీన్ని నివారించవచ్చు. అవి... పొద్దున్నే తేలిగ్గా విరేచనమయ్యేలా పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇందుకోసం చిరుధాన్యాలూ, కాయధాన్యాలూ, ఆకుకూరలు, తాజాపండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో కొవ్వులు బాగా తక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఇందుకోసం మాంసాహారాన్ని పరిమితంగా తీసుకోవడంతోపాటు అందులోనూ.... కొవ్వు మోతాదులు తక్కువగా ఉండే చికెన్, చేపల వంటి వైట్ మీట్‌ను మాత్రమే తీసుకోవాలి. వేటమాంసం, రెడ్మీట్నుంచి దూరంగా ఉండాలి. మంచి ఆరోగ్యకరమైన విసర్జక అలవాట్లు కలిగి ఉండాలి. అంటే రోజూ ఒకేవేళకు మల విసర్జనకు వెళ్లడం, అజీర్తి, గ్యాస్ ట్రబుల్ లేకుండా చూసుకోవడం లాంటివి. మలవిసర్జన సాఫీగా జరగాలంటే దేహానికి తగినంత శారీరక శ్రమ, వ్యాయామం ఉండాలి. పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. (చదవండి: పాజిటివ్ పవర్: హీనాఖాన్ ధైర్యానికి ఎవ్వరైన ఫిదా కావాల్సిందే..! ) -
PAN 2.0: కొత్త పాన్ కార్డ్ ఎంత వరకూ సేఫ్?
ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డ్ అప్‌గ్రేడ్ వెర్షన్ 'పాన్ 2.0'ను ప్రారంభించింది. ఇందులో ప్రధానంగా మూడు విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటిది యాక్సెసిబిలిటీ.. మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. రెండవది డేటా స్టోరేజ్.. ఇదీ సురక్షితం. ఇక మూడవది సులభతరమైన అప్లికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియ. కొత్త పాన్ కార్డ్‌లో క్యూఆర్ కోడ్ సదుపాయం ఉంటుంది కాబట్టి డిజిటల్ వర్క్‌లో దాని ఉపయోగం మునుపటి కంటే సులభతరం అవుతుంది.ఎలా సురక్షితం?'పాన్ 2.0'లో ఈ-పాన్ కార్డ్ ఎటువంటి ఛార్జీ లేకుండా దరఖాస్తుదారు ఈ-మెయిల్‌కు వెంటనే డెలివరీ అవుతుంది. నామమాత్రపు రుసుముతో భౌతిక కార్డ్ కూడా పొందవచ్చు. కొత్త టెక్నికల్ సదుపాయాలు చేరిన తర్వాత కూడా పెరుగుతున్న సైబర్ మోసాల నుంచి కొత్త పాన్ కార్డు రక్షణ పొందుతుందా లేదా అనే ప్రశ్న సహజమే. సైబర్ నేరగాళ్ల వల్ల కలిగే ఆర్థిక నష్టాల నుండి ప్రజలను రక్షించడంలో కొత్త కార్డ్ ఎంతవరకు సమర్థంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..తాజా సమాచారంకొత్త పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మీ కార్డ్ ఆదాయపు పన్ను శాఖ తాజా ఫార్మాట్‌కి అప్‌గ్రేడ్ అవుతుంది. దానితో మీరు మీ కొత్త డేటాను అప్డేట్ చేయవచ్చు.దుర్వినియోగానికి కళ్లెంకొత్త పాన్ కార్డ్‌లోని క్యూఆర్ కోడ్ కారణంగా, సైబర్ దుండగులు దానిని సులభంగా నకిలీ చేయలేరు. తద్వారా సైబర్ మోసాలను కట్టడి చేయడాన్ని ఇది సులభతరం చేస్తుంది.మరింత సురక్షితంకొత్త పాన్ కార్డ్ క్యూఆర్ కోడ్‌లోని వ్యక్తిగత డేటా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది. దీన్ని ప్రత్యేకంగా అధీకృత సాఫ్ట్వేర్ ద్వారా మాత్రమే రీడ్ చేసేందుకు వీలవుతుంది. దీంతో వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే సంఘటనలను ఇది తగ్గిస్తుంది. అంతే కాకుండా పాన్ ధ్రువీకరించడంలో ఆర్థిక సంస్థలకు సహాయపడుతుంది.వేగవంతమైన ధ్రువీకరణక్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా పాన్ని సులభంగా ధ్రువీకరించవచ్చు. తద్వారా సమాచార దొంగతనం, టాంపరింగ్‌కు పాల్పడటం సులభం కాదు. ఇక కొత్త ఫీచర్లు ఎంత ప్రభావవంతంగా ఉండబోతున్నాయో చూస్తే.. ఒక వేళ అన్నింటికీ ఆధార్ కార్డు లింక్ చేయడం తప్పనిసరి చేస్తే.. రియల్ టైమ్ వ్యాలిడేషన్, అధునాతన డేటా అనలిటిక్స్ వంటి ఫీచర్లు కొత్త సిస్టమ్‌కు జత కలుస్తాయి. దీంతో సైబర్ భద్రతకు బలమైన వ్యవస్థ ఏర్పడుతుంది. అయితే సైబర్ సెక్యూరిటీ ముప్పులు నేడు కొత్త రూపాల్లో వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవస్థ ఎంత ప్రభావవంతంగా, సమర్ధవంతంగా ఉంటుందో అన్నది రానున్న రోజులలో తెలుస్తుంది. -
నాజుకు నడుముతో నష్టమే..!
నడుము నాజుగ్గా తీగలా ఉండాలని కోరుకుంటారు మహిళలు. అందుకు సంబంధించిన వ్యాయామాలు, వర్కౌట్లు తెగ చేస్తుంటారు. అయితే ఇలా అస్సలు చెయ్యొద్దని వార్నింగ్ ఇస్తున్నారు వైద్య నిపుణులు. నడుమ చుట్టుకొలత తక్కువగా ఉండాలని భావిస్తే ఆరోగ్య సమస్యలు తప్పవని గట్టిగా హెచ్చరిస్తున్నారు. దీనిపై వైద్య నిపుణులు జరిపిన పరిశోధనలో చాలా షాకింగ్ విషయాలే బయటపడ్డాయి. హుయిజోంగ్ జీ, బిన్ సాంగ్ వైద్యుల నేతృత్వంలోని నార్తర్న్ జియాంగ్సు పీపుల్స్ హాస్పిటల్ చేసిన పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకోసం వాళ్లు దాదాపు 6 వేల మందికిపైగా పెద్దలపై అధ్యయనం నిర్వహించారు. సుమారు 2003 నుంచి 2019 వరకు వారి హెల్త్ డేటాను ట్రాక్ చేశారు. నడుము చుట్టుకొలత తక్కువగా ఉన్న మహిళలు ఎలా మరణాలకు దారితీసే ఆరోగ్య సమస్యల బారినపడుతున్నారో సవివరంగా వెల్లడిచింది ఆ అధ్యయనం. ఆ పరిశోధనలో నడుము చుట్టుకొలత తక్కువుగా ఉన్న మహిళలే ఎక్కువగా మరణాలకు దారితీసే గుండె సంబంధిత వ్యాధులు బారినపడుతున్నట్లు తేలింది. కనీసం ప్రతి మహిళ 107 సెంటీమీటర్లు నడుమ కొలత ఉండాలని, అంతకన్నా తక్కువుగా ఉంటే ప్రమాదమేనని పేర్కొంది. ఆరోగ్యంగా పరిగణించబడే దానికంటే ఎక్కువే ఈ నడుమ చుట్టుకొలత. ఇక పురుషుల నడుము కొలత కనీసం 89 సెంటీమీటర్లు ఉండాలని పేర్కొంది. అందువల్ల మధుమేహం ఉన్న మహిళలు తమ నడుమ కొలత 107 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉండేలా ప్రయత్నించొద్దని హెచ్చరించారు వైద్యులు. ఒకరకంగా ఈ అధ్యయనం ఊబకాయానికి మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తుందటూ పలువురు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే వైద్య నిపుణులు ఇంత సైజులో నడము ఉంటే పొత్తికడుపు వద్ద కొవ్వు పెరుకుపోతుంది ఇది అనారోగ్యమైనది అనే సందేహం అందరిలోనూ కలిగే అవకాశం ఉంటుందని అన్నారు. నిజానికి ఇక్కడ ఈ అధ్యయనం అధిక బరువుని సిఫార్సు చేయడం లేదని నడుమ సైజు ఉండాల్సిన దాని కంటే బాగా తక్కువగా ఉంటే మరణానికి దారితీసే ఆరోగ్య ప్రమాదాల బారినపడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తుంది. ఇది మనిషి జీవన నాణ్యతను తగ్గిస్తుందని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చామని, మరింత సమాచారం కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ఫిట్నెస్ సీక్రెట్ ..!) -
ఏపీకి బిగ్ అలర్ట్.. ఆ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. రానున్న ఆరు గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో నాలుగు రెడ్ అలర్ట్‌లను వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని, రెడ్ అలెర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.రేపు మధ్యాహ్ననికి పుదుచ్చేరి వద్ద తుపాను తీరాన్ని తాకనుంది. రెండు రోజులపాటు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాముందన్న వాతావరణ శాఖ.. దక్షిణ కోస్తా పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక, రాష్ట్రంలో మిగతా పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. -
స్మోకింగ్స్ .. ఆ గర్భ శత్రువులే..!
చివరకు సిగరెట్ తాగే అలవాటు ఉంటే ప్యాసివ్ స్మోకింగ్ దుష్ప్రభావాలతో ఆ పొగ తాలూకు దుష్ప్రభావాలు దంపతులిద్దరిపైనా ఉంటాయన్న విషయం అనేక పరిశోధనల్లో తేలిందే. అయితే భర్త ఇంటి బయటెక్కడో సిగరెట్ తాగి ఇంటికి వచ్చినా ఆ పొగ దుష్ప్రభావం దంపతులిద్దరితోపాటు భార్య తాలూకు గర్భధారణపై కూడా పడుతుందంటున్నారు పరిశోధకులు. భర్తకి స్మోకింగ్ అలవాటు ఉన్నప్పుడు అతడి పార్ట్నరైన భార్యకు గర్భధారణ బాగా ఆలస్యం కావచ్చు. దీనికి అనేక కారణాలున్నప్పటికీ... ముఖ్యంగా అతడి స్మోకింగ్ వల్ల భార్యలోని హార్మోన్ సైకిళ్లలోని జీవరసాయనాల్లో మార్పు రావచ్చు. ఫలితంగా ఆమెలో అండాల సంఖ్య బాగా తగ్గవచ్చు. ఒకసారి అండాల సంఖ్య తగ్గితే వాటిని తిరిగి పొందడం సాధ్యంకాదు.మామూలు ఆరోగ్యవంతులైన దంపతులతో పోలిస్తే భర్తకు పొగతాగే అలవాటు ఉంటే... అతడి భార్యకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. అంతేకాదు... గర్భస్రావమయ్యే అవకాశాలూ పెరుగుతాయి. ఒకవేళ గర్భధారణ జరిగాక కూడా బిడ్డ నెలలు నిండకముందే పుట్టే (ప్రీమెచ్యుర్ డెలివరీకి) అవకాశాలూ పెరుగుతాయి. అలా పుట్టే పిల్లల బరువు కూడా చాలా తక్కువగా ఉండే అవకాశముంది. భవిష్యత్తులో వాళ్లకు డయాబెటిస్, గుండెజబ్బులు, స్థూలకాయం వచ్చే అవకాశాలూ ఎక్కువే. ఇక నేరుగా పొగతాగే పురుషుల విషయానికే వస్తే... ఆ దురలవాటు వల్ల వాళ్ల వీర్యంలోని శుక్రకణాల సంఖ్య, నాణ్యత, కదలిక, చురుకుదనం, వాటి ఆరోగ్యం తగ్గుతాయి. అది నేరుగా వారి సంతాన సాఫల్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే సమయానికి గర్భధారణ, మంచి ఆరోగ్యకరమైన శిశువును కోరుకునేవారు ఈ దురలవాటుకు దూరంగా ఉండటమే మంచిది. పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటమన్నది కేవలం సంతాన సాఫల్యం అనే ఒక్క విషయంలోనే కాకుండా పురుషుల సంపూర్ణ ఆరోగ్యంతో ΄ాటు, భవిష్యత్తులో వారి పిల్లల పూర్తి ఆరోగ్యానికీ అది మేలు చేస్తుంది. (చదవండి: పొడవాటి రోడ్డు సొరంగంగా రికార్డు..!) -
రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లకు కొత్త సాధనం
న్యూఢిల్లీ: పెట్టుబడులపై అధిక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్ల కోసం సెబీ ‘న్యూ అస్సెట్ క్లాస్’ (కొత్త సాధనం)ను ప్రవేశపెట్టింది. అలాగే, ప్యాసివ్ ఫండ్స్‌కు ప్రోత్సాహకంగా ‘ఎంఎఫ్ లైట్–టచ్’ కార్యాచరణను అనుమతించింది. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి నిబంధనల సవరణలకూ ఆమోదం తెలిపింది. ఇలా 17 ప్రతిపాదనలకు సెబీ బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది.అందరూ అనుకున్నట్టు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో)లో రిటైల్ ట్రేడర్ల స్పెక్యులేషన్ కట్టడిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం గమనార్హం. సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్‌పై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ, కాంగ్రెస్ పార్టీ ఆరోపణల తర్వాత జరిగిన మొదటి బోర్డు సమావేశం ఇది కావడంతో అందరిలోనూ దీనిపై ఆసక్తి నెలకొంది. న్యూ అస్సెట్ క్లాస్ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సేవలు (పీఎంఎస్) పొందాలంటే కనీసం రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టాలి. రాబడుల కోసం రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ, రూ.50 లక్షల పెట్టుబడి అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఈ తరహా ఇన్వెస్టర్ల కోసం మ్యూచువల్ ఫండ్స్, పీఎంఎస్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త ఉత్పత్తిని సెబీ ప్రవేశపెట్టింది. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు సైతం స్వీకరించింది. ఈ సాధనంలో డెరివేటివ్స్‌లో పెట్టుబడులకు అనుమతి ఉంటుంది. రుణాలు తీసుకోవడానికి అనుమతి ఉండదు. అన్‌లిస్టెడ్, అన్‌రేటెడ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా అనుమతి లేదు. టీప్లస్0 ప్రస్తుతం టీప్లస్1 సెటిల్మెంట్ విధానం అమల్లో ఉంది. అంటే స్టాక్స్ కొనుగోలు చేసిన మరుసటి పనిదినంలో దాన్ని సెటిల్ చేస్తారు. తదుపరి దశలో టీప్లస్0కు మళ్లాలన్నది సెబీ ప్రణాళిక. ఇందులో భాగంగా 25 స్క్రిప్‌లకు ఆప్షనల్ (ఐచి్ఛకం) టీప్లస్0 విధానం (ట్రేడింగ్ రోజే సెటిల్మెంట్) అమల్లో ఉంది. ఇప్పుడు టాప్–500 (మార్కెట్ విలువ పరంగా) స్టాక్స్‌కు టీప్లస్0 విధానాన్ని ఐచి్ఛకంగా చేస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్లు అందరూ తమ ఇన్వెస్టర్లకు టీప్లస్0 సెటిల్మెంట్ను ఆఫర్ చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన బ్రోకరేజీ చార్జీలను వసూలు చేసుకునే స్వేచ్ఛను సెబీ కల్పించింది. మ్యూచువల్ ఫండ్స్ సైతం టీప్లస్0 విధానాన్ని పొందొచ్చు. ఎంఎఫ్ లైట్ ప్యాసివ్ పండ్స్‌కు సంబంధించి సరళించిన కార్యాచరణను సెబీ ప్రకటించింది. కేవలం ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించే సంస్థలకు నిబంధనల భారాన్ని తగ్గించింది. కేవలం ప్యాసివ్ ఫండ్స్ రూపంలో ప్రవేశించే కొత్త సంస్థలకు మార్గం తేలిక చేసింది. నికర విలువ, ట్రాక్ రికార్డు, లాభదాయకత పరిమితులను తగ్గించింది. రైట్స్ ఇష్యూ వేగవంతం రైట్స్ ఇష్యూలు వేగంగా పూర్తి చేసేందుకు సెబీ కొత్త నిబంధనలు రూపొందించింది. దీని కింద బోర్డు ఆమోదించిన నాటి నుంచి 23 పనిదినాల్లో రైట్స్ ఇష్యూ ముగుస్తుంది. ప్రస్తుతం 317 రోజుల సమయం తీసుకుంటోంది. ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్‌కు పట్టే 40 రోజుల కంటే కూడా తక్కువ కానుంది. ఇతర నిర్ణయాలు.. » సెకండరీ మార్కెట్లో (నగదు విభాగం) యూపీఐ బ్లాక్ విధానం (ఏఎస్బీఏ) లేదా 3ఇన్1 ట్రేడింగ్ సదుపాయం ద్వారా ఇన్వెస్టర్లు ట్రేడ్ చేసుకోవచ్చు. 2025 ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం మాదిరే తమ బ్యాంక్ ఖాతా నుంచి నిధులను ట్రేడింగ్ అకౌంట్‌కు బదిలీ చేసి కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐపీవో దరఖాస్తుకు ఏఎస్బీఏ విధానం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. » ఆఫ్‌షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్లను (ఎడీఐలు) జారీ చేసే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు) సంబంధించి పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు కానుంది. ఎఫ్‌పీఐలు తమ నుంచి ఓడీఐలను పొందిన వారి వివరాలను సరిగ్గా అందిస్తున్నాయా? అన్నది ఈ యంత్రాంగం పర్యవేక్షించనుంది. -
World Heart Day: హృదయ ఆరోగ్యానికి ఐదు జాగ్రత్తలు
గుండె జబ్బు.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య ఆరోగ్య సమస్య. ఇది అన్ని వయసుల వారినీ చుట్టుముడుతోంది. ఇటీవలికాలంలో యువతలోనూ ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. జీవనశైలిలో మార్పుల కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఒక వైద్య అధ్యయనంలోని వివరాల ప్రకారం కుటుంబ చరిత్ర, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, మద్యపానం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ మొదలైనవన్నీ హృదయ ఆరోగ్య సమస్యలకు కారణంగా నిలుస్తుంటాయి. అయితే హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే ఐదు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.మద్యం, ధూమపానానికి దూరంగుండె ఆరోగ్యంగా ఉండాలంటే మద్యం, ధూమపానానికి దూరంగా ఉండటం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ధూమపానం అనేది ధమనుల పనితీరును దెబ్బతీసుస్తుంది. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు పెరుగుతుంది. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మద్యపానం రక్తపోటును పెంచుతుంది. గుండె పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. దీర్ఘకాలిక గుండె జబ్బుల ముప్పును గణనీయంగా పెంచుతుంది.అలసటపై నిర్లక్ష్యం వద్దుగుండెకు సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు మొదలైనవి తీవ్రమైన గుండె సమస్యలకు సూచన కావచ్చు. ఇటువంటి సమయంలో వెంటనే చికిత్స తీసుకోవాలి. హృదయ స్పందన రేటు పెరగడం, విపరీతంగా అలసిపోయినట్లు అనిపించడం హృదయ ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు.నిద్రలేమిని విస్మరించొద్దునిద్రలేమి సమస్య ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. గుండె ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆరోగ్యకరమైన దినచర్యలో నిద్ర ఒక ముఖ్యమైన భాగం. ప్రతి రోజూ రాత్రి కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, హృదయ సంబంధ సమస్యలను నివారించవచ్చు. చక్కని నిద్ర పలు వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది.ఒత్తిడిని జయించండి అధిక ఒత్తిడి ఆరోగ్యానికి ప్రమాదకరం. దీర్ఘకాలిక ఒత్తిడి గుండెను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతుంటారు. ఒత్తిడి కారణంగా కార్టిసాల్ హార్మోన్ స్థాయి గణనీయంగా పెరుగుతుంది. ఇది రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను మరింతగా పెంచుతుంది. అందుకే ఒత్తిడికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి.వ్యాయామం తప్పనిసరిఫిట్నెస్పై శ్రద్ధ చూపడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇందుకోసం ప్రతీ రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. నడక, జాగింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటివి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వ్యాయామం చేసే అలవాటు శరీర బరువును తగ్గించడంలో, కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. -
రిస్క్ తక్కువ.. మెరుగైన రాబడి
పెట్టుబడులపై మెరుగైన రాబడులు అందరూ కోరుకుంటారు. కానీ, అస్థిరతల రిస్క్‌ను ఎదుర్కొనే గుండె ధైర్యం అందరికీ ఉండకపోవచ్చు. రిస్క్ తక్కువగా ఉండాలి, అదే సమయంలో అచ్చమైన డెట్‌తో పోల్చితే కాస్త మెరుగైన రాబడి కోరుకునే వారికి కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలం. ఈ విభాగంలో నమ్మకమైన పనితీరు చూపిస్తున్న కొన్ని పథకాల్లో పరాగ్ పారిఖ్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ ఒకటి. మధ్య, దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వారు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. బాండ్ల పట్ల బుల్లిష్ ధోరణితో ఉన్న వారికి కూడా ఈ విభాగం అనుకూలం.రాబడులుఈ పథకం ఏడాది కాలంలో 16.6 శాతం రాబడిని అందించింది. మూడేళ్లలో ఏటా11.49 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. 2021 మే నెలలో ఇది ప్రారంభమైంది. అంటే ఈ పథకానికి మూడేళ్ల చరిత్రే ఉంది. అయినప్పటికీ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు పనితీరు కంటే ఈ పథకమే మెరుగ్గా పనిచేసినట్టు తెలుస్తోంది. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ విభాగంలో వార్షిక రాబడి 13.91 శాతంగా ఉంటే, మూడేళ్లలో వార్షిక రాబడి 8.59 శాతంగానే ఉండడం గమనించొచ్చు.పెట్టుబడుల విధానంకన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ సాధారణంగా ఈక్విటీలకు 25–30 శాతం వరకు (పరిస్థితులు, అవకాశాలు) పెట్టుబడులు కేటాయిస్తుంటాయి. డెట్‌లో 70 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కానీ పరాగ్ పారిఖ్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్మాత్రం నేరుగా ఈక్విటీల్లో 15 శాతం వరకే ఇన్వెస్ట్ చేస్తుంది. మరో 10–15 శాతం వరకు ఈక్విటీ ఆర్బిట్రేజ్ అవకాశాల్లో పెట్టుబడులు పెడుతుంటుంది.పరాగ్ పారిఖ్ మ్యూచువల్ ఫండ్ సాధారణంగా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. రాబడుల కోసం అధిక రిస్క్ తీసుకోవడానికి మొగ్గు చూపదు. ఈ పథకమనే కాకుండా ఈ సంస్థకు చెందిన అన్ని విభాగాల్లోనూ ఇదే విధానం అంతర్లీనంగా కొనసాగుతుంటుంది. అందులో ఇది కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ కనుక రిస్క్ ఇంకా తక్కువనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈక్విటీ కేటాయింపులను గమనించినట్టయితే ఎక్కువ పెట్టుబడులు డివిడెండ్ దండిగా పంపిణీ చేసే బ్లూచిప్ కంపెనీల్లోనే ఉన్నాయి. డివిడెండ్ స్టాక్స్‌లో అస్థిరతలు తక్కువగా ఉంటాయి. పోర్ట్ఫోలియోఈ పథకం నిర్వహణలో రూ.2,197 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో 14.28 శాతం మేర ఈక్విట్లీలో ఇన్వెస్ట్ చేసింది. 75.71 శాతం డెట్ సాధనాలకు కేటాయించింది. రియల్ ఎస్టేట్ సాధానాల్లో 6.88 శాతం పెట్టుబడులు పెట్టింది. 3.13 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ఈక్విటీ మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే ఈ నగదును ఉపయోగించి మెరుగైన అవకాశాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.ఈక్విటీ పెట్టుబడుల్లోనూ 62 శాతం లార్జ్‌క్యాప్‌లోనే ఉన్నాయి. 32 శాతం మేర మిడ్‌క్యాప్‌లో, 6.18 శాతం మేర స్మాల్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్‌ఫోలియోలో 14 స్టాక్స్ ఉన్నాయి. డెట్ పెట్టుబడులు గమనిస్తే 56 శాతం ఎస్‌వోవీ (సావరీన్ డెట్) రేటెడ్ పత్రాలు, 18.59 శాతం ఏఏఏ రేటెడ్ ఫండ్స్‌లోనే ఉండడం గమనించొచ్చు. అంటే డెట్‌లోనూ 74 శాతం పెట్టుబడులను రిస్క్ చాలా తక్కువ ఉన్న వాటినే ఎంపిక చేసుకుంది. -
మలబద్దకంతో గుండెకు ముప్పే : తాజా అధ్యయనం
మనం తిన్న ఆహారం శుభ్రంగా జీర్ణమైన తరువాత వ్యర్థాలన్నీ మలం రూపంలో బయటికి వచ్చేయాలి. లేదంటే అనేక అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయి. అడపాదడపా మలబద్దకం చాలా సాధారణమే అయినప్పటికీ, దీర్ఘకాలిక మలబద్దకం అనేక రోగాల పెట్టు. దీనిని పట్టించుకోకుండా, చికిత్స చేయకుండా వదిలేస్తే, అది చివరికి హెమోరాయిడ్స్ లేదా పైల్స్ లాంటి సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాదు దీన్ని సరైన సమయంలో నివారించకపోతే రక్తపోటు, గుండెపోటు లాంటి తీవ్ర సమస్యలు తప్పవు.గతంలో 60 ఏళ్లు పైబడిన 5.4 లక్షలమంది ఆసుపత్రి రోగులపై జరిపిన ఆస్ట్రేలియన్ అధ్యయనం ప్రకారం, మలబద్దకం లేని రోగులతో పోలిస్తే మలబ్దకం ఉన్నవారికి అధిక రక్తపోటు, గుండెపోటు. స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. అదేవిధంగా, 9 లక్షల మంది వ్యక్తులపై చేసిన డానిష్ అధ్యయనం కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. అయితే ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో మలబద్దకం ఉంటే ఈ ముప్పు ఉంటుందా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. కానీ మోనాష్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల నేతృత్వంలో జరిగిన ఇటీవలి అంతర్జాతీయ అధ్యయనం సాధారణ జనాభాలో కూడా ఈ ప్రమాదం పొంచి ఉందని తేల్చింది. మలబద్దకం రకాలు, కారణాలుఅందరూ మలబద్దకాన్ని చిన్నపాటి సమస్యగా భావిస్తారు. దానిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది అనేక ప్రధాన వ్యాధులకు హెచ్చరిక. పురుషులతో పోలిస్తే, మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువట. మలబద్దకానికి అనేక కారణాలున్నాయి. అలాగే దీన్ని ప్రైమరీ, సెకండరీ అని రెండు గ్రూపులుగా వర్గీకరిస్తారు. మలబద్దకం సమయంలో ప్రేగు కదలికల్లో ఒత్తిడి కడుపుపై ఒత్తిడి పెంచుతుంది. దీంతో బీపీ, గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. రక్తపోటు పెరిగితే అది గుండె జబ్బులకు దారి తీస్తుంది.సాధారణంగా ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోకపోవడం, శరీరానికి కావల్సిన నీటిని తీసుకోకపోవడం మలబద్ధకానికి దారి తీస్తుంది. మలబద్దకంతో ఉన్నప్పుడు, సాధారణంగా ప్రేగుల్లో గ్యాస్ పేరుకుపోతుంది. ఇది పొత్తి కడుపులో ఒత్తిడి పెంచి ఛాతీ దాకా విస్తరిస్తుంది. దీంతో నొప్పి, మంట లాంటి అసౌకర్యాలు కలుగుతాయి. ఇది హృదయనాళ వ్యవస్థపై భారాన్ని పెంచి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు చాలా అరుదుగానే అయినప్పటికీ ఊపిరి పీల్చుకోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. బలవంతంగా మల విసర్జనకు ప్రయత్నించడంతో చాలామందిలో రక్తం స్రావం కనిపిస్తుంది. ఇది ఎనిమీయాకు కారణమవుతుంది. ఎపుడు అప్రమత్తం కావాలి?జీవన శైలిమార్పులతోపాటు, వైద్యుల సలహాపై తీసుకొనే కొన్ని రకాల మందుల ద్వారా నయం చేసుకోవచ్చు. అయితే మలబద్దకంతోపాటు ఛాతీ నొప్పి లేదా శ్వాస ఆడకపోవడం ఒకటీ రెండు రోజులకు మించి ఉంటే తీవ్రమైన సమస్యగా పరిగణించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆందోళన, దవడ, మెడ లేదా వెనుక భాగంలో నొప్పి లేదా అసౌకర్యం, చేతులు భుజాలలో నొప్పి లేదా అసౌకర్యం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.మలబద్దకం-నివారణ ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువ ఉండేలా జాగ్రత్తపడాలి. ఎక్కువ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు , చిక్కుళ్ళు తీసుకోవాలి.పుష్కలంగా నీరు తాగాలి. ప్రేగు కదలికలను ప్రేరేపించడానికి తేలికపాటి వ్యాయాయం, వాకింగ్ లాంటివి చేయాలి.పరగడుపున గోరు వెచ్చని నీళ్లను తాగడం, కొన్నిరకాల యోగాసనాల వల మంచి ఫలితం ఉంటుంది. -
అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిల్లోనే టైప్-1 డయాబెటిస్ ముప్పు ఎక్కువ
ఆధునికకాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. అయితే తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మాయిల కంటే అబ్బాయిల్లోనే టైప్ 1 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని యూకే లోని యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్‌కి చెందిన పరిశోధనా బృందం వెల్లడించింది. చిన్నపిల్లలకు టైప్-1 డయాబెటిస్ (T1D) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం కనుగొంది. తాజా అధ్యయనం ప్రకారం అమ్మాయిల్లో 10 ఏళ్ల తర్వాత టైప్ 1 మధుమేహం రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. కానీ అబ్బాయిల్లో మాత్రం ఈ ముప్పు స్థిరంగా ఉంటుందని పరిశోధన వెల్లడించింది. సెక్స్ హార్మోన్లు పాత్ర పోషిస్తాయని పరిశోధన తెలిపింది. పురుషుల్లోని ఆటోఆంటిబాడీల అభివృద్ధితో దీనికి సంబంధం ఉండవచ్చని సూచించింది. రోగనిరోధక వ్యవస్థ, దీనికి సంబంధించిన ప్రోటీన్లైన్ ఆటోఆంటిబాడీ ఎక్కువున్న అబ్బాయిల్లో ప్రమాదం ఉందని అధ్యయనం చూపించింది. వీరు మెజారిటీ ఆటో ఇమ్యూన్ వ్యాధుల మాదిరిగా కాకుండా ఈ తరహా మధుమేహానికి ప్రభావితమవుతారని వెల్లడించింది.ఈ అధ్యయనంలో కంప్యూటర్, స్టాటిస్టికల్ మోడలింగ్ డేటా సాయంతో పరిశోధకులు టీఐడీ ఉన్న వ్యక్తుల 235,765 మంది బంధువులను పరిశీలించారు. ఇందులో మగవారిలో అధిక ఆటోయాంటిబాడీ స్థాయిలు ఉన్నట్లు కనుగొన్నారు (అమ్మాయిల్లో: 5.0శాతం, పురుషుల్లో: 5.4శాతం). అలాగే మగవారు మల్టిపుల్ యాంటిబాడీ ప్రతిరోధకాలకు పాజిటివ్ వచ్చే అవకాశం ఉన్నందున వీరిలో ఐదేళ్ల ముందే ఈ టీఐడీ వచ్చే అవకాశం ఉంది. పదేళ్ల వయస్సులో వచ్చే ప్రమాదంలో మార్పు టీనేజ్-సంబంధిత హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నఅధ్యయన బృందం మరింత పరిశోధన కోసం పిలుపునిచ్చింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 9-13 వరకు జరిగే స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో యూరోపియన్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ఈ ఫలితాలను ప్రెజెంట్ చేయనున్నారు. -
అలాంటి మరణాలకు కాఫీతో చెక్ : ఎగిరి గంతేసే విషయం!
కదలకుండా ఒకేచోట గంటల తరబడి కూర్చోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలొస్తాయని, ప్రాణానికే ముప్పు అని గతంలో అనేక పరిశోధనలు తేల్చి చెప్పాయి. అయితే తాజా అధ్యయనం మాత్రం దీనికి ఒక పరిష్కారాన్ని సూచిస్తోంది. అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. నిజానికి ఇలాంటి అధ్యయనం చేయడం ఇదే తొలిసారి. విషయమం ఏమిటంటే.కూర్చోవడం వల్ల మరణ ప్రమాదాన్ని కాఫీ తగ్గిస్తుందట. నిశ్చల జీవనశైలి వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలకు కాఫీ ఆశ్చర్యకరమైన ఆయుధంగా ఉంటుందని కొత్త అధ్యయనం సూచిస్తుంది. కాఫీ తాగని వారితో పోలిస్తే ఎక్కువ సేపు కూర్చుని రోజూ కాఫీ తాగే వారు వివిధ కారణాల వల్ల చనిపోయే అవకాశం తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. కూర్చోవడం వల్ల కలిగే ప్రమాదాలను కాఫీ ఎలా ఎదుర్కొంటుంది అనే అంశంపై 10 వేల మందిపై ఈ అధ్యయనం సాగింది. ఆసక్తికరంగా, ఎక్కువసేపు కూర్చొనే వ్యక్తుల్లో ఎంత కాఫీ తాగినా గుండె జబ్బులతో మరణించే ప్రమాదం తక్కువట. ఎక్కువసేపు కూర్చున్న కాఫీ తాగని వారితో పోలిస్తే ఎక్కువ కాఫీ (రోజుకు 2.5 కప్పుల కంటే ఎక్కువ) తీసుకునే వారు కూడా మొత్తం మరణాల ప్రమాదాన్ని తగ్గిందని ఈ స్టడీ ద్వారా తెలుస్తోంది. ఇదే అధ్యయనంలో మరో ఆసక్తికరమైన విషయమం ఏమిటంటే తీసుకోవాల్సిన లిమిట్ 3-5 కప్పులు. ఐదు కప్పులు దాటితే ప్రయోజనాలు తగ్గి పోతాయట. ఈ పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయని అయితే సరైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎంత మోతాదు తీసుకోవాలనేదానిపై మరింత పరిశోధనఅవసరం అంటున్నారు పరిశోధకులు.ఈ అధ్యయనం బీఎంసీ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడింది.గతంలో కూడా కాఫీ ద్వారా సుదీర్ఘ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడవపచ్చని అధ్యయనాలు చెప్పాయి. అలాగే కెఫీన్ ద్వారా టైప్ -2 మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నాయి. కొలొరెక్టల్ కేన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులు ప్రతిరోజూ కనీసం ఐదు కప్పులు తాగేవారు తక్కువ తాగే వారితో పోలిస్తే పునరావృతమయ్యే అవకాశం గణనీయంగా తగ్గింది. కాఫీలో కూడా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి వాపును తగ్గిస్తాయి. కొన్ని కాఫీ భాగాలు మెదడును క్షీణించిన వ్యాధుల నుండి కూడా రక్షిస్తాయని కూడా తెలిపాయి. -
Social Media: ఈ వ్యసనం ప్రాణాంతకం
15 సెకన్ల రీల్స్ కోసం నూరేళ్ల జీవితాన్ని పణంగా పెడుతోంది నేటి యువత. రీల్స్‌ను ప్రవేశపెట్టిన ఇన్ స్టాగ్రామ్‌కు నేడు మన దేశంలో 24 కోట్ల మంది ఖాతాదార్లు ఉన్నారు. వీరిలో యువతీ యువకులే ఎక్కువ. ఆన్ లైన్ ఫేమ్ కోసం చిత్ర విచిత్రమైన రీల్స్ చేయడానికి ప్రాణాలతో రిస్క్ చేస్తున్నారు. గొడవలు, మర్డర్లు జరుగుతున్నాయి. మంచి ఫోన్ల కోసం దొంగలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు, సమాజం ఈ వ్యసనాన్ని ఇలాగే వదిలేయాలా?పూణెలో పోలీసులు వెంటనే స్పందించారు. మిహిర్ గాంధీ (27), మీనాక్షి సలూంఖే (23)లను అరెస్ట్ చేశారు. వీరి మీద ఐ.పి.సి 336 సెక్షన్ కింద కేసు పెట్టారు. దీని ప్రకారం ఆరు నెలలకు తగ్గకుండా జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ ఉంటాయి. ఎందుకు వీరిని అరెస్ట్ చేశారు. ప్రాణాంతకమైన రీల్ చేశారు కనుక.ఏం జరిగింది?పూణెకు చెందిన మిహిర్ గాంధీ, మీనాక్షి వారం క్రితం ఒక రీల్ విడుదల చేశారు. అందులో ఎత్తయిన భవంతి మీద మిహిర్ ఉంటే అతని చేయి ఆధారంగా మీనాక్షి గాల్లో వేలాడింది. అతను వదిలేసినా ఆమె చేయి జారినా మీనాక్షి కచ్చితంగా చనిపోయి ఉండేది. ఈ రీల్ బయటకు రాగానే అందరూ మండి పడ్డారు. ఈ రీల్స్ పిచ్చికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు స్పందించారు. వాటర్ ట్యాంక్ ఎక్కి...ఇటీవల లక్నోలోని వాటర్ ట్యాంక్ ఎక్కి రీల్ చేయబోయిన శివాంశ్ అనే కుర్రాడు కాలు జారి పడి మరణించాడు. దాంతో లక్నోలో పెద్ద ఎత్తున రీల్స్ అడిక్షన్ మీద చర్చ జరిగింది. ఇలా రీల్స్ చేస్తున్న వారికి గౌరవ మర్యాదలు ఇవ్వడం మానేయాలని తల్లిదండ్రులు, సమాజం అందరూ కోరారు. ఇలాగే రాజస్థాన్‌లోని పాలిలో ఒక యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి ఒక రీల్ చేయాలనుకున్నాడు. తల్లిదండ్రులు వారించేసరికి కోపమొచ్చి వారిని చంపేశాడు. టీనేజ్ యువతీ యువకులు ఇలా మతిలేని పనులు చేస్తున్నారనుకున్నా వైవాహిక జీవితంలో ఉన్న స్త్రీలు, పురుషులు కూడా రీల్స్‌కు బలవుతున్నారు. చత్తిస్‌గఢ్‌లోని భిలాయ్‌కి చెందిన ఒక మహిళ రీల్స్ చేయడానికి అడిక్ట్ అయ్యి భర్త వారించాడని ఆత్మహత్య చేసుకుంది. కర్నాటకలో ఒక భార్య రీల్ కోసం కన్నడ గీతానికి గంతులేసిందని మనసు నొచ్చుకున్న భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్‌లో రీల్స్ వద్దన్నందుకు భర్తనే చంపేసింది మరో మహిళ. రీల్స్ కోసం యువతీ యువకులు రకరకాల డ్రస్సులు వేసుకోవడం, ప్రాంక్‌లు చేయడం, ట్రాఫిక్‌లో ప్రమాదకరమైన ఫీట్లు చేయడం చివాట్లు తినడం ఆనవాయితీగా ఉంది. సమర్థమైన మంచి కంటెంట్‌తో కొందరు గుర్తింపు పొంది లాభపడుతున్నా మరెందరో ఈ రీల్స్ అనే వధ్యశిలపై తలలు తెగిపడుతున్నారు.గుర్తింపు కోసం పోరాటం...గతంలో డార్విన్ మనుగడ కోసం పోరాటం అన్నాడు. ఇవాళ ప్రభుత్వ పథకాల వల్ల మనుగడకు ఢోకా లేదు. ఇక మిగిలింది గుర్తింపు. టీనేజ్‌లో ఉన్న యువతీ యువకులకు గుర్తింప బడాలన్న కోరిక విపరీతంగా ఉంటుంది. గతంలో బాగా చదివి, ర్యాంక్ తెచ్చుకుని, మంచి ఉద్యోగం తెచ్చుకుంటే గుర్తింపు వచ్చేది. ఇప్పుడు ఒక్క రీల్‌తో గుర్తింపు వస్తోంది. ఫాలోయెర్ల వల్ల ఇదంతా ‘తమ కుటుంబం’ అనే భావన వారిలో కలుగుతుంది. ఎప్పుడూ కల్పిత ప్రపంచంలో ముక్కూ మొహం ఎరగని వారి కామెంట్ల ద్వారా వారు సంతృప్తి ΄÷ందుతుంటారు. మరిన్ని కామెంట్ల కోసం మరిన్ని రీల్స్ చేయాలి. మరిన్ని రీల్స్ కోసం మరిన్ని రిస్క్‌లు తీసుకోవాలి అనే భావన బలపడుతుంది.253 కోట్ల మంది...ప్రపంచ వ్యాప్తంగా రోజూ 253 కోట్ల మంది రీల్స్ చూస్తున్నారని ఒక అంచనా. 2020లో టిక్‌టాక్ బ్యాన్ అయ్యాక ఇన్స్టాగ్రామ్ రీల్స్‌ను ప్రవేశ పెట్టింది. 15 నుంచి 30 సెకండ్ల వీడియోలు పోస్ట్ చేసుకునే అవకాశం ఇచ్చింది. దాంతో ఇన్‌స్టా ఇన్ఫ్లూయెన్సర్ల పేరుతో కంటెంట్ క్రియేటర్ల పేరుతో గుర్తింపు కోసం అందరూ రంగంలో దిగారు. మన దేశంలో 8 కోట్ల మంది కంటెంట్ క్రియేటర్లు ఉన్నారంటే (కంటెంట్ ద్వారా ఆదాయం పొందాలని చూస్తున్నారంటే) అంతమందికి మంచి కంటెంట్ దొరికే అవకాశం లేదు. అందుకే పిచ్చి స్టంట్స్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఒకప్పుడు సెల్ఫీ పిచ్చితో చాలామంది ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు రీల్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.సిసలు ప్రపంచంలో...యువతీ యువకులు సిసలైన ప్రపంచంలో ఉండేలా చేస్తే వారిని ఈ రీల్స్ నుంచి బయటకు తేవచ్చు. ‘సోషల్ మీడియా అడిక్షన్ వల్ల ఆత్మహత్య ఆలోచనలతో ఉన్న వారు పెరుగుతున్నారు’ అని సైకియాట్రిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులతో దూరం, నిరుద్యోగం, ఈజీ మనీ కోసం వెంపర్లాట, క్షణిక గుర్తింపుతో వస్తున్న మానసికానందం, విలువల శూన్యత ఇవన్నీ యువతను రీల్స్ వైపు నెడుతున్నాయి. స్నేహితులతో ఆటలు, మాటలు కూడా లేనంతగా (అవతలివారు కూడా ఫోన్లతో బిజీగా ఉండటం వల్ల) ఒంటరితనానికి విరుగుడును సోషల్ మీడియాలో వెతుక్కుంటూ మరింత ఒంటరి ఔతున్నారు. తల్లిదండ్రులు.ఏం చేయాలి?→ కుటుంబం కూచుని సోషల్ మీడియా అడిక్షన్ గురించి మాట్లాడుకోవాలి.→ మనం చేసే రీల్స్ వల్ల కుటుంబానికి మంచిదా చెడ్డదా చర్చించుకోవాలి.→ ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో నిజాయితీగా చెప్పే మిత్రుల సలహా అడగాలి.→ పిల్లలు చేసే ప్రతి పనికీ అంగీకారం ఉండదని తల్లిదండ్రులు వారిని ఒప్పించేలా చె΄్పాలి.→ సైకియాట్రీ సాయం పొందాలి.→ విలువలతో కూడిన గుర్తింపు, గౌరవం మాత్రమే శాశ్వతమని తెలుసుకోవాలి. -
రోజూ మౌత్ వాష్ వాడుతున్నారా? అయితే మీకో హెచ్చరిక!
నోటి దుర్వాసనను నివారించేందుకు, ఫ్రెష్‌గా ఉండేందుకు లిస్టరిన్ మింట్ మౌత్ వాష్‌ను తరచుగా వినియోగిస్తున్నారా? అయితే తాజా అధ్యయనం గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ప్రముఖ కంపెనీకి చెందిన లిక్విడ్ మౌత్ వాష్ వాడితే కేన్సర్ ప్రమాదం మరింత పెరుగుతుందని జర్నల్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజీలో ప్రచురితమైన అధ్యయనం హెచ్చరిస్తోంది. బెల్జియంలోని యాంట్వెర్ప్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ నిపుణులు ఇటీవలి అధ్యయనంలో కూల్ మింట్ ఫ్లేవర్ మౌత్‌వాష్ రోజువారీ వినియోగంపై పరిశోధన చేశారు. దీని ప్రకారం రోజూ లిస్టరిన్ కూల్ మింట్ వాడటం వల్ల రెండు రకాల బాక్టీరియా నోట్లో పెరుగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పలు అంటు వ్యాధులు, ఇతర వ్యాధులతో ముడిపడి ఉన్న బ్యాక్టీరియా జాతులైన ‘ఫ్యూసోబాక్టీరియం న్యూక్లియేటం, స్ట్రెప్టోకోకస్ ఆంజినోసస్’ స్థాయిలను బాగా ఎక్కువగా గుర్తించినట్టు తెలిపారు. ఇవి రక్తంలో కలిసి పలు నోటి సమస్యలకు కారణమవుతాయని అధ్యయన రచయిత ప్రొఫెసర్ క్రిస్ కెన్యన్ తెలిపారు. నోటిలోని చిగుళ్ల వాపు, ఇన్ఫెక్షన్లు కూడా లిస్టెరిన్ కెమికల్ కారణంగా వచ్చే అవకాశం ఉందని పరిశోధనలో తేలిందన్నారు. మౌత్ ఫ్రెష్నర్లోని రసాయనం కారణంగా నోటిలో బ్యాక్టీరియా బాగా పెరిగిపోతుందని, ఫలితంగా పీరియాంటల్ వ్యాధులు, అన్నవాహిక, కొలొరెక్టల్ కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయన్న గత పరిశోధనలు కూడా గుర్తించాయని ఆయన ఉటంకించారు. ‘‘చాలా మంది వ్యక్తులు దీనిని ఉపయోగించకూడదు. ఒకవేళ దానిని ఉపయోగిస్తే, వారు ఆల్కహాల్ లేనిది ఎంచుకోవాలి. అలాగే వినియోగాన్ని రెండు రోజులకు పరిమితం చేయాలి." అని పేర్కొన్నారు. తమ అధ్యయనం లిస్టరిన్ను మాత్రమే పరీక్షించినప్పటికీ, ఇతర ఆల్కహాల్ ఆధారిత మౌత్‌వాష్‌లతో కూడా ముప్పు ఉంటుందని ప్రొఫెసర్ నొక్కి చెప్పారు.అలాగే నోటిలోని సమస్యలు, అనారోగ్యం వివిధ రకాల కేన్సర్ల ముప్పును పెంచుతుంది. నోటిలోని దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు కేన్సర్‌గా మారే అవకాశం ఉంది. ఇన్ఫ్లమేటరీ ప్రక్రియలు, సెల్యులార్ మార్పులు, డీఎన్ఏ ఉత్పరివర్తనాలకు దారితీయవచ్చు. చివరికి ప్రాణాంతం కూడా కావచ్చు. ప్రతి ఒక్కరికి నోటి, గొంతు ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. రెగ్యులర్ బ్రషింగ్, ఫ్లాసింగ్ , డెంటల్ చెక్-అప్ల ద్వారా మంచి నోటి పరిశుభ్రతను కాపాడుకోవాలి. సుదీర్ఘ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా నివారణలో శ్రద్ధ వహించాలి. తద్వారా కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. నోటి పరిశుభ్రతను పాటించకపోవడంతోపాటు, పొగాకు వాడకం, అధిక మద్యపానం నోటి, గొంతు, అన్నవాహిక తదితర కేన్సర్లకు కారకాలు అనేది గుర్తించాలి. నోటి ఆరోగ్య సమస్యలకు వైద్యుల ద్వారా తగిన చికిత్స తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యమని పరిశోధకులు చెబుతున్నారు.అయితే కెన్వ్యూ వాదనలను లిస్టరిన్ యజమాన్యం తిరస్కరించింది.మౌత్ వాష్‌లో ఏముంటుంది?సాధారణంగా మౌత్‌వాష్‌లలో అధిక మొత్తంలో ఇథనాల్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆల్కహాల్ నుండి సేకరించిన ఎసిటాల్డిహైడ్ అనే రసాయం ఉంటుంది. ఇలాంటి వాటిని నిత్యం వాడటం వల్ల నోటి లోపలి చర్మం చాలా సున్నితంగా మారి నోటి పూతలు, నోటి పుండ్లు వస్తాయి. ఇది నోటి కేన్సర్ ముప్పును కూడా పెంచుతుంది. -
డేనియల్ బాలాజీ హఠాన్మారణం: గుండెపోటు వస్తే అంతేనా..?
కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ (48) చిన్న వయసులోనే అకాల మరణం పొందారు. కుటుంభ సభ్యుల సమాచారం ప్రకారం..శుక్రవారం అర్థరాత్రి ఒక్కసారిగా తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారని, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయారని వెల్లడించారు. 50కి పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన చిన్నవయసులోనే కానరాని లోకాలకు వెళ్లిపోవడ బాధకరం. అస్సలు గుండెపోటు వస్తే ఇక అంతేనా?..ప్రాణాలు కోల్పోవాల్సిందేనా? బయటపడలేమా అంటే.. చాలా ఘటనల్లో గుండెపోటు రావడం ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపు చనిపోవడం జరగుతుంది. కానీ ఇలా గుండెపోటు వచ్చే ముందు కొన్ని సంకేతాలు వస్తాయట. వాటిని పట్టించుకోకపోవడంతోనే సమస్య తీవ్రమై ఆస్పత్రికి తరలించే వ్యవధి సరిపోక చనిపోవడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎలాంటి వారికి వస్తుందంటే.. మధుమేహం, ఊబకాయం, ఒత్తిడి, రక్తపోటు వంటి సమ్యలున్న వారికి గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. అలాగే కుటుంబ చరిత్రలో గుండె పోటు సంకేతాలు ఉంటే వారికి కూడా గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. ముందుగా వచ్చే సంకేతాలు.. ఛాతి నొప్పి శ్వాస ఆడకపోవడం కుడి లేదా ఎడమ చేయి లాగడం ఛాతీ అసౌకర్యం ఆ నొప్పి 20 నిమిషాలకు పైనే ఉన్నా.. వికారం కష్టపడు, చేమాటోర్చు గుండెల్లో మంట అజీర్ణం లేదా కడుపు నొప్పి అలసట మరియు వాపు మైకము ఆ టైంలో ఏం చేయాలంటే.. ఈ సంకేతాలు కనిపించిన వెంటనే సార్బిట్రేట్(5 ఎంజీ నుంచి 10 ఎంజీ) ట్యాబ్లెట్‌ను నాలుక కింద పెట్టుకుని చప్పరించాలి. అయినా నొప్పి తగ్గకపోతే దాన్ని గుండె పోటుగా పరిగణించి వెంటనే వైద్య సాయం పొందడానికి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సమయంలో ఆస్పిరిన్ (300 ఎంజీ), క్లోపిడోగ్రిల్ (300 ఎంజీ), అటోర్వాస్టాటిన్( 80 ఎంజీ ) ట్యాబ్లెట్ తీసుకోవాలి. అప్పుడు ఈసీజీ కోసం ఆస్పత్రికి వెళ్లాలి. అయితే వీటిని పరిస్థితి క్రిటికల్ అనిపించినప్పుడే ఇవి వేసుకోవాలి. అలాగే వైద్యుని వెంటనే సంప్రదించి తాను ఏ ట్యాబ్లెట్ వేసుకున్నామో? వివరించాలి. ఇక్కడ ఇలాంటి లక్షణాలు కనిపించిన.. 30 నిమిషాలలోపు ఆస్పిరిన్ నమలడం వల్ల ప్లేట్లెట్ అభివృద్ధిని నిరోధిస్తుంది, అలాగే రక్తం గడ్డకట్టడాని ఆలస్యం చేస్తుంది. కొంతమంది రోగులు గుండె సంబంధిత సంఘటన కంటే రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం వల్ల విపరీతమైన చెమట, మైకం వచ్చిందని చెబుతారు. అలాంటప్పుడూ రోగికి సార్బిట్రేట్ ట్యాబెలెట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఎందుకంటే..? ఇది బీపీను మరింత తగ్గిస్తుంది. ఈ విషయంపై పూర్తి అవగాహన ఉండి.. అవతలి వ్యక్తి పరిస్థితిని క్షణ్ణంగా తెలుసుకున్నాక ఇలాంటి ప్రథమ చికిత్సలను చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ట్యాబ్లెట్లు వేసుకున్నాం కదా!.. గుండె నొప్పి తగ్గిందని వైద్యుని వద్దకు వెళ్లకుండా నిర్లక్ష్యంగా అస్సలు వ్యవహరించొద్దు. ఇది కేవలం అంబులెన్స్ లేదా ఆస్పత్రికి వెళ్లే సమయం వరకూ ప్రాణాలను కాపాడుకోవడానికే అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. గోల్డెన్ అవర్‌లోపు తరలించాలి.. అంతేగాదు మెజారిటీ గుండెపోటు మరణాలు సమయానికి ఆస్పత్రికి చేరుకోకపోవడం వల్లనే జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు వచ్చిన మొదటి గంటలోనే పేషెంట్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తే ప్రాణాలతో బయట పడే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. చాలా కేసులలో బాధితులకు ఛాతిలో నొప్పి వచ్చిన కొన్ని గంటల తర్వాత ఆస్పత్రిలో చేరుతున్నారని.. అయితే అప్పటికే జరుగాల్సిన నష్టం జరుగుతుందని అంటున్నారు. ఎవరికైనా గుండెపోటు వచ్చిన గంటసేపటి వరకు కూడా శరీరానికి రక్తసరఫరా జరుగుతుందని.. ఇందులో మొదటి గంట తర్వాతనే రక్త ప్రసరణ ఆగిపోతుందని వైద్యులు అంటున్నారు. అందుకే గుండెపోటు వచ్చిన మొదటి గంటను గోల్డెన్ అవర్ లేదా గోల్డెన్ టైమ్ అని అంటారని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ గంట సమయంలోగా ఆసుపత్రిలో చేరాలని సూచిస్తున్నారు. (చదవండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫాలో అయ్యే డైట్ ఇదే!) -
Stress Test: మీ పెట్టుబడులకు రక్షణ ఉందా?
రిటైల్ ఇన్వెస్టర్లకు చిన్న కంపెనీలంటే చెప్పలేనంత ఆకర్షణ. అందుకే నేరుగా స్టాక్స్‌లో లేదంటే మ్యూచువల్ ఫండ్స్ రూపంలో స్మాల్, మిడ్‌క్యాప్ కంపెనీల్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. పెద్ద కంపెనీలతో పోల్చి చూస్తే, దీర్ఘకాలంలో చిన్న, మధ్యస్థాయి కంపెనీల్లో అధిక రాబడులు వారిని ఆకట్టుకుంటున్నాయి. కానీ, పెద్ద కంపెనీలతో పోలిస్తే వీటిల్లో రిస్క్ పాళ్లు అధికం. ఈ రిస్‌్కను రిటైల్ ఇన్వెస్టర్లలో అధిక శాతం మంది పట్టించుకోవడం లేదు. ఫలితం మార్కెట్ దిద్దుబాట్లలో తప్పటడుగుల కారణంగా భారీగా నష్టపోవాల్సి వస్తోంది. ఈ రిస్క్‌ను ఇన్వెస్టర్లు అర్థం చేసుకునేందుకు తీసుకొచి్చందే స్ట్రెస్ టెస్ట్. గడిచిన మూడేళ్ల డేటాను గమనించినట్టయితే స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి భారీ మొత్తంలో పెట్టుబడులు వచి్చనట్టు తెలుస్తోంది. ఒక్క 2023 సంత్సరంలోనే మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.23,000 కోట్లు వస్తే.. చిన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే స్మాల్‌క్యాప్ పథకాలు రూ.41,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. 2022లోనూ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.20,500 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.19,795 కోట్ల చొప్పున వచ్చాయి. కానీ, అస్థిరతలు తక్కువగా ఉండే లార్జ్‌క్యాప్ పథకాల నుంచి 2023లో ఇన్వెస్టర్లు రూ.3,000 కోట్లను ఉపసంహరించుకోవడం గమనార్హం. మూడేళ్ల కాలంలో స్మాల్‌క్యాప్ ఫండ్స్ ఏటా 24 శాతం చొప్పున రాబడిని ఇవ్వగా, మిడ్‌క్యాప్ ఫండ్స్ ఏటా 22 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించాయి. ఈ స్థాయి రాబడిని చూసి ఇన్వెస్టర్లు మరింతగా పెట్టుబడులను ఈ పథకాల్లోకి కుమ్మరిస్తున్నారు. వచ్చే పెట్టుబడుల ప్రవాహానికి తగ్గట్టు ఫండ్స్ సంస్థలు చిన్న, మధ్య స్థాయి కంపెనీల్లో ఆ మేరకు పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ కలసి స్టాక్స్ వ్యాల్యూషన్లు ఓ బుడగ మాదిరి తయారవుతున్నట్టు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ఆందోళన చెందింది. ఫలితంగా కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకుంది. చిన్న, మధ్య స్థాయి కంపెనీల్లో ఉండే రిస్క్ నుంచి ఇన్వెస్టర్ల ప్రయోజనాల రక్షణకు కార్యాచరణ రూపొందించుకోవాలని, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడులను నియంత్రించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, అన్ని స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌కు సంబంధించి ‘స్ట్రెస్ టెస్ట్’ నిర్వహించాలని ఫండ్స్ సంస్థలను (ఏఎంసీలు) ఆదేశించింది. లిక్విడిటీ స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ప్రకటిస్తున్నాయి. వీటి గురించి తెలుసుకోవడం అవసరం. ఏమిటీ ఈ స్ట్రెస్ టెస్ట్? పైకి ఎలాంటి అనారోగ్య సమస్యలూ కనిపించకపోవచ్చు. మరి అనూహ్యంగా హార్ట్ ఎటాక్‌తో చిన్న వయసులోనే కొందరు ఎందుకు మరణిస్తున్నట్టు? గుండె సామర్థ్యాన్ని, సమీప కాలంలో వచ్చే ముప్పును తెలుసుకునేందుకు వైద్యులు థ్రెడ్ మిల్ టెస్ట్ (టీఎంటీ) నిర్వహిస్తుంటారు. మెషిన్‌పై శ్రమతో నడస్తున్న సమయంలో గుండె స్పందనలు ఎలా ఉన్నాయనే దాని ఆధారంగా భవిష్యత్ రిస్‌్కలను వైద్యులు అంచనా వేస్తారు. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన స్ట్రెస్ టెస్ట్ కూడా ఇదే మాదిరి అనుకోవచ్చు. 2020 కరోనా సమయంలో స్టాక్ మారెŠక్ క్రాష్ గుర్తుండే ఉంటుంది. ఈ తరహా పతనాల్లో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తమ నిర్వహణలోని పెట్టుబడుల (ఏయూఎం)ను ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తాయి? రిస్‌్కను ఎలా ఎదుర్కొంటాయి? ఇన్వెస్టర్ల ప్రయోజనాలను ఎంత మేరకు కాపాడగలవు? ఇన్వెస్టర్లు ఒక్కసారిగా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తే తిరిగిచ్చే సామర్థ్యం ఫండ్స్ సంస్థలకు ఉంటుందా? ఇత్యాది అంశాలన్నీ తెలుసుకోవడానికి ఈ స్ట్రెస్ టెస్ట్ ఉపకరిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఇది కొత్తగా విని ఉండొచ్చేమో..! కానీ ఆర్బీఐ ప్రతి ఆరు నెలలకు ఒకసారి బ్యాంక్‌లకు సంబంధించి లిక్విడిటీ స్ట్రెస్ టెస్ట్‌ను నిర్వహిస్తుంటుంది. బ్యాంకుల్లో నగదు లభ్యత ఎలా ఉంది? కొరతను ఎదుర్కొంటున్నాయా? అన్నది ఆర్బీఐ మదింపు చేస్తుంటుంది. దీని అవసరం..? బాండ్ల మార్కెట్లలో మాదిరే ప్రతికూల సమయాల్లో స్మాల్, మిడ్‌క్యాప్ పథకాలకు సంబంధించి కూడా లిక్విడిటీ సమస్య ఏర్పడుతుంటుంది. ఒక మోస్తరు ఆస్తులను (పెట్టుబడులు/ఏయూఎం) నిర్వహిస్తున్నంత వరకు ఈ లిక్విడిటీ అనేది మ్యూచువల్ ఫండ్స్‌కు పెద్ద సమస్య కాబోదు. కానీ, గడిచిన ఏడాది రెండేళ్లలో స్మాల్, మిడ్‌క్యాప్ పథకాల్లోకి వస్తున్న భారీ పెట్టుబడులు లిక్విడిటీ పరంగా కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. 2024 ఫిబ్రవరి నాటికి అన్ని స్మాల్‌క్యాప్ ఫండ్స్ నిర్వహణలోని ఏయూఎం రూ.2.49 లక్షల కోట్లకు చేరితే, మిడ్‌క్యాప్ ఫండ్స్ ఏయూఎం రూ.2.95 లక్షల కోట్లకు చేరుకోవడాన్ని ఇక్కడ గమనించాలి. ఇప్పుడు ఈ విభాగాల్లోని పెద్ద పథకాలు ఒక్కో దాని నిర్వహణలోని ఆస్తులు రూ.25,000–60,000 కోట్లకు చేరాయంటే ఏ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. రూ.60,000 కోట్ల ఆస్తులు నిర్వహించే పథకం ఒక శాతం (రూ.600 కోట్లు) మేర స్టాక్స్‌ను విక్రయించినా దాన్ని మార్కెట్ సర్దుబాటు చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా లిక్విడిటీ తక్కువగా ఉండే స్టాక్స్‌లో (తక్కువ వ్యాల్యూమ్ ట్రేడ్ అయ్యేవి) ఈ రిస్క్ ఇంకా ఎక్కువ. కొద్ది అమ్మకాలకే స్టాక్ ధరలు నేలచూపులు చూస్తాయి. దీంతో ఆయా పథకాల యూనిట్ నెట్ అస్సెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ) అదే స్థాయిలో పడిపోతుంది. స్ట్రెస్ టెస్ట్ ఎలా నిర్వహిస్తారు? పథకాల పోర్ట్‌ఫోలియోలో 50, 25 శాతం మేర స్టాక్స్‌ను విక్రయించేందుకు వీలుగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థల మేనేజర్లు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. తమ స్టాక్స్‌కు సంబంధించి గడిచిన మూడు నెలల్లో సగటు ట్రేడింగ్ వ్యాల్యూమ్ను పరిశీలిస్తారు. లిక్విడిటీ (వ్యాల్యూ మ్) చాలా తక్కువగా ఉన్న దిగువ స్థాయి 20 శాతం స్టాక్స్‌ను మినహాయిస్తారు. మిగిలిన స్టాక్స్ వాల్యూమ్ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొనే సమయంలో ఏ మేరకు పెరుగుతుందన్నది ఊహాత్మక గణాంకాల ఆధారంగా అంచనా వేస్తా రు. ఈ గణాంకాల ఆధారంగా పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్ (హోల్డింగ్స్)ను ఎన్ని రోజుల్లో విక్రయించగలమనే అంచనాకు వస్తాయి. ఒక పథకం తన పెట్టబడుల్లో 25 శాతాన్ని, 50 శాతాన్ని ఎన్ని రోజుల్లో విక్రయించగలదన్నది దీని ద్వారా తెలుస్తుంది. సెబీ ఆదేశాల ప్రకారం ఫండ్స్ ప్రతి నెలా ఈ విధమైన స్ట్రెస్ టెస్ట్ నిర్వహించి, ఫలితాలను తర్వాతి 15 రోజుల్లోపు ఆన్లైన్ పోర్టల్‌పై వెల్లడించాలి. ఆయా పథకాల్లో పెట్టుబడులు పెట్టిన టాప్–10 ఇన్వెస్టర్ల వివరాలను కూడా ఫండ్స్ వెల్లడించాల్సి ఉంటుంది. వర్రీ అక్కర్లేదు.. ఒక పథకం తన నిర్వహణ పెట్టుబడుల్లో 50 శాతం విక్రయించేందుకు 60 రోజుల సమయం పడుతుందని వెల్లడించిన సందర్భాల్లో.. ఇన్వెస్టర్ల ఉపసంహరణ క్లెయిమ్‌లు ఒకే సారి ఎక్కువ మొత్తంలో వస్తే ఆమోదిస్తుందా? అన్న సందేహం అక్కర్లేదు. ఈ స్ట్రెస్ టెస్ట్ ఫలితాలు అన్నీ కూడా వాస్తవంగా మార్కెట్లో విక్రయించి, వెల్లడించిన డేటా కాదు. మార్కెట్ పతనాల్లో ఎన్ని రోజుల్లో విక్రయించగలమో ఊహాత్మకంగా వేసిన అంచనాలే. ఆయా సమయంలో ఫండ్స్ పెట్టుబడుల్లో ఉండే రిస్‌్కల గురించి తెలుసుకునేందుకు ఈ డేటా ఇన్వెస్టర్లకు సాయంగా ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడుల్లో 25 శాతం నుంచి 50 శాతం మేర ఉపసంహరణ ఒత్తిళ్లు రావడం అన్నది చాలా అరుదుగానే ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లు 10 శాతం మించవు. దీనికంటే కూడా మార్కెట్లు పడడం మొదలైన తర్వాత ఇన్వెస్టర్లు తాజా పెట్టుబడులు నిలిపివేయడం మన దేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. అంతే కానీ అప్పటికే చేసిన ఫండ్స్ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం అరుదు. నష్టభయమే దీనికి కారణం. నిజానికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలైన అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీలు) లిక్విడిటీ రిస్క్ విషయంలో తగిన సన్నద్దంగానే ఉంటాయి. అందుకే స్మాల్‌క్యాప్ అయినా, మిడ్‌క్యాప్ అయినా పెట్టుబడుల్లో 35 శాతం వరకు తీసుకెళ్లి లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ఎదురైతే ముందుగా లార్జ్‌క్యాప్ పెట్టుబడులనే నగదుగా మార్చుకుంటాయి. దీనికి తోడు పథకంలో కొంత మేర నగదు నిల్వలు కూడా ఉంటాయి. వీటికి అదనంగా పథకం మొత్తం పెట్టుబడుల విలువలో 20 శాతం మేర రుణం తీసుకుని స్వల్పకాల అమ్మకాల ఒత్తిడిని అధిగమించేందుకు సెబీ నిబంధనలు అనుమతిస్తున్నాయి. విశ్లేషణకు కీలక డేటా స్ట్రెస్ టెస్ట్ డేటాతో ఇన్వెస్టర్లకు తాము ఇన్వెస్ట్ చేసిన పథకాల్లో ఉండే రిస్క్ ఎంతన్నది తెలుస్తుంది. ఎన్ని రోజుల్లో పెట్టుబడులను ఫండ్ మేనేజర్లు నగదుగా మార్చుకుంటున్నారన్నది ఇందులో కీలకమైన అంశం. ఇప్పటి వరకు విడుదలైన స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను ఒక్కసారి తప్పకుండా గమనించాలి. స్మాల్‌క్యాప్ పథకాలు తమ పెట్టుబడుల్లో 50 శాతాన్ని విక్రయించి నగదుగా మార్చుకునేందుకు సగటున 22 నుంచి 60 రోజులు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే 25 శాతం పెట్టుబడులను విక్రయించేందుకు 11–30 రోజుల సమయం పడుతోంది. మొత్తం ఒకే రోజు విక్రయించేందుకు ఇక్కడ అవకాశాలు పరిమితం. ఎందుకంటే ఆయా స్టాక్స్‌లో లిక్విడిటీ (ట్రేడింగ్ వ్యాల్యూమ్) చాలా తక్కువగా ఉంటుందన్న అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి. సాధారణంగా స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల వద్ద నగదు నిల్వలు 4.5 శాతం నుంచి 11 శాతం మధ్య ఉన్నాయి. ఒకేసారి అమ్మకాల ఒత్తిడి ఎదురైతే తొలుత ఈ నగదు నిల్వలతో ఫండ్స్ గట్టెక్కగలవు. అప్పటికీ రిడెంప్షన్ (ఉపసంహరణ) ఒత్తిడి ఆగకపోతే పెట్టుబడులను విక్రయించాల్సి వస్తుంది. ఆయా పథకంలో కేవలం కొద్ది మంది ఇన్వెస్టర్లే ఎక్కువ పెట్టుబడులు కలిగి ఉన్నారా? లేదా అన్నది తెలుస్తుంది. ఉదాహరణకు ఒక పథకం నిర్వహణలో రూ.2,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని అనుకుందాం. కేవలం ఐదు, పది మంది ఇన్వెస్టర్లకు సంబంధించే రూ.500 కోట్ల పెట్టుబడులు ఉంటే, అది రిస్‌్కకు దారితీస్తుంది. ఆ స్థాయిలో పెట్టుబడులు కలిగి ఉన్నవారు స్మార్ట్ ఇన్వెస్టర్ల కిందకే వస్తారు. మార్కెట్ పతనం మొదలైన వెంటనే, ముందుగా వారు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు ప్రయతి్నస్తే పథకం ఎన్ఏవీ దారుణంగా పడిపోతుంది. ఇది మిగిలిన ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువను గణనీ యంగా ప్రభావితం చేస్తుంది. అయితే, తాజా స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను గమనిస్తే ఈ రిస్క్ దాదాపు లేనట్టేనని తెలుస్తోంది. ఒక పథకం పెట్టుబడుల విలు వలలో టాప్–10 ఇన్వెస్టర్లకు సంబంధించి పెట్టుబడుల విలువ 0.61–2.1 శాతం మించి లేదు. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాలు అయినప్పటికీ లార్జ్‌క్యాప్ కంపెనీలకు సైతం చెప్పుకోతగ్గ మేర కేటాయింపులు చేసిన పథకాల్లో లిక్విడిటీ రిస్క్ చాలా తక్కువ. ఎందుకంటే లార్జ్‌క్యాప్‌లో లిక్విడిటీ సమస్య ఉండదు. కావాలంటే ఒకే రోజు మొత్తం పెట్టుబడులను విక్రయించుకోగలవు. ఇక స్మాల్‌క్యాప్ ఫండ్స్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్ ఫండ్స్ లిక్విడిటీ మెరుగ్గా ఉంది. స్మాల్‌క్యాప్ పథకాలతో పోలిస్తే సగం వ్యవధిలోనే మిడ్‌క్యాప్ ఫండ్స్ తమ పెట్టుబడులను విక్రయించుకోగలవని స్ట్రెస్ టెస్ట్ డేటా తెలియజేస్తోంది. కాకపోతే మిడ్‌క్యాప్ పథకాల్లో టాప్–10 ఇన్వెస్టర్లకు సంబంధించిన పెట్టుబడులు 1.3–4.9 శాతం మధ్య ఉన్నాయి. అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ రిస్క్ ఉన్నట్టు. అవసరమైతే డేటా విశ్లేషణకు నిపుణుల సలహాలు తీసుకోవచ్చు. సంక్షోభాల్లో ఎలా..? తీవ్ర ప్రపంచ ప్రతికూల పరిణామాల్లో మార్కెట్లు కుప్పకూలితే, ఫండ్స్ పథకాలు లిక్విడిటీ రిస్‌్కను గట్టెక్కుతాయా? అంటే అవుననే చెప్పుకోవాలి. కానీ, వాస్తవ పరిస్థితుల్లో ఫలితాలు ఇలానే ఉండాలని లేదు. అప్పుడు ఇన్వెస్టర్లు ఎలా ప్రతిస్పందిస్తారు..? ప్రతికూల పరిణామాలు స్వల్ప కాలమా? లేక దీర్ఘకాలమా? తదితర అంశాలు అప్పటి వాస్తవ లిక్విడిటీ రిస్‌్కను ప్రభావితం చేస్తాయి. ఎలాంటి ప్రతికూల పరిణామాలు అయినా సరే తమ పెట్టుబడులను వెనక్కి ఇవ్వాలని ఇన్వెస్టర్లు కోరితే.. ఫండ్స్ సంస్థలు తప్పకుండా అనుసరించాల్సిందే. నష్టానికి అయినా అవి అమ్మి చెల్లింపులు చేస్తాయి. మార్గం ఏంటి? స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్ లిక్విడిటీ తక్కువగా ఉండే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అంతేకానీ, పెట్టుబడుల ఉపసంహరణకు ఇది సంకేతం కాదు. రిస్‌్కలను అర్థం చేసుకోలేని వారు, ఎన్ఏవీలు గణనీయంగా పడిపోయినప్పుడు ఓపిక పట్టలేని వారు ఈ తరహా పెట్టబడులను తగ్గించుకోవాలి. దీర్ఘకాల లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులను స్వల్పకాలిక ఆటుపోట్లను చూసి విక్రయించుకోవడం సరైన నిర్ణయం అనిపించుకోదు. అంత రిస్క్ వద్దనుకుంటే లార్జ్‌క్యాప్‌నకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవాలి. ఒకేసారి ఒక పథకం నుంచి 25–50 శాతం పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం సాధారణంగా జరగదు. కనుక స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పెట్టుబడులకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఇవీ ఉదాహరణలు ► రూ.46,000 కోట్ల పెట్టుబడులను నిర్వహించే నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్.. తన పెట్టుబడుల్లో 50 శాతాన్ని నగదుగా మార్చుకునేందుకు 27 రోజులు, 25 శాతం పెట్టుబడుల విక్రయానికి 13 రోజులు పడుతుందని స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను విడుదల చేసింది. ► రూ.17,193 కోట్ల పెట్టుబడులను నిర్వహించే క్వాంట్ స్మాల్‌క్యాప్ ఫండ్ తన పెట్టుబడుల్లో 50 శాతం విక్రయించేందుకు 22 రోజులు, 25 శాతాన్ని విక్రయించేందుకు 11 రోజులు తీసుకుంటుందని తెలిపింది. ► రూ.25,500 కోట్లు నిర్వహించే ఎస్బీఐ స్మాల్‌క్యాప్ ఫండ్ 50 శాతం పెట్టుబడుల విక్రయానికి 60 రోజులు పడుతుందని వెల్లడించింది. ► క్వాంట్ మిడ్‌క్యాప్ ఫండ్ 100% పెట్టుబడుల విక్రయానికి 10 రోజులు, 25% పెట్టుబడుల అమ్మకానికి 5 రోజులు చాలని ప్రకటించింది. ► అదే యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్ 50 % పెట్టుబడులను 12 రోజుల్లో, 25% పెట్టుబడులను 6 రోజుల్లో నగదుగా మార్చుకోగలనని పేర్కొంది. -
2024లో ముంచుకొస్తున్న ముప్పు..
ఒకవైపు భారీవర్షాలు, తుపాన్లు, వరదలు మరోవైపు కరవు కాటకాలు.. వీటికితోడు ఇటీవల కాలంలో పెచ్చురిల్లుతున్న విభిన్న దాడులతో సామాన్యులు చితికిపోతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో ఏఐ ఆధారిత మోసాలు, సైబర్‌దాడులు, రాజకీయమోసాలు 2024లో అధికం కాబోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. వీటికితోడు అంతర్జాతీయంగా ఎన్నో రిస్క్‌లు సంభవించబోతున్నట్లు అంచనావేస్తూ ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనామిక్ ఫోరం) నివేదిక విడుదల చేసింది. భారత్, అమెరికా, బ్రిటన్, మెక్సికో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. దాదాపు 300 కోట్ల మంది ఎన్నికల క్రతువులో భాగం కానున్నారు. అయితే తప్పుడు సమాచార వ్యాప్తి ఎన్నికలకు పెనుముప్పుగా పరిణమించనుంది. ఆయా దేశాల్లో ఎన్నికల ఫలితాలపైనా, ప్రజాస్వామ్య మనుగడపైనా ఇది తీవ్ర ప్రభావం చూపనుందని ప్రపంచ ఆర్థిక వేదిక వెలువరించిన ‘గ్లోబల్ రిస్క్ నివేదిక-2024’లో వెల్లడైంది. ఆర్థిక, పర్యావరణ, రాయకీయ, భౌగోళిక, సాంకేతిక తదితర 34 ముప్పులపై ఈ నివేదిక ర్యాంకులను ప్రకటించింది. తప్పుడు సమాచారం అతిపెద్ద ముప్పుగా ఉన్న దేశాల్లో భారత్ తొలిస్థానంలో ఉంది. అమెరికా ఆరోస్థానంలో ఉంది. కేవలం వాతావరణానికి సంబంధించి తప్పడు సమాచారం వల్ల కలిగే రిస్క్ 2024లో 100కు 66 శాతంగా ఉంటుందని నివేదిక ద్వారా తెలిసింది. నివేదికలోని వివరాల ప్రకారం..(రిస్క్ శాతం) 1. తీవ్రమైన వాతావరణం 66% 2. ఏఐ ఆధారిత తప్పుడు సమాచారం 53% 3. సామాజికంగా/ రాజకీయంగా కలిగే రిస్క్ 46% 4. జీవన వ్యయం 42% 5. సైబర్ దాడులు 39% 6. ఆర్థిక తిరోగమనం 33% 7. కీలకమైన వస్తువుల సరఫరాలో అంతరాయం 25% 8. సాయుధ బలగాల మధ్య యుద్ధం 25% 9. మౌలిక సదుపాయాలపై దాడులు 19% 10. ఆహార సరఫరా గొలుసుల అంతరాయం 18% -
పల్లీలు తినడం ప్రమాదమా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
పల్లీలు లేదా వేరుశెనగలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెజబ్బులు వచ్చే ప్రమాదాన్ని నివారిస్తాయి. బరువు కూడా తగ్గుతారు. అయితే ఇవి ఆరోగ్యానికి మంచివైనప్పటికీ.. కొన్ని దుష్పరిణామాలు ఉన్నాయిని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఈ వేరుశెనగ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అలాగే కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అలాంటప్పుడూ దీన్ని తినొచ్చా? మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంత వరకు మంచిది? ఆరోగ్య నిపుణులేమంటున్నారు తదితరాల గురించే ఈ కథనం!. భారతదేశంలో ప్రజలు వేరుశెనగ కాయల్ని వేయించి లేదా ఉకడబెట్టి కచ్చితంగా తీసుకుంటారు. కాలక్షేపం కోసం లేదా స్నాక్స్ మాదిరిగానైన తమ ఆహారంలో వీటిని తప్పనిసరిగా భాగం చేసుకుంటారు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్(జీఐ) తక్కువుగా ఉండి, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పైగా వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల బాదంపప్పు, జీడిపప్పు వంటి ఖరీదైన నట్స్ తినలేకపోయిన కనీసం వేరుశెనగకాయలను కచ్చితంగా తమ ఆహారంలో భాగం చేసుకుని మరీ తింటారు. అలాంటి వేరుశెనగ తింటే కొన్ని ప్రయోజనాల తోపాటు ప్రమాదాలు కూడా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ముందుగా దీని వల్ల కలిగే ప్రయోజనాల్లో ముఖ్యంగా..ఈ పల్లీలు డయాబెటిస్ పేషంట్లకు మంచి ఆహారం అని ధీమాగా చెప్పొచ్చు అంటున్నారు వైద్యులు. ఎలా అంటే..? ఇవి తింటే టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉంటుందనేది నిజమే! రక్తంలోని చక్కెరని ప్రభావితం చేసి ఇన్సులిన్ పెరగకుండా చేస్తుంది. తత్ఫలితంగా శరీరంలో చక్కెర స్థాయిలు పెరగవని అంటున్నారు. ఈ వేరుశెనగలో ఉండే గ్లూకోజ్ ఇండెక్స్(జీఐ) విలువ 13 ఉంటుంది. అందువల్ల చక్కెర కచ్చితంగా అదుపులో ఉంటుందని చెబుతున్నారు. అంతేగాదు ఉదయాన్నే వేరుశెనగ లేదా సంబంధిత ఉత్పత్తులను తినడం వల్ల రోజంతా రక్తంలోని చక్కెరని స్థాయిని పెరగకుండా నియంత్రిస్తుంది. ఒక వేళ అధిక జీఐ స్థాయిలున్నా ఆహారాన్ని తిన్నప్పుడూ.. తప్పనిసరిగా ఈ వేరుశెనగను కూడా ఆహారంలో జతచేస్తే శరీరంలో గ్లూకోజ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇది చక్కెర స్థాయిని తగ్గించడాని ప్రధాన కారణం దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే మెగ్నీషియమే. ఈ వేరుశెనగలో సుమారు 12% మెగ్నీషియం ఉంటుంది. ఇది గ్లూకోజ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే దీనిలో అసంతృప్త కొవ్వులు, ఇతర పోషకాలు అధికంగా ఉన్నందున ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడమే గాక శరీర సామర్థ్యాన్ని పెంచేలా వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయిని అధ్యయనంలో వెల్లడైంది. సంభవించే ప్రమాదాలు.. ఇందులో అధికంగా ఉండే ఒమెగా 6 కొవ్వు ఆమ్లాలు వల్ల శరీరంలో కొన్ని రకాల అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ ఒమెగా వల్లే మధుమేహం, ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా ఉన్నట్లు తన పరిశోధనలో తేలిందన్నారు. మార్కెట్లో వేరుశెనగలు వేయించి ఉప్పు, పంచదార కలి ఉంటాయి. ఇలాంటవైతే మరితం ప్రమాదమని చెబుతున్నారు. అంతేగాక దీనిలో అధికంగా ఉండే క్యాలరీలు కారణంగా చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఏదీఏమైనా ఆరోగ్యానికి ఎంత మేలు చేసేదైనా దాన్ని తగు మోతాదులో తినడమే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు (చదవండి: మళ్లీ కరోనా రిపీటా? చైనాలో మిస్టీరియస్ న్యూమోనియా కలకలం..చిన్నారులతో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు) -
టీకాతో అకాల మరణాల ముప్పుపై.. వెలుగులోకి కీలకాంశాలు
ఢిల్లీ: కరోనా వాక్సినేషన్ యువకుల్లో అకాల మరణాలను పెంచబోదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. కనీసం టీకా ఒక్క డోసు తీసుకున్నా.. అకాల మరణాలు సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొంది. కరోనా టీకా తీసుకున్నవారిలో అకాల మరణాల ముప్పుకు సంబంధించి ఐసీఎమ్ఆర్ చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. టీకాతో అకాల మరణాలు ముప్పు అంశంపై ఐసీఎమ్ఆర్ అక్టోబరు 1, 2021 నుండి మార్చి 31, 2023 మధ్య అధ్యయనాన్ని చేపట్టింది. ఈ పరిశోధనలో దేశవ్యాప్తంగా 47 ఆసుపత్రుల్లో రోగులను పరిశీలించారు. ముఖ్యంగా 18-45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులపై దృష్టి సారించారు. వారిలో ఎలాంటి ఆనారోగ్య లక్షణాలు కనిపించలేదని అధ్యయనంలో వెల్లడైంది. ఈ విశ్లేషణలో 729 కేసులను పరిశీలించారు. టీకా రెండు డోసులను తీసుకున్నవారికి అకాల మరణం సంభవించే ప్రమాదం చాలా తక్కువ అని అధ్యయనం స్పష్టం చేసింది. అయినప్పటికీ.. అకాల మరణ ప్రమాదాన్ని పెంచే అనేక అంశాలను అధ్యయనం గుర్తించింది. వీటిలో కోవిడ్-19 కారణంగా ఆస్పత్రిలో చేరిన రోగుల ఆరోగ్య చరిత్ర, ఆకస్మిక మరణానికి సంబంధించిన వ్యక్తి కుటుంబ ఆరోగ్య చరిత్ర ప్రభావితం చూపుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మరణానికి ముందు 48 గంటలలోపు అతిగా మద్యం సేవించడం, డ్రగ్స్ వంటి పదార్ధాల వినియోగం, తీవ్రమైన శారీరక శ్రమలో పాల్గొనడం వంటివి అకాల మరణ ప్రమాదాన్ని పెంచుతున్నాయని గుర్తించారు. ఇదీ చదవండి: IndiGo Flight Viral Incident: ప్రయాణీకులు ఆరుగురే అని... దించేసి పోయారు! -
ఐదు రెట్ల మరణాలు.. ఆందోళన కలిగిస్తున్న తాజా నివేదిక
శిలాజ ఇంధనాల నిర్మూలనకు సాహసోపేతమైన చర్యలు తీసుకోకుంటే వాతావరణ సంక్షోభం మరింత మంది జీవితాలను ప్రమాదంలో పడేస్తుందని తాజా నివేదిక ఒకటి ఆందోళన కలిగిస్తోంది. 100 మందికి పైగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. వాతావరణ చర్యను ఆలస్యం చేయడం వల్ల 2050 నాటికి ఉష్ణ సంబంధిత మరణాలు దాదాపు ఐదు రెట్లు పెరుగుతాయని ప్రముఖ సైన్స్ జర్నల్ లాన్సెట్‌లో నవంబర్ 14న ప్రచురితమైన వార్షిక కౌంట్‌డౌన్ నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మానవుల ఆరోగ్యం శిలాజ ఇంధనాల నిర్మూలనపైనే ఆధారపడి ఉందని పేర్కొంది. మానవాళికి ముప్పు ఓ వైపు మానవాళి ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నప్పటికీ, వాతావరణ మార్పులతో వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు కానీ, బ్యాంకులు కానీ, కంపెనీలు కానీ మేల్కోవడం లేదని, శిలాజ ఇంధనాల వినియోగాన్ని, విస్తరణను ప్రోత్సహిస్తూనే ఉన్నాయని నివేదిక రూపకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలు చమురు, గ్యాస్ ఉత్పత్తి ప్రణాళికల విస్తరణ, ఫైనాన్సింగ్‌తో శిలాజ ఇంధనంవైపు పయనిస్తూ మానవ మనుగడకు ముప్పు తెస్తున్నాయని లాన్సెట్ కౌంట్‌డౌన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రధాన రచయిత మరీనా రొమనెల్లో సీఎన్ఎన్ వార్తా సంస్థతో పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థకూ నష్టమే ప్రపంచం శిలాజ ఇంధనాలపై ఆధారపడటం కొనసాగితే , దాని పర్యవసానాలు మానవ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు కూడా విపత్తుగా మారవచ్చని రోమనెల్లో నొక్కిచెప్పారు. 1800ల చివరిలో పారిశ్రామిక పూర్వ యుగం నుంచి ఈ గ్రహం ఇప్పటికే దాదాపు 1.2 డిగ్రీల సెల్సియస్ వేడెక్కింది. ఇది 2 డిగ్రీలకు చేరుకుందంటే ప్రపంచ దేశాలు 50 శాతం కార్మిక సామర్థ్యాన్ని నష్టపోతాయని, తద్వారా అపారమైన ఆర్థిక నష్టాలకు దారి తీస్తుందని నివేదిక హెచ్చరించింది. -
అత్యంత అరుదైన ఘటన!ఒకేసారి రెండు గర్భాలా..!:
ఒక మహిళలకు రెండు గర్భాశయాలు ఉండటం అనేది అత్యంత అరుదు. ఇలా ఉంటే డెలివరీ టైంలో చాలా రిస్క్ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ ఉన్నా రెండింటిలోనూ శిశువులు పెరగడం అనేది కూడా అరుదే. అలాంటి విచిత్ర ఘటనే అలబామాకు చెందిన మహిళ విషయంలో జరిగింది. అసలేం జరిగిందంటే..దక్షిణ అమెరికాలోని అలాబామాకు చెందిన కెల్సీ హాట్చర్, కాలేబ్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఐతే ఆమె మరోసారి గర్భం దాల్చింది. ఇందులో వింత ఏంటి? అని అనుకోకండి..ఎందుకంటే? ఈసారి ఒకేటైంలో రెండుసార్లు గర్భం దాల్చింది. ఇదేలా సాధ్యం అని వైద్యులు కూడా షాక్ అయ్యారు. ఇక్కడ కెల్సీకి తన ఆరోగ్య గురించి ముందు తెలుసు. దీంతో ఆమె ఈసారి తన కడుపులో ఇద్దరు ఉన్నారని తన భర్తకు చెబుతుంది. ఆటపట్టిస్తున్నావు ఇద్దరెలా ఉంటారని ఆమె భర్త కూడా కొట్టిపడేశాడు కూడా. నిజమే!ఇద్దరు శిశువులు పెరుగుతున్నారని నమ్మకంగా చెప్పింది తన భర్తకి. ఆ మహిళకు రెండు గర్భాశయాలున్నట్లు డాక్టర్లు ఇదివరకే ఆమెకు చెప్పారు. అయితే ఈసారి రెండు గర్భాశయాల్లోనూ శిశువులు పెరుగుతున్నాయి. ఇలా జరగదు. ఏదో ఒక దానిలో గర్భం పెరగడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ రెండు గర్భాశయాలు దేనికది వేరుగా పిండాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఒక గర్భాశయంలో ఇద్దరు ఉంటే కవలలు అని పిలుస్తాం. ఇప్పుడు వేర్వేరు గర్భాశయాల్లో పిండాలు పెరుగుతున్నప్పుడూ కూడా కవలలనే పిలవాలా? అనేది సందేహస్పదమైన ప్రశ్న. ఈ మేరకు ఆమెకు వైద్యం అందిస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేతా పటేల్ మాట్లాడుతూ.. ఇలాంటివి అత్యంత అరుదని అన్నారు. కొంతమందది స్త్రీల్లో పుట్టుకతో ఇలా రెండు గర్భాశయాలు ఉంటాయి. ఈ గర్భాశయాలు రెండు చిన్న గొట్టాలతో ప్రారంభమవుతుంది. ఐతే పిండం పెరుగుతున్నప్పుడూ గొట్టాలు సాధారణంగా పెద్ద బోలు అవయవాన్ని సృష్టించేలా కలుస్తాయి. దీన్నే గర్భాశయం అంటారు. కొన్నిసార్లు ఈ ట్యూబ్‌లు పూర్తిగా చేరవు. బదులుగా దేనికది ప్రత్యేకంగా లేదా వేర్వేరు అవయవంగా అభివృద్ధి చెందుతాయి. డబుల్ గర్భాశయం ఒక యోని ప్రారంభాన్ని కలిగి ఉంటుంది. ఈ ఓపెనింగ్‌ను సర్విక్స్ అంటారు. కొన్ని సందర్భాల్లో ఇలా ప్రతి గర్భాశయం సెపరేట్ గర్భాశయాన్ని కలిగి ఉంటాయన్నారు. నిజానికి రెండు గర్భాశయాలు ఉన్న చాలా వరకు ఒక గర్భాశయంలోనే పిండం పెరుగుతుంది. రెండు గర్భాల్లోనూ పిండం అనేది పెరగదు. సరిగ్గా పిండం ఎదిగే క్రమంలో ఆ రెండు గొట్టాల్లా ఉన్న ట్యూబ్‌లు ఒక్కటిగా అయ్యి పిండం పెరిగేలా ఒకే గర్భాశయంగా మారతాయి. అరుదైన సందర్భాల్లోనే ఇలా వేర్వేరుగానే రెండు గర్భాశయాల్లో పిండాలు అభివృద్ధి చెందడం అనేది జరుగుతుందన్నారు శ్వేతా పటేల్. ఇలా డబుల్ గర్భాశయం ఉన్న స్త్రీలు విజయవంతంగా ప్రెగ్నెంట్ అయినప్పటికీ తరుచుగా గర్భస్రావం లేదా నెలలు నిండకుండానే డెలివరీ అవ్వడం జరుగుతుంటుందని క్లిష్టతర కాన్పుల నిపుణడైన డాక్టర్ రిచర్డ్ డేవిస్ చెబుతున్నారు. ప్రతి వెయ్యి మంది మహిళలల్లో ముగ్గురికి ఇలా డబుల్ గర్భాశయం లేదా డబుల్ గర్భాశయాలు ఉండొచ్చు అని వివరించారు. ప్రస్తుతం తాము సదరు మహిళ కెల్సీని ప్రసవం అయ్యేంత వరకు చాల జాగ్రత్త పర్యవేక్షిస్తూ.. ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. తాము ఇద్దరు శిశువులు బాగున్నారని భరోశ ఇవ్వలేమని పటేల్ చెబుతున్నారు. వైద్య పరంగా ఇది అరుదైన విషయమే అయినా ఆ శిశువులని కవలలని కాకుండా ప్రత్యామ్నాయంగా ఏమని పిలవాలో తెలియాల్సి ఉందన్నారు. (చదవండి: ఆహారం అనేది రుచి కోసం అనుకుంటే అంతే సంగతులు! వైద్యులు స్ట్రాంగ్ వార్నింగ్) -
ఆ రోజే ఎందుకు డయాబెటిస్ డే జరుపుకుంటున్నాం?
మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి కుటుంబంలో ఓ డయాబెటిస్ పేషెంట్ తప్పకుండా ఉంటున్నారు. రోజుకి రోజుకి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా డయాబెటిస్ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వ్యాధి సైలంట్ కిల్లర్‌లా మొత్తం అవయవాలన్నింటిపై ప్రభావం చూపించి మనిషి ఆయఃప్రమాణాని తగ్గించేస్తోంది. ఈ మధుమేహం కారణంగా చాలామంది గుండె, మూత్రపిండాల, కంటి ఇన్ఫెక్షన్లా బారిన పడినవాళ్లు కోకొల్లలు. ఇది ఓ మహమ్మారిలా మనుషులను చుట్టుముట్టి జీవితాన్ని హారతి కర్పూరంలా తెలియకుండానే హరించేస్తుంది. నిజం చెప్పాలంటే ఒకసారి వచ్చిందంటే దీర్ఘకాలిక వ్యాధిలా ఉండిపోతుంది. కేవలం శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా రక్షించుకోవడం ఒక్కటే ఉత్తమమైన మార్గం. అలాంటి మధుమేహ వ్యాధి కోసం ప్రత్యేకంగా ఓ రోజును ఏర్పాటు చేసి మరీ ఎందుకు జరుపుతున్నారు. అసలు ఈ మధుమేహాన్ని ఎలా నియంత్రించుకోవాలి తదితరాల గురించే ఈ కథనం!. చాలామంది దీనికి తీసుకోవల్సిన తగు జాగ్రత్తలు, సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడంతో ఈ వ్యాధి కారణంగా తలెత్తే రుగ్మతలు బారినపడి ప్రాణాలు కోల్పోతున్నా వాళ్ల సంఖ్య ఎక్కువ. దీంతో ప్రజలందరికి ఈ వ్యాధిపై అవగాహన వచ్చేలా ఒక రోజుని ఏర్పాటు చేసుకుని..ప్రతి ఏటా అందుకు సంబంధించిన కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తే కనీసం ఈ వ్యాధి కారణంగా చనిపోతున్న వారి సంఖ్యను తగ్గించగలగడమే కాక మధుమేహ రోగుల సంఖ్యను కూడా నియంత్రించగలిగుతామని నిపుణులు భావించారు. అదీగాక ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన ఏర్పడితే అదుపులో పెట్టుకుని దీర్ఘకాలం జీవించేలా చేయగలుగుతాం. ఆ రోజు ఎందుకంటే.. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతుతో అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య 1991లో ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించగా, 2006 నుంచి అధికారికంగా పాటిస్తున్నారు. ఇక 1922లో సర్ ఫ్రెడరిక్ బాంటింగ్ తన సహచర శాస్త్రవేత్తతో కలిసి ఇన్సులిన్ని కనిపెట్టిన సంగతి విధితమే. అయితే సర్ ఫ్రెడరిక్ ఈ వ్యాధిని నియంత్రిచడానికి రోగులను రక్షించేందుకు శతవిధాల ప్రయత్నించాడు. పైగా ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని రోగుల్లో ధైర్యాన్ని నింపేవాడు. ఆయన విశేష కృషికి గానూ ఏటా సర్ ఫ్రెడరిక్ పుట్టిన రోజు నవంబర్ 14న వరల్డ్ డయాబెటిస్ డేగా జరుపుకుంటున్నాం. ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసి ఒక్కో థీమ్‌తో ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన ఏర్పడేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మధుమేహంలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ అనేది ఒక రకమైన జన్యుపరమైన రుగ్మత, ఇది ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తుంది. అయితే టైప్ 2 డయాబెటిస్ మీ జీవనశైలి, చెడు అలవాట్ల కారణంగా వస్తుంది. ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్(ఐడీఎఫ్) ప్రపంచ వ్యాప్తంగా సుమారు 537 మిలియన్ల(సుమారు 53 కోట్ల మందికి) మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య 2045 నాటిక సుమారు 700 మిలియన్ల(70 కోట్లకు)కు పైగా పెరుగుతుందని అంచనా. దాదాపు 90%నికి పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులు టైప్2 డయాబెటిస్‌తోనే బాధపడుతున్నారు. దీన్ని క్రమతప్పక వ్యాయామం, ధూమపానానికి దూరంగా ఉండటం తోపాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో అదుపులో పెట్టుకోవచ్చు లేదా నివారించొచ్చు. ఈ ఏడాది థీమ్ "మధుమేహ సంరక్షణకు ప్రాముఖ్యత". ఈ ప్రచార క్యాంపెయిన్‌తో మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమైన మందులు అందుబాటులో ఉంచడం. అందరికీ ఈ వ్యాధి పట్ల అవగాహన, వారికి కావల్సిన మద్దతును అందిచడం, సమస్య తీవ్రతను నివారించేలా దృష్టి సారించడం వంటి స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేగాదు 2030 నాటికి మధుమేహాన్ని నియంత్రించేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకునేలా అన్ని రకాల వనరులను వినియోగించుకోవాలని ఆరోగ్య కార్యకర్తలకు పిలుపునిస్తోంది ఈ ప్రచార కార్యక్రమం. ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొనాలంటే.. ముందుగా మీకు టైప్ 2 మధుమేహం వచ్చిందో లేదో చెకప్ చేయించుకోవాలిజ మధుమేహం గురించి తెలుసుకోవడం, నివారణకు ఏం చేయాలి తదితరాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి మధుమేహగ్రస్తులకు మద్దుతు ఇవ్వడం మీ సమీప ప్రాంతో ఈ దినోత్సవాన్ని నిర్వహించడంల లేదా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం జెనీవాలోని ఐక్యరాజ్యసమితికి మీ జాతీయ ఆరోగ్య మంత్రి లేదా శాశ్వత మిషన్‌కు లేఖ పంపడం లేదా మధేమేహ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వమని కోరడం వంటివి చేయాలి (చదవండి: రోజూ ఒక కప్పు 'టీ' తాగితే.. మధుమేహం ఉండదు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
రిస్క్‌లో లక్షలాది జీమెయిల్ అకౌంట్లు.. డిలీట్ చేయనున్న గూగుల్!
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది గూగుల్ అకౌంట్లు రిస్క్‌లో ఉన్నాయి. తరచుగా ఉపయోగించని లక్షలాది అకౌంట్లను గూగుల్ వచ్చే డిసెంబర్లో తొలగించనుంది. ఇనాక్టివ్ అకౌంట్లు తొలగించే ప్రక్రియలో భాగంగా గత రెండేళ్లుగా ఉపయోగించని అకౌంట్లను గూగుల్ డిలీట్ చేయనుంది. గూగుల్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రుత్క్రిచెలీ దీని గురించి గత మే నెలలోనే బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొన్నారు. రిస్క్‌ను తగ్గించడంలో భాగంగా రెండేళ్లకు పైగా వినియోగంలో లేని అకౌంట్లను తొలగించేలా గూగుల్ అకౌంట్ల ఇనాక్టివిటీ పాలసీని అప్డేట్ చేస్తున్నట్లు వివరించారు. దీని ప్రకారం.. రెండేళ్లకు పైగా ఉపయోగించని గూగుల్ అకౌంట్లు డిలీట్ కానున్నాయి. అంటే ఆయా అకౌంట్లకు సంబంధించిన జీమెయిల్, డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్‌తోపాటు గూగుల్ ఫొటోలు కూడా డిలీట్ అయిపోతాయి. అలాంటి అకౌంట్లతో ముప్పు గూగుల్ అకౌంట్ యూజర్ల తరచూ తమ అకౌంట్‌ను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం అప్పుడప్పుడు రెండంచల వెరిఫికేషన్ చెక్‌ను గూగుల్ అనుసరిస్తూ ఉంటుంది. ఇలా ధ్రువీకరించని అకౌంట్ల ద్వారా ముప్పు ఉండే అవకాశం ఉంటుందని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ ఆ పోస్టులో పేర్కొన్నారు. అయితే తొలగింపు వ్యక్తిగత గూగుల్ అకౌంట్లకు మాత్రమే వర్తించనుంది. స్కూళ్లు, ఇతర వ్యాపార సంస్థలకు అకౌంట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలుస్తోంది. వెంటనే యాక్టివేట్ చేసుకోండి సాధారణంగా చాలామందికి ఒకటి కంటే ఎక్కువ గూగుల్ అకౌంట్లు ఉంటాయి. అవసరానికి అనుగుణంగా ఇలా ఎక్కువ అకౌంట్లను క్రియేట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ తర్వాత వాటి గురించి మరచిపోతుంటారు. ఇప్పుడు అలాంటి అకౌంట్లన్నీ డిలీట్ కాబోతున్నాయి. అలా కాకూడదంటే వాటిని వెంటనే యాక్టివేట్ చేసుకోండి. ఆయా అకౌంట్లను ఉపయోగించి ఈమెయిల్ చేయడం, గూగుల్ డ్రైవ్ ఉపయోగించడం, యూబ్యాబ్ వీడియోలు చూడటం, గూగుల్ ప్లే స్టోర్ యాప్‌ను డౌన్లోడ్ చేయడం, గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా సంబంధిత అకౌంట్లను యాక్టివేట్ చేసుకోవచ్చు. -
వ్యాయామం తక్కువుగా చేసినా చాలు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు
చాలమంది వర్క్ఔట్లు ఎక్కువగా చేస్తుంటారు. త్వరితగతిన బరువు తగ్గాలని లేదా మంచి ఫలితాలు కనిపించాలంటే ఆ మాత్రం వర్క్ఔట్లు ఉండాలని అనుకుంటారు. అందుకోసం అని వాకింగ్లు కొన్ని రకాల వ్యాయమాలు తెగ చేసేస్తుంటారు. ఐతే తాజా పరిశోధనలో అందుకు భిన్నంగా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. శాస్త్రవేత్తలు కూడా మితంగా వ్యాయామం చేస్తే చాలని తేల్చి చెప్పారు. మొన్నటి వరకు పదివేల అడుగులు వేస్తే బరువు తగ్గుతారు అనుకున్నారు. కానీ ఇప్పుడు అన్ని అడుగులు అవసరం లేదని అధ్యయనంలో వెల్లడైందంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. తక్కువ వ్యాయామంతో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్పెట్టగలమా? పరిశోధనల్లో ఏం వెల్లడైంది తదితరాల గురించే ఈ కథనం!. స్పెయిన్‌లోని గ్రెనడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం..తక్కువ వ్యాయామంతోనే మంచి రిజల్ట్స్‌ని పొందొచ్చని ప్రభావంతంగా కూడా ఉంటుందని పరిశోధనలో తేలింది. వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం దాదాపు 60% తగ్గుతుందని కూడా వెల్లడైంది. ఈ మేరకు ఈ విషయాలను అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో వెల్లడించారు శాస్త్రవేత్తలు. అందుకోసం సుమారు లక్ష మందికి పైగా వ్యక్తులపై పరిశోధనలు చేసినట్లు పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా పదివేల అడుగులు అవసరమని చెబతుంటారు. ఐతే అన్ని అడుగులు అవసరం లేదంటున్నారు. కేవలం రెండు కిలోమీటర్లు అనగా దాదాపు 2,700 అడుగులు చాలు వివిధ గుండె సంబంధిత సమ్యలు తగ్గుతాయని చెబుతున్నారు. ఎక్కువగా నడిచే వారిలో చాలా మంచి ప్రయోజనాలు కూడా కనిపించాయి. కానీ కొందరు ఎక్కువగా నడిస్తేనే మంచిదని భావించి బలవంతంగా చేస్తుంటారు. కానీ అదంతా అవసరం లేదంటున్నారు. రోజుకు రెండు కిలోమీటర్లు నడవండి, మంచి తృణ ధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోండి చాలు చాలా రుగ్మతలు నుంచి సులభంగా బయటపడతారని అంటున్నారు. అలాగే మగవాళ్లకు, ఆడవాళ్లకు వ్యాయామం ఎంత చేయాలనే వ్యత్యాసం ఏం ఉండదని పరిశోధనలో తేలిందన్నారు. తక్కువగా చేసిన మంచి ఫలితాలు ఉంటాయని భయపడాల్సి అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. అదే టైంలో ఎక్కువగా చేసేవారికి ఆరోగ్య మరింత మెరుగ్గా ఉండటమేగాక మరిన్ని ప్రయోజనాలు ఉండటాన్ని గుర్తించాం అని చెప్పారు. ఐతే ఈ పదివేల అడుగులు నడవడం అనేది జపాన్ నుంచి వచ్చింది టోక్యో ఒలంపిక్స్ నేపథ్యంలో వచ్చిందని. ఆటగాళ్లు మెరుగ్గా ఆడేలా ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి సారించేందుకు జపాన్ ఇలా పదివేల అడుగుల లక్ష్యాన్ని నిర్దేశించిందని పేర్కొన్నారు. సైన్సు పరంగా అది ఎక్కడ ఫ్రూవ్ కాలేదన్నారు. ఈ నెంబర్ ఫిగర్ అందరు గుర్తుంచుకునేందుకు సులభంగా ఉంటుందని ఇలా లక్ష్యాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. అందువల్ల ప్రతీరోజూ తక్కువ వ్యాయామం, సుమారు రెండు కిలోమీటలర్లు నడకతో కూడా పూర్తి ఫిట్నెస్గా ఉండగలమని నొక్కి చెబుతున్నారు. దీంతోపాటు వేళకు తినడం, కంటి నిండ నిద్రపోవడం వంటివి చేస్తే జీర్ణ వ్యవస్థ బాగొంటుంది. తద్వారా ఇతరత్ర సమస్యలు ఉత్ఫన్నం కావు అని చెబుతున్నారు పరిశోధకులు. (చదవండి: 'ఒంటరితనం' రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రాణాంతకమా? వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
బెడ్ రూమ్‌లోని ఫ్రిజ్ ప్రాణాంతకమా? నిపుణులు ఏమంటున్నారు?
కొందరు అర్ధరాత్రి సమయంలోనూ ఆహారం తినాలని అనుకుంటారు. అలాంటివారు రిఫ్రిజిరేటర్‌ను పడకగదికి సమీపంలో ఉంచడానికి ఇష్టపడతారు. మరికొందరు బెడ్రూమ్లోనే ఫ్రిజ్ పెట్టుకుంటారు. బెడ్రూమ్లో ఫ్రిజ్‌ని పెట్టుకున్న వారి లిస్ట్‌లో మీరు కూడా ఉంటే ఈ వార్త మీకోసమే. బెడ్రూమ్లో ఫ్రిజ్ ఉంచడం అత్యంత ప్రమాదకరమని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పడకగదిలో రిఫ్రిజిరేటర్ ఉంచడం సురక్షితం కాదనడానికి పూర్తి స్థాయిలో శాస్త్రీయ ఆధారాలు లభించకపోయినా, ప్రమాదం పొంచివుండవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఫ్రిజ్ నుండి వెలువడే రేడియేషన్ గురించి చాలామంది ఆందోళన చెందుతుంటారు. వాస్తవానికి దీని నుంచి వచ్చే రేడియేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే రిఫ్రిజిరేటర్లోని గ్యాస్ కంప్రెసర్లోనే ఉంటుంది. అందువల్ల అది లీకయ్యే ఛాన్స్ ఉండదని నిపుణులు చెబుతున్నారు. రిఫ్రిజిరేటర్ పాడైపోయినప్పుడు ఈ రేడియేషన్‌లో కొంత గదిలోకి లీక్ అయ్యే అవకాశం ఉంది. మరో ఆందోళన కలిగించే అశం ఏమంటే రిఫ్రిజిరేటర్ అగ్ని ప్రమాదాలకు తావిస్తుందని చాలామంది అంటారు. అయితే ఇందుకు చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. కొత్త మోడళ్ల ఫ్రిజ్‌లలో అనేక భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. రిఫ్రిజిరేటర్ అదనపు వేడిని కలిగిస్తుంది. ఫ్రిజ్ నుండి వచ్చే వేడి పడకగది ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫ్రిజ్‌ని బెడ్రూమ్లో ఉంచాలని నిర్ణయించుకుంటే, దాని నుంచి వచ్చేవేడిని బయటకు పంపడానికి దానిని కిటికీ దగ్గర ఉంచాలి. ఆహారాన్ని చల్లగా, తాజాగా ఉంచడానికి రిఫ్రిజిరేటర్ రోజంతా పని చేస్తుంది. కాగా ఫ్రీయాన్ వాయువు ద్రవ రూపంలోకి మారి లీక్ అయితే పలు వ్యాధులకు కలిస్తుంది. అయితే ఇది చాలా అరుదుగా జరుతుంది. దీనిని పీల్చినట్లయితే, ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే రిఫ్రిజిరేటర్‌ను ఎప్పటికప్పుడు సాంకేతిక నిపుణులతో చెక్ చేయించాలి. ఇది కూడా చదవండి: వీధి కుక్కలను చంపడం తప్పుకాదని గాంధీ ఎందుకన్నారు? -
పాకిస్తాన్‌కు భారీ భూకంపం ముప్పు? వణికిపోతున్న జనం?
పాక్‌లో భారీ భూకంపానికి సంబంధించిన అంచనాలు వెలువడిన నేపధ్యంలో పాకిస్తాన్ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన ఒక పరిశోధనా సంస్థ నుండి వచ్చిన సోషల్ మీడియా పోస్ట్ పాకిస్తాన్లో రాబోయే 48 గంటల్లో సంభవించే విధ్వంసక భూకంపానికి సంబంధించిన అంచనాను వెల్లడించింది. ఈ వార్త విన్నప్పటి నుంచి పాక్ పౌరులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వే (ఎస్‌ఎస్‌జీఈఓఎస్)కు చెందిన ఒక పరిశోధకుడు.. పాకిస్తాన్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో బలమైన వాతావరణ హెచ్చుతగ్గులు గమనించామని, ఇది రాబోయే బలమైన భూకంపాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. ఈ వార్త దేశంలో దావానలంలా వ్యాపించింది. రానున్న 48 గంటల్లో దేశంలో పెను భూకంపం వచ్చే అవకాశం ఉందంటూ వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం జరుగుతోంది. డచ్ శాస్త్రవేత్త ఫ్రాంక్ హూగర్బీట్స్ ఈ విషయాన్ని తెలియజేశారంటూ ప్రచారం జరుగుతోంది. అతను గతంలో టర్కీ, సిరియాలో ప్రమాదకరమైన భూకంపాలను అంచనా వేయడానికి గ్రహాల అమరికను అధ్యయనం చేశారు. మరో 48 గంటల్లో పాకిస్థాన్‌లో బలమైన భూకంపం వస్తుందని ఈ శాస్త్రవేత్త అంచనా వేసినట్లు ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో పాక్ ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. ప్రాణాలను దక్కించుకునేందుకు ఏం చేయాలంటూ అధికారుల సలహాలు తీసుకుంటున్నారు. ఇది కూడా చూడండి: అతి చిన్న స్వయం ప్రకటిత దేశం ఏది? జనాభా ఎంత? On 30 September we recorded atmospheric fluctuations that included parts of and near Pakistan. This is correct. It can be an indicator of an upcoming stronger tremor (as was the case with Morocco). But we cannot say with certainty that it will happen. https://t.co/B6MtclMOpe — Frank Hoogerbeets (@hogrbe) October 2, 2023 -
డీజే మ్యూజిక్ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా?
పెళ్లిళ్లలోనూ ఏదైన పండుగ, జాతర్లలో పెట్టే డీజే మ్యూజిక్ వల్ల గుండె పోటు వస్తుందా?. ఈ ఏడాది మార్చి4న బిహార్‌లో సీతామర్హి నివాసి 22 ఏళ్ల సురేంద్ర కుమార్ వేదికపై దండలు మార్చుకుని నవ వధువుతో కూర్చొని ఉండగా ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. సురేంద్ర కుమార్ డీజే సౌండ్ తనకు చాలా అసౌకర్యంగా ఉందని, తగ్గించమని చెప్పినట్లు సమాచారం. ఆ భారీ శబ్దాల వల్లే సురేంద్ర కూమార్ చనిపోయినట్లు బంధువులు ఆరోపించారు కూడా. అలాగే తెలంగాణలో 19 ఏళ్ల యువకుడు తన బంధువు పెళ్లిలో డ్యాన్య్ చేస్తూ కుప్పకూలి చనిపోయాడు. అంతేకాదు గతేడాది నవండర్ 25న ఇలానే డీజే మ్యూజిక్‌లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందాడు. భారతదేశంలో ఇలాంటి ఘటనలు గతకొంతకాలంగా కోకొల్లలుగా జరగడంతో ప్రజల్లో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించాయి. ఎందుకిలా జరుగుతుంది?. శబ్దానికి గుండెపోటుకి సంబంధం ఏంటి? చెవికి గుండెకు ఉన్న లింక్ ఏమిటి తదితరాల గురించే ఈ కథనం.. భారీ శబ్దాలు వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందా?. చెవి నుంచి వెళ్లే శబ్ద తరంగాలు గుండెను ప్రభావితం చేస్తాయా? అంటే ఔననే చెబుతున్నారు వైద్యులు. భారీ శబ్దాలు మనిషిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని పరిశోధకులు యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో వెల్లడించారు. అందుకోసం శాస్త్రవేత్తలు దాదాపు 500 మందిపై అధ్యయనం నిర్వహించారు. వారంతా రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో నివశిస్తున్నారు. నిత్యం భారీ శబ్దాల మధ్య పనిచేయడం లేదా నివశిస్తుంటారు. ఐదేళ్ల పాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో గుండె జబ్బు లక్షణాలు లేని వ్యక్తులు సైతం హృదయ సంబంధ వ్యాధులకు గురైనట్లు గుర్తించారు. పెద్ద పెద్ద శబ్దాల వద్ద గుండె వేగంలో పెరగుతున్న మార్పలను గుర్తించారు. అలాగే మెదడులో ఉండే బూడిద రండు పదార్థాం అమిగ్డాలాపై తీవ్ర ప్రభావం చూపినట్లు గుర్తించారు. ఒక రకంగా బిగ్గర శబ్దాల కారణంగా వ్యక్తుల్లో గుండె దడ, స్ట్రోక్‌లు వచ్చే అవకాశాలు గట్టిగానే ఉన్నాయని పేర్కొన్నారు. అనునిత్యం పెద్ద శబ్దాల వద్ద పనిచేసే వ్యక్తుల్లో మానసిక కల్లోలం, అసహనం ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. హృదయ స్పందనలు క్రమరాహిత్యం.. జర్మనీలో మెయిన్జ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్లో కూడా 35 నుంచి 74 ఏళ్ల వయసు ఉన్న 15 వేల మంది వ్యక్తులపై అధ్యయనం నిర్వహించారు. ఏ సంగీతాన్ని అయినా ఓ నిర్దిష్ట పరిమితి దాటి ఫ్రీక్వెన్సీ పెంచితే మానవ హృదయాలపై హానికరమైన ప్రభావం చూపుతుందని అధ్యయనంలో వెల్లడైంది. భారీ శబ్దానికి గురైనప్పుడూ హృదయ స్పందన వేగం ఒక్కసారిగా మారిపోవడం, భయం ఆందోళన ఒక్కసారిగా ఉత్ఫన్నమవుతున్నట్లు గుర్తించారు. చాలామంది, జాగింగ్ చేసేటప్పుడూ వ్యాయామాలు చేసేటప్పుడూ మ్యూజిక్ పెట్టుకుని చేస్తుంటారు ఇది అంత మంచి పద్ధతి కాదనే అంటున్నారు. ఓ మోస్తరుగా మనిషి వినగలిగేంత పరిమితి సౌండ్‌తోనే సంగీతం వింటే ఎటువంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వాల్యూమ్ ఎక్కువగా పెట్టుకుని వినడం తగ్గించాలి.. చాల ఎక్కువ వాల్యూమ్‌లో ధ్వనిని వినడం చెవిలోని ఇంద్రియ కణాలు, నిర్మాణాలు అలసిపోతాయి. ఇది చాలాకాలం పాటు కొనసాగితే శాశ్వతంగా వినికిలోపం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మానవ చెవికి 60 డెసిబుల్స్ వరకు సాధారణమని అధ్యయనంలో తేలింది. అందువల్ల ఎక్కువ గంటలపాటు పెద్ద పెద్ద వాల్యూమ్‌లో హెడ్‌ఫోన్ పెట్టుకుని వినడం, వివాహ ఫంక్షన్లో పెట్టే భారీ సంగీ మ్యూజిక్ల్లో పాల్గొనడం వంటి వాటికి దూరంగా ఉంటేనే మంచిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గుండెకు చెవికి ఉన్న సంబంధం ఏంటీ .. ఏదైన ఆహ్లాదకరమైన వాయిస్ లేదా శబ్దాన్ని వినగానే కేవలం చెవితోనే వినం. హృదయంతో ఆస్వాదిస్తాం. ఇది తెలియకుండానే జరుగుతుంది. సంగీతంతో కొన్న జబ్బులు నయం చేయడం అనే పురాతన వైద్యం ఇందులోనిదే. భయోత్సాహమైన సౌండ్లతో సాగే మ్యూజిక్ తరంగాలు మన శరీరంలో ఒక రకమైన ఆందోళనకు గురవ్వుతుంది. అది నేరుగా మన గుండెపైనే ప్రభావం చూపిస్తుంది. ఏవిధంగా మంచి సంగీతం హృదయాన్ని హత్తుకుని గుండె పదిలంగా ఉండేలా చేస్తే.. మోతాదుకు మించిన వాల్యూమ్‌తో వినే మ్యూజిక్ గుండె, మెదడుపై అదే స్థాయిలో ప్రభావం చూపిస్తాయి. మన శరీరంలోని అవయవాలు ఒకదానితో ఒకటి లింక్ అప్ అయ్యే ఉంటాయి. ఒక అవయవానికి ఏర్పడిన నష్టం దేహంలోని మిగతా అవయవాలపై ఎంతోకొంత ప్రభావం తప్పక ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. (చదవండి: గర్భం రాకుండా పరికరం ఇంప్లాంట్ చేస్తే..నేరుగా గుండెల్లోకి దూసుకుపోయి..) -
నాకిప్పుడు మూడోనెల, ఆ రిస్క్ ఉండకూడదంటే..?
నాకిప్పుడు మూడో నెల. బరువు 96 కేజీలు. మూడో కాన్పు. మొదటి రెండు కాన్పులు సిజేరియనే. రెండో కాన్పు అప్పుడు అనెస్తీషియా రిస్క్ ఎక్కువగా ఉండింది. ఈసారి ఆ రిస్క్ లేకుండా ఏం చేయాలో దయచేసి చెప్పగలరు. – రమణి విశ్వం, పిడుగురాళ్ల మీ ఎత్తు, బరువును బట్టి బాడీ మాస్ ఇండెక్స్.. బీఎమ్‌ఐని కాలిక్యులేట్ చేస్తారు. బాడీ మాస్ ఇండెక్స్ సాధారణంగా 20– 25 మధ్య ఉంటే ప్రెగ్నెన్సీ, ప్రసవమప్పుడు సమస్యలు తక్కువగా ఉంటాయి. బీఎమ్ఐ 30 కన్నా ఎక్కువ ఉన్నవారిలో ప్రెగ్నెన్సీ, అనెస్తీషియా, రికవరీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందే 5–10 శాతం బరువు తగ్గితే ప్రయోజనం ఉంటుంది. ఇప్పడు మీకు మూడోనెల అంటున్నారు కాబట్టి మీ బీఎమ్ఐ కాలిక్యులేట్ చేసి 30 కన్నా ఎక్కువ ఉంటే ఫ్యామిలీ హిస్టరీ, బీపీ, సుగర్ వంటి పరీక్షలన్నీ చేసి.. ఫలితాలను నిర్ధారించి.. ప్రెగ్నెన్సీలోనే రక్తం పలుచబడడానికి మాత్రలు స్టార్ట్ చేస్తారు. దీనివల్ల మీకు డెలివరీ.. సర్జరీ సమయంలో డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డకట్టే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది. మల్టీవిటమిన్స్, విటమిన్ డీ3, కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తారు. అంతేకాదు ప్రెగ్నెన్సీ సమయంలో క్రమం తప్పకుండా చేసే వ్యాయామాలూ నేర్పిస్తారు. మీరు నిర్ధారిత బరువుకు రావడానికి డైట్ కౌన్సెలింగ్కీ వెళ్లాలి. లెగ్ మజిల్ మూవ్మెంట్ ఎక్సర్సైజెస్, మసాజ్లను సూచిస్తారు. కంప్రెషన్ స్టాకింగ్స్ అనే సాక్స్‌లను కాళ్లకు వేసుకోవాలి. ప్రసవం తరువాత మీ బరువును బట్టి రక్తం పలుచబడడానికి వారం నుంచి పది రోజుల దాకా ఇంజెక్షన్స్‌ను ఇస్తారు. దీనివల్ల ఛాతీ, కాళ్లలో బ్లడ్ క్లాట్ అయ్యే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది. అనెస్తీషియా రిస్క్ కూడా తగ్గుతుంది. పూర్తి శరీరానికి ఇచ్చే జనరల్ అనెస్తీషియాకన్నా కూడా నడుముకు ఇచ్చే రీజనల్ అనెస్తీషియాలోనే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అధిక బరువు ఉన్న వారిలో మెడలో ఉండే థిక్నెస్ వల్ల శ్వాస సంబంధమైన, స్లీప్ ఆప్నియా సమస్యలు తలెత్తుతాయి. ఇవి జనరల్ అనెస్తీషియాలో ఇబ్బందులు కలిగిస్తాయి. ఏ అనెస్తీషియా ఇవ్వాలి అనేది తొమ్మిదవ నెలలోనే అనెస్తెటిస్ట్ (మత్తు డాక్టర్) చూసి కౌన్సెల్ చేస్తారు. అధిక బీఎమ్‌ఐలో ఆక్సిజన్ అవసరాలు పెరుగుతాయి. అనెస్తీషియా సమయంలో ఆ జాగ్రత్త తీసుకుంటారు. బీఎమ్ఐ అధికంగా ఉంటే కొన్ని పెయిన్ రిలీఫ్ మందులు సరిగా పనిచేయవు. హైరిస్క్ అనెస్తీషియా టీమ్ ఈ విషయాలను గమనించి.. అనెస్తీషియా తర్వాత సమస్యలు రాకుండా చూస్తుంది. మీరు పౌష్టికాహారం తీసుకుంటూ.. తగిన వ్యాయామం చేస్తూ క్రమం తప్పకుండా చెకప్స్‌కి వెళుతూ.. ఈసారి ప్రసవమప్పుడు రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: అర్జున బెరడు గురించి విన్నారా? సైన్సు ఏం చెబుతుందంటే..) -
అమెరికా ఖలిస్థానీలకు ఎఫ్‌బీఐ హెచ్చరికలు
న్యూయార్క్: కెనడాలో హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత అమెరికాలోని ఖలిస్థానీలకు ఎఫ్‌బీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఖలిస్థానీ నేతల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొంది. ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియనందున జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు అమెరికా ఖలిస్థానీ నేతలు చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సుర్రే గురుద్వారాలో ఉండగా.. కాల్పులు జరిపి నిజ్జర్‌ను హత్య చేశారు. ఈ కేసులో భారత్-కెనడా మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే.. నిజ్జర్ హత్య తర్వాత ఎఫ్‌బీఐ అమెరికా ఖలిస్థానీలను హెచ్చరించింది. నిజ్జర్ హత్య తర్వాత ఇద్దరు ఎఫ్‌బీఐ అధికారులు తనను కలిసినట్లు అమెరికన్ సిక్కుల కోఆర్డినేటర్ ప్రతిపాల్ సింగ్ తెలిపారు. ప్రమాదం పొంచి ఉందని సూచించారు. జాగ్రత్తగా ఉండాలని కోరారు. తనతోపాటు మరో ఇద్దరు సిక్కు నేతలను కూడా ఎఫ్‌బీఐ అధికారులు కలిశారు. నిజ్జర్ హత్యకు ముందే హెచ్చరికలు.. నిజ్జర్ హత్యకంటే ముందే కెనడాలో సిక్కు నేతలను నిఘా వర్గాలు హెచ్చరించాయంట. ఈ విషయాన్ని బ్రిటీష్ కొలంబియా గురుద్వారా కౌన్సిల్ ప్రతినిధి మోనిందర్ సింగ్ తెలిపారు. సిక్కు నేతల ప్రాణాలకు ముప్పు ఉందని అంతకంటే ముందే సమాచారం అందిందని ఆయన వెల్లడించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌పై ఎన్ఐఏ అప్పట్లో కేసులు నమోదు చేసింది. అతనిపై రూ.10 లక్షల రివార్డ్‌ను కూడా ప్రకటించింది. మోహాలీలోని కోర్టులో అతనిపై ఛార్జీషీటు దాఖలు చేసింది. అయితే.. ఆయన్ను జూన్ 18న దుండగులు హత్య చేశారు. ఈ కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఇరు దేశాల మధ్య వివాదాస్పదంగా మారింది. నిజ్జర్ హత్య తర్వాత ఖలిస్థానీ మరో ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆస్తులను ఎన్ఐఏ జప్తు చేసింది. పన్నూన్ 'జస్టిస్ ఫర్ సిక్' అనే అమెరికా ఆధారిత సంస్థకు చీఫ్‌గా ఉన్నాడు. చంఢీగర్, అమృత్సర్లోనూ ఈ సంస్థ కార్యకలాపాలు నడిచాయి. ఉపా చట్టం కింద భారత్ అతన్ని ఉగ్రవాదిగా గుర్తించింది. ఇదీ చదవండి: కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన -
1950 నుంచే పెనుముప్పు శకం ఆరంభం
భూగోళంపై గతంలో ఎన్నడూ కనిపించని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. కాలుష్యం, భూతాపం, వాతావరణ మార్పులు పెరిగిపోతున్నాయి. రుతువులు గతి తప్పుతున్నాయి. ఒకవైపు భీకర వర్షాలు, వరదలు, మరోవైపు నిప్పులు కక్కే ఎండలు సర్వసాధారణంగా మారాయి. మొత్తం పుడమి ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. అయితే, మానవుల నిర్వాకం వల్ల భూమిపై అవాంఛనీయ ఈ పరిణామం ఎప్పుడు మొదలైందో తెలుసా? 1950 నుంచి 1954 మధ్య మొదలైందని ‘ఆంథ్రోపొసీన్ వర్కింగ్ గ్రూప్’ సైంటిస్టులు గుర్తించారు. భూమాతను ప్రమాదంలోకి నెట్టివేసే కొత్త శకానికి అదొక ఆరంభమని అంటున్నారు. ఈ పరిణామానికి ఆంథ్రోపొసీన్ అని నామకరణం చేశారు. మనిషి, నూతన అనే అర్థాలున్న గ్రీక్ పదాలతో ఈ కొత్త పదం ఏర్పడింది. మొదట దీనిని 2000 సంవత్సరంలో పాల్ క్రట్జెన్, యూగీన్ స్టార్మర్ అనే శాస్త్రవేత్తలు ఉపయోగించారు. దీనిని ప్రస్తుత ‘జియోలాజికల్ టైమ్ ఇంటర్వెల్’గా పరిగణిస్తున్నారు. ‘ఆంథ్రోపొసీన్ వర్కింగ్ గ్రూప్’ సైంటిస్టులు ఇంకా ఏం చెప్పారంటే.. ► ఆంథ్రోపొసీన్లో భాగమైన పరిణామాలు, మార్పులు 1,000 లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగుతాయి. ► ఇవి మొత్తం భూమి ఆవరణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. కొన్ని మార్పులు ప్రభావం భూమిపై శాశ్వతంగా ఉంటుంది. ► శిలాజ ఇంధనాల వాడకం, అణ్వాయుధాలను ఉపయోగించడం, పొలాల్లో రసాయన ఎరువుల విచ్చలవిడి వినియోగం, భూమితోపాటు నదులు, చెరువుల్లో ప్లాస్లిక్ వ్యర్థాలు పెరగడం వంటివి ఆంథ్రోపొసీన్‌కు కారణమవుతున్నాయి. ► మానవుల చర్యల భూమికి జరుగుతున్న నష్టం అనూహ్యంగానే ఉందని, ఈ నష్టం రానురాను మరింత పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్‌కు చెందిన జియాలజిస్ట్ కోలిన్ వాటర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ► సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం బలమైన గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టడం వల్ల రాక్షస బల్లులు అంతరించిపోయాయి. ఇప్పుడు మానవ చర్యలు సైతం అదే కేటగిరీకి సమానంగా ఉన్నాయి. 1950వ దశకం తర్వాత భూగోళంపై ఎన్నో రకాల జీవులు అంతరించిపోయాయి. ► గ్రహ శకలాలు ఢీకొట్టడం అనేది ఒక కొత్త శకానికి దారితీసింది. మనుషుల కార్యకలాపాలు కూడా భూమిపై కొత్త శకానికి నాంది పలికాయి. ► ఇప్పటికైనా మేల్కొని నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలు తలెత్తుతాయనడంలో సందేహం లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈవీ జోరు.. బీమా లేదంటే బేజారు!
అతని పేరు శివకుమార్ (40). 2022 ఏప్రిల్‌లో ఓ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ముచ్చటపడి కొనుగోలు చేశాడు. ఆ స్కూటర్ డిటాచబుల్ బ్యాటరీ ఆప్షన్‌తో ఉంది. దాంతో బ్యాటరీని తీసి తన బెడ్రూమ్లోనే రాత్రి చార్జింగ్ పెట్టాడు. అదే బెడ్ రూమ్‌లో శివకుమార్, అతడి భార్యాపిల్లలు నిద్రించారు. అర్ధరాత్రి బ్యాటరీ నుంచి మంటలు వచ్చి గది అంతటా వ్యాపించాయి. ఈ మంటలకు శివకుమార్ ప్రాణాలు కోల్పోగా, భార్యా పిల్లలు గాయాలపాలయ్యారు. ఆ మధ్య ప్రముఖ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటలకు ఆహుతి కావడం తెలిసిందే. అంతెందుకు ముంబైలో ఓ ప్రముఖ కంపెనీ కారు పార్క్ చేసి ఉండగా, ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. నిజానికి కంబషన్ ఇంజన్‌తో కూడిన వాహనాల్లో అగ్ని ప్రమాదం జరగదని కాదు. కానీ, చాలా చాలా అరుదు. అదే ఎలక్ట్రిక్ వాహనాల్లో (ఈవీలు) అయితే బ్యాటరీ సిస్టమ్‌లో లోపాల వల్ల అగ్ని ప్రమాద రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మరి ఈ అగ్ని ప్రమాదాలకు వాహన బీమాలో కవరేజీ ఉంటుందా? వేటికి అసలు కవరేజీ వస్తుంది? తదితర అంశాలపై అవగాహన కల్పించే కథనమే ఇది. ప్రస్తుతం మోటారు వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్‌ను తప్పకుండా తీసుకోవాలి. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల)కు సైతం ఇదే నిబంధన వర్తిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌కు కొత్త. ఇంత కాలం ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) వాహనాలే ఉండడంతో బీమా ఉత్పత్తులు వీటికి అనుగుణంగానే తయారయ్యాయి. వీటినే బీమా సంస్థలు ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లకు సైతం జారీ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు రెండు రకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ కాంప్రహెన్సివ్ పాలసీలు ఒక రకం. ఓన్ డ్యామేజ్ తోపాటు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌తో కూడిన సమగ్ర బీమా ఇది. మోటారు ఇన్సూరెన్స్ విభాగంలోకి రాని తక్కువ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలకు అస్సెట్ ఇన్సూరెన్స్ పాలసీలను బీమా సంస్థలు విక్రయిస్తున్నాయి. ఇవి ప్రమాద నష్టాలను భర్తీ చేస్తాయి. ‘‘25 కిలోమీటర్లకు పైగా వేగంతో నడిచే అన్ని రకాల ఈవీలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఓన్ డ్యామేజీ కవరేజీ అనేది కేవలం వాహనదారు ఇష్టం మేరకు తీసుకోవచ్చు. అదే 25 కిలోమీటర్ల కంటే తక్కువ వేగం కలిగిన ఈవీలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరి కాదు. కానీ, వాహనదారులు తమ వాహనాలకు సరైన రక్షణ కలి్పంచుకునేందుకు వీలుగా సరిపడా బీమా రక్షణను తీసుకోవాలని మేము సూచిస్తాం’’అని డిజిట్ ఇన్సూరెన్స్ చీఫ్ డి్రస్టిబ్యూషన్ ఆఫీసర్ ఆదర్శ్ అగర్వాల్ తెలిపారు. అన్నింటికీ కాదు.. బీమా ఉన్నంత మాత్రాన వాహనంలో ఏ నష్టం జరిగినా బీమా వస్తుందని భావించడానికి లేదు. ఈవీకి ఇది సరిగ్గా వర్తిస్తుంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) కంటే ఈవీలు భిన్నంగా తయారవుతాయి. ముఖ్యంగా ఈవీలో ఒక్క బ్యాటరీ ధరే మొత్తం వాహనం ధరలో 40 శాతం మేర ఉంటుంది. ‘‘ఇప్పటికీ మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా చాలా తక్కువ. భారీ సంఖ్యలో అమ్మకాలు పెరిగితే తప్ప వాటికి ఎదురయ్యే నష్టాలను విశ్లేషించలేము. తగినంత డేటా, క్లెయిమ్స్ అనుభవం ఉన్నప్పుడే ఈవీలకంటూ ప్రత్యేకమైన పాలసీలను తీసుకురావడం సాధ్యపడుతుంది’’అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ టీఏ రామలింగం తెలిపారు. టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ కొంత కాలం క్రితం ఈవీల కోసమే ప్రత్యేకమైన పాలసీని రూపొందించినట్టు ప్రకటించింది. ‘ఆటో సెక్యూర్ ఈ వెహికల్ కాంప్రహెన్సివ్ పాలసీ’ పేరుతో తీసుకొచ్చిన ప్లాన్‌లో ఓన్ డ్యామేజీతోపాటు ఎలక్ట్రిక్ బ్యాటరీ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినా కవరేజీ అందులో భాగంగా ఉంది. కానీ, ఇప్పటికీ ఇది మార్కెట్లోకి రాలేదు. బ్యాటరీకి లేదు రక్షణ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈవీ పాలసీల్లో పెద్ద లోపం ఉంది. బ్యాటరీ ఒక్కటే డ్యామేజ్ అయితే పరిహారం రాదు. మొత్తం వాహనం డ్యామేజ్ అయితేనే బీమా సంస్థలు క్లెయిమ్‌లు ఆమోదించి పరిహారం చెల్లిస్తున్నాయి. ‘‘వాహన విడిభాగాలు విఫలమైతే మోటారు ఇన్సూరెన్స్ పాలసీల్లో కవరేజీ ఉండదు. సంప్రదాయ పాలసీల్లో అయితే ప్రమాదం వల్ల, అల్లర్లు, దోపిడీలు, వరదల వల్ల వాహనం, దాని విడిభాగాలకు నష్టం జరిగితే పరిహారం వస్తోంది’’అని గల్లాగర్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రాక్టీస్ లీడర్ ఎన్ భోజరాజన్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనంలో ఖరీదైన బ్యాటరీని ఎవరైనా ఎత్తుకుపోయాంటే క్లెయిమ్‌ను బీమా సంస్థలు ఆమోదించకపోవచ్చు. ఈవీలకు బ్యాటరీ అత్యంత కీలకం కనుక బ్యాటరీ ఒక్కదానికే కవరేజీ ఇచ్చే పాలసీల అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘బ్యాటరీలు, చార్జింగ్ ఎక్విప్మెంట్కు ఉద్దేశించిన ప్రత్యేకమైన పాలసీలు అవసరం. ఈవీ చార్జింగ్ సదుపాయాలతో ముడిపడిన రిస్క్‌ల కారణంగా ఈవీలు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. ప్రమాదాల వల్లే నష్టం జరగాలని లేదు. బ్యాటరీ చార్జింగ్ సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం వాటిల్లితే బ్యాటరీతోపాటు, కనెక్టర్కూ నష్టం జరుగుతుంది. సంప్రదాయ పాలసీలో బ్యాటరీతోపాటు వాహనం కూడా అగి్నకి ఆహుతి అయితే తప్ప క్లెయిమ్‌ను ఆమోదించవు’ అని భోజరాజన్ వివరించారు. అందుకే ఈవీలకే ఉద్దేశించిన ప్రత్యేక పాలసీల అవసరం ఉందని అన్నారు. మనం ఏమి చేయగలం? బీమా సంస్థలు పెరుగుతున్న ఈవీ మార్కెట్‌ను అర్థం చేసుకుంటున్నాయి. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాల తరమే కనుక ఈవీల కోసం ప్రత్యేక పాలసీలకు రూపకల్పన చేస్తున్నాయి. కనుక వాహనదారులు అన్ని బీమా సంస్థలను సంప్రదించిన తర్వాతే పాలసీని ఎంపిక చేసుకోవాలి. బ్యాటరీ కవరేజీతో కూడిన ప్లాన్‌ను ఏదైనా సంస్థ ఆఫర్ చేస్తే ఎంపిక చేసుకోవడం మెరుగు. ప్రీమియం కొంచెం ఎక్కువైనా, బ్యాటరీ కవరేజీతో కూడిన ప్లాన్‌ను తప్పక తీసుకోవాలన్నది నిపుణుల సూచన. మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న కొద్దీ బీమా సంస్థలు కూడా ఈవీల కోసమే ఉద్దేశించిన ఎన్నో ఫీచర్లతో పాలసీలను అందుబాటులోకి తెస్తాయి. కేవలం థర్డ్ పార్టీ డ్యామేజ్ కాకుండా ఓన్ డ్యామేజ్ కవరేజీతో కూడిన కాంప్రహెన్సివ్ పాలసీకే ప్రాధాన్యం ఇవ్వాలి. రైడర్లను కూడా యాడ్ చేసుకోవడాన్ని పరిశీలించాలి. డిప్రీసియేషన్ కవర్, గ్యాప్ వ్యాల్యూ కవర్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ తీసుకోవాలని లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ ప్రెసిడెంట్ ఉదయన్ జోషి సూచించారు. ముఖ్యంగా ఈవీ వాహనదారులు రిటర్న్ టు ఇన్వాయిస్ రైడర్‌ను తీసుకోవాలని పాలసీబజార్ మోటార్ రెన్యువల్స్ హెడ్ అశ్విని దూబే సూచించారు. ఈ రైడర్‌తో వాహనం ఇన్వాయిస్ విలువ మేర పరిహారం పొందొచ్చన్నారు. కారు చోరీకి గురైనా లేక రిపేర్ చేయడానికి అనుకూలంగా లేని రీతితో దెబ్బతిన్నా లేక అగ్ని ప్రమాదంతో మొత్తం నష్టం వాటిల్లినప్పుడు ఈ రైడర్ కింద పరిహారం వస్తుందన్నారు. పాలసీ కొనుగోలుకు ముందే వేటికి కవరేజీ వస్తుంది, వేటికి మినహాయింపు ఉన్నదీ తప్పకుండా అడిగి తెలుసుకోవాలి. ప్రీమియం భారం అనుకోవద్దు.. ఈవీలకు ఇచ్చే బీమా పాలసీల ప్రీమియం ఎక్కువగా ఉంటుందనుకోవడం పొరపాటు. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వాహనాల కంటే ఈవీలకు థర్డ్ పార్టీ కవర్ 15% వరకు తక్కువ. ‘‘ఐసీఈ వాహనాలతో పోలిస్తే ఈవీ కార్లు, బైక్‌లకు కాంప్రహెన్సివ్ కవరేజీ ప్రీమియం 5–20% వ్యత్యాసంతో ఉంటోంది. ఓన్ డ్యామేజ్ కవరేజీలోనూ స్వల్ప వ్యత్యాసం ఉంటోంది. ఏడాది కాలానికి 30 కిలోవాట్ అవర్ ఎలక్ట్రిక్ కారుకు థర్డ్ పార్టీ ప్రీమియం రూ.2,000 స్థాయిలో ఉంది. అదే ఐఈసీ వాహనాలకు (1,000 సీసీ మించని) ప్రీమియం మరో రూ.200 వరకు అటూ ఇటూగా ఉంటోంది. ‘ఈవీలకు ప్రీమియం, బీమా సంస్థ ధరల విధానంపైనే ఆధారపడి ఉంటుంది. ఈవీ తయారీ, మోడల్, బ్యాటరీ సామర్థ్యం, ప్రాంతం, వాహనం వయసు వంటి అంశాలు ప్రీమియం ధరపై ప్రభావం చూపిస్తాయి’ అని ఉదయన్ జోషి వెల్లడించారు. ఈవీలకు సంబంధించి మరిన్ని క్లెయిమ్‌లు వస్తే కానీ, ప్రీమియం మెరుగ్గా మారగలదన్నారు. ఈవీలకు ఉన్న రిస్‌్కల నేపథ్యంలో వాటికంటూ ప్రత్యేకమైన ఉత్పత్తులు తీసుకువచ్చేందుకు ఐఆర్డీఏఐ సైతం బీమా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. -
ఇంట్లో పెద్ద తాచుపాముంటే.. ప్రశాంతంగా, నిబ్బరంగా ఉండగలమా!
జీవితంలో కొన్ని వదిలించుకుని తీరవలసినవి, ఎన్ని సర్దుబాట్లుచేసుకుని అయినా వదలకూడనివి కొన్ని ఉంటాయి... వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుని తదనుగుణంగా దిద్దుకోకపోతే పచ్చటి జీవితాలు పాడయిపోతాయి, మోడయిపోతాయి. అందులో మొదటగా స్నేహితుడు.. అదీ ఆత్మీయుడు, ప్రాణసముడు.. అని నమ్మి మనం మన కష్టం, సుఖం, బాధలు, ఇబ్బందులు, బలహీనతలు అన్నీ మనసు విప్పి ఏవీ దాచుకోకుండా చెప్పేసుకుంటాం. ఇవన్నీ తెలుసుకుని మనల్ని మోసం చేయడానికి అతను కనిపెట్టుకుని ఉన్నాడు... అని తెలిసినప్పుడు మీరెంత ప్రమాదంలో ఉన్నారో ఊహించుకోండి. మీరు వెంటనే అప్రమత్తం కావాలి. దిద్దుబాటు చర్యలు చేపట్టాలి... సాధ్యం కానప్పుడు దూరంగా పెట్టడానికి సందేహించకూడదు. అలాగే భృత్యుడు... సేవకుడికి వినయం ఉండాలి. యజమానిపట్ల గౌరవభావం ఉండాలి. ఆయన చెప్పిన ఆదేశాలను పాటించడం తన విధిగా అనుకోవాలి. తనసేవలతో యజమానిని మెప్పించడానికి ప్రయత్నం చేస్తుండాలి. అలా కాక యజమానికన్నా తాను ఎక్కువ చదువుకున్నవాడిననీ, దేనిలోకూడా ఆయనకేమీ తాను తీసిపోననీ, ఆయన మాటలు నేను వినేదేమిటనే సేవకుడు... యజమానిని ఎప్పుడూ తిరస్కార భావంతోనే చూస్తుంటాడు. అటువంటి భృత్యుడిని సంస్కరించగల శక్తి ఉంటే సంస్కరించగలగాలి... అది సాధ్యంకానప్పుడు వదిలించుకోవాలి. కపటి అయిన మిత్రుడు, అహంకారి అయిన భృత్యుడు మృత్యువుతో సమానం. ఇంట్లో పెద్ద తాచుపాము దూరింది.. ఇంట్లోనే ఎక్కడో ఉంది.. రోజుకు నాలుగైదు సార్లు కనిపిస్తున్నది. ఏదో దానిమానాన అది ఉందని ప్రశాంతంగా, నిబ్బరంగా ఇంట్లో ఉండగలమా... ఇవి కూడా అంతే... ఇక ... ఒకసారి అనుబంధం ఏర్పడిన తరువాత ఎన్ని అవాంతరాలు, ఎంత మానసిక క్లేశం ఎదురవుతున్నా సర్దుబాటు చేసుకుంటూ, చివరిదాకా కొనసాగించాల్సిన బంధం – దాంపత్య బంధం. ఇద్దరూ కలిసి చెయ్యిచెయ్యిపట్టుకుని ప్రస్థానం చేయాలి. ఎవరు ఎవరి చేయి పట్టుకున్నారు, ఎవరు ఎవరిని కాపాడుకోవాలి.. అనేది ఆయా సందర్భాలను బట్టి ఉంటుంది. ఉదాహరణకు... ఒక చిన్న పిల్లను తీసుకుని తండ్రి నడిచి వెడుతున్నాడు. ‘అమ్మా! మనం నడుస్తున్న ప్రదేశం అంత మంచిది కాదు. కొండమీద నడుస్తున్నాం. జారితే ప్రమాదం. నా చేయి గట్టిగా పట్టుకో..’ అన్నాడు. దానికి ఆ పిల్ల .. ‘‘వద్దు నాన్నగారూ, నేను మీ చేయి పట్టుకున్నాననుకోండి. జారిపోవడం ఎంత ప్రమాదకరమో, మీ చేయి విడిచి పెట్టేయడం కూడా అంతే ప్రమాదకరం కావచ్చు. అందుకని నేను మీ చేయి పట్టుకోను. మీరే నా చేయి పట్టుకోండి. అప్పుడు ఎంత ప్రమాదం వచ్చినా మీరు నా చేయి వదలరు.. అది నా నమ్మకం’’ అన్నది. ఆ నమ్మకం ఎంత గొప్పది. ఇది భార్యాభర్తలమధ్య జీవితాంతం అలాగే ఉండాలి... ఒకరికొకరు బాసటగా. అంతే తప్ప ఎవరి చేయి ఎవరు ఎప్పుడు పట్టుకోవాలో వాళ్ళకే తెలియకపోతే... వాళ్ల మధ్యే అభిజాత్యాలు, అహంకారాలు పుడితే, ఆ దాంపత్యం ఏం వర్ధిల్లుతుంది, దానివల్ల ఏ ప్రయోజనం సిద్ధిస్తుంది... ఇవి చిన్న చిన్న విషయాల్లాగానే కనిపిస్తాయి. తరువాత చూసుకోవచ్చులే అని కాక .. సమస్య మొదలయిందని గుర్తించిన మరుక్షణం దృష్టి పెట్టి దిద్దుకుని జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలి. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నేను ప్రెగ్నెంట్‌ని.. ఆ మాత్రలు వాడుతున్నా? బిడ్డకు ఏదైనా ప్రమాదమా?
నేను ప్రెగ్నెంట్‌ని. ఇప్పుడు మూడో నెల. రక్త హీనత ఉందని నాకు మాత్రలు ఇచ్చారు. దీనివల్ల బిడ్డకు ఏదైనా ప్రమాదం ఉంటుందా? – ప్రమోద, నెల్లూరు హీమోగ్లోబిన్ పదకొండు గ్రాముల కన్నా తక్కువ ఉన్నప్పుడు మొదటి మూడు నెలల్లోనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏడవ నెల నుంచి ప్రసవం వరకు కనీసం 10.5గ్రాములు ఉండాలి. ఇది బ్రిటిష్ కమిటీ ఫర్ స్టాండర్డ్ ఇన్ హెమటాలజీ గైడ్‌లైన్స్ ప్రకారం ప్రెగ్నెన్సీ.. ప్రసవంలో కూడా ఫాలో కావాలి. ప్రసవం తరువాత పది గ్రాముల కన్నా తక్కువ ఉంటే కచ్చితంగా మాత్రలు ఇవ్వాల్సిందే. రక్తహీనత వల్ల ప్రెగ్నెన్సీ సమయంలోనే కాదు ప్రసవం తర్వాతా చాలా సమస్యలు వస్తాయి. ఓరల్ థెరపీ అంటే ఓరల్ ఐరన్ మాత్రలను ముందుగా రెండువారాల పాటు ఇస్తారు. వాటితో హిమోగ్లోబిన్ కనుక పెరిగితే తర్వాత మాత్రలను వాడాల్సిన అవసరం ఉండదు. ప్రెగ్నెన్సీలో అందరికీ 28 వారాలకు సీబీపీ .. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ రక్త పరీక్ష చేయాలి. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీకి హీమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫొరీసస్ అనే రక్తపరీక్షనూ తప్పకుండా చేయించాలి. ఈ టెస్ట్ ద్వారా పుట్టుకతో వచ్చే జెనెటిక్ సమస్యలు సికిల్ సెల్ అనీమియా, తలసీమియావంటి వ్యాధులను.. క్యారియర్ స్టేటస్‌ని కనిపెట్టవచ్చు. ఈ వ్యాధులు/క్యారియర్స్‌గా ఉన్నవారికి ఓరల్ థెరపీతో, డైట్‌తోనే మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అలా తీసుకుంటేనే అసిడిటీ సమస్యలు తగ్గుతాయి ఐరన్ పెరగడానికి ఇంజెక్షన్ ఇవ్వకూడదు. అలాచేస్తే వాళ్లకు ఐరన్ ఓవర్‌లోడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే మీకు ఆ బ్లడ్ టెస్ట్ చేసి చికిత్స మొదలుపెట్టటం మంచిది. ఈ వైద్య పరీక్షలో కేవలం ఐరన్ లోపం మాత్రమే ఉందని తేలితే అప్పుడు ఐరన్ స్టడీస్ చేస్తారు. సరైన ప్రిపరేషన్‌తో చికిత్స చేస్తే ఈ ఐరన్ లోపం సమస్య త్వరగా తగ్గిపోతుంది. ఈ ఐరన్ మాత్రలను విటమిన్ సీతో గానీ, సిట్రస్ ఫ్రూట్ జ్యూసెస్‌తో గానీ తీసుకుంటే ఆ మాత్రలను శరీరం త్వరగా గ్రహిస్తుంది. అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. ఐవీ ఐరన్ ఇంజెక్షన్స్ కూడా పనిచేస్తాయి. కొంతమందికి కిడ్నీ పరీక్షలనూ సూచిస్తారు. రేనల్ అనీమియా అనేదాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో హీమోగ్లోబిన్ 8 గ్రాముల కంటే తక్కువగా ఉంటే పేషంట్ పరిస్థితిని బట్టి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇస్తాం. మొదటి మూడునెలల్లో హీమోగ్లోబిన్ పదకొండు గ్రాముల కన్నా తక్కువగా ఉంటే హెమటాలజిస్ట్ / ఫిజీషియన్‌ను సంప్రదించి డైట్, ఐరన్ మాత్రలతో చికిత్స మొదలుపెట్టడం వల్ల ఇటు బిడ్డకు, అటు తల్లికి వచ్చే సమస్యలను నివారించగలుగుతాం. తలనొప్పి, శ్వాస ఆకడపోవడం.. అనీమియాతో బాధపడుతున్న తల్లిలో.. నీరసం, పాల్పిటేషన్స్, తలనొప్పి.. వంటివి ఎక్కువ. శ్వాస ఆడకపోవడం.. కాళ్ల వాపులూ రావచ్చు. బిడ్డ పుట్టిన తరువాత హీమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండొచ్చు. ప్రసవం తరువాత పాస్ట్పార్టమ్ హేమరేజ్, అబ్రప్షన్ చాన్సెస్ పెరుగుతాయి. అందుకే రక్తహీనతను గుర్తించిన వెంటనే దానికి చికిత్సను అందించాలి. మాత్రలు ఇవ్వాలి. ఒకవేళ దద్దుర్లు వంటి రియాక్షన్ ఏదైనా వస్తే వేరే ప్రిపోజిషన్ని ప్రయత్నించాలి. ఇలా రక్తహీనతకు తగిన చికిత్సతో తల్లి ఆరోగ్యాన్ని కాపాడ్డమే కాదు పండంటి బిడ్డనూ కనొచ్చు. (చదవండి: నేరాలను తగ్గించేలా.. సరికొత్త అత్యాధునిక జైలు) -
Diabetes: పేషెంట్స్‌కి ఈ వ్యాధుల ఎటాక్ అయితే..డేంజర్లో ఉన్నట్లే..
మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటీస్ అని కూడా పిలిచే ఈ వ్యాధి ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం. ఇది వస్తే పేషెంట్లు ఎలా ఉంటారనే దాని గురించి అందరికి తెలిసిందే. దీనికి పూర్తిగా నివారణ లేదు గానీ కొన్ని జాగ్రత్తలు, ఆరోగ్య నియమాలను పాటించడం ద్వారా మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవడమే గాక సులభంగా బయటపడవచ్చు. ఐతే ఈ డయాబెటిస్ పేషెంట్లకి రోగ నిరోధక శక్తి తగ్గిపోయే అవకాశం ఉన్నందున కొన్ని రకాల అంటువ్యాధుల వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధుల వచ్చాయి అంటే మీరు డేంజర్లో ఉన్నట్లు అర్థం. సత్వరమే మేల్కోని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాంతకం కాకుండా చూసుకోవచ్చు. డయాబెటిస్ రోగులుకు సాధారణంగా వచ్చే అంటువ్యాధులు నేషనల్ లైబ్రెరీ ఆప్ మెడిసినల్ అధ్యయనాల ప్రకారం..పేషెంట్లో ఆరు శాతం మంది ఇన్ఫెక్షన్ల సంబంధింత వ్యాధుల కారణంగా ఆస్పత్రుల చేరి మరణాల వరకు సంభవించిన కేసులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ఎముకలు, కీళ్ల ఇన్ఫక్షన్లకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పాదాలలో చలనం తగ్గి గాయమైన తెలయకపోవడం. ఆ తర్వాత క్రమంగా అది పెద్దదిగా మారి దాని నుంచి శరీరమంతా ఇన్ఫక్షన్ వ్యాపించి ప్రాణాంతకంగ మారిని కేసులు ఎక్కువే. ఆయా రోగులకు అంత్యభాగంలో రక్తప్రసరణ సరిగా జరగదు. దీంతో ఆయా ప్రాంతాల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే ఏదైన వ్యాధి వస్తే ఈజీగా ఇన్షక్షనే అయ్యే ప్రమాదం ఎక్కువ. రకరకాల చర్మ సమస్యలు వచ్చినా మధుమేహం ఎక్కువగా ఉంది అనడానికి ప్రధమ సంకేతం గోరుచుట్టు, యూరినరీ ఇన్ఫక్షన్లు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. చెవి, ముక్కు, గొంతు ఇన్ఫక్షన్లు వచ్చిన సాధారణంగా భావించొద్దు. అలాగే స్త్రీలల్లో జననేంద్రియాలలో ఏదైన ఇన్ఫక్షన్ల వచ్చిన తేలికగా తీసుకోవద్దు. లైంగికంగా సంక్రమించే వ్యాధుల మాదిరిగా ఉంటాయి. అందువల్లే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాడం ఉత్తమం. (చదవండి: కొబ్బరినీళ్లతో ఇన్ని ప్రయోజనాలా?.. మరి డయాబెటిక్ పేషెంట్స్ తాగొచ్చా?) -
ఫండ్ రివ్యూ: ఈ ఫండ్‌తో రిస్క్ తక్కువ.. మెరుగైన రాబడులు
ఈక్విటీలు ఇటీవల రెండు నెలల కాలంలో ర్యాలీ చేసి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి సమీపానికి చేరుకున్నాయి. ఈ సమయంలో మార్కెట్లోకి ప్రవేశించడం రిస్క్‌గా ఇన్వెస్టర్లు భావించొచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే అని కాదు, ఏ సమయంలో అయినా పెట్టుబడులు పెట్టుకునేందుకు అనుకూలమైన విభాగమే బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్. మార్కెట్ పరిస్థితులు, వడ్డీ రేట్లు, స్థూల ఆర్థిక అంశాలకు అనుగుణంగా ఈక్విటీ, డెట్ విభాగాల మధ్య కేటాయింపులు మారుస్తూ, రిస్క్ తగ్గించి మెరుగైన రాబడులు ఇచ్చే విధంగా ఇవి పనిచేస్తుంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ టాప్ పనితీరు చూపిస్తోంది. రాబడులు ఈ పథకం 16 ఏళ్ల స్థిరమైన రాబడుల చరిత్రతో బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ విభాగంలో మెరుగైన స్థానంలో ఉంది. స్టాక్స్, బాండ్స్, డెరివేటివ్స్ (హెడ్జింగ్) మధ్య కేటాయింపులు మారుస్తూ, తక్కువ రిస్క్‌తో స్థిరమైన రాబడులు అందిస్తోంది. ఈ పథకం పదేళ్ల కాలంలో చూస్తే ఏటా 13.5 శాతం చొప్పున రాబడులు అందించింది. అదే ఐదేళ్ల కాలంలో రాబడులు చూస్తే ఏటా 11 శాతానికి పైనే ప్రతిఫలాన్ని ఇచ్చింది. ఇక మూడేళ్ల కాలంలో వార్షిక రాబడులు 15 శాతానికి పైనే ఉన్నాయి. ఏడాది కాలంలో 13.72 శాతం రాబడి తెచ్చి పెట్టింది. మూడు, ఐదు, పదేళ్ల కాలంలో రాబడుల పరంగా ఈ పథకం బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ విభాగం సగటు రాబడుల కంటే మెరుగైన పనితీరు చూపించింది. 2–3 శాతం అధిక రాబడులు అందించింది. ఈ కాలంలో ఈక్విటీ కేటాయింపులు 49 శాతంగానే ఉన్నాయి. అయినా కానీ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఎంతో మెరుగైన రాబడులు అందించడాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. క్రిసిల్ హైబ్రిడ్ 50ప్లస్50 మోడరేట్ ఇండెక్స్‌ను మూడు, ఐదేళ్ల కాలం రాబడుల పరంగా ఈ పథకం అధిగమించింది. బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే వారు అచ్చమైన ఈక్విటీ పథకాల కంటే తక్కువగా, అదే సమయంలో డెట్ కంటే ఎక్కువ రాబడులు సొంతం చేసుకోవచ్చు. అంటే ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులు వీటితో సొంతం అవుతాయి. ఈ పథకంలో పదేళ్ల కాలంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎక్స్ఐఆర్ఆర్ రాబడి వార్షికంగా 11.95 శాతం చొప్పున ఉంది. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో సెబీ నిబంధనల ప్రకారం బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అన్నవి ఈక్విటీ, డెట్‌లో ఎందులో అయినా సున్నా నుంచి నూరు శాతం వరకు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అంటే పెట్టుబడుల విషయంలో వీటికి పూర్తి స్వేచ్ఛ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, స్థూల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఈక్విటీ, డెట్ విభాగాలకు కేటాయింపులు చేసుకోవడం రిటైల్ ఇన్వెస్టర్‌కు కష్టమైన పనే. ఆ పనిని ఈ పథకం చేసి పెడుతుంది. ఈక్విటీ, డెట్ మధ్య మార్పులు చేర్పులు చేస్తూ ఈ పథకం దీర్ఘకాలంలో సమర్థవంతమైన, విశ్వసనీయమైన పనితీరు చూపిస్తోంది. స్టాక్స్ అధిక విలువలకు చేరాయా? లేక చౌకగా ఉన్నాయా? అన్నది నిర్ణయించుకునేందుకు తనదైన నమూనాను ఈ పథకం అనుసరిస్తుంది. 2020 మార్చిలో సెన్సెక్స్ గణనీయంగా పడిపోయినప్పుడు నికర ఈక్విటీ పెట్టుబడులను 73.7 శాతానికి పెంచుకుంది. ఆ తర్వాత మార్కెట్ ర్యాలీ చేయడంతో 2021 నవంబర్ నాటికి ఈక్విటీ పెట్టుబడులను 30 శాతానికి తగ్గించుకుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.46,534 కోట్ల పెట్టుబడులు ఉంటే, అందులో ఈక్విటీ కేటాయింపులు 40.9 శాతంగా, డెట్ కేటాయింపులు 24 శాతంగా ఉన్నాయి. నగదు, నగదు సమానాల్లో 32.54 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లోనూ రిస్క్‌ను దాదాపు తగ్గించేందుకు 91 శాతం మేర లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. మిడ్‌క్యాప్‌నకు 8.52 శాతం కేటాయింపులు చేసింది. డెట్ విభాగంలోనూ అధిక నాణ్యత కలిగిన ఏఏఏ, ఏఏప్లస్ బాండ్లకే కేటాయింపులు ఎక్కువ చేసింది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం రిలయన్స్ ఇండస్ట్రీస్ 5.94 ఐసీఐసీఐ బ్యాంక్ 5 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.85 ఇన్ఫోసిస్ 3.66 టీవీఎస్ మోటార్ 2.81 మారుతి సుజుకీ 2.57 హెచ్డీఎఫ్సీ 2.44 భారతీ ఎయిర్టెల్ 2.44 ఎస్బీఐ 2.31 యాక్సిస్ బ్యాంక్ 1.88 -
లైఫ్ స్టయిల్ పాలసీలకు అయిదు కారణాలు
అలవాట్లు, అభిరుచులు, ఇష్టాఇష్టాలను బట్టి ప్రతి ఒక్కరికీ ఒకో జీవన విధానం...అంటే లైఫ్ స్టయిల్ ఉంటుంది. విలువైనదిగా పరిగణించే లైఫ్ స్టయిల్‌ను కాపాడుకునేందుకు అంతా ప్రయత్నిస్తుంటాము. బీమా సాధనం దీనికి కూడా ఉపయోగపడుతుంది. మీరు ఇష్టపడేవి చేజారకుండా నివారించలేకపోయినా.. అలాంటి సందర్భాల్లో వాటిల్లే నష్టాన్ని ఎంతో కొంత మేర భర్తీ చేసుకునేందుకు ఇది ఉపయోగకరంగా ఉండగలదు. మిగతా పాలసీలకు భిన్నమైన లైఫ్ స్టయిల్ బీమాను ఎంచుకోవడానికి ప్రధానంగా అయిదు కారణాలు ఉన్నాయి. ► మానసిక, శారీరక ఆరోగ్యానికి రక్షణ కోసం: ఒత్తిళ్లు, ఆందోళనలతో కూడుకున్న ప్రస్తుత ప్రపంచంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్నీ కాపాడుకోవడం చాలా కీలకంగా ఉంటోంది. సమగ్రమైన హెల్త్ ఇన్సూరెన్స్ ఇందుకు సహాయపడుతుంది. ప్రస్తుతం టెలీ కౌన్సిలింగ్, మానసిక.. శారీరక ఆరోగ్యంపై వెబినార్లు, వెల్నెస్ సెంటర్స్ .. డయాగ్నాస్టిక్ సెంటర్లకు వోచర్లు, తరచూ హెల్త్ చెకప్‌లు మొదలైన వాటికి కూడా బీమా కంపెనీలు కవరేజీనిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటిస్తే రెన్యువల్ సమయంలో ప్రీమియంపై డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లు కూడా ఇస్తున్నాయి. ► సైబర్ క్రైమ్ నుంచి రక్షణ కోసం: కరోనా మహమ్మారి ప్రబలినప్పటి నుంచి సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మోసగాళ్ల వల్ల వాటిల్లే నష్టాల నుంచి వ్యక్తిగత సైబర్ రిస్క్ పాలసీలు కాపాడగలవు. వ్యక్తిగత డేటా లేదా ప్రైవసీకి భంగం కలగడం, ఈ–మెయిల్ ఫిషింగ్, మొదలైన వాటి నుంచి రక్షణనివ్వగలవు. ► రిస్కీ క్రీడల్లో గాయాల బారిన పడితే రక్షణ: మీకు ఎంతో ఇష్టమైన క్రీడలు ఆడేటప్పుడు గాయాలబారిన పడితే రక్షణ కల్పించే విధమైన పాలసీలు ఉన్నాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్, ఎన్డ్యురెన్స్ స్పోర్ట్స్ వంటి రిస్కీ హాబీలు ఉన్న వారికీ స్పోర్ట్స్ ఇన్సూరెన్స్ కవరేజీని బీమా కంపెనీలు ఇస్తున్నాయి. క్రీడలపరంగా వివిధ రకాల గాయాలకు చికిత్స, ఫిజియోథెరపీ మొదలుకుని ప్రమాదవశాత్తూ ఏదైనా అనుకోనిది జరిగితే యాక్సిడెంటల్ డెత్ కవరేజీ వరకూ పలు అంశాలకు కవరేజీ ఉంటోంది. ప్రమాదాల బారిన పడినప్పుడు తలెత్తే వైద్య ఖర్చులు, విరిగిన ఎముకలకు చికిత్స వ్యయాలు, సాహస క్రీడలపరమైన బెనిఫిట్, ఎయిర్ అంబులెన్స్ కవరేజీ లాంటివి అదనంగా తీసుకోవచ్చు. ► పెంపుడు జంతువులకు బీమా: జంతువులను పెంచుకోవడమంటే చాలా బాధ్యతతోను, ఖర్చుతోనూ కూడుకున్న వ్యవహారం. వాటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ ఉండాలి. వెటర్నరీ ఫీజులు, వైద్యం ఖర్చులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో సమగ్రమైన పెట్ కవరేజీ ఉంటే శస్త్రచికిత్సలు .. హాస్పిటలైజేషన్ వ్యయాలు, థర్డ్ పార్టీ లయబిలిటీ మొదలైన భారాలను తగ్గించుకోవచ్చు. ► వివాహ శుభకార్యానికీ కవరేజీ: ప్రస్తుతం పెళ్లిళ్లంటే చాలా ఖర్చుతో కూడుకున్నవిగా మారిపోయాయి. అనుకోనిది ఏదైనా జరిగితే చేసిన ఖర్చంతా వృధాగా పోయే రిస్కులు ఉంటు న్నాయి. అయితే, వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌తో పెళ్లిళ్లలో ఏదైనా ప్రమాదాలు చోటు చేసుకున్నా, విలువైనవి పోయినా కవరేజీని పొందవచ్చు. అంతే కాదు, ఊహించని పరిస్థితుల వల్ల వివాహం రద్దయినా లేదా వాయిదా పడినా అప్పటి వరకూ చేసిన ఖర్చులను నష్టపోకుండా లైఫ్‌స్టయిల్ కవరేజీ కాపాడుతుంది. -
వక్రీకరించే వైఖరిని మార్చుకోమంటూ యూఎస్‌కి చైనా స్ట్రాంగ్ వార్నింగ్!
చైనా పట్ల అమెరికాకు ఉన్న వక్రీకరణ వైఖరిని మార్చుకోవాలి లేదంటే సంఘర్షణ కాస్త ఘర్షణగా మారుతుందని చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ యద్ధం విషయంలో రష్యాతో గల సన్నిహిత సంబంధాలపై తమ వైఖరిని వక్రీకరించొద్దంటూ ఆయన హెచ్చరించారు. ఎప్పటికీ చైనాను అణిచి వేయడం, అదుపు చేయడం వంటి పనుల్లో యూఎస్ నిమగ్నమవ్వుతోందంటూ క్విన్ గ్యాంగ్ ఆరోపణలు చేశారు. ఈ మేరకు బీజింగ్‌లోని వార్షిక పార్లమెంటు సమావేశం సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా పట్ల యూఎస్ అభిప్రాయాలు, అవగాహనలు వక్రీకరించి ఉన్నాయని అన్నారు. చైనాను యూఎస్ ప్రాథమిక ప్రత్యర్థిగా చేస్తోంది. దీని పర్యవసానం భౌగోళిక రాజకీయ సవాలుగా మారుతుందన్నారు. ఇది చొక్కాలోని మొదటి బటన్ని తప్పుగా పెట్టడం లాంటిదని చెప్పారు. యూఎస్ ఎప్పుడూ ఉద్రిక్తతలు, సంక్షోభాలు తలెత్తకుండా ద్వైపాక్షిక సంబంధాలతో రక్షణ కవచాలను ఏర్పరుచుకుంటుందే తప్ప సంఘర్షణ కోరుకోదని వల్లిస్తుంటుంది అన్నారు క్విన్. కానీ ఆచరణ పరంగా అమెరికా భావం ఏంటంటే చైనాపై అపవాదులు, దాడులు చేసినప్పటికీ తమ దేశం స్పందిచకూడదు లేదా దాడి చేయకుండా కట్టడి చేయాలనుకుంటుందన్నారు. ఇలాంటి వాటికి అమెరికా చెక్‌పెట్టకుండా తప్పుడు మార్గంలో కొనసాగిస్తే పట్టాలు తప్పడమే కాకుండా ఎన్ని రక్షణదారులు ఉన్న వాటిని నిరోధించలేవు అని హెచ్చరించారు. పైగా సంఘర్షణ ఘర్షణగా మారి విపత్కర పరిణామానికి దారితీస్తుందన్న అమెరికాకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. కాగా వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ జాతీయ భద్రతా ప్రతినిధి జాన్‌కిర్బీ.. క్విన్ విమర్శలను తిప్పికొట్టారు. బీజింగ్‌తో ఘర్షణ పడాలని ప్రయత్నించడం లేదని నొక్కి చెప్పారు. తాము చైనాతో వ్యూహాత్మక పోటీని కోరుకుంటున్నామే గానీ వివాదాన్ని కాదని చెప్పారు. చైనాని ఎప్పుడూ ఆ స్థాయిలోనే ఉంచామని చెప్పారు. (చదవండి: ఇంటి పనికే పరిమితమైన భార్యకు కోటి రూపాయాలు చెల్లించమన్న కోర్టు!) -
‘పెరిగే సముద్ర మట్టాలతో కొన్ని దేశాలే జలసమాధి’
భూతాప పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్‌కు కట్టడి చేయకపోతే సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరిగి పలు దేశాలను ముంచేస్తాయని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘పెరుగుతున్న సముద్ర మట్టాలు’ అంశంపై ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సముద్ర మట్టాలు పెరిగితే భారత్, బంగ్లాదేశ్, చైనా, నెదర్లాండ్స్ వంటి దేశాలకు చాలా ప్రమాదం. కైరో, లాగోస్, మపుటో, బ్యాంకాక్, ఢాకా, జకార్తా, ముంబై, షాంఘై, కోపెన్‌హాగెన్, లండన్, లాస్ ఏంజెలెస్, న్యూయార్క్, బ్యూనస్ ఏరిస్, శాంటియాగో వంటి నగరాలకు ముప్పు. భూతాపం 2 డిగ్రీలు పెరిగితే సముద్రమట్టాలు ఆరు మీటర్లు, 5 డిగ్రీలు పెరిగితే ఏకంగా 22 మీటర్లు పైకెగసి ఆయా దేశాలను జలసమాధి చేస్తాయి’ అని హెచ్చరించారు. చదవండి: ఘోర ప్రమాదం.. 39 మంది వలసదారులు మృతి -
అతి వ్యాయామంతో గుండెకు చేటు.. పోటు!
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో యువతలో గుండెపోటు సంబంధిత మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అధిక బరువు, శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఇందుకు కారణమని చాలామంది భావిస్తున్నారు. కానీ, కారణం అది కాదంట!. మరి.. అలవాటు లేని వ్యాయామాలు లేదంటే అతి వ్యాయామం వల్ల యువత గుండెపోటు బారిన పడుతున్నారని నిపుణులు గుర్తించారు. పాతికేళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారిలో పలువురు జిమ్‌లో మృతి చెందిన సంఘటనలు ఇటీవలి కాలంలోనే బయటపడ్డాయి. కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్, గాయకుడు కేకే, కమేడియన్ రాజు శ్రీవాస్తవ వ్యాయామం చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకల్లో యువత నృత్యాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తగిన శిక్షణ లేకుండానే కఠిన వ్యాయా మాలు చేయడం లేదా అతిగా వ్యాయామం చేయడం వల్ల కరోనరీ నాళాల్లో చీలికలు ఏర్పడతాయని, అంతిమంగా గుండెపోటుకు దారితీస్తుందని మొరాదాబాద్‌కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. అలవాటు లేని ఎక్సర్సైజ్లకు యువత దూరంగా ఉండాలని మరో వైద్యుడు వివేక్ కుమార్ సూచించారు. ఏ వ్యాయామం ఎలా చేయాలన్న దానిపై తగిన శిక్షణ తీసుకోవాలని చెప్పారు. -
రాబడి కోసం కొత్త మార్గం..!
కొందరు ఇన్వెస్టర్లు కొత్త పెట్టుబడి సాధనాల కోసం తరచూ అన్వేషిస్తుంటారు. పెట్టుబడుల్లో ఎక్కువ వైవిధ్యం కోరుకుంటారు. కొందరికి రాబడే ప్రామాణికం. రిస్క్ ఉన్నా ఫర్వాలేదు ఎక్కువ రాబడి కావాలన్నది వారి విధానం. ముఖ్యంగా నేటి తరం యువ ఇన్వెస్టర్లు స్థిరమైన ఆదాయం కోసం డెట్‌కు ప్రత్యామ్నాయ సాధనాల కోసం చూస్తున్నారు. సంప్రదాయ డెట్ సాధనాలతో పోలిస్తే వారికి ఎక్కువ రాబడి కావాలి. ఈక్విటీ మార్కెట్లలో మాదిరిగా అస్థిరతలు ఉండకూడదు. ఎలానూ ఈక్విటీల్లో కొంత ఇన్వెస్ట్ చేస్తారు. కనుక ప్రత్యామ్నాయాలు కోరుకునే వారు పెరిగిపోతున్నారు. ఈ తరహా ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వచ్చిన సాధనమే ‘ఇన్వాయిస్ ఇన్వెస్టింగ్’. ఇది ఎలా పనిచేస్తుంది? రాబడులు ఏ మేరకు ఉంటాయి? తదితర వివరాలను అందించే ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది.. ఇన్వాయిస్ ఫైనాన్స్ / డిస్కౌంటింగ్ అంటే... ఇన్వాయిస్ ఫైనాన్స్, డిస్కౌంటింగ్‌ను సులభంగా అర్థం చేసుకుందాం. ఒక పేపర్ తయారీ కంపెనీ ఉంది. రూ.లక్ష విలువ చేసే పేపర్‌ను నోట్‌బుక్ తయారీ కంపెనీకి విక్రయించింది. ఒప్పందం ప్రకారం 90 రోజుల తర్వాత రూ.లక్షను నోట్‌బుక్ తయారీ కంపెనీ చెల్లిస్తే చాలు. కానీ, అంతకంటే ముందే నిధుల అవసరం పేపర్ కంపెనీకి ఏర్పడింది. దీంతో నోట్‌బుక్ కంపెనీ నుంచి రావాల్సిన రూ.లక్ష ఇన్వాయిస్ను రూ.90వేలకే ఒక ప్లాట్ఫామ్లో విక్రయానికి ఉంచింది. దీన్ని ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అంటారు. ఈ డీల్‌లో పేపర్ కంపెనీకి వెంటనే రూ.90వేల క్యాష్ ఫ్లో అందుతుంది. దీన్ని కొనుగోలు చేసిన ఇన్వెస్టర్‌కు 90 రోజులకే రూ.10వేల లాభం వస్తుంది. అలా కాకుండా.. ఇదే పేపర్ తయారీ కంపెనీ నోట్ బుక్ కంపెనీ నుంచి రావాల్సిన రూ.లక్ష ఇన్వాయిస్ను వెంటనే నగదుగా మార్చుకోవాలని అనుకుంది. డిస్కౌంట్‌కు విక్రయించకుండా, 90 రోజుల కాలానికి 12 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తూ రూ.లక్ష రుణం కోరింది. దీన్ని ఇన్వాయిస్ ఫైనాన్సింగ్ అంటారు. ఎలా పనిచేస్తుంది..? ఇది స్టార్టప్‌ల కాలం. ఏటేటా వందలాది స్టార్టప్‌లు ఉనికిలోకి వస్తున్నాయి. వీటి విస్తరణకు నిధులు అవసరం ఎంతో ఉంటుంది. అదే సమయంలో అవి నిధుల కోసం ప్రతిసారి ఈక్విటీ జారీ మార్గాన్ని ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడవు. ఎందుకంటే ఈక్విటీ విలువ పలుచబడిపోతుంది. దీనివల్ల రాబడులూ పలుచన అవుతాయి. ఇక్కడే రెవెన్యూ బేస్డ్ ఫైనాన్సింగ్ (కంపెనీల ఆదాయాన్ని చూసి రుణాలు ఇవ్వడం) అవసరం ఎదురవుతుంది. ఇది అటు స్టార్టప్‌లకు, ఇటు పెట్టుబడి అందించే వారికీ ప్రయోజనం చేకూరుస్తుంది. కంపెనీలకు తలనొప్పి లేని నిధులు అందుతాయి. జిరాఫ్, బెటర్ఇన్వెస్ట్, క్రెడ్ఎక్స్ ఇలా పలు సంస్థలు ఇన్వెస్టింగ్ ఫైనాన్సింగ్‌కు సంబంధించి మంచి పెట్టుబడుల అవకాశాలను ఆఫర్ చేస్తుంటాయి. వెంచర్ క్యాపిటల్ (వీసీ), ఏంజెల్ ఇన్వెస్టర్లు ఉన్నారు కదా? అన్న ప్రశ్న ఎదురుకావచ్చు. కానీ, ఇవి ఊరికే పెట్టుబడులు అందించవు. భారీ రాబడులు ఆశిస్తాయి. లేదంటే తాము అందించే పెట్టుబడులకు భారీ వాటా కోరుకుంటుంటాయి. రిస్క్ ఎక్కువగా ఉండే వ్యాపారాలకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి నిధులు లభించడం అసాధ్యం. అందుకనే ఆదాయం చూసి రుణాలు అందించే ఆర్బీఎఫ్ మార్కెట్ విస్తరిస్తోంది. ఈ విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్లకు ‘ఇన్వాయిస్ ఫైనాన్స్/ఇన్వాయిస్ డిస్కౌంటింగ్’ రూపంలో పెట్టుబడుల అవకాశాలు లభిస్తాయి. ఇన్వాయిస్ల రూపంలో కంపెనీలు తమకు కావాల్సిన నిధులను సమకూర్చుకుంటాయి. ఇన్వాయిస్లపై కంపెనీలకు నిధులు రావాల్సి ఉన్నప్పుడు.. వాటిని ఇన్వెస్టర్లకు హామీగా ఉంచి/లేదా విక్రయించి కంపెనీలు నిధులు కోరతాయి. సౌకర్యవంతం... ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. వారికి భిన్నమైన పెట్టుబడుల అవకాశాలను అందించేందుకు ఎన్నో ఆన్లైన్ వేదికలు కూడా ఏర్పాటువుతున్నాయి. అలా వచ్చిందే ఇన్వాయిస్ ఇన్వెస్టింగ్. 18 ఏళ్లు నిండి, కేవైసీ పూర్తి చేసిన వారు వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కనీస పెట్టుబడి లక్ష రూపాయిల నుంచి మొదలవుతుంది. కొన్ని ప్లాట్‌ఫామ్‌లు, కొన్ని కేసుల్లో కనీసం రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. తమ ప్లాట్‌ఫామ్‌పై నమోదైన ఇన్వెస్టర్లకు ఆయా సంస్థలు పెట్టుబడుల అవకాశాలను తీసుకొస్తుంటాయి. ఇందుకోసం ఇన్వెస్టర్, రుణ గ్రహీత ఇద్దరి నుంచి ‘స్ప్రెడ్ (వడ్డీ రేటు మధ్య వ్యత్యాసం) రూపంలో చార్జీలను వసూలు చేస్తాయి. పెట్టుబడుల అవకాశాలను లిస్టింగ్ చేసేందుకు కూడా చార్జీ తీసుకుంటాయి. రుణం కోసం కంపెనీలు ఆఫర్ చేసే ఇన్వాయిస్లను ఆయా ప్లాట్‌ఫామ్‌లు ముందుగా తనిఖీ చేస్తాయి. అవి నిజమైనవా, కావా అన్నది నిర్ధారించుకుంటాయి. అంతా డీజిటల్‌గా జరిగిపోయే విధానం కావడంతో ఇరువైపుల వారికి సౌకర్యంగా ఉంటుంది. పైగా అందుబాటు ధరలకే నిధులు కంపెనీలకు లభిస్తాయి. ఇన్వెస్టర్లకు కూడా మెరుగైన రాబడులు అందుతాయి. కొత్తవారు, అనుభవం లేని వారు అయితే తెలిసిన ఇన్వెస్టర్‌తో సంయుక్తంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడుల అవకాశాలు జిరాఫ్ ప్లాట్‌ఫామ్.. ఏడేళ్ల చరిత్ర కలిగిన లాజిస్టిక్స్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ డీల్ ను అందిస్తోంది. కాలవ్యవధి కేవలం 91 రోజులు. దీని ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (ఐఆర్ఆర్) 12.25 శాతంగా ఉంది. అంటే రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే మూడు నెలల్లో రూ.1.03 వేలు లభిస్తాయి. జిరాఫ్ డీల్‌ను లిస్ట్ చేయడానికే పరిమితం కాదు. సదరు పెట్టుబడిని కాల వ్యవధి వరకు పర్యవేక్షిస్తుంటుంది. ఇన్వెస్టర్లకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఇస్తుంది. డిఫాల్ట్ అవకాశాలు ఏర్పడితే... డిఫాల్ట్ (ఎగవేత) అవకాశాలు ఉన్నట్టు భావిస్తే ఇన్వెస్టర్ల తరఫున తనే ఆయా హక్కులను వినియోగించుకుని డీల్స్‌ను క్లోజ్ చేసి, నిధులు రాబడుతుంది. జిరాఫ్ ప్లాట్‌ఫామ్‌పై 30/60 రోజుల కాలవ్యవధితో కూడిన ‘ఇన్వాయిస్ డిస్కౌంటింగ్’ డీల్ కూడా ఉంది. క్రెడ్ఎక్స్ ప్లాట్ఫామ్లో కనీస పెట్టుబడి రూ.3 లక్షలుగా ఉంది. కాల వ్యవధి 30/90 రోజులు. ఇక బెటర్ఇన్వెస్ట్ ప్లాట్‌ఫామ్ అయితే ఆకర్షణీయమైన పెట్టుబడుల అవకాశాలను ఆఫర్ చేస్తోంది. సినీ నిర్మాణంలో పెట్టుబడులకు వీలు కల్పిస్తోంది. సినిమా విడుదలైన 60/90 రోజుల తర్వాత నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సినీ నిర్మాణ సంస్థలకు ఆదాయం వస్తుంది. మరి అప్పటి వరకు వాటికి నిధుల అవసరం ఎంతో ఉంటుంది కదా. అందుకుని సినీ నిర్మాణ సంస్థలు ఓటీటీ ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించి ఇన్వాయిస్లను ఇన్వెస్టర్లకు విక్రయిస్తుంటాయి. ఇక్కడ ఓటీటీ సంస్థలే నేరుగా ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేస్తాయి. వీటి వార్షిక రాబడి 12.18 శాతంగా ఉంది. ఆయా అంశాలు అన్నింటిపై నిపుణుల సలహాలు అవసరం. రిస్క్‌లు ఏమిటంటే.. ఏ పెట్టుబడిలో అయినా రిస్క్ ఉంటుంది. ఈ ఆన్లైన్ వేదికలు రాబడి నుంచి పన్ను మేర తగ్గించి ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేస్తాయి. ఇక ఇన్వెస్టర్లు తమవైపు నుంచి ఎటువంటి పన్ను చెల్లించక్కర్లేదని అవి చెబుతుంటాయి. కానీ, మిగిలిన ప్లాట్‌ఫామ్‌లకు ఈ విషయంలో స్పష్టత లేదు. కనుక ప్లాట్‌ఫామ్‌లు పన్ను కోత అమలు చేస్తే, ఆ మేరకు టీడీఎస్ అడిగి రిటర్నుల్లో చూపించుకోవడం మంచిది. తక్కువ సందర్భాల్లో పెట్టుబడికి కూడా నష్టం ఏర్పడొచ్చు. కాకపోతే ఆయా పెట్టుబడుల అవకాశాలకు సంబంధించి రిస్క్‌ను తాము ముందే విశ్లేషించినట్టు ప్లాట్‌ఫామ్‌లు ఇన్వెస్టర్లకు భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అదే సమయంలో ఇన్వెస్టర్లకు చెల్లింపులు ఆలస్యం అయినా, ఎగ వేతలు ఏర్పడినా, మోసాలు జరిగినా, తప్పుదోవ పట్టించినా బాధ్యత తీసుకోవు. ఇవి కేవలం ఇరువైపుల వర్గాలను కలిపేందుకు, వారికి సేవలు అందించడానికే పరిమితమవుతుంటాయి. దేనీకి హామీ ఇవ్వవు. కనుక సంప్రదాయ డెట్ పెట్టుబడి సాధనాలకు ఇవి ప్రత్యామ్నాయం కావు. పీపీఎఫ్‌లో 7%, ఎఫ్‌డీల్లో 6–7% మేర రాబడి వస్తుంది. కానీ, వాటిల్లో హామీ ఉంటుంది. ఇన్వాయిస్ ఇన్వెస్టింగ్‌కు ఇటువంటి హామీ ఉండదు. నిధులు ఆశించే సంస్థల పేరు, బ్రాండింగ్ తదితర అంశాల ఆధారంగా రిస్క్‌ను కొంత వరకు అర్థం చేసుకోవచ్చు. ఆయా సంస్థలకు సంబంధించి గత చరిత్ర ఆధారంగానూ నిర్ణయం తీసుకోవచ్చు. మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటే రిస్క్ ఎదురుకావచ్చు. దీర్ఘకాలానికి ఇన్వాయిస్లపై రుణాలు తీసుకునే సంస్థల విషయంలో ముందుగానే తగినంత అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మూడేళ్లకు పైగా కాలంలో ఆయా సంస్థల ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మారిపోయే రిస్క్ ఉంటుంది. మూడు నెలల నుంచి ఏడాదిలోపు ఇన్వాయిస్లపై రిస్క్ తక్కువగా ఉంటుంది. -
క్రిప్టో కరెన్సీతో ముమ్మాటికీ ప్రమాదమే
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలు ఆర్థిక వ్యవస్థకు ముమ్మాటికీ ప్రమాదమేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టంచేశారు. అంతర్లీనంగా ఎటువంటి పటిష్టతా లేకుండా కేవలం విశ్వాసం, ఊహాగానాల ఆధారంగా విలువను పొందే ఏ ఇన్స్ట్రమెంటైనా అది చివరకు తీవ్ర అనిశ్చితికే దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్బీఐ గురువారం విడుదల చేసిన 25వ ఫైనాన్షియల్ స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) విడు దల సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► అంతర్జాతీయంగా అధిక ద్రవ్యోల్బణం కొనసాగే అవకాశం ఉంది. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతల ప్రభా వం ఎకానమీలపై ఉంటుంది. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ ఎకానమీ రికవరీ బాటలో పయనిస్తోంది. ఎటువంటి సవాళ్లనైనా తట్టుకోడానికి వీలుగా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు పటిష్ట మూలధనాన్ని కొనసాగిస్తున్నాయి. ► 2021లో అంతర్జాతీయ వాణిజ్య పరిమాణం 10.1 శాతం పెరిగితే 2022లో ఇది 5 శాతానికి పడిపోతుందని అంచనా. ► దేశీయంగా బ్యాంకింగ్ మొండిబకాయిల నిష్పత్తి మార్చిలో ఆరేళ్ల కనిష్టం 5.9 శాతానికి పడిపోయింది. 2023 మార్చి నాటికి మొండిబకాయిలు 5.3 శాతానికి దిగివస్తాయని భావిస్తున్నాం. ► రూపాయి తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి ఆర్బీఐ తగిన అన్ని చర్యలూ తీసుకుంటుంది. దీర్ఘకాలంలో రూపాయి స్థిరత్వం ఆర్బీఐ లక్ష్యం. ► మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో భారత్ విదేశీ రుణ భారం 47.1 బిలియన్ డాలర్లు పెరిగి, 620.7 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే జీడీపీ నిష్పత్తిలో చూస్తే 2021 మార్చిలో 21.2%గా ఉంటే, 2022 మార్చిలో 19.9%కి తగ్గింది. ► పరిశ్రమకు రుణ వృద్ధి మే 2022లో 8.7 శాతానికి పెరిగింది. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు సంబంధించి ఈ రేటు 11.8 శాతం పెరిగింది. పరిశ్రమకు రుణ వృద్ధి 2021 మేలో కేవలం 0.2 శాతం కావడం గమనార్హం. ► అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) వినియోగంలో ప్రైవేట్ రంగ బ్యాంకులు... ప్రభుత్వ రంగ సంస్థల కంటే ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. -
ధరల దాడిని ఇలా ఎదుర్కోండి..!
ఈక్విటీకి హెడ్జింగ్ అన్ని రకాల పెట్టుబడులకు ద్రవ్యోల్బణం రిస్క్ ఉంటుంది. ఈక్విటీలు సైతం అందుకు అతీతం కాదు. కంపెనీల వ్యాపారాలపైనా ద్రవ్యోల్బణం ప్రభావం ఉంటుందని గుర్తించాలి. ద్రవ్యోల్బణం వల్ల కంపెనీలకు ముడి సరుకుల ధరలు పెరిగిపోతాయి. దీనివల్ల తయారీ కంపెనీల లాభాల మార్జిన్లు తగ్గిపోతాయి. అధిక ద్రవ్యోల్బణం ఉన్న సమయాల్లో పరిశీలించినప్పుడు.. 2009–10లో నిఫ్టీ 50 కంపెనీల (ఫైనాన్షియల్ కంపెనీలు మినహా) ఎబిట్డా 19.86 శాతంగా ఉంటే, 2013–14 నాటికి 16.31 శాతానికి క్షీణించింది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం తర్వాత నెలకొన్న పరిస్థితులు ఇందుకు దారితీశాయి. ఆ సమయాల్లో వినియోగదారుల కొనుగోలు శక్తి కూడా క్షీణిస్తుంది. దాంతో అవసరమైన కొనుగోళ్లకు పరిమితమై.. అనవసరపు ఖర్చును నియంత్రించుకునేందుకు వినియోగదారులు మొగ్గు చూపిస్తారు. దాంతో కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోతుంది. కనుక ద్రవ్యోల్బణం కొన్ని కంపెనీలకు ప్రతికూలిస్తే.. కొన్ని కంపెనీలకు అనుకూలిస్తుందని చెప్పుకోవాలి. కనుక పెట్టుబడుల్లో వైవిధ్యమైన కంపెనీలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడు సహజంగానే హెడ్జింగ్ (రక్షణ) ఉండేలా చూసుకోవచ్చు. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న సమయాల్లో కొన్ని రకాల థీమ్‌లను పరిశీలించొచ్చు. రెండేళ్ల క్రితం 2020 మార్చిలో సన్ ఫ్లవర్ నూనె లీటర్ రూ.85. రెండు నెలల క్రితం రూ.120. ఇప్పుడు రూ.180–200కు పైనే. 2019 జూలైలో పెట్రోల్ లీటర్ ధర రూ.73. 2020 జూన్‌లో రూ.80. 2021 జూలైలో రూ.100. 2022 ఏప్రిల్‌లో రూ.120. ఇలా నిత్యావసరాల ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. దీన్నే ద్రవ్యోల్బణంగా చెప్పుకోవాలి. కరెన్సీ విలువను తినేసే చెద పురుగు ఇది. పెట్టుబడికి రాబడి తోడైనప్పుడే సంపదగా మారుతుంది. ఈ క్రమంలో పెట్టుబడి విలువను హరించే ద్రవ్యోల్బణం గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? మెజారిటీ ఇన్వెస్టర్లు పట్టించుకోని అంశం ఇది. ఇంటి నిర్మాణం అప్పుడే చెక్కకు చెద పట్టకుండా కెమికల్ కోటింగ్ వేయిస్తాం. అలాగే, పెట్టుబడి చేస్తున్నప్పుడే ద్రవ్యోల్బణం రక్షణ గురించి కూడా యోచించాలి. ప్రస్తుతం ప్రపంచదేశాలు ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ఉక్రెయిన్–రష్యా సంక్షోభంతో నిత్యావసరాల ధరలు రెక్కలు విప్పుకున్నాయి. దీనికంటే ముందు కరోనా కారణంగా సరఫరా వ్యవస్థలో సమస్యలు ఏర్పడ్డాయి. ఇవన్నీ ధరల ఒత్తిళ్లకు దారితీశాయి. అధిక ద్రవ్యోల్బణం నికర రాబడిని తగ్గించేస్తుంది. కనుక ప్రతి ఇన్వెస్టర్‌కు పెట్టుబడితోపాటు, ద్రవ్యోల్బణం రక్షణ గురించి కూడా తెలుసుకోవాలి. అధిక ద్రవ్యోల్బణ సమయాల్లో నిఫ్టీ 50 నికర రాబడి మైనస్‌గా ఉండడాన్ని ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవాలి. 2002, 2013, 2016, 2018లో నిఫ్టీ 50 నికర రాబడి మైనస్‌గా నమోదైంది. గత 20 ఏళ్ల కాలంలోని సగటు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే.. దీర్ఘకాలంలో ఈక్విటీల్లో నికర రాబడి 6.5 శాతానికి పైనే ఉంటేనే పెట్టుబడి ఫలితమిచ్చినట్టు. ఈక్విటీల కంటే ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లో (డెట్) ఇన్వెస్ట్ చేసే వారిపై ద్రవ్యోల్బణ కాటు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్థిరాదాయ పథకాల్లో రాబడికి, ద్రవ్యోల్బణానికి మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుంది. 2008 నుంచి 2013 మధ్య అధిక ద్రవ్యోల్బణం సమయంలో 10 ఏళ్ల సావరీన్ బాండ్ నికర రాబడి మైనస్‌గా ఉండడాన్ని గమనించాలి. కనుక పెట్టుబడులపై ద్రవ్యోల్బణ ప్రభావం తగ్గించుకునే చర్యలపై దృష్టి సారించినప్పుడే అధిక ప్రయోజనం. ద్రవ్యోల్బణం అంచనాలు.. ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కోరుకునే వారు ముందుగా మధ్య కాలానికి అది ఏ స్థాయిలో ఉంటుందన్న అంచనాలకు రావాలి. 1960నుంచి వినియోగధరల ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ) ఎన్నో సందర్భాల్లో రెండంకెల స్థాయిలో నమోదైంది. 1973–74, 1980–81, 1991–92 సంవత్సరాల్లో సగటు ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్లో కొనసాగింది. ఆయా కాలాల్లో చమురు ధరలు గణనీయంగా పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ద్రవ్యోల్బణం సెగలకు నేపథ్యంగా ఉన్నాయని చెప్పుకోవాలి. 1970ల్లో అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం.. 1980, 1990ల్లో గల్ఫ్ యుద్ధం, ఇరాక్‌పై కువైట్ దురాక్రమణ వంటివన్నీ ధరల్లో అస్థిరత్వానికి దారితీశాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత 2008–2013 మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం 11.06 శాతం వరకు వెళ్లింది. సగటున 9.8 శాతంగా నమోదైంది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితులతో ద్రవ్యోల్బణం మరింత పైపైకి వెళ్లొచ్చన్న అంచనాలున్నాయి. చమురు ధరలు బ్యారెల్ 100 డాలర్లకు పైనే ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 5.5–6 శాతం మధ్య ఉండొచ్చని చాలా మంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు. నోమురా అయి తే 6.3%గా అంచనా వేసింది. ద్రవ్యో ల్బణం తగిన అంచ నాలతోనే పెట్టుబడి ఎక్కడ పెట్టాలి, రక్షణ ఎలా కల్పించుకోవాలన్న అంశంపై స్పష్టత సాధ్యపడుతుంది. బంగారంతో రక్షణ ఉంటుందా? బంగారం ధరలు ద్రవ్యోల్బణంతోపాటే పెరుగుతాయన్న ఒక నమ్మకం ఉంది. కానీ, అన్ని వేళలా ఇదే ధోరణి ఉంటుందని చెప్పలేం. బంగారం డిమాండ్ అన్నది ప్రధానంగా ఇన్వెస్టర్లు, ఆభరణాల కొనుగోలుదారులపై ఆధారపడి ఉంటుంది. ధరలు పెరుగుతున్నప్పుడు స్వల్ప కాలంలో ఆ ప్రయోజనం పొందేందుకు ఇన్వెస్టర్లు బంగారంలోకి పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తారు. కానీ, అధిక ధరల కారణంగా వినియోగదారుల నుంచి ఆభరణాలకు డిమాండ్ తగ్గుతుంది. ధరలు తగ్గుతున్నప్పుడు బంగారం ఆభరణాలకు కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఆ సమయంలో పెట్టుబడులకు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ముందుకు రారు. బంగారాన్ని దీర్ఘకాల పెట్టుబడి సాధనంగా పరిగణించే వారు చాలా తక్కువ. దాన్ని ట్రేడింగ్, స్వల్పకాల హెడ్జింగ్ సాధనంగానే ఎక్కువ మంది పరిగణిస్తుంటారు. ఈ ధోరణి కారణంగా బంగారం అన్నది ద్రవ్యోల్బణం హెడ్జింగ్‌కు సంబంధించి ప్రభావవంతమైన సాధనంగా కాబోదు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితుల్లో బంగారం ధరలు పెరుగుతుంటాయి. పోర్ట్‌ఫోలియోకు వైవిధ్యం దృష్ట్యా ఒక పెట్టుబడి సాధనంగాను బంగారాన్ని చూడొచ్చు. ఇతర సాధనాలు ప్రతికూలతలు ఎదుర్కొంటున్న సందర్భాల్లో బంగారం నుంచి సానుకూల రాబడి అందుకోవచ్చు. కనుక పోర్ట్‌ఫోలియోలో బంగారానికి 5–10 శాతం మేర కేటాయింపులు చేసుకోవచ్చు. స్థిరాదాయ పెట్టుబడులు (డెట్) డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన వారు ద్రవ్యోల్బణం తీరుపై ఎప్పుడూ కన్నేసి ఉంచాల్సిందే. ఎందుకంటే ద్రవ్యోల్బణాన్ని బట్టే వడ్డీ రేట్ల గమనం ఆధారపడి ఉంటుంది. ద్రవ్యోల్బణం కట్టలు తెంపుకుని వెళుతున్న తరుణంలో దీన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంకు కీలక విధాన రేట్ల పెంపు బాటలో వెళ్లాల్సి వస్తుంది. ఇతరత్రా ఏ చర్యలు తీసుకున్నా కానీ, రేట్ల పెంపును చేపట్టక తప్పదు. ప్రస్తుతానికి వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిలో ఉంటే, ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉంది. దీంతో సమీప భవిష్యత్తులో రిజర్వ్ బ్యాంకు రేట్ల పెంపు చేపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో బాండ్ల ఈల్డ్స్ పెరిగి, వాటి ధరలు తగ్గుతాయి. 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ 7 నుంచి 7.5 శాతానికి చేరొచ్చని అంచనా. యూఎస్ ఫెడ్ కూడా రేట్ల పెంపు విషయంలో దూకుడుగానే ఉంది. ఈ ఏడాది చివరికే 2 శాతానికి చేర్చాలన్న అంచనాలతో ఉంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి అమ్మకాల ఒత్తిడికి కూడా కలసి సావరీన్ బాండ్ల ఈల్డ్స్ పెరిగేందుకు దారితీస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్గం ఏంటి? ఈ సమయంలో స్థిరాదాయ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారు స్వల్పకాల బాండ్లను ఎంపిక చేసుకోవడం సరైనది. దీనివల్ల రేట్ల పెరుగుదల నుంచి ప్రయోజనం పొందొచ్చు. పెట్టుబడులు స్వల్పకాలంలోనే మెచ్యూరిటీకి వస్తాయి కనుక వాటిని తిరిగి అధిక రేట్లపై ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏడాది లేదా రెండేళ్ల వ్యవధిపై ఫిక్స్డ్ డిపాజిట్‌కే పరిమితం కావాలి. రేట్ల పెంపు ముగిసే వరకు స్వల్పకాల బాండ్లనే నమ్ముకోవడం సరైనది. రేట్ల పెంపు ముగిసిన తర్వాత మూడేళ్ల కాలానికి పెట్టుబడులు పరిశీలించొచ్చు. 2023 లేదా 2024లో రేట్ల పెంపు ముగిసే అవకాశం ఉంది. ఎన్బీఎఫ్సీ డిపాజిట్లు, కార్పొరేట్ బాండ్లకూ ఇదే వర్తిస్తుంది. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు (రిస్క్ తీసుకోని) లిక్విడ్ లేదా మనీ మార్కెట్ ఫండ్స్‌కు పరిమితం కావాలి. స్వల్పకాలంలో పెరిగే రేట్ల నుంచి వీటికి ప్రయోజనం ఉంటుంది. అధిక రిస్క్ తీసుకునే వారు కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఇక్కడ క్రెడిట్ రిస్క్ ఉంటుందని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. అధిక ద్రవ్యోల్బణ సమయాల్లో, వడ్డీ రేట్లు పెరిగే సమయాల్లో ఫ్లోటింగ్ రేట్ ఫండ్స్ అనుకూలం. వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు సవరించే బాండ్లలో ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఒకే విడత పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్ బాండ్ 2020ను ఎంపిక చేసుకోవచ్చు. దీనిపై ప్రస్తుతం 7.15 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఆరు నెలలకు ఒకసారి ఈ రేటు సవరణకు లోనవుతుంది. దీని కాల వ్యవధి ఏడేళ్లు. ప్రభుత్వ హామీతో వచ్చే మెరుగైన సాధనం ఇది. ఆరు నెలలకోసారి వడ్డీ రేటు చెల్లింపు ఉంటుంది. క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే వారికి కూడా అనుకూలం. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేసుకుంటామనుకునే వారు.. పీపీఎఫ్‌ను కూడా పరిశీలిం చొచ్చు. ఇందులో ప్రస్తుతం 7.1 శాతం రేటు అమల్లో ఉంది. మార్కెట్ లీడర్స్ మోట్ (వ్యాపార బలాలు) ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి పెరిగిన ధరలను వినియోగదారులకు బదిలీ చేయగలవు. ధరలను పెంచినా ఆయా కంపెనీల ఉత్పత్తులు, సేవలను వినియోగదారులు పక్కన పెట్టలేని విధంగా వాటికి ఆదరణ ఉంటుంది. కనుక ఆయా కంపెనీల లాభాలు అంతగా ప్రభావితం కావు. నిఫ్టీ50 సూచీలోని కంపెనీల లాభాలు వార్షికంగా 9 శాతం చొప్పున 2010–2014 మధ్య (అధిక ద్రవ్యోల్బణ కాలం) పెరగడాన్ని గమనించొచ్చు. అంటే లాభాల మార్జిన్లపై ఒత్తిడి ఉన్నా కానీ అవి వృద్ధిని నమోదు చేయగలిగాయి. కన్జ్యూమర్ నాన్ డిస్క్రీషనరీ ద్రవ్యోల్బణం గరిష్టాలకు చేరినప్పుడు వినియోగదారులు విలాస ఉత్పత్తుల కొనుగోలు తగ్గించుకుంటారే కానీ, కన్జ్యూమర్ స్టాపుల్స్ను తగ్గించుకోలేరు. 2011–12లో 28.5%, 2012–13లో 25.3% చొప్పున బ్రిటానియా ఇండస్ట్రీస్ లాభాల్లో వృద్ధిని చూపించింది. ఆ సమయం లో రిటైల్ ద్రవ్యోల్బణం 10% మేర ఉంది. అదే సమయంలో బజాజ్ ఆటో ఆదాయంలో 10% వృద్ధి చూపించినా, లాభాల పెరుగుదల 1.3 శాతమే. కమోడిటీ స్టాక్స్ ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న సమయాల్లో కమోడిటీ స్టాక్స్‌లో పెట్టుబడులు కూడా పోర్ట్‌ఫోలియోకు రక్షణనిస్తాయి. ఆ సమయంలో ముడి చమురు, ఇతర కమోడిటీల ధరలు పెరిగిపోతాయి. దీంతో ఆయా కంపెనీల లాభాలు కూడా గణనీయ వృద్ధిని చూస్తాయి. ప్రభుత్వరంగ చమురు కంపెనీలపై ప్రభుత్వం నుంచి కొంత నియంత్రణ ఉంటుంది. అలాగే, ప్రభుత్వరంగ మెటల్ కంపెనీల పరిస్థితి కూడా ఇంచు మించు ఇలాగే ఉంటుంది. కానీ, ప్రైవేటు రంగ మెటల్ కంపెనీలైన హిందాల్కో, వేదాంత తదితర కంపెనీలు అధిక ద్రవ్యోల్బణం సమయాల్లో మంచి పనితీరు చూపిస్తుంటాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్లు) ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల హెడ్జింగ్ సాధనంగా రీట్లను కూడా ఫండ్ మేనేజర్లు పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై ఇవి ఆదాయాన్ని ఆర్జిస్తూ డివిడెండ్ రూపంలో ఆ మొత్తాన్ని వాటాదారులకు పంపిణీ చేస్తుంటాయి. కాలానుగుణంగా వీటి నిర్వహణలోని ప్రాజెక్టుల విలువ పెరుగుతుంది. అద్దె అదాయం కూడా పెరుగుతుంది. దీంతో ఎప్పటికప్పుడు డివిడెండ్ ఆదాయానికి తోడు.. పెట్టుబడి వృద్ధిని కూడా ఇన్వెస్టర్లు చూడొచ్చు. ప్రసు ్తతం మన స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ అయిన రీట్ల సగటు డివిడెండ్ రాబడి 4–6% మధ్య ఉంది. -
ఉక్రెయిన్‌లో విద్యార్థులను పట్టించుకోవడం లేదు
వారణాసి: యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులు ప్రమాదంలో చిక్కుకుని ఉండగా ప్రధాని మోదీ మాత్రం ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయారని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ఉక్రెయిన్‌లో మన విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోవడం మానేసిందని దుయ్యబట్టారు. గురువారం వారణాసిలో సమాజ్‌వాదీ(ఎస్పీ) పార్టీ తరఫున జరిగిన ఎన్నికల ర్యాలీలో మమత ప్రసంగించారు. ‘పుతిన్‌తో సత్సంబంధాలున్న మీకు, యుద్ధం వస్తుందని మూడు నెలలు ముందుగానే తెలిసినా, భారతీయులను ఉక్రెయిన్ నుంచి ఎందుకు వెనక్కి తీసుకు రాలేకపోయారు?’ అని ప్రధానిని ఆమె ప్రశ్నించారు. అక్కడ మన విద్యార్థులు బంకర్లలో ఉంటూ నీరు, ఆహారం దొరక్క అలమటిస్తుండగా ఎలాంటి సాయం అందించకుండా వెనక్కి రావాలంటే ఎలా సాధ్యమని ఆమె ప్రధానిని నిలదీశారు. కోవిడ్ సమయంలో దేశవ్యాప్త లాక్డౌన్ విధించి వలస కార్మికులను ప్రభుత్వం అత్యంత తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఆమె విమర్శించారు. -
గబ్బర్‌సింగ్‌తో పోల్చి అవమానిస్తున్నారు - నిర్మలా సీతారామన్
FM Sitharaman asks banks: కస్టమర్లతో స్నేహపూరితంగా వ్యవహరించాలని బ్యాంకులకు కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. దానివల్ల బ్యాంకు నుంచి రుణం తీసుకునే ప్రక్రియ సాఫీగా సాగుతుందన్నారు. అదే సమయంలో రుణాల విషయంలో రిస్క్ పట్ల జాగ్రత్తగానూ వ్యవహరించాలని సూచించారు. అండర్‌రైటింగ్ ప్రమాణాల (రుణం జారీ చేసే ముందు రిస్క్ స్థాయిని గుర్తించడం) విషయంలో బ్యాంకులు అలసత్వంగా ఉండరాదని మంత్రి హెచ్చరించారు. బడ్జెట్ అనంతరం పరిశ్రమల ప్రతినిధులతో సోమవారం ముంబైలో నిర్వహించిన ఒక సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆరి్థక వ్యవస్థ నిలకడగా కోలుకోవాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్టు చెప్పారు. మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంబంధించి బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలు ఆర్థిక వ్యవస్థపై ఎన్నో అంచల ప్రభావం చూపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా విపత్తు సమయంలో బాధిత వర్గాలకు చెల్లింపులు చేసేందుకు టెక్నాలజీ ఎంతో సాయపడినట్టు తెలిపారు. ఆవిష్కరణలకు, స్టార్టప్‌లకు ప్రభుత్వం నుంచి మద్దతు కొనసాగుతుందన్నారు. ఫైనాన్షియల్ మార్కెట్ల పట్ల నమ్మకం, విశ్వాసం అన్నది మరింత మంది ఇన్వెస్టర్లను చేరుకోవడానికి కీలకమని మంత్రి పేర్కొన్నారు. ఈ రంగం మరింత బలోపేతం అయ్యే మార్గాలపై దృష్టి సారించాలని ఈ రంగానికి చెందిన భాగస్వాములకు ఆమె సూచించారు. సంస్థలను అవమానించడమే జీఎస్టీని గబ్బర్‌సింగ్ ట్యాక్స్ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేస్తున్న విమర్శలపై మంత్రి మండిపడ్డారు. దేశ సంస్థలను అవమానించడంగా ప్రతిపక్షాల తీరును పేర్కొన్నారు. జీఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాలు, కేంద్రానికి భాగస్వామ్యం ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేశారు. కౌన్సిల్‌పై మూడింట ఒక వంతు ప్రభావమే కేంద్రం నుంచి ఉంటుందన్నారు. ఆరోగ్యం రాష్ట్రాల బాధ్యత ఆరోగ్య సంరక్షణ అన్నది రాష్ట్రాల ప్రాథమిక బాధ్యత అని ఆరి్థక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు చాలా తక్కువగా, జీడీపీలో 1.3 శాతంగానే ఉన్నాయని, దీన్ని పెంచాలంటూ వచ్చిన సూచనల పట్ల ఆయన స్పందించారు. కేటాయింపులు అధికం చేయాలంటే జీడీపీలో పన్నుల నిష్పత్తి పెరగాల్సి ఉంటుందన్నారు. మహిళలు ముందుకు రావాలి.. మహిళలు కంపెనీ బోర్డుల్లో చేరేందుకు వెనకాడుతున్నట్టు, తాను స్వయంగా వారిని ఒప్పించేందుకు ఇబ్బంది పడినట్టు మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. టాప్ 1,000 కంపెనీలు బోర్డుల్లో కనీసం ఒక మహిళా డైరెక్టర్‌ను అయినా కలిగి ఉండాలని చట్టం నిర్దేశిస్తున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. ‘‘నా స్థాయిలో నేను నా వంతు ప్రయత్నాలు చేశాను. ‘కంపెనీ బోర్డుల్లో ఎందుకు చేరడం లేదు? మీ అనుభవం మాకు తోడవ్వాలని కోరుకుంటున్నాం’ అని చెప్పాను. అయినా ఎవరూ ముందుకు రాలేదు. ఇది తీవ్రమైన అంశం’’ అని మంత్రి పేర్కొన్నారు. దీనికి పరిష్కారంతో ముందుకు రావాలని పరిశ్రమను కోరారు. పూర్తి స్థాయిలో డిజిటల్ సేవలు: ఖరా ఇదే కార్యక్రమంలో ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా మాట్లాడుతూ.. డిజిటల్‌గా రుణాలను మంజూరు చేయడంపై దృష్టి సారించినట్టు చెప్పారు. దీనివల్ల కస్టమర్లు సౌకర్యవంతంగా రుణాలను పొందగలరన్నారు. వచ్చే రెండు నెలల్లో ఎస్బీఐ పూర్తిస్థాయిలో డిజిటల్‌గా రుణాల మంజూరును అమలు చేయనున్నట్టు ప్రకటించారు. స్టార్టప్‌ల సమస్యలు ఎక్కువగా మూలధనం వైపు నుంచే ఉన్నట్టు చెప్పారు. ఈ విషయంలో మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. కొంత కాలానికి చిన్న వ్యాపారాలకు ఇచ్చే రుణాలు వ్యక్తిగత రుణాలను అధిగమిస్తాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు ఇంకా కరోనా ప్రభావం నుంచి బయటపడాల్సి ఉందంటూ.. గ్రామీణ ప్రాంతాల్లో వసూలు కాని రుణాలను గుర్తించే విషయమై ఆరి్థక మంత్రిని కొన్ని వెసులుబాట్లు కోరనున్నట్టు చెప్పారు. -
ఇన్వెస్టర్లూ.. వీటి సంగతి చూడరూ.!
ఏదైనా ఒక విభాగంలో పెట్టుబడిని లక్ష్యం, కాల వ్యవధి, రంగం పనితీరు ఇలా ఎన్నో అంశాలు నిర్ణయిస్తాయి. పెట్టుబడిదారులు తమ లక్ష్యాలకు అనుకూలమైన ఉత్పత్తులపై దృష్టి సారించాలి. మల్టీక్యాప్, ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఇన్వెస్టర్లకు లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ విభాగంలో పరిమిత రిస్క్‌తో పెట్టుబడులకు వీలు కల్పిస్తాయి. కనుక చక్కని ఏకైక పెట్టుబడి పరిష్కారంగా ఇవి పనిచేస్తాయి. తమ పెట్టుబడులను గణనీయంగా వృద్ధి చేసే సాధనాలను ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో భాగం చేసుకోవడం ద్వారానే గరిష్ట ప్రయోజనాన్ని సొంతం చేసుకోగలరు. విదేశీ పెట్టుబడులకు చోటు నూతన, వినూత్నమైన పెట్టుబడుల అవకాశాలు మన మార్కెట్లలోనూ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వస్తున్నాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాలపైనా ఇన్వెస్టర్లు ఒకసారి దృష్టి సారించాలి. ముఖ్యంగా అధిక రిస్క్ తీసుకునే వారు విదేశీ పెట్టుబడులకు చోటివ్వాలి. వర్ధమాన, అభివృద్ధి చెందిన మార్కెట్లలో దీర్ధకాలంలో గణనీయమైన సంపదను సృష్టించుకోవచ్చు. ఫండ్ ఆఫ్ ఫండ్స్ తదితర సాధనాల ద్వారా ఇన్వెస్టర్లు ఆయా అవకాశాల్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. అత్యవసరాల కోసం పెట్టుబడి జీవితంలో దేన్నీ ఊహించలేమని కరోనా మహమ్మారి అతిపెద్ద పాఠం నేర్పించింది. ఈ తరహా పరిస్థితులను మనం ‘సన్నద్ధత’ ద్వారానే అధిగమించగలం. అందుకని అత్యవసర నిధిపై పెట్టుబడి పెట్టడం ఎంతో ముఖ్యం. ఇలా చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఆ నిధిని వేగంగా వెనక్కి తీసుకోవచ్చు. ఇందుకోసం ఓవర్‌నైట్ ఫండ్, లిక్విడ్ ఫండ్, లో డ్యురేషన్ డెట్ ఫండ్స్, లేదా ఫ్లోటర్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. నాణ్యతకు ప్రాధాన్యం పెట్టుబడుల సాధనాల నాణ్యతపైనా దృష్టి పెట్టాలి. మంచి వ్యాల్యూషన్లు, దీర్ఘకాలంలో రాబడులను ఇచ్చే విధంగా పెట్టుబడులు ఉండాలి. ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నట్టు అన్ని కంపెనీలు లేదా అన్ని రంగాల్లో ఎప్పుడూ అదే మాదిరి ప్రదర్శన, రాబడులను ఉండవని తెలుసుకోవాలి. ప్రీమియం వ్యాల్యూషన్లతో ఎక్కువ కాలంపాటు కొనసాగలేవు. కనుక దీర్ఘకాల పెట్టుబడుల్లో నాణ్యతకు పెద్ద పీట వేయాలి. నూతన సంవత్సరం ప్రారంభమైందని చెప్పి తమ పోర్ట్‌ఫోలియోను సమూలంగా మార్పు చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఏర్పడకపోవచ్చు. కాకపోతే పునఃసమీక్ష అన్నది మంచి విధానం. భవిష్యత్తులో రాబడులను ఇచ్చే విధంగా పోర్ట్‌ఫోలియో ఉందా, లేదా అన్నది సరిచూసుకోవడం ఇక్కడ కీలకమని గుర్తించాలి. రిస్క్ కొద్దీ రాబడులు అనుభవం ఉన్న పెట్టుబడిదారులు రిస్క్‌ను, రాబడులను అర్థం చేసుకోగలరు. కానీ, అవగాహన లేని ఇన్వెస్టర్లు ‘రిస్క్’ అంటే ఏంటో నష్టాల రూపంలో చూడాల్సి వస్తుంది. కనుక ఇన్వెస్టర్లు రిస్క్‌ను అర్థం చేసుకునేందుకు వారి పోర్ట్‌ఫోలియోను సూక్ష్మంగా విడదీసి చూడాలి. తమ అవసరాలకు అనుగుణంగా రీబ్యాలన్స్ (మార్పులు చేర్పులు)చేసుకోవాలి. రిస్క్‌కు అనుగుణంగా రాబడులను సర్దుబాటు చేసుకోవాలి. ప్యాసివ్ పెట్టుబడి అవకాశాలు ప్యాసివ్ ఇన్వెస్టింగ్ పట్ల భారతీయ ఇన్వెస్టర్లలోనూ క్రమంగా ఆదరణ పెరుగుతోంది. వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో నిర్మాణానికి ఇవి వీలు కల్పించడమే కాకుండా.. ఇండెక్స్‌కు అనుగుణంగా వెయిటేజీ, రాబడులకు చోటిస్తున్నాయి. ఫండ్ మేనేజర్ వైపు నుంచి పక్షపాత ఆధారిత లోపాలను అధిగమించే ఉత్పత్తులు ఇవి. ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ రూపంలో ప్యాసివ్ పెట్టుబడులు చేసుకోవచ్చు. ఇండెక్స్కే పరిమితం అయ్యే ఉత్పత్తులు ఇవి ఎంతమాత్రం కాబోవు. థీమ్యాటిక్, రంగాల వారీ ఫండ్స్‌లోనూ ఇవి అంకురిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లకు రాబడులపై భరోసా ఉంటుంది. లక్ష్యాల సమీక్ష గడిచిన రెండేళ్లలో ఎన్నో మార్పులు సంభవించాయి. ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలు మారిపోయాయి. కనుక ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల లక్ష్యాలను కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా సమీక్షించుకోవాలి. వివాహం తర్వాత బాధ్యత పెరిగి రీబ్యాలన్స్ అవసరం ఏర్పడవచ్చు. లేదంటే ఉన్నత విద్యకు సంబంధించిన ప్రాధాన్యతలు మారిపోయి ఉండొచ్చు. వీటికి అనుగుణంగా మీ పెట్టుబడుల లక్ష్యాల్లోనూ మార్పులు చేసుకోవాలి. మార్కెట్లో నూతన అవకాశాల కోసం చూస్తూ ఉండొచ్చు. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా తమ పోర్ట్‌ఫోలియో నిర్మాణంపై తప్పకుండా దృష్టి సారించాలి. గడిచిన రెండేళ్లలో.. ముఖ్యంగా కరోనా ప్రవేశం తర్వాత ప్రతీ ఒక్కరికీ ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. వ్యాపార విధానాలు, నమూనాలను మార్చుకోవాల్సి వచ్చింది. టెక్నాలజీని అక్కున చేర్చుకోవాల్సి వచ్చింది. నూతనతరం టెక్నాలజీ ఆధారిత కంపెనీలు కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతున్నాయి. దీంతో ఈక్విటీ మార్కెట్ పట్ల ఇన్వెస్టర్ల వైఖరిలోనూ మార్పు వచ్చింది. 2022 అయినా స్థిరత్వాన్ని, సానుకూల పరిస్థితులను తీసుకురావాలని ఆశిద్దాం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు (హెల్త్ చెకప్) చేయించుకోవాలన్నది వైద్యుల సూచన. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను నిర్ణీత కాలానికోసారి సమీక్షించుకోవాలన్నది (వెల్త్ చెక్) ఆర్థిక సలహాదారులు ఇచ్చే సలహా. నూతన సంవత్సరం ఆరంభం ఇందుకు అనుకూల సందర్భంగా చూడాలి. గత సంవత్సరంలో రాబడులు ఏ మేరకు సమకూరాయి, రిస్క్ సామర్థ్యం, పెట్టుబడుల తీరు వీటన్నింటినీ పరిశీలించుకుని అస్సెట్ అలోకేషన్‌ను అమల్లో పెట్టాలి. మార్కెట్ అవకాశాలను సొంతం చేసుకునే విధంగా విధానాన్ని రూపొందించుకుని అమల్లో పెట్టాలి. – రాఘవ్ అయ్యంగార్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్, యాక్సిస్ ఏఎంసీ -
ఏ తల్లి కన్న బిడ్డో గానీ.. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా..
గతంలో ఎవరైనా ఆపదలో ఉంటే ప్రజలు తక్షణమే స్పందించి ప్రమాదంలోని వారికి సాయం అందించేవాళ్లు. కానీ ప్రస్తుత సోషల్‌మీడియా సమాజంలో మాత్రం సాయం మాట అటుంచితే సెల్ఫీలు, వీడియోలు తీసి నెట్టింట షేర్‌చేసే నెటిజన్లకు మాత్రం కొదవలేదని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఇటీవల మనం చాలానే చూసాం. అయితే ఇంకా మానవత్వం మిగిలే ఉందని అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు చూసినప్పుడు మనకి అనిపిస్తాయి. అసలు అంతలా ఆ వీడియోలో ఏముంది.. ఓ బాలుడు ప్రమాదకరంగా భవనంపై నుంచి వేలాడుతూ కనిపిస్తాడు. దీంతో ఎక్కడి నుంచి వచ్చాడో గానీ ఒక్కడు మాత్రం అందరిలా చోద్యం చూస్తూ, వీడియోలు ఫోటోలు తీయడం చేస్తూ సమయాన్ని వృథా చేయలేదు. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు కదిలాడు. ఆలోచన చేయలేదు, ఒక్కఉదుటున పెకెక్కి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఏ తల్లి కన్న బిడ్డవో గానీ నువ్వు చల్లగా ఉండాలని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు. అందరిలా చోద్యం చూస్తూ, వీడియెాలు పొటోలు తీసుకుంటు సమయాన్ని వృద్దా చేయలేదు. తన ప్రాణం గురించి ఆలోచన చేయలేదు, ఒక్క ఉదుటున పైకెక్కి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడినాడు. ఏ తల్లికన్న బిడ్డవో ?నీవు చల్లగా వుండాలి సోదరా pic.twitter.com/TCPEYMaJX8— సన్న పిన్ చార్జర్ (@sannapincharger) December 7, 2021 -
అలెర్ట్: ఈ వైఫై రూటర్లు వాడుతున్నారా..? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..!
సైబర్ నేరస్తులు పంథా మార్చారు. ఇన్ని రోజులు మెయిల్స్, మెసేజెస్, ఫ్రీగిఫ్ట్ లు పేరుతో బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేసేవారు. కానీ ఇప్పుడు రూటు మార్చి వైఫై రూటర్ల సాయంతో వైరస్ పంపి పర్సనల్ కంప్యూటర్లు, ఆఫీస్‌లో కంప్యూటర్లపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాడుల్లో వ్యక్తులు, లేదంటే సంస్థల రహస్యాల్ని స్వాధీనం చేసుకుంటున్నారు. వాటిని అడ్డం పెట్టుకొని కావాల్సిన మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని మిలియన్ల వైఫై రూటర్లలో సుమారు 226 భద్రతా లోపాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ 'ఐఓటీ ఇన్స్పెక్టర్', టెక్నాలజీ మ్యాగజైన్ 'చిప్' పలు నివేదికల్ని విడుదల చేసింది. నెట్‌గేర్, ఆసుస్, సినాలజీ,డీ - లింక్, ఏవీఎం,టీపీ -లింక్, ఇడి మ్యాక్స్ సంస్థల రూటర్లలో సెక్యూరిటీ సమస్యలు తలెత్తాయని, తద్వారా యూజర్ల వ్యక్తిగత డేటాను దొంగిలించేందుకు అవకాశం ఉన్నట్లు నివేదికల్లో పేర్కొన్నాయి. ఈ సెక్యూరిటీ సమస్యలు వెలుగు రావడంతో సంబంధిత సంస్థలు.. ఆ సమస్యని పరిష్కరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఐఓటీ ఇన్స్పెక్టర్ సంస్థ సీటీఓ ఫ్లోరియన్ లుకావ్స్కీ మాట్లాడుతూ.. మిలియన్ల రూటర్లలో తలెత్తిన 226 భద్రతా లోపాల వల్ల తలెత్తే నష్టం ఒకే విధంగా ఉంటుందని చెప్పలేం. కానీ అదే భద్రతా లోపాల్ని అడ్డంపెట్టుకొని హ్యాక్ చేయడం హ్యాకర్లకు చాలా సులభం' అవుతుందని అన్నారు. అయితే ఈ సమస్యలకు రూటర్లలో వినియోగించే కొత్త కాంపోనెంట్స్, ల్యూనిక్స్ కెర్నాల్ అనే ఆపరేటింగ్ స్టిస్టమ్ తో పాటు ఇతర డేటా సర్వీసులను టార్గెట్ చేసుకొని సైబర్ దాడులు జరిగే ప్రమాదం ఉందని అన్నారు. సైబర్ దాడుల నుంచి సేఫ్‌గా ఉండాలంటే ఇటీవల నార్డ్ పాస్ అనే సంస్థ 50 దేశాలకు చెందిన ప్రజలు ఎలాంటి పాస్‌వర్డ్‌లను వినియోగిస్తున్నారు. ఆ పాస్‌వర్డ్‌లను ఎంత సమయంలో హ్యాక్ చేయొచ్చు అనే అంశంపై సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో మనదేశానికి చెందిన ప్రజలు..సెకను కన్నా తక్కువ సమయంలో హ్యాక్ చేసే విధంగా పాస్ వర్డ్ అనే వర్డ్‌ను పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటున్నారని తేలింది. దీంతో పాటు 12345, 123456, 123456789, 12345678, india123, 1234567890, 1234567 పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటున్నట్లు నార్డ్ పాస్ పేర్కొంది. అలా కాకుండా కష్టతరమైన వర్డ్స్‌లేదంటే నెంబర్స్ పెట్టుకోవడం వల్ల వైఫై రూటర్ల ద్వారా జరిగే హ్యాకింగ్ నుంచి సురక్షింతంగా ఉండొచ్చని ఫ్లోరియన్ లుకావ్స్కీ సూచించారు. చదవండి : వాటిని పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటే..కొంప కొల్లేరే -
రాయలచెరువుకు తప్పిన ముప్పు.. వారం తర్వాత ఇంటికెళ్లిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
తిరుపతి రూరల్: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాలకు చెందిన 25 గ్రామాల ప్రజలకు వారం రోజులపాటు కంటి మీద కునుకు లేకుండా చేసిన 500 ఏళ్ల నాటి రాయలచెరువుకు పూర్తిస్థాయిలో ముప్పు తప్పింది. వారం కిందట భారీ వరదలతో చెరువు కట్టకు ఏర్పడిన లీకేజీలకు 55 వేల ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లోని వేలాదిమంది ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శనివారం సాయంత్రం రాయల చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదవండి: ఆ దిశగా మరో ముందడుగు.. సీఎం జగన్ ట్వీట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెరువు లీకేజీలను వందశాతం అరికట్టామని, పశువులతో సహా పునరావస కేంద్రాలకు వెళ్లిన దాదాపు 15 వేల మంది ప్రజలు తిరిగి ఇళ్లకు రావాలని పిలుపునిచ్చారు. లీకేజీలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపించారని, ఆయన ఆదేశాల మేరకు చెన్నై, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్లు, ఇరిగేషన్ నిపుణులను పిలిపించి సమస్యను గుర్తించామన్నారు. 120 మంది నిపుణుల పర్యవేక్షణలో 453 మంది కార్మికులు వారం రోజులుగా రోజుకు 19 గంటలపాటు యుద్ధప్రతిపాదికన పనులు చేశారన్నారు. భారతీ సిమెంట్ యాజమాన్యం వితరణ చేసిన 35వేల ఖాళీ సంచులు, టీటీడీ నుంచి 20 వేల సంచుల్లో ఇసుక, క్వారీ డస్ట్‌ను కలిపి లీకేజీలు ఏర్పడిన ప్రదేశంలో బెర్మ్ పద్ధతిలో అరికట్టామని వివరించారు. నీటి ప్రవాహానికి ఈ బస్తాలు కొట్టుకుపోకుండా 700 టన్నుల బోల్డర్స్ (పెద్దపెద్ద బండరాళ్లు)ను వీటికి దన్నుగా ఉంచామన్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడినా కట్టకు ఇబ్బంది లేకుండా ఔట్‌ఫ్లో 8 వేల క్యూసెక్కులు వెళ్లే విధంగా ఏర్పాట్లుచేశామని చెవిరెడ్డి వెల్లడించారు. ఏడు రోజుల తర్వాత ఇంటికి.. నిర్వాసితులు ఇంటికి వచ్చిన తర్వాతే తాను ఇంటికి వెళ్తానన్న చెవిరెడ్డి.. మొదటి రోజు నుంచి చెరువు కట్టపైనే బసచేసి చెరువు మరమ్మతు పనులను అనుక్షణం పర్యవేక్షించారు. అంతేకాక.. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు నేవీ హెలికాప్టర్లలో నిత్యావసర సరుకులను అందిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో.. చెరువు లీకేజీలకు పూర్తిస్థాయిలో అడ్డకట్ట వేసిన తర్వాత స్థానికులందరూ ఇళ్లకు చేరుకున్నాక చెవిరెడ్డి శనివారం ఇంటికి వెళ్లారు. -
కార్పొరేట్ల చేతుల్లో బ్యాంకులు వద్దు: రజనీష్‌కుమార్
ముంబై: బ్యాంకింగ్ రంగంలోకి కార్పొరేట్లను అనుమతించాల్సిన అవసరం లేదని ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. రిలేటెడ్ పార్టీ (బ్యాంకు యాజమాన్యాలతో సంబంధం కలిగిన వారితో లావాదేవీలు) లావాదేవీలు పరంగా ఉండే రిస్క్ నేపథ్యంలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు ‘‘నా వరకు భారత్ వంటి దేశంలో బ్యాంకులను కలిగి ఉండేందుకు కార్పొరేట్లను అనుమతిస్తే పెద్ద రిస్క్‌లను ఎదుర్కోవాల్సి వస్తుంది. సరైన యాజమాన్యాలతో, నిపుణుల ఆధ్వర్యంలో నడిచే బ్యాంకులే మనకు కావాలి’’ అని సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ స్టడీస్ నిర్వహించిన ఒక వెబినార్‌లో భాగంగా రజనీష్‌కుమార్ పేర్కొన్నారు. -
స్వీయ తప్పిదం! గూగుల్ కొంపముంచుతుందా?
ఏం అవసరం పడినా.. ఇంటర్నెట్లో వెతికే ఎక్కువమంది ఆశ్రయించేది గూగుల్ బ్రౌజర్‌నే. గూగుల్ రూపొందించిన ఈ క్రాస్ ప్లాట్‌ఫామ్ వెబ్ బ్రౌజర్‌ను.. రోజూ కొన్ని కోట్ల మంది ఉపయోగిస్తుంటారు. అలాంటిది తన స్వీయ తప్పిదంతో గూగుల్ వాళ్లందరినీ దూరం చేసుకోవాలని చూస్తుందా?! ‘సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయి. గూగుల్ క్రోమ్‌ను అప్డేట్ చేసుకోండి’.. గత కొన్ని నెలలుగా తెర మీద వినిపిస్తున్న ప్రకటన ఇది. స్వయంగా తన యూజర్ల కోసం గూగుల్ స్వయంగా చేసిన భారీ హెచ్చరిక ఇది. సాధారణంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఏవీ ఈ తరహా ప్రకటనలు చేయవు. కానీ, అందుకు విరుద్ధంగా గూగుల్ చేసిన ప్రకటన.. ఇప్పుడు గూగుల్‌కే డ్యామేజ్ చేయనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యూజర్ల భద్రత విషయంలో గత కొంతకాలంగా హెచ్చరికలు జారీ చేస్తున్న గూగుల్.. ఈమధ్య మరో అప్డేట్ ఇచ్చింది. 19 రకాల సెక్యూరిటీ సమస్యలను సైతం ఈ కొత్త క్రోమ్ వెర్షన్‌కు అప్డేట్ కావాలని కోట్ల మంది యూజర్లను కోరింది. అంతేకాదు కాపీ లింక్స్, క్యూఆర్ కోడ్లను వెబ్సైట్లతో పంచుకునేందుకు సురక్షితమైన హబ్‌గా క్రోమ్ కొత్త వెర్షన్‌ను ప్రకటించుకుంది. అయితే గూగుల్ చేసిన ఈ ప్రకటన.. పరోక్షంగా తన యూజర్లను తానే దూరం చేసుకున్నట్లు అవుతుందని ‘ది రిజిస్ట్రర్’లో ఒక ఎడిటోరియల్ కథనం ప్రచురించింది. ఈ ప్రకటన ద్వారా గూగుల్ బ్రౌజర్ నుంచి కోట్ల మంది దూరం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది. పైగా గూగుల్ చేస్తున్న సవరణలు.. మొత్తంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్ వ్యవస్థనే ప్రభావితం చేయనున్నాయట!. గూగుల్ అప్డేట్ వల్ల ఏం ఒరగకపోగా.. వెబ్సైట్ వ్యవస్థ నాశనం అవుతుందని సీనియర్ టెక్ ఎక్స్పర్ట్ స్కాట్ గిల్బర్ట్సన్ ఈ మేరకు ఆ వ్యాసంలో పేర్కొన్నారు. అంతేకాదు గూగుల్ చర్యల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని, మొత్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటుందని పేర్కొంది. వెబ్ అనేది కేవలం ప్రొఫెషనల్స్ డెవలపర్స్ కోసమే కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కొసమెరుపు ఏంటంటే.. గూగుల్ బ్రౌజర్ కంటే మోజిల్లా ఫైర్ఫాక్స్ తన దృష్టిలో బెస్ట్ బ్రౌజర్ అంటూ స్కాట్ కామెంట్లు చేయడం. చదవండి: గూగుల్ సంచలన నిర్ణయం.. మీ ప్రమేయం లేకుండానే! -
ఆ విషయంలో అమెరికాను వెనక్కి నెట్టిన ఇండియా
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మేకిన్ ఇన్ ఇండియా కాన్సెప్టు క్రమంగా ప్రభావం చూపుతోంది. మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయం ఇటీవల విడుదలైన ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ వ్యాపార, వాణిజ్య రంగాలకు సంబంధించి ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ వివిధ అంశాలపై ప్రతీ ఏడు సర్వేలు నిర్వహిస్తోంది. ఈ ఏడు నిర్వహించిన సర్వేలో ఇండియా సానుకూల ప్రగతిని సాధించినట్టు ఈ సర్వే ప్రకటించింది. ముఖ్యంగా మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లో ఇండియా పరిస్థితి మెరుగైంది. ప్రపంచంలోనే తయారీ రంగానికి సంబంధించి అత్యంత అనుకూలమైన దేశాల్లో రెండో స్థానం సాధించింది. ఇంతకు ముందు ఈ స్థానంలో అమెరికా ఉండేది. యూఎస్ఏను వెనక్కి నెట్టి ఇండియా ద్వితీయ స్థానానికి చేరుకుంది. ఇక ఎప్పటిలాగే మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లో చైనానే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇండియాకు అనుకూలించేనా ? ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల్లో సింహభాగం అమెరికాకు చెందినవే ఉన్నాయి. ఇటీవల చైనాతో నెలకొన్న వివాదం నేపథ్యంలో చైనాలో ఉన్న తమ తయారీ యూనిట్లను ఇతర దేశాలకు తరలించే యోచనలో అనేక కంపెనీలు ఉన్నాయి. ఈ తరుణంలో అమెరికా కంపెనీలకు ఏషియాలో తయారీ హబ్‌గా చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియా ఎదిగేందుకు అవకాశం ఉందని సర్వే అభిప్రాయపడింది. ఈ అంశంలో ఇండియాకు ఇండోనేషియా, తైవాన్, వియత్నాంల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. వ్యయ నియంత్రణలో వెనుకబాటు తయారీ రంగంలో ఇండియా పరిస్థితి మెరుగైనప్పటికీ వ్యయ నియంత్రణలో ఇండియా వెనుకడుగు వేసినట్టు ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సర్వే ప్రకటించింది. గతంలో కాస్ట్ సినారియోలో ఇండియా ద్వితీయ స్థానంలో ఉండగా ఈ ఏడాది మూడో స్థానానికి పడిపోయింది. అనూహ్యంగా ఇండోనేషియా ఐదో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. మరోవైపు థాయ్‌లాండ్ ఎనిమిదో స్థానం నుంచి ఐదో స్థానానికి వచ్చి చేరింది. వ్యయ నియంత్రణలో ఇండియాకు తోటి ఆసియా దేశాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇక కాస్ట్ విషయంలో కూడా ప్రథమ స్థానంలో చైనానే ఉంది. ఇండియాలో రిస్క్ ఎక్కువ బిజినెస్ రిస్క్‌కు సంబంధించి ఇండియాకు ప్రతికూల ఫలితాలే ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సర్వేలో వెల్లడయ్యాయి. ముఖ్యంగా పాలసీలు, పొలిటికల్ ప్రెషర్లను పరిగణలోకి తీసుకుని ఈ సర్వేను రూపొందించగా ఇండియా టాప్ దేశాల సరసన కాకుండా రిస్క్ ఎక్కువగా ఉన్న మలేషియా, బెల్జియం, ఇండోనేషియా, బల్గేరియా, రోమేనియా, థాయ్‌లాండ్, హంగరీ, కొలంబియా, ఇటలీ, పేరు, వియత్నాంల సరసన నిలిచింది. ఈ విభాగంలో కూడా చైనా మొదటి స్థానంలో ఉండగా కెనడా, అమెరికా, ఫిన్లాండ్, చెక్ రిప్లబిక్ దేశాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మెరుగుపడాల్సిందే తయారీ యూనిట్‌కు కావాల్సిన స్థలం, మానవ వనరులు విషయంలో ఇండియా స్థానం మెరుగైనా పొలిటికల్ ప్రెషర్, పాలసీల విషయంలో వెనుకబడే ఉంది. ఇక కాస్ట్ విషయంలో తోటి ఆసియా దేశాల నుంచి గట్టి పోటీ ఉంది. చదవండి : సోలార్ పవర్ ప్రాజెక్టులో దూసుకెళ్తున్న టాటా పవర్ -
పరిశ్రమ ధైర్యంగా రిస్క్ చేయాలి
న్యూఢిల్లీ: ఇబ్బందులు వచ్చినా (రిస్క్) తట్టుకుని నిలబడదామన్న సాహసోపేత ధోరణిని భారత్ పరిశ్రమ పెంపొందించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. కరోనా తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్న భారత్ ఎకానమీ తిరిగి వేగం పుంజుకుంటోందని కూడా ఆయన బుధవారం పేర్కొన్నారు. ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థ– కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు ఇవీ... ► దేశ ప్రయోజనాల పరిరక్షణలో ఎటువంటి ఇబ్బందులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం ఇటీవల కీలక సంస్కరణలను తీసుకువచ్చింది. ఇవి సాహసోపేత నిర్ణయాలు. మహమ్మారి సమయంలోనూ సంస్కరణల బాటలో ప్రభుత్వం కొనసాగింది. ఏదో బలవంతంగా నిర్ణయాలను తీసుకోలేదు. ఆయా చర్యలు సత్ఫలితాలు అందిస్తాయనే ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ► భారత్ పరిశ్రమకు అవసరమైన మద్దతును అందించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మరిన్ని సంస్కరణలు తీసుకురావడానికి వెనుకాడబోదు. ► భారతదేశ స్వయం స్వావలంభన నినాదం విజయవంతం కావాలి. ఈ బాధ్యత ప్రధానంగా భారత పరిశ్రమపైనే ఉంది. ► దేశ అభివృద్ధి, సామర్థ్యంపై పూర్తి విశ్వాసం వ్యక్తమవుతున్న ప్రస్తుత వాతావరణాన్ని పురోభివృద్ధికి ఒక అవకాశంగా మలుచుకోవాలని పారిశ్రామిక రంగాన్ని కోరుతున్నారు. ► కొత్త ప్రపంచంతో కలిసి నడవడానికి భారత్ ఇప్పుడు పూర్తి సన్నద్దంగా ఉంది. ఆయా శక్తి సామర్థ్యాలను సమకూర్చుకుంది. ఒకప్పుడు భారత్‌కు విదేశీ పెట్టుబడులు అనేవి కష్టం. ఇప్పుడు అన్ని రకాల పెట్టుబడులనూ స్వాగతించే స్థితిలో ఉన్నాం. ► పన్నుల వ్యవస్థను సంస్కరించుకున్నాం. సరళతరం చేసుకున్నాం. అంతర్జాతీయ స్థాయిలో పోటీపూర్వక కార్పొరేట్ పన్ను విధానాన్ని రూపొందించుకుని, అనుసరిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా అమలుకు నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్న పరోక్ష పన్నుల సమగ్ర విధానం– వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలుల్లోకి తీసుకుని రావడమేకాదు, వసూళ్లలో సైతం రికార్డులను నమోదుచేసుకుంటున్నాం. ► కార్మిక చట్టాలను హేతుబద్దీకరణకు కేంద్రం పెద్దపీట వేసింది. అలాగే మెజారిటీ ప్రజల జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని సంస్కరణల ద్వారా మార్కెట్‌తో అనుసంధానిస్తున్నాం. ► ప్రభుత్వం తీసుకున్న పలు సంస్కరణలు, సంబంధిత చర్యల ఫలితంగానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ), విదేశీ మారకద్రవ్య నిల్వలు రికార్డు స్థాయికి చేరాయి. ► స్టార్టప్స్ విషయంలో పెట్టుబడిదారుల స్పందన అనుహ్యంగా ఉంది. భారత్‌కు మంచి వృద్ధి అవకాశాలు ఉన్నాయనడానికి సంకేతమిది. భారత్‌కు ప్రస్తుతం 60 యూనికార్న్స్ (100 కోట్ల డాలర్ల విలువను చేరిన కంపెనీలను యూనికార్న్‌గా వ్యవహరిస్తారు) ఉన్నాయి. వీటిలో 21 గత కొద్ది నెలల్లోనే ఈ స్థాయిని అందుకున్నాయి. ► సూక్ష్మ, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నిధులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూడ్డానికి ఉద్దేశించిన ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లు నుంచి బ్యాంకింగ్ డిపాజిటర్ల ప్రయోజనాలకు ఉద్దేశించిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) యాక్ట్, 1961 సవరణ వరకూ (డిపాజిట్లపై బీమా రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకూ పెంపు) పలు బిల్లులను ప్రవేశపెట్టాం. సంస్కరణలపై ప్రభుత్వ సంకల్పాలనికి ఈ చర్యలు ఉత్తేజాన్ని ఇస్తున్నాయి. ► గత ప్రభుత్వాలు చేసిన ఎన్నో తప్పిదాలను కేంద్రం సరిదిద్దుతోంది. రెట్రో ట్యాక్స్ రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇందులో ఒక భాగం. మౌలికానికి ఫారెక్స్ నిల్వలు!: గడ్కరీ సూచన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నియంత్రణలో భారీగా ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలను (జూలై 30తో ముగిసిన వారంలో రికార్డు స్థాయిలో 621 బిలియన్ డాలర్లు. రూపాయిల్లో దాదాపు 44 లక్షల కోట్లు) దేశ మౌలిక రంగం పురోభివృద్ధికి వినియోగించుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి విధాన రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... భారత్‌కు మిగులు డాలర్ నిల్వలు ఉన్నాయి. వీటిని దేశ మౌలిక రంగం పురోభివృద్ధికి వినియోగించుకోడానికి ఉద్దేశించిన విధాన రూపకల్పనపై ఆర్బీఐ గవర్నర్‌తో చర్చించాలని నేను నిర్ణయించుకున్నాను. దేశంలో మౌలిక రంగంసహా పలు కీలక ప్రాజెక్టులకు ప్రస్తుతం చౌక వడ్డీరేటుకు నిధులను సమకూర్చుకోవాల్సి ఉంది. విద్యుత్ శాఖకు అనుబంధంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్–పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇది భారత్ విద్యుత్ రంగానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఇదే విధంగా ఇండియన్ రైల్వేలకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. ఈ తరహాలోనే భారత్ జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి కూడా ఒక ఫైనాన్షియల్ అనుబంధ సంస్థ ఉండాలి. రోడ్డు ప్రాజెక్టుల్లో భారీగా విదేశీ నిధులు వచ్చే లా కొత్త వ్యవస్థ రూపకల్పన తక్షణం జరగాలి. -
పెట్టుబడికి ఐడియా ఒక్కటే సరిపోదు..
పల్లం వెంటే నీరు ప్రవహించినట్టు.. పెట్టుబడులు కూడా రాబడులనే వెతుక్కుంటూ వెళుతుంటాయి. ఆలోచన వస్తే ఆలస్యం చేయొద్దు.. వెంటనే ఇన్వెస్ట్ చేయడమే.. దీన్నే ఆలోచనాధారిత పెట్టుబడిగా (ఐడియా ఇన్వెస్టింగ్) చెబుతుంటారు. సంప్రదాయ ఇన్వెస్టర్లు, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న వారు కంపెనీల గురించి పూర్తిగా అధ్యయనం చేయనిదే పెట్టుబడులు పెట్టరు. కానీ, ఒక ఆలోచనకు అనుబంధంగా పెట్టుబడుల నిర్ణయాలు తీసుకునే వారిని ఐడియా ఇన్వెస్టర్లుగా పిలుస్తారు. మల్టీబ్యాగర్ (పెట్టుబడిని) అని భావిస్తే చాలు వెంటనే ఆ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. పెట్టుబడులకు ముందే కంపెనీ ఆర్థిక మూలాల దగ్గర్నుంచి.. యాజమాన్యం, పోటీతత్వం, ఉత్పత్తులు/సేవలకు ఉన్న మార్కెట్ ఆదరణ ఇలా ఎన్నో అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసే వారికి రాబడులు కచ్చితంగా వస్తుంటాయి. కానీ, బుల్ మార్కెట్లో గొర్రెదాటు విధానంలో ఇన్వెస్ట్ చేసేవారికీ రాబడులు వస్తుంటాయి. మార్కెట్ గమనం మార్చుకుంటే అప్పుడు తెలిసొస్తుంది ఎక్కడ తప్పు జరిగిందో అని. ఐడియా ఇన్వెస్టర్ల పెట్టుబడుల విధానం దీనికి పూర్తి భిన్నం. ఇందులోనూ రిస్క్‌లు లేకపోలేదు. వాటిపై చర్చించే కథనమే ఇది.. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలను ప్రకటించడం తెలిసిందే. ఐడియా ఇన్వెస్టర్లు ఈ ప్యాకేజీలతో లాభపడే స్టాక్స్‌లో వెంటనే ఇన్వెస్ట్ చేస్తారు. డిజిటల్ ఇండియాపై కేంద్రం ఎక్కువగా దృష్టి పెట్టడంతో.. ఈ విధానం నుంచి లాభపడే స్టాక్స్‌ను ఎంచుకుంటారు. బీమా, రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని పెంచితే ఆయా రంగంలోని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. మౌలికరంగంపై రానున్న ఐదేళ్లలో కేంద్ర సర్కారు భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తుండడంతో ఇన్ఫ్రా స్టాక్స్‌ను ఎంపిక చేసుకుంటారు. ఇలా ఉంటుంది ఐడియా ఇన్వెస్టర్ల పెట్టుబడుల విధానం. అధ్యయనం లేకపోతే..? ఒక ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్ దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇచ్చాయంటే.. ఇతరులతో పోలిస్తే ఆ కంపెనీల గురించి ముందుగానే మెరుగైన అంచనా వేసుకుని పెట్టుబడులు పెట్టడం వల్లేనన్నది నిపుణుల అభిప్రాయం. ఫలానా రంగానికి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని.. మార్కెట్ గుర్తించని సమయంలో మేలి కంపెనీలను గుర్తించే వారు విజేతలుగా రాణిస్తుంటారు. కానీ, ఒక ఆలోచన ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లే ఐడియా ఇన్వెస్టర్లు మాత్రం కంపెనీల గురించి ఆయా రంగాల గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడం తక్కువే. దీనికి బదులు సానుకూలతలను చూసి వెంటనే ఆయా స్టాక్స్‌ను సొంతం చేసుకునే విధంగా ఉంటుంది వారి ధోరణి. ఎందుకంటే ‘ఆలస్యం అమృతం విషం’ అనే సూత్రాన్ని వారు అనుసరిస్తుంటారు. ఆత్మనిర్భర్ భారత్ కింద ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ఒక రంగానికి ప్రకటించిన తర్వాత.. ఆలస్యం చేస్తే ఆయా స్టాక్స్ ర్యాలీతో చేతికి అందకుండా పోతాయన్న భయం వారిలో ఉంటుంది. దీంతో ఫలానా అవకాశాన్ని కోల్పోకూడదన్న ధోరణితో అధ్యయనం కంటే వేగంగా ఇన్వెస్ట్ చేసేందుకే ఆసక్తి చూపిస్తుంటారు. కరోనా రెండో విడతలో ఒక దశలో ఆక్సిజన్‌కు దేశంలో తీవ్ర కొరత నెలకొనడాన్ని చూశాం. దీంతో రాబడుల కోసం ఆక్సిజన్ ఉత్పత్తి చేసే కంపెనీల వెంట పడ్డారు ఐడియా ఇన్వెస్టర్లు. ఇందుకు నిదర్శనం బోంబే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్స్. ఐడియా ఇన్వెస్టర్లనే థీమ్యాటిక్ ఇన్వెస్టర్లుగానూ పరిగణిస్తుంటారు. అంటే అప్పటి పరిస్థితులకు తగ్గట్టు పెట్టుబడులు చేస్తుంటారు. పేరులోనే ఆక్సిజన్ ఉండడంతో బోంబే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ ఏకంగా 150 శాతం ర్యాలీ చేసింది. ఈ కంపెనీ చాలా చిన్నది. రూ.200 కోట్ల మార్కెట్ విలువ కలిగినది. ఈ స్టాక్ 52 వారాల కనిష్ట ధర రూ.8511 కాగా, గరిష్ట ధర రూ.25,500 వరకు (ఏప్రిల్ 20న) పరుగులు తీసింది. ముఖ్యంగా ఈ ఏడాది మార్చి నుంచి ఏప్రిల్ మధ్య వరకు రూ.10,000 నుంచి రూ.25,000కు ర్యాలీ చేయడం గమనార్హం. కంపెనీ ఆక్సిజన్ తయారీలో లేదన్న విషయం బయటకు రావడంతో అమ్మకాల కారణంగా స్టాక్ రూ.14,550కు పడిపోయింది. వాస్తవానికి ఈ కంపెనీ గతంలో పారిశ్రామిక గ్యాస్‌ల తయారీలో ఉంది. 2019 ఆగస్ట్‌లో ఆ వ్యాపారం నుంచి తప్పుకుంది. పక్కదారి.. ఒక్క బాంబే ఆక్సిజన్ అనే కాదు.. ఐడియా ఇన్వెస్టింగ్, థీమ్యాటిక్ ఇన్వెస్టింగ్ దారిలో తప్పుదోవ పట్టించేవి ఎన్నో ఉంటాయి. మార్కెట్ పరిస్థితులను సొమ్ము చేసుకునేందుకు సీజన్‌వారీగా వ్యాపార ప్రణాళికలతో ముందుకు వెళ్లే కంపెనీలు చాలానే ఉన్నాయి. ఆకర్షణీయంగా అనిపిస్తే, నిధుల సమీకరణ ప్రతిపాదన తీసుకొచ్చి కొత్త వ్యాపారం దిశగా దూకుడుగా వెళ్లేవీ ఉన్నాయి. డాట్‌కామ్ బూమ్ సమయంలో సైబర్ పేరుతో.. 2007–08 ఇన్ఫ్రా బూమ్‌లో పేరులో ఇన్ఫ్రా తగిలించుకుని కొత్త వ్యాపారాలు మొదలు పెట్టినవి కూడా ఉన్నాయి. ఈ కామర్స్ బూమ్ చూసి లాజిస్టిక్స్ (రవాణా సేవలు)లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అడుగుపెట్టినవీ ఉన్నాయి. ఈ తరహా కంపెనీల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలన్నది నిపుణుల సూచన. ఎందుకంటే ఎంపిక చేసుకున్న వ్యాపారంలో సామర్థ్యాన్ని నిరూపించుకుని.. మార్కెట్ లీడర్‌గా అవతరించిన తర్వాత.. వ్యాపార విస్తరణ కోణంలో నూతన అవకాశాల వైపు చూసే కంపెనీలు రాణించేందుకు అవకాశం ఉంటుందని భావించొచ్చు. కానీ, ఒక వ్యాపారంలో రాణించలేక.. మార్కెట్ ధోరణికి తగినట్టు వ్యవహరించే కంపెనీల నుంచి రాబడులను ఆశించడం నష్టాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. ఇందుకు వక్రంగీ సాఫ్ట్వేర్ కంపెనీయే ఉదాహరణ. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసే వ్యాపారంలో ఉన్న ఈ కంపెనీ ఎన్నో నూతన అవతారాలతో వాటాదారులకు నష్టాలు మిగిల్చింది. ఆధార్ యూఐడీ ప్రాజెక్ట్‌కు 2010లో ఫ్రాంచైజీగా వ్యవహరించిన ఈ సంస్థ.. అనుబంధ కంపెనీలతో ఈకామర్స్ సంస్థలకు లాజిస్టిక్స్ సేవలు, బంగారం రిటైలింగ్ ఇలా కొత్త వ్యాపారాలను చేపట్టింది. అంతటితోనూ ఆగలేదు. దేశవ్యాప్తంగా వైట్‌లేబుల్ ఏటీఎంల ఏర్పాటులోకీ ప్రవేశించింది. వైట్ లేబుల్ అంటే అన్ని బ్యాంకుల కస్టమర్ల కోసం స్వతంత్రంగా ఏర్పాటు చేసేవి. ఈ కంపెనీ నూతన ఎత్తుగడలు థీమ్యాటిక్/ ఐడియా ఇన్వెస్టర్లకు తెగనచ్చేసింది. దీంతో 2015 సెప్టెంబర్‌లో రూ.54 వద్దనున్న షేరు ధర 2018 జనవరి 25న రూ.505 గరిష్టాలకు చేరింది. ఆ తర్వాత కంపెనీ నిర్వహణ ప్రమాణాల్లో లోపాలు వెలుగు చూశాయి. ఆడిటర్ రాజీనామా, సెబీ జరిమానాలు.. ఈ పరిణామాలతో స్టాక్ ధర 2018 నవంబర్‌లో రూ.32కు పడిపోయింది. ఇప్పటికీ ఈ స్టాక్ ధర రూ.46 దరిదాపుల్లోనే ఉంది. ... అందుకే మూక ధోరణి ఇక్కడ పనికిరాదు. మధ్యలోనే కాడి వదిలేసేవాటికి దూరంగా ఉంటేనే ఇన్వెస్టర్ల పెట్టుబడులకు రక్షణ. ఇందుకోసం పెట్టుబడులు పెట్టే ముందుగా కంపెనీ ఆర్థిక అంశాలను పూర్తిగా అధ్యయనం చేయాలి. వార్షిక రిపోర్ట్‌లను, యాజమాన్యం భవిష్యత్తుకు సంబంధించి చేసే వ్యాఖ్యలు, ప్రణాళికలను పరిశీలించాలి. ఉన్న వ్యాపారాన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లకుండా కొత్త వ్యాపారాల్లోకి ఎప్పటికప్పుడు ప్రవేశించే కంపెనీల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన వ్యాపారాలను ఏర్పాటు చేసి, వాటిని విజయం దిశగా నడిపించిన యాజమాన్యాలు అయితే ఫర్వాలేదు. సరైన ట్రాక్రికార్డు లేకుండా ఎప్పుడూ వార్తల్లో ఉండేలా వ్యాపారాలను సృష్టించే వాటి విషయంలోనే అప్రమత్తంగా ఉండాలి. నిర్వహణ అంత సులువుకాదు.. నిర్వహణ సామర్థ్యం ఉందా, లేదా? అని చూడకుండా పెట్టుబడులకు ఆయా కంపెనీలను ఎంపిక చేసుకోవడం వల్ల లాభాలు వస్తాయన్న హామీ ఉండదు. ఏ కొత్త వ్యాపారం అయినా దాన్ని విజయవంతం చేసే సామర్థ్యాలు యాజమాన్యాలకు ఉన్నాయా? అనేది ముఖ్యంగా చూడాలి. ఎడ్యుకాంప్ సొల్యూషన్స్ కంపెనీని ఇక్కడ ఉదాహరణగా తీసుకోవాలి. 2008–2010 మధ్య ఐడియా ఇన్వెస్టర్లకు ఈ స్టాక్ ఎంతో ఆకర్షణంగా ఉండేది. 2006లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఈ కంపెనీ షేరు.. బ్రహ్మాండమైన ర్యాలీతో ఇన్వెస్టర్ల మతిపోగొట్టింది. మనదేశంలో దాదాపు స్కూళ్లన్నీ బ్లాక్ బోర్డులపై బోధనతోనే నడుస్తుండేవి. సరిగ్గా వీటి స్థానంలో డిజిటల్ బోధన అనే ఐడియాను ఈ సంస్థ వ్యాపార మంత్రంగా చేసుకుంది. దేశవ్యాప్తంగా స్కూళ్లకు మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టింది. లిస్ట్ అయిన మూడేళ్లలోనే ఆదాయంలో నూరు శాతం వృద్ధిని చూపించింది. 48 శాతం నిర్వహణ లాభాలను ప్రకటించింది. 2,500 స్కూళ్లలో స్మార్ట్‌క్లాస్ సొల్యూషన్లను ఏర్పాటు చేసింది. 15,000 స్కూళ్లకు విస్తరించి, రూ.1,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దూకుడుగా అయితే వెళ్లింది కానీ, ప్రణాళిక లోపించింది. స్కూళ్లల్లో డిజిటల్ బోధన పరికరాలను ఏర్పాటు చేస్తేనే ఆదాయం రాదు కదా.. ఆ విధానాన్ని వ్యాపార పరంగా విజయవంతంగా మార్చుకోవడంలో విఫలమైంది. స్కూళ్ల సంఖ్యను పెంచుకోవడంపై ఎక్కువగా దృష్టి పెట్టింది. దీంతో చాలా స్కూళ్లు ఎడ్యుకాంప్కు చెల్లింపులు కూడా చేయలేకపోయాయి. స్కూళ్ల నుంచి కంపెనీకి రావాల్సిన చెల్లింపులు పేరుకుపోవడంతో.. తీసుకున్న రుణాలకు చెల్లింపులు చేయలేక ఎడ్యుకాంప్ చేతులెత్తేసింది. 2016లో బ్యాంకుల నిరర్థక ఆస్తిగా ఈ కంపెనీ మారిపోయింది. ఒకప్పుడు రూ.1,000 పలికిన షేరు ఇప్పుడు రూ.3 దగ్గర్లో ట్రేడవుతోంది. అందుకే కంపెనీ వ్యాపార ఆలోచనలు బ్రహ్మాండంగా ఉండే సరిపోదు. సమర్థవంతంగా నిర్వహించి, విజయాలను అందుకోవడం కొన్నింటికే సాధ్యపడుతుంది. ఆ కొన్నింటిని గుర్తించగలిగితే రాబడులు బుట్టనిండా వేసుకోవచ్చు. అలా అని అన్ని కంపెనీలూ బోంబే ఆక్సిజన్, వక్రంగీ సాఫ్ట్వేర్, ఎడ్యుకాంప్ అవుతాయని కూడా అనుకోవద్దు. ముఖ్యంగా కరోనా రాకతో ఫార్మా, ఆస్పత్రుల కంపెనీలకు భారీ లాభాలు వస్తాయన్న ఐడియాతో ఆయా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన వారు గడిచిన ఏడాది కాలంలో గణనీయమైన రాబడులను సొంతం చేసుకున్నారు. అయితే, ఫార్మా రంగంలో మన దేశం దిగ్గజంగా ఉన్న విషయం తెలిసిందే, ప్రపంచస్థాయి కంపెనీలు ఇక్కడ ఎప్పుడో కొలువుదీరి వ్యాపారంలో కాకలు తీరి ఉన్నాయి. డయాగ్నోస్టిక్స్, ఆస్పత్రుల్లోనూ మంచి కంపెనీలున్నాయి. దీంతో ఈ ఐడియా మంచి లాభాలనే కురిపించింది. కరోనా రాక ముందు కూడా ఇవన్నీ వ్యాపారంలో మంచి పనితీరు చూపిస్తున్నాయి. కరోనా కారణంగా పెరిగిన డిమాండ్‌తో మరింత లాభపడ్డాయి. అందుకే ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా వచ్చే అవకాశాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే ఐడియా ఇన్వెస్టర్లు తమ మొత్తం పెట్టుబడులను వాటికే కేటాయించకుండా.. 10–20 శాతానికే పరిమితం చేసుకోవడం, పూర్తి అధ్యయనం తర్వాతే అడుగులు వేయడం వల్ల రాబడులు అటుంచితే పెట్టుబడులకు నష్టం కలగకుండా కాపాడుకోవచ్చు. -
బ్యాంకుల పర్యవేక్షణ మరింత పటిష్టం
ముంబై: కొంగొత్త సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా ఆర్థిక రంగ సంస్థలను తీర్చిదిద్దే దిశగా రిస్కు అధారిత పర్యవేక్షణ (ఆర్బీఎస్) విధానాన్ని సమీక్షించాలని, పటిష్టం చేయాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ ప్రక్రియ కోసం సాంకేతిక నిపుణులు/కన్సల్టెంట్ల నుంచి బిడ్లను ఆహ్వానించింది. బ్యాంకులు, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో పాటు దేశవ్యాప్త ఆర్థిక సంస్థల పర్యవేక్షణకు ఆర్బీఎస్ విధానాన్ని రిజర్వ్ బ్యాంక్ ఉపయోగిస్తోంది. అసెట్ క్వాలిటీ, లిక్విడిటీ, ఆర్థిక సామర్థ్యాలు, గవర్నెన్స్ మొదలైన అంశాలను మదింపు చేసేందుకు ఇది తోడ్పడుతోంది. -
పాత డ్యాంలతో ప్రపంచానికి ముప్పు
న్యూయార్క్: భవిష్యత్ తరాలకు జలప్రళయం పొంచి వుంది. కాలం తీరిన భారీ ఆనకట్టలతో రాబోయే మూడు దశాబ్దాల్లో ప్రజలు పెనుముప్పును ఎదుర్కోబోతున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. భారతదేశంలోని దాదాపు వెయ్యి డ్యాంలు నిర్మించి 2025 నాటికి 50 ఏళ్లు పూర్తవుతుంది. ప్రపంèచవ్యాప్తంగా ఇలా కాలం తీరిన డ్యాంలు అత్యంత ప్రమాదకరంగా మారుతాయని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. 2050 నాటికి.. అంటే మరో 30 ఏళ్లలో ఇటువంటి పురాతన ఆనకట్టలకు దిగువనే అత్యధిక మంది జీవిస్తూ ఉండే పరిస్థితి ఉంటుందని తెలియజేసింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ‘కెనడా ఇనిస్టిట్యూట్ ఫర్ వాటర్, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్’ సంకలనం చేసిన ‘ఏజింగ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్: ఎన్ ఎమర్జింగ్ గ్లోబల్ రిస్క్’ అనే నివేదిక ప్రపంచవ్యాప్తంగా 1930 నుంచి 1970 మధ్య నిర్మించిన 58,700 భారీ ఆనకట్టల జీవిత కాలాన్ని 50 నుంచి 100 ఏళ్లకే రూపకల్పన చేసిన ట్టు వెల్లడించింది. 50 ఏళ్ల తరువాత నుంచి ఇటువంటి భారీ ఆనకట్టల సామర్థ్యం క్షీణిస్తూ వస్తుంది. అమెరికాలో... అమెరికాలోని 90,580 డ్యాంల సరాసరి వయస్సు 56 ఏళ్ళు. 2020 సంవత్సరంలో అమరికాలోని దాదాపు 85 శాతం ఆనకట్టలు వాటి జీవితకాలానికి మించి పనిచేస్తున్నాయి. 75 శాతం అమెరికా డ్యాంలు 50 ఏళ్ళు దాటిన తరువాత ఫెయిల్ అవడం ప్రారంభం అవుతుంది. అమెరికాలోని ఆనకట్టల పునరుద్ధరణకు 64 బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది. 21 అమెరికా రాష్ట్రాల్లోని గత ముప్ఫయ్యేళ్ళలో దాదాపు 1,275 డ్యాంలను తొలగించారు. కేవలం 2017లోనే 80 డ్యాంలను తొలగించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రాజెక్టుల్లోని నీటి పరిమాణం 7,000 నుంచి 8,300 క్యూబిక్ కిలో మీటర్లు అని అంచనా వేశారు. ఆసియా, యూరప్, నార్త్ అమెరికాల్లో ప్రధానంగా 20వ శతాబ్దం మధ్య కాలంలో 1960– 70 దశకంలో అత్యధికంగా భారీ ఆనకట్టల నిర్మాణం జరిగింది. ఆఫ్రికాలో 1980ల్లో అత్యధికంగా డ్యాంల నిర్మాణం జరిగింది. ఆ తరువాత కాలంలో కొత్తగా భారీ ఆనకట్టల నిర్మాణం తగ్గుతూ వచ్చిందని ఈ అధ్యయనం తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 20 శతాబ్దం మధ్యలో మాదిరిగా ప్రపంచంలో తిరిగి పెద్ద ఆనకట్టల నిర్మాణం జరిగే అవకాశం ఇప్పుడు లేదు. కానీ ఆ రోజుల్లో నిర్మించిన ఆనకట్టలకు అనివార్యంగా వయస్సు పెరుగుతూ వస్తుంది. నాలుగు దశాబ్దాలుగా భారీ ఆనకట్టల నిర్మాణం తగ్గుతూ వస్తోంది. దీనికి కారణం ఈ భారీ ఆనకట్టల నిర్మాణానికి అవసరమైన ప్రాంతాలు సైతం క్రమంగా తగ్గిపోతున్నాయి. ఇప్పటికే 50 శాతం నదీప్రవాహ ప్రాంతం విఛ్చిన్నమైపోయినట్టు రిపోర్టు తెలిపింది. అలాగే భారీ డ్యాంల నిర్మాణాలు చూపుతోన్న ప్రభావం, పర్యావరణ సమస్యలు తదితర అంశాలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెరిగిందని కూడా ఈ అధ్యయనం గుర్తించింది. అందుకే భారీ ప్రాజెక్టుల స్థానంలో ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నీటిని నిల్వచేసే దృక్పథం, దృష్టీ పెరిగింది. అందుకే సహజ సిద్ధమైన పరిష్కారాలను వెతుకుతున్న విషయాన్ని ఈ అధ్యయనం తేల్చింది. తీవ్రతరమవుతోన్న పర్యావరణ పరిస్థితుల రీత్యా ఆనకట్టల రూపకల్పనలో పరిమితులను పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. కాలంచెల్లిన ఆనకట్టలను తొలగించాల్సిన ఆవశ్యకతను ఈ రిపోర్టు స్పష్టం చేస్తోంది. ప్రజల భద్రత, నిర్వహణా ఖర్చులు తగ్గించేందుకు, రిజర్వాయర్ల సెడిమెంటేషన్, సహజసిద్ధమైన నదులను పరిరక్షించుకోవడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన భారీ ఆనకట్టల నిర్మాణం తగ్గడానికి ప్రధాన కారణాలని రిపోర్టు వెల్లడించింది. ఆనకట్టల నిర్మాణం ఎంత ముఖ్యమో, వాటి కాలం చెల్లిన తరువాత వాటి తొలగింపు కూడా మానవాళి మనుగడకోసం అంతే ముఖ్యమని అధ్యయనం అభిప్రాయపడింది. కాలం తీరడం అంటే.. ఆనకట్ట నిర్మాణ సామర్థ్యాన్ని బట్టి అది ఎంతకాలం ఉంటుందో నిర్ధారిస్తారు. ఆనకట్ట నిర్మించి 50 ఏళ్లు దాటిన తరువాత దాని జీవిత కాలం క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఆనకట్టకి పదే పదే మరమ్మత్తుల అవసరం అవుతూ ఉంటాయి, డ్యాం సామర్థ్యం క్షీణించడం వల్ల నిర్వహణ ఖర్చు పెరుగుతుంది. నాణ్యమైన ఆనకట్టలను రూపకల్పన చేస్తే, వాటి నిర్వహణ సమగ్రంగా ఉంటే, 100 సంవత్సరాల వరకూ చక్కగా ఉపయోగపడతాయి. కానీ, ఆర్థిక పరిమితులు, ఇతర ఆచరణాత్మక సమస్యల వల్ల వయస్సుమీరిన ఆనకట్టలు పనికిరాకుండా పోయే పరిస్థితి వస్తుంది. 20వ శతాబ్దంలో నిర్మించిన వేలకొద్దీ ఆనకట్టల దిగువన 2050 కల్లా అత్యధిక మంది ప్రజలు నివసించే పరిస్థితి ఏర్పడుతుంది. వాటిలో చాలా వరకు ఇప్పటికే కాలంతీరినట్టు ఐక్యరాజ్య సమితి యూనివర్సిటీ అంచనా వేసింది. అమెరికా, ఫ్రాన్స్, కెనడా, ఇండియా, జపాన్, జాంబియా, జింబాబ్వే దేశాల్లోని డ్యాంలపై ఈ అధ్యయనం చేశారు. కేరళకు పెను ముప్పు భారతదేశంలో దాదాపు 1,115 భారీ ఆనకట్టలు నిర్మాణం జరిగి 2025 నాటికి 50 ఏళ్లు పూర్తికానుంది. దేశంలోని దాదాపు 4,250కి పైగా ఆనకట్టలకు 2050 నాటికి 50 ఏళ్లు నిండుతాయి. అలాగే 2050 సంవత్సరానికల్లా దేశంలోని 64 ఆనకట్టలకు 150 ఏళ్ల పూర్తవుతాయి. 100 ఏళ్ల క్రితం నిర్మించిన కేరళలోని ముల్లపెరియార్ డ్యాం బద్దలైతే దాదాపు 35 లక్షల మంది ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఈ అధ్యయనం అంచనా వేసింది. దీన్ని భూకంపాలకు అనువైన ప్రదేశంలో కట్టారని, అలాగే కట్టడం క్రమంగా దెబ్బతింటోందని, ఈ డ్యాం పర్యవేక్షణ కేరళ తమిళనాడుల మధ్య వివాదాస్పదంగా మారిందని చెప్పింది. అత్యధిక ఆనకట్టలు నాలుగు దేశాల్లోనే... 20 శతాబ్దపు మధ్యలో ప్రపంచం అనూహ్యంగా భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చవి చూసిందని రిపోర్టు వెల్లడించింది. నాలుగు ఆసియా దేశాల్లోనే అత్యధికంగా భారీ డ్యాంలున్నాయని గుర్తుచేసింది. చైనా, ఇండియా, జపాన్, దక్షిణ కొరియాల్లో మొత్తం 32,716 పెద్ద ఆనకట్టలు(ప్రపంచంలోనే 55 శాతం) ఉన్నాయి. ఒక్క చైనాలోనే 23,841 భారీ ఆనకట్టలు(ప్రపంచంలోని మొత్తం డ్యాంలలో 40 శాతం) ఉన్నాయి. వీటిలో చాలా వాటికి త్వరలోనే 50 ఏళ్లు పూర్తవుతాయి. వీటికి ప్రమాదం పొంచి వున్నట్టు అధ్యయనంలో తేలింది. ఇదే పరిస్థితి ఆఫ్రికా, దక్షిణ అమెరికా, తూర్పు యూరప్‌లోనూ ఉంది. కాలంతీరిన పెద్ద ఆనకట్టల సమస్య చాలా తక్కువ దేశాలెదుర్కొంటున్నాయి. ప్రపంచంలోని పెద్ద ఆనకట్టలలో 93 శాతం కేవలం 25 దేశాల్లోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆనకట్టల స్థితిగతులు ఇలా.. -
2050 నాటికి తీవ్రమైన నీటి సంక్షోభం..
ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగిన 100 ప్రధాన నగరాలు తీవ్రమైన నీటి సంక్షోభాన్నిఎదర్కోనున్నాయి. దీంతో 2050 నాటికి ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న 350 మిలియన్ల ప్రజలు ఈ సమస్యను ఎదర్కోనున్నారు. ప్రపంచ వైల్డ్‌లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇటీవల నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. వాతావరణ మార్పులకు అనుగుణంగా అత్యవసర చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జాబితాలో 30 లక్షలకు పైగా జనాభా ఉన్న జైపూర్ 45వ స్థానంలో ఉండగా, 20 లక్షల జనాభాతో ఇండోర్ 75వ స్థానంలో ఉంది. దక్షిణ అమెరికా,దక్షిణ ఆసియా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలతో పాటు చైనాలోని దాదాపు 50 నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. (ఎల్లో అలర్ట్: చెన్నై ఉక్కిరిబిక్కిరి.. ) ముఖ్యంగా భారత్‌లోని ప్రధాన నగరాలైన అమృత్సర్, పూణే, శ్రీనగర్, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, సూరత్ సహా కోజికోడ్, విశాఖపట్నం, థానే, వడోదర, రాజ్‌కోట్, కోటా, నాసిక్, లక్నో, కన్పూర్ సహా మరికొన్ని నగరాలు ఈ అత్యధిక రిస్క్ జోన్లో ఉన్నాయి. దేశంలో పర్యావరణం తీవ్ర సంక్లిష్టంలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఉండగా మరికొన్ని నగరాల్లో వరదలు ప్రధాన సమస్యగా మరింది. వాటర్ షెడ్డులు, చిత్తడి నేలల పునరుద్ధణ వంటి చర్యలు వెంటనే చేపట్టకపోతే ఇది భవిష్యత్ తరాలకు తీవ్ర సమస్యగా మారే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. రిస్క్ జోన్లో ఉన్న నగరాలు 2020లో 17 శాతంగా ఉంటే ఇది 2050 నాటకి 51శాతానికి పెరగనున్నట్లు సర్వే పేర్కొంది. (ఢిల్లీ వాసులను వణికిస్తున్న కరోనా ‘థర్డ్ వేవ్’ ) -
అంతరిక్ష ప్రయాణం
రిస్క్ తీసుకోవడం హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌కి మహా సరదా. తన సినిమాలో స్టంట్లన్నీ దాదాపు స్వయంగానే చేస్తారు. అవసరమైతే ప్రయాణిస్తున్న విమానం మీద నిల్చుంటారు. ఎల్తైన కట్టడం బూర్జ్ ఖలీఫా మీద ఫైటింగ్స్ చేస్తారు. తాజాగా ఓ సినిమా చిత్రీకరణను ఏకంగా అంతరిక్షంలోనే చేయాలనుకుంటున్నారు. దాదాపు పన్నెండు వందల కోట్ల బడ్జెట్‌తో యూనివర్శల్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇందుకోసం అక్టోబర్ 2021లో అంతరిక్ష యానం చేయనున్నారు టామ్ క్రూజ్. ఈ చిత్రదర్శకుడు డౌగ్ లిమన్తో కలసి ఈ ప్రయాణం చేయనున్నారు టామ్. చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభిస్తారో ఇంకా ప్రకటించలేదు. -
వైరస్‌తో కలిసి సహజీవనం తప్పదు..
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ను మరింత కాలం పాటు పొడిగించిన పక్షంలో దేశానికి ఆర్థికంగా.. ఆత్మహత్యా సదృశ్యమయ్యే రిస్కు పొంచి ఉందని పారిశ్రామిక దిగ్గజం, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. లాక్డౌన్ వల్ల లక్షల ప్రాణాలను కాపాడుకోగలిగినప్పటికీ.. పొడిగిస్తూ పోవడం వల్ల బడుగు వర్గాలు తీవ్రమైన కష్టాలు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ‘టెస్టింగ్ పెరిగే కొద్దీ, కేసుల సంఖ్యపెరగడం కూడా సాధారణంగా జరిగేదే. అయితే, లాక్‌డౌన్‌ను మరింత దీర్ఘకాలం పొడిగిస్తే మాత్రం ఆర్థికంగా ఆత్మహత్యా సదృశ్యమయ్యే రిస్కు ఉంది. వైరస్‌తో కలిసి సహజీవనం చేయక తప్పదు’ అని ట్వీట్ చేశారు. -
రిస్క్ తీసుకున్నా
విక్రమ్‌ప్రభు హీరోగా నటించిన ‘ఇదు ఎన్న మాయమ్’ (2015) చిత్రంతో తమిళంలో, రామ్ హీరోగా నటించిన ‘నేను.. శైలజ’ (2016) చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు కీర్తీ సురేష్. ‘మహానటి’ చిత్రంతో తనలో అద్భుత నటి ఉందని నిరూపించుకున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఆమె కెరీర్ జోరుగా ఉంది. ఈ విషయం గురించి కీర్తీ సురేష్ మాట్లాడుతూ –‘‘నేనీ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాను. ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ కెరీర్లో రిస్క్ తీసుకుని ధైర్యంగా ముందడుగు వేశాను. నేను ఓవర్‌నైట్ స్టార్‌ని కాలేదు. కానీ ఊహించనదాన్ని కన్నా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో నాకు మంచి ఫేమ్ వచ్చిందని మాత్రం చెప్పగలను. అలాగే ఇంత తక్కువ సమయంలో జాతీయ అవార్డు (‘మహానటి’ చిత్రానికి) సాధిస్తానని కూడా ఊహించలేదు. నేను చేసిందల్లా శక్తివంచన లేకుండా నా పాత్రలకు న్యాయం చేయడమే’’ అన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘అన్నాత్తే’ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు కీర్తీ సురేష్. అలాగే ఇటు తెలుగు అటు తమిళంలో ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు ‘మిస్ ఇండియా, గుడ్‌లక్ సఖి, పెంగ్విన్ ’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. -
యాంటీ బయాటిక్స్ అతి వాడకం అనర్థమే
బోస్టన్: తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోని పిల్లలు వారి మొదటి ఐదేళ్ల జీవితంలో సగటున 25 యాంటీ బయాటిక్ ప్రిస్క్రిప్షన్లను అందుకుంటున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది వారిలో వ్యాధికారకాలతో పోరాడే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని, అలాగే ప్రపంచవ్యాప్తంగా యాంటి బయాటిక్ నిరోధకతను పెంచుతుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభానికి దోహదం చేసే ప్రధాన కారకాల్లో యాంటి బయాటిక్స్ వాడకం కూడా ఉందని తెలిపింది. -
ఒక్క టాబ్లెట్‌తో గుండె జబ్బులు మాయం!
సాక్షి, న్యూఢిల్లీ : రోజుకు నాలుగు మందుల మిశ్రమం కలిగిన ఒక చిన్న టాబ్లెట్ వేసుకోవడం ద్వారా దేశంలో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని ఓ తాజా వైద్య అధ్యయనం వెల్లడించింది. తద్వారా ‘జాతీయ ఆరోగ్య స్కీమ్’ కింద ప్రభుత్వానికి ఖర్చవుతున్న కోట్లాది రూపాయలను ఆదా చేయవచ్చని కూడా ఆ అధ్యయనం సూచించింది. ఆస్ప్రిన్, స్టాటిన్ మందులతోపాటు రక్తపోటును నియంత్రించే ఏవైనా రెండు మందులతో కూడిన ‘పోలి పిల్’ వేసుకుంటే గుండెపోటు రాకుండా చేయవచ్చని అధ్యయనం జరిపిన వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులు ఉన్నవారే కాకుండా ఎలాంటి గుండె జబ్బులు లేని వారు కూడా ఈ ‘పోలి పిల్’ వేసుకుంటే వారిలో 40 శాతం వరకు గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని వారు చెప్పారు. పలు మందుల మిశ్రమ‘ పోలి పిల్స్’ గురించి గత కొన్నేళ్లుగా బ్రిటన్‌లో అధ్యయనాలు కొనసాగుతున్నా తాజా అధ్యయనమే సత్ఫలితాలిచ్చాయని వైద్యులు తెలిపారు. పైగా ఒక్క ట్యాబ్లెట్‌కు భారతీయ కరెన్సీలో కేవలం రెండు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని వారు చెప్పారు. 50 ఏళ్ల నుంచి 75 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన ఏడువేల మందిపై ఐదేళ్లపాటు అధ్యయనం జరపడం వల్ల ఈ ‘ పోలి పిల్’ ప్రభావాన్ని అధ్యయనం చేయగలిగామని వైద్యులు ‘ది లాన్సెట్’ పత్రికలో వివరించారు. దేశంలోని లక్షలాది మంది ప్రజలు ఇప్పటికే ‘స్టాటిన్ ట్యాబ్లెట్ల’తోపాటు బీపీ మందులు వాడుతున్నారని, వారు అనేక మందులు తీసుకునే బదులు రోజుకో ట్యాబ్లెట్ తీసుకుంటే సరిపోతుందని అధ్యయనంలో పాల్గొన్న బర్మింగమ్ యూనివర్శిటీ చెందిన ప్రొఫెసర్ టామ్ మార్శల్ తెలిపారు. ఎలాంటి గుండె జబ్బులు లేకుండా 50 ఏళ్ల వయస్సు దాటిని వారంతా ఈ ‘పోలి పిల్’ వాడడం వల్ల గుండె జబ్బులను అరికట్టవచ్చని ఆయన చెప్పారు. -
‘మిషన్ శక్తి’తో ఐఎస్ఎస్కు ముప్పు
వాషింగ్టన్: శత్రుదేశాల ఉపగ్రహాలు కూల్చేసేందుకు ఇటీవల భారత్ చేపట్టిన శాటిలైట్ విధ్వంసక క్షిపణి (ఏశాట్) పరీక్ష వల్ల అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికే (ఐఎస్ఎస్) ముప్పు వాటిల్లనుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా హెచ్చరించింది. ఆ ప్రయోగం వల్ల అంతరిక్షంలో దాదాపు 400 వ్యర్థ శకలాలు పోగుపడ్డాయని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రైడెన్‌స్టిన్ తెలిపారు. దీంతో ఐఎస్ఎస్ను వ్యర్థాలు ఢీకొనే ప్రమాదం 44 శాతం పెరిగిందన్నారు. కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాలను కూల్చేయగల చరిత్రాత్మక ‘మిషన్ శక్తి’ని విజయవంతంగా భారత్ ప్రయోగించినట్లు ప్రధాని మోదీ మార్చి 27న వెల్లడించడం తెల్సిందే. 60 వ్యర్థ శకలాలను గుర్తించామని, అందులో 24 ఐఎస్ఎస్కు అతి దగ్గరలో ఉన్నాయని బ్రైడెన్‌స్టిన్ చెప్పారు. ‘అంతరిక్షంలోకి వ్యర్థాలను పంపడం చాలా ఘోరమైన చర్య. అది కూడా అంతరిక్ష పరిశోధన కేంద్రానికి దగ్గరగా పంపడం దారుణం. భవిష్యత్తులో మానవులు అంతరిక్షంలోకి పంపేందుకు చేపట్టే ఉపగ్రహ ప్రయోగాలకు ఇలాంటి చర్యలు విఘాతం కలిగిస్తాయి’అని చెప్పారు. మిషన్ శక్తిలో భాగంగా భారత్ తన ప్రయోగాన్ని వాతావరణ దిగువ పొరల్లోనే చేయడం వల్ల శకలాలు కొన్ని వారాల వ్యవధిలోనే వాతావరణంలోకి ప్రవేశించి మండిపోతాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసినా అలా జరగలేదని ఆయన పేర్కొన్నారు. భారత్ ఏశాట్ పరీక్షకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయం నుంచి మాట్లాడిన తొలి వ్యక్తి బ్రైడెన్‌స్టిన్ కావడం గమనార్హం. శకలాల వల్ల ఐఎస్ఎస్కు ముప్పు పొంచి ఉందనే విషయాన్ని నాసా నిపుణులు, జాయింట్ స్పేస్ ఆపరేషన్స్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు చెప్పినట్లు బ్రైడెన్‌స్టిన్ తెలిపారు. 2007లో చైనా ఇలాంటి ప్రయోగమే చేపట్టడం వల్ల పోగుపడ్డ శకలాలు ఇంకా అంతరిక్షంలోనే ఉన్నాయని గుర్తు చేశారు. -
బాండ్ ఫండ్లు కొన్నిచాలు!
పెట్టుబడి పెట్టేటపుడు ప్రతి ఇన్వెస్ట్‌మెంట్‌పైనా అధిక రాబడిని ఆశిస్తే రిస్క్ పెరిగిపోతుందని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎక్కువ రిస్క్ ఎక్కువ ఉంటే అక్కడే రాబడి కూడా ఎక్కువుంటుంది. అందుకని రిటైల్ ఇన్వెస్టర్లు ప్రతిచోటా అధిక రాబడి ఆశిస్తే... ప్రతికూల పరిస్థితుల్లో కొన్ని చేదు ఫలితాలు ఎదురుకావచ్చు. కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను డైవర్సిపై చేసుకోవటం తప్పనిసరి. అధిక రాబడుల కోణంలో 100 శాతం పెట్టుబడులను ఈక్విటీ పథకాల్లోనే ఇన్వెస్ట్ చేయకుండా, కొంత శాతాన్ని బాండ్ ఫండ్స్‌కు కూడా కేటాయించుకోవడం శ్రేయస్కరం. సెబీ ఇటీవల మ్యూచువల్ ఫండ్ పథకాలను హేతుబద్ధం చేయటం తెలిసిందే. అయితే, బాండ్ ఫండ్స్‌లో 16 కేటగిరీలను ప్రవేశపెట్టడంతో వీటిలో ఏ పథకాలు ఎంచుకోవాలి? అన్న సందేహం చాలా మందికి వస్తోంది. వీటిని నిపుణుల ముందు ఉంచింది ‘సాక్షి’. రెండు మూడు బాండ్ ఫండ్స్ చాలన్నది వారి సూచన. ఇంకా వారు చెప్పిన వివరాల సమాహారమే ఈ కథనం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం సరైన బాండ్ ఫండ్ ఎంచుకునేందుకు ముందుగా ఆ ఫండ్‌తో వచ్చే ప్రయోజనాలపై అవగాహన తెచ్చుకోవాలి. ప్రాథమికంగా చూస్తే బాండ్ ఫండ్ అన్నది మొత్తం పోర్ట్‌ఫోలియోకు కుషన్ లాంటిది. స్థిరమైన రాబడులతో పోర్ట్‌ఫోలియోకు దన్నుగా ఉంటుంది. డెట్ ఫండ్స్ అన్నవి మరింత ఆటుపోట్లతో కూడిన పెట్టుబడి సాధనాలకు హెడ్జింగ్ లాంటివన్నది ‘ఫండ్స్ ఇండియా’ మ్యూచువల్ ఫండ్స్ రీసెర్చ్ హెడ్ విద్యా బాల మాట. అయితే, బాండ్ ఫండ్స్‌లో ఎన్నో రకాలున్నాయి కనుక వాటిని చూసి అయోమయంలో పడిపోవక్కర్లేదు. బాండ్ పోర్ట్‌ఫోలియో ఏర్పాటుకు సులభ విధానాన్ని అనుసరించొచ్చని, రెండు మూడు రకాల పథకాలకు మించి అవసరం లేదని ఆయన చెప్పారు. మొదటి ప్రాధాన్యం ఇదీ... బాండ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకునే వారికి తొలి ప్రాధాన్యం లిక్విడ్ ఫండే. 91 రోజుల వరకు కాల వ్యవధి తీరే సాధనాల్లో ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. వీటి గురించి అర్థం చేసుకునేందుకు ఎటువంటి గందరగోళం అవసరం లేదు. ‘‘వీటిలో రాబడులన్నవి ముందే అంచనా వేయొచ్చు. పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్నిస్తాయి. క్రెడిట్ లేదా వడ్డీ రేట్ల పరంగా రిస్క్ ఉండదు’’అని విద్యా బాల వివరించారు. పైగా లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుబడులను అత్యవసర నిధిగా వినియోగించుకోవటం సులువు. మిగులు నిధులను బ్యాంకు ఖాతాల్లో ఉంచే బదులు లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే రాబడులు అధికంగా పొందొచ్చు. బ్యాంకు సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ 3.5 శాతమే. కానీ, లిక్విడ్ ఫండ్ లేదా లోడ్యూరేషన్ ఫండ్‌లో రాబడులు 7– 7.5 శాతం స్థాయిలో ఉంటాయి. లిక్విడ్ ఫండ్స్‌లో ఉంచిన నిధులను ఇన్వెస్టర్‌కు అవసరం ఏర్పడితే కొన్నింటిలో తక్షణమే వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఉంది. రూ.50,000 వరకు లేదా ఫండ్ విలువలో 90 శాతం ఏది తక్కువ అయితే ఆ మేర వెంటనే వెనక్కి తీసుకోవచ్చు. కొన్నింటిలో మరుసటి రోజు తీసుకునేందుకు అవకాశం ఉంది. వెంటనే తీసుకునే అవకాశం ఉన్నందున బ్యాంకు ఖాతాకు ఉన్న సౌకర్యం ఇందులోనూ ఉంటుంది. అతితక్కువ లేదా తక్కువ కాల ఫండ్స్ మూడేళ్ల కాల వ్యవధి వరకు ఉన్న సాధనాల్లో పెట్టుబడులు పెడతాయని, ఇన్వెస్టర్లు ఇంతే కాల వ్యవధి కోసం వీటిని ఎంచుకోవచ్చన్నది మార్నింగ్ స్టార్ ఫండ్ రీసెర్చ్ డైరెక్టర్ కౌస్తుభ్ బేల్‌పుర్కార్ సూచన. వడ్డీ రేట్ల పరంగా వీటిలో అంత రిస్క్ ఉండదని, తక్కువ కాల వ్యవధితో కూడిన బాండ్స్ వీటి పోర్ట్‌ఫోలియోలో ఉండడమే కారణమని, లిక్విడ్ ఫండ్ కంటే అధిక రాబడులను ఇస్తాయని చెప్పారాయన. దాదాపు రిస్క్‌కు దూరంగా ఇవి అధిక రాబడులను అందిస్తాయని ప్లాన్‌రూపీ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు అమోల్ జోషి చెప్పారు. చాలా మంది ఇన్వెస్టర్లకు లిక్విడ్ ఫండ్, లో డూరేషన్ ఫండ్ సరిపోతాయని ఆయన సూచించారు. ఎందుకంటే మారే వడ్డీ రేట్ల వాతావరణంలో వీటి రాబడులపై ప్రభావం తక్కువగా ఉంటుంది. డిఫాల్ట్ రిస్క్ చాలా చాలా తక్కువ. కొంత రిస్క్... ఇంకాస్త రాబడి బాండ్ ఫండ్స్‌లో ఇతర కేటగిరీలోని ఫండ్స్‌లో వడ్డీ రేట్ల పరంగా రిస్క్‌ను అర్థం చేసుకోవడం కాస్త కష్టమే. అయితే, రిస్క్ ఉన్నా కాస్తంత అధిక రాబడులు ఆశించే వారికి నిపుణులు సూచించేవి క్రెడిట్ రిస్క్ ఫండ్స్ లేదా డైనమిక్ బాండ్ ఫండ్స్. లిక్విడ్, షార్ట్ డ్యురేషన్‌తో పాటు కాస్తంత పెట్టుబడులను వీటికి కేటాయించుకోవడం ద్వారా డెట్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోను పరిమితం చేసుకోవాలన్నది నిపుణుల సూచన. తక్కువ రేటింగ్ ఉన్న కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులను అందించేవి క్రెడిట్ రిస్క్ ఫండ్స్. తక్కువ రేటింగ్ ఉన్న సాధనాల్లో పెడతాయి కనుక రిస్క్ ఎక్కువ. అందుకే క్రెడిట్ రిస్క్ ఫండ్స్‌గా వీటిని పిలుస్తారు అయితే, దేశీ కార్పొరేట్ కంపెనీల పరిస్థితి మెరుగుపడుతూ ఉన్నందున తక్కువ రేటింగ్ ఉన్నవి కూడా మెరుగుపడే సూచనలున్నాయి. దీంతో రాబడులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా తక్కువ రేటింగ్ ఉన్న కంపెనీలు బాండ్ల చెల్లింపుల పరంగా డిఫాల్ట్ అయితే రాబడులపై ఆ ప్రభావం ఉంటుందని గుర్తుంచుకోవాలి. రిస్క్ తీసుకునే వారు డైనమిక్ బాండ్ ఫండ్‌ను కూడా పరిశీలించొచ్చు. షార్ట్, లాంగ్ డ్యురేషన్ ఫండ్స్ మధ్య పెట్టుబడులను మారుస్తూ (దీన్నే డైనమిక్ అనేది) మారే వడ్డీ రేట్ల నుంచి అధిక రాబడులను అందుకునే ప్రయత్నం చేస్తుంటాయి. వడ్డీ రేట్ల గమనం గురించి అర్థం కాని వారు ఈ పథకాలను ఎంచుకోవచ్చు. మీడియం డ్యురేషన్, లాంగ్ డ్యురేషన్, కార్పొరేట్ బాండ్, బ్యాంకింగ్, పీఎస్‌యూ ఫండ్ తదితర కేటగిరీలు కూడా బాండ్ ఫండ్స్‌లో ఉన్నాయి. కానీ, ఇన్వెస్టర్ల పెట్టుబడులకు ఇవి ఏమంత విలువను చేకూర్చేవి కావన్నది నిపుణుల మాట. చూడాల్సిన అంశాలు ఇవీ... క్రెడిట్ రిస్క్ అన్ని డెట్ ఫండ్స్ కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ లేదా మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లు అయిన ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లు, ట్రెజరీ బిల్లులు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్, కమర్షియల్ పేపర్లలో ఇన్వెస్ట్ చేసేవే. వీటిని బట్టి రిస్క్ ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు అన్నవి రిస్క్ లేనివి. అదే కంపెనీ బాండ్ అయితే రిస్క్ తప్పకుండా ఉంటుంది. ఇన్వెస్టర్ తమ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకునే పథకాలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాయన్న అవగాహన తప్పనిసరి. ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు మినహా మిగిలిన సాధనాలకు తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేసినట్టయితే అధిక రిస్క్ ఉన్నట్టుగానే భావించాలి. కాల వ్యవధి డెట్ ఫండ్స్‌లో ఈక్విటీల్లానే ఎన్నో పథకాలు ఉన్నాయి. మీ పెట్టుబడుల కాల వ్యవధికి సరిపోయే పథకాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు లిక్విడ్ ఫండ్స్ అన్నవి మూడు నెలల కాల వ్యవధి కోసం. లాంగ్ టర్మ్ బాండ్ ఫండ్స్ అన్నవి దీర్ఘకాలంలో ఒకటి లేదా రెండంకెల స్థాయిలో రాబడులు ఆశించేవారి కోసం. లిక్విడిటీ డెట్ ఫండ్స్‌లో ఓపెన్ ఎండెడ్ ఫండ్స్‌ను మాత్రమే అవసరంపడితే లిక్విడ్ (నగదుగా)గా మార్చుకోవచ్చు. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అన్నవి కూడా ఉన్నాయి. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ఫండ్ కాల వ్యవధి ముగిసే వరకు వేచి ఉండాల్సి వస్తుంది. మధ్యంతరంగా డబ్బులు కావాల్సివ స్తే వీటిని అమ్మి సొమ్ము చేసుకోవడం కష్టం. అందుకే ఇన్వెస్ట్ చేసే వారు తమ అవసరాలను గుర్తెరిగి పథకాలను ఎంచుకోవాలి. ఎగ్జిట్ లోడ్ చాలా వరకు డెట్ ఫండ్స్ ఎగ్జిట్ లోడ్ విధి స్తున్నాయి. అంటే పెట్టుబడులను వెనక్కి తీసుకునే సమయంలో విధించే చార్జీ. అయితే, ఇది కేవలం ప్రారంభంలో కొంత కాలం పాటే ఉంటుంది. అంటే నెలల నుంచి ఏడాది వరకు ఉండొచ్చు. ఆ లోపు వెనక్కి తీసుకుంటే ఆ మొత్తం నుంచి 1 శాతా న్ని మినహాయించుకుంటాయి ఫండ్స్ సంస్థలు. ఫండ్ మేనేజర్ పరంగా రిస్క్ ఫండ్ మేనేజర్లు సైతం కొన్ని సందర్భాల్లో మార్కెట్ గమనాలను అవగాహన చేసుకోలేకపోవచ్చు. దీంతో ఆ పథకం రాబడులు ప్రభా వితమవుతాయి. -
ఐసీఐసీఐపై ఫిచ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: వీడియోకాన్ గ్రూపు రుణ వివాదంతో ఇబ్బందుల్లో పడ్డ ఐసీఐసీఐ బ్యాంకు ప్రాభవం మరింత మసకబారుతోంది. తాజాగా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్ కీలక వ్యాఖ్యలు చేసింది. బ్యాంకుపై ఆరోపణలు సంస్థ రిపుటేషన్ను దెబ్బతీస్తుందని పేర్కొంది. సీబీఐ విచారణ పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతిందని తెలిపింది. అంతేకాదు ఐసీఐసీఐలో గవర్నెన్స్‌పై ప్రశ్నలు తలెత్తాయని ఫిచ్ రేటింగ్స్ సోమవారం వ్యాఖ్యానించింది. బ్యాంకుపై ఆరోపణలను దర్యాప్తు సంస్థ రుజువు అయితే..భారీ ఆర్థిక జరిమానా ప్రమాదంతోపాటు చట్టపరమైన చర్యలు కూడా తీవ్రంగానే ఉండనున్నాయని ఫిచ్ అంచనా వేసింది. వీడియోకాన్ గ్రూపునకు సంబంధించిన రుణ కేటాయింపు వివాదాన్ని పరిశీలిస్తున్నామని..దీనికనుగుణంగా తదుపరి రేటింగ్‌ను అంచనా వేస్తామని ఒక ప్రకటనలో వెల్లడించింది. బ్యాంకు కీర్తి , ఆర్థిక ప్రొఫైల్‌కు నష్టాలు గణనీయంగా పెరగడం లాంటి ఇతర పరిణమాల నేపథ్యంలో తగిన రేటింగ్ తీసుకుంటామని తెలిపింది. అలాగే స్వతంత్ర దర్యాప్తునకు బ్యాంకు అయిష్టతను ప్రకటించడం కార్పొరేట్ పాలనా పద్ధతిపై బలమైన సందేహాలను కలగిస్తోందని ఫిచ్ అభిప్రాయపడింది.అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలీస్తే ఐసీఐసీఐలాంటి ప్రయివేటురంగ దిగ్గజ బ్యాంకుల్లో కార్పొరేట్ గవర్నెర్స్ పటిష్టంగా ఉంటుందనేది తమ విశ్వాసంగా ప్రకటించింది. మెరుగైన-అర్హత కలిగిన బోర్డు సభ్యులు, వృత్తిపరమైన నైపుణ్య నిర్వహణ అంశాల కారణంగా కార్పొరేట్ గవర్నెన్స్ మెరుగ్గా వుంటుందని పేర్కొంది. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు డ్యామేజ్ కంట్రోల్లో పడింది. టాప్ పెట్టుబడిదారులతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఇన్వెస్టర్లు మరిన్నివివరాలు కావాలంటూ డిమాండ్ చేశారు. అటు బ్యాంకు సీఈవో చందా కొచర్ భర్త దీపక్ సోదరుడు రాజీవ్ కొచర్‌ను వరుసగా అయిదవ రోజు కూడా సీబీఐ విచారిస్తోంది. అటు ఐసీఐసీఐలో 12.3 శాతం అధిక వాటా కలిగి వున్న ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ కూడా ఈ సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. -
ఫేస్‌బుక్‌కు భారీ షాక్!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ భారీ చిక్కుల్లో పడింది. తాజాగా యూరోపియన్ యూనియన్ గోప్యతా నియమాలకు సంబంధించి విచారణ నేపథ్యంలో గణనీయమైన వ్యాపార నష్టాలను ఎదుర్కొంటోంది. 50 మిలియన్ల మంది ఫేస్బుక్ ఖాతాల వివరాలు లీక్ అయ్యాయన్న ఆరోపణలు ఫేస్బుక్ షేర్‌ను తీవ్ర నష్టాల్లోకి జార్చాయి. అంతేకాదు మార్కెట్ క్యాప్ రాత్రికి రాత్రే తీవ్రంగా నష్టపోయింది. డాటా బ్రీచ్ వార్తలతో మార్క్ జుకర్‌బర్గ్ 2004 లో స్థాపించిన ఫేస్బుక్ విలువలో 40 బిలియన్ డాలర్ల విలువ తుడిచిపెట్టుకుపోయింది. 2004 తరువాత ఇదే అతిపెద్ద క్షీణత అని ఎనలిస్టులు చెబుతున్నారు. ట్రంప్ ఎన్నికల సభలకు సంబంధించిన అంశాలు 5కోట్లమంది ఫేస్బుక్ యూజర్లకు ఎలా అందాయన్న అంశంపై యూఎస్, యూరోపియన్ న్యాయశాఖ అధికారులు ఫేస్బుక్ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్‌ను విచారించారన్న అంశం ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమైంది. దీంతో ఫేస్‌బుక్‌సహా టెక్నాలజీ దిగ్గజాలపై నియంత్రణలు పెరగవచ్చన్న అంచనాలు టెక్నాలజీ కౌంటర్లను దెబ్బతీసినట్లు నిపుణులు చెబుతున్నారు. టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకోవడంతో ఫేస్బుక్ 7 శాతం దిగజారింది. అల్ఫాబెట్ 3 శాతం, మైక్రోసాఫ్ట్ 2 శాతం, యాపిల్ 1.5 శాతం చొప్పున పతనమయ్యాయి. దీంతో మార్కెట్లు నీరసించినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు ఫేస్బుక్ కారణంగా టెక్నాలజీ దిగ్గజాలలో భారీ అమ్మకాలు నమోదుకావడంతో ప్రధానంగా సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. -
ఆ యాంటీబయాటిక్‌తో గుండెకు ముప్పు
న్యూయార్క్ : యాంటీబయాటిక్స్ వాడకంపై భిన్న వాదనలు వినిపిస్తున్న క్రమంలో తాజాగా ఓ యాంటీబయాటిక్పై పదేళ్ల పాటు జరిపిన అథ్యయనంలో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. బయాక్సిన్ బ్రాండ్ పేరిట విక్రయిస్తున్న క్లారిత్రోమైసిన్ హృద్రోగంతో బాధపడే రోగులకు పెనుముప్పుగా పరిణమించిందని తేలింది. ఇన్ఫెక్షన్ల చికిత్సకు వైద్యులు ఈ యాంటీబయాటిక్‌ను సహజంగా రిఫర్ చేస్తుంటారు. ఈ మందును వాడిన కొన్ని సంవత్సరాల తర్వాత సైతం హృద్రోగులకు ప్రాణాపాయం ముంచుకొస్తుందని ఎఫ్‌డీఏ హెచ్చరించింది. హృద్రోగాలతో బాధపడతే వారు ఈ డ్రగ్‌ను రెండు వారాల కోర్సుగా తీసుకున్న క్రమంలో ఏడాది లేదా తర్వాతి కాలంలో గుండె పోటు లేదా హఠాన్మరణానికి గురైనట్టు పదేళ్ల పాటు నిర్వహించిన అథ్యయనంలో వెల్లడైంది. 2005లోనే క్లారిత్రోమైసిన్ దుష్పరిణామాలపై ఎఫ్‌డీఏ హెచ్చరించింది. ఇక గుండె సమస్యలతో బాధపడే రోగులకు ఈ మందు చేసే మేలు కంటే కీడే అధికమని ఎఫ్‌డీఏ గుర్తించింది. ఈ డ్రగ్ కారణంగా గుండె వేగంగా కొట్టుకుంటుందని, గుండెపోటు, ఆకస్మిక మరణానికి దారితీసే ప్రమాదం ఉందని పేర్కొంది. -
రిస్క్ తీసుకోవటం ఇష్టమా?
సాహసాలు చేయటం గొప్పే... రిస్క్ తీసుకుంటేనే జీవితంలో థ్రిల్ ఉంటుంది. ఇది అలవాటుగా మారితే? ప్రతిదానికీ రిస్క్ చేయాలనుకుంటే? అతివిశ్వాసం మిమ్మల్ని నడిపిస్తే? ఫలితం... పాజిటివ్ రిజల్ట్స్ కంటే నెగెటివ్ రిజల్ట్సే ఎక్కువ రావచ్చు, ఎన్నో అనర్థాలకు కారణం కావచ్చు. కొన్ని విషయాల్లో రిస్క్ అవసరమైనా ఇది శృతి మించటమే మంచిది కాదు. మీరూ రిస్క్ బీయింగేమో ఒకసారి చెక్ చేసుకోండి. 1. పదిమంది ఒక్కమాటపై ఉన్నా మీరు మాత్రం వారికి వ్యతిరేకంగా ఉంటారు. ఎ. అవును బి. కాదు 2. మీరు చేసే పని ఒప్పు అవుతుందనే నమ్మకం మీలో బలంగా ఉంది. ఎ. అవును బి. కాదు 3. ఏ పనైనా డెడ్‌లైన్ వచ్చేదాకా పూర్తిచేయరు. ఎ. అవును బి. కాదు 4. ప్రమాదకరమైన పందాలు (బంగీ జంప్, బైక్ వీలింగ్ మొదలైనవి) నిర్వహించేటప్పుడు, వాటిలో కచ్చితంగా పాల్గొనాలనుకుంటారు. ఎ. అవును బి. కాదు 5. మీకు అనుభవంలేని వ్యాపారాలు/ ఇతర ఆదాయ మార్గాల్లో పెట్టుబడి పెడుతుంటారు. ఎ. అవును బి. కాదు 6. ప్రమోషన్‌పై చాలా దూరంగా మీ కంపెనీ మిమ్మల్ని బదిలీ చేసినా, (బంధువులు, స్నేహితులు, తెలిసినవారు లేనిచోటికి) ప్రమోషన్‌ను స్వీకరిస్తారు. ఎ. అవును బి. కాదు 7. మీ స్నేహితులంతా కలిసి టూర్ వెళ్లే సమయంలో మీ ఆరోగ్యం సరిగా లేకపోయినా కార్యక్రమాన్ని వాయిదా వేయరు. ఎ. అవును బి. కాదు 8. ముఖ్యమైన నిర్ణయాలను తక్షణమే తీసుకుంటారు (ఆలోచించకుండా) ఎ. అవును బి. కాదు 9. ఇతరులను కామెంట్ చే స్తూ ఆనందిస్తారు. ఎ. అవును బి. కాదు 10. మేనేజర్‌తో మీటింగ్ జరుగుతున్నప్పుడు, సుపీరియర్స్ తీసుకున్న నిర్ణయం మీకు నచ్చకపోతే అక్కడే దానిని ఖండిస్తారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు ఏడు దాటితే మీలో చాలెంజింగ్ స్పిరిట్ ఎక్కువపాళ్లలో ఉంటుంది. దీనివల్ల కొన్ని సార్లు ప్రమాదాలు మీ దరి చేరతాయి. అన్ని విషయాల్లో రిస్క్ తీసుకోకపోవటమే మంచిది. ‘బి’లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే మీరు రిస్క్ తీసుకోవటానికి దూరం. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులకు మీరు గురికారు. ‘ఎ’ లు నాలుగు లోపు వస్తే అవసరమైన విషయాల్లో మాత్రమే రిస్క్ తీసుకుంటారు. -
బీమాకు యుక్త వయసే కరెక్ట్!
⇒ ఎప్పుడు ఏం జరుగుతుందో మన చేతుల్లో ఉండదు ⇒ త్వరగా ప్రారంభిస్తే ప్రీమియం కూడా తక్కువ జీవితం మన చేతుల్లో ఉండదు. ఏదీ అనుకున్నట్టు జరగదు కూడా. దీన్నెప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. గతేడాది నవంబర్‌లో ఇండోర్– పాట్నా రైలు ప్రమాదం జరిగింది... గుర్తుందా? ఇందులో ప్రాణాలు కోల్పోయిన 120 మందిలో ఓ ఇద్దరు యువకుల గురించి తెలుసుకోవాలి. వీరు గతేడాది ప్రారంభంలోనే కొత్తగా ఉద్యోగంలో చేరారు. ఒకసారి ఆలోచించండి. వారి కుటుంబాలు వారిపై ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటాయో? సంపాదించే కొడుకులను పోగొట్టుకున్న ఆ కుటుంబాల కలలు కల్లలయ్యాయి. అయితే ఇద్దరిలో ఒక వ్యక్తి మాత్రం ఉద్యోగంలో చేరిన వెంటనే జీవిత బీమా పాలసీ తీసుకున్నాడు. మరో వ్యక్తి అప్పుడే బీమా ఎందుకులే... అని తన సంపాదనను ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టడం ఆరంభించాడు. ఇప్పుడు ఎవరి కుటుంబం సంతోషంగా ఉందో మీకు ఆర్థమయ్యే ఉంటుంది!!. జీవిత బీమా కూడా ఆర్థిక సాధనమే.. సంపాదన ప్రారంభించిన దగ్గరి నుంచే ఇన్వెస్ట్ చేయాలి. ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల ఇన్వెస్ట్మెంట్ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే సందేహం చాలా మందికి ఉంటుంది. కేవలం కుటుంబం కలిగిన వారు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలని అనుకోకూడదు. పెళ్లి కాకుండా ఒంటరిగా ఉన్నా కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఎంత వీలైతే అంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాలి. అప్పుడే చివరిలో ఎక్కువ ప్రయోజనం పొందగలం. ఇక్కడ జీవిత బీమాను కూడా ఆర్థిక సాధనంగానే చూడాలి. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ప్రకారం... దేశంలో రెండో అత్యంత అనూకూలమైన, ఇష్టమైన ఆర్థిక సాధనం జీవిత బీమానే. 2020 నాటికి భారత్ ప్రపంచంలోని ప్రధాన ఇన్సూరెన్స్ మార్కెట్లలో ఒకటిగా మారబోతోంది. బాధ్యతలను భర్తీ చేస్తుంది! జీవిత బీమా అనేది మరణించిన తర్వాత మన కుటుంబానికి ఆర్థికంగా బాసటగా నిలుస్తుంది. సంపాదించడం ప్రారంభించిన ప్రతి వ్యక్తి తొలినాళ్లలోనే తప్పకుండా జీవిత బీమా తీసుకోవాలి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు మన మదిని తొలిచేస్తాయి. కోల్పోయిన ఆదాయ భర్తీకి పాలసీ తీసుకుంటున్నావా? లేదా పిల్లల చదువుకా? లేదా తల్లిదండ్రుల కోసమా? ఇలా ఎన్నో అవసరాలు తెరమీదకు వస్తాయి. అందుకే బీమా పాలసీ తీసుకునే ముందు కవరేజ్ ఎంతుందో చూసుకోవాలి. ఇది మన అవసరాలకు సరిపడేలా ఉండాలి. యువతకు బీమా అంటే బేజారా? చాలా మంది యువత జీవిత బీమాను తీసుకోవడానికి ఇష్టపడరు. దీనికి రెండు కారణాలుంటాయి. ఒకటి వారు దీర్ఘకాలం జీవిస్తామని భావించడం. రెండవది తెలిసి తెలిసి చావుకు ప్రణాళికలు వేసుకోవడం ఎందుకని ఆలోచించడం. ఈ ఆలోచనా ధోరణ మంచిది కాదు. మనం మరణించిన తర్వాత మనల్ని నమ్ముకున్న వారిని ఎవరు చూసుకుంటారో తెలీదు. అందుకే మనం చనిపోయినా కూడా మనం తీసుకున్న బీమా వారిని కష్టాల పాలు కాకుండా చూసుకుంటుందనే విషయాన్ని గుర్తెరగాలి. ముందుగా బీమా తెలివైన నిర్ణయం ముందు నుంచే జీవిత బీమా తీసుకోవడాన్ని తెలివైన నిర్ణయంగా భావించాలి. మీరు యుక్త వయసులో ఉన్నప్పుడు పాలసీ తీసుకుంటే దాని ప్రీమియం తక్కువగా ఉంటుంది. అదే ఎక్కువ వయసు ఉన్నప్పుడు తీసుకుంటే ప్రీమియం ఎక్కువవుతుంది. కొంతమంది బీమా పాలసీలు చాలా ఖరీదైనవని, గందరగోళంగా ఉంటాయని, అర్థం చేసుకోవడం కష్టమని అనుకుంటుంటారు. మీరు ఎంత మొత్తంలో ప్రీమియం చెల్లించగలరనే ప్రాతిపదికనే మీ పాలసీ ఎంపిక జరగాలి. తర్వాత కంపెనీ సెటిల్మెంట్ రేటు ఏవిధంగా ఉందో చూడండి. ఈ వివరాలు ఆయా కంపెనీల వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉంటాయి. అలాగే మనపై ఆధారపడ్డ వారి భవిష్యత్ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకొని పాలసీని ఎంపిక చేసుకోవాలి. జీవిత బీమా పాలసీ ఎప్పుడు తీసుకోవాలి అని మీరు మీ అంతరాత్మను ప్రశ్నించుకుంటే.. దానికి సమాధానం ఇప్పుడే అని తెలుసుకోండి. -
ఘోరం..
ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు గుంతకల్లుకు చెందిన ఇద్దరు దుర్మరణం నలుగురికి గాయాలు.. వారిలో ఒకరి పరిస్థితి విషమం నల్లబోయినపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘటన బత్తలపల్లి (ధర్మవరం ) : బత్తలపల్లి మండలం నల్లబోయనపల్లి బస్‌స్టేజీ సమీపాన అనంతపురం – కదిరి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు... సోమవారం సాయంత్రం గుంతకల్లు పట్టణానికి చెందిన నాగరాజు (40), మస్తాన్‌ఖాన్(43), బోయ శ్రీనివాసులు మదనపల్లి నుంచి కారులో స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. నల్లబోయనపల్లి బస్‌స్టేజీ సమీపంలోకి రాగానే డ్రైవింగ్ చేస్తున్న నాగరాజు కంటిమీద రెప్పవాల్చాడు. స్టీరింగ్‌పై పట్టుతప్పింది. ఎదురుగా అనంతపురం నుంచి తిరుపతి వెళ్తున్న కదిరి ఆర్టీసీ డిపో బస్సు డ్రైవర్ గమనించి తాను మరింత రోడ్డుపక్కగా వచ్చాడు. అయినా వేగంగా వచ్చి బస్సును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ నాగరాజు ఎగిరి కిందపడి ప్రాణం విడిచాడు. పక్కనే కూర్చున్న మస్తాన్‌ఖాన్ కూడా తీవ్రంగా గాయపడి సీటులోనే మృతి చెందాడు. వెనుక సీటులో కూర్చున్న బోయ శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్టీసీ బస్సులో 51 మంది ప్రయాణికులుండగా వారిలో మొలకలవేముల మండలం ఓలేటివారిపల్లికి చెందిన లలితమ్మ, మహబూబ్‌బాషా, మహమ్మద్ స్వల్పంగా గాయపడ్డారు. బస్సులో మరికొందరు స్వల్పంగా గాయపడినా వారు మరో బస్సులో వెళ్లిపోయారు. గాయపడిన వారిలో బోయ శ్రీనివాసులు పరిస్థితి విషమంగా ఉంది. ముదిగుబ్బ, బత్తలపల్లికి చెందిన 108 వాహనాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులును మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. స్వల్పంగా గాయపడిన వారికి బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ధర్మవరం రూరల్ సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ హారున్‌బాషా తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారును జేసీబీ సాయంతో పక్కకు తొలగించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ మత్తుతో గుండె చిత్తు
న్యూయార్క్: గంజాయి వాడకం గుండె సమస్యలను రెట్టింపు చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. గంజాయి మూలంగా నాడీ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమౌతుందని తెలిసినప్పటికీ.. ఇది గుండెపై చూపించే దుష్ఫలితాలపై అంతగా అవగాహన లేదు. అమెరికాలోని సెయింట్ ల్యూక్ యూనివర్సిటీకి చెందిన భారత సంతతి ప్రొఫెసర్ అమితోజ్ సింగ్ ఈ అంశంపై పరిశోధన నిర్వహించారు. గంజాయి వాడకం మూలంగా గుండె కండరాలు బలహీనపడతాయని ఆయన వెల్లడించారు. గంజాయి వాడేవారిలో చాలా తక్కువ వయసులో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా స్ట్రెస్ కార్డియోమయోపతికి గంజాయి దోహదం చేస్తుందని అమితోజ్ సింగ్ తెలిపారు. స్ట్రెస్ కార్డియోమయోపతిలో గుండె కండరాలు బలహీనపడి.. రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం తగ్గుతుంది. -
గొంతులో ఆహారం ఇరుక్కున్నప్పుడు...
గొంతులో ఏదైనా ఇరుక్కున్నపుడు పొర పోయిందని, ఎవరో తలచుకుంటున్నారని అంటుంటారు. మనం తిన్న ఆహారం కిందికి కదలడానికివీలుగా తలపై తడుతుంటారు. అయితే ఆ ఆహారం... కడుపులోకి దారితీసే ఆహార నాళంలోకి కాకుండా, ఊపిరితిత్తుల్లోకి వెళ్లాల్సిన వాయునాళంలోకి పోతే ప్రమాదం. కాబట్టి ఆ ఆహారం బయటకు రావడానికి వీలుగా దగ్గమని చెప్పాలి. ⇔ గొంతుకు ఏదైనా అడ్డం పడిందేమోనని పేషెంట్ నాలుక చాపేలా చేసి, గొంతులోకి వెళ్లు పోనిచ్చి చూడాలి. ఏదైనా అడ్డు ఉంటే తీసేయాలి. ⇔ గొంతులో ఏదైనా ఇరుక్కుని బాధ పడుతున్నప్పుడు వ్యక్తి వెనక మనం నిల్చొని, మన రెండు చేతులను పొట్ట చుట్టూ బిగించి అకస్మాత్తుగా పట్టుబిగిస్తున్నట్లుగా కదిలించాలి. క్రమంగా ఆ పట్టును పొట్టపై కింది భాగం నుంచి పైకి కదల్చాలి. దీని వల్ల పొట్టలోపల ఒత్తిడి పెరిగి, అది పైభాగానికి కదిలి అడ్డుపడిన పదార్థాన్ని బయటకు నేట్టేసే అవకాశం ఉంటుంది. దీన్ని హీమ్లిచ్ మెనోవర్ అంటారు. ⇔ పిల్లల్ల గొంతులో ఏదైనా ఆహార పదార్థం ఇరుక్కుంటే మనం కుర్చీలో కూర్చుని పిల్లలను కాళ్లపై బోర్లా పడుకోబెట్టాలి. ఇలా పడుకోబెట్టినప్పుడు తల కిందికి ఉండేలా చూడాలి. వీపుపై అకస్మాత్తుగా ఒత్తిడి తేవాలి. మన కాళ్ల ఒత్తిడి పిల్లల పొట్ట మీద పడి... అది పైకి ఎగబాకి, అడ్డు పడ్డ పదార్థం బయటకు వచ్చే అవకాశం ఉంది. ⇔ ఇలా పడుకోబెట్టి అకస్మాత్తుగా ఒత్తిడి కలిగించేప్పుడు ఆ కదలికలను పై వైపునకు... అంటే నడుము నుంచి రెండు భుజాల మధ్యగా పై వైపునకు కదిలిస్తే, గొంతులో ఇరుకున్న పదార్థం బయటకు వచ్చే అవకాశం ఉంది. ⇔ పైవన్నీ సత్ఫలితాలు ఇవ్వనప్పుడు వెంటనే ఆసుపత్రికి తరలించాలి. అక్కడ కొన్ని లారింగోస్కోపీ అనే పరికరం ద్వారా గొంతును పరీక్ష చేసి, అక్కడ ఇరుక్కున్న పదార్థాన్ని తొలగిస్తారు. -
ఆక్వాకు వైరస్ గండం
* నష్టాల్లో రైతులు * మెలకువలు పాటించక పోవడంతోనే ఈ పరిస్థితి * అవగాహన ఏర్పరుచుకోవాలంటున్న మత్స్యశాఖ అధికారులు నిజాంపట్నం: ఆక్వా రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. ప్రస్తుతం రొయ్యలకు వైరస్ సోకుతుండటంతో రైతులు భారీగా నష్టాలను చవిచూస్తున్నారు. 1990 ప్రాంతంలో తీరప్రాంతంలో ఉర్రూతలూగించిన ఆక్వాసాగు క్రమేణ వైరస్ వ్యాధుల ప్రభావానికి ఉనికే కనుమరుగైంది. కొన్ని సంవత్సరాలు ఆక్వా సాగు అంటేనే రైతుల్లో వణుకు పుట్టించింది. ఇందుకోసం తవ్విన చెరువులను తిరిగి రైతులు పంట భూములుగా మలుచుకోవటం ప్రారంభించి వరిసాగువైపు పయనించారు. తిరిగి ఇటీవల ఆక్వా సాగు ఆశాజనకంగా మారటం, ప్రకృతి ఆటుపోట్ల నడుమ వరిసాగు ప్రశ్నార్థకంగా మారుతుండటంతో తీరప్రాంతంలోని రైతులు దీనిపై దృష్టిసారించారు. అయితే సాగుపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవటం, సరైన మెలకువలు పాటించకపోవటంతో ఆదిలోనే నష్టాల బారిన పడుతున్నారు. ఆక్వాసాగు చేస్తున్న చెరువుల్లో సుమారు నెలరోజుల లోపే వైరస్ వ్యాధులు సోకి రొయ్య పిల్లలు చనిపోతున్నాయి. ప్రమాణాలు పాటించకపోవటంతోనే.. రొయ్యలను పట్టిన తరువాత చెరువులోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి నెలరోజుల పాటు ఎండబెట్టాలి. ఆసమయంలో బ్లీచింగ్, బ్యాక్టీరియా నివాణకు మందులను చల్లాల్సి ఉంది. అయితే చెరువులోని రొయ్యలను పట్టిన తరువాత ఈజాగ్రత్తలు పాటించకుండానే తిరిగి రొయ్య పిల్లలను వేసి సాగుకు సిద్ధమవుతుండటంతో వైరస్ వ్యాధులు సోకుతున్నాయి. వరికి ప్రత్యామ్నాయంగా వెనామి రొయ్యపై దృష్టి.. గత రెండు మూడు సంవత్సరాలుగా సాగునీరు లేక ఖరీఫ్ ప్రశ్నార్థకంగా మారటంతో తీరప్రాంతంలోని రైతులు ప్రత్యామ్నాయంగా ఆక్వాసాగువైపు మళ్లుతున్నారు. సాగు చేయాలనే ఆదుర్దాతో, పూర్తి అవగాహన ఏర్పరుచుకోకుండా, పూర్తిస్థాయిలో నియమాలు పాటించకుండా చేస్తున్న సాగు నష్టాలనే తెచ్చిపెడుతున్నది. రైతులు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించి సాగును చేపడితే తప్పనిసరిగా ఆక్వా ఆశాజనకంగా ఉంటుందని మత్స్యశాఖ అధికారులు తెలుపుతున్నారు. తాము ఇచ్చే సూచనలు, సలహాలు పాటించి సాగును చేపట్టాలని కోరుతున్నారు. అధికారుల సూచనలు ఇవీ.. నీటి గుణాలు ఎప్పకప్పుడు పరీక్షించుకోవాలి. ప్రాణవాయువు(డి.ఒ) ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పరిశీలించాలి. వారానికి ఒకసారి నీటి పీ.హెచ్, ఆల్సలినీటి, విషవాయువులైన అమ్మోనియా, నైట్రేట్, హైడ్రోజన్‌సలై్ఫడ్ వంటివి పరీక్షించుకోవాలి. వెనామి సాగులో నిరంతరం ఏరియేటర్లు వాడుకోవాలి. ప్రతి 300 కేజీల రొయ్యలకు ఒక హెచ్‌పీ ఏరియేటర్ అవసరం. బయో సెక్యూరిటీ.. చెరువు ప్రవేశ ద్వారం వద్ద చేతులు, కాళ్లు కడుగుకొనేందుకు వీలుగా పొటాషియం పెర్మాంగ్‌నేట్ ద్రావణం ఉంచాలి. చెరువు గట్ల వెంబడి పీతలు వంటి వైరెస్ వాహకాల ప్రవేశాన్ని నిరోధించేందుకు వీలుగా ఆరమీటరు ఎత్తులో వల (క్రాబ్‌ఫెన్సింగ్) ఏర్పాటు చేయాలి. ప్రతి చెరువుకు వేర్వేరు పనిముట్లు(వలలు,మగ్గు వంటివి) వాడుకోవాలి. శుభ్ర పరిచే వ్యవస్థ తప్పనిసరి.. సాగు తొలిదశ నుంచి ఈ జాగ్రత్తలు, సూచనలు పాటించాలి. చెరువులో రొయ్యపిల్లల్ని వదలడం, చెరువులో నీటిని పెట్టుకుని తక్కువ మోతాదులో సేంద్రియ, రసాయనిక ఎరువులు వాడుకోవాలి. రొయ్యపిల్లల నాణ్యత, ఒత్తిడి పరీక్షలు చేసుకుని పి.ఎల్ 10 నుంచి 12 రోజులు ఉన్నవాటిని చదరపు మీటరుకు 60 పిల్లలకు మించకుండా విడుదల చేయాలి. – ఎ.రాఘవరెడ్డి, ఎఫ్‌డీవో -
అమరావతికి భారీ ప్రమాదం పొంచి ఉంది
-
'రిస్క్ తీసుకోకపోవడంకన్నా మరో రిస్క్ లేదు'
న్యూయార్క్: ఏ వ్యాపార రంగంలో రాణించాలన్నా రిస్క్ తీసుకోవడం ముఖ్యం. ఏ రిస్క్ తీసుకోక పోవడం అన్నింటికన్నా పెద్ద రిస్క్. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పేటెండ్ డైలాగ్ ఇది. ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ కంపెనీల్లో ఏటా పెట్టుబడులు పెట్టే 'వై కాంబినేటర్’ కంపెనీ ప్రెసిడెంట్ శ్యామ్ ఆల్ట్మేన్కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కూడా ఆయన ఈ మాటనే చెప్పారు. అయితే రిస్క్ తీసుకోవడం అంటే తొందరపడి వెర్రి నిర్ణయాలు తీసుకోవడం కాదని ఆయన స్పష్టం చేశారు. వ్యాపార రంగంలో రాణించాలంటే యువతకు ఇచ్చే సలహా ఏమిటని శ్యామ్ ఆయన్ని సూటిగా ప్రశ్నించగా, ‘వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో అతిపెద్ద రిస్క్ తీసుకోకపోవడమే అన్నింటికన్నా పెద్ద రిస్క్. కంపెనీలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు, మార్పులు, చేర్పులు చేయకపోతే కంపెనీ ఎదగడంలో వెనకబడి పోతుంది. అలాఅని ఉత్పత్తుల్లో తరచుగా మార్పులు తీసుకరాకూడదు. కంపెనీ గురించి దూరాలోచన చేయక పోవడం వల్ల అలాంటి మార్పులకు ఆస్కారం ఏర్పడుతుంది. ఏ కంపెనీలోనైనా తోటి వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. మన కంపెనీ బాగా రాణిస్తున్నప్పుడు మార్పుల పేరిట వెర్రి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు’ అని జుకర్ బర్గ్ తెలిపారు. ఫేస్బుక్ ఇటీవల 200 కోట్ల డాలర్లకు ‘ఆకులస్’ కంపెనీని కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఫేస్‌బుక్‌కు కూడా ఆకులస్ లాంటి టాలెంట్ ఉందని, అయితే అన్ని తామే చేయాలనుకునే తత్వం కూడా మంచిది కాదని అన్నారు. అంతేకాకుండా ప్రతిసారి ఉన్న కంపెనీలో మార్పులు తీసుకొచ్చే బదులు కొత్త కంపెనీలను తీసుకోవడం పెద్ద ముందడుగు అనిపిస్తుందని, ఆకులస్ కంపెనీని కొనుగోలు చేయడం కూడా అలాంటి ముందడుగని తాను భావిస్తున్నానని చెప్పారు. పైగా ఆకులస్లో టాలెంట్ పీపుల్ ఉన్నారని ఆయన చెప్పారు. అచ్చం స్నాప్‌చాట్ తరహాలో పనిచేసే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌ను ఫేస్బుక్ ఇటీవల ఆవిష్కరించడాన్ని జుకర్‌బర్గ్ ప్రస్తావిస్తూ, వినియోగదారుల మనోభావాల మేరకు అలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. కావాలనుకుంటే స్నాప్‌చాట్ స్టోరీస్ ఫీచర్‌ను ఫేస్బుక్ తీసుకరావచ్చని, కానీ కాపీ అనే ముద్ర కూడా కంపెనీ మీద ఉండకూడదని ఆయన చెప్పారు. ‘ఏదైనా పెద్ద రిస్క్ తీసుకోవాలనుకున్నప్పుడు అందులో ఉన్న ప్రతికూల అంశాల గురించి మన చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని హెచ్చరిస్తుంటారు. వారి మాటల్లో వాస్తవం లేకపోలేదు. ప్రతి నిర్ణయంలో సానుకూల, ప్రతికూల అంశాలు తప్పక ఉంటాయి. ప్రతికూల అంశాలకు భయపడి ఏ నిర్ణయం తీసుకోకపోతే కంపెనీలో ప్రతిష్టంభన ఏర్పడుతుంది. అది ప్రమాదరకరం. అందుకని పెద్ద రిస్క్ తీసుకోకపోవడమే అతి పెద్ద రిస్క్ అన్నది సర్వదా నా అభిప్రాయం’ అని జుకర్ బర్గ్ తన ఇంటర్వ్యూను ముగించారు. -
ఎన్నాళ్లీ.. నడకయాతన
పండుటాకులకు తప్పని పింఛన్‌పాట్లు ప్రతినెలా కొమ్మాయిగూడెం నుంచి రామన్నపేటకు వెళ్లాల్సిందే.. 350మంది లబ్ధిదారులు రానుబోను 5కి.మీ. మేర కాలినడకనే.. కొమ్మాయిగూడెం (రామన్నపేట) ఆసరా పింఛన్ డబ్బులు పొందేందుకు వృద్ధులకు అవస్థలు తప్పడం లేదు. ప్రతినెలా పింఛన్ తీసుకునేందుకు వారి పడే కష్టాలు అన్నీఇన్ని కావు. మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన ఆసరా పింఛన్ లబ్ధిదారులే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పింఛన్ డబ్బులు చేతనైనా కాకపోయినా, ఎండైనా వానైనా మండలకేంద్రానికి కాలినడకన వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి వారిది. కొమ్మాయిగూడెం.. రామన్నపేట మేజర్‌గ్రామపంచాయతీ పరిధిలోని మధిరగ్రామం. మండలకేంద్రానికి 2.5కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొమ్మాయిగూడెంలో 400పైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. జనాభా 2,500 వరకు ఉంటుంది. రామన్నపేట మేజర్‌గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 1,035మంది ఆసరాపింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. వారిలో 329 వృద్ధాప్య, 439 వితంతువులు, 142 వికలాంగులు, 62 గీతకార్మికులు, 63 చేనేతకార్మికులు ఉన్నాయి. ఇందులో సుమారు 350మంది లబ్ధిదారులు కొమ్మాయిగూడెం గ్రామానికి చెందినవారే కావడం గమనార్హం. గ్రామానికి చెందిన ఆసరా పింఛన్ లబ్ధిదారులు పింఛన్‌డబ్బులు పొందాలంటే ప్రతినెలా మండలకేంద్రానికి వెళ్లాలి. ఆర్‌అండ్‌బీకి చెందిన బీటీరోడ్డు ఉన్నప్పటీకీ గ్రామం మీదుగా ఆర్టీసీ బస్సులు, ఆటోలు తిరగవు. దీంతో పింఛన్‌దారులు ప్రలినెలా కాలినడకన మండలకేంద్రానికి వెళ్లవలసి వస్తుంది. పింఛన్‌డబ్బులు పొందడానికి రోజంతా పడుతుంది. సాయంత్రందాక తిండిలేక, తాగడానికి నీళ్లు దొరకక తీవ్ర అసౌకర్యారికి గురవుతూ పింఛన్ తెచ్చుకుంటన్నామని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఇందులో ముఖ్యంగా ఎండాకాలంలో వృద్ధుల పడే బాధలు వర్ణణాతీతంగా మారాయి. సీఎస్పీని ఏర్పాటుచేయాలని వేడుకోలు ఆసరా పింఛన్ లబ్ధిదారులు, ఉపాధిహామీ కూలీలకు డబ్బులు చెల్లించేందుకు కొమ్మాయిగూడెంలో సీఎస్పీ (కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్)ని ఏర్పాటు చేయాలని వామపక్షపార్టీలు, ప్రజాప్రతిని«ధులు అనేక పర్యాయాలు పంచాయతీరాజ్, పోస్టల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయినా ఆయాశాఖల నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. రోజంతా పడుతుంది –గుర్జాల బాల్‌రెడ్డి ఈ మధ్యన నాలుగైదు రోజులే పింఛన్లు పంచుతున్నారు. అందరు ఓకేసారి ఎగబడుతున్నారు. మేం నడుచుకుంటూ వచ్చి సీరియల్లో పెట్టడం ఆలస్యం అవుతుంది. దీంతో మా వంతువచ్చి పింఛన్‌డబ్బులు తీసుకోవడానికి రోజంతా పడుతుంది. సర్కారోళ్లు పుణ్యం కట్టుకోవాలి – శానగొండ ఈశ్వరమ్మ మా ఊరుమీదుగా బస్సులు ఆటోలు తిరగవు. నడుచుకుంటూనే పోస్టాఫీసుకు వెళ్లి వస్తాం. రానుబోను ఐదారు కిలోమీటర్లు ఉంటుంది. ఆడాడ చెట్లకింద కూర్చూని నడక సాగిస్తాం. సర్కారోళ్లు మా ఊళ్లోనే పింఛన్‌డబ్బులు ఇప్పించి పుణ్యం కట్టుకోవాలి. -
కొంచెం తాగినా ముప్పు ముప్పే..
మందుబాబులు తరుచుగా చెప్పుకొని సమర్థించుకునే మాటలు.. 'ఎప్పుడో ఒకసారి తాగితే ఏమీ కాదు', 'కొంచెం తాగితే ఫర్వాలేదు'. అయితే ఈ అప్పుడప్పుడు, తక్కువ పరిమాణం అనే మాటలు కూడా ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగించేవే అని తాజా పరిశోధనలో తేలింది. రోజుకు ఒక గ్లాసు వైన్ తీసుకునే వారిలో సైతం ఏడు రకాల క్యాన్సర్లు సంభవించే ముప్పు పెరుగుతోందని న్యూజిలాండ్‌కు చెందిన ఒటాగో మెడికల్ స్కూల్ పరిశోధక బృందం నిర్వహించిన తాజా పరిశీలనలో తేలింది. రోజుకు ఒక గ్లాసు రెడ్‌వైన్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న వాదన అర్ధరహితమైందని ఈ పరిశోధన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఆల్కహాల్ పరిమాణం తక్కువగా తీసుకునే వారిలో సైతం నోరు, గొంతు, అహారవాహిక, కాలేయం, పెద్దప్రేగు వంటి శరీర భాగాలలో క్యాన్సర్లు సంభవించే ముప్పు పెరుగుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జెన్నీ కానర్ తెలిపారు. 2012 నుంచి క్యాన్సర్ కారణంగా సంభవించిన మరణాలను పరిశీలిస్తే.. ప్రతి 20 మరణాల్లో ఒకటి(ఐదు శాతం) ఆల్కహాల్ మూలంగానే అని కానర్ వెల్లడించారు. అయితే.. తీసుకునే ఆల్కహాల్ పరిమాణం పెరిగిన కొద్దీ క్యాన్సర్ ముప్పు శాతం కూడా పెరుగుతుందని ఆమె వెల్లడించారు. -
దుర్గ గుడి ఫ్లై ఓవర్ నిర్మాణంలో ప్రమాదం
-
ప్రమాదాలకు దారితీసే నిద్ర అలవాట్లు..
న్యూయార్క్ః నిద్రలేమి, అతి నిద్ర కూడా ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని న్యూయార్క్ కు చెందిన పరిశోధకులు చెప్తున్నారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సగటున ఆరునుంచి, ఎనిమిది గంటలు నిద్రపోవాలని, లేదంటే ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ఆరు గంటలకంటే అతి తక్కువగా నిద్రపోవడం ద్వారా అనేక ఆనారోగ్యాలు దరిచేరడంతోపాటు మరణాలు సైతం సంభవిస్తున్నట్లు తమ పరిశోధనల్లో తేలినట్లు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకుడు మైఖేల్ ఇర్విన్ తెలిపారు. కలత నిద్ర, నిద్రలో ఆటంకాలు అనేక ప్రమాదాలకు దారి తీస్తాయని అమెరికా పరిశోధకులు అంటున్నారు. చాలీ చాలని నిద్రతోపాటు, అత్యధికంగా కానీ, అతి తక్కువగా కానీ నిద్రపోవడం కడుపులో మంట వంటి ఇతర ఆనారోగ్యాలకు దారి తీస్తాయని తాజా అధ్యయనాలద్వారా కనుగొన్నారు. తగిన నిద్ర లేకపోవడం అనేది ఓ మహమ్మారి వంటిది అని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ భావిస్తోంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, వ్యాయామంతోపాటు నిద్ర ఎంతో అవసరమని అమెరికా లాస్ ఏంజిల్స్ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు మైఖేల్ ఇర్విన్ తెలిపారు. నిద్రాభంగం, నిద్రలేమి శరీరంలో అధిక కొవ్వును కలుగజేయడం, కడుపులో మంటను సృష్టించడంతోపాటు, ప్రవర్తనపై కూడ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని ఇర్విన్ చెప్తున్నారు. ఇన్ ఫ్లమేషన్.. శరీరంలోని సి-రియాక్టివ్ ప్రొటీన్ ను, ఇంటర్‌ల్యూకిన్ 6 తోపాటు రక్త ప్రవాహాన్ని కూడా పెంచుతుంది. దీనివల్ల రక్తపోటు, మధుమేహం, గుండెకు సంబంధించిన అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లు బయోలాజికల్ సైకియాట్రీ జర్నల్ లో ప్రచురించిన పరిశోధనల్లో తెలిపారు. అత్యధిక, అత్యల్ప నిద్ర కూడా శరీరంలో సీఆర్పీని పెంచుతాయని, ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి కనీసం 6 నుంచీ 8 గంటల వరకూ నిద్రపోవాలని అధ్యయనకారులు చెప్తున్నారు. తాము నిర్వహించిన పరిశోధనల్లో దాదాపు 50000 మంది భాగస్వాములయ్యారని, అంతేకాక పలు వైద్య చికిత్సా వ్యాసాలపై కూడా విశ్లేషణాత్మక అధ్యయనాలు నిర్వహించినట్లు ఇర్విన్ తెలిపారు. నిద్ర అలవాట్ల ఆధారంగా చికిత్సలు అందించి పలు అనారోగ్యాలను తగ్గించవచ్చని పరిశోధకులు నిర్థారించారు. -
వయసు నిబంధన.. ప్రమాదాన్ని తగ్గిస్తుంది!
హూస్టన్‌ః అనేక దేశాల్లో వివాహాలకు చట్టపరమైన వయసు నిబంధనలు ఉన్నసంగతి తెలిసిందే. కానీ అలవాట్లకు సైతం నిబంధనలు విధిస్తే ఆరోగ్యాలు బాగుపడతాయంటున్నారు తాజా పరిశోధకులు. చిన్ననాటినుంచే చెడు అలవాట్లకు బానిసలౌతుండటంతో, అతి తక్కువ వయసులోనే అనారోగ్యాల బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేపట్టింది. మద్యపానానికి చట్టపరంగా 21 ఏళ్ళ వయసును నిర్థారిస్తే.. చిన్నవయసునుంచే మద్యం తాగే అలవాటు ఉన్నవారితో పోలిస్తే మరణాల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. మద్యం తాగేందుకు కనీస వయసు (మినిమమ్ లీగల్ డ్రింకింగ్ ఏజ్ (ఎంఎల్డీయే) 21 ఏళ్ళు ఉండేట్టుగా చట్టాన్ని తెస్తే మరణాల శాతం తగ్గుతుందని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. మద్యం తాగే వయసు కనీసం 21 ఏళ్ళు ఉండేట్లుగా చూస్తే.. యవ్వనంలో ఆరోగ్య పరంగా అనేక లాభాలు చేకూరుతాయని అధ్యయనకారులు చెప్తున్నారు. 21 ఏళ్ళ వయసుకన్నా ముందే మద్యానికి అలవాటు పడినవారు... మద్యానికి సంబంధించిన అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటమే కాక, మరణించే ప్రమాదం కూడ ఉన్నట్లు పరిశోధనల్లో తెలుసుకున్నారు. 1990 నుంచి 2010 మధ్య జనాభా మరియు, వారి మరణాలకు కారణాల డేటాను అమెరికా రీసెర్స్ సొసైటీనుంచి సేకరించిన శాస్త్రవేత్తలు.. 21 ఏళ్ళ వయసులోపు మద్యపానం అలవాటు అనేక ప్రమాదాలకు దారి తీస్తుందని తెలుసుకున్నారు. మద్యపానం అలవాటుతో కాలేయానికి సంబంధించిన వ్యాధుల బారిన పడినవారు, మద్యపానం వల్ల క్యాన్సర్ తో చనిపోయినవారి రికార్డులను సైతం అధ్యయనకారులు పరిశీలించారు. దీనిద్వారా మద్యపానం సేవించే కనీస వయసు 21 ఏళ్ళు ఉండాలనే చట్టపరమైన నిబంధన విధిస్తే... అనేక ఆల్కహాలిక్ వ్యాధులవల్ల ఏర్పడే మరణాల సంఖ్య తగ్గించి, జీవించే సమయాన్ని పెంచవచ్చని అభిప్రాయం వ్యక్తంచేశారు. ముఖ్యంగా కాలేజీలకు వెళ్ళనివారికి ఈ నిబంధన వల్ల అధిక ప్రయోజనం ఉంటుందని అధ్యయనకారులు చెప్తున్నారు. అలాగే విద్యాలయ ప్రాంగణాల్లో 21 ఏళ్ళ వయసు లోపు ఉన్నవారిపై మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే ఎంఎల్డీయే వల్ల కళాశాలలకు హాజరయ్యే విద్యార్థులకు సైతం లాభం చేకూరుతుందని భావిస్తున్న అధ్యయనకారులు తమ క్లినికల్ అండ్ ఎక్స్ పరిమెంటల్ పరిశోధనలను ఆల్కహాలిజం జర్నల్ లో నివేదించారు. -
రిస్క్‌లేని పెట్టుబడి సాధనమేది...?
మా అమ్మగారు సీనియర్ సిటిజన్. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ఆమెకు ఇష్టం లేదు. 10-15 ఏళ్లపాటు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్)లో ఇన్వెస్ట్ చేయమంటారా? లేక ఆల్ట్రా షార్ట్‌టర్మ్, షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే పన్ను ప్రయోజనాలు అధికంగా లభిస్తాయి. - రాధాకృష్ణ, నెల్లూరు పన్ను ప్రయోజనాలతో పాటు సురక్షితమైన రాబడులు కావాలంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ కంటే పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్) ఉత్తమమైన ఇన్వెస్ట్మెంట్ మార్గమని చెప్పవచ్చు. పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే రాబడులపై ఎలాంటి పన్నులు ఉండవు. అయితే పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే 15 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. దీనిపై వచ్చే రాబడులు ప్రభుత్వ సెక్యూరిటీలపై వచ్చే రాబడుల కన్నా కొంచెమే అధికంగా ఉంటాయి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సొమ్ములను వెనక్కితీసుకోవాలి అనుకుంటే డెట్ ఫండ్స్ ఉత్తమం. ఈ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన మూడేళ్లలోపే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ అమ్మగారి ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ మూడేళ్ల త ర్వాత ఈ డెట్ ఫండ్స్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇండెక్సేషన్ ప్రయోజనాలతో కలిపి 20 శాతంగా ఉంటుంది. ఈక్విటీ మార్కెట్లో లాగానే డెట్ మార్కెట్లో కూడా వివిధ బాండ్ల ధరలు ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. అందుకని డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ రాబడులు, ఏడాది ఏడాదికి మారుతూ ఉంటాయి. ఇప్పుడు పీపీఎఫ్ వడ్డీరేట్లు కూడా ప్రతి మూడు నెలలకొకసారి మారుతూ ఉన్నాయి. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఎలాంటి రిస్క్ వద్దనుకుంటే, పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇది సురక్షితమైన పెట్టుబడి సాధనం. ప్రభుత్వ దన్నుతో ఇది నడుస్తుండడమే దీనికి కారణం. నేను భారత పౌరసత్వం వదులుకొని జర్మనీ పౌరసత్వం తీసుకోవాలనుకుంటున్నాను. ఓవర్సీస్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డ్‌కు దరఖాస్తు చేయాలనుకుంటున్నాను. అయితే నాకు కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. భారత పౌరసత్వం వదులుకొని జర్మనీ పౌరసత్వం తీసుకోవడం వల్ల ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఏమైనా ప్రభావం ఉంటుందా? - మార్గరెట్, హైదరాబాద్ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా(ఓసీఐ), నాన్ రెసిడెంట్ ఇండియన్(ఎన్నారై)తో దాదాపు సమానం. ఆర్థిక, విద్య తదితర రంగాల్లో ఈ హోదాలు ఉన్నవారికి ఒకే విధమైన హక్కులు లభిస్తాయి. ఒక్క వ్యవసాయ, ప్లాంటేషన్ ఆస్తుల కొనుగోళ్లలో మాత్రమే తేడా ఉంటుంది. మీరు మీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు, అయితే మీ పౌరసత్వంలో మార్పులు, చేర్పులు గురించి మీ బ్యాంక్‌కు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు సమాచారమందించడం తప్పనిసరనే విషయాన్ని మాత్రం మరచిపోకండి. నా వయస్సు 34 సంవత్సరాలు. నా కోసం ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్, నా నాలుగేళ్ల కూతురి కోసం జీవన్ అంకుర్ పాలసీలను తీసుకున్నాను. రెండింటి మెచ్యురిటీ కాలం 20 ఏళ్లు. ఈ రెండింటి వార్షిక ప్రీమియమ్ రూ.59,000. ఇప్పటికి మూడేళ్ల ప్రీమియమ్‌లు చెల్లించాను. దీర్ఘకాల రాబడులకు ఇవి సరైనవి కావని మిత్రులంటున్నారు. ఈ పాలసీల నుంచి బయటపడే మార్గం చెప్పండి. - సందేశ్, వైజాగ్ ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్‌కు సంబంధించి గ్యారంటీడ్ సరెండర్ వేల్యూ--మీరు చెల్లించిన మొత్తం ప్రీమియమ్‌లలో ఒక ప్రత్యేకమైన శాతంగా ఉంటుంది. అదనపు ప్రీమియమ్, రైడర్లకు చెల్లించిన ప్రీమియమ్లకు మినహాయింపు ఉంటుంది. మీరు తీసుకున్న పాలసీ కాల వ్యవధి, మీరు ఈ పాలసీని ఎప్పుడు సరెండర్ చేస్తారు అన్న విషయాలపై ఈ పర్సంటేజ్ ఆధారపడి ఉంటుంది. ఇక ఎల్ఐసీ జీవన్ అంకుర్ అనేది లాభాలతో కూడిన సంప్రదాయ ప్లాన్. ఈ ప్లాన్‌లో రిస్క్ కవర్ తండ్రి/తల్లిపై ఉంటుంది. ఈ ప్లాన్‌లో కూతురు నామినీగా ఉంటుంది. ఈ పాలసీ తీసుకొని మూడేళ్లైతేనే/ లేదా మూడు పూర్తి ప్రీమియమ్‌లు చెల్లిస్తేనే మీరు ఈ పాలసీని సరెండర్ చేయగల అవకాశముంటుంది. దీనికి సరెండర్ వేల్యూ- మీరు చెల్లించిన ప్రీమియమ్‌ల్లో 30 శాతం(మొదటి ఏడాది ప్రీమియమ్, ఆప్షనల్ రైడర్, అదనపు ప్రీమియమ్‌లను మినహాయించి)గా ఉంటుంది. మీకు నష్టాలు వచ్చినా సరే, ఈ పాలసీలను సరెండర్ చేయడమే సముచితమని భావిస్తున్నాం. ఇలాంటి బీమా, ఇన్వెస్ట్మెంట్ కలగలసిన ప్లాన్లు స్వల్ప మొత్తానికే బీమా కవర్‌ను ఇస్తాయి. అంతంత రాబడులు మాత్రమే వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ కోసం ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడం సరైనది కాదు. ఇలా చేస్తే బీమా కవర్, రాబడుల్లో రాజీ పడాల్సి ఉంటుంది. జీవిత బీమా కోసమైతే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. తక్కువ ప్రీమియమ్‌లు, అధిక రాబడులు వీటి ప్రత్యేకత. ఇక పాప చదువు, ఇంటి కొనుగోలు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసమైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. నేను ఒక మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) రెగ్యులర్ ప్లాన్‌లో రెండేళ్ల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే మ్యూచువల్ ఫండ్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్‌కు సంబంధించిన డెరైక్ట్ ప్లాన్‌కు మారాలనుకుంటున్నాను. అలా మారే వీలుందా? అవసరమైతే ఏమైనా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందా ? - అబ్దుల్లా, వరంగల్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్) లేదా ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లకు తప్పనిసరిగా మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ లాక్ ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాతనే మీరు రెగ్యులర్ ప్లాన్ నుంచి డెరైక్ట్ ప్లాన్‌కు మారాల్సి ఉంటుంది. అంతకంటే ముందుగానే మారడానికి వీలు లేదు. జరిమానా చెల్లించి మారే వీలు ఏమీ లేదు. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
చాక్లెట్ తింటే మధుమేహం దూరం!
