toddler died
-
క్యాబ్‌లోంచి పాపను విసిరేసి.. తల్లిపై వేధింపులు!
ముంబై: దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలు దారుణాలు ఒడిగడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. క్యాబ్‌లో ప్రయాణిస్తున్న ఓ వివాహితను వేధించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆమె ఒడిలోని పది నెలల పాపను క్యాబ్ నుంచి బయటకు విసిరేశారు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. వారి చర్యను ప్రతిఘటించటంతో బాధితురాలిని సైతం క్యాబ్ నుంచి తోసేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ముంబై-అహ్మదాబాద్ హైవేలో పెల్హార్ నుంచి పోషేర్కు వెళ్తున్న క్రమంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. వడా తాహసీల్‌లోని పెల్హార్ నుంచి పోషేర్కు ఓ వివాహిత తన పాపతో క్యాబ్‌లో వెళ్తోంది. మార్గమధ్యలో డ్రైవర్‌తో పాటు తోటి ప్రయాణికులు ఆమెపై వేధింపులకు పాల్పడ్డారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో.. పాపను లాక్కొని, క్యాబ్ నుంచి బయటకు విసిరేశారు. దీంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమెను బయటకు నెట్టేశారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకుని మాండ్వీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: వ్యభిచార ముఠా పట్టివేత.. మహిళ అరెస్ట్ -
ఎంత ఘోరం? పసికందు పేగులు తీసిన వీధి కుక్క
నోయిడా: తల్లిదండ్రులు భవన నిర్మాణంలో కూలీ పనులు చేసుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వారి ఏడు నెలల పసికందుపై ఓ వీధి కుక్క దాడి చేసింది. పేగులు బయటకు తీయటంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలోని హౌసింగ్ సొసైటీ లోటస్ బౌలేవార్డ్ సెక్టార్ 100లో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సంఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి శునకాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హౌసింగ్ సొసైటీలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కూలీ పని చేసుకునే ఓ కుటుంబం తమ 7 నెలల పాపతో అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం వీధి కుక్క దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన శిశువును నోయిడాలోని యదార్థ ఆసుపత్రి ఐసీయూలో చేర్చారు. పసికందు పేగులు బయటకు రావటం వల్ల వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయనా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం ఉదయం చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వీధి కుక్కలు దాడి చేయటం ఇదేం మొదటి సారి కాదని, ప్రతి 3-4 నెలలకోసారి దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు. నోయిడా అథారిటీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదన్నారు. నోయిడా హౌసింగ్ సొసైటీ ముందు స్థానికుల ఆందోళన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. ఈ విషయంపై ఏఓఏ స్పందించారు. నోయిడా అథారిటీతో మాట్లాడామని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతుందని తెలిపారు. ఇదీ చదవండి: చీకటి గదిలో బంధించి, బలవంతంగా పెళ్లి -
తుపాకితో ఆడుకుంటూ.. చిన్నారి మృతి
అమెరికాలో గన్ కల్చర్ పిల్లల ప్రాణాలు తీసేస్తోంది. తాజాగా సిన్సినాటి నగరంలో మూడేళ్ల చిన్నారి తన తల్లి బ్యాగ్‌లోంచి హ్యాండ్ గన్ తీసి దాంతో ఆడుకుంటుండగా పొరపాటున అది పేలి ప్రాణాలు కోల్పోయాడు. పిల్లాడు సరిగ్గా ఛాతీలోకి కాల్చుకోవడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. పిల్లాడి తల్లి ఎలిజబెత్ గ్రీన్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కొడుకు కాల్చేసుకున్నాడని, అతడి నాడి అందడంలేదని ఆమె గగ్గోలు పెడుతున్నట్లు వినిపించింది. దీంతో ఆమెపై కేసు పెట్టాలా లేదా అన్న విషయాన్ని ఇంకా తేల్చలేదు. తుపాకి తనదేనని, దాన్ని తన ఇంట్లో పర్సులో పెట్టుకుంటానని ఆమె తెలిపారు. పిల్లాడి పేరు మార్క్స్ గ్రీన్ అని గుర్తించారు. ప్రతియేటా అమెరికాలో ఇలా ప్రమాదవశాత్తు జరుగుతున్న తుపాకి కాల్పుల్లో సుమారు వంద మంది వరకు మరణిస్తున్నారు.