tapeworm
-
బరువు తగ్గాలని ఆ పిల్స్ తీసుకుంది, నరకం చూసింది!
బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేసి, ఫలితం దక్కక విసిగిపోతూ ఉంటారు చాలామంది. క్రమ తప్పని ఆహార నియమాలు, వ్యాయాంతో బరువు తగ్గడం సులభమే. అయితే ఈ ప్రక్రియ అందరికీ ఒకేలా ఉండదు. వారి శారీరక లక్షణాలు, శరీరతత్వాన్ని బట్టి సుదీర్ఘ కాలం పాటు ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది. అంతేగానీ విపరీత ధోరణులకు పోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. ఈ విచిత్రమైన కేసు గురించి తెలిస్తే.. గుండె గుభేలు మంటుంది.అమెరికాకు చెందిన కేన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ బెర్నార్డ్ హ్సు అందించిన కేస్‌స్టడీ వివరాల ప్రకారం ఒక మహిళ బరువు తగ్గించుకోవాలనే ఆరాటంలో టేప్‌వార్మ్ టాబ్లెట్లను వాడింది. ఫలితంగా బరువు తగ్గడం మాటేమో గానీ శరీరమంతా పురుగులు చేరి సర్వనాశనం చేశాయి. దీంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది, జ్ఞాపకశక్తిని కోల్పోయింది.ఆహారం ,వ్యాయామ నియమాలతో బరువు తగ్గడానికి చాలా కష్టాలు పడింది అయోవాకు చెందిన 21 ఏళ్ల యువతి. ఈ క్రమంలో టేప్‌వార్మ్ గుడ్లతో నిండిన మందులను వాడటం ద్వారా వేగంగా బరువు తగ్గవచ్చని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకొని క్రిప్టోకరెన్సీ సహాయంతో ఆ టాబ్లెట్లను కొనుగోలు చేసింది. మొదట్లో రెండు టేప్‌వార్మ్ మాత్రలు వేసుకుంది. అనుకున్నట్టుగా బరువు తగ్గడంలో కడుపులో నొప్పి, ఉబ్బరం లాంటి ఇబ్బందులొచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. ఒక వింత బాత్రూమ్ సంఘటన తర్వాత షాక్‌కు గురైంది. చెంపల మీద ఎవరో కొడుతున్నట్టు, చప్పట్లు కొట్టినట్టు శబ్దాలు వినబడ్డాయి. ప్లష్ చేయ బోతున్నపుడు నల్లగా, ముద్దలు ముద్దలుగా ఏవో పాకుతూ బయటకు రావడం చూసింది. (మనవడితో దాండియా స్టెప్పులేసిన నీతా అంబానీ, ఆ స్టార్ కిడ్ కూడా!)ఇక ఆత రువాత కొద్ది రోజుల్లోనే, గడ్డం కింద అసాధారణమైన గడ్డ వచ్చింది. దీంతోపాటు తీవ్రమైన తలనొప్పి , ఒత్తిడి వంటి మరికొన్ని లక్షణాలు కనిపించాయి. ఇది భరించలేక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేయించుకుంది. అది నెగెటివ్ వచ్చింది. కానీ ఉన్నట్టుండి, మతిమరుపు వచ్చింది.. ఒక గంట ముందు ఏం జరిగిందో కూడా గుర్తులేకుండాపోయింది. చివరికి వైద్యులను ఆశ్రయించింది. ఆమె మెదడు ,శరీరంలోని ఇతర భాగాలలో - నాలుక ,కాలేయంతో సహా పలు గాయాలను వైద్యులు గుర్తించారు. చివరికి తన డేంజరస్ డైట్ ను బయటపెట్టింది. TE అనే రెండు రకాల పరాన్నజీవుల (టేనియా సాగినాటా, టేనియా సోలియం) గుడ్లు రక్తంలోకి చేరి ఇన్ఫెక్షన్కు కారణమైనట్లు కనుగొన్నారు. చికిత్స అందించి ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. (Age is just a number 64 ఏళ్ల వయసులోఎంబీబీఎస్ : రిటైర్డ్ ఉద్యోగి సక్సెస్ స్టోరీ) బరువు తగ్గడానికి టేప్‌వార్మ్ గుడ్లను తీసుకోవడం అనే ఈ విచిత్రమైన పద్ధతి విక్టోరియన్ ఎరాలో వాడేవారట. ఈ పద్ధతి ఎంత సాధారణంగా ఉపయోగించారనేది అస్పష్టమని డాక్టర్ బెర్నార్డ్ వెల్లడించారు. ఇలాంటి పద్ధతుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.టేప్‌వార్మ్ ఎంత ప్రమాదకరం?పరాన్నజీవులు తమ గుడ్లను తెలియకుండానే ఉడకని మాంస ఉత్పత్తుల ద్వారా శరీరంలోకి చేరతాయి. 30 అడుగుల పొడవు పెరుగుతాయి,పేగుల్లో వీపరీతంగా గుడ్లు పెడతాయి. ఇవి శరీరంలోని పోషకాలను తినేస్తాయి. తద్వారా బరువు తగ్గిపోతారు. టేప్వార్మ్తో మరో అతి పెద్ద ప్రమాదం ఏమిటంటే, అవి ఎక్కడ అతుక్కుపోయాయో గుర్తించడం కష్టం. జీర్ణాశయం వెలుపల ఉన్న ఇతర అవయవాలకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి.కలుషిత, సరిగ్గా ఉడకని మాంసాహారం ద్వారా కడుపులో పెరిగే ఈ పురుగులను గ్యాస్ట్రిక్ వార్మ్స్ అని కూడా అంటారు. వీటిలో ఏలిక పాములు (రౌండ్ వార్మ్స్), పట్టీ పురుగులు (ఫ్లాట్ వార్మ్స్), నారికురుపు పురుగులు (టేప్ వార్మ్స్) అనే రకాలు ఉంటాయి. వీటిలో ఒక్కొక్కటి ఒక్కో రకమైన లక్షణాలతో వ్యాపిస్తాయి. టేప్‌వార్మ్ లక్షణాలుఅతిసారంతీవ్రమైన కడుపునొప్పివికారంబలహీనతజ్వరంబాక్టీరియల్ ఇన్ఫెక్షన్లునరాల సమస్యలు -
National Deworming Day: చిన్ని బొజ్జలకు కావాలి ఈ రక్ష
నులిపురుగులు చిన్న సమస్య కాదు. అలాగని పెద్ద సమస్యా కాదు. చిన్న పిల్లలను బాధించే చికాకు సమస్య. ఆరోగ్యంగా పిల్లలు ఎదగాలంటే ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ ఉండాలి. మన దేశంలో 65 శాతం మంది చిన్నారులు నులిపురుగులతో బాధ పడుతున్నారు. పూర్వం అమ్మమ్మలు, నానమ్మలు పిల్లల ప్రవర్తనలో మార్పు గమనించి నులిపురుగుల మందు వేసే వారు. ఇప్పుడు తల్లులకు వ్యవధి ఉండటం లేదు. కాని తప్పదు జాగ్రత్త. నులిపురుగులు పిల్లలను బాగా ఇబ్బంది పెడతాయి. అవి కడుపులో ఉన్నాయంటే పిల్లలు మలద్వారం వద్ద దురద ఉందని చెబుతుంటారు. పదేపదే అక్కడ గీరుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ముక్కు ఎక్కువగా దురద పెడుతున్నా ‘కడుపులో నులిపురుగులున్నాయేమో’ అని పెద్దలు అనేవారు. ఇంతకు మునుపు పిల్లలు ఆరుబయలులో విసర్జన చేసేవారు కాబట్టి పెద్దలు నులిపురుగులు గమనించేవారు. ఇప్పుడు ఇళ్లల్లో టాయిలెట్లు వాడి ఫ్లష్ చేయడం వల్ల నులి పురుగులను గమనించే అవకాశం లేదు. పెద్దల కంటే పిల్లలకు నులి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుందని గ్రహించాలి. నులి పురుగులంటే? నులి పురుగులు పేగుల్లో చేరి మన ΄ోషకాలను దొంగిలించి తినే పరాన్న జీవులు. వీటివల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని ‘అస్కారియాసిస్’ అంటారు, మన దేశంలోదాదాపు 85 శాతం మంది పిల్లల్లో ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తోందని ఆరోగ్య సంస్థలు ప్రకటించాయి. నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, నీరసం, కడుపులో నొప్పి వంటి అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి. అకలి మందగిస్తుంది. ‘మా పిల్లవాడు ఇంతకుముందు బాగా తినేవాడు ఇప్పుడు తినడం లేదు’ అని తల్లులు కంప్లయింట్ చేస్తారు. పిల్లల ఎదుగుదల దెబ్బతింటుంది. కొందరు పిల్లలు నులిపురుగుల వల్ల సరిగా నిద్ర΄ోలేక ఇబ్బంది పడతారు. ఎలా ప్రవేశిస్తాయి? చిన్నపిల్లలు మట్టిలో ఆడుకోవడం సర్వసాధారణం. మట్టిలో ఆడుకొని చేతులు శుభ్రం చేసుకోకుండా తింటే నోటి ద్వారా ΄పొట్ట, పేగుల్లోకి నులి పురుగులు ప్రవేశిస్తాయి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, కాళ్లకు చెప్పులు వేసుకోకుండా తిరగడం, వ్యక్తిగత శుభ్రత ΄ాటించక΄ోవడం, దుమ్ము ధూళి చేరిన కలుషిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల నులిపురుగుల సమస్య తలెత్తవచ్చు. ఏం చేయాలి? ప్రధానంగా చిన్నపిల్లల చేతి గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. గోళ్లు కొరికే అలవాటును మాన్పించాలి. ప్రతిరోజూ వేడి చేసి చల్లార్చిన మంచినీటిని మాత్రమే తాగించాలి. వైద్యుల సలహాతో అల్బెండజోల్ మాత్రలు వాడాలి. ప్రకృతి వైద్యంలో ఎనిమా ద్వారా కూడా ఈ నులి పురుగుల బెడద తొలగిస్తారు. కొన్ని సులువైన చిట్కాల ద్వారా కూడా నులిపురుగుల సమస్యను అధిగమించవచ్చు. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండటం వల్ల నులిపురుగులను నివారించడంలో కీలక ΄ాత్ర ΄ోషిస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి ఆ రసంలో గ్లాసు నీటిని కలిపి తాగించడం ద్వారా కడుపులో నులిపురుగులను నివారించవచ్చు. రెండు లవంగాలను ఒక గ్లాసు నీటిలో వేసి ఆ నీటిని తాగించడం వల్ల కడుపులో నులి పురుగులను నివారించవచ్చు. బొప్పాయి పండును తినిపించడం, సన్నగా ఉండే ఆవాలను వేయించి ΄పొడిచేసి మజ్జిగలో కలిపి తాగించడం వంటి వాటి ద్వారా నులిపురుగుల బెడదను అధిగమించేలా చేయవచ్చు. అన్నింటికీ మించి వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటు చేయడం అవసరం. -
నులి పురుగు బ్రెయిన్‌లోకి వెళ్లడం వల్లే ..
సాక్షి, గుంటూరు: గత ఐదేళ్లుగా ఫిట్స్‌తో బాధపడుతూ.. నిరంతరం కుడి చేయి కొట్టుకుంటున్న పదేళ్ల బాలుడికి గుంటూరుకు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి అరుదైన శస్త్రచికిత్స చేసి వ్యాధిని నయం చేశారు. ఆపరేషన్ వివరాలను బుధవారం గుంటూరులో ఆయన మీడియాకు వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లుకు చెందిన బురుసు వీర్రాజు, మహేశ్వరి దంపతుల పదేళ్ల కుమారుడు మహేష్ 2015 నుంచి ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. మందులు వాడుతున్నా ఫిట్స్ తగ్గలేదు. గత నెల 15 నుంచి రాత్రి నిద్రపోయే 8 గంటలు మినహా రోజంతా బాలుడి కుడిచేయి ఆగకుండా నిరంతరం కొట్టుకుంటూనే ఉండేది. దీంతో బాలుడి తల్లిదండ్రులు అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లగా.. బ్రిందా న్యూరో సెంటర్‌కు వెళ్లమని రిఫర్ చేశారు. బ్రెయిన్ సర్జరీలకు వాడే అత్యాధునిక వైద్య పరికరం ‘న్యూరో నావిగేషన్ టెక్నాలజీ’, ‘యానిమేటెడ్ త్రీడీ బ్రెయిన్ మ్యాప్’లను ఉపయోగించి బాలుడి బ్రెయిన్లోని గడ్డను ఈ నెల 17న డాక్టర్ హనుమ శ్రీనివాసరెడ్డి తొలగించారు. డాక్టర్ త్రినాథ్ సహకరించారు. నులి పురుగు బ్రెయిన్‌లోకి వెళ్లడం వల్లే .. ఆపరేషన్ చేసి తొలగించిన ట్యూమర్‌కు బయాప్సీ పరీక్ష చేయగా ‘న్యూరో సిస్టిసెర్కోసిస్ ఆఫ్ బ్రెయిన్’గా తేలిందని డాక్టర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇది ఒక టేప్‌వార్మ్ (నులిపురుగు) వల్ల వస్తుందన్నారు. పంది మాంసం తినేవారితో పాటు కూరగాయలు, పండ్లు సరిగా కడుక్కోకుండా తినేవారిలో న్యూరో సిస్టిసెర్కోసిస్ ఎగ్స్ ఉండి నులిపురుగు బ్రెయిన్‌లోకి వెళ్లడం వల్ల ఈ సమస్య వస్తుందని వివరించారు. -
‘నులి’ పేద్దాం.!
– నేడు జాతీయ నులిపురుగుల నివారణ దినం – జిల్లాలో 7,90,273 మందికి మాత్రల పంపిణీకి ఏర్పాట్లు కర్నూలు(హాస్పిటల్): చేతులను శుభ్రం చేసుకోవడం అనే విషయం చూడ్డానికి చిన్నదైనా, అది పాటిస్తే 60 రకాల వ్యాధులను దరిచేరకుండా చేయవచ్చన్న సంగతి చాలా మందికి తెలియదు. ప్రతి ఏడాది ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నా అవి క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరడం లేదు. ఫలితంగా ఇప్పటికీ కడుపులో నులిపురుగుల సమస్యతో అనేక మంది చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. నులిపురుగుల కారణంగా పలు రకాల వ్యాధులు సోకి అల్లాడుతున్నారు. దీనిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదిన ‘జాతీయ నులిపురుగుల నివారణ దినం’గా పేర్కొంటూ జిల్లా వ్యాప్తంగా పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఇంటర్ మీడియట్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని విస్తతంగా చేపట్టనున్నారు. నులి పురుగుల ఎలా వ్యాపిస్తాయి శరీరంలో నులిపురుగులు ఉన్న పిల్లవాడు తన మలంతో నేలను కలుషితం చేస్తాడు. ఈ గుడ్లు నేలలో లార్వాలుగా వృద్ధి చెందుతాయి. మిగతా పిల్లలు ఈ గుడ్లను ఆహారం, మురికిచేతుల ద్వారా చర్మం లోపలికి