pills
-
అబార్షన్ మాత్రలను ఎగబడి కొంటున్నారు.. ఎందుకంటే?
-
బరువు తగ్గాలని ఆ పిల్స్ తీసుకుంది, నరకం చూసింది!
బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేసి, ఫలితం దక్కక విసిగిపోతూ ఉంటారు చాలామంది. క్రమ తప్పని ఆహార నియమాలు, వ్యాయాంతో బరువు తగ్గడం సులభమే. అయితే ఈ ప్రక్రియ అందరికీ ఒకేలా ఉండదు. వారి శారీరక లక్షణాలు, శరీరతత్వాన్ని బట్టి సుదీర్ఘ కాలం పాటు ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది. అంతేగానీ విపరీత ధోరణులకు పోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. ఈ విచిత్రమైన కేసు గురించి తెలిస్తే.. గుండె గుభేలు మంటుంది.అమెరికాకు చెందిన కేన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ బెర్నార్డ్ హ్సు అందించిన కేస్‌స్టడీ వివరాల ప్రకారం ఒక మహిళ బరువు తగ్గించుకోవాలనే ఆరాటంలో టేప్‌వార్మ్ టాబ్లెట్లను వాడింది. ఫలితంగా బరువు తగ్గడం మాటేమో గానీ శరీరమంతా పురుగులు చేరి సర్వనాశనం చేశాయి. దీంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది, జ్ఞాపకశక్తిని కోల్పోయింది.ఆహారం ,వ్యాయామ నియమాలతో బరువు తగ్గడానికి చాలా కష్టాలు పడింది అయోవాకు చెందిన 21 ఏళ్ల యువతి. ఈ క్రమంలో టేప్‌వార్మ్ గుడ్లతో నిండిన మందులను వాడటం ద్వారా వేగంగా బరువు తగ్గవచ్చని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకొని క్రిప్టోకరెన్సీ సహాయంతో ఆ టాబ్లెట్లను కొనుగోలు చేసింది. మొదట్లో రెండు టేప్‌వార్మ్ మాత్రలు వేసుకుంది. అనుకున్నట్టుగా బరువు తగ్గడంలో కడుపులో నొప్పి, ఉబ్బరం లాంటి ఇబ్బందులొచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. ఒక వింత బాత్రూమ్ సంఘటన తర్వాత షాక్‌కు గురైంది. చెంపల మీద ఎవరో కొడుతున్నట్టు, చప్పట్లు కొట్టినట్టు శబ్దాలు వినబడ్డాయి. ప్లష్ చేయ బోతున్నపుడు నల్లగా, ముద్దలు ముద్దలుగా ఏవో పాకుతూ బయటకు రావడం చూసింది. (మనవడితో దాండియా స్టెప్పులేసిన నీతా అంబానీ, ఆ స్టార్ కిడ్ కూడా!)ఇక ఆత రువాత కొద్ది రోజుల్లోనే, గడ్డం కింద అసాధారణమైన గడ్డ వచ్చింది. దీంతోపాటు తీవ్రమైన తలనొప్పి , ఒత్తిడి వంటి మరికొన్ని లక్షణాలు కనిపించాయి. ఇది భరించలేక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేయించుకుంది. అది నెగెటివ్ వచ్చింది. కానీ ఉన్నట్టుండి, మతిమరుపు వచ్చింది.. ఒక గంట ముందు ఏం జరిగిందో కూడా గుర్తులేకుండాపోయింది. చివరికి వైద్యులను ఆశ్రయించింది. ఆమె మెదడు ,శరీరంలోని ఇతర భాగాలలో - నాలుక ,కాలేయంతో సహా పలు గాయాలను వైద్యులు గుర్తించారు. చివరికి తన డేంజరస్ డైట్ ను బయటపెట్టింది. TE అనే రెండు రకాల పరాన్నజీవుల (టేనియా సాగినాటా, టేనియా సోలియం) గుడ్లు రక్తంలోకి చేరి ఇన్ఫెక్షన్కు కారణమైనట్లు కనుగొన్నారు. చికిత్స అందించి ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. (Age is just a number 64 ఏళ్ల వయసులోఎంబీబీఎస్ : రిటైర్డ్ ఉద్యోగి సక్సెస్ స్టోరీ) బరువు తగ్గడానికి టేప్‌వార్మ్ గుడ్లను తీసుకోవడం అనే ఈ విచిత్రమైన పద్ధతి విక్టోరియన్ ఎరాలో వాడేవారట. ఈ పద్ధతి ఎంత సాధారణంగా ఉపయోగించారనేది అస్పష్టమని డాక్టర్ బెర్నార్డ్ వెల్లడించారు. ఇలాంటి పద్ధతుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.టేప్‌వార్మ్ ఎంత ప్రమాదకరం?పరాన్నజీవులు తమ గుడ్లను తెలియకుండానే ఉడకని మాంస ఉత్పత్తుల ద్వారా శరీరంలోకి చేరతాయి. 30 అడుగుల పొడవు పెరుగుతాయి,పేగుల్లో వీపరీతంగా గుడ్లు పెడతాయి. ఇవి శరీరంలోని పోషకాలను తినేస్తాయి. తద్వారా బరువు తగ్గిపోతారు. టేప్వార్మ్తో మరో అతి పెద్ద ప్రమాదం ఏమిటంటే, అవి ఎక్కడ అతుక్కుపోయాయో గుర్తించడం కష్టం. జీర్ణాశయం వెలుపల ఉన్న ఇతర అవయవాలకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి.కలుషిత, సరిగ్గా ఉడకని మాంసాహారం ద్వారా కడుపులో పెరిగే ఈ పురుగులను గ్యాస్ట్రిక్ వార్మ్స్ అని కూడా అంటారు. వీటిలో ఏలిక పాములు (రౌండ్ వార్మ్స్), పట్టీ పురుగులు (ఫ్లాట్ వార్మ్స్), నారికురుపు పురుగులు (టేప్ వార్మ్స్) అనే రకాలు ఉంటాయి. వీటిలో ఒక్కొక్కటి ఒక్కో రకమైన లక్షణాలతో వ్యాపిస్తాయి. టేప్‌వార్మ్ లక్షణాలుఅతిసారంతీవ్రమైన కడుపునొప్పివికారంబలహీనతజ్వరంబాక్టీరియల్ ఇన్ఫెక్షన్లునరాల సమస్యలు -
బాబు.. ఓ ‘పిల్స్’ ఫ్యాక్టరీ..
సాక్షి, అమరావతి: చంద్రబాబు వందలాది తప్పుడు కేసులు పెట్టించి రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి అడుగడుగునా అడ్డుతగులుతున్నారని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ‘పిల్స్’ (ప్రజాప్రయోజన వ్యాజ్యాలు) ఫ్యాక్టరీని నడుపుతూ దేశంలో ఏ ప్రభుత్వంపైనా లేనన్ని కేసులు ఈ అభివృద్ధి నిరోధక శక్తులు వేశాయని, వారు తమ స్వార్థం కోసం ప్రజాహిత వ్యాజ్యాన్ని కూడా దు ర్వినియోగపరుస్తున్నారని వారు దుయ్యబట్టారు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా రాష్ట్రానికి కరోనా వైరస్ కన్నా ప్రమాదకరంగా మారారని ఆరోపించారు. ‘జగన్ పాలన–న్యాయవాదుల స్పందన’ అంశంపై ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొన్న న్యాయవాదులు తమ అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధిపై ఆంధ్రా అడ్వకేట్స్ ఫోరం రూపొందించిన నివేదిక ముఖ్యాంశాల పోస్టర్లను అవిష్కరించిన అనంతరం వారు తమ మాట్లాడారు. ఎవరెవరు ఏమన్నారంటే.. చంద్రబాబు ఫ్యాక్టరీ నుంచే ‘పిల్స్’.. న్యాయ వ్యవస్థలోని కొందరు కక్షపూరితంగా వ్యవరించారు. జస్టిస్ రాకేష్‌కుమార్ పదవీ విరమణచేసే రోజు జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ, తర్వాత అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో ఉన్న ఆయనపై ఆరోపణలు రావడంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అలాగే, జగన్‌పై ఇబ్బందికర వ్యాఖ్యలు చేసిన జస్టిస్ బట్టు దేవానంద్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మందలించారు. చంద్రబాబు ఒక ‘పిల్ ఫ్యాక్టరీ’ని తయారుచేసి జగన్ ప్రభుత్వంపై సొంత ఖర్చులతో పిల్స్ వేయిస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వం అవన్నీ తట్టుకుంటూ ముందుకెళ్లడం అభినందనీయం. – వీవీఆర్ కృష్ణంరాజు, అధ్యక్షుడు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ వారికి స్థలాలిచ్చి బీసీలకు ఇవ్వకుండా కోర్టు స్టేనా!? అమరావతిలో బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టు స్టే ఇచ్చింది. కానీ, అదే అమరావతిలో న్యాయమూర్తులకు, బ్యూరోక్రాట్లకు స్థలాలు కేటాయించారు. ఇదేం న్యాయం? పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి సీఎం జగన్ మంచి పనిచేశారు. విదేశీ విద్య పథకంతో సామాన్యులను చదివిస్తున్నారు. 75 ఏళ్లలో ఎవరూ ఇలాంటి పనిచేయలేదు. దేశంలోనే బెస్ట్ సీఎం జగన్. – బి.అశోక్‌కుమార్, అధ్యక్షుడు, ఆంధ్ర అడ్వకేట్స్ ఫోరం కేసులు లేకపోతే మరింత అభివృద్ధి.. ఇన్ఫ్రా రంగంలో రాష్ట్రం శరవేగంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ ప్రతి పక్షాలు, ఒక వర్గం మీడియా పురోగతి ఏమీలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్విసెస్ ఇండియా లిమిటెడ్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశంలో సుమారు రూ.70 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుండగా.. అందులో రూ.6.75 లక్షల కోట్ల విలువైన పనులు ఒక్క ఏపీలోనే జరుగుతున్నాయి. అలాగే, జగన్ ప్రభుత్వంలో ఆరు ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, పది హార్బర్లు, నాలుగు పోర్టులు, మూడు ఇండ్రస్టియల్ కారిడార్లు, రెండు మేజర్ ఎయిర్‌పోర్టులు, 31 చిన్న, మధ్య తరహా పారిశ్రామిక పార్కుల నిర్మాణం జరుగుతోంది. ఇంత పెద్దఎత్తున ఇన్ఫ్రా డెవలప్మెంట్ మరే రాష్ట్రంలోనూ జరగడంలేదు. – వెంకట్ మేడపాటి, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ.. ఇటీవల ప్రధాని మోదీ∙కూడా స్వార్థపూరిత ప్రజాహిత వ్యాజ్యాలపట్ల ఆందోళన వ్యక్తంచేశారు. 2023–24లో పారిశ్రామిక రంగంలో 16.36 శాతం, స ర్విస్ సెక్టార్లో 20 శాతం, వ్యవసాయ రంగంలో 13 శాతం వృద్ధిని మన రాష్ట్రం సాధించింది. కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా సుమారు రూ.20 లక్షల కోట్లు పేదలకు నేరుగా బదిలీ చేయగా, ఒక్క వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.2.60 లక్షల కోట్లు బదిలీచేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. – నారాయణమూర్తి, ఉపాధ్యక్షుడు, నవరత్నాలు అమలు కమిటీ స్వార్థశక్తుల చేతుల్లో ‘పిల్’ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తరచుగా కోర్టులు జోక్యం చేసుకోవడంవల్ల అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది. సామాన్యుల కోసం పిల్ సదుపాయం కలి్పస్తే అది స్వార్థశక్తుల చేతిలో ఆయుధంగా మారింది. అనవసరమైన కోర్టు కేసులు లేకపోతే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ఉండేది. – నరహరశెట్టి శ్రీహరి, సీనియర్ న్యాయవాది విద్యలో కేరళను దాటేస్తున్నాం.. రాష్ట్రంలో పిలిచి ఉద్యోగాలిస్తున్నారు.. పోర్టులు కడుతున్నారు.. విద్యా వ్యవస్థలో కేరళను దాటి ఏపీ మొదటి స్థానానికి వెళ్తోంది. తమ సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. పరోక్షంగా న్యాయవాదుల కుటుంబాలు బాగుపడుతున్నాయి. జూనియర్ లాయర్లకు రూ.5వేలు గతంలో ఎవరూ ఇవ్వలేదు. – ధనలక్ష్మి, న్యాయవాది ఈ సర్కారును మళ్లీ గెలిపించుకోవాలి.. విద్యావ్యవస్థలో సీఎం జగన్ ప్రక్షాళన తీసుకొచ్చారు. బడుగులు తెలుగు మీడియంలోనే చదవాలన్నట్లు గత ప్రభుత్వాలు చేశాయి. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని సీఎం జగన్ అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకోవాలి. – బి. సౌమ్య, న్యాయవాది ప్రతీ హామీని జగన్ నెరవేర్చారు.. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీనీ సీఎం జగన్ నెరవేర్చారు. లాయర్లు, ఆటోడ్రైవర్ల దగ్గర్నుంచి పారిశ్రామికవేత్తల వరకూ, అన్ని వర్గాల వారికీ ఆరి్థక చేయూతనిస్తున్నారు. అలాంటి సీఎంను మళ్లీ మనందరం మద్దతిచ్చి గెలిపించుకోవాలి. – ఉషాజ్యోతి, న్యాయవాది సంక్షేమ పాలనను లాయర్లు అందరికీ చెప్పాలి.. రాష్ట్రంలో సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ పాలన గురించి న్యాయవాదులు తమ వద్దకు వచి్చన ప్రతి ఒక్కరికీ చెప్పి, వాళ్లకు జరిగిన మేలు గురించి గుర్తుచేయాలి. వారి ద్వారా ప్రజలందరికీ తెలిసేలా చేయాలి. – జంగా జయలక్ష్మి, సీనియర్ న్యాయవాది లాయర్లకు జగన్ తప్ప ఎవరూ మంచి చేయలేదు.. గతంలో న్యాయవాదులను వాడుకోవడం తప్ప ఏ ప్రభుత్వం మంచి చేయలేదు. జగన్ సీఎం అయ్యాక రూ.100 కోట్లు ఇస్తామన్నారు. అన్నట్లుగానే ఇచ్చారు. నవరత్నాలు అనే పదాన్ని ఎక్కడ చదివారోగానీ ఆ పేరుతో అందరికీ మంచి చేస్తున్నారు. అవి నిలబడాలంటే జగన్ మళ్లీ గెలవాలి. – రమణి, సీనియర్ న్యాయవాది మళ్లీ టీడీపీ బానిసత్వంలోకి వెళ్లొద్దు.. పధా్నలుగు సంవత్సరాల వనవాసం నుంచి బయటకు వచ్చినట్లుంది జగన్ పాలన. మళ్లీ టీడీపీ బానిసత్వంలోకి వెళ్లకుండా ఉండాలంటే న్యాయవాదులంతా కలిసికట్టుగా ఉండాలి. రాష్ట్రంలో చెడ్డ వారంతా చంద్రబాబుకి మద్దతిస్తున్నారు. మంచివాళ్లు జగన్‌ని కోరుకుంటున్నారు. – జీవనజ్యోతి, న్యాయవాది రాష్ట్రంలో అద్భుత ప్రగతి.. జగన్ ప్రభుత్వం ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే వెంటనే కేసులు వేసి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారు. ప్రజాహిత వ్యాజ్యం అనేది సామాన్యుల న్యాయం కోసం రూపొందిస్తే వాటిని పెత్తందారులు హస్తగతం చేసుకున్నారు. 24 నెలల కరోనా కాలం తర్వాత మిగిలిన మూడేళ్లలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించింది. 2023–24లో 17 శాతం స్ధూల జాతీయోత్పత్తి వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్ధానంలో ఉంది. – చిన్నం రామకృష్ణ, న్యాయవాది -
ఐవీఎఫ్ హార్మోన్ల బదులు అబార్షన్ బిళ్లలిచ్చారు!
న్యూయార్క్: వైద్యపరమైన నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ ఉదంతం. అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో సంతానం కోసం ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించిన తమికా థామస్ అనే మహిళకు మెడికల్ షాపు ఐవీఎఫ్ హార్మోన్ల బదులు పొరపాటున అబార్షన్ మాత్రలు ఇచి్చంది. ఏకంగా ఇద్దరు గర్భస్థ శిశువుల మరణానికి కారణమైంది! పుట్టబోయే బిడ్డలను పొట్టన పెట్టుకున్నారంటూ మెడికల్ షాప్‌పై ఆమె స్టేట్ బోర్డ్ ఆఫ్ ఫార్మసీకి ఫిర్యాదు చేసింది. ప్రిస్క్రిప్షన్‌లోని డాక్టర్ చేతిరాత అర్థం కాకపోవడం ఈ దారుణ పొరపాటుకు దారి తీసినట్టు విచారణలో తేలింది. ‘షాపు సిబ్బంది తప్పు మీద తప్పు చేశారు. ఆ రాతను తమకు తోచినట్టుగా అర్థం చేసుకుని ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. పైగా తాము ఏం మందులు ఇస్తున్నదీ, వాటివల్ల ఏం జరుగుతుందన్నది విధిగా చెప్పాల్సి ఉండగా ఆ పని కూడా చేయలేదు’అని బోర్డు తేలి్చంది. మెడికల్ షాప్‌కు పది వేల డాలర్ల జరిమానా విధించింది. కానీ దీనివల్ల పుట్టక ముందే కన్ను మూసిన తమ బిడ్డలు తిరిగొస్తారా అంటూ థామస్ దంపతులు విలపిస్తున్నారు. వారికి నలుగురు సంతానం. పెద్ద కుటుంబం కావాలనే కోరికతో మళ్లీ పిల్లలను కనాలని నిర్ణయించుకుని ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించారు. -
నేటి నుంచి మిషన్ ఇంద్రధనుస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి చిన్నారికి వ్యాధి నిరోధక టీకాలు వేయడమే లక్ష్యంగా మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. ప్రతినెలా ఆరు రోజుల చొప్పున మూడునెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆదివారం ‘సాక్షి’తో ఆమె ప్రత్యేకంగా మిషన్ ఇంద్రధనస్సు, నులిపురుగుల మాత్రల పంపిణీపై మాట్లాడారు. మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం ఈ నెల 7 నుంచి 12వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు తెలిపారు. మరలా సెప్టెంబర్ 11 నుంచి 16వ తేదీ వరకూ, అక్టోబర్ 9 నుంచి 14వ తేదీ వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే నిర్వహించిన సర్వేలో వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోని చిన్నారులు 3,009 మందిని గుర్తించామన్నారు. వారితో పాటు ఇంకా వ్యాధినిరోధక టీకాలు వేయించుకోని వారు ఉంటే వారికి కూడా వేయనున్నట్లు తెలిపారు. అందుకోసం జిల్లాలో 422 సెçషన్స్(స్థలాలు)ను ఎంపిక చేసి వ్యాక్సినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం చివరికి మీజిల్స్–రూబెల్లా నిర్మూలనకు లక్ష్యాల ఏర్పాటులో భాగంగా మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని పట్టిష్టంగా అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 5.50 లక్షల ఆల్బెండాజోల్ మాత్రలు.. ఈ నెల 10న నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు(ఆల్బెండాజోల్) మింగించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. విద్యాశాఖ అధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 19 ఏళ్లులోపు ఉన్న పిల్లలకు మాత్రలు వేయనున్నట్లు తెలిపారు. మొత్తం 4,67,550 మందికి వేయాలనేది లక్ష్యం కాగా, 5.50 లక్షల మాత్రలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఆ మాత్రలను విజయవాడలోని జోనల్ కమిషనర్లు, మండలాల్లోని ఎంఈఓలు, మెడికల్ ఆఫీసర్ల ద్వారా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు సరఫరా చేసినట్లు తెలిపారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా నులిపురుగుల మాత్రలు వేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు ఆమె తెలిపారు. -
ఏదో ఒక కారణంతో..ఆ పిల్స్‌ని అదేపనిగా వాడుతున్నారా?!
నిద్రపట్టడం లేదు.. ఆందోళనగా ఉంది. మూడ్ బాగోలేదు.. స్ట్రెస్‌గా ఉంది. వీటన్నింటికీ మనవాళ్లు ఎంచుకుంటున్న మార్గం ‘పిల్’. ఒక మోతాదులో టాబ్లెట్ వాడితే సమస్య తగ్గిపోతుంది కదా! అనుకుంటారు. ఇది చెడు అలవాటు కాదనుకుంటారు. కానీ, ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు టాబ్లెట్ వేసుకోవడం కూడా వ్యసనమే. నేటి రోజుల్లో చాలామంది వర్క్ టెన్షన్ అనో, స్ట్రెస్ అవుతున్నామనో స్లీపింగ్ పిల్స్‌కు అలవాటు పడిపోయేవారు పెరుగుతున్నారు. వీటిని ముందుగా డాక్టర్ని కలిసి వారి సలహాతో తీసుకోవడం మొదలుపెడతారు. ఆ టాబ్లెట్ వేసుకున్న కొన్ని రోజులు బాగా అనిపించి, ఆ పాత ప్రిస్క్రిప్షన్ పైన ఆ టాబ్లెట్లను అలాగే కంటిన్యూ చేస్తుంటారు. యాంగ్జైటీ పిల్స్, స్ట్రెస్ పిల్స్, మూడ్ ఎలివేటర్స్.. ఇలా విభిన్న రకాలుగా ఉండే ఈ పిల్స్‌ను ఆందోళనగా అనిపింనప్పుడల్లా వాడతారు, క్రమేణా వాటికి అలవాటు పడిపోయి మరిన్ని సమస్యల్లోకి కూరుకుపోతున్నారు. ∙∙ వసుధ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ప్రాజెక్ట్ టీమ్ లీడర్‌గా బిజీ షెడ్యూల్ తనది. ఓ వైపు కుటుంబం, మరోవైపు ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం. కొన్నాళ్లు బాగానే మేనేజ్ చేసినా ఎదురయ్యే సమస్యలు టెన్షన్ పెట్టేవి. దీంతో ఆందోళన పెరిగిపోయేది. ఒత్తిడిని తగ్గించుకోవాలంటే బాగా నిద్రపోవాలని చెబుతుండేవారు స్నేహితులు. కానీ, ఆ ఒత్తిడి వల్లే నిద్ర పట్టడం లేదనేది వసుధ కంప్లైంట్. ఫ్రెండ్ సలహా మేరకు డాక్టర్ని కలిసింది. కొన్ని రోజులు ఆందోళన తగ్గడానికి ఒక మెడికల్ కోర్సును వాడమని చెప్పాడు డాక్టర్. ఆ కోర్స్ వాడాక తనకు చాలా రిలీఫ్‌గా అనిపింంది. ఆందోళనగా అనిపించినా, పనిభారంతో తల బరువుగా అనిపించినా అవే టాబ్లెట్స్ తెచ్చుకొని వాడటం మొదలుపెట్టింది. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు టాబ్లెట్ లేనిదే పరిష్కారం కాదు అనేంత స్థాయికి వచ్చేసింది. నిద్ర పట్టడం లేదని రాత్రిళ్లు స్లీపింగ్ పిల్స్ వేసుకునేది. కానీ, ఆఫీసుకు వెళ్లినా ఆ మత్తు ఆమెను వదిలేది కాదు. దీంతో తీసుకున్న ప్రాజెక్ట్ వర్క్స్ చేయడంలో ఆలస్యం అవుతూ ఉండేది. రోజులో ఎక్కువ సమయం మత్తుగా ఉండటంతో జాబ్ పోయే పరిస్థితి ఎదురైంది. లాయర్, డాక్టర్, ఇంజినీర్.. ప్రతీ వృత్తి, ఉద్యోగం చేస్తున్నవారిలో ఎన్నో ఆందోళనలు ఎదుర్కోవడం చూస్తున్నాం. ఈ ఆందోళన స్థాయి వారి శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో సమస్యను సాల్వ్ చేసుకోవడానికి టాబ్లెట్స్‌ను ఆశ్రయించేవారు పెరుగుతున్నారు. శరీరానికి ఏ కొద్దిగా కెమికల్‌ను బయట నుంచి అలవాటు చేసినా మైండ్ మరికొంత మోతాదు పెంచేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా కెమికల్ మోతాదు శరీరంపై చెడు ప్రభావం చూపడానికి దోహదం చేస్తాయి. సహజమే కానీ.. ఈ సమస్యను ఎదుర్కొనేవారిలో అధిక శాతం చదువుకున్నవారే. ‘ఇదేమీ చెడు అలవాటు కాదు కదా! నేను సరైన విధంగా మానేజ్ చేసుకోగలుగుతున్నాను కదా’ అనుకుంటారు. బయటి వాళ్లకు కూడా వీళ్లు ‘పిల్స్’వాడుతున్నారనే విషయం తెలియదు. కొంత కాలం బాగానే గడిచిపోతుంది. కానీ, సమస్య మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఏ వ్యక్తిలో అయినా భావోద్వేగాలు మారిపోతుండటం సహజంగా జరుగుతుంది. కొందరు మాత్రం ప్రతిదానికి ఆందోళన పడే వారుంటారు. మన వ్యక్తిత్వం ఇలాంటిది అని అర్థం చేసుకొని, ఈ సమస్యనుం బయటకు రావడానికి నిపుణులు సాయం తీసుకోవాలి. కొందరికి రకరకాల ఫోబియాలు ఉంటాయి. వీటిని అధిగమించడానికి కూడా టాబ్లెట్స్‌ని ఆశ్రయిస్తుంటారు. ఇవీ వనసిక సమస్యలే అని గుర్తించాలి. బయటపడాలంటే టెక్నిక్స్: మనకు తెలియదు కానీ, చాలామంది మహిళల పర్సులలో కొన్ని టాబ్లెట్లు ఉంటాయి. అవి, పెయిన్ కిల్లర్స్, మూడ్ స్టెబిలైజర్స్, స్ట్రెస్ పిల్స్, స్లీపింగ్ పిల్స్... వంటి వాటిలో ఏవైనా ఉండచ్చు. ముందుగా వాటిని బయట పడేయాలి. ఏ సమస్య బాధిస్తోందో దానిని కుటుంబ సభ్యుల మధ్య లేదా నిపుణుల ముందు వ్యక్తం చేయాలి. ఆ సమస్యకు సంబంధించిన బ్లాక్స్‌ను క్లియర్ చేసుకుంటే సులువుగా బయటపడచ్చు. ప్రతి ఒక్కరిలోనూ సాధారణ ఆందోళనలు ఉంటాయి. కానీ, కొంతమంది మాత్రం ప్రతి చిన్న విషయానికీ ఆందోళన పడిపోతుంటారు. ఇది కొన్నిరోజులకు పెద్ద ఆందోళనగా వరుతుంటుంది. ఆందోళన తగ్గించుకోవడానికి పిల్స్ వాడకం బదులు, దానిని అధిగమించేలా మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాలి. శరీరం కెమికల్ మీద ఎంతవరకు డిపెండ్ అయిందో గుర్తించి దానిని బ్రేక్ చేస్తాం. మైండ్‌ను రిలాక్స్‌గా ఉంచే యోగా, ధ్యానంతోపాటు సరైన పోషకాహారం మీదా దృష్టి పెట్టాలి. శరీరం బయట నుంచి తీసుకునే కెమికల్ కాకుండా సహజసిద్ధంగా మార్పులకు లోనయ్యేలా అలవాటు చేసుకున్నప్పుడు ఇంటర్నల్ సిస్టమ్ రీ యాక్టివేట్ అవుతుంది. – డాక్టర్ గిడియన్, డి–అడిక్షన్ థెరపిస్ట్ లివింగ్ సోబర్, హైదరాబాద్ (చదవండి: కీళ్లనొప్పులా?.. ఈ ఆహారం తీసుకోండి!) -
నేను ప్రెగ్నెంట్‌ని.. ఆ మాత్రలు వాడుతున్నా? బిడ్డకు ఏదైనా ప్రమాదమా?
నేను ప్రెగ్నెంట్‌ని. ఇప్పుడు మూడో నెల. రక్త హీనత ఉందని నాకు మాత్రలు ఇచ్చారు. దీనివల్ల బిడ్డకు ఏదైనా ప్రమాదం ఉంటుందా? – ప్రమోద, నెల్లూరు హీమోగ్లోబిన్ పదకొండు గ్రాముల కన్నా తక్కువ ఉన్నప్పుడు మొదటి మూడు నెలల్లోనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏడవ నెల నుంచి ప్రసవం వరకు కనీసం 10.5గ్రాములు ఉండాలి. ఇది బ్రిటిష్ కమిటీ ఫర్ స్టాండర్డ్ ఇన్ హెమటాలజీ గైడ్‌లైన్స్ ప్రకారం ప్రెగ్నెన్సీ.. ప్రసవంలో కూడా ఫాలో కావాలి. ప్రసవం తరువాత పది గ్రాముల కన్నా తక్కువ ఉంటే కచ్చితంగా మాత్రలు ఇవ్వాల్సిందే. రక్తహీనత వల్ల ప్రెగ్నెన్సీ సమయంలోనే కాదు ప్రసవం తర్వాతా చాలా సమస్యలు వస్తాయి. ఓరల్ థెరపీ అంటే ఓరల్ ఐరన్ మాత్రలను ముందుగా రెండువారాల పాటు ఇస్తారు. వాటితో హిమోగ్లోబిన్ కనుక పెరిగితే తర్వాత మాత్రలను వాడాల్సిన అవసరం ఉండదు. ప్రెగ్నెన్సీలో అందరికీ 28 వారాలకు సీబీపీ .. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ రక్త పరీక్ష చేయాలి. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీకి హీమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫొరీసస్ అనే రక్తపరీక్షనూ తప్పకుండా చేయించాలి. ఈ టెస్ట్ ద్వారా పుట్టుకతో వచ్చే జెనెటిక్ సమస్యలు సికిల్ సెల్ అనీమియా, తలసీమియావంటి వ్యాధులను.. క్యారియర్ స్టేటస్‌ని కనిపెట్టవచ్చు. ఈ వ్యాధులు/క్యారియర్స్‌గా ఉన్నవారికి ఓరల్ థెరపీతో, డైట్‌తోనే మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అలా తీసుకుంటేనే అసిడిటీ సమస్యలు తగ్గుతాయి ఐరన్ పెరగడానికి ఇంజెక్షన్ ఇవ్వకూడదు. అలాచేస్తే వాళ్లకు ఐరన్ ఓవర్‌లోడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే మీకు ఆ బ్లడ్ టెస్ట్ చేసి చికిత్స మొదలుపెట్టటం మంచిది. ఈ వైద్య పరీక్షలో కేవలం ఐరన్ లోపం మాత్రమే ఉందని తేలితే అప్పుడు ఐరన్ స్టడీస్ చేస్తారు. సరైన ప్రిపరేషన్‌తో చికిత్స చేస్తే ఈ ఐరన్ లోపం సమస్య త్వరగా తగ్గిపోతుంది. ఈ ఐరన్ మాత్రలను విటమిన్ సీతో గానీ, సిట్రస్ ఫ్రూట్ జ్యూసెస్‌తో గానీ తీసుకుంటే ఆ మాత్రలను శరీరం త్వరగా గ్రహిస్తుంది. అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. ఐవీ ఐరన్ ఇంజెక్షన్స్ కూడా పనిచేస్తాయి. కొంతమందికి కిడ్నీ పరీక్షలనూ సూచిస్తారు. రేనల్ అనీమియా అనేదాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో హీమోగ్లోబిన్ 8 గ్రాముల కంటే తక్కువగా ఉంటే పేషంట్ పరిస్థితిని బట్టి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇస్తాం. మొదటి మూడునెలల్లో హీమోగ్లోబిన్ పదకొండు గ్రాముల కన్నా తక్కువగా ఉంటే హెమటాలజిస్ట్ / ఫిజీషియన్‌ను సంప్రదించి డైట్, ఐరన్ మాత్రలతో చికిత్స మొదలుపెట్టడం వల్ల ఇటు బిడ్డకు, అటు తల్లికి వచ్చే సమస్యలను నివారించగలుగుతాం. తలనొప్పి, శ్వాస ఆకడపోవడం.. అనీమియాతో బాధపడుతున్న తల్లిలో.. నీరసం, పాల్పిటేషన్స్, తలనొప్పి.. వంటివి ఎక్కువ. శ్వాస ఆడకపోవడం.. కాళ్ల వాపులూ రావచ్చు. బిడ్డ పుట్టిన తరువాత హీమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండొచ్చు. ప్రసవం తరువాత పాస్ట్పార్టమ్ హేమరేజ్, అబ్రప్షన్ చాన్సెస్ పెరుగుతాయి. అందుకే రక్తహీనతను గుర్తించిన వెంటనే దానికి చికిత్సను అందించాలి. మాత్రలు ఇవ్వాలి. ఒకవేళ దద్దుర్లు వంటి రియాక్షన్ ఏదైనా వస్తే వేరే ప్రిపోజిషన్ని ప్రయత్నించాలి. ఇలా రక్తహీనతకు తగిన చికిత్సతో తల్లి ఆరోగ్యాన్ని కాపాడ్డమే కాదు పండంటి బిడ్డనూ కనొచ్చు. (చదవండి: నేరాలను తగ్గించేలా.. సరికొత్త అత్యాధునిక జైలు) -
Hyderabad: గర్భిణీకి బలవంతంగా గర్భస్రావం మాత్రలిచ్చిన భర్త
సాక్షి, హైదరాబాద్: ఆడపిల్ల పుడుతుందేమోనన్న అనుమానంతో ఆరు నెలల గర్భిణీ అయిన భార్య కడుపులోని శిశువు హత్యకు కారణమైన భర్త, అత్తలను కంచన్‌బాగ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు.. హఫీజ్‌బాబానగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ మహమూద్, తబస్సుమ్ బేగంలు దంపతులు. వీరికి 18 నెలల పాప సంతానం ఉంది. ప్రస్తుతం తబస్సుమ్ ఆరు నెలల గర్భిణీ. అయితే భర్త మహమూద్ మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనన్న భయంతో ఈ నెల 14వ తేదీన రాత్రి తబస్సుమ్‌కు బలవంతంగా అబార్షన్ మందులు అందించాడు. దీంతో ఈ నెల 15వ తేదీన తబస్సుమ్ తీవ్ర రక్తస్రానికి గురై ఇంట్లోనే చనిపోయిన శిశువుకు జన్మనిచ్చింది. దీంతో మహమూద్ కుటుంబ సభ్యులు మృత శిశువుని హఫీజ్‌బాబానగర్‌లోనే పాతిపెట్టారు. అనంతరం తబస్సుమ్ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో చాంద్రాయణగుట్టలోని లిమ్రా ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలను అందించాడు. ఆసుపత్రిలో కోలుకున్న అనంతరం తబస్సుమ్‌ను భర్త మహమూద్, కుటుంబ సభ్యులు తలాబ్‌కట్టాలో నివాసముండే తల్లిగారింటికి పంపించారు. దీంతో తబస్సుమ్ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. తబస్సుమ్ కుటుంబ సభ్యులు ఈ నెల 17వ తేదీన కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో భర్త మహమూద్, అత్త షమీమ్ బేగం, ఆడ పడుచు షహనాజ్‌లపై ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా బండ్లగూడ మండల తహసీల్దార్ నవీన్, ఫొరెన్సిక్ వైద్య సిబ్బంది సమక్షంలో హఫీజ్‌బాబానగర్‌లో పాతిపెట్టిన శిశువుని బయటికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. శిశువు మృతికి కారణమైన మహమూద్, షమీమ్ బేగంలను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ఈ కేసులో మరో నిందితులు ఆడపడుచు షహనాజ్ పరారీలో ఉంది. -
మూడోసారి ఆడపిల్లేనని.. గర్భస్రావానికి మాత్రలు మింగిన యువతి మృతి
సాక్షి, చెన్నై: మూడోసారి గర్భంలోనూ ఆడపిల్లే ఉందన్న బాధతో ఓ యువతి గర్భస్రావం చేసు కోవడానికి మాత్రలు మింగడంతో మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. కడలూరు జిల్లా వేపూర్ సమీపంలోని కీళకురిచ్చి గ్రామానికి చెందిన గోవిందరాజ్, అముద (27) దంపతులు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అముద మూడోసారి గర్భం దాల్చింది. కడుపులో ఉన్న బిడ్డ మగబిడ్డా, ఆడబిడ్డా అని అముద తెలుసుకోవాలనుకుంది. దీనికి సంబంధించి పరీక్షలు చేయించుకునేందుకు గత 17వ తేదీ అముద కల్లకురిచ్చి జిల్లా అసకలత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఉన్న ఆస్పత్రి యజమాని, అముద కడుపుని స్కాన్ చేసి, ఆమె ఆడపిల్లను మోస్తున్నట్లు చెప్పింది. మూడోసారి ఆడబిడ్డకు జన్మనివ్వడానికి ఇష్టం లేని అముద అబార్షన్ చేయమని కోరింది. ఆ తర్వాత అముదకు అదే ఫార్మసీలో అబార్షన్ మాత్రలు ఇచ్చారు. వాటిని తిన్న తర్వాత వేపూర్ సమీపంలోని నిరామణిలో ఉన్న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. 2 రోజులు అక్కడే ఉన్న ఆమెకు శనివారం సాయంత్రం తీవ్ర రక్తస్రావం అయింది. కొద్దిసేపటికి స్పృహతప్పి పడిపోయింది. దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు, బంధువులు వెంటనే అముదను చికిత్స నిమిత్తం వేపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అముద అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటన గురించి వేపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రభుత్వ టీచర్‌గా హిజ్రా.. చదువుపై ఇష్టంతో.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. -
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ...ఆ మాత్రలకు పెరిగిన డిమాండ్! ఎందుకలా..
Potassium Iodide Pill block Radioactive Iodine: ఉక్రెయిన్ రష్యా మధ్య నిరవధికంగా యుద్ధం కొనసాగుతోంది. ఎటునుంచి చూసిన ఈ యుద్ధం ఆగుతుందని ఎవరికి అనిపించటంలేదు. అలాంటి విధ్వంసకర పోరు సమయంలో పొటాషియం అయోడైడ్ మాత్రలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. దీనికి గల కారణం రష్యా ఉక్రెయిన్‌లోని అణుకర్మాగారం పై దాడుల జరపడంతోనే ఈ మాత్రలకు అనుహ్యంగా డిమాండ్ పెరిగింది. అసలు పొటాషియం అయోడైడ్(కేఐ) అంటే ఏమిటి? దీని ప్రత్యేకత ఏమిటంటే..సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) ప్రకారం పొటాషియం అయోడైడ్ అనేది స్థిరమైన అయోడిన్ ఉప్పు. ఇది రేడియోధార్మిక అయోడిన్‌ను థైరాయిడ్ గ్రంథి గ్రహించకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. తద్వారా ఈ గ్రంధిని అణుధార్మిక రేడియేషన్ భారి నుంచి కాపాడుతుంది. అంతేకాదు థైరాయిడ్ గ్రంధిలోకి రేడియోధార్మిక అయోడిన్ రాకుండా నిరోధించడానికి మన వద్ద ఉన్న టేబుల్ స్పూన్ ఉప్పు, అయోడిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలలోని అయోడిన్ సరిపోదని సీడీసీ పేర్కొంది. అంతేకాదు థైరాయిడ్ గ్రంధి స్థిరమైన అయోడిన్, రేడియోధార్మిక అయోడిన్ మధ్య వ్యత్యాసాని గుర్తించలేదు. అయితే ఒక వ్యక్తి కేఐ మాత్ర తీసుకున్నప్పుడూ స్థిరమైన అయోడిన్ని మాత్రమే గ్రహిస్తుందని, రేడియోధార్మిక అయోడిన్‌ను ప్రవేశించకుండా అడ్డుకుంటుందని సీడీసీ వెల్లడించింది. దీంతో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్రతరం అవుతుందనే భయంతో చాలామంది యూరోపియన్లు అయోడిన్ మాత్రలను నిల్వ చేసుకున్నారు. అంతేగాక బెల్జియంలో, దాదాపు 30 వేల మంది నివాసితులు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన అణు నిరోధక దళాలను హై అలర్ట్‌లో ఉంచాలని ప్రకటించిన నేపథ్యంలో ఉచిత మాత్రల కోసం ఫార్మసీలకు వెళ్లారని స్థానిక మీడియా పేర్కొంది. పైగా యూఎస్‌లోని ఫార్మాస్యూటికల్ కంపెనీ పొటాషియం అయోడైడ్ ఉత్పత్తులకు సంబంధించిన అధిక డిమాండ్‌ను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. (చదవండి: ఉక్రెయిన్‌లో రష్యా బాంబుల మోత) -
మహిళల శ్రమ దోపిడీకి ‘పిల్స్’
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణాదిలోనే వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన తమిళనాడులో దాదాపు నాలుగువేల ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లులు ఉండగా, వాటిల్లో దాదాపు మూడు లక్షల మంది మహిళలు పనిచేస్తున్నారు. వారు రోజంతా పది గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేస్తేనే వారికి పూర్తి వేతనం వస్తుంది. మహిళలు రుతుస్రావం సమయంలో కనీసం మూడు రోజులపాటు సెలవు పెట్టాల్సి వస్తుంది. అలా చేస్తే ఉద్యోగాలే పోతాయి. అందుకని వారు ఆ సమయాల్లో కూడా ఫ్యాక్టరీల్లో పనికి హాజరవుతున్నారు. రుతుస్రావం సందర్భంగా వచ్చే నీరసం, బలహీనత పది గంటల పాటు పనిచేయనీయదు. వారి పనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ‘టైమ్‌కీపర్’ వారికి గంట విశ్రాంతి కూడా ఇవ్వరు. మూత్రానికి వెళ్లిన పది నిమిషాల్లో తిరిగి రావాలి. మూత్రానికి కూడా ఎక్కువ సార్లు పోనీయరు. పోతే గంటకింతా, అరగంటకింతా అని వేతనాలు కట్ చేస్తారు. మరి రుతుస్రావం సమయంలో మహిళలు పనిచేసేది ఎలా ? దీనికి సులభమైన మార్గాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యాలే కనిపెట్టాయి. రుతుస్రావం సమయంలో మహిళలకు పెయిన్ కిల్లర్స్ లాంటి మాత్రలను టైమ్ కీపర్ల ద్వారా యాజమాన్యాలే సరఫరా చేస్తున్నాయి. ‘థామ్సన్ రాయటర్స్ ఫౌండేషన్’ ఇటీవల వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తోన్న వంద మందికి పైగా మహిళా కార్మికులను ఇంటర్వ్యూ చేయగా వారిలో 90 శాతం మంది ఇలాంటి పిల్స్ తీసుకొని పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇది చాలా భయంకరమైన విషయం. తరచుగా ఈ పిల్స్‌ను వాడడం వల్ల మహిళల్లో మానసిక ఒత్తిడి, గాబరా పెరుగుతుంది. గర్భాశయం వద్ద క్యాన్సర్ రహిత కణతులు ఏర్పడతాయి. ఇతర ఇన్ఫెక్షన్లూ వస్తాయి. కొందరిలో గర్భస్రావం కూడా జరుగుతుంది. ఫ్యాక్టరీలు సరఫరా చేస్తున్న ఈ పిల్స్‌పై ఓ కాగితంగానీ, బ్రాండ్ నేమ్‌గానీ, ఆఖరికి అది ఎక్స్పైర్ అయిందా, లేదా కూడా తెలియడం లేదని దర్యాప్తులో తేలింది. ఈ పిల్స్ కారణంగా తాను తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సుధా అనే 17 ఏళ్ల యువతి తెలిపింది. చిత్తు కాగితాలు ఏరుకుని బతికే తన తల్లికి తోడుగా ఉండేందుకు తానీ పనిలో చేరానని, నెలకు ఆరు వేల రూపాయలు వస్తాయని, వారానికి ఒక్క రోజు మినహా ఎలాంటి సెలవులు ఉండవని, సెలవు పెడితే జీతం కట్ చేస్తారని తెలిపింది. తమ కుటుంబానికి లక్షన్నర రూపాయల అప్పు ఉండడం వల్ల తప్పనిసరిగా తానీ పనిలో కొనసాగాల్సి వస్తోందని వాపోయారు. మరో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కనగ మరిముత్తు అనే 21 ఏళ్ల యువతి పిల్స్ కారణంగా తన ఆరోగ్యం పాడవుతోందని, తీసుకోకపోతే పనిచేసే పరిస్థితి ఉండడం లేదని చెప్పారు. ఈ పిల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న విషయం తెలియదని, తమకు ఎవరు ఆ విషయం తెలపలేదని చెప్పారు. ఐబ్రూఫెన్, అడ్విల్ లాంటి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ డ్రగ్స్‌ను మహిళలకు ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయని వైద్యులు అంటున్నారు. రుతుస్రావాన్ని అరికట్టేందుకు మందులు ఇస్తున్న మాట వాస్తవమేనని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ టైమ్ కీపర్ తెలిపారు. యాజమాన్యమే వాటిని తమకు సరఫరా చేస్తోందని, అయితే వాటి పేరేమిటో, వాటి వల్ల లాభమా, నష్టమా కూడా తనకు తెలియదని, తాను వాటిని వాడాల్సిన అవసరం రాలేదని మధ్యవయస్కురాలైన ఆమె చెప్పారు. తమ దృష్టికి ఈ విషయం రాలేదని, ఇలాంటి అనైతిక చర్యలకు తాము పాల్పడమని 500 వస్త్ర కంపెనీలకు సభ్యత్వం కలిగిన ‘సదరన్ మిల్లర్స్ అసోసియేషన్’ ప్రధాన కార్యదర్శి సెల్వరాజు కందస్వామి చెప్పారు. ఈ డ్రగ్స్ తీసుకొని బాధ పడుతున్న వస్త్ర ఫ్యాక్టరీల మహిళలు తమ వద్దకు పదుల సంఖ్యలో వస్తున్నారని దిండిగుల్లో క్లినిక్ నడుపుతున్న డాక్టర్ పీ. నళిన కుమారి తెలిపారు. కార్మిక చట్టాల ప్రకారం అర్హులైన నర్సులు, డాక్టర్లతో కంపెనీలే స్వయంగా డిస్పెన్సరీలను ఏర్పాటు చేయాలి. ఎక్కువ ఫ్యాక్టరీలను కలిగిన అతికొద్ది మంది మాత్రమే డిస్పెన్సరీలను నడుపుతున్నారు. చాలా కంపెనీలు ఫ్యాక్టరీల్లో టైమ్ కీపర్ల ద్వారా కడుపు నొప్పికి, తల నొప్పికి, నడుము నొప్పులకు సాధారణ మాత్రలను సరఫరా చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. -
స్త్రీలోక సంచారం
కోల్‌కతాలోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్’ పూర్వ విద్యార్థిని అంజు సేత్ ఆ ఇన్స్టిట్యూట్ తొలి మహిళా డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఇటీవలి వరకు ఆమె యు.ఎస్.లోని వర్జీనియా టెక్‌లో ప్రొఫెసర్‌గా ఉన్నారు. 2008లో అక్కడ చేరడానికి ముందు ఇల్లినాయిస్ యూనివర్సిటీలో డైరెక్టర్‌గా, హ్యూస్టన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 25 ఏళ్ల తన కెరీర్లో అంజు సేత్ ఎక్కువ భాగం విదేశాలలోనే గడిపారు. సేత్ ఢిల్లీలో పట్టభద్రులయ్యారు. 1978లో కోల్‌కతా ఐ.ఐ.ఎం.లో ఎం.బి.ఎ. చేశారు. ఇండియాలో ఎక్కువలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లో 83 శాతం మంది, తమిళనాడులో 63 శాతం మంది మహిళలు అవాంఛిత గర్భాన్ని పోగొట్టుకోడానికి డాక్టర్ల అనుమతి లేకుండానే, సొంతంగా ఫార్మసీలకు వెళ్లి అబార్షన్ పిల్స్ కొని తెచ్చుకుంటున్నట్లు న్యూయార్క్‌లోని గట్మాకర్ ఇన్స్టిట్యూట్, ముంబైలోని ‘ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్’ కలిసి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయింది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు అస్సాం, బిహార్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో ‘అవాంఛిత గర్భం – గర్భవిచ్ఛిత్తి మాత్రల వాడకం’ అనే అంశంపై అధ్యయనం జరిపిన ఈ రెండు సంస్థలు.. ప్రమాదకరమైన ఈ ధోరణిని నివారించడానికి, ప్రభు త్వం సురక్షితమైన విధానాలను మహిళలకు అందుబాటులోకి తేవాలని తమ అధ్యయన ఫలితాల నివేదికలో సూచించాయి. ప్రముఖ బెంగాలీ నటి నఫీసా అలీ (61) తను స్టేజ్ త్రీ క్యాన్సర్‌తో ఉన్నట్లు వెల్లడించారు! ఇటీవలే ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ 3’లో కనిపించిన నఫీసా ఈ వార్తను తన అభిమానులు, ఫాలోవర్లను ఉద్దేశించి ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి, దాని కింద.. ‘ఇప్పుడే నా అపురూపమైన స్నేహితురాలిని కలిసి వచ్చాను. నా స్టేజ్ త్రీ క్యాన్సర్ నుంచి నేను కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు’’ అని రాశారు. నఫీసా అలీ మోడల్, పొలిటీషియన్, సామాజిక కార్యకర్త కూడా. మొదట కాంగ్రెస్‌లో ఉండి, తర్వాత సమాజ్‌వాదిలో చేరి, తిరిగి ఆమె కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. -
మాత్రలతో మధుమేహానికి చెక్..!
ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ మధుమేహంతో సతమతమవుతున్నారు. తీపి తినాలనుకుంటే నోరు కట్టేసుకోవడమే కాదు.. తరచూ చెకప్‌లు చేయించుకోవడం, ఇన్సులిన్ స్థాయిని అదుపులో ఉంచేందుకు ఇంజక్షన్లు తీసుకోవడం వంటి అంశాలు షుగర్ పేషంట్లకు మరింత కష్టతరంగా మారుతున్నాయి. అయితే ఇన్సులిన్ మాత్రలను అందుబాటులోకి తేవడం ద్వారా తరచూ ఇంజక్షన్ తీసుకోవాల్సిన అవసరాన్ని తప్పించి.. వారి ఇబ్బందుల్ని కాస్తైనా దూరం చేయొచ్చని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇన్సులిన్‌ను మాత్రల రూపంలో అందించేందుకు తాము జరిపిన పరిశోధనలు సత్ఫలితాలను ఇస్తున్నాయని హార్వర్డ్ జాన్ పాల్సన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెన్ బయాలజీ ప్రొఫెసర్ సమీర్ మిత్రగొట్రి అంటున్నారు. అయితే కడుపులో ఉండే ఆమ్లాలు జీర్ణవ్యవస్థలోకి చేరకముందే ఇన్సులిన్‌ను నిర్వీర్యం చేయడం వల్ల మాత్రలు పూర్తి స్థాయిలో ప్రభావం చూపలేవన్నారు. ‘ఇన్సులిన్ మాత్రను పేగు లోపలి పంపించవచ్చు. కానీ ప్రొటీన్ల రవాణాను అడ్డుకునే విధంగా పేగు నిర్మాణం రూపొంది ఉండటం వల్ల అది పేగు గోడలను దాటలేదన్నారు. పేగు గోడలపై ఉన్న శ్లేష్మ పొర గుండా ఇన్సులిన్‌ను పంపించి రక్తంలోకి ప్రవహించేలా చేయడం కూడా సవాలుతో కూడుకున్న పని’ అని ఆయన వివరించారు. అయితే ఆమ్లాలను తట్టుకునే తొడుగు ఉండే మాత్రలను తయారు చేయడం ద్వారా సమస్యను అధిగమించవచ్చని పేర్కొన్నారు. దీంతో ఇన్సులిన్ మాత్రలు చిన్న పేగులను చేరే వరకూ ఇన్సులిన్‌ను విడుదల చేసే అవకాశం ఉండదు గనుక రక్తంలోకి సులభంగా ప్రవేశపెట్టవచ్చన్నారు. ఇన్సులిన్ మాత్రల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆరు మధుమేహ రహిత ఎలుకలపై పరిశోధనలు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో మూడింటికి మాత్రల రూపంలో, మిగిలిన వాటికి ఇంజక్షన్ ద్వారా ఇన్సులిన్ అందించినట్లు తెలిపారు. అయితే మాత్రలు ఇచ్చిన ఎలుకల్లో రక్తంలోని గ్లూకోజ్ స్థాయి రెండు గంటల్లోపే 38 శాతానికి పడిపోయిందని.. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ 10 గంటల్లో 45 శాతానికి చేరిందన్నారు. ఇంక్షన్ ఇచ్చిన ఎలుకల్లో గ్లూకోజ్ స్థాయి గంటలోపే 49 శాతానికి పడిపోయినట్లు గుర్తించామన్నారు. ఇన్సులిన్ మాత్రల ప్రభావ శీలతను అంచనా వేసేందుకు ఈ పరిశోధనలు సరిపోవని, వివిధ జంతువులపై పరిశోధనలు చేయడం ద్వారా పురోగతి సాధించే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాజా జర్నల్‌లో సమీర్ మిత్రగొట్టి పొందుపరిచారు. అయితే మధుమేహ చికిత్సకు నోటి ద్వారా ఇన్సులిన్ అందించే ప్రక్రియలో ఏర్పడే సైడ్ ఎఫెక్ట్స్ ను రూపుమాపేందుకు లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
మగాళ్లకూ గర్భ నిరోధక మాత్రలు!
పిల్లలు పుట్టకుండా ఉండేందుకు ఇకపై మహిళలు మాత్రమే మాత్రలు తీసుకోవాల్సిన అవసరం లేదు. పురుషులపై జరిపిన ప్రయోగాలు విజయవంతం కావడంతో, ఇప్పుడు పురుషులకూ గర్భ నిరోధక మాత్రలు వస్తున్నాయి. మగాళ్లకూ ఇలాంటి సౌకర్యం కల్పించేందుకు ఇప్పటివరకూ బోలెడన్ని ప్రయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. చివరకు డైమిథడ్రోలోన్ అండీకానోయేట్ అనే రసాయనం దీన్ని సాధ్యం చేసింది. దీని సామర్థ్యం, భద్రతపై జరిగిన తొలి పరీక్షలు విజయవంతం కావడంతో మలిదశ ప్రయోగాలకు రంగం సిద్ధమైంది. చాలామంది పురుషులు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను ఇష్టపడరని.. అవసరమైనప్పుడు మాత్రమే ఇలాంటి సామర్థ్యమున్న పద్ధతి కోసం చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ పరిశోధనల్లో పాల్గొన శాస్త్రవేత్త స్టెఫానీ పేజ్ తెలిపారు. తొలిదశ ప్రయోగాల్లో తాము వంద మంది పురుషులను ఎంచుకుని మూడు వేర్వేరు మోతాదుల్లో మందు అందించామని, అత్యధిక మోతాదు తీసుకున్న వారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి గణనీయంగా మందగించినట్లు గుర్తించామని చెప్పారు. అయితే ఈ మాత్రల వినియోగం వల్ల శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ కొంత నష్టపోవడంతో పాటు కొద్దిగా ఒళ్లు చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసిందన్నారు. -
'మాత్రలు కాదు.. నా తల్లి మరణమే కారణం'
ముంబయి: తన వద్ద ఏ మాత్రలు లేవని, ఎవరూ వాటిని ఇవ్వలేదని, అసలు తాను ఏ మాత్రలు వేసుకోలేదని షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఆమెతల్లి ఇంద్రాణి ముఖర్జియా పేర్కొంది. తన తల్లి మరణం గురించి తెలుసుకొని తీవ్ర విచారంలోకి కూరుకుపోయానని, దిగ్భ్రాంతికి లోనవ్వడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లానని చెప్పింది. మోతాదుకు మించిన మాత్రలు వేసుకోవడం ద్వారా అపస్మారక స్థితిలోకి వెళ్లిందని భావించి ఆమెను జేజే ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే, ఆమె పూర్తి స్థాయిలో కోలుకున్న అనంతరం మంగళవారం రాత్రి డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. తన అస్వస్థతకు తల్లి మరణమే కారణమని చెప్పారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఇంద్రాణిని బైకుల్లా మహిళా ఖైదీల జైలుకు తరలించారు. -
మింగ మాత్రలేదు
సాక్షి, గుంటూరు : ఉచిత వైద్యం అందుతుందనే ఆశతో ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయించే రోగులు ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి నెలకొంది. స్వైన్ ఫ్లూ, కంఠసర్పి వంటి ప్రాణాంతక వ్యాధులకు సైతం మందులు సరఫరా చేయలేక వైద్య ఆరోగ్యశాఖ చేతులెత్తేస్తోంది. ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లే స్తోమత లేక, బహిరంగ మార్కెట్లో మందులు కొనలేక పేద ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో స్వైన్ ఫ్లూ కేసులు అధికంగా నమోదు కావటం, జిల్లాలో ఓ మహిళ, పొరుగున ప్రకాశం జిల్లాలో మరో యువకుడు స్వైన్‌ఫ్లూ లక్షణాలతో మృతిచెందినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాధిపట్ల జిల్లా వాసుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. జిల్లా మహిళ స్వైన్‌ఫ్లూతో చనిపోలేదని అధికారులు నిర్ధారించినప్పటికీ ప్రజల్లో భయం మాత్రం పోలేదు. ఈ వ్యాధి లక్షణాలతో ఎవరైనా ఆస్పత్రిలో చేరితే ముందుగా చికిత్స చేసే వైద్య సిబ్బందికి టామిఫ్లూ వ్యాక్సిన్‌ను వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం గుంటూరు జ్వరాల ఆసుపత్రిలో ఉన్న కొద్దిపాటి వ్యాక్సిన్ సిబ్బందికే సరిపోయే పరిస్థితి లేదు. ఇంక రోగులకు వేయడానికి వ్యాక్సిన్ ఎక్కడి నుంచి తేవాలో అధికారులకే తెలియాలి. ఈ వ్యాక్సిన్‌ను ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే సరఫరా చేయాలని బహిరంగ మార్కెట్లో అమ్మకూడదన్న నింబధనలతో మరింత ఇబ్బందిగా మారింది. కంఠసర్పి నివారణా మందులూ లేవు.. చిన్న పిల్లల్లో అధికంగా వచ్చే ప్రాణాంతక కంఠసర్పి వ్యాధికి కూడా ప్రభుత్వ వైద్యశాలల్లో మందులు లేవు. ఈ వ్యాధి సోకిన పిల్లలకు బరువు ఆధారంగా ఆరు నుంచి ఎనిమిది డోస్‌లు యాంటి డిఫ్తీరియల్ సీరమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఒక్కో డోస్ విలువ బహిరంగ మార్కెట్లో రూ.10వేల వరకు ఉంది. అంత ఖరీదైన మందులు కొనుగోలు చేసే శక్తి లేకపోవడం పేద ప్రజలకు సమస్యగా మారింది. పిచ్చికుక్క కరిచినప్పుడు బ్రేక్-3 బైట్స్‌కు ఇమ్మినో గ్లోబిన్ వ్యాక్సిన్‌ను ఏడు నుంచి ఎనిమిది డోసులు వాడాల్సి ఉంటుంది. ఖరీదైన ఈ మందు కూడా ప్రభుత్వాస్పత్రుల్లో కొరతగానే ఉంది. ఇప్పటికైనా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ వైద్యశాలల్లో మందుల కొరత తీర్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.