లండన్ః రోజూ వంద గ్రాముల చాక్లెట్ తిని మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చంటున్నారు తాజా అధ్యయనకారులు. త్వరలో డాక్టర్లు కూడ ఇదో వైద్యంగా సలహా ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. డార్క్ చాక్లెట్ తీసుకోవడం ద్వారా ముధుమేహాన్ని నియంత్రించ వచ్చని లండన్ లోని వార్విక్ యూనివర్శిటీ జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. చాక్లెట్ లో ఉండే పదార్థాలు ఇన్సులిన్ లెవెల్స్ ను నియంత్రిస్తాయని తద్వారా గుండె జబ్బులు కూడ వచ్చే అవకాశం తగ్గుతుందని చెప్తున్నారు. వార్విక్ విశ్వవిద్యాలయం అధ్యయనకారులు 18 నుంచి 69 ఏళ్ళ మధ్య వయసుగల 1153 మందిపై నిర్వహించిన పరిశోధనల్లో తాజా విషయాలు వెలుగులోకి వచ్చాయి. చక్కెర వ్యాధి గ్రస్థులు ప్రతిరోజూ వంద గ్రాముల డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణకు సహకరించడంతోపాటు ఇతర హృద్రోగ సమస్యలు కూడ చాలావరకూ తగ్గే అవకాశం ఉందని లక్సెంబర్గ్ పరిశోధనల్లో తెలుసుకున్నారు. డార్క్ చాక్లెట్ తయారీకి వినియోగించే కోకోలో మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ప్రతిరోజూ 100 గ్రాముల చాక్లెట్ ను తీసుకోవడం వల్ల లివర్ లోని ఎంజైములు అభివృద్ధి చెంది, ఇన్సులిన్ ను నియంత్రించేందుకు తోడ్పడుతుందని పరిశోధకులు చెప్తున్నారు. అలాగే ఈ చాక్లెట్ ను ప్రతిరోజూ తీసుకునేవారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని, రోజుకు 28.8 గ్రాముల చొప్పున ప్రతిరోజూ తీసుకునే వారిలో చురుకుదనం పెరిగి ఉత్సాహంగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలినట్లు చెప్తున్నారు. అంతేకాక కోకో ఉన్న ఉత్పత్తులను తరచుగా తీసుకోవడం వల్ల కూడ గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చని, ఇది గుండె మెటబాలిక్ కండిషన్ ను మెరుగు పరుస్తుందని వార్విక్ మెడికల్ స్కూల్ పరిశోధకుల సెవేరియో స్టేంజెస్ తెలిపారు. పరిశోధనా వివరాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురించారు. -
సమ్మర్ సెలవులు లేదా వేసవి హాలిడేస్...
సరదా సంసారం ప్రశాంతంగా ఆ మధ్యాహ్నాన్ని తెలుగులో డబ్ చేసిన హాలీవుడ్ సినిమా చూస్తూ అర్థవంతం చేద్దామనుకుంటూ ఉండగా ‘కిచక్’ అని సౌండ్ వచ్చింది. ‘కాదు... అది పచక్’ అని మా ఆవిడ ఆ తర్వాత వాదించిందిగాని మొత్తం మీద సౌండైతే వచ్చింది. నా పై ప్రాణాలు పైనే పోయాయి. ‘ఏమండీ... ఈ ఎల్లో సరిపోతుందా’ అంది మా ఆవిడ నా దగ్గరకు వచ్చి కలిపిన శనగపిండిని చూపిస్తూ. ఆమెనే ఆరాధనగా చూశాను. ఎవరైనా ఉప్పు సరిపోయిందా పచ్చి మిర్చి సరిపోయిందా అని అడుగుతారు. ఎల్లో సరిపోయిందా అని అడగడం ఏ భర్తకైనా అరుదుగా దొరికే ఆనందబాష్పకణం. ‘ఇప్పుడు ఈ రిస్క్ ఎందుకు పెట్టుకున్నావ్ చెప్పూ’ అన్నాను. ‘అదేమిటండీ... పిల్లలకు సెలవులు కదా. ఆడుకుంటున్నారు. కాసేపటికి సాయంత్రమవుతుంది. చిరుతిండి ఏదైనా అడిగితే ఏం పెట్టను? అందుకని మసాలా వడలు చేద్దామనుకుంటున్నాను. ఏడో క్లాస్‌లో ఒకసారి అమ్మమ్మ చేస్తుంటే చూశాను. అప్పుడు తను పొయ్యి మీద బాండిల్ పెట్టి వీటిని చేసిన గుర్తు’... ‘చేశాక నాకు పెట్టవు కదూ. దొంగ... చెప్పు... పెట్టవు కదూ’... ‘భలేవారే. మొదటి వడ మీరే తినాలి. ఈ హార్లిక్స్ సీసా ఎక్కడుందో’ ‘ఏమిటి... పిండిలో హార్లిక్స్ కలుపుతావా?’ ‘భలేవారే. నాకు ఆ మాత్రం తెలియదా. అందులో సోడా ఉప్పు దాచేనండీ’... కిచెన్‌లోకి వెళ్లిపోయింది. ప్రశాంతంగా ఆ మధ్యాహ్నాన్ని తెలుగులో డబ్ చేసిన హాలీవుడ్ సినిమా చూస్తూ అర్థవంతం చేద్దామనుకుంటూ ఉండగా ‘కిచక్’ అని సౌండ్ వచ్చింది. ‘కాదు... అది పచక్’ అని మా ఆవిడ ఆ తర్వాత వాదించిందిగాని మొత్తం మీద సౌండైతే వచ్చింది. నా పై ప్రాణాలు పైనే పోయాయి. ఎందుకంటే అలాంటి లలితమైన సౌండ్లు మా చిన్నాడే చేస్తాడు. పరిగెత్తుకుంటూ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్లాను. ల్యాప్‌టాప్‌లో నుంచి తేలికపాటి పొగ వస్తోంది. వాడు విజయం సాధించినట్టుగా గంభీరంగా నవ్వుతున్నాడు. పెద్దాడు బిక్కముఖం వేసుకొని చూస్తున్నాడు. ఫ్లాష్‌కట్: ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ‘మోటూ పత్లూ’ పెద్దాడు చూస్తున్నాడు. కాదు ‘షౌన్ ద షీప్’ చూడాలని చిన్నాడు ముచ్చటపడ్డాడు. పెద్దాడు వినలేదు. చిన్నాడు ఎర్రగడ్డలో కొన్న బ్లూ కలర్ ప్లాస్టిక్ బ్యాట్ తీసుకొని ల్యాప్‌టాప్ మీద పట్టుదలగా ‘పుటుక్’మని కొట్టాడు. యూకు ట్యూబ్ పోయింది. నా సెన్సెక్స్ పతనమయ్యింది. మా ఆవిడ ఏం అనలేదు. నా వైపు చూసి ‘అప్పుడే చెప్పాను. అనుభవించండి’ అంది. ‘ఏదో నా తప్పులా మాట్లాడుతున్నావ్?’ ‘మీ తప్పు కాదా. పెద్దాణ్ణి చూడండి ఎంత బుద్ధిగా ఉంటాడో! ఎందుకు?.. వాడి కాన్పు మా పుట్టింట్లో అయ్యింది కాబట్టి. రెండో కాన్పు కూడా మా పుట్టింట్లోనే చేద్దామండీ పిల్లలు బుద్ధిగా ఉంటారంటే విన్నారా? ఊహూ.. మా ఊళ్లో మా ఫ్యామిలీ డాక్టర్ భానుకట్ల విజయతోనే చేయించాలన్నారు. ఇప్పుడేమైంది? విజయ్ మాల్యాలాగా తయారయ్యాడు. మీ ఇళ్లల్లో పిల్లలంతా అంతేగా... కింగ్‌కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా’ ‘శారదా’... ‘శంకర్ శాస్త్రీ’... ఆ అరుపుకు బిక్క చచ్చాను. ‘ఏం... మీకేనా గొంతు. మాకు లేదా. మేం మాత్రం మిరియాల పాలు తాగడం లేదా. మీరు ఎంత పెద్దగా అరిచినా వాస్తవం వాస్తవమే. మీ అన్నయ్య పిల్లలు, చెల్లెలి పిల్లలు, తమ్ముడి పిల్లలు... హవ్వ.. హవ్వ... దేశీయ స్టెంట్ కంపెనీలన్నీ మీ పేరు చెప్పుకునే కదండీ బతుకుతున్నాయి. వీళ్ల అల్లరికే కదా మీ ఊళ్లో నిక్షేపంలా ఉన్నవాళ్లంతా గుండెకి ఒక స్టెంటు రెండు స్టెంట్లూ వేసుకొని తిరుగుతున్నారు.’... లాభం లేదు ఎదురుదాడి చేయాల్సిందే.‘ఆ మాటకొస్తే మీవాళ్ల పిల్లలు మాత్రం తక్కువా? మొన్న మీ ఊరి పేరు పేపర్లో వేశారు చూళ్లేదా? మీ ఊళ్లోకి ఒక్క కోతి కూడా రావడం లేదని విడ్డూరంగా రాశారు. మీ కొండముచ్చులుండగా కోతులెందుకొస్తాయ్? వాటి సేఫ్టీ అవి చూసుకోవూ’ ‘మాటలు నేర్చిన యాంకర్ వాట్సప్ అంటే థమ్సప్ అదంట. అలా ఉంది మీరు మాట్లాడటం’ ‘ఖుదా మెహర్బాన్తో గధా పహిల్వాన్.. అలా ఉంది నువ్వు చెప్పడం’... ‘నాకు హిందీ రాదని ఆ భాషలో వాగకండి’.. ‘ఇంకా వాగుతాను. పోవే ఖాందన్.. ఘరోండా... జ్యోతీ బనేగీ జ్వాలా.. ఖూన్ కా రిష్తా’.... అవన్నీ ఏవో భారీ బూతు తిట్లు అనుకుని చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలని మా ఆవిడ ఆ ఏర్పాట్లలోకి వెళ్లింది. ఈలోపు హాల్లో నుంచి మళ్లీ ఏవో మృదువైన శబ్దాలు రావడం మొదలెట్టాయి. పరిగెత్తి చూశాను. వంశాంకురాలిద్దరూ టీవీ దగ్గర ఉన్నారు. స్టార్ మూవీస్ చూడాలని పెద్దాడు.. డిస్నీ ఎక్స్‌డి చూడాలని చిన్నాడు... సున్నితమైన చర్యలతో ఒకరి పై మరొకరు పై చేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. అమీర్‌పేట సర్దార్జీ షాపులో కొన్న టేబుల్ టెన్నిస్ బ్యాట్ చిన్నాడి చేతిలో సిద్ధంగా ఉంది... ‘శారదా’ పెద్దగా అరిచాను. ‘శంకరశాస్త్రి’... మా ఆవిడ జవాబిచ్చింది.ఇక ఈ వేసవి హాలిడేస్ జాలీ జాలీగా గడవబోతున్నందుకు ఎంతో రొమాంచితంగా అనిపించింది. - భా.బా (భార్యా బాధితుడు) తాజా కలం: గీతాకారుడిలా సెలవిస్తున్నాడు... పార్థా! డాబర్ వారి చాందీసోనా చవన్‌ప్రాశ్ రెండు పూటలా రెండు చెంచాలు పుచ్చుకొనుము. వీలైనచో పచ్చిపాలు తాగి బస్కీలు తీయుము. వేసవి సెలవుల్లో భార్యా పిల్లలను ఎదుర్కొనడానికి నాకు తెలిసినది చెప్పాను. నీకు తెలిసినదుంటే నాకు తెలియజేయుము. -
బ్రెస్ట్ క్యాన్సర్ తిరగబెట్టకుండా.. చిన్న చిట్కా!
ఒకసారి క్యాన్సర్ బారిన పడి, చికిత్స చేయించుకున్నవారికి మళ్లీ ఆ వ్యాధి తిరగబెడుతుందనే ఆందోళన తక్కువేమీ కాదు. రొమ్ము క్యాన్సర్ పునరుక్తిని తగ్గించేందుకు చిన్న చిట్కాను పాటించాలని పరిశోధకులు చెబుతున్నారు. రాత్రి భోజనం తర్వాత విరామం ఎక్కువ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టే అవకాశాలు చాలా తక్కువ అని తాజా అధ్యయనంలో తేలింది. రాత్రి ఎక్కువసేపు ఉపవాసం ఉండటం ఈ వ్యాధి మళ్లీ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందన్నారు. 1995, 2007 మధ్యకాలంలో రొమ్ము క్యాన్సర్ పునరుక్తి, కొత్త ట్యూమర్లు రావడం, వారి ఆహార పద్ధతులు, నియమాలపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఇప్పటికే వ్యాధితో పోరాడిన దాదాపు 2వేల మందిపై జరిపిన కొత్త పరిశోధనలో ఈ అంశం తేలిందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకురాలు కేధరీన్ మారినాక్ తెలిపారు. రాత్రిపూట భోజనం తర్వాత విరామం 13 గంటల కంటే తక్కువ కాకుండా ఉంటే ప్రారంభదశలోనే రొమ్ము కాన్సర్ చికిత్స పొందిన మహిళల్లో తిరిగి కణితులు ఏర్పడే అవకాశం 36 శాతం తగ్గిందని వెల్లడించారు. భోజనం తరువాత వెంటనే నిద్రకు ఉపక్రమిస్తే ఈ వ్యాధి తిరగబెట్టే అవకాశం ఎక్కువే అంటున్నారు. ఎక్కువ సేపు నిద్ర, రాత్రి ఎక్కువ భోజన విరామం గ్లైసేటెడ్ హిమోగ్లోబిన్‌ను ప్రభావితం చేస్తుందన్నారు. దీంతోపాటు ఇతర క్యాన్సర్ల ప్రమాదం, టైప్ 2 మధుమేహం, గుండె రక్తనాళాల వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. రాత్రిపూట ఉపవాస విరామం తగినంత పొడిగించుకొని దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదాన్ని తగ్గించుకోవాలని పరిశోధకులు సూచించారు. జామా ఆంకాలజీ అనే పత్రికలో ఈ పరిశోధనా పత్రం ప్రచురితమైంది. -
బత్యాలకు త్రుటిలో తప్పిన ప్రమాదం
పెనగలూరు: ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడుకు ఆదివారం త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ట్రాక్టర్ ఢీకొం ది. అయితే ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. వివరాల్లోకెళితే.. ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు ప్రయాణిస్తున్న కారును ఆదివారం సాయంత్రం పెనగలూరు మండలంలోని బెస్తపల్లి వద్ద ఓ ట్రాక్టర్ ఢీకొంది. సుమారు 15 అడుగుల దూరం మేర బత్యాల వాహనాన్ని ట్రాక్టర్ ఈడ్చుకుంటూ వెళ్లింది. కారు తలుపులు, ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాద దృశ్యాన్ని చూస్తే కారులో ఉన్న వారికి తీవ్రగాయాలు అయి ఉంటాయని భావిస్తారు. అయితే కారులో ఉన్నవారికి చిన్నపాటి గాయాలు కూడా కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. -
పేదల పొరుగున పెరిగితే...
పేదరికం అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో, ఆర్థికంగా వెనుకబడినవారు నివసించే ప్రాంతాల్లో ఉండే యువతుల్లో ఊబకాయ సమస్య అత్యధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తాజా అధ్యయనాల్లో తేలింది. పేదరికం, ఊబకాయానికి మధ్య పాక్షిక సంబంధం ఉండే అవకాశం ఉందని పరిశోధకులు తేల్చారు. తక్కువ ఆదాయం ఉండేవారు నివసించే ప్రాంతాల్లో వ్యాయామ సౌకర్యాలు, ఆరోగ్యకరమైన ఆహారవనరులు లేకపోవడమే కాక, అధిక ఒత్తిడి కూడ ఊబకాయానికి కారణమౌతోందని చెప్తున్నారు. ఆదాయం తక్కువగా ఉన్నవారు నివసించే ప్రాంతంలో ఎక్కువకాలం ఉండటం యువతుల జీవితకాల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని అమెరికా కొలరాడో డెన్వర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆడమ్ లిప్పర్ట్ తెలిపారు. నేషనల్ సర్వే డేటాలోని ఏడవతరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను పరిశోధన బృందం 13 సంవత్సరాలపాటు పరిశీలించింది. విద్యార్థులు బాల్యంనుంచి యుక్త వయసులోకి మారుతున్న సమయంలో వారు నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి, వారిలో ఊబకాయం సమస్య సంక్రమిస్తున్నట్లు అధ్యయనాల్లో వెల్లడి అయింది. పిల్లలు...బాల్యం నుంచీ యుక్త వయసు వరకూ పేదలు ఉండే ప్రాంతాల్లో స్థిరంగా ఉంటే వారిలో ఊబకాయం సమస్య అధికంగా ఉంటున్నట్లు గుర్తించారు. అదే యుక్త వయసులోకి మారుతున్న సమయంలో పేదలు ఉన్న ప్రాంతంనుంచీ సంపన్న ప్రాంతానికి మారినప్పుడు ఊబకాయ సమస్య తక్కువగానూ, సంపన్న ప్రాంతంనుంచీ తక్కువ ఆదాయం ఉన్న ప్రాంతానికి చేరినప్పుడు స్థూలకాయం సమస్య ఎక్కువవుతున్నట్లు తేలింది. ముఖ్యంగా మురికివాడల్లోనూ, పేదలు నివసించే ప్రాంతాల్లోనూ ఎక్కువకాలం పెరిగిన యువతులు భవిష్యత్తులో ఊబకాయం సమస్యతో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనల్లో వెల్లడించారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా యువతులకు సానుకూల వనరులు సమకూర్చడం, నివాస పరిస్థితులు మెరుగు పరచడంవల్ల వారి భవిష్యత్తు ఆరోగ్యంగా కొనసాగే అవకాశం ఉంటుందని లిప్పర్ట్ సూచించారు. -
గురకతో ఆ ముప్పు పెరుగుతోంది!
మ్యూనిచ్: నిద్రలో గురక పెడుతున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పరిశోధకులు. గురక పెట్టేవారిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని తాజా పరిశోధనల్లో తేలింది. మరీ ముఖ్యంగా గురకపెట్టే పురుషులు జాగ్రత్తగా ఉండాలని చెబుతునారు. గురక పెట్టే సమయంలో గాలి తీసుకోవడంలో ఏర్పడే అవరోధం వల్ల శరీరంలోని ముఖ్యమైన కణజాలాలాకు అందే ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుందని, ఈ స్థితి క్యాన్సర్‌కు కారణం కావడమే కాకుండా వేగంగా వ్యాప్తి చెందడానికి దోహదం చేస్తుందని మ్యూనిచ్‌లో జరిగిన యురోపియన్ అసోసియేషన్ ఆరోగ్య సదస్సులో శాస్త్రవేత్తలు వెల్లడించారు. శరీరంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గడం వల్ల క్యాన్సర్ కణాలు గ్రహించే ప్రొటీన్ల శాతం పెరుగుతుందని, తద్వారా అవి వేగంగా వృద్ధి చెందుతాయని డాక్టర్ ఆంటోని విలాసికా తెలిపారు. ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఆక్సిజన్ లెవల్స్ తగ్గడం అనేది వాటి మూత్రపిండాల్లోని కణాల అసహజ పెరుగుదలకు కారణం అయినట్లు రుజువైందని, మనుషుల్లో సైతం మూత్రపిండాల కణాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రొఫెసర్ అర్ముఫ్ స్టెంజల్ వెల్లడించారు. -
జీవితంలో రిస్క్ తీసుకోండి
అహ్మదాబాద్: నిరాశావాదులు, ప్రతికూల భావనలతో ఉండే వారి మాట వినొద్దని విద్యార్థులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సూచించారు. జీవితంలో కొన్ని రిస్క్‌లు తీసుకోవాలని, సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఆశావాదమనే మెలోడీలతో చెవులను నింపుకొని, మీ సొంత సంగీతానికి తగ్గట్లుగా డ్యాన్స్ చేయాలని చెప్పారు. ఇక్కడి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పెట్రోలియమ్ యూనివర్సిటీ(పీడీపీయూ) నాలుగవ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. రిస్క్ తీసుకున్నవాళ్లే చరిత్ర సృష్టించారని, కోట్లాది ప్రజల జీవితాలను మార్చేశారని పీడీపీయూకు ప్రెసిడెంట్‌గా కూడా పనిచేస్తున్న ఆయన వివరించారు. గ్రామీణ పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన విద్యార్థులకు ఉద్బోధించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాపారంలో ఇంధన పరిశ్రమ కీలకంగా ఉందని, భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల పరిష్కారంలో ఇతరుల కంటే పీడీపీయూ విద్యార్ధులు సమర్థవంతంగా వ్యవహరించగలరని పేర్కొన్నారు. పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాల నుంచి భారత్‌ను నవీకరణ ఇంధన వనరుల దిశగా నడిపించేలా నవ కల్పనలను రూపొందించాలని ఆయన విద్యార్ధులకు పిలుపునిచ్చారు. -
కంప్యూటర్‌తో మతిమరుపు దూరం!
వాషింగ్టన్: కనీసం వారానికి ఒకసారి కంప్యూటర్ను వాడటం వలన వృద్ధులలో మతిమరుపు వచ్చే అవకాశం తగ్గుతోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కంప్యూటర్ వాడకం, చదవటం, రాయటం లాంటి చర్యల ద్వారా మెదడు ఉత్తేజితమౌతుందని, తద్వారా మెదడు క్రియాశీలకంగా పనిచేస్తూ మానసికపరమైన సమస్యలు తగ్గిపోతున్నాయని అమెరికాకు చెందిన మయో క్లినిక్ వెల్లడించింది. మలి వయసులో ఎదుర్కొనే అనేక మానసిక సమస్యలకు ప్రధాన కారణం మెదడును క్రియాశీలకంగా ఉంచే మానసిక కార్యకలాపాల్లో పాల్గొనకపోవటమే అని పరిశోధనకు నేతృత్వం వహించిన క్రెల్ రోచ్ తెలిపారు. కంప్యూటర్ను వారానికి ఒక సారి వాడటం ద్వారా మానసిక రుగ్మతల భారీన పడే అవకాశం 42 శాతం తగ్గుతోందని, మేగజైన్లు చదవటం, సామాజిక కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించే వారిలో మతిమరుపు అవకాశం 30 శాతం మేర తగ్గుతోందని ఆయన తెలిపారు. -
కప్పు టీతో గుండెజబ్బులు దూరం
ప్రతి రోజూ ఓ కప్పు టీ తాగితే గుండెపోటు.. స్ట్రోక్ లాంటి ప్రమాదాలను నివారించుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అసలు టీ తాగనివారితో పోలిస్తే రోజుకు ఒక కప్పు టీ తాగేవారిలో గుండెపోటు లేదా ఇతర హృదయ సంబంధిత వ్యాధులు సంక్రమించే అవకాశం 35 శాతం తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. టీ తాగే అలవాటు ఉన్నవారిలో గుండెలోని ధమనుల్లో కాల్షియం తక్కువగా ఉన్నట్లు అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ ఆస్పత్రి శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ధమనుల్లో పేరుకునే కాల్షియం నిక్షేపాలు గుండెజబ్బులకు, స్ల్రోక్తో పాటు ఇతర ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులను తగ్గించేదుకు టీ ప్రయోజనకరంగా ఉన్నట్లు తమ అధ్యయనాల్లో తేలిందని జాన్స్ హాప్కిన్స్ ఆస్పత్రి పరిశోధక బృందం సభ్యులు ఇలియట్ మిల్లర్ తెలిపారు. 2000 సంవత్సరంలో పరిశోధనలు ప్రారంభించినప్పుడు మొదట్లో సుమారు 6 వేల మందికి పైగా పురుషులు, మహిళలు పాల్గొన్నారని, వారెఎవ్వరికీ ఎలాంటి గుండెజబ్బులూ లేవని పరిశోధకులు తెలిపారు. తర్వాత 11 ఏళ్లలో గుండెనొప్పి, స్ల్రోక్, ఛాతీనొప్పితో బాధపడే వారితోపాటు కొందరు ఇతర గుండెజబ్బులతో మరణించిన వారి ట్రాక్ రికార్డును పరిశీలించగా... ముందుతో పోలిస్తే ఐదేళ్ల తర్వాత వారి రక్తనాళాల్లో కాల్షియం నిక్షేపాలు పేరుకున్నట్లు అధ్యయనాల ద్వారా తెలిసిందని పరిశోధకులు చెప్తున్నారు. పరిశోధన సమయంలో రోజూ ఓ కప్పు టీ తాగినవారిలో మాత్రం అస్సలు టీ తాగనివారి కంటే మూడింట ఒకవంతు గుండెనొప్పి వంటి ప్రమాదాలకు దూరంగా ఉన్నట్లు పరిశోధనల్లో తేల్చారు. -
కాఫీతో ఆ రిస్క్ సగానికి పైగా తగ్గుతోంది!
లండన్: కాఫీ ప్రియులకు శుభవార్త. మీరు రోజు మామూలుగా తాగేదానికన్నా అదనంగా మరో రెండు కప్పుల కాఫీని లాగించమని చెబుతున్నారు పరిశోధకులు. దీని ద్వారా కాలేయానికి సంబంధించిన ప్రాణాంతకమైన వ్యాధులు సగానికి పైగా తగ్గుతాయని చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శరీరంలో ఆల్కహాల్ మోతాదు మించడం, హెపటైటిస్ సీ లాంటి వైరల్ వ్యాధుల భారిన పడటం ద్వారా కాలేయం(లివర్) తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఇలా దీర్ఘకాలంగా కాలేయ వ్యాధులు ఉన్నవారిలో అది లివర్ క్యాన్సర్‌గా మారి ప్రాణాంతకంగా తయారవుతోంది. అయితే ఈ ముప్పును కాఫీ సగానికి పైగా తగ్గిస్తోందని లండన్‌లోని సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృంధం తాజాగా తేల్చింది. సుమారు 5 లక్షల మందిని పరిశీలించి ఈ ఫలితాలను వెల్లడించారు. లివర్ సిర్రోసిస్ వ్యాధికి కాఫీ మంచి విరుగుడులా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. కాఫీతో కలిగే ఈ ప్రయోజనాలను తెలుసుకోవడం ద్వారా లివర్‌కు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారికి మంచి ఉపయోగాలున్నాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఒలివర్ కెన్నడీ వెల్లడించారు. -
నిద్ర ప్రియులకు హెచ్చరిక
న్యూయార్క్: నిద్ర ప్రియులకు హెచ్చరిక. అతి నిద్ర ఏమాత్రం మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఎనిమిది గంటలు మించి నిద్రపోతూ ఉంటే వారు ఏక్షణమైనా సమస్యల వలయంలో చిక్కుకోవచ్చని హెచ్చరిస్తున్నారు. వీరికి గుండెపోటు వచ్చేందుకు 146శాతం అధికంగా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏడు నుంచి ఎనిమిది గంటలు మాత్రమే నిద్రపోయి తప్పనిసరిగా వ్యాయామం చేసేవారు మాత్రం జీవితాంతం ఎలాంటి ఆరోగ్య పరమైన సమస్యలను ఎదుర్కోకుండా హాయిగా బతికేయొచ్చని కూడా వారు సెలవిస్తున్నారు. ఇప్పటి వరకు అత్యంత ప్రాణాలు హరించే వాటిల్లో తొలి రెండు స్థానాల్లో గుండెపోటు, క్యాన్సర్ ఉండగా దాని అనంతరం కూడా అతి నిద్ర వల్ల వచ్చే గుండె పోటేనని చెప్తున్నారు. ప్రతి ఏడాది బ్రిటన్‌లో దాదాపు లక్షమంది గుండెపోటుకు గురవుతుండగా వీరిలో సగానికిపైగా అతి నిద్రకు అలవాటైన వారే ఉన్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధనను అమెరికాకు చెందిన న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన అధ్యయనకారులు చేశారు. ఎంతలేదన్నా కనీసం రోజుకు 30 నుంచి 60 నిమిషాలపాటు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి సురక్షితం అని చెప్పారు. -
కాఫీ మీ జీవితాన్ని కాపాడుతుంది..!
కాఫీ తాగడం అలవాటుపై అనేక అనుమానాలు, అపోహలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. అయితే తాజా పరిశోధకులు మాత్రం... కాఫీ తాగడం జీవితాన్నే కాపాడుతుందంటున్నారు. రోజుకు నాలుగైదు కప్పుల కాఫీ తాగడం జీవన పరిమాణాలనే పెంచుతాయంటున్నారు. అసలు కాఫీనే తాగే అలవాటు లేని వారికన్నా కాఫీ తాగేవారు ఎక్కువ కాలం బతుకుతున్నారని, మధుమేహం, గుండె జబ్బులనుంచి వచ్చే ప్రమాదాలను కూడా అరికట్టేందుకు కాఫీ సహకరిస్తుందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, మధుమేహం, అకాల మరణాలు, న్యుమోనియా, ఇన్ఫ్లుయంజా వంటి వ్యాధుల వల్ల వచ్చే ప్రమాదాలకు దూరంగా ఉండడంతోపాటు ఆత్మహత్యలకు పాల్పడాలన్న ఆలోచనల నుంచి కూడా కాఫీ దూరం చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. పది సంవత్సరాలపాటు (1998 నుంచి 2009) సుమారు లక్షమంది నడివయస్కులపై చేసిన పరిశోధనల్లో కాఫీ తాగనివారికంటే తాగేవారు ఎక్కువకాలం బతికినట్లుగా తెలుసుకున్నారు. కాఫీలోని ఫినోలిక్ యాసిడ్లు, పొటాషియం, కెఫిన్ సహా మనుషుల జీవనంపై క్రియాశీలకంగా పనిచేస్తామయని నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ అధ్యయన రచయిత డాక్టర్ ఎరిక్కా లాఫ్టిఫైడ్ తెలిపారు. అలాగే ప్రతిరోజూ నాలుగు నుంచి ఐదు కప్పుల కాఫీ తాగే వారికి వ్యాధుల ప్రమాదం అత్యల్పంగా ఉందని పరిశోధకులు చెప్తున్నారు. అలాగే కాఫీ తాగేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. కొన్ని క్యాన్సర్ల తో బాధపడే వారికి కాఫీ అలవాటువల్ల కొంత జీవన కాలం పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు గర్భిణిలు కాఫీ తాగొచ్చా కూడదా అన్న విషయంపై కూడ అనుమానాలను తాజా పరిశోధనలు తీరుస్తున్నాయి. రోజుకు సుమారు రెండు వందల మిల్లీగ్రాముల కెఫెన్ కలిగిన కాఫీని గర్భిణిలు కూడా తాగొచ్చని అమెరికన్ అబ్ స్టెట్రీషియన్స్, గైనకాలజిస్ట్ ల కళాశాల అధ్యయనకారులు చెప్తున్నారు. రోజువారీ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేవారిలాగే ప్రతిరోజూ అలవాటుగా కాఫీ తాగేవారు కూడ ఆరోగ్యంగానే ఉంటారని తెలుస్తోంది. అయితే అప్పటికే అనారోగ్యంతో బాధపడేవారు మాత్రం కాఫీ తాగకుండా ఉండటమే మంచిదంటున్నారు. ఏది ఏమైనా కాఫీ రోజువారీ జీవితంలో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే పానీయంగా అధ్యయనకారులు చెప్తున్నారు. -
డిస్క్ వాపుతో రిస్క్ ఉంటుందా?
హస్తవాసి కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 45. ఇటీవల రొటీన్ రక్త పరీక్షలు చేయించుకున్నాను. అందులో నా కొలెస్ట్రాల్ 350కి పైనే ఉందని అని చెప్పారు. నేను మద్యం, మాంసాహారాలకు చాలా దూరంగా ఉంటాను. అయినప్పటికీ నాలో కొలెస్ట్రాల్ ఇంత ఎక్కువగా పెరగడానికి కారణం ఏమిటి? - జీవన్, కొత్తగూడెం రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండటం అన్నది కేవలం మన ఆహార నియమాల మీద మాత్రమే కాదు... జన్యుపరమైన అంశాలపైన కూడా ఆధారపడుతుంది. జన్యుపరమైన అంశమే కారణమై ఉన్నవారిలో ఏలాంటి ఆహార నియమాలూ పాటించకపోతే కొలెస్ట్రాల్ మరింతగా పెరగవచ్చు. కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణాలు ఏవైనా దాని వల్ల భవిష్యత్తులో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మీరు స్టాటిన్స్ అనే కొలెస్ట్రాల్ తగ్గించే మందులను డాక్టర్ సలహాపై క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. నా వయసు 35 ఏళ్లు. మా కుటుంబంలో చాలామందికి గుండె జబ్బులు ఉన్నాయి. మా నాన్నగారికి కూడా గుండెజబ్బు ఉంది. నాకు కూడా గుండెజబ్బు ఉందేమోనని అనుమానంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - కనకరత్నం, గుంటూరు మీరు చెప్పినదాన్ని బట్టి మీ కుటుంబ చరిత్రలో గుండెజబ్బు ఉన్నట్లు తెలుస్తోంది. మీదింకా చిన్న వయసే కాబట్టి ప్రస్తుతం మీది వట్టి ఆందోళన మాత్రమే అనిపిస్తోంది. అయినా మీరు ఒకసారి దగ్గర్లో ఉన్న కార్డియాలజిస్ట్‌ను కలిసి మీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌తో పాటు ఈసీజీ ఎకో, టీఎమ్‌టీ టెస్టులు చేయించుకుని జబ్బు లేదని నిర్ధారణ చేసుకోండి. ఆ తర్వాత రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ లాంటి వ్యాయామాలు చేయండి. మంచి జీవనశైలితో జీవించండి. మీకు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. - డాక్టర్ శ్రీనివాసకుమార్ చీఫ్ కార్డియాలజిస్ట్, సిటిజెన్స్ హాస్పిటల్స్, శేరిలింగంపల్లి, హైదరాబాద్. ఫిజియోథెరపీ కౌన్సెలింగ్ ఎవరో అకస్మాత్తుగా ముందుకు పడిపోతుండగా, వాళ్లను పడిపోకుండా ఆపే ప్రయత్నంలో నా వీపు మధ్యభాగం బెణికింది. ఈ సంఘటన ఆర్నెల్ల కిందట జరిగింది. అప్పట్నుంచి నాకు వీపు మీద నొప్పి వస్తూ, అది మోకాలి కింది వరకూ పాకుతోంది. ఫిజియోథెరపీతో నొప్పి తగ్గింది. అయితే ఇప్పుడు గమనించిన అంశం ఏమిటంటే... నా ఎడమకాలి కంటే కుడికాలు తొందరగా అలసిపోతోంది. నేను టేబుల్ టెన్నిస్ ఆడుతుంటాను. ఈ మధ్య రెండు నిమిషాలు నిలబడితే చాలు... నొప్పి వచ్చి అది కాలి కిందవైపునకు పాకుతోంది. డాక్టర్‌ను కలిస్తే ఎల్4, ఎల్5 వెన్నుపూసల మధ్య వాపు వచ్చినట్లు తెలుస్తోంది, మళ్లీ ఫిజియో చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. అయినా ఈ నొప్పి నుంచి ఉపశమనం కలగడం లేదు. పైగా ఒక్కోసారి వెన్ను మధ్యన నొప్పి వస్తోంది. ఈ డిస్క్ వాపు సమస్య పూర్తిగా తగ్గుతుందా? దయచేసి వివరించండి. - సుధాకర్‌రెడ్డి, హైదరాబాద్ వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ తన స్థానం నుంచి జరిగి, అది కాలికి వెళ్లే నరాలను నొక్కుతుండటం వల్ల మీకు ఈ నొప్పి వస్తుండవచ్చు. అందువల్లనే మీకు కాలిలోకి పాకుతున్నట్లు నొప్పి వస్తోందనిపిస్తోంది. ఇలాంటి నొప్పులు మాటిమాటికీ తిరగబెడుతుంటాయి. మీరు సందేహిస్తున్నట్లుగా మీ వెన్నునొప్పికీ, కాలిలోకి పాకే నొప్పికీ సంబంధం ఉంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఫిజియోథెరపీ, కొన్ని నొప్పి నివారణ మందులు వాడటం (నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్-ఎన్ఎ స్ఏఐడీ), వేడి కాపడం పెట్టడం, టెన్స్, అల్ట్రాసౌండ్ చికిత్సలతో ఇది తగ్గవచ్చు. ఒకవేళ కొందరిలో ఈ ప్రక్రియలతో నొప్పి తగ్గకపోతే చివరి ప్రయత్నంగా సర్జరీ అవసరం కావచ్చు. కానీ చాలామందిలో సాధారణ ఫిజియోథెరపీతోనే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంటుంది. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని ఫిజియోథెరపిస్టును కలిసి, వారు సూచించిన ఫిజియోథెరపీ ప్రక్రియలను అనుసరించండి. అలాగే కొంతకాలం పాటు మీరు బరువులు ఎత్తకపోవడం, జాగింగ్ చేయకపోవడం, అకస్మాత్తుగా పక్కలకు తిరగకపోవడం, దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. మీ వ్యాయామాల్లో భాగంగా ఈత చాలా మేలు చేస్తుంది. వాకింగ్ కూడా మంచిదే. - ఆర్. వినయ కుమార్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫిజియోథెరపీ, కేర్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్ ఈఎన్టి కౌన్సెలింగ్ నాకు ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డం పడినట్లుగా అనిపిస్తుంది. చాలా రకాల మందులు వాడాను. మార్కెట్లో దొరికే చుక్కల మందు వాడుతున్నాను. అది వాడినప్పుడు మాత్రం సమస్య తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. ఆ మందుకు అలవాటు అవుతానేమో అని మానేశాను. రాత్రిపూట రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. చాలాసార్లు నోటితో గాలి తీసుకోవాల్సి వస్తోంది. నా సమస్య ఏమిటి? దీనికి తగిన పరిష్కారం తెలియజేయగలరు. - సీ.ఎస్.రావు, రావులపాలెం ఇటీవల కాలుష్యం వల్ల, జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో మొదట ఉండేది ముక్కుకు సంబంధించిన సమస్యలే. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడం లేదా అలర్జీ లేదా ముక్కులో పాలిప్స్ లేదా ఈ అన్ని సమస్యలు కలగలిసి ఉండవచ్చు. మీరు మొదట నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయించి, అవసరమైతే సీటీ స్కాన్ (పీఎన్ఎస్) కూడా తీయించాక మీ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్‌తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చే సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులను దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్ని రకాల నేసల్ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు. నాకు తరచూ జలుబు చేస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. టాబ్లెట్ వేసుకుంటే జలుబు తగ్గుతుంది. ఆ తర్వాత మళ్లీ వస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - సుకుమార్, విజయవాడ మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీకు ‘నేసల్ అలర్జీ’ ఉండవచ్చు అనిపిస్తోంది. ముక్కు, చెవి, గొంతు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. దానివల్ల ఒక భాగంలో సమస్య వస్తే అది మిగతా రెండు భాగాలను కూడా సమస్యకు గురిచేస్తుంది. మీరు చెప్పినట్లుగా యాంటీ అలర్జిక్ టాబ్లెట్ వాడటం శాశ్వత పరిష్కారం కాదు. పైగా దాన్ని ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ఇతర సమస్యలు కూడా వస్తాయి. దీనికంటే ‘నేసల్ స్ప్రే’లు వాడటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. వాటితో సైడ్ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి. మీరు ముందుగా నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం చికిత్స తీసుకోవడం మంచిది. దాంతోపాటు మీకు అలర్జీ కలిగించే అంశాలను గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండండి. - డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్ఓడి - ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ . మా చిరునామా: వైద్యసలహా కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్- 34. ఈ మెయిల్: asksakshidoctor@gmail.com నిర్వహణ: యాసీన్ -
ఈ రోగానికి మందేది?!
మితి మీరితే ఏదైనా వికటిస్తుంది. అది ప్రాణాధార మందుల విషయంలో కూడా వాస్తవమేనని తరచు వెల్లడవుతున్న ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. వచ్చిన వ్యాధేమిటో తెలియక, రోగి పడుతున్న నరకయాతనను చూడలేక ఆప్తులంతా క్షోభించే పాడుకాలం అంతరించి...రోగకారక క్రిములను మట్టుబెట్టే యాంటీ బయాటిక్స్ అందుబాటులోకొచ్చినప్పుడు ప్రపంచమంతా సంతోషించింది. యాంటీబయాటిక్స్ ఆవిష్కరణ మానవాళి చరిత్రలో ఒక విప్లవాత్మక పరిణామం. రోగాన్ని నిరోధించి, ఆయుఃప్రమాణాన్ని పెంచడంలో అవి కీలక పాత్ర పోషించాయి. దేన్నయినా జయించగలమన్న ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి. తరాలనుంచీ, యుగాలనుంచీ మానవజాతి ప్రాణాలు తోడేస్తున్న అంటువ్యాధులపై 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుగొనడంతో మొదలెట్టి దాదాపు వంద రకాల యాంటీయాటిక్స్ అందుబాటులోకొచ్చాయి. అయితే అవసరం జూదంగా మారకూడదు. విచక్షణా, హేతుబద్ధతా కొరవడకూడదు. యాంటీబయాటిక్స్ విషయంలో జరిగింది అదే. రోగి స్థితిగతులను అంచనావేసి, రోగ తీవ్రతను ఆధారం చేసుకుని మోతాదు నిర్ధారించాల్సి ఉండగా... అందుకు బదులు విచ్చలవిడి వాడకం ఎక్కువైంది. 'పిడుక్కీ, బియ్యానికీ ఒకటే మంత్రం...' అన్నట్టు అన్నిటికీ యాంటీబయాటిక్స్ వినియోగించడం పెరిగిపోయింది. కనుకనే వ్యాధి కారక క్రిములు మొండి ఘటాలుగా మారాయి. ఏ మందులనైనా తట్టుకునే స్థితికి చేరుకున్నాయి. పర్యవసానంగా తేలిగ్గా తగ్గవలసిన వ్యాధులు దీర్ఘకాలం పీడిస్తున్నాయి. ఇదే వరస కొనసాగితే భవిష్యత్తులో చిన్న చిన్న గాయాలు కూడా మానే స్థితి ఉండకపోవచ్చునని వైద్య నిపుణులు చేస్తున్న హెచ్చరికలు మనం ఎలాంటి విపత్కర స్థితికి చేరువవుతున్నామో తెలియజెబుతున్నాయి. ఇతర రంగాల మాదిరే వైద్య రంగం కూడా వ్యాపారమయం కావడంవల్లనే ఇలాంటి దుస్థితి ఏర్పడింది. మనుషుల ప్రాణాలతో ముడిపడి ఉండే ఆరోగ్యరంగంలో ప్రైవేటు సంస్థల ఆధిపత్యం మితిమీరడంవల్లనే ఇంతగా వికటించింది. ఔషధ సంస్థలకూ, వైద్యులకూ ఉండాల్సిన సంబంధమూ.... వైద్యుడికీ, రోగికీ ఉండాల్సిన బంధమూ గతి తప్పాయి. అనైతికత, అమానవీయత దండిగా పెరిగాయి. పరిశోధనలపై దృష్టి సారించాల్సిన ఔషధ సంస్థలు అడ్డదారిలో అమాంతం ఎదగాలని చూస్తున్నాయి. నాణ్యమైన మందుల్ని ఉత్పత్తి చేయడానికి బదులు నాసిరకం సరుకును మార్కెట్లోకి వదులుతున్నాయి. కొన్నేళ్ల క్రితం 167 రకాల యాంటీబయాటిక్స్‌పై ఆరా తీసినప్పుడు అందులో కేవలం 15 మాత్రమే వ్యాధులను ఎదుర్కొనడానికి ఉపయోగపడతాయని తేలింది! ఔషధ సంస్థలు వైద్యులకు ఆకర్షణీయమైన బహుమతులను ఎరగా చూపి అమ్మకాలను పెంచుకుంటుంటే...రోగి ఆర్థిక స్థోమతనుగానీ, మందుల వాడవలసిన అవసరాన్నిగానీ పరిగణనలోకి తీసుకోకుండా ఎడాపెడా అంటగట్టే ధోరణి వైద్యుల్లో పెరుగుతోంది. ఇవి చాలవన్నట్టు వచ్చిన రోగమేదో తెలియకుండా, వైద్య సలహా తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించకుండా మందుల దుకాణాలకెళ్లి సమస్య చెప్పి ఏవో మాత్రలు కొనుగోలు చేసి వాడేవారూ ఎక్కువయ్యారు. కట్టుదిట్టమైన చట్టాలుండటంతోపాటు వాటి అమలు తీరును పర్యవేక్షించే వ్యవస్థలు చురుగ్గా పనిచేస్తున్నప్పుడే ఇలాంటి పోకడలను నియంత్రించడం సాధ్యమవుతుంది. అవి సక్రమంగా పనిచేయకపోవడంవల్లనే రోగ నిరోధకత నానాటికీ క్షీణిస్తున్నదని గుర్తించాలి. నిజానికిది మన దేశంలోని సమస్య మాత్రమే కాదు. చాలాచోట్ల అచ్చం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.ఈ ప్రమాదం గురించి 2001లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. యాంటీబయాటిక్స్ అతివాడకాన్ని, దుర్వినియోగాన్ని అరికట్టకపోతే గడ్డు పరిస్థితులు తలెత్తుతాయని తెలిపింది. ఈ హెచ్చరికల పర్యవసానంగా అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు దిద్దుబాటు చర్యలు తీసుకున్నాయి. మన దేశంలో ఇలాంటి పరిస్థితి కనబడదు. ఇక్కడ ఫ్యామిలీ డాక్టర్లు ఎన్నడో కనుమరుగయ్యారు. ఇప్పుడు భారీ పెట్టుబడులతో కార్పొరేట్ ఆస్పత్రులు రంగంలోకొచ్చాయి. అవి రోగిని వైద్య సాయం అవసరం పడిన వ్యక్తిగా కాక, కస్టమర్‌గా భావిస్తున్నాయి. వేల రూపాయలు వ్యయమయ్యే వైద్య పరీక్షలు సరేసరి...అవసరంలేని మందుల్ని అంటగట్టే పోకడలు కూడా పెరిగాయి. అసలు ఏ వ్యాధికైనా అల్లోపతి వైద్య విధానం తప్ప మరే విధమైన ప్రత్యామ్నాయమూ లేదని భావించే వాతావరణం ఏర్పడింది. వ్యాధి ప్రాథమిక దశలో ఉండగా ఇంట్లో లభించే చిన్న చిన్న వాటితో దాన్ని అరికట్టడం తేలికవుతుందన్న అవగాహన ఒకప్పుడు ప్రజల్లో ఉండేది. అది రాను రాను కరువవుతోంది. దేనికైనా ఒక మాత్ర మింగేస్తే తేలిగ్గా తగ్గిపోతుందన్న దురభిప్రాయం ఏర్పడుతోంది. కిందిస్థాయి వరకూ పటిష్టమైన యంత్రాంగం ఉండే ప్రభుత్వాలు తల్చుకుంటే ఇలాంటి లోటుపాట్లను సరిదిద్దడం పెద్ద కష్టం కాదు. కానీ ఆ పని జరగడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వాలను మాత్రమే తప్పుబట్టి ప్రయోజనం లేదు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)వంటి వృత్తిగత సంస్థల వైఫల్యం కూడా తక్కువేమీ కాదు. ఇలాంటి సంస్థలు వైద్యుల్లో మాత్రమే కాదు...ప్రజల్లో సైతం యాంటీబయాటిక్స్పైనా...వాటి దుర్వినియోగం, అతి వినియోగంవల్ల కలిగే అనర్థాలపైనా గట్టిగా ప్రచారం చేస్తే నియంత్రించడం సాధ్యమవుతుంది. అలాగే మందుల వినియోగంపై ఫార్మాసిస్టులు మొదలుకొని నర్సులు, గ్రామీణ ఆరోగ్య సహాయకులవరకూ అందరికీ ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తుండాలి. మందుల దుకాణాల్లో యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా అమ్మకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడే పరిస్థితి కాస్తయినా మెరుగుపడుతుంది. నిర్లక్ష్యమనే రోగాన్ని వదుల్చుకుంటేనే ముంచుకొస్తున్న ముప్పును ఆపడం తేలికవుతుంది. -
విద్యుదాఘాతం రైతు మృతి
మోటర్ ఆన్ చేయడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపాలెం పంచాయతి పరిధిలోని లచ్చిరాంతండలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బానోతు రవి(33) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం వ్యవసాయ బావి వద్ద మోటర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ కరెంటు వైర్లు తాకడంతో.. రైతు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కొంత రిస్క్ఉన్నా.. లిక్విడ్ స్కీమ్స్ బెస్ట్
నా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పెద్ద మొత్తంలోనే సొమ్ములున్నాయి. ఈ సొమ్ములను మంచి రాబడులు వచ్చే మార్గాల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నా ఇన్వెస్ట్‌మెంట్స్‌కు భద్రత ఉండాలి. ఎలాంటి పన్నుల భారం ఉండకూడదు, లేదంటే తక్కువ పన్నులుండాలి. నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాష్ చేసుకునేలా ఉండాలి. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని నాకు తగిన సూచనలివ్వండి. - చక్రవర్తి, గుంటూరు తక్షణం అవసరం లేని పక్షంలో బ్యాంక్‌లో డిపాజిట్ల రూపంలో ఇంత పెద్ద మొత్తం ఉంచుకోవడం సరైనది కాదు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ డిపాజిట్లపై వచ్చే రాబడులు పెద్దగా ఉండవని చెప్పవచ్చు. పైగా బ్యాంక్ డిపాజిట్లపై పన్ను ప్రయోజనాలు కూడా తక్కువగానే ఉంటాయి. ఇప్పటికిప్పుడు అవసరం లేని డబ్బులను మంచి రాబడులు వచ్చే ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని, కాలాన్ని, మీరు భరించగలిగే రిస్క్‌ను పరిగణనలోకి తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న కాలం మూడేళ్లలోపు ఉంటే, డెట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎంచుకోవాలి. ఐదేళ్లు, అంతకు మించి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే షేర్లలో ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించవచ్చు. బ్యాంకు డిపాజిట్లలోలాగా భద్రంగా, లిక్విడిటీతో ఉండే ఇన్వెస్ట్మెంట్ సాధనాలు దాదాపు లేవు. లిక్విడిటీ, భద్రత కావాలనుకుంటే, మీ సొమ్ములను బ్యాంక్ డిపాజిట్లలోనే కొనసాగించండి. కొంత రిస్క్ తీసుకోగలిగితే, లిక్విడ్ స్కీమ్స్‌ను పరిశీలించవచ్చు. లిక్విడ్ స్కీమ్స్ మరీ ఏమంత రిస్క్‌గా ఉండవనే చెప్పవచ్చు. ఒక్క రోజులోనే డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. మార్కెట్ రాబడులే వచ్చే అవకాశాలున్నాయి. ఒక ఏడాది పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆల్ట్రా షార్ట్-టర్మ్ బాండ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. నాకు వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని రూ.50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్‌కు మాత్రమే అర్హత ఉందని ఒక బీమా సంస్థ పేర్కొంది. నేను రూ. కోటి టర్మ్ పాలసీ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినా కూడా రూ.50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ మాత్రమే ఇస్తామని ఆ కంపెనీ తెలిపింది. నేను రూ.50 లక్షల టర్మ్ పాలసీలను రెండు తీసుకుందామనుకుంటున్నాను. అలా తీసుకోవచ్చా? ఇలా తీసుకున్న పక్షంలో క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఏమైనా సమస్యలు వస్తాయా? - సాగర్, వరంగల్ ఆ బీమా సంస్థను కాకుండా మరో బీమా సంస్థను సంప్రదించండి. టర్మ్ ప్లాన్‌కు దరఖాస్తు చేసేపటప్పుడు ఏ బీమా సంస్థ అయినా ప్రస్తుతం మీ దగ్గరున్న బీమా పాలసీల గురించి వాకబు చేస్తాయి. అప్పుడు మీరు మీ బీమా పాలసీల గురించి చెప్పండి. మీరు రూ.50 లక్షల టర్మ్ పాలసీ తీసుకొని ఉండి కూడా, మరో రూ.50 లక్షల టర్మ్ పాలసీ కోసం దరఖాస్తు చేస్తే, ఇవ్వాలా, వద్దా అనేది సదరు బీమా సంస్థ నిర్ణయించుకుంటుంది. ఇక క్లెయిమ్‌ల విషయానికొస్తే, క్లెయిమ్ సరిఅయినది అయితే, నామినీకి రెండు బీమా సంస్థలు బీమా మొత్తాన్ని చెల్లిస్తాయి. క్లెయిమ్ చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు ఉండకూడదనుకుంటే, మీకు తెలిసిన అన్ని వివరాలను బీమా పాలసీ తీసుకునేటప్పుడు వెల్లడించడం మంచిది. నేను ఇటీవలనే మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే స్వల్ప, దీర్ఘకాలిక లాభాలపై పన్నులు ఎలా ఉంటాయి. పన్నులు ఆదా చేస్తూ పటిష్టమైన పోర్ట్‌ఫోలియోను ఎలా ఏర్పాటు చేసుకోవాలో సూచిస్తారా ? - శ్రీవల్లి, హైదరాబాద్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే రాబడులపై విధించే పన్నులకు, డెట్ ఫండ్స్ ద్వారా వచ్చే రాబడులపై విధించే పన్నులకు తేడా ఉంటుంది. డెట్ ఫండ్స్‌తో పోల్చితే ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పన్ను ప్రయోజనాలు అధికంగా లభిస్తాయని చెప్పవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాది తర్వాత విక్రయిస్తే మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏడాదికి మించిన ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఎలాంటి పన్ను ఉండదు. ఒకవేళ మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఏడాదిలోపే విక్రయిస్తే వాటిని స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను 15 శాతంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక డెట్ ఫండ్స్ విషయానికొస్తే మూడేళ్లలోపు ఈ ఫండ్ యూనిట్లను విక్రయిస్తే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆదాయపు పన్ను స్లాబ్నునుసరించి ఈ పన్ను ఉంటుంది. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ మూడేళ్లు మించితే, 20 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఇండెక్సేషన్‌తో కలిపి) చెల్లించాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్లు డివిడెండ్లపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అయితే డివిడెండ్లకు సంబంధించి పన్నులు చెల్లించాల్సిన బాధ్యత మ్యూచువల్ ఫండ్ సంస్థలకు ఉంటుంది. ఆ మేరకు రాబడులపై ప్రభావం ఉంటుంది. మూడేళ్ల ఇన్వెస్ట్మెంట్ కాలానికి డెట్ ఫండ్స్‌లోనూ, ఐదేళ్లకు మించిన ఇన్వెస్ట్మెంట్ కాలానికి ఈక్విటీ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేస్తే పన్ను ప్రయోజనాలతో పాటు మంచి రాబడులు కూడా పొందవచ్చు. ఎలాంటి పన్నులు చెల్లించకపోవడం, ఒకవేళ పన్నులు చెల్లించాల్సి ఉంటే, వీలైనంత తక్కువగా పన్నులు చెల్లించడం.. మంచి ఇన్వెస్ట్మెంట్ వ్యూహాల్లో ఒకటి. అయితే పన్నులు ఆదా చేయడమే ప్రధాన లక్ష్యంగా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు ఉండకూడదు. మీ ఆర్థిక లక్ష్యాలు, మీరు భరించగలిగే రిస్క్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. -
అతుక్కుపోయారో.. ఇక అంతే సంగతి!
న్యూయార్క్: ఏదో కాసేపు సరదాకో, లేదా విశ్రాంతిగా ఫీలయ్యేందుకో అలా టీవీ చూస్తే పెద్దగా నష్టం లేదుగానీ, ప్రతి రోజు అదే పనిగా టీవీ చూసేవాళ్లు మాత్రం తమంతట తాము వారి మృత్యురాత రాసుకున్నట్లేనని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు నిద్రాణంగా ఉన్న ఎన్నో రోగాలను కారకమయ్యే కణాలను కూడా నిద్ర లేపినట్లవుతుందని అవి ఒక్కసారి మేలుకున్నాక క్యాన్సర్ తోపాటు గుండె సంబంధమైన ప్రమాదకరమైన వ్యాధులు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని మేరీలాండ్ లోగల నేషనల్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన సరాహ్ కేడల్ అనే పరిశోధనకారుడు ఆయన చేసిన అధ్యయనం వివరాలు వెల్లడించాడు. దీని ప్రకారం రోజూ మూడు నుంచి నాలుగు గంటలు చూసే వారి ఆయుష్షు తరిగిపోతుంది. ఆ అలవాటు నయంకాని ప్రమాదకరమై వ్యాధులను కలిగిస్తుంది. అంతేకాదు, మానసిక స్థితిపైనే తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా శారీరక దారుఢ్యంలో కూడా అమాంతం మార్పుల తీసుకొస్తుంది. ఆసక్తి, ఏకాగ్రత కూడా దెబ్బతిని పూర్తి శరీరం పనిచేసే వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం ఉందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. -
షాంపూలతో క్యాన్సర్ ముప్పు!
న్యూయార్క్: షాంపూలో ఉపయోగించే రసాయనాలతో క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాలలో ఈ విషయం వెల్లడయింది. వినియోగదారులు విరివిగా ఉపయోగించే షాంపూలు, కాస్మొటిక్ పదార్దాలు, బాడీ లోషన్ల తయారీలో ఉపయోగించే రసాయనాల ద్వారా మహిళల్లో 'రొమ్ము క్యాన్సర్' వచ్చే అవకాశం పెరుగుతుందని ఈ పరిశోధనలో తేలింది. దీనితో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన అనేక వ్యాధుల భారిన పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. పరిశోధనకు సంబంధించిన వివరాలను కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త డేల్ లీట్మెన్ వెల్లడిస్తూ.. 'తక్కువ పరిమాణంలో వాడుతున్నప్పటికీ నిలువ కొరకు వాడే రసాయనాలు క్యాన్సర్ వ్యాధికి కారకాలవుతున్నాయి. శరీరంలో ఈస్ట్రోజన్‌ను పోలినటువంటి రసాయనాలయిన పారాబీన్స్ను షాంపూలు, కాస్మొటిక్స్‌లలో స్వల్ప మోతాదులో వాడుతున్నారు. వీటి వాడకం వలన క్యాన్సర్‌తో పాటు మహిళల్లో అనేక రుగ్మతలు తలెత్తుతాయి' అని తెలిపారు. వివిధ ఉత్పత్తుల తయారీలో విరివిగా ఉపయోగించే పారాబీన్స్కు సంబంధించి, అవెంతవరకు సురక్షితం అన్న దానిపై విస్తృత పరిశోధన జరగాలని శాస్త్రవేత్తలు తెలిపారు. -
ట్విట్టర్, ఫేస్ బుక్ లో వదంతులకు మరణశిక్షే..!
ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తే ఏమవుతుందో తెలుసా.. ఇక్కడైతే ఏమో గానీ సౌదీ అరేబియాలో అయితే మాత్రం మరణశిక్ష విధిస్తారట. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వ వెబ్సైట్లో అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలపై ఎన్నో ఆంక్షలు విధిస్తున్న సౌదీ సర్కారు తాజా ప్రకటన సామాన్య ప్రజల్లో ఆందోళన రేపుతోంది. ఈ ప్రకటన వెనుక.. మొత్తం సోషల్ మీడియానే ఆ దేశంలో నిషేధించాలన్న ప్రయత్నం కనిపిస్తోందని పలువురు అంటున్నారు. కొత్తరాజు సల్మాన్ పాలనలో ఈ మరణ శిక్షల జోరు పెరిగిపోతోంది. సౌదీ రాజు కొత్త నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంస్థలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల హజ్ యాత్రకు వెళ్లి తొక్కిసలాటలో వెయ్యిమంది వరకూ చనిపోవడం... దీనికి కారణం ప్రభుత్వ నిర్వహణ లోపమేనని సోషల్ మీడియాలో రావడంతో... ఆగ్రహానికి గురైన ప్రభత్వం ఈ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు చిన్నపాటి తప్పులు చేసినవారికి.. ఖైదు, ప్రయాణ నిషేధం, గృహ నిర్బంధం వంటి శిక్షలు అమలులో ఉన్నాయని, ఇప్పుడు ఓ సామాజిక మాధ్యమంలో వదంతులు సృష్టించేవారికి మరణ శిక్ష విధించేందుకు నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి అని మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ చెప్తోంది. అయితే ఏ రకం వార్తలకు శిక్ష పడుతుందో స్పష్టంగా ధ్రువీకరించలేదని ఓ సీనియర్ న్యాయమూర్తి అంటున్నారు. ఇప్పుడు అందరిలో ఆందోళన కలిగిస్తున్న కొత్త చట్టాన్ని కొన్ని వారాల క్రితం వచ్చిన సౌదీ రాజు ప్రకటించారు. 79 ఏళ్లు కొత్త రాజు సల్మాన్, అతడి కుమారుడు 30 ఏళ్ల మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రవేశ పెట్టిన ఈ ప్రకటనకు జనం నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. మాస్ మీడియాను సెన్సార్ చేయడం కోసం ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. -
వాట్సప్‌తో జాగ్రత్త
ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. - ఫొటో అప్లోడ్పై అజాగ్రత్త వద్దు - నిబంధనలు తెలియని యాప్‌లు డౌన్లోడ్ చేయకండి - అపరిచితుల సందేహాలకు సమాధానం ఇవ్వొద్దు. - యాంటీ హ్యాకింగ్ సాప్ట్‌వేర్‌ను మొబైల్లో ఉంచుకోండి. - ఫ్యామిలీ పర్యటనల వివరాలు, లొకేషన్ షేరింగ్ చేయకండి. - పరిచయం, నమ్మకం లేని వ్యక్తులతో షేరింగ్ చేయవద్దు - పిల్లల ఫోటోలు వారి వివరాలను ఇతరులతో షేరింగ్ చేయడమూ ప్రమాదమే. - ఎక్కువ మంది లింక్ అయ్యారని అపరిచిత వ్యక్తులతో షేర్ ఇవ్వవద్దు. - ఎంత పరిచయం ఉన్న వారైనా వారిని మిత్రులుగా ఒప్పుకునే ముందు వారి జాబితాలో ఎవరున్నారు. ఎలాంటి వారున్నారు. అనే విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి పటాన్చెరు : ప్రస్తుతం ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ఫోన్లే కనిపిస్తున్నాయి. వాట్సప్‌ల వినియోగం ఎక్కువైంది. వీటి వల్ల ప్రయోజనం ఎంతుందో ప్రమాదం కూడా అంతే ఉంది. వీటిని ఉపయోగించి నేరాలకు పాల్పడే వారి సంఖ్య చాలా పెరిగింది. సర్వీస్ ప్రొవైడర్లతో సంబంధం లేకుండా ఇంటర్నెట్ సాయంతో పని చేసే తక్షణ సమాచార వ్యవస్థ వాట్సప్. వీటిలో వీడియోలు, మెసేజ్‌లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పంపుకునే సౌలభ్యం ఉండడంతో పాటు ఎటువంటి చార్జీలు లేకపోవడంతో అందరూ అధికంగా వాడుతున్నారు. రోజుకు వాట్స్‌ప్‌ల నుంచి కోట్లలో మేసేజ్‌లు, ఫొటోలు వెళ్తున్నట్లు సర్వేలలో వెల్లడవుతోంది. ఈ నేపథ్యంలో వాట ్సప్ల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా జరిగితే.. మనం ఎక్కడో సరదాగా తీసుకున్న వ్యక్తిగత ఫొటోను స్నేహితుల కోసం షేర్ చేస్తే దానిని మన ప్రమేయం లేకుండా ఇతరులు చూసే ఆస్కారం ఉంది. ఆ ఫోటోను మార్ఫింగ్ చేసే ప్రమాదమూ లేకపోలేదు. అందుకు వాట్సప్‌లో వ్యక్తిగత సమాచారం, ఫొటోలను స్నేహితులకు షేర్ చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే లొకేషన్ షేరింగ్ కూడా మన భద్రతకు ముప్పు తెస్తోందని, దీనివల్ల మనం ఎక్కడున్నామో అగంతకులకు ఇట్టే తెలిసిపోతుందని హెచ్చరిస్తున్నారు. డౌన్‌లోడ్‌లోనూ.. కాలపరిమితితో ఉచితంగా అందుబాటులోకి వచ్చిన గుగూల్ వాట్సప్, వైబర్, వీచాట్ వంటికి అనేకం అందుబాటులోకి వచ్చాయి. వీటిని డౌన్లోడ్ చేసుకునే ముందు దాని ఆప్షన్లు నిబంధనలు పూర్తిగా చదివి అప్పుడు డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. అలా కాకుండా ఆటోమెటిక్‌గా డౌన్లోడ్ అయ్యే యాప్ వల్ల మన ఫొటోలు మార్ఫింగ్ అయ్యే ప్రమాదముంది. -
పాతవూరులో ఉద్రిక్తత..
అనంతపురం: కాలపరిమితి అయిపోయిందని కొత్తగా టెండర్లు పాడిన వారికి షాపులు ఇవ్వాలంటూ నగరపాలక రెవెన్యూ అధికారులు దుకాణ యాజమానులకు తేల్చి చెప్పారు. బుధవారం అనంతపురం నగరం పాతవూరులోని మునిసిపల్ షాపులను మూత వేసే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దుకణా యజమానులు, సీపీఎం నేతలు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. మరో మూడేళ్లు గడువు పెంచాలంటూ వేడుకున్నారు. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఏవిధంగా పోలీసుల జోక్యంతో మూసేందుకు వస్తారని అక్కడ దుకాణ యజమానులు నరసింహారెడ్డి, ఖాదర్‌బాషా, వెంకటనరసింహ, నరసింహులు, సీపీఎం నేత ముస్కిన్ అన్నారు. అందుకు అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. 25 ఏళ్లు దాటడంతోనే టెండర్లు వేయడం జరిగిందని తదితర అధికారులు చెప్పారు. కాలపరిమితి అయిపోవడంతోనే నూతన గుత్తేదార్లకు షాపులు అప్పజెప్పాలన్నారు. అందుకు వ్యాపారులు టెండర్లు సైతం ఇష్టారాజ్యంగా జరిగాయని, తమకు ఆ విషయాన్ని తెలియజేసింటే తాము టెండర్లలో దిగే వారమన్నారు. -
రెండో రోజూ విరిగిన లాఠీ
విశాఖపట్నం: అధికారుల సమాచారలోపం వారికి నరకాన్ని చూపిస్తోంది. రెండో రోజు అదే తీరు. కొలువు కోసం వెళ్లిన నిరుద్యోగిపై లాఠీ విరిగింది. విశాఖలో నిర్వహిస్తున్న ఆర్మీ ర్యాలీకి రెండోరోజు వేలాది మంది అభ్యర్ధులు హాజరయ్యారు. నిజానికి ఇంత మంది అభ్యర్ధులు వస్తారనే అంచనా ముందుగానే అధికారులకు ఉన్నప్పటికీ ఆ మేరకు ఏర్పాట్లు చేయలేకపోయారు. కనీసం తాగునీరు కూడా అందించలేదు. ముందురోజు రాత్రి నుంచే స్టేడియం వద్దకు చేరుకున్న అభ్యర్ధులను విడతల వారీగా టోకెన్లు తీసుకునేందుకు అనుమతించారు. లాఠీచార్జ్ టోకెన్ల కోసం ముందుకు దూసుకువస్తున్న అభ్యర్ధులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ లాఠీ చార్జ్‌లో అనేక మంది యువకులు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఎక్కించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలకు అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ప్రాధమిక చికిత్స చేశారు. -
మితిమీరి మంచి నీళ్లు తాగినా ముప్పే!
న్యూయార్క్: నీళ్లు ఎంత ఎక్కువ తాగితే ఆరోగ్యానికి అంత మంచిదని భావిస్తారు చాలా మంది. కానీ ఇలా అతిగా నీళ్లు తాగటం కూడా ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లయోలా యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన అంతర్జాతీయ నిపుణుల బృందం సూచనల ప్రకారం దాహం వేసినప్పుడు మాత్రమే నీటిని తాగాలి. అవసరం లేకున్నా అధికంగా నీళ్లు తాగకూడదు. సాధారణంగా మనం తాగే నీటిని మూత్ర పిండాలు వడపోస్తాయి. నీటిలోని వ్యర్థ పదార్థాల్ని మూత్రం రూపంలో బయటకు పంపేస్తాయి. ఇలా మూత్ర పిండాలకు కూడా ఒక స్థాయిలో పని చేయగలిగే శక్తి ఉంటుంది. కానీ అవసరానికి మించి నీళ్లను తాగడం వల్ల వాటిని మూత్ర పిండాలు వడపోయలేవు. ఎక్కువ నీటిని వడపోసే క్రమంలో మూత్ర పిండాలపై ఒత్తిడి పెరిగి, అవి వాపునకు గురవుతాయి. శరీరంలో సోడియం స్థాయి తగ్గిపోతుంది. ఫలితంగా అనేక కణజాలాలు ఉబ్బిపోయి ప్రాణానికే హాని కలగవచ్చు. ముఖ్యంగా క్రీడాకారుల్లో ఈ సమస్య ఎక్కువ తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే వారు గేమ్స్ ప్రాక్టీస్ చేసే సమయంలో అవసరం లేకున్నా అతిగా నీళ్లు తాగుతారు. ఇది ఎక్సర్సైజ్ అసోసియేటెడ్ హైపోనాట్రీమియా (ఈఏహచ్)కు దారి తీస్తుంది. తల తిరగడం, వాంతులు, వికారం లాంటి లక్షణాలు ఈఏహచ్కు సూచనలు. నీళ్లు తాగడం వల్ల అలసటను అధిగమించొచ్చని క్రీడాకారులు భావిస్తారు. చెమట ద్వారా కోల్పోయే నీటిని భర్తీ చేసేందుకు, ఆట ఆడే సమయంలో ఇతర సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కూడా నీటిని తీసుకుంటారు. దీని వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సహజ సిద్ధంగా దాహం వేసినప్పుడు మాత్రమే నీటిని తీసుకోవాలని, ఇది క్రీడాకారుల ఆరోగ్యానికి మేలు చేస్తుందని వారు చెబుతున్నారు. -
స్మార్ట్ఫోన్లతో గుండె రోగులకు ముప్పు!
లండన్: గుండెలో పేస్‌మేకర్ కలిగి ఉండే వ్యక్తులు స్మార్ట్ఫోన్లతో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. స్మార్ట్ఫోన్ల నుంచి విడుదలయ్యే విద్యుదయస్కాంత తరంగాలు..హృదయ సంకేతాలుగా భావించి..పేస్మేకర్లు గుర్తిస్తే సడన్ షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని జర్మనీ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. స్మార్ట్ఫోన్లను పేస్మేకర్లు లేదా ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫిబ్రిలేటర్లు(ఐసీడీ)లకు 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరంలోనే ఉంచాలని అమెరికా ఆహారం, ఔషణ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) గతంలోనే హెచ్చరించింది. పేస్మేకర్లు, ఐసీడీలు అమర్చిన 308 మంది వ్యక్తులను స్మార్ట్ఫోన్ల నుంచి విడుదలయ్యే విద్యుదయస్కాంత తరంగాలకు ఎక్స్పోజ్ చేయగా ఒకరు షాక్‌కు గురయ్యారని పరిశోధకులు తెలిపారు. -
గోదావరిలోకి దూసుకెళ్లిన మృత్యు ‘తూఫాన్’
-
భగవంతుడా...
గోదావరిలోకి దూసుకెళ్లిన మృత్యు ‘తూఫాన్’ ఏపీలోని ధవళేశ్వరం వద్ద పెను విషాదం.. ఒకే ఇంట్లో 14 మంది మృతి మరో రెండు కుటుంబాల్లో 8 మందిని కాటేసిన మృత్యువు పుణ్యక్షేత్రాలను సందర్శించి వస్తుండగా ఘటన మాటలకందని మహా విషాదం అంటే ఇదేనేమో.. తిరుమలలో వెంకన్నకు, శ్రీకాళహస్తిలో కాళహస్తీశ్వరునికి, శ్రీశైలంలో మల్లన్నకు, బెజవాడలో దుర్గమ్మకు మొక్కిన చేతులు.. తెల్లవారితే సింహాచలంలో అప్పన్న సన్నిధిలో జోడించాలనుకున్న చేతులు.. నిశ్చేతనమయ్యాయి. శుక్రవారం రాత్రి గోదారమ్మ తీరం వెంట పిల్లా పాపల కేరింతలతో సాగిపోతున్న వారి ప్రయాణం మధ్యలోనే ముగిసింది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీపై ఎడమ వైపు వెళ్తున్న తూఫాన్ వాహనం డ్రైవర్ ఒక్క క్షణం రెప్ప వాల్చటంతో కుడివైపు తిరిగింది. నిశిరాత్రివేళ బ్యారేజీ గోడను ఢీకొట్టి 30 అడుగుల లోతులో పడటంతో పెను ప్రమాదం జరిగింది. 22 మంది మృత్యువాత పడ్డారు. ఇద్దరు బిడ్డల నిండు జీవితాలను కాపాడుకునేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టిన ఓ తండ్రి.. కుమారుడిని మాత్రం రక్షించుకుని కన్నుమూశాడు. ఆ బాలుడు ఈ ఘోరకలికి ప్రత్యక్షసాక్షిగా, మృత్యుంజయుడిగా మిగిలాడు.సాక్షి, విశాఖపట్నం, రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజీ వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పెను ప్రమాదంలో 22 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఏడుగురు చిన్నారు లున్నారు. వీరంతా విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మోసయ్యపేటకు చెందిన వారి సమీప బంధువులు. ఇష్టదైవాల్ని దర్శించుకుని, తిరుగుముఖం పట్టిన వీరు గమ్యం చేరకుండానే మృత్యు వాతపడ్డారు. ఈ బృందంలోని ఒకే ఒక్క బాలుడు జరిగిన ఘోరకలికి ప్రత్యక్షసాక్షిగా, మృత్యుంజయుడయ్యూడు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ప్రధాన గేట్లు దాటిన వెంటనే వచ్చే మలుపులో వారు ప్రయాణిస్తున్న వాహనం నేరుగా స్కవర్ స్లూయిజ్లోకి బోల్తా కొట్టింది. ఆ వాహనం 30 అడుగుల ఎత్తు నుంచి కింద ఉన్న సిమెంట్ గచ్చుపై పడిపోయింది. ప్రయాణికులు గచ్చుపై పడడంతో బలమైన తీవ్ర గాయాలై మృతిచెందారని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన వాహనం శుక్రవారం అర్ధరాత్రి 12.51 సమయంలో ఏలూరు సమీపాన కలపర్రు టోల్గేట్ దాటినట్టు నమోదయింది. కలపర్రు నుంచి ధవళేశ్వరం సుమారు 95 కిలోమీటర్లు. దీన్ని బట్టి అర్ధరాత్రి రెండున్నర, మూడు గంటల మధ్యలో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాద సంఘటన తెల్లవారుజాము 5.30 వరకూ ఎవరికీ తెలియలేదు. మృత్యువు నుంచి బయటపడిన కిరణ్‌సాయి బ్యారేజీ దిగువ రోడ్డుకు వచ్చి ‘మా అక్కకు నీళ్లు కావాలంటూ..’ అరవడంతో సమీపంలో ఉన్న మత్స్యకారులకు తెలిసింది. వారు దగ్గరలో ఉన్న లాకు కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. కార్యాలయ సిబ్బంది ధవళేశ్వరం పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గురైన తూఫాన్ వాహనం నుంచి మృతదేహాలను బయటకు తీశారు. మృతుడు గోపి స్నేహితుడు జె.హేమంత్ మొదట చనిపోయినవారిని గుర్తిం చాడు. ఘటనాస్థలిలో 21 మంది మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన కిరణ్, బాలిక సంధ్యలను చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సంధ్య మృతిచెందింది. కిరణ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఎప్పుడూ తీర్థయాత్రలకు జనాన్ని తీసుకెళ్లే ఈగల అప్పారావు ఈ ఏడాది తన కుటుంబ సభ్యులను, బంధువులను 22 మందిని తీసుకెళ్లాడు. స్వతహాగా డ్రైవరు అయిన అప్పారావు సొంత తుఫాన్ వ్యాన్ (ఏపీ 31 టీసీ-3178)లో 6వ తేదీన తిరుపతి తదితర పుణ్యక్షేత్రాలకు వీరిని వెంటబెట్టుకువెళ్లాడు. 9వ తేదీన తిరుపతి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. 12వ తేదీన (శుక్రవారం) విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. అదే రోజు రాత్రి అక్కడి నుంచి బయలుదేరారు. శనివారం ఉదయం సింహాచలం అప్పన్నను దర్శించుకుని స్వగ్రామం మోసయ్యపేటకు వెళ్లాలనుకున్నారు. ఈలోపే ప్రమాదం బారిన పడ్డారు. తెల్లారేసరికి పిడుగులాంటి వార్త.. తమ వారంతా యాత్రలు ముగించుకుని వచ్చేస్తున్నారని ఇంటి వద్ద మిగిలిన వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. తెల్లవారే సరికి పిడుగులాంటి వార్త టీవీల్లో వచ్చింది. గోదావరిలో తూఫాన్ వ్యాన్ బోల్తాకొట్టిందని అందులో ఉన్న 22 మంది మృత్యువాతపడ్డారని.. విశాఖ జిల్లా అచ్యుతాపురం మోసయ్యపేట వాసులని. అంతే.. మన డ్రైవర్ ఆప్పారావు వ్యానే అని నిర్ధారణకొచ్చారు. తెల్లారగానే ఊరు ఊరంతా విషాదంలో మునిగిపోయింది. పరుగుపరుగున అప్పారావు, వారి బంధువుల ఇంటికి తండోపతండోలుగా వెళ్లారు. అప్పారావు కుటుంబంతా మృత్యువాతపడగా.. ఇప్పుడా కుటుంబంలో అప్పారావు తండ్రి 85 ఏళ్ల వెంకులు ఒక్కడే బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు. అయిన వారందరినీ పోగొట్టుకుని విగతజీవిలా ఉన్నాడు. యాత్ర ముగించుకుని వీరు శనివారం సింహాచలం నృసింహస్వామిని దర్శించుకుని స్వగ్రామం మోసయ్యపేటకు చేరుకోవలసి ఉంది. వారి ఆచారం ప్రకారం గ్రామం నుంచి శుక్రవారం రాత్రే 20 మందితో కలిసి తోడపెద్దు (ఆంబోతు)ను సింహాచలం పంపించారు. వీరంతా సింహాచలంలో అప్పారావు కుటుంబం కోసం వేచి చూస్తున్న తరుణంలోనే ఘోరం జరిగిపోయింది. మోసయ్యపేటతో పాటు సమీపంలోని అచ్యుతాపురం, పరిసర గ్రామాలు శనివారం శోకసంద్రంలో మునిగిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు మృతుల ఇళ్ల వద్దకు చేరుకుని కన్నీరు పెట్టుకున్నారు. డ్రైవర్ అప్పారావుగా పేరు గడించిన అప్పారావుకు ఈ ప్రాంతంలో మంచిపేరుంది. పాతికేళ్లుగా స్థానికుల్ని తీర్థయాత్రలకు తీసుకెళ్తుండడంతో అందరితో పరిచయాలున్నాయి. దీంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన ఆ కుటుంబీకులను ఓదార్చడానికి భారీ సంఖ్యలో ఇరుగుపొరుగు గ్రామాల వారు వచ్చారు. కాగా ఏపీ హోం మంత్రి చినరాజప్ప మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మృతుల వివరాలు ఈగల అప్పారావు(55), అతని భార్య కనక(40), పెద్ద కుమారుడు రాజు(27) కోడలు లక్ష్మి (23), రెండో కుమారుడు ప్రసాద్ (25), కోడలు అన్నపూర్ణ(21), మూడో కుమారుడు గోపి(24), అప్పారావు కుమార్తె కోనా వెంకటలక్ష్మి(27), అల్లుడు రమణ(30), అప్పారావు మనుమలు కోన సాయి(8), ఈగల హర్ష(2), ఈగల నవ్య(4), ఈగలఅమిత్(5), ఈగల కార్తీక్ (7) మృతి చెందారు. అప్పారావుకు వరసకు సోదరుడైన ఈగల రాంబాబు(32), అతని భార్య కొండమ్మ(30), తల్లి చిన్నమ్మ(60), రాంబాబు కుమార్తె సంధ్య(14), అప్పారావు సోదరి దార్ల చిట్టమ్మ(68), గాజువాక మండలం కుర్మన్నపాలెంకు చెందిన అప్పారావు మరదలు పుర్రే సునీత(29), మరో మరదలు రంబిల్లి మండలం కొత్తకోడూరుకు చెందిన అల్లు లక్ష్మి(35), సునీత కుమారుడు పుర్రే పవన్(8) మృతి చెందగా, రాంబాబు కుమారుడు కిరణ్‌సాయిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. మూడు గంటల తర్వాత వెలుగులోకి.. ధవళేశ్వరం నుంచి సాక్షి ప్రతినిధి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి తూఫాన్ వ్యాను బోల్తా పడి ప్రమాదం జరిగిన మూడు గంటల తరువాత కాని ఈ సంఘటన వెలుగు చూడలేదు. కాటన్ హయాంలో నిర్మించిన పాత ఆనకట్ట, తరువాత నిర్మించిన బ్యారేజీ స్కవర్ల ఆపరేషన్ నిర్వహించే స్లూయిజ్ వద్ద వ్యాను బోల్తా కొట్టింది. అక్కడ 30 అడుగుల లోతున సిమెంట్ తొట్టెలా ఉంటుంది. ప్రమాదం జరిగిన చోట బ్యారేజీపై లైటింగ్ లేకపోవడం వల్ల ప్రమాదాన్ని గుర్తించ లేకపోయారు. ప్రమాదానికి గురైన వాహనం శుక్రవారం అర్ధరాత్రి 12.51 గంటల సమయంలో ఏలూరు సమీపాన కలపర్రు టోల్ గేట్ దాటినట్టు నమోదయింది. కలపర్రు నుంచి ధవళేశ్వరం సుమారు 95 కిలోమీటర్లు. దీన్నిబట్టి అర్ధరాత్రి సుమారు రెండున్నర, మూడు గంటల మధ్యలో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాద సంఘటన తెల్లవారుజాము 5.30 గంటల వరకూ ఎవరికీ ఈ విషయం తెలియలేదు. ముందే తెలిస్తే కొందరి ఊపిరైనా నిలిచేది: ప్రమాదం జరిగిన వెంటనే ఎవరికైనా తెలిసి ఉంటే కొంతమందైనా ప్రాణాలతో బయటపడేవారు. వాస్తవానికి కాటన్ బ్యారేజీపై సిబ్బంది రాత్రి గస్తీ నిర్వహిస్తారు. తెల్లవారుజాము వరకూ విషయం ఇరిగేషన్ సిబ్బందికి కూడా తెలియలేదు. ఘటనా స్థలానికి కూతవేటు దూరంలోనే లాకు కార్యాలయం ఉన్నప్పటికీ అక్కడ ఉన్న సిబ్బందికి మత్స్యకారులు చెప్పేవరకూ ప్రమాద విషయం తెలియక పోవడం గమనార్హం. -
ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో ప్రమాదం
కరీంనగర్: బూడిద నీరు పడి వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన జిల్లాలోని ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో శుక్రవారం చోటుచేసుకుంది. 500 మెగావాట్ల ఏడో యూనిట్ లో విధులు నిర్వర్తిస్తున్న మోగ్లీ (42) యాష్ పైప్‌లైన్ సరిచేస్తుండగా వేడిగా ఉన్న బూడిద నీరు అతని పై పడింది. దీంతో వీపు పూర్తిగా కాలిపోయింది. వెంటనే అప్రమత్తమైన సహచరులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం అతణ్ని హైదరాబాద్ తరలించారు. -
గాజువాక బీహెచ్ఈఎల్లో ప్రమాదం
గాజువాక (విశాఖపట్నం): గాజువాకలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) లో గురువారం తెల్లవారు జామున ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు బీహెచ్ఈఎల్ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చించారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది. హెచ్‌పీవీపీ విభాగంలో ట్యాంకర్ ప్లేట్లు అమరుస్తుండగా ఈ సంఘటన జరిగినట్టు సమాచారం. -
మన వద్ద భూకంపం వస్తే ఆ నగరాలు ఖల్లాసే!
న్యూఢిల్లీ: భారత దేశంలోని అసోంలోని గువాహటి, జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ నగరాలు మాత్రం చాలా జాగ్రత్తగా ముందస్తు వ్యూహంతో ఉండాలని నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్(ఎన్ డీఎం) హెచ్చరిస్తోంది. దీంతోపాటు మరో 36 నగర ప్రాంతాలు కూడా భూప్రకంపనలకు తావిచ్చేవిగా ఉన్నాయని చెప్పింది. దేశంలోని భూకంప బారిన పడే నగరాల్లో ఇవే ముందు వరుసలో ఉన్నట్లు తాజాగా తన డేటాలో పేర్కొంది. జోన్-5 అత్యంత ప్రమాదకరమైనదని, ఇక్కడ అతి తీవ్ర భూకంపాలు వస్తాయని హెచ్చరించింది. ఇక నాలుగో జోన్ తీవ్ర భూకంపం సంభవించే జోన్ అని ఇందులో ఢిల్లీతో సహా మొత్తం ఎనిమిది నగరాలు ఉన్నాయని తెలిపింది. మరో 30 నగరాలు మాత్రం స్వల్పంగా భూప్రకంపనలు(జోన్-3) వ్యాపించే చోట ఉన్నాయని వెల్లడించింది. దురదృష్టం కొద్ది ఈ నగరాల్లో భవంతులు అన్నీకూడా భూకంపాలను తట్టుకునే విధంగా లేవని, పైగా జనాభా కూడా ఎక్కువగా ఇక్కడ ఉండటంతో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. నేపాల్ భూకంపం నేపథ్యంలో ఎన్డీఎం ఈ డేటాను సేకరించి ముందుస్తుగా వెల్లడించింది. -
మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు బోల్తా
డ్రైవర్‌తోపాటు, ఐదుగురు ప్రయాణికులకు గాయాలు ఇచ్చోడ : మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారి హెచ్‌పీ గ్యాస్ గోదాం సమీపంలో శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడ్డ సంఘటనలో బస్సు డ్రైవర్‌తో ఐదుగురు ప్రయాణికులకు గాయూలయ్యాయి. గాయపడ్డ వారిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక ఎస్సై సంజీవ్, ప్రయాణికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని అకోలా నుంచి నిజామాబాద్ వెళ్తున్న (ఎంహెచ్ 04 5203 నంబర్ గల) బస్సు ఇచ్చోడ బైపాస్ సమీపంలోకి రాగానే డ్రైవర్ నందకిశోర్‌కు ఆకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో బస్సు అదుపుతప్పి గుంతలో పడింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో ఐదుగురు గాయపడగా వెంటనే 108లో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ట్రాక్టర్, మోటార్ సైకిల్ ఢీ : ఇద్దరికి గాయాలు ఆదిలాబాద్ రూరల్ : మండలంలోని చాంద-టి జాతీయ రహదారిపై శనివారం ట్రాక్టర్‌కు మోటార్ సైకిల్ ఢీకొనడంతో మావలకు చెందిన మహేందర్‌తోపాటు మరొకరు గాయపడ్డారు. బైక్‌పై భోరజ్ నుంచి ఆదిలాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చందా-టి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ముందు నుంచి వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వచ్చి బైక్ ఢీ కొట్టిన్నట్లు తెలుస్తోంది. గమనించిన స్థానికులు చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం మహేందర్‌ను హైదరాబాద్ తీసుకెళ్లారు. ఈ విషయంపై ఆదిలాబాద్ రూరల్ పోలీసులను వివరాలను కోరగా తమ వద్ద కేసు నమోదు కాలేదని ఓ కానిస్టేబుల్ తెలిపారు. -
జేమ్స్‌బాండ్ షూటింగ్లో మళ్లీ ప్రమాదం
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కథానాయక పాత్ర అంటే జేమ్స్ బాండే. తెరపై జేమ్స్‌బాండ్ చేసే వీరోచిత విన్యాసాలకు ముగ్ధులు కానివాళ్లు ఉండరు. ఇప్పటివరకు 23 జేమ్స్ బాండ్ చిత్రాలొస్తే, వాటిలో దాదాపు అన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు 24వ బాండ్ తయారవుతున్నాడు. బాండ్‌గా డేనియల్ క్రెగ్ నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ మెండెస్ దర్శకుడు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రం కోసం వారం రోజుల క్రితం ఓ పోరాట దృశ్యం తీస్తున్నప్పుడు డేనియల్ క్రెగ్ మోకాలికి గాయమైంది. తాజాగా ఈ షూటింగ్ లొకేషన్లో మరో ప్రమాదం జరిగింది. కెమెరా ఉన్న ఓ ట్రక్ అదుపు తప్పి, దూసుకు రావడంతో సెకండ్ యూనిట్ డెరైక్టర్‌గా చేస్తున్న టెర్రీ మాడ్డెన్కి గాయాలయ్యాయి. ఇవి బలమైన గాయాలు కావడంతో హుటాహుటిన అతణ్ణి ఆస్పత్రిలో చేర్చారు. ప్రాణభయం లేదని డాక్టర్లు పేర్కొనడంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఏడాది నవంబర్ 6న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
విశాఖలో దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ
విశాఖపట్నం: ఆనందపురం జంక్షన్ వద్ద ఒక దుకాణంలోకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు దుకాణాలుతో పాటు ఒక ఆటో కూడా ధ్వంసం అయింది. -
బాధితులను పరామర్శించిన నేతలు
సోమందేపల్లి: పెనుకొండ బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు పరామర్శించారు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ పెనుకొండ ప్రభుత్వాసుపత్రి వద్దకు వచ్చి బాధితులను ఓదార్చారు. గాయపడినవారికి వెంటనే చికిత్సలు అందచేయాలని వైద్యులను కోరారు. మార్చురీ వద్ద మృతదేహాలను చూ సి ఆయన చలించిపోయారు. రోధిస్తున్న బంధువులను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. పెనుకొండ కాంగ్రెస్ పార్గీ ఇన్చార్జ్ కెటి శ్రీధర్, అడిషనల్ ఎస్పీ మాల్యాద్రి, ఇంటిలిజెన్స్ డీఎస్పీ కోలార్‌కృష్ణ, సమాచార శాఖ ఏడీ వెంకటేశ్వర్లు, నియోజకవర్గం వైఎస్సార్ సీపీ, తేదేపా, కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. హిందూపురం రూరల్ ఎస్ ఐ, మడకశిర ఎస్ఐ, పెనుకొండ సీఐ రాజేంద్రనాథ్ యాద వ్, మడకశిర సిఐ హరినాథ్, పెనుకొండ, సోమందేపల్లి, రొ ద్దం, పరిగి, హిందూపురం రూరల్ ఎస్ఐలు శేఖర్, నారాయణ, హరున్‌బాషా, రంగడు, ఆంజనేయులు, పోలీసు సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రులకు చేరవేశారు. ఇలాంటి ఘటనలు బాధాకరం: బస్సు ప్రమాదం అత్యంత బాధకరమని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ శంకర్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల కిందట జరిగిన రైలు ప్రమాదాన్ని మరచిపోకముందే మరోసారి బస్సు ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగడం మరచిపోలేనిదన్నారు. కండీషన్ లేని బస్సులు, ప్రమాదం స్థలం వద్ద భద్రతా చర్యలు తీసుకోకపోవడం ఈ ఘటనకు కారణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బాధితులను ఓదార్చిన పీసీసీ అధ్యక్షుడు : పీసీసీ అధ్య క్షుడు రఘువీరారెడ్డి బుధవారం బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన, మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. మావటూరు, బండపల్లి, నాగలూరు గ్రామాలకు వెళ్లి మృతదేహాలను సందర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఆయన హిందూపురంలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. -
ఔటర్‌పై లారీని ఢీకొన్న కారు. ఒకరి మృతి
హైదరాబాద్: శంషాబాద్ మండలం పెద్దగోల్కొండ వద్ద ఆగివున్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా , ఐదుగురికి త్రీవ గాయాలయ్యాయి. షిర్డీ నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగ్రాతులు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వారిగా గుర్తించారు. -
ప్రమాదమని తెలిసీ...
యలమంచిలి : ప్రమాదమని తెలిసినప్పటికీ తప్పనిస్థితిలో ప్రయాణాలు సాగిస్తున్నారు గ్రామీణ ప్రాంత ప్రజలు. ఎక్కువ మంది ఆటోలు, ట్రాక్టర్లు, వ్యాన్లపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలు సాగిస్తుంటారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లేటప్పుడు కొందరు, రోజువారి కూలి పనులకు వెళ్లేందుకు మరికొందరు, కూలీలు, మహిళలు కిక్కిరిసిపోయి లగేజీ వాహనాలపై ప్రయాణిస్తున్నారు. అలాంటి సమయాల్లో ప్రమాదాలు జరిగితే తేరుకోలేని కష్టాన్ని, అంతకుమించిన నష్టాన్ని వారు ఎదురుకోవాల్సి వస్తోంది. యలమంచిలి ప్రాంతంలో ఇటీవల పలుచోట్ల ట్రాక్టర్లు, వ్యాన్లపై నిలబడి కాళ్లు కదిపే వీలులేకుండా కిక్కిరిసిపోయి గ్రామీణ ప్రాంత మహిళలు ప్రయాణిస్తున్నారు. తరచూ ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రయాణాలు సర్వసాధారణమైపోయాయి. పరిమితికి మించి ఆటోల్లో సైతం ప్రయాణికులను ఎక్కించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. లగేజీ వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకోకూడదన్న నిబంధన అమలు కావడం లేదు. ఇలాంటి నిర్లక్ష్యం వల్లే కొన్ని సందర్భాల్లో భారీ రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రాణనష్టాలు సంభవించడం జరుగుతున్నాయి. ఇలాంటి ప్రయాణాలను నియంత్రించాల్సిన రోడ్డు రవాణా, పోలీసు శాఖాధికారులు, సిబ్బంది చూసీ చూడనట్టు వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రమాదం జరిగినపుడు అధికారులు ప్రకటనలకు పరిమితమవుతున్నారు తప్ప చిత్తశుద్ధితో నిబంధనలు అమలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు స్పందించి ఇటువంటి ప్రయాణాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
రిస్క్‌లేని పెట్టుబడి అదొక్కటే..!
చీటీలు, మంత్లీ సేవింగ్స్ స్కీమ్స్, ఆర్డీలు, సేవింగ్స్ సర్టిఫికెట్ల కొనుగోలు.... వీటిలో ఏది తక్కువ రిస్క్‌తో ఎక్కువ రాబడినిస్తాయి? - పి. పద్మజ, మచిలీపట్నం ప్రైవేట్ చిట్‌ఫండ్స్..ముఖ్యంగా అన్ రిజిస్టర్డ్ చిట్ఫండ్లలో నూటికి నూరు శాతం రిస్కు ఉంటుంది. అయినా మీరు చీటీలు వేయదల్చుకుంటే రిజిస్టర్డ్ చిట్‌ఫండ్స్ కొంత ఫర్వాలేదు. ప్రైవేట్ చిట్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రత్యామ్నాయంగా కొన్ని సంప్రదాయ ఇన్వెస్ట్మెంట్ సాధనాలున్నాయి. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు వీటిలో అసలు రిస్కు ఉండదు. రిస్కు చేయగలను అనుకుంటే సగం మొత్తాన్ని ఈక్విటీ గ్రోత్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టొచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) కింద నెలకు ఇంత అని స్థిరమొత్తంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. గత 15 ఏళ్ల సగటు చూస్తే కొన్ని ఫండ్ స్కీములు దాదాపు 15-18 శాతం దాకా రాబడి ఇచ్చాయి. మంత్లీ సేవింగ్స్ స్కీమ్స్ (పీపీఎఫ్): ఏడాదికి రూ. 500 కనీస డిపాజిట్‌తో పీపీఎఫ్ ఖాతా ప్రారంభించవచ్చు. 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయాలి. పీపీఎఫ్‌పై ప్రస్తుతం 8.7 శాతం మేర వడ్డీ లభిస్తోంది. సెక్షన్ 80 సీ కింద అసలు, వడ్డీ మీద కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. ఒకవేళ డిపాజిట్‌దారు చట్టపరంగా ఏవైనా చిక్కుల్లో ఇరుక్కున్నా పీపీఎఫ్ మొత్తాన్ని కోర్టులు అటాచ్ చేయడానికి లేదు. రికరింగ్ డిపాజిట్లు: ప్రస్తుతం వీటిపై 8.4 శాతం మేర వడ్డీ రేటు లభిస్తోంది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ ఖాతాలు తీసుకోవచ్చు. నెలకు అత్యంత తక్కువగా రూ. 10 కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్: వీటిని మీ పేరున లేదా మీ పిల్లల పేరు మీదనైనా తీసుకోవచ్చు. ప్రస్తుతం 5 సంవత్సరాల ఎన్ఎస్సీలపై 8.5 శాతం, 10 సంవత్సరాల సర్టిఫికెట్స్‌పై 8.8 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. కనీస ఇన్వెస్ట్మెంట్ రూ.100. - రజనీ భీమవరపు సీఎఫ్‌పీ, జెన్‌మనీ -
బాహుబలి కోసం తమన్నా హార్డ్ వర్క్
-
శ్రీమఠం ధర్మాధికారి మృతి
మంత్రాలయం రూరల్: శ్రీరాఘవేంద్ర స్వామి మఠం ధర్మాధికారి రాజ.ఎస్.రాజగోపాల్‌చార్ గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆరు రోజుల క్రితం ఈయన కర్ణాటక రాష్ట్రంలోని గంగావతి నుంచి మైసూర్‌కు వెళ్తుండగా చిక్నాయక్హళ్లి దగ్గర ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం చెట్టును ఢీకొట్టడంతో డ్రైవర్ శివరాముడు అక్కడిక్కడే మృతి చెందాడు. గాయపడిన రాజ.యస్.రాజగోపాల్చార్ను చికిత్స నిమిత్తం బెంగళూరులోని మాల్య నర్సింగ్‌హోంకు తరలించారు. చికిత్సపొందుతూ గురువారం అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కర్ణాటక రాష్ర్టం మైసూర్ నియోజకవర్గం నంజనగూడ గ్రామంలో అంత్యక్రియలు పూర్తయ్యాయన్నారు.రాజగోపాల్చార్కు భార్య సౌమ్య, కుమారుడు ధనుష్, కుమార్తె ధరణి ఉన్నారు. ఈయన శ్రీమఠం పూర్వపు పీఠాధిపతి సుశమీంద్రతీర్థుల పూర్వాశ్రమంలో పుత్రుడు. తండ్రి పీఠాధిపతి కావడంతో 2001 నుంచి 2006 వరకు శ్రీ మఠం ఆప్తకార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో పేదలను ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు పలువురికి ఉద్యోగాలు ఇప్పించారు. మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలనాగిరె డ్డి, వైఎస్సార్సీపీ నాయకులు వై.సీతారామిరెడ్డి, వై.ప్రదీప్‌రెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, మండల కన్వీనర్ భీంరెడ్డి, మంత్రాలయం సర్పంచ్ తెలబండ్ల భీమయ్య తదితరులు ఫోన్ ద్వారా రాజగోపాల్‌చార్ కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. శ్రీ మఠంలో సంతాప సభ నిర్వహించారు. మేనేజరు శ్రీనివాసరావు, ఏఏవో మాధవశెట్టి, ఏఓ రంగారావు, వ్యాసరాజ్చార్, పీఆర్వో రాఘవేంద్రరావు తదితరులు రాజగోపాల్‌చార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిమళ పాఠశాలకు సెలవు ప్రకటించారు. మంత్రాలయంలో దుకాణాలు, హోటళ్ల యాజమాన్యులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. -
కలుషిత తాండవం
డంపింగ్ యార్డుగా తాండవ నది ప్లాస్టిక్ సంచుల శుభ్రంతో నీరు కలుషితం ఇలాగే వదిలేస్తే ఉనికికే ప్రమాదం తాండవ నదిలో కలుషితం తాండవిస్తోంది. నది కాలుష్య కోరల్లో చిక్కుకుని జీవ రాసులు బలైపోతున్నాయి. చె త్తా చెదారంతో తాండవ ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. నదికి రెండు పక్కలా ఆక్రమణలు చోటు చేసుకోగా, మరో పక్క డంపింగ్ యార్డుగా ఉపయోగిస్తున్నారు. పాయకరావుపేట, తుని పట్టణాలకు తాగునీటితోపాటు వేలాది ఎకరాలకు సాగునీరందించే తాండవను ర క్షించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. పాయకరావుపేట: ప్రస్తుతం ఉన్న తాండవ పరిస్థితి చూస్తే గుండె తరుక్కు పోతుంది. ప్రజలకు, రైతులకు ఆందోళన కలిగిస్తోంది. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దులో ఉన్న తాండవ నది నాతవరం మండలం తాండవ నుండి ప్రవహిస్తూ నాతవరం, కోటనందూరు, పాయకరావుపేట, తుని పట్టణాల మీదుగా పెంటకోట వద్ద సముద్రంలో కలుస్తోంది. ఈ నదిపై ఆధారపడి తుని, పాయకరావుపేట, నక్కపల్లి మండలాలకు చెందిన 22 వేల ఎకరాల భూములు సాగవుతున్నాయి. జంట పట్టణాల్లో తాగునీటి అవసరాలను తీరుస్తోంది. చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉన్న తాండవ తీరంలో తుని- పాయకరావుపేట పట్టణాలకు చెందిన వందలాది టన్నుల చెత్త వేస్తుండటంతో నది డంపింగ్ యార్డుగా మారింది. గతంలో తుని మున్సిపాలిటీ అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గతేడాదిలో వచ్చిన నీలం తుపాను ధాటికి నది ఉధృతంగా ప్రవహించి నదిలో పేరుకు పోయిన చెత్త మంగవరం, కొత్తూరు, సత్యవరం, మాసాహెబ్‌పేట ప్రాంతాల్లో ఉన్న తమలపాకు తోటల్లోకి కొట్టుకుని వచ్చి నిలచిపోయంది. భారీగా వచ్చిన చెత్తను తొలగించలేక రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ముఠా ఆనకట్ట దిగువ భాగంలో అర ట్లకోట ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల నదికి చుట్టుపక్కల ఉన్న భూములు కోతకు గురయ్యాయి. ముఠా ఆనకట్టకు వేసి రాతిపేర్పు చెల్లా చెదురైంది. దీనికి తోడు నదిలో సిమెంటు, ఎరువులు, సల్ఫర్ సంచులు శుభ్రంచేస్తున్నారు. తుని, పాయకరావుపేట పట్టణాల్లో వివిధ దుకాణాల్లో లభ్యమయ్యే ప్లాస్టిక్ సంచులు, గోనెలను నదిలో పూర్తిగా శుభ్రపరచి వాటిని రీసైక్లింగ్‌కు పంపిస్తుంటారు. ఈ క్రమంలో నది పూర్తిగా కలుషితమవుతోంది. రెండు పట్టణాల్లో ఉన్న చేపలు మార్కెట్, చికెన్, మటన్సెంటర్ల నుండి వస్తున్న వ్యర్థాలను కూడా నదిలోనే పడేస్తున్నారు. దీంతో నీరు కలుషితమై వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని పట్టణ వాసులు భయాందోళనలు చెందుతున్నారు. ఇంత జరగుతున్నా నీటిపారుదల శాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపడితే నది కాలుష్యం నుండి రక్షించుకునే అవకాశం ఉందని పలువురు సూచిస్తున్నారు. -
నందిగామలో వరద బీభత్సం
పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం తీవ్రరూపం దాల్చుతున్న వైరా, కట్టలేరు, మరగమ్మ వాగు రోడ్లపైకి చేరుతున్న నీటి ప్రవాహం ఇబ్బందులు పడుతున్న ప్రయూణికులు నందిగామ రూరల్ : నందిగామలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉప నదులు, వాగులకు భారీగా వరదనీరు చేరింది. గురువారం రాత్రి 66.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరుసగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు గ్రామాల పరిధిలో ఉన్న పంట పొలాల్లోకి నీరు చేరింది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వైరా, కట్టలేరు పొంగిపొర్లుతున్నాయి. నందిగామ మండలం కూడళి సమీపంలో వైరానది చప్టాపై నుంచి ప్రవహిస్తుండటంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి నందిగామ, వీరులపాడు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వైరానదికి మరింత వరదనీరు వచ్చే ప్రమాదం ఉండటంతో చప్టాపై నుంచి వెళ్లేందుకు సాహసం చేయవద్దని నందిగామ తహశీల్దార్ ఎంసీహెచ్ నాగేశ్వరరావు ప్రయాణికులకు సూచించారు. అనాసాగరం సమీపంలో మరగమ్మ వాగు రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండటంతో నందిగామ నుంచి శనగపాడు మీదుగా పెనుగంచిప్రోలు వెళ్లే రహదారిలో ప్రయాణికులు మోకాళ్ల లోతు నీటిలో అవస్థలు పడుతున్నారు. -
వరదల్లో చిక్కుకున్న తెలుగువారు క్షేమం
-
కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో భారీ వరదల్లో తెలుగు ప్రజలు చిక్కుకున్నారు. అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు, యాత్రకు వెళ్లిన వారు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీనగర్ ఎన్ఐటీలో 50 మంది తెలుగు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎన్ఐటీ క్యాంపస్‌ను వరద నీరు చుట్టుమట్టడంతో విద్యార్థులు సిబ్బంది అతికష్టమ్మీద బయపడ్డారు. విద్యార్థులను లేహ్-లడఖ్‌కు తరలించారు. కాశ్మీర్ వరదల్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ దంపతులు కూడా చిక్కుకున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మరో 200మందికి పైగా విద్యార్ధులు ఓ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు. -
శివ శివా ఎంత నిర్లక్ష్యం
నాడు గాలిగోపురం కూలింది నేడు మండపం కుంగింది కొబ్బరిచిప్పలు, నూనెడబ్బాలు పిచ్చిమొక్కలతో దెబ్బతిన్న ఆలయం స్తపతుల ఆదేశాలు సరే.. ఆచరణ మాటేంటో? శ్రీకాళహస్తి: గోపురం కూలినా, ఆలయపైకప్పు పెచ్చులూడి పడుతున్నా కాళహస్తీశ్వరాలయూధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నాలుగేళ్ల కిందట ఆలయగోపురమే కూలిపోగా, శుక్రవారం ఆల యంలో ఒకమండపం కుంగిపోయింది. ఆలయం పైభాగంలో పిచ్చిమొక్కలు మొలిచినా పట్టించుకోకపోవడం, నూనె డబ్బాలు, కొబ్బరిచిప్పలు ఎండబెట్టడం కారణంగా ఆలయగోడలు దెబ్బతింటున్నాయి. శ్రీకాళహస్తి దేవస్థానంతో పాటు పలు మండపాలు, గోపురాలు మరమ్మతులు చేయించాలని రెండేళ్ల క్రితమే అప్పటి రాష్ట్ర దేవాదాయశాఖ స్తపత్తులు వేలు, సుందరాజన్ పలుసార్లు ఆల యాన్ని పరిశీలించి ఆదేశాలు జారీ చేశారు. అయినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. చిన్నపాటి వర్షాలకే ఆలయగోడలు తడి సి ముద్దవుతున్నాయి. పిచ్చిమొక్కల కారణంగా ఆలయ గోడలు పగుళ్లు వస్తున్నాయి. ఆలయ గాలిగోపురం 2010 మే 26వ తేదీ కుప్పకూలిపోయింది. నాలుగేళ్లు గడుస్తున్నా గోపురం పనులు పునాదులకే పరిమితమయ్యూయి. ఆ తరువాత ఆరు నెలల వ్యవధిలోనే కైలాసగిరి కొండల్లో వేయిలింగాల కోనలోని సహస్రలింగేశ్వరస్వామి ముఖద్వార గాలిగోపురం కుప్పకూలే దిశలో ఉందని స్థానికులు గుర్తించడంతో ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్దిరోజుల వ్యవధిలోనే జ్ఞానప్రసూనాంబ, భిక్షాలగోపురం పైభాగం నుంచి కలశరాళ్లు, ఆలయంలోపల దక్షిణామూర్తి పైభాగం నుంచి రాళ్లు, గురుదక్షిణామూర్తి వద్ద ఆలయ పైకప్పు పెచ్చులు ఊడిపడిన విషయం తెలిసిందే. అయినా అధికారులు ఆ సమయం లో మాత్రమే స్పందించడం.. .హంగామా చేయడం ఆ తర్వాత పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. తాజాగా అష్టోత్తరలింగం మండపం కుంగడం..కూలడానికి సిద్ధంగా ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. కుంభాభిషేకం చేయాలని భావిస్తున్నాం... ఆలయంలో త్వరలో కుంభాభిషేకం చేయాలని భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేయించాలని రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులకు తెలియజేశాం. వారు సానుకూలంగా స్పందిం చారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. -శ్రీనివాసరావు, ఆలయ ఈవో -
విందుకు వెళ్లొస్తూ... మృత్యుఒడిలోకి
పెళ్లింట్లో విషాదం కారును ఢీకొట్టిన లారీ వధువు బావ దుర్మరణం మరో ఐదుగురికి గాయాలు బెల్లంపల్లి : మరదలి రిసెప్షన్ విందుకు వచ్చి ఆనందోత్సాహాలతో ఇంటికి తిరిగెళ్తుండగా లారీ ఢీకొనడంతో బావ మృతిచెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో శుక్రవారం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకుంది. వన్‌టౌన్ ఏఎస్సై ఖాదర్‌పాషా కథనం ప్రకారం... ములుగు మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన స్వాతికి, కాగజ్‌నగర్‌కు చెందిన సురేంద్రచారితో ఈ నెల 20న వివాహం జరిగింది. గురువారం రిసెప్షన్ విందు కోసం స్వాతి కుటుంబ సభ్యులు, బంధువులు కాగజ్ నగర్‌కు రెండు వాహనాల్లో వచ్చారు. వారిలో స్వాతి అక్కాబావలు హన్మకొండకు చెందిన మహారాజ అంజలి, భాస్కరచారి(28) ఉన్నారు. విందు ముగించుకుని శుక్రవారం తెల్లవారుజామున వధూవరులతో కలిసి కాట్రపల్లికి బయల్దేరారు. క్వాలిస్ వాహనంలో వధూవరులు, బంధువులు, మరో కారులో భాస్కరాచారి, బంధువులు ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో బెల్లంపల్లి శివారులో మూసివేసిన 68 గని సమీపంలో మంచిర్యాల వైపు నుంచి తాండూర్ వైపు వెళ్తున్న ఓ లారీ అతి వేగంగా వచ్చి వారి కారును ఢీకొట్టింది. దీంతో కారు నడుపుతున్న భాస్కరాచారి(28) తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో భాస్కరచారి భార్య అంజలి, మామ మొగిలయ్య, తోడల్లుడు కృష్ణమాచారి, బావమరిది రామకృష్ణ, తోడల్లుడి కుమారుడు ప్రదీప్‌కు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిల్చింది. బైక్ మెకానిక్ అయిన భాస్కరచారికి కుమారులు స్నేహిత్, వర్షిత్ ఉన్నారు. సంఘటన స్థలాన్ని సీఐ బానోతు బాలాజీ , తాళ్లగురిజాల ఎస్సై బి.రాజు పరిశీలించారు. మృతుడి తోడల్లుడు కస్పోజు సంజీవచారి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకే ట్రాక్‌పైకి ప్యాసింజర్ రైలు, ఇంజన్
ఆందోళనకు గురైన ప్రయాణికులు హైదరాబాద్: మాసాయిపేటలో జరిగిన దుర్ఘటన మరవకముందే మరో ప్రమాదం తృటిలో తప్పింది. సోమవారం మధ్యాహ్నం అల్వాల్‌లో జరిగిన సంఘటన రైలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బోధన్ నుండి సికింద్రాబాద్ మీదుగా మహబూబ్‌నగర్‌కు వెళ్తున్న ప్యాసింజర్ సోమవారం ఒంటిగంట ప్రాంతంలో అల్వాల్ రైల్వే స్టేషన్లో ఆగి బయలుదేరింది. ఎదురుగా అదే ట్రాక్‌పై ఓ రైలింజన్ రావడాన్ని గమనించిన ప్యాసింజర్ డ్రైవర్ ట్రెయిన్‌ను నిలిపివేశారు. ఎదురుగా వస్తున్న ఇంజన్ డ్రైవర్‌ను కూడా అప్రమత్తం చేసి రెండూ దూరంగా నిలచేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటన పాసింజర్ రైలులో ఉన్న వారిని కలవరపరచింది. కొందరు బోగీలనుండి దిగి పరుగులు తీశారు. ఈ విషయమై రైల్వే అధికారులు విచారణ జరపాలని ప్రయాణికులు కోరారు. -
కొనసాగిన ఎగుమతుల జోరు
న్యూఢిల్లీ: భారత ఎగుమతులు 2014 జూన్‌లో (గత యేడాది ఇదే నెలతో పోల్చి చూస్తే) 10.22 శాతం పెరిగాయి. ఈ విలువ 26.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఎగుమతుల్లో వృద్ధి రెండంకెల్లో నమోదుకావడం వరుసగా ఇది రెండవనెల. అయితే వీటి వృద్ధి రేటు మేతో పోల్చితే (12.4 శాతం) తక్కువ కావడం గమనార్హం. ఇక దిగుమతులు ఇదే నెలలో 8.33 శాతం పెరిగి 38.24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫలితంగా ఈ నెలలో ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు 11 నెలల గరిష్ట స్థాయిలో 11.76 బిలియన్ డాలర్లుగా నిలిచింది. జూన్‌లో బంగారం దిగుమతులు పెరగడం కూడా వాణిజ్యలోటు ఎగయడానికి దారితీసింది. బుధవారం ఈ గణాంకాలను కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసింది. రంగాల పరంగా చూస్తే... జౌళి (14.39% పెట్రోలియం ప్రొడక్ట్స్ (38.3%), ఇంజనీరింగ్ (21.57%), తోళ్లు (15%), సముద్ర ఉత్పత్తులు (27.49%), చమురు గింజలు (44.4%), పొగాకు (31%) ఎగుమతులు బాగున్నాయి. డిమాండ్ పెరగడం హర్షణీయం అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం వల్ల వృద్ధి రేటు రెండంకెల్లో నమోదయినట్లు ఎగుమతిదారుల సంస్థ ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అలాగే వర్థమాన దేశాల్లో ఎగుమతులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు గత ఏడాదికన్నా బాగుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల విలువ 312 బిలియన్ డాలర్లుగా ఉంది. 2014-15లో ఈ విలువ కనీసం 325 బిలియన్ డాలర్లను అధిగమించాలన్నది లక్ష్యం. క్యూ1లో వాణిజ్యలోటు సానుకూలమే జూన్‌లో వాణిజ్యలోటు పెరిగినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్)లో ఈ లోటు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 31 శాతం తగ్గింది. విలువ రూపంలో 33.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఎగుమతులు పెరగడం, బంగారం దిగుమతులు భారీగా తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మూడు నెలల్లో ఎగుమతుల వృద్ధి రేటు 9.3 శాతంగా ఉంది. విలువ 80.11 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతులు 6.92 శాతం వృద్ధితో 113.19 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
ఐసీఐసీఐ విదేశీ విస్తరణ
వడోదర: విదేశాల్లో విస్తరణ కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రయత్నాలు చేస్తోంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, మారిషస్ల్లో బ్యాంక్ శాఖలను ఏర్పాటు చేయనున్నామని బ్యాంక్ ఎండీ, సీఈఓ చందా కొచ్చర్ చెప్పారు. అంతేకాకుండా చైనాలో ఉన్న రిప్రజంటేటివ్ ఆఫీస్‌ను పూర్తి స్థాయి బ్యాంక్ శాఖగా ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. వీటన్నింటికి తగిన ఆమోదాలు ఆర్బీఐ నుంచి పొందామని వివరించారు. బ్యాంక్ 20వ వార్షిక సాధారణ సమావేశంలో ఆమె మాట్లాడారు. భారత ప్రైవేట్ బ్యాంకులతో పోల్చితే విదేశీ నెట్‌వర్క్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ అతి పెద్ద బ్యాంక్ అని పేర్కొన్నారు. మూడు అనుబంధ బ్యాంకులతో, ఎనిమిది రిప్రజంటేటివ్ ఆఫీస్లతో విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 653 బ్యాంక్ శాఖలను, 834 ఏటీఎంలను ఏర్పాటు చేశామని, దీంతో మొత్తం శాఖల సంఖ్య 3,753కు, ఏటీఎంలు 11,315కు పెరిగాయని చందా కొచ్చర్ తెలిపారు. వృద్ధి సాధనపై దృష్టి సారించే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం భారత్‌కు ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశీ యంగా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ, మంచి పనితీరు సాధించామని తెలిపారు. ఈ ఏడాది మరింత మెరుగైన ఫలితాలను నమోదుచేయగలమన్న విశ్వాసాన్ని కొచర్ వ్యక్తం చేశారు. -
ముంపు ముప్పు
కారంచేడు: వర్షాకాలం వచ్చిందంటే చాలు..చీరాల పట్టణం, కారంచేడు గ్రామాలతో పాటు వేల ఎకరాలు నీట మునిగే ప్రమాదం పొంచి ఉంటోంది. కారంచేడులోని అండర్ టన్నెల్ శిథిలావస్థకు చేరింది. మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ అండర్ టన్నెల్ గోడలు పెద్దపెద్ద పగుళ్లతో కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ టన్నెల్గుండా వెలుపలికి వచ్చే వరదనీరు రొంపేరు కుడి, ఎడమ కాలువల ద్వారా సముద్రంలో కలవాలి. ఏ క్షణమైనా ఆ అండర్ టన్నెల్ కూలేందుకు సిద్ధంగా ఉండటంతో వేల క్యూసెక్కుల నీరు కొమ్మమూరు కాలువలోకి చొచ్చుకొచ్చే ప్రమాదం పొంచి ఉంది. = కొమ్మమూరు కాలువ జిల్లాలో కారంచేడు, పర్చూరు, చినగంజాం, చీరాల, వేటపాలెం, నాగులుప్పలపాడు మండలాల్లో సుమారు లక్ష ఎకరాలకు సాగునీరందిస్తుంది. = ఈ కాలువ పరిధిలో అనేక ప్రాంతాల్లో అండర్ టన్నెల్స్ (యూటీ)ను నిర్మించారు. వీటిగుండా ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద, మురుగునీరు...సాగు, తాగునీటిని సరఫరా చేసే కొమ్మమూరు కాలువలో కలవకుండా రొంపేరు ద్వారా సముద్రంలో కలుస్తుంది. = కారంచేడు యూటీ వద్ద రొంపేరు రెండు కెనాల్స్‌గా విడిపోతుంది. లెఫ్ట్ కెనాల్ ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్ ద్వారా సముద్రంలో కలుస్తుంది. రైట్ కెనాల్ వేటపాలెం స్ట్రయిట్‌కట్ ద్వారా సముద్రంలో కలుస్తుంది. = అయితే దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ టన్నెల్స్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ టన్నెల్స్ అన్నంటిలో ప్రధానమైంది కారంచేడు-కుంకలమర్రు మధ్యలో ఉంది. దీనిగుండా సంతమాగులూరు, యద్దనపూడి, పర్చూరు మండలాల్లోని మురుగు, వరదనీరు ప్రవహిస్తుంది. దాన్ని నాటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అంచనావేసి నిర్మించారు. అయితే ప్రస్తుతం ఎన్నో రెట్లు అధికంగా నీరు ప్రవహిస్తోంది. అండర్ టన్నెల్స్ వైశాల్యం సరిపోక మురుగునీరు పొలాలపైకి మళ్లుతోంది. = ఫలితంగా కారంచేడు, పర్చూరు, చీరాల మండలాల పరిధిలో వేల ఎకరాలు ఏటా ముంపునకు గురవుతూనే ఉన్నాయి. = అధికంగా వచ్చిన వరదనీటి వల్ల యూటీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ బీటలు వారాయి. ఏ క్షణాన అయినా కూలే ప్రమాదముంది. నిపుణుల అంచనాల ప్రకారం కారంచేడు టన్నెల్‌కు 2-3 టీఎంసీల నీరు వస్తుంది. బీటలు వారిన గోడలు కూలీనట్లయితే ఈ రెండు, మూడు టీఎంసీల వరద నీరు కొమ్మమూరు కాలువలో కలుస్తుందని రైతులు వాపోతున్నారు. = ఇదే జరిగితే కాలువ పూర్తిగా చిన్నాభిన్నమవడమే కాకుండా సమీపంలోని చీరాల, కారంచేడు ప్రాంతాలు సైతం మునిగిపోయే ప్రమాదముంది. = ఈ పెను విపత్తు అధికారులకు అర్థమవుతున్నా ముందస్తు చర్యలు తీసుకుంటున్న ఆనవాళ్లు కూడా కనిపించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. = గత ఏడాది అక్టోబరులో వచ్చిన భారీ వరదలతో యూటీల వద్ద గోడలపైకి నీరు ప్రవహించింది. ఇంత వరకు ఇలాంటి పరిస్థితి చూడలేదని వృద్ధ రైతులు చెబుతున్నారు. = గోడలపైకి ప్రవహించిన వరదనీరు కొమ్మమూరు కాలువలోకి వచ్చాయి. ఈ ప్రవాహానికి కాలువకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. ఇదే ప్రాంతంలో ఉన్న యూటీ గోడలు కూలిపోతే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విపత్తులను నివారించాలంటే అధికారులు వెంటనే తగు జాగ్రత్తలు పాటించాలని రైతులు కోరుతున్నారు. తొలగని అవరోధాలు.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చినపుడు అప్పటి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రైతులు కొమ్మమూరు కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టాలని వేడుకున్నారు. దీంతో స్పందించిన వైఎస్ రూ.196 కోట్లు మంజూరు చేశారు. కానీ తరువాత వచ్చిన ప్రభుత్వం, పనులు నిర్వహించాల్సిన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహించడంతో పనులకు అవరోధం ఏర్పడింది. ఏడు సంవత్సరాలు పూర్తవుతున్నా ఆధునికీకరణ పనులు అటకెక్కాయి. యూటీల నూతన నిర్మాణం కలగానే ఉంది. ప్రమాదాలు మాత్రం రాకెట్ వేగంతో దూసుకొస్తున్నాయి. దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఏ మార్గం అన్వేషిస్తారో అని అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. -
గ్యాస్ ధరపై త్వరగా నిర్ణయం
పెట్రోలియం మంత్రిని కోరిన బీపీ చీఫ్ మాస్కో: కృష్ణా గోదావరి బేసిన్‌లోని కేజీ డీ6 క్షేత్రంలో గ్యాస్ ఉత్పత్తి పెంపునకు గ్యాస్ ధర సవరణ, చట్ట సంబంధ అనుమతులు అవరోధాలుగా మారిన నేపథ్యంలో బ్రిటిష్ పెట్రోలియం (బీపీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాబ్ డూబ్లే భారత పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. మాస్కోలో మంగళవారం ప్రపంచ పెట్రోలియం సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాన్‌ను ఆయన కలుసుకున్నారు. గ్యాస్ ధరల పెంపుపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా డూబ్లే కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేజీ డీ6తో సహా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన 21 చమురు, గ్యాస్ బ్లాకుల్లో 30 శాతం వాటాను బీపీ 2011లో 720 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. కేజీ డీ6లో నానాటికీ క్షీణిస్తున్న ఉత్పత్తి పెంపునకు ప్రభుత్వ అనుమతులు జాప్యం కావడం బీపీకి నిరాశ కలిగించింది. గ్యాస్ ధరను గత ఏప్రిల్ 1 నుంచి పెంచాల్సి ఉన్నప్పటికీ పెంచలేదనే విషయాన్ని మంత్రి దృష్టికి డూబ్లే తెచ్చారు. కేజీ డీ6లో ప్రస్తుతం రోజుకు 13 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. మూడేళ్ల కిందటి ఉత్పత్తితో పోలిస్తే ఇది కేవలం ఐదో వంతే. ధరల పెంపుపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే తమ పెట్టుబడుల నిర్ణయాలు కొలిక్కి వస్తాయని బీపీ చెబుతోంది. -
అభాగ్యులనుఅక్కున చేర్చుకునే చేతులు
పుట్టుకతో మనిషికి కొన్ని బంధాలు ఏర్పడుతాయి. కానీ పుడుతూనే కొందరికి అన్ని బంధాలూ తెగిపోతాయి. జన్మనిస్తూ తల్లి మరణిస్తుంది. కళ్లు తెరిచేలోపే కన్న తల్లిదండ్రుల్ని మృత్యువు లాక్కెళ్లిపోతుంది. కారణాలు ఏవైతేనేం... పసిగుడ్డుగా ఉన్నప్పుడే బతుకు కుప్పతొట్టి పాలవుతుంది. అలాంటివారికి తమకంటూ చెప్పుకోవడానికి ఏ బంధం ఉంటుంది? ఏ బాంధవ్యం ఒడిలో చేర్చుకుని, గుండెల్లో పొదువుకుని పెంచుతుంది? ఈ ఆలోచన ఒక వ్యక్తిని వేలాదిమందికి తండ్రిని చేసింది. అతడి నీడలో వారి జీవితాలకు పునాది వేసింది! ‘‘నాన్నా... నాకు నాన్న లేడా?’’... ఆ ప్రశ్న వింటూనే అదోలా అయిపోయింది విద్యాకర్ మనసు. ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా చూస్తూండిపోయారు. ఆయన మనసులో ఏముందో అర్థం చేసుకోలేని చిన్నారి అభిలాష్ ఏడుస్తూ నిలబడ్డాడు. ‘‘చెప్పండి నాన్నా... నాకు నాన్న లేడా?’’ అన్నాడు నిలదీస్తున్నట్టుగా. అతడిని దగ్గరకు తీసుకుని గుండెకు హత్తుకున్నారు విద్యాకర్. నీకు నాన్న లేడని ఆ చిన్నారికి చెప్పలేరాయన. ఎందుకంటే అతడు తననే తండ్రి అనుకుంటున్నాడు. ఉన్నాడు అని కూడా చెప్పలేడు. ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. ఆ బాబు తండ్రెవరో తనకు కూడా తెలియదు కాబట్టి! మార్చి 27, 1994. చెన్నైలోని అన్నానగర్‌లో ఉండే విద్యాకర్కి ఓ ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి చెప్పింది వింటూనే విద్యాకర్ హడావుడిగా స్కూటర్ వేసుకుని బయలుదేరారు. ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన గుర్తుల ఆధారంగా ఓ కుప్పతొట్టి దగ్గరకు చేరుకున్నారు. అక్కడి దృశ్యం చూసి ఆయన మనసు కరిగి నీరయ్యింది. కుప్ప తొట్టిలో... కళ్లు కూడా తెరవని ఒక పసికందు పడివుంది. చీమలు కుడుతుంటే గుక్కపట్టి ఏడుస్తోంది. ఒళ్లంతా దద్దుర్లతో ఎర్రగా కందిపోయింది. విద్యాకర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే బిడ్డను తీసుకుని ఆసుపత్రికి పరుగెత్తారు. తక్షణ చికిత్స చేయించి ఆ శిశువును కాపాడారు. తర్వాత బాబుని తీసుకుని ఇంటికి వెళ్లారు. అభిలాష్ అని పేరుపెట్టి ప్రేమగా పెంచడం మొదలుపెట్టారు. అతడే అభిలాష్. ఊహ తెలిసేనాటికి తాను ఎవరి చేతుల్లో ఉన్నాడో అతడే తండ్రి అనుకున్నాడు అభిలాష్. బడిలో చేరిన తరువాత తెలిసింది తన అప్లికేషన్ ఫామ్‌లో తండ్రి అనే కాలమ్ ఖాళీగా ఉంది అని. అది తట్టుకోలేకపోయాడు. నేరుగా వెళ్లి తను నాన్నా అని పిలిచే విద్యాకర్‌ని నిలదీశాడు. తర్వాత మెల్లగా నిజం తెలుసుకున్నాడు. నాన్న కాని ఆ నాన్నకు పాదాభివందనం చేశాడు. ఇప్పటికీ రోజూ చేస్తూనే ఉంటాడు. కుప్పతొట్టిలో దొరికిన తనకు కొడుకు స్థానాన్ని ఇచ్చిన విద్యాకర్ రుణం తీర్చుకోలేనంటాడు కన్నీళ్లతో. ప్రస్తుతం ఐఏఎస్ పరీక్షకు ప్రిపేరవు తున్నాడు అభిలాష్. నిజానికి అతడే కాదు. అతడిలా విద్యాకర్ ప్రేమలో తడిసి విరబూసిన కుసుమాలు చాలానే ఉన్నాయి. ఆ గుబాళింపు తెలియాలంటే... చెన్నైలో ఉన్న ‘ఉదవుమ్ కరంగళ్’కు వెళ్లాలి. అది ప్రేమ ప్రపంచం... కన్నవాళ్లే ఒక్కోసారి పిల్లలను విసు క్కుంటూ ఉంటారు. కానీ ‘ఉదవుమ్ కరంగళ్’లో ఉండే ఏ చిన్నారినీ విద్యాకర్ ఒక్కసారి కూడా విసుక్కుని ఉండరు. వాళ్లని చూస్తేనే ఆయన మనసులో ప్రేమ పొంగి పొరలుతుంది. ఎక్కడెక్కడినుంచో ఆ పిల్లలను తీసుకొచ్చా రాయన. తల్లిదండ్రుల్ని కోల్పోయినవాళ్లు, కుప్పతొట్టి లోనో రోడ్డు పక్కనో దారుణమైన స్థితిలో పడివుండి పసికందులుగా దొరికిన వాళ్లు... ఎక్కడ ఓ చిన్నారి కనిపించినా అక్కున చేర్చు కుంటారాయన. వారి కోసమే ‘ఉదవుమ్ కరంగళ్’ను స్థాపించారు. విద్యాకర్ పుట్టింది మంగుళూరులో. పద మూడేళ్ల వయసులో అనుకోకుండా రామకృష్ణ అనే వ్యక్తిని ఓ ప్రమాదం నుంచి కాపాడారు. ఆ తరువాత ఆయనతో సాన్నిహిత్యం పెరిగింది. ఓసారి ఆయనను కలుసుకోవడానికి చెన్నై కూడా వెళ్లారు. అప్పుడే ఆయనకు సమాజం కోసం బతకడమంటే ఏంటో తెలిసింది తొలిసారి. రామకృష్ణ సమాజ సేవ చేసేవారు. ఆయనను చూసి స్ఫూర్తిపొందిన విద్యాకర్... స్థానికంగా కుష్టురోగుల కోసం పనిచేసే ఓ ఎన్జీవోలో చేరారు. సేవ చేస్తూ అక్కడే ఉండిపోయారు. ఆ క్రమంలో ఓరోజు... ఒక రిక్షా కార్మికుడు ఒక పసిబిడ్డను తీసుకుని విద్యాకర్ దగ్గరకు వచ్చాడు. సినిమా హాల్లో దొరికిందని చెప్పి, విద్యాకర్కు అప్పగించి వెళ్లిపోయాడు. ఆ బిడ్డకు ఓ నీడ కల్పించాలని చాలా ప్రయత్నించారు విద్యాకర్. కానీ ఎవరూ సహకరించలేదు. దాంతో ఆయన మనసు కదిలిపోయింది. దిక్కులేని బిడ్డను సాకేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు, ఇలాంటి పిల్లలందరి పరిస్థితి ఏంటి? అని ఆలోచించిన ఆయన ‘ఉదవుమ్ కరంగళ్ (సాయం చేసే చేతులు)’కు పునాది వేశారు. నాటి నుంచి తన సంస్థ ద్వారా ఎందరో చిన్నారులను అక్కున చేర్చుకున్నారు విద్యాకర్. వాళ్లంతా తనను ‘నాన్నా’ అని పిలుస్తుంటే ఆయన కళ్లు చెమ్మగిల్లుతాయి. ఆయన చేతులు వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటాయి. - సమీర నేలపూడి ‘ఉదవుమ్ కరంగళ్’ను 1983లో స్థాపించారు విద్యాకర్. మొదట అనాథ శిశువుల సంరక్షణ కోసమే పెట్టినా... తరువాత సంస్థను పలు సేవా కార్యక్రమాల దిశగా విస్తరించారాయన. వృద్ధులకు ఆసరా కల్పిస్తున్నారు. మానసిక వికలాంగులను చేరదీసి చికిత్స చేయిస్తున్నారు. ఎయిడ్ వ్యాధిగ్రస్తులను కూడా చేరదీస్తున్నారు. వీరందరికీ ఆవాసం కల్పించేందుకు చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు విద్యాకర్. ప్రస్తుతం ఈ స్వచ్ఛంద సంస్థలో ఎనిమిది వందలకు పైగా మానసిక వికలాంగులు, నాలుగు వందల మందికి పైగా ఎయిడ్స వ్యాధిగ్రస్తులు, యాభై మందికి పైగా వృద్ధులు ఉన్నారు. అదే విధంగా ఆరు వందల మందికి పైగా అనాథ పిల్లలున్నారు. వీరిలో నెల రోజుల నుంచి ఇరవయ్యేళ్ల వయసు ఉన్నవారి వరకూ ఉన్నారు. అందరూ విద్యాకర్‌ని ‘పప్పా (నాన్నా)’ అనే పిలుస్తారు. ఎవరూ అనాథలుగా ఫీలవకూడదన్న ఉద్దేశంతోనే అలా పిలవడం అలవాటు చేశారు విద్యాకర్. అందరికీ చదువు చెప్పిస్తున్నారు. అది కూడా ఎవరికి నచ్చిన కోర్సు వాళ్లు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఆ మంచి మనసే ఆయనను అందరికీ ఆప్తుడిగా మార్చింది. ఆయన ఖ్యాతిని విదేశాల వారు సైతం గుర్తించేలా చేసింది! -
మృత్యుహేల
ఎములాడెళ్లకుండానే నిండు కుటుంబం బలి లారీ రూపంలో కబళించిన మృత్యువు కరీంనగర్ జిల్లా ఆరెపల్లిలో లారీ, ఆటో ఢీ పది మంది దుర్మరణం మూడు జంటలు.. కవలలు.. తల్లీకూతుళ్లు కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం ఆరెపల్లి వద్ద సోమవారం శవాల గుట్టలు పేరుకుపోయాయి. కొడుకు-కోడలు పెళ్లిమొక్కు చెల్లిం చుకునేందుకు ఎములాడ రాజన్న దర్శనానికి వెళ్తున్న కుటుంబమంతా మృత్యుదేవత ఒడిలోకి చేరిపోయింది. ఇసుక లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో పది మంది మృతిచెందారు. వీరందరూ వరంగల్ జిల్లావాసులే. శవాలను సిరిసిల్ల ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. విషయం తెలిసి వచ్చిన ఆత్మీయుల రోదనలతో అక్కడి వాతావరణం బరువెక్కింది. ఈ ఘటనతో వరంగల్ కాశిబుగ్గ, కరీమాబాద్ బొమ్మలగుడి, ఒంటిమామిడిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నారుు. మృతుల్లో ఇద్దరు కవల పిల్లలతోపాటు తల్లిదండ్రులు, నూతన దంపతులు ఉన్నారు. ‘పిల్లలు పుట్టడం కోసం మొక్కని దేవుడు లేడు.. వెళ్లని ఆస్పత్రి లేదు. నా కొడుకుకు లేకలేక కవల పిల్లలు పుట్టారని సంతోషపడ్డా.. ఎంత పనిచేస్తివి దేవుడా.. నేనేం పాపం చేసిన.. నాకు నా వాళ్లని దూరం చేసినవు.. అంటూ కాశిబుగ్గలోని ఇంటి వద్ద కవల పిల్లల నాయనమ్మ రోదించిన తీరు అక్కడున్న వారి కంట కన్నీరు పెట్టించింది. -
శుభకార్యానికి వెళ్లొస్తూ...
ఆటో,వ్యాన్ ఢీ: ఇద్దరు మృతి ఎనిమిది మందికి తీవ్రగాయాలు బుచ్చెయ్యపేట, న్యూస్‌లైన్: అంత వరకూ జరిగిన శుభ కార్యానికి చెందిన ముచ్చట్లు చెప్పుకుంటూ సరాదాగా ఆటోలో వస్తున్న వారిని వ్యాన్ రూపంలో మృత్యువు పలకరించింది. కనురెప్ప పాటులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఎనిమిది మంది తీవ్రగాయాలపాలయ్యారు. చీడికాడ మండలం మంచాల గ్రామానికి చెందిన పట్నాల రాజు అతని తల్లి పార్వతమ్మ, కుటుంబీకులు పట్నాల వీరభద్రుడు, పట్నాల బ్రహ్మాజి, పట్నాల రాము, పట్నాల లక్ష్మి , కుచ్చర్ల భారతి ఆమె నాలుగేళ్ల కొడుకు వినయ్, కుచ్చర్ల లక్ష్మి, గోస మౌనిక కలిసి తమ గ్రామానికి చెందిన దేముడునాయుడు ఆటోలో రావికమతంలో తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై తిరిగి వస్తున్నారు. బీఎన్ రోడ్డులో లోపూడి వద్దకు వచ్చేసరికి నర్సీపట్నం మదర్ థెరీసా నర్సింగ్ హోమ్‌కు చెందిన నర్సింగ్ వ్యాన్ వడ్డాది నుంచి వస్తూ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జయింది. ఆటోడ్రైవర్ దేముడు నాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. తల్లి కళ్లముందే కొడుకు కన్నుమూత... డ్రైవర్ పక్కనే కూర్చొని ఉన్న పట్నాల రాజు తీవ్రంగా గాయపడి ఆటోలో ఇరుక్కుపోయాడు. మిగతా వారంతా తీవ్రగాయాలతో రోడ్డుపై చెల్లా చెదురుగా పడ్డారు. స్థానిక యువకులు వచ్చి ఆటోలో ఇరుక్కున్న రాజును రక్షించేందుకు ప్రయత్నించారు. ఆ పక్కనే కాళ్లు విరిపోయి రక్తపు మడుగులో పడి ఉన్న తల్లి పార్వతమ్మను చూసి కొన ఊపిరితో ఉన్న రాజు, అమ్మా...కాపాడు అమ్మా...అంటూ రోధించాడు. కదలలేని స్థితిలో తల్లి ఉండగా ఆమెను చూస్తూనే రాజు కళ్లు మూశాడు. మరోపక్క తలకు దెబ్బతగిలిన నాలుగేళ్ల చిన్నారి వినయ్ ఆ పక్కనే శరీరమంతా దెబ్బలతో రక్తపు మడుగులో ఉన్న తల్లి భారతిని చూసి ‘అమ్మా... మంచినీళ్లు ఇవ్వమ్మా...’ అంటూ రోధించిన సంఘటన చూపరును కలిచివేసింది. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ వాహనాలు వచ్చి క్షతగాత్రులను చోడవరం, అనకాపలి ఆస్పత్రులకు తరలించారు. చోడవరం సీఐ విశ్వేశ్వరరావు వచ్చి కేసు నమోదు చేశారు. నర్సింగ్ వ్యాన్ సభ్యుల పరారీ ఆటోను ఢీకొని ఇద్దరు ఇద్దరు మరణానికి, మరో తొమ్మిది మంది గాయపడేందుకు కారణమైన నర్సింగ్ హోమ్ వ్యాన్‌లో ఉన్న వారు అక్కడ నుంచి పరారయ్యారు. నర్సింగ్ హోమ్‌కు చెందిన కొందరు ఈవ్యాన్లో మరో కార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ప్రమాద తీవ్రతను గుర్తించి భయపడి వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. -
వడ్డీ రేట్లలో మార్పులు చేయని RBI
-
కీలక పాలసీ వడ్డీరేట్లు యథాతథం..
ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లుచల్లారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగమనం కొనసాగుతున్నా.. ద్రవ్యోల్బణం కట్టడికే ప్రాధాన్యమిచ్చారు. కీలక పాలసీ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని మంగళవారం జరిగిన పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ నిర్ణయించింది. అయితే, చట్టబద్ద ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్)ను మాత్రం అర శాతం తగ్గించడంద్వారా వ్యవస్థలోకి ద్రవ్యసరఫరా పెంచే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా ద్రవ్యోల్బణం గనుక మరింత తగ్గుముఖం పడితే వడ్డీరేట్లను తప్పకుండా తగ్గిస్తామని చెప్పడం ఒక్కటే కాస్తలోకాస్త ఊరటనిచ్చే విషయం. అయితే, ఎస్ఎల్ఆర్ను తగ్గించినప్పటికీ... తాము ఇప్పట్లో వడ్డీరేట్లను తగ్గించే అవకాశం లేదని బ్యాంకర్లు తేల్చిచెప్పారు. ముంబై: మోడీ నేతృత్వంలోని కొత్త సర్కారు కొలువైన తర్వాత తొలిసారిగా చేపట్టిన ఆర్బీఐ పాలసీ సమీక్షలో దాదాపు అందరి అంచనాలకు అనుగుణంగానే నిర్ణయం వెలువడింది. కీలక పాలసీ రేట్లను మార్చకుండా వదిలేసినప్పటికీ.. ఎస్ఎల్ఆర్ను అర శాతం ఆర్బీఐ తగ్గించింది. దీంతో ప్రస్తుతం 23 శాతంగా ఉన్న ఎస్ఎల్ఆర్ 22.5 శాతానికి తగ్గింది. ఈ నెల 14 నుంచి ఈ తగ్గింపు నిర్ణయం అమలవుతుందని పేర్కొంది. తాజా చర్యలతో వ్యవస్థలోకి సుమారు రూ.40,000 కోట్లు విడుదలయ్యే అవకాశం ఉంది. దీనివల్ల బ్యాంకులకు రుణాలిచ్చేందుకు నిధుల లభ్యత పెరగనుంది. ఇదిలాఉండగా... రెపో రేటు 8 శాతం, రివర్స్ రెపో రేటు 7 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతం చొప్పున ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగనున్నాయి. బ్యాంక్ రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్ఎఫ్)లను కూడా ప్రస్తుత 9 శాతం వద్దే ఉంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వరుసగా రెండోసారీ నో చేంజ్... ఆర్బీఐ గవర్నర్‌గా గతేడాది సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టిన రాజన్.. ఆతర్వాత మూడుసార్లు పావు శాతం చొప్పున రెపో రేటును పెంచడం తెలిసిందే. అయితే, తాజాగా రేట్లను యథాతథంగా ఉంచడంద్వారా వరుసగా రెండోసారి పాలసీ రేట్లను పెంచడం లేదా తగ్గించకుండా వదిలేసినట్లయింది. ప్రధానంగా ద్రవ్యోల్బణం కట్టడికే తమ తొలిప్రాధాన్యమంటూ వస్తున్న రాజన్.. తాజాగా మోడీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూడా ఇదే పల్లవిని వినిపించారు. గతేడాది జీడీపీ వృద్ధి రేటు ఇంకా మందగమనంలోనే 4.7 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. కాగా, సరఫరాపరమైన అడ్డంకుల నేపథ్యంలో ఆర్బీఐ లక్ష్యానికి అనుగుణంగా ద్రవ్యోల్బణం దిగొచ్చే అవకాశాలు లేవని విశ్లేషకులు అంటున్నారు. దీనివల్ల డిసెంబర్‌లోపు మరో విడత పాలసీ రేట్ల పెంపు తప్పకపోవచ్చని బ్రోకరేజి దిగ్గజం క్రెడిట్ సూసే అభిప్రాయపడింది. పాలసీలో ఇతర ముఖ్యాంశాలు... ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు గతంలో అంచనావేసినట్లుగానే 5.5 శాతంగా ఉండొచ్చు. ఫారెక్స్ మార్కెట్లో సానుకూల పరిస్థితుల నేపథ్యంలో(డాలరుతో రూపాయి విలువ బలపడటం) వ్యక్తిగతంగా విదేశాల్లో పెట్టే వార్షిక పెట్టుబడుల పరిమితి పెంపు. ప్రస్తుత 75,000 డాలర్ల స్థాయి నుంచి 1.25 లక్షల డాలర్లకు పెంచుతూ నిర్ణయం. బంగ్లాదేశ్, పాకిస్థాన్ పౌరులు మినహా భారత, విదేశీ పౌరులు భారత్ నుంచి బయటికి వెళ్లినప్పుడు ఇకపై రూ.25,000 వరకూ భారతీయ కరెన్సీని పట్టుకెళ్లేందుకు అనుమతి. ప్రస్తుతం విదేశాలకు వెళ్లే భారతీయులు రూ.10,000 వరకూ మాత్రమే దేశీ కరెన్సీని తమతో తీసుకెళ్లేలా ఆర్బీఐ పరిమితి ఉంది. ఫారెక్స్ మార్కెట్లో దేశీయ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కరెన్సీ డెరివేటివ్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు కూడా లావాదేవీలు జరిపేం దుకు అనుమతి. ఈ విభాగంలో ట్రేడింగ్ పరిమాణం తగ్గడంతో దీన్ని బలోపేతం చేసేందుకు చర్యలు. ఎక్స్పోర్ట్ క్రెడిట్ రీఫైనాన్స్ సదుపాయం కింద నిధుల లభ్యత తగ్గింపు. ప్రస్తుతం ఎగుమతిదారులు తాము చెల్లించాల్సిన రుణ మొత్తంలో మరో 50 శాతం వరకూ రుణం తీసుకోవడానికి వీలుండగా.. దీన్ని ఇప్పుడు 32 శాతానికి తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను తగ్గించలేం తేల్చిచెప్పిన బ్యాంకర్లు ఆర్బీఐ ఎస్ఎల్ఆర్ను అర శాతం తగ్గించినప్పటికీ.. తాము మాత్రం వడ్డీరేట్ల తగ్గించే అస్కారం లేదని బ్యాంకర్లు స్పష్టం చేశారు. పాలసీ సమీక్ష తమ అంచనాలకు అనుగుణంగానే ఉందన్నారు. ఆర్బీఐ పాలసీపై ఎవరేమన్నారంటే... ఆర్బీఐ నిర్దేశించిన స్థాయికంటే ప్రస్తుతం బ్యాంకుల ఎస్ఎల్ఆర్ స్థాయి అధికంగానే ఉంది. దీన్ని తగ్గించడంవల్ల తక్షణం ఎలాంటి ప్రభావం ఉండదు. ద్రవ్యసరఫరా పెంపు సంకేతమిది. సమీప కాలంలో వడ్డీరేట్లు తగ్గే అవకాశాల్లేవు. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్మన్ కొత్త ప్రభుత్వం రానున్న నెలల్లో వృద్ధి పెంపునకు, ద్రవ్యోల్బణం కట్టడి కోసం తీసుకోబోయే పాలసీ విధానపరమైన చర్యలను పరిశీలించి తదనుగుణంగా తగిన నిర్ణయం తీసుకోవడానికివీలుగానే ఆర్బీఐ పరపతి విధాన నిర్ణయం ఉంది. కేంద్రంలో కొలువుదీరిన మోడీ సర్కారు వృద్ధికి చేయూతనిస్తుందన్న అంచనాల నేపథ్యంలో వేచిచూసే ధోరణితో ఆర్బీఐ వ్యవహరించింది. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ ఎస్ఎల్ఆర్ తగ్గింపు వల్ల మాకు రూ.1,600 కోట్ల నిధుల లభ్యత పెరిగినప్పటికీ వడ్డీరేట్లలో మార్పులను మేం పరిశీలించే అవకాశం లేదు. - ఎం.నరేంద్ర, ఐఓబీ సీఎండీ ఎస్ఎల్ఆర్ కోతను స్వాగతించిన కార్పొరేట్లు పాలసీ వడ్డీరేట్లను తగ్గించనప్పటికీ.. ఎస్ఎల్ఆర్ను అర శాతం తగ్గించడంపట్ల పారిశ్రామిక వర్గాలు హర్హం వ్యక్తం చేశాయి. ఈ చర్యతో కార్పొరేట్ రంగానికి రుణాలు పెంచేందుకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని చాంబర్లు పేర్కొన్నాయి. సరళ పాలసీని అనుసరించడం ద్వారా పెట్టుబడులను పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న చర్యలను ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్దార్థ్ బిర్లా ప్రశంసించారు. కాగా, ఎస్ఎల్ఆర్ తగ్గింపు వల్ల పారిశ్రామిక రంగానికి పెట్టుబడులకు రుణ లభ్యత పెరిగి, వృద్ధికి కూడా ఊతమిస్తుందని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. కాగా, అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ మాత్రం నిధుల లభ్యత పెరగడం కంటే వడ్డీరేట్ల తగ్గింపే ప్రస్తుతం పారిశ్రామిక రంగానికి అత్యవసరమని చెప్పారు. రియల్టర్ల అసంతృప్తి: పాలసీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపట్ల రియల్ ఎస్టేట్ రంగం అసంతృప్తి వ్యక్తం చేసింది. వృద్ధికి ఊతమిచ్చేవిధంగా మళ్లీ హౌసింగ్ డిమాండ్ పెంచాలంటే ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించాలని రియల్టీ డెవలపర్ల సంఘాల సమాఖ్య(క్రెడాయ్) డిమాండ్ చేసింది. ‘వ్యవస్థలోకి ద్రవ్యసరఫరా పెంచేలా ఎస్ఎల్ఆర్ను తగ్గించడాన్ని మేం స్వాగతిస్తున్నాం. అయితే, వడ్డీరేట్ల తగ్గింపు ద్వారా ఇళ్ల కొనుగోళ్లు పెంచే చర్యల కోసం రియల్టీ పరిశ్రమల వేచిచూస్తోంది’ అని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ సి.శేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీర్ఘకాలం పాటు వడ్డీరేట్లు తగ్గకుండా అక్కడే ఉంటే ఇళ్ల కొనుగోళ్లు జోరందుకోవడం కష్టమని క్రెడాయ్ చైర్మన్ లలిత్ జైన్ పేర్కొన్నారు. ఆర్బీఐ అస్త్రాలు... నగదు నిల్వల నిష్పతి(సీఆర్ఆర్): బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో కచ్చితంగా ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన మొత్తమే సీఆర్ఆర్. రెపో రేటు: బ్యాంకులు తన వద్దనుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీని రెపో రేటుగా పేర్కొంటారు. రివర్స్ రెపో: బ్యాంకులు తన వద్ద ఉంచే అదనపు నిధులపై రిజర్వ్ బ్యాంక్ చెల్లించే వడ్డీనే రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు. ఎస్ఎల్ఆర్: బ్యాంకులు తమ వద్దనున్న డిపాజిట్లలో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా ప్రభుత్వ సెక్యూరిటీ(బాండ్లు)ల్లో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. దీన్నే చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్)గా వ్యవహరిస్తారు. రుణ వృద్ధిని నియంత్రించేందుకు ఆర్బీఐ దీన్ని పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది. -
పెదగొన్నూరులో రగులుతున్న చిచ్చు
ఏడు ఇళ్లు దహనం రూ.10 లక్షల ఆస్తి నష్టం నిన్నమొన్నటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలో కక్షల కార్చిచ్చు రాజుకుంది. 48 గంటల వ్యవధిలో గ్రామంలో ఒక హత్య, లక్షల విలువైన ధాన్యం రాశుల దహనం, తాజాగా ఏడు ఇళ్లు దగ్ధం ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పెదగొన్నూరు (ముదినేపల్లి రూరల్), న్యూస్‌లైన్ : పెదగొన్నూరులో కక్షలు, కార్పణ్యాల చిచ్చు రగులుతూనే ఉంది. గ్రామంలో హత్య, ధాన్యం రాశుల దహనం ఘటనలు జరిగి 48 గంటలు గడవకముందే.. బుధవారం రెండో వర్గానికి చెందిన ఏడు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం రాత్రి గ్రామానికి చెందిన కోటప్రోలు గంగాధరరావు హత్యకు గురయ్యాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన పలువురు రైతుల ధాన్యం రాశులు, కుప్పలు, గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటనలు జరిగాయని, వీటన్నింటికీ గోకరకొండ ముత్యాలయ్య బాధ్యుడని స్థానికులు భావిస్తున్నారు. వారి అనుమానాలను బలపరుస్తూ ముత్యాలయ్య పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నిందితుడైన ముత్యాలయ్య ఇంటినుంచి ఒక్కసారిగా మంటలు ఎగసి పడ్డాయి. వాటిని స్థానికులు అరికట్టే లోపుగానే ఇతర ఇళ్లకు వ్యాపించాయి. అదుపు చేయడం సాధ్యం కాకపోవడంతో ఏడు ఇళ్లు వరుసగా దగ్ధమయ్యాయి. ఇళ్లలోని నగదు, బంగారం, వెండి తదితర వస్తువులన్నీ కాలిపోయి.. బాధితులంతా కట్టుబట్టలతో మిగిలారు. తప్పుదోవ పట్టించేందుకే... హత్య, ధాన్యం దహనం చేసిన కేసులో నిందితుడు ముత్యాలయ్య పోలీసుల ఎదుట లొంగిపోయి స్టేషన్లోనే ఉన్నాడు. గ్రామంలో ముత్యాలయ్యపై తీవ్ర వ్యతిరే కత వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హతుడు గంగాధరరావు కుటుంబ సభ్యులపై దృష్టి మరల్చేందుకు ముత్యాలయ్య బావమరిది భార్య బత్తుల జ్యోతి మధ్యాహ్నం సమయంలో ముత్యాలయ్య ఇంటికి వచ్చి నిప్పంటించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న గుడివాడ డీఎస్పీ జీ నాగన్న ఎదుట గ్రామస్తులంతా జ్యోతి మాత్రమే గృహ దహనాలకు కారణమని చెప్పారు. పలువురు మహిళలు ఇందుకు సంబంధించి డీఎస్పీకి వివరాలు తెలిపారు. వెంటనే స్పందించిన డీఎస్పీ జ్యోతిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాధితులంతా తమకు న్యాయంచేసి రక్షణ కల్పించాలని డీఎస్పీ, ఎస్ఐ వీ సతీష్‌లను కోరారు. ప్రమాదంలో నిందితుడు ముత్యాలయ్య ఇంటితో పాటు తణుకు శ్రీనివాసరావు, బత్తుల క్రీస్తురాజు, వెంకట నాగమణి, రాములమ్మ, లక్ష్మీనరసింహం, నల్లగచ్చు వెంకటనారాయణ, నాంచారయ్యల ఇళ్లు కాలిపోయాయి. ఆర్ఐ గౌతమ్‌కుమార్, వీఆర్వో కాంతారావు బాధితులనుంచి వివరాలు సేకరించారు. లక్ష రూపాయల నగదు కాలిపోయింది... స్థలం రిజిస్ట్రేషన్ చేయించేందుకు, పొలం కౌలు చెల్లించేందుకు లక్ష రూపాయల నగదు ఇంట్లో దాచిపెట్టా. ప్రమాదంలో నగదుతో పాటు 5 కాసుల బంగారం, 10 తులాల వెండి కాలిపోయాయి. - బత్తుల క్రీస్తురాజు, బాధితుడు కట్టుబట్టలతో మిగిలాం అగ్ని ప్రమాదంలో ఇంట్లోని వస్తువులు, పొలం దస్తావేజులు కాలిపోయాయి. కట్టుబట్టలతో మిగిలాం. ఏం పాపం చేశామని మాకిలాంటి పరిస్థితి ఏర్పడింది? - నల్లగచ్చు నాగప్రసాద్, బాధితుడు జ్యోతి వల్లే ప్రమాదం ముత్యాలయ్య బంధువైన జ్యోతి ఇంటికి వచ్చి బయటకు వెళ్లిన వెంటనే ఆ ఇంటి నుంచి మంటలు వచ్చాయి. ప్రమాదానికి జ్యోతి కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. - ఎర్రంశెట్టి వరల క్ష్మి, ప్రత్యక్ష సాక్షి -
ప్రమాద బాధితుల పాణదాత
సాధారణంగా మనం మనవాళ్లకి జరగకూడనిది ఏదైనా జరిగితే బాధ పడతాం. అలా ఎవరికీ జరగకూడదని కోరుకుంటాం. కానీ అలాంటి ప్రమాదం వారికి జరగకుండా చూసేందుకు ప్రయత్నించం. అందుకు ఏదైనా చేద్దామని ఆలోచించం. కానీ పీయూష్ తివారీ ఆలోచించాడు. తనకు, తన కుటుంబానికి కలిగిన బాధ మరెవరికీ కలగకూడదను కున్నాడు. అతడి ఆలోచన ఎంతోమంది జీవితాలను నిలబెట్టింది. ఎందరికో ప్రాణదానం చేసింది. ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపింది. అది 2007. న్యూఢిల్లీ. పీయూష్ తివారీకి అతడి బంధువుల ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. వాళ్లు చెప్పింది వినగానే చేస్తున్న పని వదిలి వాళ్లింటికి పరుగెత్తాడు పీయూష్. పదిహేడేళ్ల తన కజిన్ శివమ్ బాజ్‌పేయ్ మృతదేహం చూసి విస్తుపోయాడు. చిన్నవాడు. చురుకైనవాడు. ప్రమాదంలో చనిపోయాడని తెలిసి బాధపడ్డాడు. అయితే ఆ కథ అక్కడితో ముగిసిపోలేదు. శివమ్ మరణం గురించి పీయూష్‌కి కొన్ని నిజాలు తెలిశాయి. శివమ్ ఘటనా స్థలంలోనే చనిపోలేదు. త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడం వల్ల మరణించాడు. దారిని పోయేవాళ్లెవరూ అతడిని హాస్పిటల్‌కి తీసుకెళ్లలేదు. దాదాపు నలభై అయిదు నిమిషాల తర్వాత ఓ వ్యక్తి అంబులెన్సకి ఫోన్ చేస్తే, వాళ్లు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. ఇది తెలియగానే ఎంతో ఆవేదన చెందాడు పీయూష్. వెంటనే రోడ్డు ప్రమాదాల గురించి వాకబు చేశాడు. ఆ క్రమంలో అతడికి కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. మన దేశంలో జరిగే రోడ్డుప్రమాదాల్లో సగానికి పైగా మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయి. దారుణం ఏమిటంటే... ప్రమాదం జరిగిన తరువాత వాళ్లని ఎవరూ పట్టించుకోక పోవడం వల్లే ఎక్కువమంది మరణిస్తున్నారు. లేనిపోని తలనొప్పి ఎందుకని ఎవరూ స్పందించడం లేదు. పోలీసులు, అంబులెన్సులు చేరుకునేటప్పటికి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ వాస్తవాలు పీయూష్ మనసును తొలిచేశాయి. ఈ పరిస్థితుల్ని మార్చాలంటే ఏం చేయాలా అని ఆలోచించాడు. ‘సేవ్ లైఫ్ ఫౌండేషన్’ ను స్థాపించాడు. రోడ్డు ప్రమాదాల బారిన పడినవాళ్లను రక్షించేందుకు నడుం కట్టాడు. మృత్యుద్వారాలను మూసెయ్యాలని... 2008లో తన స్నేహితుడు క్రిషన్ మెహతాతో కలిసి న్యూఢిల్లీలో తన ఫౌండేషన్‌ను నెలకొల్పాడు పీయూష్ తివారీ. ప్రమాదాలకు గురైనవారిని కాపాడి సకాలంలో వైద్యాలయాలకు తరలించడం, ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించాల్సిన తీరు గురించి ప్రజల్లో అవగాహనను పెంచడం వంటి లక్ష్యాలను పెట్టుకుని అడుగులు కదిపాడు. ఆసక్తి ఉన్నవారిని వాలంటీర్లుగా చేర్చుకున్నాడు. ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనాల ప్రకారం 2010 నాటికి సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించేవారి సంఖ్య లక్షా అరవై వేలు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే... 2020 నాటికి ఈ సంఖ్య ఐదున్నర లక్షలకు చేరుతుంది. అయితే ప్రమాదాల నియంత్రణ అన్నది మన చేతుల్లో ఉండదు. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రమాదం జరిగిన తర్వాత చేయాల్సిన వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. ప్రమాదానికి గురైనవారికి చికిత్స జరిగేలా చూడడంలో ఆలస్యం కారణంగా ఏ ఒక్కరి ప్రాణాలూ పోకూడదు అన్న ఆలోచనకు తగ్గట్టే ఏర్పాట్లు చేశాడు. రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిస్తే చాలు, వాలంటీర్లు అక్కడకు క్షణాల్లో చేరిపోతారు. గాయపడినవారికి ప్రథమ చికిత్స చేసి, ఆపైన ఆసుపత్రికి తీసుకెళ్లి పోతారు. అలా దాదాపు పది రాష్ట్రాల్లో, ఎనిమిది వేల మంది వాలంటీర్లు... కొన్ని వేలమంది ప్రాణాలు కాపాడారు. అయితే ఈ విషయంలో పోలీసులకు కూడా ప్రమాదానంతర చర్యల మీద పూర్తి అవగాహన ఉండాలి. కాబట్టి పోలీసులకు ఆ విషయంలో తర్ఫీదు అవసరం అని భావించాడు పీయూష్. పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదించి, తమ సంస్థలోని బోధనా విభాగం ద్వారా పోలీసులకు ఎమర్జెన్సీ కేర్ విషయంలో శిక్షణనివ్వడం మొదలుపెట్టాడు. అందుకోసం విదేశాల నుంచి నిపుణులను రప్పిస్తున్నాడు. ఇప్పటివరకూ తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో ‘లైఫ్’లను ‘సేవ్’ చేసి, తన సంస్థ పేరును సార్థకం చేశాడు. ‘‘ఈ బాధ్యత నా ఒక్కడిదీ కాదు, ప్రమాదం బారిన పడినవారిని కాపాడేందుకు అందరూ ముందుకు రావాలి’’ అంటాడు పీయూష్. నిజమే... సాటి మనిషి ప్రాణం నిలబెట్టడానికి అందరూ తమవంతు సహాయం చేయాలి. అప్పుడు పీయూష్ లాంటివారి అవసరం ఉండదు. శివమ్లా ఎవరూ ప్రాణాలూ కోల్పోరు! - సమీర నేలపూడి ప్రపంచమంతా తెలిసింది! పోలీసులతో కలిసి పీయూష్ చేస్తోన్న సేవల్ని మనదేశంతో పాటు ప్రపంచమంతా గుర్తించింది. 2010లో ఆయనను ‘రోలెక్స్ అవార్డ ఫర్ ఎంటర్ప్రైజ్’ పురస్కారం వరించింది. 2011లో అమెరికాలోని కొలెరాడో యూనివర్శిటీ వారు వచ్చి ఫౌండేషన్ గురించి ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. అదే ఏడు ‘ద వీక్’ పత్రిక తమ వార్షికోత్సవ సంచికలో ‘సేవ్ లైఫ్ ఫౌండేషన్’ సేవలను ప్రశంసిస్తూ ప్రత్యేక కథనాన్ని వెలువరించింది. -
భారత్ భవిత బంగారం!
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం భారత్ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందని విశ్లేషణా సంస్థలు అంచనా వేస్తున్నాయి. దేశం ఆర్థిక సవాళ్లను అధిగమించవచ్చని రేటింగ్ సంస్థ మూడీస్ సోమవారం పేర్కొంది. వచ్చే రెండేళ్లలో దేశాభివృద్ధి 6.8 శాతం ఉంటుందని బ్యాంకింగ్ సేవల దిగ్గజ సంస్థ తాజాగా మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. ఈ మేరకు ఆయా సంస్థలు విడుదల చేసిన విశ్లేషణా పత్రాలను వేర్వేరుగా పరిశీలిస్తే- క్రెడిట్ పాజిటివ్: మూడీస్ ఎన్నికల ఫలితాలు సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తుందని మూడీస్ పేర్కొంది. స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ఈ పరిణామం దోహదపడే అవకాశాలు ఉన్నాయని మూడీస్ వివరించింది. ఇది భారత్‌కు ‘క్రెడిట్ పాజిటివ్’అని సంస్థ తన తాజా నివేదికలో విశ్లేషించింది. ప్రస్తుతం దేశానికి మూడీస్ ‘బీఏఏ3’ రేటింగ్ ఉంది. స్టేబుల్ అవుట్‌లుక్‌తో కొంత క్రెడిట్ రిస్క్ ఉన్నట్లు ఈ రేటింగ్ సూచిస్తుంది. అటు ప్రభుత్వానికి, ఇటు కార్పొరేట్ రంగానికి ఈ విజయం క్రెడిట్ పాజిటివ్ అని వివరించింది. బ్యాంకింగ్ రంగానికి సైతం ఇది శుభసూచకమని అభిప్రాయపడింది. చిదంబరం తన తాత్కాలిక బడ్జెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేటాయించిన మూలధన పెట్టుబడులను మోడీ సర్కారు పెంచవచ్చని విశ్లేషించింది. ఇది బ్యాంకుల క్రెడిట్ పాజిటివ్‌కు దోహదపడుతుందని వివరించింది. ఇన్వెస్టర్ సెంటిమెంట్ తక్షణం మెరుగుదలకు ఇది దోహపదడిందని వివరించింది. కార్పొరేట్, మౌలిక రంగాల విషయంలో నిలిచిపోయిన విధానాల పునరుద్ధరణకు ఈ ఫలితాలు దోహదపడతాయని మూడీస్ వైస్‌ప్రెసిడెంట్, సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ వికాశ్ హలాన్ అన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సన్నిహిత సహకారం వల్ల పెట్టుబడుల్లో ప్రస్తుతం ఉన్న నిరుత్సాహ ధోరణి తొలగిపోతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కొత్త ప్రభుత్వం సహజ వాయువు ధరలను పెంచే అవకాశం కూడా ఉన్నట్లు వివరించింది. ఇదే జరిగితే ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వంటి అప్‌స్ట్రీమ్ ఆయిల్, గ్యాస్ కంపెనీలకు లాభదాయకమని పేర్కొంది. దీర్ఘకాలంలో పెట్టుబడులకు ఇది ఊతమిచ్చే అంశంగా దీనిని విశ్లేషించింది. ఏప్రిల్‌లోనే గ్యాస్ ధరలు పెరగాల్సి ఉన్నా, దీనిపై నిర్ణయాన్ని ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం పక్కనబెట్టింది. మోర్గాన్ స్టాన్లీ ఇలా... వచ్చే కొద్ది త్రైమాసికాల్లో దేశం స్టాగ్ఫ్లేషన్ నుంచి బైటపడుతుంది. వృద్ధి కనిష్ట స్థాయి వద్ద కొనసాగుతూ, ధరల పెరుగుదల తీవ్రంగా ఉండే పరిస్థితిని స్టాగ్‌ఫ్లేషన్‌గా వ్యవహరిస్తాం. ఈక్విటీ మార్కెట్ ఊపుమీదుంటుంది. 2015 జూన్ నాటికి మోర్గాన్ స్టాన్లీ సెన్సెక్స్ టార్గెట్ 26,300. దీనికి సంబంధించి క్రితం టార్గెట్ 21,280 పాయింట్లు. భారత్ వృద్ధికి సంబంధించి ఎన్నికల ఫలితాలు కీలకమైనవి. వచ్చే రెండేళ్లలో జీడీపీ వృద్ధి 6.8 శాతానికి పెరగవచ్చు. ద్రవ్యోల్బణం 6 శాతం దిశగా కిందకుదిగే అవకాశం ఉంది. భారత్ సంస్థాగత అంశాలు ఇప్పటికే పటిష్టంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం వృద్ధికి ఊతం ఇస్తూ, సంస్కరణల ప్రక్రియ వేగం పెంచవచ్చు. వ్యాపార సెంటిమెంట్‌కు ఫలితాలు ఊపిరులూదాయి. కార్పొరేట్ రంగ లాభదాయకతకు, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెరగడానికి ఈ ఫలితాలు దోహదపడే అవకాశం ఉంది. ఫలితాలు దేశాభివృద్ధికి సంబంధించి మా విశ్వాసాన్ని పెంచాయి. రానున్న పదేళ్లలో జీడీపీ వృద్ధి రేటు 6.75 శాతానికి పైగా నమోదవుతుంది. జీడీపీ విలువ ప్రస్తుత 1.9 ట్రిలియన్ డాలర్ల నుంచి 5 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చు. ఇబ్బందులూ ఉన్నాయ్ దేశ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లూ పొంచి ఉన్నట్లు మోర్గాన్ స్టాన్లీ నివేదిక విశ్లేషించింది. రానున్న 12 నెలల్లో ఎల్నీనో, ఎగుమతుల స్పీడ్ తగ్గుదల వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. మధ్యకాలికంగా ఎదురయ్యే సవాళ్లలో ప్రపంచ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఒకటి. సంస్కరణల ప్రక్రియను వేగవంతం చేయడం మరొకటి. -
మోడీ వస్తే చిన్న ర్యాలీ... రాకపోతే భారీ పతనమే!
మరి ఈసారో?... సగటు ఎగ్జిట్ పోల్స్‌ను పరిగణనలోకి తీసుకొని మార్కెట్ వర్గాలు మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 250-270 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఇప్పటికే మార్కెట్లు పరుగులు తీశాయి. గత 5 రోజుల్లో సెన్సెక్స్ 1,600 పాయింట్లకుపైగా పెరిగింది. ఇప్పటికే మార్కెట్లు భారీగా పెరగడంతో అప్పర్ సర్క్యూట్‌కి(20% పెరగడం) అవకాశాల్లేవని, ఫలితాలు అంచనాలకు భిన్నంగా ఉంటే లోయర్ సర్క్యూట్‌ను (20% తగ్గడం) తాకొచ్చని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్ గరిష్టంగా 20% పెరగడం లేదా తగ్గడం జరిగితే, ఆ రోజుకి ఇక ట్రేడింగ్ ఆపేస్తారు. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్నికల ఫలితాలు వెలువడనున్న శుక్రవారం స్టాక్ మార్కెట్ కదలికలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. 2004, 2009 సంవత్సరాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం సూచీలు 15 శాతానికి పైగా పెరగడం కానీ నష్టపోవడం కానీ జరిగింది. ఈ సారి కూడా అదే విధంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో 20% కదలికలకు మార్కెట్లు సిద్ధం చేసుకుంటున్నట్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డేటా వెల్లడిస్తున్నది. ప్రస్తుతం నిఫ్టీ 7,100 స్థాయి వద్ద ఉంటే పెరిగితే 8,000-8,500 స్థాయి వరకు వెళ్ళొచ్చన్న నమ్మకంతో ట్రేడర్లు కాల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఒకవేళ ఫలితాలు ప్రతికూలంగా ఉంటే 6,000-5,500 స్థాయి వరకు పడొచ్చన్న ఉద్దేశ్యంతో ట్రేడర్లు పుట్ ఆప్షన్స్ కొనుగోలు చేస్తున్నారు. ర్యాలీ జరిపితే కాల్ ఆప్షన్ కొన్నవారికి, తగ్గితే పుట్ ఆప్షన్ కొన్నవారికి లాభం వస్తుంది. ఎగ్జిట్ పోల్ ప్రభావం ఎంత? గత రెండు ఎన్నికల ఫలితాలు మార్కెట్ అంచనాలకు భిన్నంగా వచ్చాయి. 2004లో అందరూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్ అంచనాలు వస్తే దానికి భిన్నంగా వామపక్షాల మద్దతుతో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అలాగే 2009లో యూపీఏ కూటమి తిరిగి అధికారంలోకి రాదని, థర్డ్ ఫ్రంట్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ ఘోషించాయి. కాని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వామపక్షాల మద్దతు అవసరం లేకుండానే యూపీఏ కూటమి అధికారం నిలబెట్టుకుంది. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా పరుగులు తీశాయి. కాని ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికర విషయం ఇంకోటుంది. 2004 ఫలితాల తర్వాత సూచీలు కుప్పకూలినా.. ఆ తర్వాతి కాలంలో ఎన్నడూ ఊహించనంత లాభాలందించాయి. 2009 లో స్వల్పకాలానికి పెరిగినా ఆ తర్వాత కుప్పకూలి పరిమిత శ్రేణిలో కదిలాయి. అప్పర్ సర్క్యూట్ చాన్స్ తక్కువే ఎన్నికల ఫలితాల లెక్కింపు 8 గంటలకే ప్రారంభం కానుండటంతో 9.15కల్లా ఫలితాల సరళిపై కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మార్కెట్లు ప్రారంభంలోనే కొద్దిగా గానప్ అప్ లేదా గ్యాప్ డౌన్‌తో ప్రారంభం కావచ్చని ఎస్ఎంసీ గ్లోబల్ రీసెర్చ్ హెడ్ జగన్నాథం తూనుగుంట్ల అంచనా వేస్తున్నారు. ఎన్డీఏకి 280 వరకు సీట్లు వస్తాయని అంచనాతో మార్కెట్లు ఇప్పటికే పెరగడంతో వాస్తవ ఫలితాలు కూడా అదే విధంగా ఉన్నాసరే మార్కెట్లు పెద్దగా పెరగకపోవచ్చన్నారు. ఒకవేళ ఎన్డీఏ కూటమి 220-240 దగ్గరకొచ్చి ఆగిపోతే భారీ పతనం తప్పకపోవచ్చన్నారు. ఫలితాలు ఏకపక్షంగా ఉండకుండా, చివరివరకూ ఊగిసలాట ధోరణిలో ఉంటే మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతాయన్నారు. రేపటి ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఎన్ని, బీజేపీఒంటిరిగా ఎన్ని సీట్లు సాధిస్తున్నది అన్న అంశాలను పరిశీలించాలంటున్నారు జెన్ మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి. ఎన్డీఏ కూటమి 300 సీట్లు దాటితే 10% వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. కేవలం బీజేపీ సీట్లు 220 లోపునకు పరిమితం అయినా, ఎన్డీఏ కూటమి 230లోపు ఆగినా, థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నా సూచీలు లోయర్ సర్క్యూట్ తాకుతాయని సతీష్ పేర్కొన్నారు. స్వల్ప మెజార్టీతో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సెన్సెక్స్ కేవలం 150 నుంచి 200 పాయింట్లు పెరుగుతుందని, అదే ఫలితాలు భిన్నంగా ఉంటే 2,000 వరకు నష్టపోయే ప్రమాదం ఉందని ఎడల్విస్ ఫైనాన్షియల్ మేనేజింగ్ పార్టనర్ అంబరీష్ బాలిగ పేర్కొన్నారు. స్థిరమైన ప్రభుత్వం వస్తే రానున్న 12-18 నెలల్లో నిఫ్టీ 8,700 వరకు పెరుగుతుందని, అదే థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే సూచీలు 15-20% నష్టపోయి 3-6 నెలల తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి దిశ తీసుకుంటుందనేది కార్వీ స్టాక్ బ్రోకింగ్ అంచనా. ఎన్నికల తర్వాత... సంవత్సరం రెండు రోజుల్లో 1999 6.05% 2004 -16.56% 2009 17.34% -
దేవతలారా... మన్నించండి!
నమో నాస్తికా! సృజనాత్మకత అదుపు తప్పితే ఘోర ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో కళాకారుడి ప్రతిష్ట కాళ్లూ చేతులు పోగొట్టుకుంటుంది. నష్టం లేదు. కానీ చుట్టుపక్కల దెబ్బతినే మనోభావాల మాటేమిటి? వాటికి ఏ కళాకారుడొచ్చి మందు రాస్తాడు? రాసినా అది ఓదార్పో, ఉపశమనమో అవుతుంది కానీ పరిహారమో, ప్రాయశ్చిత్తమో కాలేదు. ఇలాంటి ఘోర ప్రమాదమే ఒకటి ఇటీవల ముంబైలోని ‘తప్రూట్’ అనే యాడ్ ఏజెన్సీ వల్ల జరిగింది. గృహహింసకు వ్యతిరేకంగా ఈ సంస్థ రూపొందించిన చిత్రాలలోని మితిమీరిన సృజనాత్మకత వివాదానికి కారణమయింది. లక్ష్మీదేవి, సరస్వతీ దేవి, దుర్గామాత... వీరు ముగ్గురూ గృహ హింసకు గురైనట్లుగా, వారి ముఖాలపై గాయాలను, కమిలిన గుర్తులను చేర్చి ఈ ఏజెన్సీ పోస్టర్లు విడుదల చేసింది. వాటి కింద ఇలా రాసి ఉంటుంది. ‘‘ఇలాంటి రోజు ఒకటి రాకూడదని ప్రార్థించండి. నేడు భారతదేశంలో 68 శాతం మంది గృహహింసకు గురవుతున్నారు. రేపు ఎవరూ ఇందుకు మినహాయింపు కాకపోవచ్చు. ఆఖరికి మనం పూజించే దేవతలు కూడా’’. ‘సేవ్ అవర్ సిస్టర్స్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ కోసం తయారైన పోస్టర్లు ఇవి. అయితే ప్రమాదాన్ని ముందుగా ఊహించిన ఆ సంస్థ వీటిని ఇంటర్నెట్ ప్రచార ఉద్యమానికి మాత్రమే పరిమితం చేసింది. ఉద్దేశాలు మంచివే కావచ్చు. కానీ వాటిని వ్యక్తం చేసే విధానం సక్రమంగా లేకపోతే వాటిని ఎవరూ సమర్థించరు. మత విశ్వాసాల విషయంలో అస్సలు క్షమించరు. ఎంతటి సృజనశీలురైనా ఈ వాస్తవాన్ని గుర్తించక తప్పదు. -
ఈ యువకుడు యమజాతకుడు
ఓ యువకుడు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ తన ముందుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో ఎదుటి వైపు నుంచి మరో బస్సు అతివేగంగా దూసుకొచ్చింది. యువకుడు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం బస్సు చక్రాల కిందకు దూసుకెళ్లి పెద్ద శబ్దం వచ్చింది. ఆర్టీసీ డ్రైవర్ బస్సును నిలిపివేశారు. ఆ యువకుడి తీవ్ర ప్రమాదం జరిగిందని బస్సు ప్రయాణికులు భావిం చారు. స్పల్పగాయాలతో ప్రాణాపాయం నుంచి బయట పడిన యువకుడిని చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఘటన అవనిగడ్డ మండలం, తుంగలవారిపాలెం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని గుడివాకవారిపాలేనికి చెందిన గుడివాక వెంకటేశ్వరరావు ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై నాగాయలంక బయలుదేరాడు. తుంగలవారిపాలెం వద్ద నాగాయలంక ఫంటు బస్సును ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఎదురుగా నాగాయలంక నుంచి నర్సాపురం వెళ్లే బస్సు వేగంగా దూసుకొచ్చింది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన వెంకటేశ్వరరావు ద్విచక్రవాహనాన్ని వదిలేసి పక్కకు దూకాడు. ఆ ద్విచక్రవాహనం ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కిందకు వెళ్లిపోవడం, బస్సు పంటకాలువవైపు వరగటంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే డ్రైవర్ బస్సును చాకచక్యంగా నిలిపివేశారు. ప్రయాణికులు అందరూ వెంకటేశ్వరరావుకు ఏ ప్రమాదం జరిగిందోనని ఆందోళన చెందారు. అతను స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. -
బీమా బ్రోకింగ్ వ్యాపారంలోకి జెన్‌మనీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రోకింగ్‌సహా పలు ఆర్థిక సేవల రంగంలో ఉన్న జెన్‌మనీ తాజాగా బీమా బ్రోకింగ్ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇందుకోసం జెన్‌మనీ ఇన్సూరెన్స్ సర్వీసెస్ పేరుతో అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసినట్లు జెన్‌మనీ మేనేజింగ్ డెరైక్టర్ ప్రతాప్ కంతేటి తెలిపారు. గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో బీమా బ్రోకింగ్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జీవిత, సాధారణ బీమా రంగంలో ఉన్న అన్ని కంపెనీలకు చెందిన పాలసీలు విక్రయించే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. అధిక కమీషన్ల కోసం ఆశపడకుండా ఖాతాదారులకు అవసరమైన పాలసీలను మాత్రమే అందిస్తామని, ముఖ్యంగా టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ విభాగాలపై అధికంగా దృష్టిసారించనున్నట్లు తెలిపారు. బీమా రంగంలో విస్తరణకు ఇంకా చాలా అవకాశాలున్నాయని, వచ్చే మూడేళ్ళలో మొత్తం ఆదాయంలో 50 శాతం బీమా బ్రోకింగ్ నుంచే వచ్చే విధంగా చేయాలన్నదే తమ లక్ష్యమని జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి తెలిపారు. గత ఆరు నెలల నుంచి స్టాక్ మార్కెట్ లావాదేవీలు పెరిగాయని, అలాగే రాష్ట్ర విభజన పూర్తి కావడంతో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా విచారణలు మొదలైనట్లు తెలిపారు. -
ఏటీఎంలకు ‘ఎక్స్పీ’ గండం...
న్యూఢిల్లీ: విండోస్ ఎక్స్పీ నుంచి బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లోని చాలా పర్సనల్ కంప్యూటర్లు, ఏటీఎంలను ఆప్‌గ్రేడ్ చేయాల్సి ఉందని అమెరికా సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఇలా చేయని పక్షంలో ఈ పీసీలకు, ఏటీఎంలకు సెక్యురిటీ రిస్క్‌లు తప్పకపోవచ్చని వివరించింది. ఈ కంపెనీ విండోస్ ఎక్స్‌పీని 2001, ఆక్టోబర్‌లో విడుదల చేసింది. ప్రస్తుతమున్న ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 8తో పోల్చితే విండోస్ ఎక్స్పీ మూడు జనరేషన్లు వెనకబడి ఉంది. వచ్చే నెల 8 నుంచి విండోస్ ఎక్స్‌పీకి సపోర్ట్ సర్వీసులందించడం ఆపేస్తామని మైక్రోసాఫ్ట్ వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో లక్ష వరకూ ఏటీఎంలు ఉంటాయని, వీటిల్లో అధిక భాగం విండోస్ ఎక్స్‌పీపైనే పనిచేస్తున్నాయని మైక్రోసాఫ్ట్ ఇండియా జీఎం(విండోస్ బిజినెస్) అమ్రిష్ గోయెల్ పేర్కొన్నారు. అయితే కేవలం కొన్ని పాత ఏటీఎంలకు మాత్రమే సమస్య ఉంటుందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎం.వి. టంకసాలె పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సపోర్ట్ సర్వీసులు ఆగిపోతే సమస్యలు పెరుగుతాయని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని గత వారంలోనే భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కూడా హెచ్చరించింది. -
ప్రొడక్ట్ బిజినెస్‌ను విడదీసిన పొలారిస్
న్యూఢిల్లీ: ప్రొడక్ట్ బిజినెస్‌ను విడదీసి ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు సాఫ్ట్వేర్ సేవల సంస్థ పొలారిస్ ఫైనాన్షియల్ టెక్నాలజీ వెల్లడించింది. తద్వారా తదుపరి దశ వృద్ధిని అందుకోలగమని భావిస్తున్నట్లు తెలిపింది. అన్ని అనుమతులూ లభిం చాక ప్రొడక్ట్ విభాగాన్ని ‘ఇంటలెక్ట్ డిజైన్ ఏరీనా’గా పిలవనున్నట్లు పేర్కొంది. గ్లోబల్ యూనివర్సల్ బ్యాంకింగ్, రిస్క్ అండ్ ట్రెజరీ మేనేజ్మెంట్, గ్లోబల్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ బిజినెస్‌లు ఇంటలెక్ట్లో భాగంగా ఉంటాయని వివరించింది. ఈ చర్య కస్టమర్లు, ఉద్యోగులతోపాటు, ఇన్వెస్టర్లకు కూడా లబ్దిని చేకూర్చగలదని పొలారిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అరుణ్ జైన్ పేర్కొన్నారు. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో పొలారిస్ షేరు దాదాపు 12% దూసుకెళ్లి రూ. 153 వద్ద ముగిసింది. -
ఫండ్స్ పథకాలపట్లా ఆసక్తి చూపాలి
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను వినియోగించుకోవడంలో విజయవంతమైన బీమా రంగ కంపెనీల బాటలో మ్యూచువల్ ఫండ్స్ కూడా ప్రయాణించాలని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సూచించింది. అయితే ఇందుకు ప్రధానంగా ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకులు సహకరించాలని పేర్కొంది. తద్వారా ఫండ్ పథకాల విక్రయంలో పీఎస్‌యూ బ్యాంకులు ప్రముఖ పాత్రను పోషించేందుకు వీలుచిక్కుతుందని అభిప్రాయపడింది. బీమా పథకాల పంపిణీలో బ్యాంకింగ్ నెట్వర్క్ విజయవంతమైన నేపథ్యంలో సెబీ సూచనలకు ప్రాధాన్యత ఏర్పడింది. సంప్రదాయ బ్యాంకింగ్ ప్రొడక్ట్లకుతోడు థర్డ్‌పార్టీ బీమా పథకాల విక్రయంలో బ్యాంకులు భారీ విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే మ్యూచువల్ ఫండ్స్ పథకాల విషయంలో ఇది ప్రతిబింబించడంలేదని సెబీ వ్యాఖ్యానించింది. బ్యాంకుల ద్వారా ఫండ్ పథకాల విక్రయం పుంజుకోవాలంటే పీఎస్‌యూ బ్యాంకులే చొరవ చూపాల్సి ఉంటుందని సూచించింది. భారీగా విస్తరించిన బ్రాంచీల ద్వారా బ్యాంకులు ఫండ్ పథకాల పంపిణీకి జోష్ తీసుకురాగలవని సెబీ ప్రతిపాదనలలో పేర్కొంది. ఈ ప్రతిపాదనలను సెబీ బోర్డు ఇటీవల ఆమోదించిన సంగతి తెలిసిందే. -
గుర్రాల పోటీలో అపశ్రుతి
ముగ్గురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం గాంధీ గ్రామం సోలాపూరమ్మవారి ఉత్సవంలో ఘటన చోడవరం, న్యూస్‌లైన్: హుషారుగా జిల్లా స్థాయి గుర్రపు పందాలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఉత్సాహంగా పోటీలో పరుగులు తీస్తున్న గుర్రాల మధ్యలోకి కొందరు దూసుకురావడంతో అపశ్రుతి చోటుచేసుకుంది. గుర్రాల కింద పడి ముగ్గురు తీవ్రంగా గాయపడగా వీరిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా మారింది. చోడవరంమండలం గాంధీ గ్రామంలో ఆదివారం సోలాపూర్ అమ్మవారి తీర్థ మహోత్సవం అంగరంగ వైభంగా జరిగింది. ఉదయం నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం ఈ ఆలయం సమీపంలో పొలాల్లో జిల్లా స్థాయి గుర్రపు, యడ్ల బళ్ల పోటీలు నిర్వహించారు. ముందు యడ్ల బళ్ల పోటీలు జరగగా, గుర్రపు పోటీలు నిర్వహించే సమయానికి కొంత పొద్దుపోయిన సమయం అయ్యింది. అయినా పోటీ జరిగే ప్రదేశంలో భారీగా లైట్లు ఏర్పాటు చేయడంతో గుర్రపు పోటీలు మంచి రసవత్తరంగా ప్రారంభమయ్యాయి. గుర్రాలు పోటీ పడి పరుగెడుతున్న సమయంలో ఒక్కసారిగా కొందరు మధ్యలో అటుగా వెళ్లడానికి ప్రయత్నించారు. ఇంతలో అప్పటికే వేగంగా దూసుకొస్తున్న గుర్రాల కింద కొందరు పడిపోయారు. ఈ ప్రమాదంలో గాంధీ గ్రామం దూదిరామయ్య(70), ఆరిపాక సన్యాసి(60), ఎస్.పవన్(25) తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో దూది రామయ్య అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో 108 అంబులెన్స్‌లో అనకాపల్లి 100 పడకల ఆస్పత్రికి తరలించారు. మిగతా ఇద్దర్నీ చోడవరం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స నిర్వహించారు. అంతా అహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సాహంగా జరుగుతున్న పోటీల మధ్యలో ఈ సంఘటన చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన అనంతరం యథావిధిగా పోటీలు నిర్వహించారు. -
రుణం వచ్చేలా వృద్ధులకు పాలసీ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేవలం పెన్షన్ పథకాలే కాకుండా పదవీ విరమణ తర్వాత బీమా రక్షణతో పాటు, ఆర్థిక అవసరాలను తీర్చేలా వృద్ధులకు ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తెస్తోంది బజాజ్ అలయంజ్. ఇప్పటి వరకు వయసుపై బడిన వారికి మార్కెట్లో సరైన బీమా పథకం లేదని, ఆ లోటును భర్తీ చేసేలా త్వరలోనే కొత్త పథకం ప్రవేశపెడుతున్నామంటున్న బజాజ్ అలయంజ్ లైఫ్ ప్రొడక్ట్ హెడ్ రితురాజ్ భట్టాచార్యతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. కొత్త నిబంధనలు వచ్చాక అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడిందా? ఈ మార్పులతో ప్రీమియం రేట్లు ఏమైనా పెరిగాయా? మార్పులు జరిగినప్పుడు కొంత ఒడిదుడుకులు ఉండటం సహజం. కొత్త నిబంధనలు వచ్చి నెల రోజులు మాత్రమే అయింది. కాబట్టి అప్పుడే అమ్మకాల గురించి వ్యాఖ్యానించటం కష్టం. మార్పులను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం మేం కొత్త పథకాలపై ఏజెంట్లకు అవగాహన కల్పించే పనిలో ఉన్నాం. ఇదంతా పూర్తయి మామూలు పరిస్థితి రావడానికి మరికొన్నాళ్లు పడుతుంది. మా పథకాల పోర్ట్‌ఫోలియోను సమూలంగా మార్చి కొత్త తరహా పథకాలను ప్రవేశపెట్టడానికి ఈ నిబంధనల మార్పును చక్కగా వినియోగించుకుంటున్నాం. కొత్త నిబంధనలతో బీమా రక్షణ పెరిగింది. ఆ మేరకు ప్రీమియం ధరల్లో కొంత మార్పు ఉండచ్చు కాని ప్రీమియం ధరల్లో భారీ మార్పులేమీ రాలేదు. బజాజ్ అలయంజ్ ఎటువంటి ఉత్పత్తులపై దృష్టిపెడుతోంది? ప్రస్తుతం ఎన్ని పథకాలు అందుబాటులో ఉన్నాయి? ప్రస్తుతం 8 వ్యక్తిగత బీమా పథకాలు, మరో 8 గ్రూపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ఉద్యోగంలోకి చేరి తొలిసారిగా బీమా తీసుకునే వారికోసం, అలాగే రిటైర్ అయిన తర్వాత కూడా బీమా రక్షణతో పాటు వారి అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉండే పథకాలపై దృష్టిసారిస్తున్నాం. ముఖ్యంగా జీవించే కాలం పెరుగుతుండటంతో 60 ఏళ్ల పైబడిన వారికి ఉపయోగపడేలా, అవసరమైతే బీమా పథకంపై రుణం తీసుకునే అవకాశం ఉండే హోల్‌లైఫ్ పథకాలపై దృష్టిసారిస్తున్నాం. ఇంతకాలం బీమారంగం వీరి అవసరాలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ విభాగంపై మేం ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. వచ్చే నెలలోనే ఇటువంటి పాలసీని ప్రవేశపెట్టనున్నాం. మొత్తం మీద నెలకు 3 పథకాలు చొప్పున ప్రవేశపెట్టాలన్నది లక్ష్యం. టర్మ్, యులిప్, ఎండోమెంట్ అన్ని పథకాలు ఉండే విధంగా బ్యాలెన్స్డ్ పోర్ట్‌ఫోలియోపై దృష్టిసారిస్తున్నాం. కేవలం ఆన్లైన్లో తీసుకునేలా ఏమైనా కొత్త బీమా పథకాలను ప్రవేశపెడుతున్నారా? ప్రత్యేకంగా ఎటువంటి ఆన్లైన్ పథకాలనూ ప్రవేశపెట్టడం లేదు. కాని అన్ని పథకాలనూ ఆన్లైన్లో తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఆన్లైన్ ద్వారా తీసుకునే పాలసీలపై ఏజెంట్లకు కమీషన్లు చెల్లించాల్సి ఉండదు కాబట్టి ఆ మేరకు ప్రీమియం భారం తగ్గుతుంది. కాని ప్రస్తుతం సరళిని చూస్తే పాలసీ వివరాలను తెలుసుకోవడానికి ఆన్లైన్ ఉపయోగించి, ఆఫ్‌లైన్‌లో పాలసీలు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. పాలసీ తీసుకునే సమయంలో ఏజెంట్ సహాయం కావాలనుకోవడం దీనికి ప్రధాన కారణంగా గమనించాం. అలాగే రెన్యువల్ ప్రీమియంలు ఆన్లైన్ ద్వారా చెల్లించే వారి సంఖ్యలో 30 శాతానికిపైగా వృద్ధి నమోదవుతోంది. యులిప్ ఫండ్స్ మార్చుకోవడం, చిరునామా మార్పు వంటి సేవలన్నీ ఆన్లైన్లో అందిస్తున్నాం. బ్యాంకులు కేవలం ఒక బీమా కంపెనీ పథకాలనే కాకుండా అన్ని బీమా కంపెనీలు పథకాలూ అమ్మేలా ఐఆర్డీఏ విడుదల చేసిన మార్గదర్శకాల సంగతి? మొత్తం వ్యాపారంలో 55 శాతం వరకు బ్యాంకుల నుంచే వస్తోంది. దేశవ్యాప్తంగా 100కిపైగా బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. బ్యాంకులను బ్రోకర్లుగా మారిస్తే మా వ్యాపారం మరింత వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. వ్యాపారం సన్నగిల్లడంతో కొన్ని బీమా కంపెనీలు శాఖల సం ఖ్యను తగ్గించుకుంటున్నాయి? బజాజ్ అలయంజ్ పరిస్థితేంటి? గతంలో ఒకే పట్టణంలో నాలుగైదు శాఖలను ఏర్పాటు చేసిన బీమా కంపెనీలు వ్యయ నియంత్రణలో భాగంగా వాటిని విలీనం చేస్తున్నాయి. శాఖలను పునర్ వ్యవస్థీకరించడం తప్ప పూర్తిగా మూసేయడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 773 శాఖలు ఉన్నాయి. తగినన్ని శాఖలు ఉండటంతో కొత్తగా ఎటువంటి విస్తరణ కార్యక్రమాల యోచన లేదు. -
పీఎస్‌యూ ఫండ్స్‌కు దూరంగా ఉండండి
మూడు నెలల కాలానికి కొంత మొత్తన్ని ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నేను 30 శాతం ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాను. లిక్విడ్ ఫండ్, షార్ట్ టెర్మ్ ఫండ్, ఫిక్స్డ్ డిపాజిట్- ఈ మూడింటిలో ఏది ఎంచుకోవాలో తెలియని డోలాయమాన పరిస్థితుల్లో ఉన్నాను. నా అంచనాల ప్రకారం.., 1.లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్(ఎస్టీసీజీ) ట్యాక్స్ 30 శాతం, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) 27 శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 2. షార్ట్‌టెర్మ్ ఇన్కమ్ ఫండ్‌లో పెట్టుబడులు పెడితే ఎస్టీసీజీ 30 శాతం, డీటీటీ 13 శాతం చెల్లించాలి. ఇక ఫిక్స్డ్ డిపాజిట్ల విషయానికొస్తే షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 30 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ మూడింటిపై ఒకే విధమైన రాబడి (8-9 శాతం)వచ్చే అవకాశాలున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ చేయడమే ఉత్తమం అంటారా? -చైతన్య ప్రసాద్, విజయవాడ పన్నులకు సంబంధించి మీ అంచనాలు కరెక్టే. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి, షార్ట్‌టెర్మ్ గెయిన్స్ ట్యాక్స్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందనే అభిప్రాయంలో మీరున్నారు. ఇది సరికాదు. మీరు కనుక గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకుంటే క్యాపిటల్ గెయిన్స్ పన్ను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. డీడీటీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక వేళ డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే డీడీటీని మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఎస్టీసీజీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే షార్ట్‌టెర్మ్ ఇన్‌కం ఫండ్‌లో డివిడెండ్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమని చెప్పవచ్చు. ఇలా చేస్తే మీరు 13 శాతం డీడీటీ మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. ఎస్బీఐ పీఎస్‌యూ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి భారీగా నష్టపోయాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? తగిన మార్గం సూచించండి? - అరవింద్, హైదరాబాద్ ప్రభుత్వ రంగంలో ఇన్వెస్ట్ చేయడమనేది సరైన ఆలోచన కాదని చెప్పవచ్చు. అనుభవమున్న ఇన్వెస్టరైతే పరిస్థితులను బట్టి తగిన మదుపువ్యూహంతో లాభాలు గడించే అవకాశాలుంటాయి. ప్రభుత్వ రంగ కంపెనీలకు సంబంధించి దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరించినా లాభాలు రావడం అరుదైన విషయమే. ప్రభుత్వం పూర్తి స్థాయి వ్యాపార కంపెనీగా వ్యవహరించలేకపోవడమే దీనికి ప్రధాన కారణం.. డివిడెండ్లు, సబ్సిడీల రూపంలో పీఎస్‌యూల నుంచి వీలైనంత నిధులను పిండుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుంటే, ఒక ప్రత్యేకమైన పీఎస్‌యూ ఫండ్ ఉత్తమమైనదా? అధమమైనదా? అని ఇన్వెస్టర్లు ఆలోచించడం అనవసరం. మొత్తం మీద పీఎస్‌యూ స్టాక్స్ దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుకూలమైనవి కావని చెప్పవచ్చు. అందుకని పీఎస్‌యూ ఫండ్స్‌కు దూరంగా ఉండడమే మేలు.. నిలకడైన రాబడులతో భారీ నిధిని ఏర్పాటు చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా డెట్ ఫండ్‌లో సిప్ విధానంలో 5 నుంచి 10 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను? అలా అయితే ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారు? - ప్రీతి, విశాఖపట్టణం, నిలకడైన రాబడుల కోసం సిప్ విధానంలో డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం మంచి నిర్ణయమే. అయితే పదేళ్ల కాలానికి సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడానికి డెట్ ఫండ్స్ కంటే ఈక్విటీ ఫండ్స్ ఉత్తమం. ఉదాహరణకు మీరొక డెట్ఫండ్లో పదేళ్ల పాటు సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, మీకు 8.86 శాతం వార్షిక రాబడులు వస్తాయి. ఇదే లార్జ్‌క్యాప్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీకు 15.25 శాతం వార్షిక రాబడులు వచ్చే అవకాశాలున్నాయి. మీరు రిస్క్‌ను ఏమాత్రం భరించలేని వారైతే, మంచి రేటింగ్ ఉన్న డైనమిక్ బాండ్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టండి. వడ్డీరేట్లను బట్టి వివిధ మెచ్యూరిటీ కాల వ్యవధులున్న డెట్ ఇన్స్ట్రుమెంట్స్ల్లో ఈ ఫండ్స్ పెట్టుబడులు పెడతాయి. కొంచెం రిస్క్ తీసుకోగలిగితే, హైబ్రిడ్ లేదా బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. లార్జ్ క్యాప్ ఫండ్స్‌తో పోల్చితే వీటిల్లో కొంచెం రిస్క్ తక్కువ. మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఏడేళ్ల కాలానికి 11.3 శాతం వార్షిక రాబడిని ఇస్తాయి. -
చిన్నపాటి అలక్ష్యం...ప్రాణాలు ఫణం
ప్రమాదం అంచున ప్రయాణాలు నిత్యం రక్తమోడుతున్న రోడ్లు మొక్కుబడిగా రహదారి భద్రతా వారోత్సవాలు ప్రయాణికులను వదిలి పాఠశాల్లో అవగాహనా! చిన్నపాటి అజాగ్రత్త పెను ప్రమాదానికి దారితీస్తోంది.. ఏమవుతుందిలే అనే అలక్ష్యం నిండు ప్రాణాలను కబళిస్తోంది.. తొందరగా గమ్యానికి చేరాలన్న ఆతృత కాటికి తీసుకుపోతోంది.. అన్నీ తెలిసినా నిత్యం ప్రమాదం అంచునే మనిషి ప్రయాణం సాగుతోంది.. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక పొరపాటు నిండు జీవితానికి గ్రహపాటుగా మారుతున్న వైనంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సి ఉంది.. ఈ దిశగా ఇటీవల చేపట్టిన రోడ్డు భద్రతా వారోత్సవాలు దోహదం చేస్తాయా అంటే అవీ మొక్కుబడి తంతుగానే సాగుతున్నాయి. సాక్షి, మచిలీపట్నం/ నందిగామ రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ నెల 20 నుంచి 26 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్న రవాణా శాఖ అధికారులు మొక్కుబడిగా ఈ తంతు నిర్వహిస్తున్నారు. ప్రమాదాలకు కారణమైన కీలక విషయాలపై వారు దృష్టి సారించటం లేదు. ప్రమాదాల నివారణ కోసం వాహనచోదకులు, ప్రయాణికుల్లో చైతన్యం నింపాల్సి ఉండగా, పాఠశాల విద్యార్థులతో ర్యాలీలు, ప్రమాదానికి గురైన ఒక కారును నమూనాగా ఊరేగించడం, ప్రమాదాల కారణాలను విద్యార్థులకు వివరించడంతో సరిపెడుతున్నారు. విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన మంచిదే అయినా కీలకమైన ప్రాంతాల్లో ప్రమాద కారణాలు గుర్తించి వాటిపై అవగాహన పెంచే ప్రయత్నం మాత్రం జరగడంలేదు. ప్రమాదం అంచున ప్రయాణాలు... గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే ద్విచక్ర వాహన చోదకులు, ఆటోలపై ప్రయాణం చేసేవారు నిత్యం ప్రమాదం అంచునే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ద్విచక్ర వాహనంపై నలుగురు ప్రయాణించటం, బైక్‌లపైనా అధిక బరువు (లగేజీ)తో ప్రయాణాలు కొనసాగించడం తరచూ కనిపిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకపోవడం నిత్యకృత్యమైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు నిత్యం ఆటోలు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఆటోవాలాలు ఆదాయం కోసం పరిమితి కంటే ఎక్కువ మందిని ఎక్కిస్తున్నారు. నలుగురు ఎక్కి ప్రయాణం చేయాల్సిన ఆటోలో ఏకంగా 30 మందిని కూడా ఎక్కిస్తున్నారంటే ఎంత ప్రమాదకర స్థితిలో ప్రయాణాలు సాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సమయానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండకపోవడం వల్లే ఆటోల్లో కిక్కిరిసిన ప్రయాణం చేస్తున్నామనేది పలువురి వాదన. ఇటువంటి వారికి రవాణా శాఖాధికారులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాల్సి ఉంది. చివరకు వారోత్సవాల్లో కూడా మొక్కుబడిగా ట్రాఫిక్ నిబంధనలపై ప్రచారం నిర్వహిస్తూ రవాణా శాఖాధికారులు చేతులు దులుపుకుంటున్నారు. గతంలో జరిగిన పలు పెద్ద ప్రమాదాలను వీడియోల రూపంలో చిత్రీకరించి వాటిని గ్రామీణ ప్రాంతాల్లో తరచూ ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తే కొంతమేర ప్రమాదాలను అదుపుచేయవచ్చని పలువురు పేర్కొంటున్నారు. నెత్తురోడుతున్న రోడ్లు.. జిల్లాలో గత ఏడాది కాలంలో పరిశీలిస్తే రోడ్లు నెత్తురోడాయి. గత ఏడాది ఆరంభం రోజునే గుడివాడ, మక్కపేట, కేసరపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. 2013 జనవరి 8న నూజివీడు, జి.కొండూరు, కలిదిండి ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. భోగి రోజైన జనవరి 13న వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు చనిపోయారు. జనవరి 15న వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఉయ్యూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, ఆగిరిపల్లి ప్రాంతాల్లో ఐదుగురు మృతి చెందారు. జనవరి 25న విజయవాడ, కంభంపాడు, భీమవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. మార్చి 3న తోట్లవల్లూరు, ఎ.కొండూరు, కంకిపాడు మండలాల్లో రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. మార్చి 26న విస్సన్నపేట, కలిదిండిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతన పడ్డారు. మే 21న ఉంగుటూరు, కంచికచర్ల, జగ్గయ్యపేట, మచిలీపట్నం రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. జూలై 6న ఉంగుటూరు, ముదినేపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. జూలై 7న మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుడివాడకు చెందిన లారీ డ్రైవర్, క్లీనర్ బత్తుల లక్ష్మణరావు, గుమ్మిడి ప్రతాప్‌లు ఇద్దరు మృతి చెందారు. జూలై 15న గుడివాడ, కంచికచర్ల, హనుమాన్‌జంక్షన్ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. జూలై 20న పామర్రు మండలం కనుమూరు చెక్‌పోస్టు వద్ద లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో ఏఎస్సై ఎంవీవీ ప్రసాద్ (54) దుర్మరణం చెందారు. సెప్టెంబర్ 8న కలిదిండి, కంచికచర్ల, జగ్గయ్యపేట ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. సెప్టెంబర్ 22న పెనమలూరు, కైకలూరు ప్రాంతాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. నవంబర్ 9న కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, నూజివీడు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే తొందరగా గమ్యం చేరాలనే ఆతృత, నిర్లక్ష్యపు డ్రైవింగ్, అలక్ష్యం తదితర కారణాలతో ఎన్నో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇటువంటి ప్రమాదాలను నిలువరించేందుకు ప్రజల్లో మరింత ఆవగాహన అవసరం. -
56 చమురు-గ్యాస్ బ్లాక్‌ల వేలం
న్యూఢిల్లీ: భారత్‌లో మళ్లీ పెద్దయెత్తున చమురు-గ్యాస్ బ్లాక్‌ల వేలానికి రంగం సిద్ధమైంది. కొత్త అన్వేషణ లెసైన్సింగ్ విధానం పదో విడత(నెల్ప్-10)లో కనీసం 56 బ్లాక్‌లను వేలం వేయనున్నట్లు పెట్రోలియం శాఖ కార్యదర్శి వివేక్ రే సోమవారమిక్కడ వెల్లడించారు. వచ్చే వారంలో జరగనున్న పెట్రోటెక్ సదస్సులో ఈ క్షేత్రాలకు సంబంధించిన వివరాలను తెలియజేయనున్నామని చెప్పారు. అయితే, వేలంలో బిడ్లకు ఆహ్వాన నోటీసులను ఫిబ్రవరి నెలలో జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రంగరాజన్ కమిటీ సిఫార్సుల మేరకే... చమురు-గ్యాస్ బ్లాక్‌ల కాంట్రాక్టుల విషయంలో సమూలంగా మార్పులు చేసిన నిబంధనలతో ఈ నెల్ప్-10 వేలం ప్రక్రియను చేపడుతున్నట్లు వివేక్ తెలిపారు. ప్రధానంగా ఉత్పత్తి ప్రారంభించిన రోజునుంచే సంబంధిత చమురు-గ్యాస్ బ్లాక్‌ల నుంచి ఎంతపరిమాణంలో ప్రభుత్వానికి ఉత్పత్తిలో ఎంత వాటాను ఆఫర్ చేయనున్నారనేది వేలంలో పాల్గొనే కంపెనీలు తమ బిడ్డింగ్‌లో తెలియజేయాల్సి ఉంటుంది. అత్యధిక మొత్తంలో చమురు-గ్యాస్ ఉత్పత్తి వాటాను ఆఫర్ చేసే కంపెనీకే బిడ్డింగ్‌లో బ్లాక్‌లు దక్కుతాయని వివేక్ రే వివరించారు. భవిష్యత్తులో చమురు-గ్యాస్ బ్లాక్‌ల కాంట్రాక్టులను అప్పగించే విషయంలో ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ సి. రంగరాజన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకే ఈ కొత్త నిబంధనలను రూపొందించారు. కాగా, ఇప్పటిదాకా జరిగిన మొత్తం 9 విడతల నెల్ప్ బిడ్డింగ్‌లలో 254 బ్లాక్‌లను వివిధ కంపెనీలకు కేంద్రం కేటాయించింది. కాగ్ అక్షింతల ప్రభావం... ప్రస్తుత నిబంధనల ప్రకారం చమురు కంపెనీలు ప్రభుత్వంతో లాభాలను పంచుకోవడానికి ముందే తమ అన్వేషణ, ఉత్పాదక వ్యయాలను రికవరీ చేసుకునే వీలుంది. అయితే ఈ నిబంధనల వల్ల కంపెనీలు తమ పెట్టుబడి వ్యయాలను భారీగా పెంచుకునేలా దారితీస్తోందని, ప్రభుత్వానికి రావాల్సిన లాభాల పంపకంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) కేజీ-డీ6 క్షేత్రాల్లో ఆడిటింగ్ సందర్భంగా పెట్టుబడి వ్యయాలను భారీగా పెంచిచూపిందని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందంటూ కాగ్ తేల్చిచెప్పింది కూడా. ఈ పరిణామాల నేపథ్యంలోనే కాంట్రాక్టు నిబంధనల్లో మార్పులకు పెట్రోలియం శాఖ నడుం బిగించింది. పారదర్శకత పెరుగుతుంది... ‘ఇక నుంచి ఉత్పత్తి పంపకం విధానాన్ని కాకుండా ఆదాయాల పంపకం విధానాన్ని అవలంభించాలని మేం ప్రతిపాదిస్తున్నాం. దీనివల్ల ఆదాయాలను ముందే రికవరీ చేసుకోవడం, పెట్టుబడులను పెంచిచూపడం వంటి అంశాలకు ఇక తావుండదు. నెల్ప్-10 నుంచే ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు త్వరలో కేబినెట్ ఆమోదముద్ర కోసం మేం కసరత్తు మొదలుపెట్టాం’ అని వివేక్ వెల్లడించారు. ఈ ఉత్పత్తి ఆధారిత చెల్లింపుల విధానం వల్ల మరింత పారదర్శకతతో పాటు కంపెనీల అన్వేషణ, అభివృద్ధి కార్యకలాపాల్లో తమ జోక్యం కూడా తగ్గుముఖం పట్టేందుకు దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ విధానాన్ని కొన్ని కంపెనీలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. కొత్త నిబంధనల ఖరారుపై కేబినెట్‌దే తుది నిర్ణయమని వివేక్ పేర్కొన్నారు. -
క్విప్ ఇష్యూలకు బ్యాంకులు రెడీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలు స్టేట్‌బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ సహా పలు బ్యాంకులు అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)ని చేపట్టనున్నాయి. తద్వారా రూ. 15,000 కోట్లకుపైగా పెట్టుబడులను సమీకరించాలని భావిస్తున్నాయి. క్విప్ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధపడుతున్న జాబితాలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ), దేనా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ సైతం ఉన్నాయి. ఈ బాటలో మరికొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు నిధుల సమీకరణకు వీలుగా ఆయా బోర్డుల అనుమతిని కోరనున్నాయి. రానున్న జనవరి-మార్చి క్వార్టర్లో క్విప్ ద్వారా స్టేట్‌బ్యాంక్ రూ. 9,576 కోట్లను సమీకరించాలని ప్రణాళికలు వేసింది. ఇందుకు ఇప్పటికే ప్రభుత్వ అనుమతిని కూడా పొందింది. ఇక ఐడీబీఐ బ్యాంక్ రూ. 1,200 కోట్లను, దేనా బ్యాంక్ రూ. 800 కోట్లను సమీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే విధంగా షేర్ల అమ్మకం ద్వారా ఐవోబీ రూ. 350 కోట్లు, అలహాబాద్ బ్యాంక్ రూ. 320 కోట్లను అందుకోవాలని చూస్తున్నాయి. కాగా, 2013లో క్విప్‌ల ద్వారా దేశీయ కంపెనీలు రూ. 12,000 కోట్లను సమీకరించాయి.