లార్వా చొచ్చుకుపోవడం వల్ల నులిపురుగుల సంక్రమణం జరుగుతుంది. ఈ క్రిములు క్రమంగా అభివృద్ధి చెంది తిరిగి గుడ్లను ఉత్పత్తి చేసి, పిల్లలకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, మలంలో రక్తం వంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తాయి. పిల్లల్లో నులిపురుగుల సంక్రమణం ఎంత ఎక్కువగా ఉంటే వ్యాధి లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. నులి పురుగుల నివారణ ఇలా.. 1.బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకూడదు.ఎల్లప్పుడూ మరుగుదొడ్డినే వాడాలి. 2. భోజనం చేసే ముందు, మరుగుదొడ్డికి వెళ్లి వచ్చిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. 3. బూట్లు, చెప్పులు ధరించాలి 4. గోర్లను శుభ్రంగా, చిన్నవిగా కత్తిరించుకోవాలి. 5. ఎల్లప్పుడూ పరిశుభ్రమైన నీటినే తాగాలి. ఆహారాన్ని కప్పి ఉంచాలి. 6. పండ్లను, కూరగాయలను శుభ్రమైన నీటితో కడగాలి. 7. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. జిల్లాలో 7,90,273 మంది పిల్లలకు మాత్రలు జిల్లాలో ఒకటి నుంచి 5 ఏళ్ల పిల్లల సంఖ్య అంగన్వాడీ కేంద్రాల్లో 2,66,251, 10 నుంచి 19 ఏళ్ల వయస్సు(చదువుకు వెళ్లని, ఇండ్ల వద్ద ఉన్న) వారి సంఖ్య 65,763, ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య 4,58,259 మంది కలిపి మొత్తం 7,90,273 మంది పిల్లలు ఉన్నారు. వీరందరికీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం నులిపురుగుల నివారణ కోసం మాత్రలు వేయనుంది. ఒకటి నుంచి రెండేళ్ల పిల్లలకు సగం మాత్ర, 2 నుంచి 5 ఏళ్లు పిల్లలకు, ఆపై వయస్సు వారికి ఒక మాత్ర చొప్పున ఇవ్వనున్నాం. ఈ మేరకు విద్య, ఎస్ఎస్ఏ, ఐసీడీఎస్, అనియత విద్య, వికలాంగుల సంక్షేమ శాఖ, డీఆర్డీఏ, సాంఘిక సంక్షేమ శాఖ, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకోనుంది. – డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్ఓ -
బుర్రలో పురుగు తొలిచేస్తోంది!!
మన ఆలోచనలు సరిగా లేకపోతే, ఏ విషయమూ తేలకపోతే బుర్రలో పురుగు తొలిచేస్తోందంటాం కదూ. కానీ, బ్రిటన్‌లో నిజంగానే ఓ వ్యక్తి బుర్రలో అత్యంత అరుదైన ఓ ఏలికపాము కనిపించింది. అది ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగేళ్లుగా అతడి బుర్రలో కాపురం ఉంటోందట! దీంతో ఈ రకమైన పరాన్నజీవిని గుర్తించి, దానికి చికిత్స చేసేందుకు ఇప్పుడో కొత్త అవకాశం ఏర్పడిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. స్పిరోమెట్రా ఎరినాస్యురోపై అనే ఈ ఏలికపాము 1953 నుంచి ఇప్పటివరకు కేవలం 300 సార్లము మాత్రమే కనిపించింది. ఇక బ్రిటన్‌లో అయితే ఇప్పటివరకు ఇది కనిపించడం ఇదే తొలిసారి. ఈ పురుగు ఉండటం వల్ల శరీర కణజాలాల్లో వాపు వస్తుంది. ఈ లక్షణాన్ని స్పార్గానోసిస్ అంటారు. ఇది మెదడులో వచ్చినప్పుడు తలనొప్పితో పాటు.. జ్ఞాపకశక్తి కూడా పోతుంది. ఒక సెంటీమీటరు పొడవున్న ఈ పురుగును గుర్తించి తీసేలోపు అది మెదడులో కుడినుంచి ఎడమవైపు ఐదు సెంటీమీటర్ల దూరం ప్రయాణించింది.