అంధులపై అఘాయిత్యం: విదేశీ కామాంధుడి అరెస్టు | British man arrested in Delhi for sexually abusing blind kids | Sakshi
Sakshi News home page

అంధులపై అఘాయిత్యం: విదేశీ కామాంధుడి అరెస్టు

Published Tue, Sep 5 2017 9:25 AM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM

అంధులపై అఘాయిత్యం: విదేశీ కామాంధుడి అరెస్టు - Sakshi

అంధులపై అఘాయిత్యం: విదేశీ కామాంధుడి అరెస్టు

న్యూఢిల్లీ: అంధ బాలలపై అఘాయిత్యానికి ఒడిగట్టిన బ్రిటిష్‌ జాతీయుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ బ్లైండ్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ఆశ్రమగృహంలోని అంధ బాలలపై ముర్రే డెనిస్‌వార్డ్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బ్రిటన్‌లోని గ్లౌస్‌స్టెర్‌షైర్‌కు చెందిన ముర్రే ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌ ఎన్‌క్లేవ్‌లో అద్దెకు ఉంటున్నాడు.

అతను శనివారం సాయంత్రం డార్మిటరీలో అంధ బాలకులపై లైంగిక అకృత్యాలకు పాల్పడుతుండగా.. ఆశ్రమానికి చెందిన ఓ ఉద్యోగి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. అంధ బాలలపై అతని అకృత్యాన్ని ఉద్యోగి తన ఫోన్‌లో రికార్డు చేసి.. వెంటనే ఆశ్రమం నిర్వాహకులకు సమాచారం ఇచ్చాడని, ముర్రె తానేం తప్పు చేయలేదని బుకాయిస్తున్నా..అతనికి వ్యతిరేకంగా వీడియో ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసు అధికారి ఆర్పీ ఉపాధ్యాయ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement