నేను ప్రెగ్నెంట్‌ని. ఇప్పుడు మూడో నెల. రక్త హీనత ఉందని నాకు మాత్రలు ఇచ్చారు. దీనివల్ల బిడ్డకు ఏదైనా ప్రమాదం ఉంటుందా?
– ప్రమోద, నెల్లూరు
హీమోగ్లోబిన్ పదకొండు గ్రాముల కన్నా తక్కువ ఉన్నప్పుడు మొదటి మూడు నెలల్లోనే ట్రీట్‌మెంట్ ఇవ్వాలి. ఏడవ నెల నుంచి ప్రసవం వరకు కనీసం 10.5గ్రాములు ఉండాలి. ఇది బ్రిటిష్ కమిటీ ఫర్ స్టాండర్డ్ ఇన్ హెమటాలజీ గైడ్‌లైన్స్ ప్రకారం ప్రెగ్నెన్సీ.. ప్రసవంలో కూడా ఫాలో కావాలి.
ప్రసవం తరువాత పది గ్రాముల కన్నా తక్కువ ఉంటే కచ్చితంగా మాత్రలు ఇవ్వాల్సిందే. రక్తహీనత వల్ల ప్రెగ్నెన్సీ సమయంలోనే కాదు ప్రసవం తర్వాతా చాలా సమస్యలు వస్తాయి. ఓరల్ థెరపీ అంటే ఓరల్ ఐరన్ మాత్రలను ముందుగా రెండువారాల పాటు ఇస్తారు. వాటితో హిమోగ్లోబిన్ కనుక పెరిగితే తర్వాత మాత్రలను వాడాల్సిన అవసరం ఉండదు.
ప్రెగ్నెన్సీలో అందరికీ 28 వారాలకు సీబీపీ .. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ రక్త పరీక్ష చేయాలి. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీకి హీమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫొరీసస్ అనే రక్తపరీక్షనూ తప్పకుండా చేయించాలి. ఈ టెస్ట్ ద్వారా పుట్టుకతో వచ్చే జెనెటిక్ సమస్యలు సికిల్ సెల్ అనీమియా, తలసీమియావంటి వ్యాధులను.. క్యారియర్ స్టేటస్‌ని కనిపెట్టవచ్చు. ఈ వ్యాధులు/క్యారియర్స్‌గా ఉన్నవారికి ఓరల్ థెరపీతో, డైట్‌తోనే మేనేజ్ చేయాల్సి ఉంటుంది.
అలా తీసుకుంటేనే అసిడిటీ సమస్యలు తగ్గుతాయి
ఐరన్ పెరగడానికి ఇంజెక్షన్ ఇవ్వకూడదు. అలాచేస్తే వాళ్లకు ఐరన్ ఓవర్‌లోడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే మీకు ఆ బ్లడ్ టెస్ట్ చేసి చికిత్స మొదలుపెట్టటం మంచిది. ఈ వైద్య పరీక్షలో కేవలం ఐరన్ లోపం మాత్రమే ఉందని తేలితే అప్పుడు ఐరన్ స్టడీస్ చేస్తారు. సరైన ప్రిపరేషన్‌తో చికిత్స చేస్తే ఈ ఐరన్ లోపం సమస్య త్వరగా తగ్గిపోతుంది. ఈ ఐరన్ మాత్రలను విటమిన్ సీతో గానీ, సిట్రస్ ఫ్రూట్ జ్యూసెస్‌తో గానీ తీసుకుంటే ఆ మాత్రలను శరీరం త్వరగా గ్రహిస్తుంది. అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. ఐవీ ఐరన్ ఇంజెక్షన్స్ కూడా పనిచేస్తాయి.
కొంతమందికి కిడ్నీ పరీక్షలనూ సూచిస్తారు. రేనల్ అనీమియా అనేదాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో హీమోగ్లోబిన్ 8 గ్రాముల కంటే తక్కువగా ఉంటే పేషంట్ పరిస్థితిని బట్టి బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఇస్తాం. మొదటి మూడునెలల్లో హీమోగ్లోబిన్ పదకొండు గ్రాముల కన్నా తక్కువగా ఉంటే హెమటాలజిస్ట్ / ఫిజీషియన్‌ను సంప్రదించి డైట్, ఐరన్ మాత్రలతో చికిత్స మొదలుపెట్టడం వల్ల ఇటు బిడ్డకు, అటు తల్లికి వచ్చే సమస్యలను నివారించగలుగుతాం.
తలనొప్పి, శ్వాస ఆకడపోవడం..
అనీమియాతో బాధపడుతున్న తల్లిలో.. నీరసం, పాల్పిటేషన్స్, తలనొప్పి.. వంటివి ఎక్కువ. శ్వాస ఆడకపోవడం.. కాళ్ల వాపులూ రావచ్చు. బిడ్డ పుట్టిన తరువాత హీమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండొచ్చు. ప్రసవం తరువాత పాస్ట్‌పార్టమ్ హేమరేజ్, అబ్‌రప్షన్ చాన్సెస్ పెరుగుతాయి. అందుకే రక్తహీనతను గుర్తించిన వెంటనే దానికి చికిత్సను అందించాలి. మాత్రలు ఇవ్వాలి. ఒకవేళ దద్దుర్లు వంటి రియాక్షన్ ఏదైనా వస్తే వేరే ప్రిపోజిషన్‌ని ప్రయత్నించాలి. ఇలా రక్తహీనతకు తగిన చికిత్సతో తల్లి ఆరోగ్యాన్ని కాపాడ్డమే కాదు పండంటి బిడ్డనూ కనొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment