british man
-
భార్యను హత్య చేశాడు.. కానీ కోర్టు నిర్దోషని తెలిపింది
లండన్: సిప్రస్ లో తన భార్యను చంపిన కేసులో ఓ హంతకుడిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. బ్లడ్ క్యాన్సరుతో బాధపడుతున్న భార్య జానీస్ హంటర్ బాధను తట్టుకోలేక తానే చంపమని కోరిందని, తప్పని పరిస్థితుల్లో నిందితుడు డేవిడ్ హంటర్ ఆమె ఆత్మహత్యకు సాయం చేశాడని హంతకుడి తరపు న్యాయవాది కోర్టుకి వాదనలు వినిపించగా కోర్టు ఆ వాదనలతో ఏకీభవించింది. డేవిడ్ హంటర్ నరహంతకుడిగా అనిపించడం లేదని తెలిపింది. డేవిడ్ హంటర్(76) భార్య జానీస్ హంటర్ బ్లడ్ క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. చూస్తుండగానే వ్యాధి ముదిరిపోవడంతో చివరి రోజుల్లో ఆమె నొప్పిని భరించలేకపోయింది. బ్రతికి ఉండటం కంటే చనిపోవడమే మేలని తరచూ భర్తకు గోడు వినిపించేది. చివరికి ఒకరోజు బాధ తీవ్రం కావడంతో తనను చంపి నొప్పి నుండి విముక్తి కలిగించమని భర్తను వేడుకుంది. తాను ఎంతగానో ప్రేమించిన భార్య అంత వేదన భరించడాన్ని చూడలేకపోయిన హంటర్ మరో ప్రత్యామ్నాయం లేక 2021 డిసెంబర్లో భార్యను కడతేర్చాడు. దీంతో హంటర్ పై హత్యా నేరం మోపబడింది. భార్య ఆవేదన తట్టుకోలేకే ఆమెను చంపినట్టు హంటర్ పదేపదే కోర్టుకు విన్నవించాడు. అతని తరపు వకీలు కూడా ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పుకొచ్చారు. తన భార్య చివరి రోజుల్లో చూడ విహీనంగా తయారైన తన ఆకృతిని ఎవరికీ చూపించలేక మానసికంగా బాగా కుంగిపోయిందని, తనకు డైపర్లు కూడా మార్చేవాడినని, తనకోసం నేను అంతగా శ్రమ పడటం చూడలేకపోయింది. దాన్ని తలచుకుని ఇంకా ఎక్కువ బాధపడేది. ఒకానొక దశలో బాధని తట్టుకోలేక ఎలాగైనా తనను చంపేయమని ఆరేడు వారాలు ప్రాధేయపడిందని, తప్పని పరిస్థితులలోనే అలా చేశానని కోర్టుకు తెలిపారు హంటర్. వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు హంటర్ నరహంతకుడేమీ కాదని వ్యాఖ్యానించింది. కోర్టు తన అభిప్రాయం వెల్లడించిన తర్వాత హంటర్ కళ్ళు చెమ్మగిల్లాయి. మూడేళ్ళుగా జైలులో మగ్గిపోతున్న తన తండ్రి ఎట్టకేలకు బయటకు రానున్నారని సంతోషాన్ని వ్యక్తం చేసింది హంటర్ కుమార్తె. జులై 27న హంటర్ నిర్దోషని తీర్పు వెలువడటమే తరువాయి అమ్మ సమాధి దగ్గరకు వెళ్ళిపోతారని చెప్పుకొచ్చింది. ఇది కూడా చదవండి: ఆ రెస్టారెంట్లో తిన్న తర్వాత హాయిగా పడుకోవచ్చు.. -
బోర్ కొడుతోందని.. చావును పెంచి పోషిస్తున్నాడు
బోర్డమ్ను అధిగమించడానికి మనిషి ముందు మార్గాలెన్నో ఉన్నాయి. ఒక్కోసారి వాటిలో కొన్ని విచిత్రంగా కూడా అనిపించొచ్చు. కానీ, విసుగును పొగొట్టుకునేందుకు ఇక్కడో వ్యక్తి ఏకంగా తన ప్రాణాలతోనే చెలగాటం ఆడుతున్నాడు. బ్రిటన్ వ్యక్తి డేనియల్ ఎమీలైన్ జోన్స్.. ఇప్పుడు ప్రపంచంలోనే ప్రమాకరమైన స్టంట్ ద్వారా వార్తల్లోకి ఎక్కాడు. విసుగును దూరం చేసుకునేందుకు ఈ భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన మొక్కను పెంచుతున్నాడు అతను. డెండ్రోస్నైడ్ మోరోయిడెస్.. ఆ మొక్కను ముద్దుగా జింపీ-జింపీ అని పిలుస్తారు. సూసైడ్ప్లాంట్గా దీనికి మరో పేరు కూడా ఉంది. దానికి ఉండే ముళ్లు గనుక గుచ్చుకుంటే.. ఆ నొప్పి కొన్ని నెలలపాటు ఉంటుంది. అంతేకాదు.. ఆ మొక్క ఒకరకమైన వాతావరణం సృష్టిస్తుంది. అందులో ఉంటే.. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కలుగుతాయంట. జింపీ-జింపీకి ఆస్ట్రేలియన్ స్టింగింగ్ ట్రీ అనే పేరు కూడా ఉంది. దీనిని అత్యంత విషపూరితమైన మొక్కగా వ్యవహరిస్తుంటారు. దాని ముళ్లు గనుక గుచ్చుకుంటే ఒకేసారి యాసిడ్ మీద పడినట్లు.. షాక్ తగిలినట్లు అనిపిస్తుంటుంది. డేనియల్.. ఆక్స్‌ఫర్డ్‌లో పని చేసే ఓ ట్యూటర్. తనకు విసుగు పెట్టి.. అది దూరం చేసుకునేందుకే ఆ మొక్కను పెంచుతున్నాడట. ఇందుకోసం ఆస్ట్రేలియా నుంచి విత్తనాలు తెప్పించుకున్నాడు. తన బోర్డమ్ను దూరం చేసుకునేందుకు ఇలా ప్రమాదకరమైన మొక్కను తెచ్చుకుని.. చాలా జాగ్రత్తగా దానిని పెంచుతూ విసుగును పొగట్టుకుంటున్నాడట డేనియల్!. -
కస్టమర్‌కు ‘ఉబర్’ షాక్..15 నిమిషాల రైడ్‌కు రూ.32 లక్షలు
ఇంగ్లాండ్: యాప్ ఆధారిత క్యాబ్ సేవలను అందిస్తున్న ఉబర్.. చాలా మందికి సుపరిచితమే. ఏ చిన్న జర్నీ ఉన్నా ఉబర్‌ను చాలా మంది ఉపయోగించి క్యాబ్ బుక్ చేసుకుంటారు. ఛార్జీలు వందల నుంచి వేల వరకు ఉండొచ్చు. కానీ, లక్షల్లో ఉంటుందని మీరెప్పుడైనా ఊహించారా?. ఓ బ్రిటిష్ వ్యక్తికి కేవలం 15 నిమిషాల రైడ్‌కు ఏకంగా రూ.32 లక్షల ఛార్జ్ చేసి ఊహించని షాకిచ్చింది ఉబర్. క్యాబ్ సంస్థ నుంచి వచ్చిన మెసేజ్ చూసుకుని బాధితుడు ఒక్క క్షణం దిగ్భ్రాంతికి లోనైనట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. 15 నిమిషాల రైడ్‌కు 38,317 డాలర్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా 32 లక్షల రూపాయలు ఉబర్ ఛార్జ్ చేసినట్లు తెలిపింది. ఇంగ్లాండ్, మాంచెస్టర్‌లోని బక్స్టన్ ఇన్ ప్రాంతంలో తన పని ముగించుకుని రైడ్ షేర్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నారు ఒలివర్ కల్పన్(22). తాను పని చేసే బార్ నుంచి నాలుగు మైళ్ల దూరంలోని విచ్వుడ్లో తన స్నేహితుడిని కలవాలనుకున్నారు. ఉబర్ భారీ మొత్తంలో ఛార్జ్ చేయటంపై బాధితుడు కల్పన్ సౌత్ వెస్ట్ న్యూస్ సర్వీస్‌కు వివరించాడు. ‘చాలా సార్లు ఉబర్ మాదిరి యాప్‌ల ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఎప్పుడూ ఎలాంటి సమస్య రాలేదు. ఎప్పుడైనా 11-12 డాలర్లు(రూ.900-1000) ఛార్జ్ చేసేవారు. ఈసారి ఉబర్‌లో కారు బుక్ చేసుకోగా.. కేవలం 15 నిమిషాల జర్నీ చేశాను. ఆ తర్వాతి రోజు ఉబర్ నుంచి మెసేజ్ రావటంతో షాక్ అయ్యా. మొత్తం 35,427 పౌండ్లు(39,317 డాలర్లు) ఛార్జ్ చేసినట్లు తెలిసింది.’ అని బాధితుడు కల్పన్ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బాధితుడు కల్పన్.. వెంటనే ఉబర్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. తన బ్యాంకు ఖాతాలో అంత డబ్బు లేకపోవటంతో వారు తీసుకోలేకపోయారని పేర్కొన్నాడు. తొలుత ఛార్జ్ అమౌంట్ చూసి ఉబర్ కస్టమర్ కేర్ వాళ్లు సైతం తికమక పడ్డారు. అయితే.. కల్పన్ రైడ్ గమ్య స్థానం ఆస్ట్రేలియాగా నమోదు కావటంతో భారీ స్థాయిలో ఛార్జ్ చేయాల్సి వచ్చినట్లు గుర్తించారు. ఇంగ్లాండ్‌లోని విచ్‌వుడ్ కాకుండా.. ఆస్ట్రేలియా, విక్టోరియాలోని విచ్వుడ్గా నమోదైనట్లు తేలింది. బ్యాంకులో సరైన నిధులు లేకపోవటంతో ఉబర్ విత్‌డ్రా చేయలేకపోయింది. ఒకవేళ నగదు ఉండి ఉంటే.. తిరిగి తీసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు కల్పన్. ఇదీ చదవండి: Hong Kong టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన టికెట్లు ఫ్రీ -
ఎయిడ్స్ అంటించావ్.. క్షమించేది లేదు
లండన్ : తనకున్న సుఖవ్యాధిని కావాలనే పది మందికి అంటించిన ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. దయతో శిక్ష తగ్గించాలన్న అతగాడి విజ్ఞప్తిని కోర్టు నిర్దాక్షిణ్యంగా తోసిపుచ్చింది. ‘ఐదుగురి జీవితాలను నాశనం చేసిన నీకు బయటతిరిగే హక్కు లేదు’ అంటూ ఓ బ్రిటన్ కోర్టు.. జీవిత శిక్షను ఖరారు చేసింది. వివరాల్లోకి వెళ్తే... బ్రిగ్టోన్కు చెందిన డరైల్ రోవ్(27) ఓ ప్రముఖ కంపెనీలో హెయిర్ డ్రెస్సర్. విలాసాలకు మరిగిన ఇతగాడికి 2015 లో ఎయిడ్స్ వ్యాధి సోకింది,(తల్లిదండ్రుల నుంచే సోకిందని అతని బంధువు ఒకరు చెప్పటం విశేషం). అయినప్పటికీ ఓ ‘గే’ డేటింగ్ యాప్ ద్వారా ఐదుగురు పురుషులతో సంబంధాలను కొనసాగించాడు. వారితో రక్షణ లేకుండానే లైంగిక చర్యల్లో పాల్గొనటం.. తద్వారా వారికీ హెచ్ఐవీ సోకింది. డరైల్ చేష్టలు ఇక్కడితో ఆగలేదు. ‘నాకు ఎయిడ్స్ ఉందోచ్’ అంటూ సందేశాలు పెట్టాడు. దీంతో వారంతా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతన్ని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. విచారణలో అతను పోలీసులకు తప్పుదోవ పట్టించేందుకు శతవిధాల యత్నించారు. చివరకు వాస్తవాలు తేలటంతో నేరం అంగీకరించాడు. అతని శాడిజంపై బ్రిగ్టోన్ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఎందరో యువకుల జీవితాలను రాక్షసంగా నువ్వు నాశనం చేశావ్. పైగా సురక్షిత శృంగారానికి వీలున్నా.. కావాలనే నిరాకరించావ్. నీలాంటి వాడికి సమాజంలో బతికే హక్కు లేదు. జీవిత కాల శిక్షే సరైంది’ అని జడ్జి తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. -
అంధులపై అఘాయిత్యం: విదేశీ కామాంధుడి అరెస్టు
న్యూఢిల్లీ: అంధ బాలలపై అఘాయిత్యానికి ఒడిగట్టిన బ్రిటిష్ జాతీయుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని నేషనల్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ఆశ్రమగృహంలోని అంధ బాలలపై ముర్రే డెనిస్వార్డ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బ్రిటన్‌లోని గ్లౌస్స్టెర్షైర్కు చెందిన ముర్రే ఢిల్లీలోని వసంత్‌కుంజ్ ఎన్‌క్లేవ్‌లో అద్దెకు ఉంటున్నాడు. అతను శనివారం సాయంత్రం డార్మిటరీలో అంధ బాలకులపై లైంగిక అకృత్యాలకు పాల్పడుతుండగా.. ఆశ్రమానికి చెందిన ఓ ఉద్యోగి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. అంధ బాలలపై అతని అకృత్యాన్ని ఉద్యోగి తన ఫోన్లో రికార్డు చేసి.. వెంటనే ఆశ్రమం నిర్వాహకులకు సమాచారం ఇచ్చాడని, ముర్రె తానేం తప్పు చేయలేదని బుకాయిస్తున్నా..అతనికి వ్యతిరేకంగా వీడియో ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసు అధికారి ఆర్పీ ఉపాధ్యాయ్ తెలిపారు. -
పాశ్చాత్యుల్ని వీడని రంగు జబ్బు
చర్మం రంగు కారణంగా భారత మూలాలున్న బ్రిటన్ వ్యక్తిని నిర్బంధించిన అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు లండన్: శాస్త్ర సాంకేతిక రంగాల్లో శరవేగంగా వస్తున్న మార్పులతో ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయినా పాశ్చాత్యుల్లో గూడు కట్టుకున్న వర్ణ వివక్ష మాత్రం ఇంకా తుడిచి పెట్టుకుపోలేదు. తాజాగా భారత సంతతికి చెందిన బ్రిటన్ వ్యక్తికి అమెరికాలో ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. చర్మం రంగు కారణంగా అమ్రీత్ సురానా అనే వ్యక్తిని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు 13 గంటల పాటు నిర్బంధించి అనంతరం తిప్పి పంపేశారు. యూకే సెక్యూరిటీ కంపెనీలో ఇంటర్నేషనల్ మేనేజర్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల సురానా అరిజోనాలోని బ్రాంచ్ పరిశీలన నిమిత్తం లండన్ నుంచి అమెరికా వచ్చారు. డెట్రాయిట్లో దిగి కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వేచి చూస్తున్న సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. ‘అమెరికాలో వీసా లేకుండా ప్రయాణించడానికి అనుమతించిన 38 దేశాల్లో ఒక దేశానికి చెందిన వ్యక్తినని ఆధారాలు చూపినా నా చర్మం రంగు కారణంగా వారు దాన్ని నమ్మలేదు’ అని సురానా పేర్కొన్నారు. సురానాను తిప్పి పంపడంపై యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటక్షన్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. 20 నిమిషాల వ్యవధిలోనే వారు నన్ను అమెరికాలో ఉద్యోగం కోసం వచ్చిన అక్రమ వలసదారుగా నిర్ధారించారని సురానా వాపోయారు. -
'ఎయిర్ పోర్ట్ ఖాళీ చేయించారు'
ఆమ్స్టర్డామ్: ఓ వ్యక్తి 'నా దగ్గర బాంబు ఉంది' అని అరవడంతో అధికారులు విమానాశ్రయాన్ని ఖాళీ చేయించిన ఘటన నెదర్లాండ్స్ లో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఆమ్స్టర్డామ్ లోని స్చిపోల్ విమానాశ్రయం ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఆ సమయంలో బ్రిటన్‌కు చెందిన 29 ఏళ్ల ఓ వ్యక్తి హఠాత్తుగా.. నా దగ్గర బాంబు ఉంది అని అరిచాడు. దీంతో భద్రతా అధికారులు అప్రమత్తమై ప్రయాణికులను ఖాళీ చేయించారు. అధికారులు స్నిఫర్ డాగ్‌లను రంగంలోకి దింపి సదరు వ్యక్తి లగేజ్‌ను చెక్ చేయించారు. అయితే అతడి వద్ద ఎలాంటి విస్పోటక పదార్థాలు లభించలేదు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని.. అలా ఎందుకు ప్రవర్తించాడు అన్న దానిపై విచారణ జరుపుతున్నారు. సుమారు 20 నిమిషాల అనంతరం ఎలాంటి బాంబు లేదని నిర్థారించుకున్న తరువాత ప్రయాణికులను విమానాశ్రయంలోకి అనుమతిచ్చారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఉగ్రవాద దాడులు జరగొచ్చనే హెచ్చరికలతో పలు యూరప్ దేశాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. -
పిల్లల్ని కనడమే అతని బిజినెస్
లండన్: పిల్లల్ని కనడమే అతని బిజినెస్. ఇప్పటివరకు 20 మంది ప్రియురాళ్ల ద్వారా 40 మంది పిల్లల్ని కన్నాడు. వారిలో సగం మంది పిల్లల పేర్లు కూడా అతనికి గుర్తు లేదట. వారిలో కొందరుపిల్లలు తన కళ్ల ముందునుంచి వెళ్తున్నా అతను గుర్తించలేడట. ఎవరి విషయంలోనైనా డౌటొస్తే వారు తన పిల్లలేనా, కాదా అన్న విషయం నిర్ధారించుకోడానికి వారిని పిలిచి వీపు చూస్తాడట. ఎందుకంటే తనకు పుట్టిన ప్రతి సంతానం వీపుపైన వాళ్ల పేరును, దాంతోపాటు వంశవృక్షాన్ని పచ్చబొట్టు పొడిపించాడు. ఛానల్-5 కార్యక్రమానికి హాజరైన ఆ పిల్లల తండ్రి తన పూర్తి వివరాలను వెల్లడించాడు. బ్రిటన్‌లోని మాన్మౌత్షైర్లో నివసిస్తున్న అతని పేరు మైక్ హాల్పిన్. అతనికి ప్రస్తుతం 53 ఏళ్లు. అతనికి మూడేళ్ల నుంచి 37 ఏళ్ల వయస్సుగల 40 మంది పిల్లలున్నారు. తనకు తెలియకుండా ఇంకా కొంతమంది పిల్లలుండొచ్చని అతని అనుమానం. ఒకరిద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఉద్యోగం చేసేవాడట. పిల్లలు పెరగడంతో వారి పోషణార్థం బ్రిటన్ ప్రభుత్వం భత్యం చెల్లించడం మొదలయ్యాక పిల్లల్ని కనడమే పనిగా పెట్టుకున్నాడట. ప్రస్తుతం అతనికి ప్రభుత్వం ఏడాదికి రూ. 25 లక్షల వరకు చెల్లిస్తోంది. ఈలోగా తనకు మద్యం అలవాటు ఎక్కువవడంతో పిల్లల పోషణ భారమైందట. దీంతో సామాజిక సేవా సంస్థలు 26 మంది పిల్లల్ని దత్తత తీసుకొని పోషిస్తున్నాయట. మద్యం అలవాటు నుంచి బయటపడేందుకు తాను కూడా తీవ్రంగా కృషి చేస్తున్నానని చెప్పాడు. ప్రస్తుతం హాల్పిన్ ప్రభుత్వ హాస్టల్లో ఫియాన్సీ డయానా మోరిస్‌తో కలిసి ఉంటున్నాడు. అయితే ప్రియురాళ్లతో సెక్స్‌లో పాల్గొనడం, వారి ద్వారా సంతానం కనడం మాత్రం ఎప్పటికీ ఆపనని చెప్పాడు. పిల్లలు దేవుడిచ్చిన వరాలని, కుటుంబ నియంత్రణ పాటించడం మహాపాపమని, ఒంట్లో శక్తి ఉన్నంతవరకు పిల్లల్ని కంటూనే ఉంటానంటూ 'గో ఫోర్త్ అండ్ మల్టీప్లై' అనే బైబిల్ సూక్తిని వల్లించాడు. ఎంతమంది ఫియాన్సీలతో తిరిగినా తమకభ్యంతరం లేదని, పిల్లలకు మాత్రం ఫుల్స్టాప్ పెట్టమని బ్రిటన్ టాక్స్ పేయర్స్ గొడవపెడుతున్నారు. -
బుర్రలో పురుగు తొలిచేస్తోంది!!
మన ఆలోచనలు సరిగా లేకపోతే, ఏ విషయమూ తేలకపోతే బుర్రలో పురుగు తొలిచేస్తోందంటాం కదూ. కానీ, బ్రిటన్‌లో నిజంగానే ఓ వ్యక్తి బుర్రలో అత్యంత అరుదైన ఓ ఏలికపాము కనిపించింది. అది ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగేళ్లుగా అతడి బుర్రలో కాపురం ఉంటోందట! దీంతో ఈ రకమైన పరాన్నజీవిని గుర్తించి, దానికి చికిత్స చేసేందుకు ఇప్పుడో కొత్త అవకాశం ఏర్పడిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. స్పిరోమెట్రా ఎరినాస్యురోపై అనే ఈ ఏలికపాము 1953 నుంచి ఇప్పటివరకు కేవలం 300 సార్లము మాత్రమే కనిపించింది. ఇక బ్రిటన్‌లో అయితే ఇప్పటివరకు ఇది కనిపించడం ఇదే తొలిసారి. ఈ పురుగు ఉండటం వల్ల శరీర కణజాలాల్లో వాపు వస్తుంది. ఈ లక్షణాన్ని స్పార్గానోసిస్ అంటారు. ఇది మెదడులో వచ్చినప్పుడు తలనొప్పితో పాటు.. జ్ఞాపకశక్తి కూడా పోతుంది. ఒక సెంటీమీటరు పొడవున్న ఈ పురుగును గుర్తించి తీసేలోపు అది మెదడులో కుడినుంచి ఎడమవైపు ఐదు సెంటీమీటర్ల దూరం ప్రయాణించింది.