Cab ride
-
నైట్‌లో ముంబయి మొదటిస్థానం.. వీకెండ్లో..
ట్యాక్సీ సర్వీసులను అందించే ఉబర్ సంస్థ 2023లో చేసిన పర్యటనలకు సంబంధించి ఆసక్తికర విషయాలను విడుదల చేసింది. ఈ ఏడాది దిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, పుణెల్లో ఎక్కువ మంది రైడ్ బుక్ చేసినట్లు సంస్థ వెల్లడించింది. రాత్రి సమయంలో వచ్చిన బుకింగ్‌ల విషయానికొస్తే.. ముంబయి మొదటిస్థానంలో నిలిచింది. వీకెండ్లో మాత్రం కోల్‌కతాలోని ప్రజలు ఎక్కువగా బుక్ చేసుకున్నారు. 2023 సంవత్సరానికిగాను ఉబర్ రైడ్స్ రికార్డు స్థాయిలో 6800 కోట్ల కిలోమీటర్లలో సేవలందించిందని తెలిపింది. ఇది దేశంలోని మొత్తం రోడ్ నెట్‌వర్క్‌లో వెయ్యి రెట్లు అని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..? ఉబెర్ వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలు రైడ్స్‌లో ఎక్కువ భాగం సాయంత్రం 6-7 గంటల మధ్య షెడ్యూల్ చేస్తున్నవే. శనివారం ఉబెర్ ఫేవరెట్ డే. ఆ రోజే అధికంగా బుకింగ్స్ వస్తున్నాయి. రైడ్ బుక్ చేసిన ట్రిప్‌ల సంఖ్య పరంగా దసరా, క్రిస్మస్ అత్యంత ప్రజాదరణ పొందిన రోజులు. ఒక్క డిసెంబర్లోనే అత్యధిక సంఖ్యలో రైడ్లు బుక్ అయినట్లు సంస్థ తెలిపింది. విమానాశ్రయాలకు అధిక సంఖ్యలో ఉబర్ ట్రిప్‌లు ఉదయం 4-5 గంటల మధ్య బుక్ అయ్యాయి. -
క్యాబ్‌లోంచి పాపను విసిరేసి.. తల్లిపై వేధింపులు!
ముంబై: దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలు దారుణాలు ఒడిగడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. క్యాబ్‌లో ప్రయాణిస్తున్న ఓ వివాహితను వేధించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆమె ఒడిలోని పది నెలల పాపను క్యాబ్ నుంచి బయటకు విసిరేశారు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. వారి చర్యను ప్రతిఘటించటంతో బాధితురాలిని సైతం క్యాబ్ నుంచి తోసేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ముంబై-అహ్మదాబాద్ హైవేలో పెల్హార్ నుంచి పోషేర్కు వెళ్తున్న క్రమంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. వడా తాహసీల్‌లోని పెల్హార్ నుంచి పోషేర్కు ఓ వివాహిత తన పాపతో క్యాబ్‌లో వెళ్తోంది. మార్గమధ్యలో డ్రైవర్‌తో పాటు తోటి ప్రయాణికులు ఆమెపై వేధింపులకు పాల్పడ్డారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో.. పాపను లాక్కొని, క్యాబ్ నుంచి బయటకు విసిరేశారు. దీంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమెను బయటకు నెట్టేశారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకుని మాండ్వీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: వ్యభిచార ముఠా పట్టివేత.. మహిళ అరెస్ట్ -
కస్టమర్‌కు ‘ఉబర్’ షాక్..15 నిమిషాల రైడ్‌కు రూ.32 లక్షలు
ఇంగ్లాండ్: యాప్ ఆధారిత క్యాబ్ సేవలను అందిస్తున్న ఉబర్.. చాలా మందికి సుపరిచితమే. ఏ చిన్న జర్నీ ఉన్నా ఉబర్‌ను చాలా మంది ఉపయోగించి క్యాబ్ బుక్ చేసుకుంటారు. ఛార్జీలు వందల నుంచి వేల వరకు ఉండొచ్చు. కానీ, లక్షల్లో ఉంటుందని మీరెప్పుడైనా ఊహించారా?. ఓ బ్రిటిష్ వ్యక్తికి కేవలం 15 నిమిషాల రైడ్‌కు ఏకంగా రూ.32 లక్షల ఛార్జ్ చేసి ఊహించని షాకిచ్చింది ఉబర్. క్యాబ్ సంస్థ నుంచి వచ్చిన మెసేజ్ చూసుకుని బాధితుడు ఒక్క క్షణం దిగ్భ్రాంతికి లోనైనట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. 15 నిమిషాల రైడ్‌కు 38,317 డాలర్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా 32 లక్షల రూపాయలు ఉబర్ ఛార్జ్ చేసినట్లు తెలిపింది. ఇంగ్లాండ్, మాంచెస్టర్‌లోని బక్స్టన్ ఇన్ ప్రాంతంలో తన పని ముగించుకుని రైడ్ షేర్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నారు ఒలివర్ కల్పన్(22). తాను పని చేసే బార్ నుంచి నాలుగు మైళ్ల దూరంలోని విచ్వుడ్లో తన స్నేహితుడిని కలవాలనుకున్నారు. ఉబర్ భారీ మొత్తంలో ఛార్జ్ చేయటంపై బాధితుడు కల్పన్ సౌత్ వెస్ట్ న్యూస్ సర్వీస్‌కు వివరించాడు. ‘చాలా సార్లు ఉబర్ మాదిరి యాప్‌ల ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఎప్పుడూ ఎలాంటి సమస్య రాలేదు. ఎప్పుడైనా 11-12 డాలర్లు(రూ.900-1000) ఛార్జ్ చేసేవారు. ఈసారి ఉబర్‌లో కారు బుక్ చేసుకోగా.. కేవలం 15 నిమిషాల జర్నీ చేశాను. ఆ తర్వాతి రోజు ఉబర్ నుంచి మెసేజ్ రావటంతో షాక్ అయ్యా. మొత్తం 35,427 పౌండ్లు(39,317 డాలర్లు) ఛార్జ్ చేసినట్లు తెలిసింది.’ అని బాధితుడు కల్పన్ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బాధితుడు కల్పన్.. వెంటనే ఉబర్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. తన బ్యాంకు ఖాతాలో అంత డబ్బు లేకపోవటంతో వారు తీసుకోలేకపోయారని పేర్కొన్నాడు. తొలుత ఛార్జ్ అమౌంట్ చూసి ఉబర్ కస్టమర్ కేర్ వాళ్లు సైతం తికమక పడ్డారు. అయితే.. కల్పన్ రైడ్ గమ్య స్థానం ఆస్ట్రేలియాగా నమోదు కావటంతో భారీ స్థాయిలో ఛార్జ్ చేయాల్సి వచ్చినట్లు గుర్తించారు. ఇంగ్లాండ్‌లోని విచ్‌వుడ్ కాకుండా.. ఆస్ట్రేలియా, విక్టోరియాలోని విచ్వుడ్గా నమోదైనట్లు తేలింది. బ్యాంకులో సరైన నిధులు లేకపోవటంతో ఉబర్ విత్‌డ్రా చేయలేకపోయింది. ఒకవేళ నగదు ఉండి ఉంటే.. తిరిగి తీసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు కల్పన్. ఇదీ చదవండి: Hong Kong టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన టికెట్లు ఫ్రీ -
మందుబాబు దూకుడు.. పోలీసుల్నే 'ఢీ' కొట్టాడు
సాక్షి, కేపీహెచ్‌బీ కాలనీ: మద్యం సేవించి వాహనం నడుపుతూ వచ్చిన వ్యక్తి డ్రంకన్ డ్రైవ్ తనిఖీ విధుల్లో ఉన్న హోంగార్డుతో పాటు ఓ మహిళను ఢీకొట్టాడు. దీంతో వారికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకొని వివరాలు సేకరిస్తున్న ఏఎస్ఐని అతివేగంతో వచ్చిన మరో ట్యాక్సీ డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో ఆయన రోడ్డు పక్కనే ఉన్న రాయిపై ఎగిరిపడ్డారు. తల, కాలుకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఉదంతమంతా కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రాత్రి 10 గంటల సమయంలో నిజాంపేట రోడ్డులోని కొలన్ రాఘవరెడ్డి గార్డెన్స్ సమీపంలో కేపీహెచ్‌బీ లా అండ్ ఆర్డర్, కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా డ్రంక్ డ్రైవ్ చేపట్టారు. సుమారు 11.40 గంటల సమయంలో బాచుపల్లికి చెందిన సృజన్.. పవన్‌తో కలసి మద్యం సేవించి తన స్నేహితుడైన శ్రీధర్‌ను పికప్ చేసుకునేందుకు నిజాంపేట వైపు టీఎస్03 ఈజెడ్ 9119 నంబర్ గల క్రెటా వాహనంలో బయలుదేరారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న విషయాన్ని గుర్తించి వారి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుండగా కానిస్టేబుల్ రాజ్‌కుమార్ వారి కారు వద్దకు వచ్చి ఆపాలని సూచించాడు. దీంతో సృజన్ కారును వేగంగా రివర్స్ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో హోంగార్డు ప్రహ్లాద్‌తో పాటు తనూజ అనే మహిళను ఢీకొట్టాడు. ఎస్ఐ సక్రమ్ అప్రమత్తమై గాయాలైన ప్రహ్లాద్, తనూజను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన సృజన్‌ను అదుపులోకి తీసుకుని బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా 174గా నమోదు కావడం విశేషం. కారులో ఉన్న సృజన్ స్నేహితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దూసుకొచ్చిన క్యాబ్... ఈ ఘటన గురించి తెలుసుకున్న నైట్ రౌండింగ్ ఏఎస్ఐ మహిపాల్‌రెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతున్న చోటుకు చేరుకున్నాడు. మహిపాల్‌రెడ్డి ప్రమాద వివరాలను నోట్ చేసుకుంటుండగానే అర్ధరాత్రి 12.10 గం. సమయంలో టీఎస్08 యూడీ 2984 నంబర్ గల క్యాబ్‌ను అతి వేగంగా నడుపుతూ అటుగా వచ్చిన అస్లాం అలీ.. మహిపాల్‌రెడ్డిని ఢీకొట్టాడు. ఆయన ఎగిరి రోడ్డు పక్కనే ఉన్న రాయిపై పడటంతో కాలు, తలకు తీవ్రగాయాలయ్యాయి. మహిపాల్‌రెడ్డిని కొండాపూర్‌లోని కిమ్స్‌కు తరలించారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆస్పత్రికి వెళ్లి మహిపాల్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన సృజన్, అస్లాం అలీలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
2030 నాటికి అన్నీ ఎలక్ట్రిక్ కార్లే!
సాక్షి, న్యూఢిల్లీ/ కాలిఫోర్నియా : అమెరికన్ క్యాబ్ సేవల సంస్థ లిఫ్ట్ కార్పొరేషన్ జీరో-ఎమిషన్ వాహనాలకు మారే ప్రణాళికలను ప్రకటించింది. 2030 నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాలతో సేవలను అందించనున్నామని తెలిపింది. కొత్త విధానాలకు అనుగుణంగా కరోనా, లాక్ డౌన్ సంక్షోభ కాలాన్ని ఒక అవకాశంగా తీసుకుని సరికొత్తగా ముందుకు వెళుతున్నామని కంపెనీ ప్రకటించింది. అయితే ఉద్గార నిబంధనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మారేందుకు వీలుగా డ్రైవర్లకు దీనికి విధాన రూపకర్తలు , వాహన తయారీదారులు ఆర్థిక ప్రోత్సాహకాలందించాలని కోరింది. కరోనా మహమ్మారి ప్రేరిత విపత్తునుంచి బయటకు రావాలని భావిస్తున్నట్టు లిఫ్ట్ సహ వ్యవస్థాపకుడు జాన్ జిమ్మెర్ తాజాగా వెల్లడించారు. అద్దె కార్ల కంపెనీలు, లక్షల మంది డ్రైవర్లను అందిస్తున్న స్వతంత్ర కాంట్రాక్టర్ల సమన్వయంతో పనిచేయనున్నామని తెలిపారు. తద్వారా లక్షల మెట్రిక్ టన్నుల కాలుష్య కారకాలను వాతావరణంలోకి రాకుండా నిరోధించవచ్చని కంపెనీ అభిప్రాయపడింది. బలమైన ఛార్జింగ్ నెట్వర్క్, అన్నింటికంటే ముఖ్యంగా డ్రైవర్ల సహకారం అవసరమన్నారు. అలాగే ఇ-వాహనాల వినియో డ్రైవర్లకు ప్రోత్సాహకాలు అందివ్వనున్నట్టు తెలిపారు. క్యాబ్ సేవల సంస్థలు సగటు ప్రయాణికుల కంటే 50 శాతం ఎక్కువ కాలుష్య కారకాలను వెదజల్లుతున్నాయని ఆరోపిస్తూ, ఉద్గారాలను తగ్గించేందుకు కొత్త నిబంధనలను తీసుకురానున్నట్టు కాలిఫోర్నియా రెగ్యులేటరీ నిర్ణయించింది. ఈ నిబంధనలు లిఫ్ట్ కు ప్రతికూలంగా మారనున్నాయని విశ్లేషకులు అంచనా . దీంతో సంస్థ తాజా నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19, లాక్ డౌన్ కారణంగా క్యాబ్ సేవల కంపెనీలు సంక్షోభంలో పడిపోయాయి. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు వేలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ క్రమంలో లిప్ట్ కూడా 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం 1 శాతం కంటే తక్కువ ఎలక్ట్రిక్ కార్లను లిఫ్ట్ నడుపుతోంది. -
ఎక్కడుంటావో తెలుసు.. వదిలిపెట్టను!
నువ్వు ఎక్కడుంటావో నాకు తెలుసు.. నిన్ను వదిలిపెట్టను అని ఓలా క్యాబ్ డ్రైవర్ తన ప్యాసింజర్ అయిన అమ్మాయిని బెదిరించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఓలాకు కంప్లైంట్ చేయడంతో వెంటనే స్పందించి అతడ్ని ఉద్యోగంలోంచి తీసేసింది. అసలేం జరిగిదంటే.. బెంగళూరులో ఉండే అర్జితా బెనర్జీ తన అక్క ఇంటికి వెళ్లడానికి ఆమె తండ్రి ఓలా క్యాబ్‌ను బుక్ చేశారు. ఆ వెంటనే ఆ క్యాబ్ డ్రైవర్‌కు ఫోన్ చేసిన అర్జితా.. పికప్ లొకేషన్‌కు వచ్చిన వెంటనే తనకు కాల్ చేయమని సూచించింది. దానికి.. తన నంబర్‌కు ఇష్టమొచ్చినప్పుడు కాల్ చేయండి మేడమ్ అని డ్రైవర్ బదులిచ్చాడు. ఆ సమాధానం తనకు నచ్చకపోయినా.. ఆలస్యమవుతుందన్న కారణంతో దగ్గర్లో మరో క్యాబ్ ఉండకపోయే సరికి ఆ క్యాబ్‌లోనే వెళ్లింది. తనతో పాటు మరి కొంతమంది కూడా ఆ షేరింగ్ క్యాబ్‌లో ఎక్కారు. అయితే ఆ క్యాబ్ డ్రైవర్.. మరీ నిదానంగా వెళ్తుండటంతో అందులో ఉన్నవారు కాస్త వేగంగా వెళ్లమని చెప్పేసరికి ఇష్టమొచ్చినట్లు డ్రైవ్ చేశాడు. సరిగా నడిపించమని కోరగా.. మళ్లీ సాధారణంగా డ్రైవ్ చేస్తూ అందర్నీ వారి డెస్టినేషన్‌లో దించేశాడు. చివరగా అర్జితా వంతు వచ్చింది. అర్జితాను ఎక్స్ట్రాగా రూ.200 ఇవ్వమని బెదిరించాడు. అందుకు నిరాకరించిన ఆమె.. తన తండ్రి ముందుగానే మని ఆన్లైన్లో కట్టేశాడని బదులిచ్చింది. కావాలంటే తన తండ్రితో మాట్లాడమని ఫోన్ ఇచ్చింది.. ఫోన్లో మాట్లాడుతూ.. నీ బిడ్డను ఎక్కడైనా వదిలేస్తాను.. చంపిపడేస్తాను అంటూ బెదిరించాడు. చివరకు ఆ డ్రైవర్ ఆమె ఫోన్ లాక్కున్నాడు. చుట్టుపక్కలా ఎవరూ సాయం రాకపోయేసరికి.. బయపడిన అర్జితా అతడికి రూ500 ఇచ్చి తన ఫోన్‌ను విడిపించుకుంది. వెళ్లేటప్పుడు అర్జితా అతడికి వార్నింగ్ ఇచ్చింది. దానికి ప్రతిగా.. తన అడ్రస్ తెలుసునని వదిలిపెట్టను అని ఆ క్యాబ్ డ్రైవర్ బెదిరించాడు. ఈ మేరకు అర్జితా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ క్యాబ్ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. -
‘కారు’ చౌక ప్రయాణం!
ఆటో చార్జీలతోనే క్యాబ్‌ల్లో అందుబాటులో లగ్జరీ సేవలు అంతర్జాతీయ సంస్థలు రాకతో మారిన పరిస్థితి ప్రత్యేక యాప్‌లు,ఆన్లైన్ బుకింగ్‌లు సిటీబ్యూరో: ఆటో చార్జీతో లగ్జరీ కారులో ప్రయాణం. అదీ మన మహా నగరంలో. మీరు చదివింది నిజమే. క్యాబ్‌లతో ఇది సాధ్యమవుతోంది. ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే క్యాబ్ ప్రయాణం అందుబాటులో ఉండేది.. అంతర్జాతీయ సంస్థల ప్రవేశంతో పరిస్థితి మారింది. సంస్థల మధ్య పోటీ పెరిగింది. అత్యాధునిక సౌకర్యాలు, తక్కువ ఖర్చుతో లగ్జరీ కార్లలో సగటు సిటిజనులు ప్రయాణించే సౌలభ్యం కలిగింది. ఇంక ఆలస్యం ఎందుకు? ఎంచక్కా ఆటో చార్జీలతోనే కారులో రయ్..రయ్ మంటూ నగరాన్ని చుట్టేయండి. నగరంలో ప్రస్తుతం గ్రీన్‌క్యాబ్స్, డాట్, ట్యాక్స్ ఫర్ ష్యూర్, ఓలా,ఊబర్, మేరు,ఫాస్ట్‌ట్రాక్, సీ క్యాబ్స్, స్కై క్యాబ్స్ తదితర సంస్థలు క్యాబ్ సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ఇండికా, ఇండిగో, సిడాన్, ఇన్నోవా, స్విఫ్ట్,స్విఫ్ట్ డిజైర్ వంటి వివిధ రకాలకు చెందిన 5000 కార్లు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. రోజూ 25 వేల నుంచి 30 వేల మంది ప్రయాణికులకు క్యాబ్స్ సేవలను వినియోగించుకొంటున్నారు. మేరు క్యాబ్స్ సుమారు 900 వాహనాలను కలిగి ఉండగా, డాట్స్,ఓలా, గ్రీన్‌క్యాబ్స్ సంస్థలు వందలాది వాహనాలను అందుబాటులో ఉంచాయి. ‘డిమాండ్ బాగా ఉంది. అన్ని క్యాబ్ సంస్థలు కలిసి ప్రస్తుతం ఈ డిమాండ్‌ను 60 శాతం మాత్రమే భర్తీ చేస్తున్నాయి. సమయాభావం, వాహనాల కొరతతో అందరికీ సేవలు అందించలేకపోతున్నాం’ అని నగరానికి చెందిన గ్రీన్‌క్యాబ్స్ సంస్థ ప్రతినిధి అనిల్ కొఠారీ అభిప్రాయపడ్డారు. జపాన్‌కు చెందిన ‘జపనీస్ సాఫ్ట్ బ్యాంక్’, శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ఊబర్ వంటి అంతర్జాతీయ సంస్థలు సేవలను విస్తరిస్తున్నాయి. క్యాబ్ సంస్థల మధ్య నెలకొన్న ఈ పోటీ వినియోగదారుడికి మేలు చేస్తోంది. యాప్‌లు,ఆన్లైన్ బుకింగ్‌లు... ఇప్పటికే ఢిల్లీ, ముంబయి, చెన్నై, పూనె నగరాల్లో క్యాబ్స్‌ను ప్రవేశపెట్టిన ఊబర్ సంస్థ ప్రస్తుతం హైదరాబాద్‌లో తన సేవలను ప్రారంభించింది. ఊబర్ వాహనాల కోసం ప్రయాణికులు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవలసి ఉంటుంది. చె ల్లింపులు కూడా ఆన్లైన్లోనే ఉంటాయి. ఇందుకోసం ప్రత్యేక యాప్‌లు ఉన్నాయి. ఊబర్ వంటి పెద్ద సంస్థలే కాదు. కొద్ది పాటి వాహనాలతో ఈ రగంలో కొనసాగుతున్న చిన్న చిన్న క్యాబ్ సంస్థలు సైతం వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ప్రత్యేక యాప్‌లతో ముందుకు వస్తున్నాయి. 300 వాహనాలతో ప్రయాణికులకు సేవలను అందజేస్తున్న గ్రీన్‌క్యాబ్స్ జీపీఆర్ఎస్, వెహికిల్ ట్రాకింగ్, యాప్,ఆన్లైన్ బుకింగ్ సేవలను కొనసాగిస్తోంది. లగ్జరీ వాహనాలు... ఇప్పటి వరకు ఇండికా, సీడాన్, ఇన్నోవా వంటి వాహనాలతో పాటు, మారుతీ స్విఫ్ట్ డిజైర్ వంటివి ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. దీంతో వాహనాల స్థాయిని బట్టి చార్జీల్లో మార్పులు తప్పనిరి. ఇండికా వంటి వాహనాల్లో కిలోమీటర్‌కు రూ.10 చొప్పున చార్జీ తీసుకుంటే, ఇన్నోవాల్లో రూ.15 చొప్పున తీసుకుంటున్నారు. స్విఫ్ట్డిజైర్లో ఇంకొంచెం ఎక్కువే. ఊబర్క్యాబ్స్ బీఎండబ్ల్యూ, మెర్సిడెస్‌బెంజ్, ఆడి వంటి లగ్జరీ వాహనాలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. 1.6 కిలోమీటర్ల కనీస దూరానికి ఆటో చార్జీ రూ.20. ఆ తరువాత ప్రతి కిలోమీటర్‌కు రూ.11 చొప్పున చార్జీ ఉంటుంది. ఈ లెక్కన సికింద్రాబాద్ నుంచి అమీర్‌పేట్‌కు సుమారు 10 కిలోమీటర్ల దూరానికి ఆటోచార్జి రూ.108. కానీ ఇప్పుడు కిలోమీఆటర్కు రూ.10 చొప్పున చెల్లించి కేవలం రూ.100తో సికింద్రాబాద్ నుంచి అమీర్‌పేట్ వరకు క్యాబ్ జర్నీ చేయవచ్చు. నగరంలో ఎక్కడి నుంచైనా సరే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు గతంలో రూ.490 వరకు చార్జీ విధించిన ఓలా క్యాబ్స్ ఇప్పుడు రూ.390కే ఆ సదుపాయాన్ని అందజేస్తోంది. ఓలా క్యాబ్స్‌తో మిగతా సంస్థలు సైతం పోటీ పడుతున్నాయి. ఇటీవల నగరంలో తన సేవలను ప్రారంభించిన ఊబర్ క్యాబ్స్ ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు అత్యాధునిక సదుపాయాలతో ఆకట్టుకుంటోంది.