బుర్రలో పురుగు తొలిచేస్తోంది!! | Rare worm in British man's brain sequenced | Sakshi
Sakshi News home page

బుర్రలో పురుగు తొలిచేస్తోంది!!

Published Fri, Nov 21 2014 2:42 PM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

బుర్రలో పురుగు తొలిచేస్తోంది!!

బుర్రలో పురుగు తొలిచేస్తోంది!!

మన ఆలోచనలు సరిగా లేకపోతే, ఏ విషయమూ తేలకపోతే బుర్రలో పురుగు తొలిచేస్తోందంటాం కదూ. కానీ, బ్రిటన్లో నిజంగానే ఓ వ్యక్తి బుర్రలో అత్యంత అరుదైన ఓ ఏలికపాము కనిపించింది. అది ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగేళ్లుగా అతడి బుర్రలో కాపురం ఉంటోందట! దీంతో ఈ రకమైన పరాన్నజీవిని గుర్తించి, దానికి చికిత్స చేసేందుకు ఇప్పుడో కొత్త అవకాశం ఏర్పడిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

స్పిరోమెట్రా ఎరినాస్యురోపై అనే ఈ ఏలికపాము 1953 నుంచి ఇప్పటివరకు కేవలం 300 సార్లము మాత్రమే కనిపించింది. ఇక బ్రిటన్లో అయితే ఇప్పటివరకు ఇది కనిపించడం ఇదే తొలిసారి. ఈ పురుగు ఉండటం వల్ల శరీర కణజాలాల్లో వాపు వస్తుంది. ఈ లక్షణాన్ని స్పార్గానోసిస్ అంటారు. ఇది మెదడులో వచ్చినప్పుడు తలనొప్పితో పాటు.. జ్ఞాపకశక్తి కూడా పోతుంది. ఒక సెంటీమీటరు పొడవున్న ఈ పురుగును గుర్తించి తీసేలోపు అది మెదడులో కుడినుంచి ఎడమవైపు ఐదు సెంటీమీటర్ల దూరం ప్రయాణించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement