ఇంగ్లాండ్: యాప్ ఆధారిత క్యాబ్ సేవలను అందిస్తున్న ఉబర్.. చాలా మందికి సుపరిచితమే. ఏ చిన్న జర్నీ ఉన్నా ఉబర్‌ను చాలా మంది ఉపయోగించి క్యాబ్ బుక్ చేసుకుంటారు. ఛార్జీలు వందల నుంచి వేల వరకు ఉండొచ్చు. కానీ, లక్షల్లో ఉంటుందని మీరెప్పుడైనా ఊహించారా?. ఓ బ్రిటిష్ వ్యక్తికి కేవలం 15 నిమిషాల రైడ్‌కు ఏకంగా రూ.32 లక్షల ఛార్జ్ చేసి ఊహించని షాకిచ్చింది ఉబర్. క్యాబ్ సంస్థ నుంచి వచ్చిన మెసేజ్ చూసుకుని బాధితుడు ఒక్క క్షణం దిగ్భ్రాంతికి లోనైనట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. 15 నిమిషాల రైడ్‌కు 38,317 డాలర్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా 32 లక్షల రూపాయలు ఉబర్ ఛార్జ్ చేసినట్లు తెలిపింది.
ఇంగ్లాండ్, మాంచెస్టర్‌లోని బక్స్టన్ ఇన్ ప్రాంతంలో తన పని ముగించుకుని రైడ్ షేర్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నారు ఒలివర్ కల్పన్(22). తాను పని చేసే బార్ నుంచి నాలుగు మైళ్ల దూరంలోని విచ్‌వుడ్‌లో తన స్నేహితుడిని కలవాలనుకున్నారు. ఉబర్ భారీ మొత్తంలో ఛార్జ్ చేయటంపై బాధితుడు కల్పన్ సౌత్ వెస్ట్ న్యూస్ సర్వీస్‌కు వివరించాడు. ‘చాలా సార్లు ఉబర్ మాదిరి యాప్‌ల ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఎప్పుడూ ఎలాంటి సమస్య రాలేదు. ఎప్పుడైనా 11-12 డాలర్లు(రూ.900-1000) ఛార్జ్ చేసేవారు. ఈసారి ఉబర్‌లో కారు బుక్ చేసుకోగా.. కేవలం 15 నిమిషాల జర్నీ చేశాను. ఆ తర్వాతి రోజు ఉబర్ నుంచి మెసేజ్ రావటంతో షాక్ అయ్యా. మొత్తం 35,427 పౌండ్లు(39,317 డాలర్లు) ఛార్జ్ చేసినట్లు తెలిసింది.’ అని బాధితుడు కల్పన్ తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న బాధితుడు కల్పన్.. వెంటనే ఉబర్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. తన బ్యాంకు ఖాతాలో అంత డబ్బు లేకపోవటంతో వారు తీసుకోలేకపోయారని పేర్కొన్నాడు. తొలుత ఛార్జ్ అమౌంట్ చూసి ఉబర్ కస్టమర్ కేర్ వాళ్లు సైతం తికమక పడ్డారు. అయితే.. కల్పన్ రైడ్ గమ్య స్థానం ఆస్ట్రేలియాగా నమోదు కావటంతో భారీ స్థాయిలో ఛార్జ్ చేయాల్సి వచ్చినట్లు గుర్తించారు. ఇంగ్లాండ్‌లోని విచ్‌వుడ్ కాకుండా.. ఆస్ట్రేలియా, విక్టోరియాలోని విచ్‌వుడ్‌గా నమోదైనట్లు తేలింది. బ్యాంకులో సరైన నిధులు లేకపోవటంతో ఉబర్ విత్‌డ్రా చేయలేకపోయింది. ఒకవేళ నగదు ఉండి ఉంటే.. తిరిగి తీసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు కల్పన్.
ఇదీ చదవండి: Hong Kong టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన టికెట్లు ఫ్రీ
Comments
Please login to add a commentAdd a comment