టేప్ వార్మ్ పిల్స్: భయంకరమైన అనుభవం
బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేసి, ఫలితం దక్కక విసిగిపోతూ ఉంటారు చాలామంది. క్రమ తప్పని ఆహార నియమాలు, వ్యాయాంతో బరువు తగ్గడం సులభమే. అయితే ఈ ప్రక్రియ అందరికీ ఒకేలా ఉండదు. వారి శారీరక లక్షణాలు, శరీరతత్వాన్ని బట్టి సుదీర్ఘ కాలం పాటు ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది. అంతేగానీ విపరీత ధోరణులకు పోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. ఈ విచిత్రమైన కేసు గురించి తెలిస్తే.. గుండె గుభేలు మంటుంది.
అమెరికాకు చెందిన కేన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ బెర్నార్డ్ హ్సు అందించిన కేస్‌స్టడీ వివరాల ప్రకారం ఒక మహిళ బరువు తగ్గించుకోవాలనే ఆరాటంలో టేప్‌వార్మ్ టాబ్లెట్‌లను వాడింది. ఫలితంగా బరువు తగ్గడం మాటేమో గానీ శరీరమంతా పురుగులు చేరి సర్వనాశనం చేశాయి. దీంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది, జ్ఞాపకశక్తిని కోల్పోయింది.
ఆహారం ,వ్యాయామ నియమాలతో బరువు తగ్గడానికి చాలా కష్టాలు పడింది అయోవాకు చెందిన 21 ఏళ్ల యువతి. ఈ క్రమంలో టేప్‌వార్మ్ గుడ్లతో నిండిన మందులను వాడటం ద్వారా వేగంగా బరువు తగ్గవచ్చని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకొని క్రిప్టోకరెన్సీ సహాయంతో ఆ టాబ్లెట్లను కొనుగోలు చేసింది. మొదట్లో రెండు టేప్‌వార్మ్ మాత్రలు వేసుకుంది. అనుకున్నట్టుగా బరువు తగ్గడంలో కడుపులో నొప్పి, ఉబ్బరం లాంటి ఇబ్బందులొచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. ఒక వింత బాత్రూమ్ సంఘటన తర్వాత షాక్‌కు గురైంది. చెంపల మీద ఎవరో కొడుతున్నట్టు, చప్పట్లు కొట్టినట్టు శబ్దాలు వినబడ్డాయి. ప్లష్ చేయ బోతున్నపుడు నల్లగా, ముద్దలు ముద్దలుగా ఏవో పాకుతూ బయటకు రావడం చూసింది. (మనవడితో దాండియా స్టెప్పులేసిన నీతా అంబానీ, ఆ స్టార్ కిడ్ కూడా!)
ఇక ఆత రువాత కొద్ది రోజుల్లోనే, గడ్డం కింద అసాధారణమైన గడ్డ వచ్చింది. దీంతోపాటు తీవ్రమైన తలనొప్పి , ఒత్తిడి వంటి మరికొన్ని లక్షణాలు కనిపించాయి. ఇది భరించలేక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేయించుకుంది. అది నెగెటివ్ వచ్చింది. కానీ ఉన్నట్టుండి, మతిమరుపు వచ్చింది.. ఒక గంట ముందు ఏం జరిగిందో కూడా గుర్తులేకుండాపోయింది. చివరికి వైద్యులను ఆశ్రయించింది. ఆమె మెదడు ,శరీరంలోని ఇతర భాగాలలో - నాలుక ,కాలేయంతో సహా పలు గాయాలను వైద్యులు గుర్తించారు. చివరికి తన డేంజరస్ డైట్ ను బయటపెట్టింది. TE అనే రెండు రకాల పరాన్నజీవుల (టేనియా సాగినాటా, టేనియా సోలియం) గుడ్లు రక్తంలోకి చేరి ఇన్ఫెక్షన్‌కు కారణమైనట్లు కనుగొన్నారు. చికిత్స అందించి ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. (Age is just a number 64 ఏళ్ల వయసులోఎంబీబీఎస్ : రిటైర్డ్ ఉద్యోగి సక్సెస్ స్టోరీ)
బరువు తగ్గడానికి టేప్‌వార్మ్ గుడ్లను తీసుకోవడం అనే ఈ విచిత్రమైన పద్ధతి విక్టోరియన్ ఎరాలో వాడేవారట. ఈ పద్ధతి ఎంత సాధారణంగా ఉపయోగించారనేది అస్పష్టమని డాక్టర్ బెర్నార్డ్ వెల్లడించారు. ఇలాంటి పద్ధతుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
టేప్‌వార్మ్ ఎంత ప్రమాదకరం?
పరాన్నజీవులు తమ గుడ్లను తెలియకుండానే ఉడకని మాంస ఉత్పత్తుల ద్వారా శరీరంలోకి చేరతాయి. 30 అడుగుల పొడవు పెరుగుతాయి,పేగుల్లో వీపరీతంగా గుడ్లు పెడతాయి. ఇవి శరీరంలోని పోషకాలను తినేస్తాయి. తద్వారా బరువు తగ్గిపోతారు. టేప్‌వార్మ్‌తో మరో అతి పెద్ద ప్రమాదం ఏమిటంటే, అవి ఎక్కడ అతుక్కుపోయాయో గుర్తించడం కష్టం. జీర్ణాశయం వెలుపల ఉన్న ఇతర అవయవాలకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి.
కలుషిత, సరిగ్గా ఉడకని మాంసాహారం ద్వారా కడుపులో పెరిగే ఈ పురుగులను గ్యాస్ట్రిక్ వార్మ్స్ అని కూడా అంటారు. వీటిలో ఏలిక పాములు (రౌండ్ వార్మ్స్), పట్టీ పురుగులు (ఫ్లాట్ వార్మ్స్), నారికురుపు పురుగులు (టేప్ వార్మ్స్) అనే రకాలు ఉంటాయి. వీటిలో ఒక్కొక్కటి ఒక్కో రకమైన లక్షణాలతో వ్యాపిస్తాయి.
టేప్‌వార్మ్ లక్షణాలు
అతిసారం
తీవ్రమైన కడుపునొప్పి
వికారం
బలహీనత
జ్వరం
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు
నరాల సమస్యలు
Comments
Please login to add a commentAdd a comment