న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఉన్నతాధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. మహిళా, శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సీనియర్ అధికారిని సస్పెండ్ చేస్తూ సోమవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉత్తర్వులు జారీ చేశారు. స్నేహితుడి కుమార్తె అయిన మైనర్‌పై గత కొన్ని నెలలుగా అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా ఆమె ఆమె గర్భం దాల్చడానికి కారకుడయ్యాడనే కారణంతో ఆప్ సర్కార్ చర్యలు చేపట్టింది. అదే విధంగా నేటి సాయంత్రం 5 గంటల్లోగా ఈ ఘటనకు సంబంధించి నివేదిక అందించాల్సిందిగా సీఎస్‌ను ఆదేశించారు..
కాగా మహిళా శిశు అభివృద్ధి శాఖలో డిప్యూటీ డైరెక్టర్ ప్రమోదయ్ ఖాఖాకు.. తన స్నేహితుడు కుమార్తెతో తొలిసారి చర్చిలో పరిచయం ఏర్పడింది. 2020 అక్టోబర్1న స్నేహితుడు మరణించడంతో అతడి కుమార్తె బాధ్యతను తాను చూసుకుంటానని చెప్పాడు. అనంతరం ఆమెను తన ఇంటికే తీసుకెళ్లాడు. బాలిక అతన్ని మామ అని పిలిచేది.
ఈ క్రమంలో నవండర్ 2020 నుంచి 2021 జనవరి మధ్య అనేకసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం నిందితుడు భార్యకు బాధితురాలు తెలియజేయగా.. బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆమె కూడా అతడికి సహకరించింది. తన కుమారుడితో గర్భస్రావ మాత్రలు తెప్పించి బాలికతో మింగించింది. అనంతరం 2021 జనవరిలో తన తల్లి ఇంటికి తిరిగి వచ్చింది.
అయితే బాలిక ఈ నెలలో అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆమె తల్లికి సమాచారమివ్వగా తనకు ఎదురైన వేధింపులను ఆమెకు వివరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.నిందితుడిపై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం ఆమె ఇంకా కోలుకుంటోంది. మరోవైపు బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదైంది. దీంతో ప్రమోదయ్ ఖాఖాతోపాటు ఆయన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
చదవండి: సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..
ఈ ఘటనపై ఆప్ నేత సురభ్ భరద్వాజ్ తీవ్రంగా స్పందించారు. ‘సదరు అధికారి చేసింది హేయమైన పని. నిందితుడి భార్య కూడా ఈ నేరంలో భాగమైంది. ఈ ఘటన సమాజానికి మాయని మచ్చ. ఇలాంటి చర్యలను సహించేది లేదు. త్వరలోనే కఠిన చర్యలు తీసుకోవాలి. నిందితుడైన అధికారిని సస్పెండ్ చేయాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. సీఎస్ నుంచి సాయంత్ర 5 గంటల వరకు నివేదిక కోరారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం ఢిల్లీ పోలీసులు విఫలమవ్వడం దారుణమైన అంశం. ఇది సిగ్గుమాలిన చర్చ. ఆ అధికారిని చట్టపరంగా పూర్తి స్థాయిలో శిక్షించాలి’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment