Toddler Flung Out Of Cab Dies Mother Molested In Maharashtra - Sakshi
Sakshi News home page

క్యాబ్‌లోంచి చిన్నారిని విసిరేసి.. తల్లిపై వేధింపులు!

Published Sun, Dec 11 2022 10:49 AM | Last Updated on Sun, Dec 11 2022 1:02 PM

Toddler Flung Out Of Cab Dies Mother Molested In Maharashtra - Sakshi

ముంబై: దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలు దారుణాలు ఒడిగడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. క్యాబ్‌లో ప్రయాణిస్తున్న ఓ వివాహితను వేధించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆమె ఒడిలోని పది నెలల పాపను క్యాబ్ నుంచి బయటకు విసిరేశారు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. వారి చర్యను ప్రతిఘటించటంతో బాధితురాలిని సైతం క్యాబ్‌ నుంచి తోసేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ముంబై-అహ్మదాబాద్‌ హైవేలో పెల్హార్‌ నుంచి పోషేర్‌కు వెళ్తున్న క్రమంలో శనివారం జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. వడా తాహసీల్‌లోని పెల్హార్‌ నుంచి పోషేర్‌కు ఓ వివాహిత తన పాపతో క్యాబ్‌లో వెళ్తోంది. మార్గమధ్యలో డ్రైవర్‌తో పాటు తోటి ప్రయాణికులు ఆమెపై వేధింపులకు పాల్పడ్డారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో.. పాపను లాక్కొని, క్యాబ్‌ నుంచి బయటకు విసిరేశారు. దీంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమెను బయటకు నెట్టేశారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకుని మాండ్వీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: వ్యభిచార ముఠా పట్టివేత.. మహిళ అరెస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement