weight loss treatment
-
బరువు నిర్వహణకు ది బెస్ట్ 30-30-30 రూల్ డైట్..!
ఎన్నో రకాల డైట్ల గురించి విన్నాం. కానీ ఏంటిది 30-30-30 డైట్..?. కీటోజెనిక్ డైట్ నుంచి వీగన్ ప్లాన్స్, అడపాదడపా ఉపవాసం, అధిక-ప్రోటీన్ నియమాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ భోజనం ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఇలా నెంబర్ల రూల్‌తో కూడిన డైట్ ఏంటి..? మంచిదేనా అని సందేహించకండి. ఎందుకంటే పోషకాహార నిపుణులు ఈ డైట్ నూటికి నూరు శాతం మంచిదని కితాబిస్తున్నారు. మరీ ఆ డైట్ ఏంటి..? అందులో ఎలాంటి ఆహారం తీసుకుంటారో చూద్దామా...ప్రస్తుతం తీసుకునే డైట్లలో ఎక్కువగా అధిక బరువు సమస్యను తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండటం కోసం అనుసరించేవి. అయితే కొన్ని డైట్లతో తొందరగా ఫలితాలను అందుకోగలం. అదేవిధంగా అందరికీ అన్ని డైట్లు సరిపడవు కూడా. అయితే పోషకాహార నిపుణురాలు లోవ్నీత్ బాత్రా చెప్పే 30-30-30 డైట్ మాత్రం సత్వర ఫలితాలను ఇవ్వడమే గాక తొందరగా వెయిట్ లాస్ అవ్వుతారట. నిపుణుల సైతం నూటికి నూరు మార్కుల ఇస్తున్నారు ఈ డైట్‌కి. పైగా ఇది సమర్థవంతమైనది, ఆరోగ్యకరమైన వెయిట్ లాస్ డైట్ అని చెబుతున్నారు. ఈ డైట్ ఎలా ఉంటుందంటే..ఉదయం మేల్కోగానే 30 నిమిషాలలోపు 30 గ్రాముల ప్రోటీన్ తీసకోవాలి. ఆ తర్వాత 30 నిమిషాల పాటు తీవ్రతతో కూడిన వ్యాయామాలు చేయాలి. మనం ఎప్పుడైతే కేలరీలను తగ్గిస్తామో.. అప్పుడు శరీరంలో ఉన్న వేస్ట్ కొవ్వు అదనపు శక్తి కోసం ఖర్చువుతుంది. దీనివల్ల చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయి. అలాగే ఈ డైట్ పరంగా చేసే శక్తిమంతమైన వ్యాయామాలు కండరాలను బలోపేతం చేస్తాయి. ఇది ఒకరకంగా తినాలనే కోరికను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. అదీగాక ప్రతి ఉదయాన్ని 30 నిమిషాలలోపు 30 గ్రాముల ప్రోటీన్‌తో ప్రారంభిస్తారు కాబట్టి ఎక్కువ ఫుడ్ తీసుకోవాలనే ధ్యాస తెలియకుండానే తగ్గుతుందట. ఆటోమేటిగ్గా ఈ రూల్ గుర్తొచ్చి చకచక మన పనులు పూర్తిచేసుకునేలా మన మైండ్ సెట్ అయిపోవడంతో త్వరితగతిన ఫలితాలు అందుకుంటామని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. View this post on Instagram A post shared by Lovneet Batra (@lovneetb) (చదవండి: దీర్ఘాయువు మందులతో దుష్ప్రభావాలే ఎక్కువ..!: టెక్ మిలియనీర్) -
అద్భుతమైన ‘5’ టిప్స్‌తో 72 కిలోలు బరువు తగ్గింది!
బరువు తగ్గడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అలాగని అంత కష్టమూ కాదు. బాడీ తత్వాన్ని తెలుసుకుని సరైన ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులతో మనం కోరుకున్న బరువు లక్ష్యాన్ని చేరు కోవచ్చు. ఈ విషయాన్ని అంబర్ క్లెమెన్స్ మరోసారి నిరూపించారు. పట్టుదలగా, నిబద్దతగా కొన్ని రకాల నియమాలను పాటించి రెండేళ్లలో ఏకంగా 160 పౌండ్లు (72 కిలోలు) బరువును తగ్గించుకుంది. అంతేకాదు తగ్గిన బరువును స్థిరంగా కొనసాగిస్తోంది. ఈ ప్రయాణంలో తాను అనుసరించిన ముఖ్యమైన సూత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Amber Clemens (@amber_c_fitness)విజయవంతంగా బరువు తగ్గడం అనేది అలవాట్లను మార్చుకోవడంతో మొదలవుతుంది అంటుంది అంబర్. అంతకుముందు పిచ్చి పిచ్చిగా డైటింగ్ చేశానని, ఆ తరువాత తాను అనుసరించిన పద్దతి, ఆహార నియమాల మూలంగా చక్కటి ఫలితం సాధించానని తెలిపింది. ముఖ్యంగా ప్రతిరోజూ చేసే ఐదు విషయాలను పంచుకుంది. ప్రతి భోజనంతో కనీసం 25-20 గ్రాముల ప్రోటీన్‌ను తీసుకుంటుంది. అలాగే స్నాక్స్‌గా ఆమె 5-10 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటుంది. అలా ఆమె రోజువారీ తీసుకోవాల్సిన ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. ఎక్కువ నీళ్లు తాగడం చేయడం వలన మంచి ఫలితం సాధించానని చెప్పుకొచ్చింది. అద్భుతమైన 5 టిప్స్రోజుకి 7-10 వేల అడుగులు నడవడం: చిన్న అడుగులు పెద్ద మార్పులకు నాంది పలుకుతాయి. రోజూ నడవడం అలవాటుగా చేసుకుంటే అద్భుతాలు చేయవచ్చు. తన రోజుకి మరింత శారీరక శ్రమ కలిగేలా ఎక్కువగా నడవడం,లిఫ్ట్ లేదా ఎలివేటర్‌కు బదులుగా నడుచుకుంటూ వెళ్లానని అంబర్ చెప్పింది.3 లీటర్ల నీరు తాగడం: హైడ్రేషన్ కీలకం, కనీసం మూడు లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా , ఆరోగ్యంగా ఉంటుందని చెబుతోంది అంబర్.25-30 గ్రాముల ప్రోటీన్: ప్రతి భోజనంతో, అంబర్ కనీసం 25-20 గ్రాముల ప్రోటీన్‌ను తీసుకుంటుంది. స్నాక్స్ కోసం, ఆమె 5-10 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటుంది. ఇది ఆమె రోజువారీ ప్రోటీన్ తీసుకోవడం లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడిందట.ముందస్తు ప్లాన్ : రోజు రాత్రి ఆహారాన్ని ముందస్తుగా తినడం లాంటివి చేసింది. రేపు ఏం తినాలి అనేది ముందుగానే నిర్ణయించుకొని సిద్ధం చేసుకోవడం కూడా ఇందులో భాగంగా పాటించింది.కొద్దిగా స్వీట్: అలాగే స్వీట్స్ తినాలనే తన కోరిక మేరకు రాత్రి డెజర్ట్ లేదా టిఫిన్‌లో కొద్దిగా ఏదైనా తీపిని జోడించినట్టు తెలిపింది. అలాగే వ్యాయామాన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తూ చేయాలనీ, రోజుకి కనీసం 30 నిమిషాలు, వారానికి నాలుగు సార్లు చేయాలి. దీంతోపాటు మంచి నిద్ర ఉంటే చాలు బరువు తగ్గడం ఈజీ అంటోంది ఈ ఫిట్నెస్ కోచ్. -
'తల్లులు' డోంట్ వర్రీ!..ప్రసవానంతరం జస్ట్ 34 రోజుల్లోనే..!
మహిళలు ప్రసవానంతరం బరువు తగ్గడం అంత ఈజీ కాదు. బిడ్డను కన్న తర్వాత శరీరంలో వచ్చే మార్పులు కారణంగా బరువు తగ్గించుకోవడం అత్యంత సవాలుగా ఉంటుంది. ఇది చాలామంది తల్లులకు ఎదురయ్యే కఠిన సమస్య. అయితే దక్షిణాప్రికాకు చెందిన భారత సంతతి మహిళ మాత్రం ఈ సమస్యను అధిగమించి విజయవంతంగా బరువు తగ్గింది. అదికూడా 34 రోజుల వ్యవధిలోనే కేజీల కొద్దీ బరువు కోల్పోవడం విశేషం. ఆమె వెయిట్‌లాస్ జర్నీ ఎలా సాగిందంటే..దక్షిణాఫ్రికాకు చెందిన భారత సంతతి మహిళ రవిషా చిన్నప్ప వెయిట్ లాస్ జర్నీ ఎందరికో స్ఫూర్తినిస్తుంది. ఐవీఎఫ్ ద్వారా తల్లి అయిన రవిషా ప్రసవానంతరం అధిక బరువు సమస్యతో ఒక ఏడాదిపాటు చాలా ఇబ్బందులు పడింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బరువులో పెద్దగా మార్పు కనిపించలేదు. ఇక డైట్లో సమర్థవంతమైన మార్పులు తీసుకొస్తేనే బెటర్ అని భావించింది. అందుకోసం ఓ 'త్రీ ట్రిక్స్'ని క్రమంతప్పకుండా అనుసరించింది. అవే ఆమె బరువును వేగంగా తగ్గించేలా చేయడంలో కీలకంగా ఉపయోగపడ్డాయి. అవేంటంటే..మొదటిది..శరీరం హైడ్రేటెడ్ ఉంచుకునేలా చూడటం..రవిషా తల్లిగా బిజీ అయిపోవడంతో హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడంపై దృష్టిసారించలేకపోయినట్లు పేర్కొంది. నిజానికి కొవ్వుని కరిగించే మార్గాలలో హైడ్రేషన్ ఒకటి. అందుకోసం రవిషా తన ఫోన్ టైమర్ సహాయంతో హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకునేది. నిద్ర లేచినప్పటి నుంచి ప్రతి 90 నిమిషాలకు ఒకసారి టైమర్ ఆన్ అయ్యేలా సెట్ చేసింది వెంటనే 20 సిప్ల నీరు తాగేలా చూసేకునేది రవిషా. మన శరీర బరువులో సగం ఔన్సుల నీటిని తాగేలా ప్రయత్నిస్తే అది జీర్ణక్రియకు మద్దతు ఇవ్వడమే గాకుండా బరువు తగ్గించే ప్రయాణంలో కీలకంగా ఉంటుంది. రెండొవది ..ఆహారంలో మార్పులు..జీవనశైలిలో ఆహారాన్ని తీసుకునే విధానంలో కొద్దిపాటి మార్పులు చేసింది. ఎక్కువ ప్రొటీన్లు ఉండే ఆహారం తీసుకోవడంతో తియ్యటి పదార్థాలను తినాలనే కోరికను నియంత్రించుకుంది రవిషా. ప్రతిరోజూ కనీసం వంద గ్రాముల ప్రోటీన్‌ని ఉండేలా చూసుకునేది. ఇది దాదాపు 400 కేలరీలకు సమానం. ఒకరకంగా ఇది అనారోగ్యకరమైన ఆహారపదార్థాలు తినాలనే కోరికలను గణనీయంగా తగ్గించేలా చేయడమే గాక పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టిసారించేలా చేస్తుందని చెబుతోంది రవిషా. మూడొవది..క్రమం తప్పకుండా తన బరువుని చెక్‌చేసుకోవడం సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం వంటివి చేయాలి. ఎలాంటి ఒత్తిడికి, ఆందోళనలకి తావివ్వకుండా బరువు తగ్గేలా ఇంకేం చేయగలమో అనే దానిపై దృష్టిపెట్టడం, పాజిటివ్ మైండ్‌తో ఉండడం వంటివి చేయాలి. ముఖ్యంగా ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటోంది రవిషా. ఇక్కడ రవిషా బరువు తగ్గాలనే సంకల్పం తోపాటు ఎలాంటివి ఆహారాలు తీసుకుంటే శరీరానికి మంచిది అనేది తెలుసుకుని మరీ ఆచరణలో పెట్టింది. చివరగా పాజిటివ్ ఆటిట్యూడ్‌కి పెద్దపీట వేసింది. ఇవే ఆమెను ప్రసావానంతరం విజయవంతంగా బరువు తగ్గేలా చేశాయి.(చదవండి: భారతీయలు-అమెరికన్లు: ఆహారపు అలవాట్లలో ఇంత వ్యత్యాసమా..?) -
బరువు తగ్గాలని ఆ పిల్స్ తీసుకుంది, నరకం చూసింది!
బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేసి, ఫలితం దక్కక విసిగిపోతూ ఉంటారు చాలామంది. క్రమ తప్పని ఆహార నియమాలు, వ్యాయాంతో బరువు తగ్గడం సులభమే. అయితే ఈ ప్రక్రియ అందరికీ ఒకేలా ఉండదు. వారి శారీరక లక్షణాలు, శరీరతత్వాన్ని బట్టి సుదీర్ఘ కాలం పాటు ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది. అంతేగానీ విపరీత ధోరణులకు పోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. ఈ విచిత్రమైన కేసు గురించి తెలిస్తే.. గుండె గుభేలు మంటుంది.అమెరికాకు చెందిన కేన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ బెర్నార్డ్ హ్సు అందించిన కేస్‌స్టడీ వివరాల ప్రకారం ఒక మహిళ బరువు తగ్గించుకోవాలనే ఆరాటంలో టేప్‌వార్మ్ టాబ్లెట్లను వాడింది. ఫలితంగా బరువు తగ్గడం మాటేమో గానీ శరీరమంతా పురుగులు చేరి సర్వనాశనం చేశాయి. దీంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది, జ్ఞాపకశక్తిని కోల్పోయింది.ఆహారం ,వ్యాయామ నియమాలతో బరువు తగ్గడానికి చాలా కష్టాలు పడింది అయోవాకు చెందిన 21 ఏళ్ల యువతి. ఈ క్రమంలో టేప్‌వార్మ్ గుడ్లతో నిండిన మందులను వాడటం ద్వారా వేగంగా బరువు తగ్గవచ్చని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకొని క్రిప్టోకరెన్సీ సహాయంతో ఆ టాబ్లెట్లను కొనుగోలు చేసింది. మొదట్లో రెండు టేప్‌వార్మ్ మాత్రలు వేసుకుంది. అనుకున్నట్టుగా బరువు తగ్గడంలో కడుపులో నొప్పి, ఉబ్బరం లాంటి ఇబ్బందులొచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. ఒక వింత బాత్రూమ్ సంఘటన తర్వాత షాక్‌కు గురైంది. చెంపల మీద ఎవరో కొడుతున్నట్టు, చప్పట్లు కొట్టినట్టు శబ్దాలు వినబడ్డాయి. ప్లష్ చేయ బోతున్నపుడు నల్లగా, ముద్దలు ముద్దలుగా ఏవో పాకుతూ బయటకు రావడం చూసింది. (మనవడితో దాండియా స్టెప్పులేసిన నీతా అంబానీ, ఆ స్టార్ కిడ్ కూడా!)ఇక ఆత రువాత కొద్ది రోజుల్లోనే, గడ్డం కింద అసాధారణమైన గడ్డ వచ్చింది. దీంతోపాటు తీవ్రమైన తలనొప్పి , ఒత్తిడి వంటి మరికొన్ని లక్షణాలు కనిపించాయి. ఇది భరించలేక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేయించుకుంది. అది నెగెటివ్ వచ్చింది. కానీ ఉన్నట్టుండి, మతిమరుపు వచ్చింది.. ఒక గంట ముందు ఏం జరిగిందో కూడా గుర్తులేకుండాపోయింది. చివరికి వైద్యులను ఆశ్రయించింది. ఆమె మెదడు ,శరీరంలోని ఇతర భాగాలలో - నాలుక ,కాలేయంతో సహా పలు గాయాలను వైద్యులు గుర్తించారు. చివరికి తన డేంజరస్ డైట్ ను బయటపెట్టింది. TE అనే రెండు రకాల పరాన్నజీవుల (టేనియా సాగినాటా, టేనియా సోలియం) గుడ్లు రక్తంలోకి చేరి ఇన్ఫెక్షన్కు కారణమైనట్లు కనుగొన్నారు. చికిత్స అందించి ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. (Age is just a number 64 ఏళ్ల వయసులోఎంబీబీఎస్ : రిటైర్డ్ ఉద్యోగి సక్సెస్ స్టోరీ) బరువు తగ్గడానికి టేప్‌వార్మ్ గుడ్లను తీసుకోవడం అనే ఈ విచిత్రమైన పద్ధతి విక్టోరియన్ ఎరాలో వాడేవారట. ఈ పద్ధతి ఎంత సాధారణంగా ఉపయోగించారనేది అస్పష్టమని డాక్టర్ బెర్నార్డ్ వెల్లడించారు. ఇలాంటి పద్ధతుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.టేప్‌వార్మ్ ఎంత ప్రమాదకరం?పరాన్నజీవులు తమ గుడ్లను తెలియకుండానే ఉడకని మాంస ఉత్పత్తుల ద్వారా శరీరంలోకి చేరతాయి. 30 అడుగుల పొడవు పెరుగుతాయి,పేగుల్లో వీపరీతంగా గుడ్లు పెడతాయి. ఇవి శరీరంలోని పోషకాలను తినేస్తాయి. తద్వారా బరువు తగ్గిపోతారు. టేప్వార్మ్తో మరో అతి పెద్ద ప్రమాదం ఏమిటంటే, అవి ఎక్కడ అతుక్కుపోయాయో గుర్తించడం కష్టం. జీర్ణాశయం వెలుపల ఉన్న ఇతర అవయవాలకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి.కలుషిత, సరిగ్గా ఉడకని మాంసాహారం ద్వారా కడుపులో పెరిగే ఈ పురుగులను గ్యాస్ట్రిక్ వార్మ్స్ అని కూడా అంటారు. వీటిలో ఏలిక పాములు (రౌండ్ వార్మ్స్), పట్టీ పురుగులు (ఫ్లాట్ వార్మ్స్), నారికురుపు పురుగులు (టేప్ వార్మ్స్) అనే రకాలు ఉంటాయి. వీటిలో ఒక్కొక్కటి ఒక్కో రకమైన లక్షణాలతో వ్యాపిస్తాయి. టేప్‌వార్మ్ లక్షణాలుఅతిసారంతీవ్రమైన కడుపునొప్పివికారంబలహీనతజ్వరంబాక్టీరియల్ ఇన్ఫెక్షన్లునరాల సమస్యలు -
సారా అలీఖాన్ వెయిట్ లాస్ జర్నీ..
-
వెయిట్ లాస్ స్టోరీ: జస్ట్ 90 రోజుల్లోనే ఏకంగా 14 కిలోలు..!
వెయిట్ లాస్ జర్నీ అనేది ఎప్పటికీ ఆసక్తికరమైన అంశమే. ఎందుకంటే బరువు పెరగడం ఈజీగానీ తగ్గడమే బహు కష్టం. పోనీ వర్కౌట్లు, డైటింగ్లు చేసి బరువు తగ్గించుకోగలమా అంటే.. అంత ఈజీ కాదు. కొన్ని రోజుల చేశాక వామ్మో..! అని స్కిప్ చేసేస్తాం. కానీ ఈ వ్యక్తి మాత్రం జస్ట్ 90 రోజుల్లో ఏకంగా 14 కిలోల బరువు తగ్గి చూపించాడు. ఇంతకీ అతడు అన్ని కిలోల బరువు ఎలా తగ్గాడు? ఏంటీ అతడి ఫిట్నెస్ సీక్రెట్ అంటే..పులక్ బాజ్‌పాయ్ జస్ట్ రెండు నెలల్లోనే 14 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆరోగ్యకరమైన డైట్ ఫాలోవుతూ బరువు తగ్గడం విశేషం. అతడి వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగిందంటే..ప్రతిరోజూ ఆరోగ్యకరమైన డైట్ తీసుకునేవాడట. రాత్రి పదిగంటలకు తేలికపాటి ఆహారాన్ని తీసుకునేవాడనని చెబుతున్నాడు పులక్. చక్కెరకు, అందుకు సంబంధించిన ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని చెప్పాడు. అలాగే బయటి ఆహారం, జంక్‌ఫుడ్ కూడా తీసుకోలేదని తెలిపాడు. పండ్లు, బంగాళదుంపలు, బియ్యం వంటి వాటిని మాత్రం తీసుకున్నట్లు వివరించాడు. ఐతే వారంలో ఒక రోజు మాత్రం ఈ కఠిన డైట్‌కి విరామం ఇచ్చి వెజ్ శాండ్విచ్, తేలికపాటి చక్కెరతో కూడిన కోల్డ్ కాఫీ మాత్రం తీసుకునేలా డైట్ ప్లాన్ చేసుకున్నాడు పులక్. దీంతోపాటు సాధారణ వ్యాయామం, సైక్లింగ్ తప్పనిసరిగా చేసేవాడు. రెగ్యులర్ వ్యాయామం, సైక్లింగ్ ఆహార నియంత్రణ, కేలరీలను బర్న్ చేసేందుకు అద్భుతంగా ఉపయోగిపడిందని అంటున్నాడు పులక్. చివరిగా పులక్.. "నిలకడగా బరువు తగ్గాలనే నిర్ణయంపై స్ట్రాంగ్‌గా ఉండాలి. అలాగే ఆహార నియంత్రణ తోపాటు తీసుకునే విషయంలో శ్రద్ధ వహించడం వంటివి చేస్తే ప్రభావవంతంగా బరువు తగ్గుతాం". అని చెబుతున్నాడు. అంతేగాదు సదా మసులో తాను బరువు తగ్గుతున్నాను, బరువు తగ్గాలి వంటి పాజిట్ ఆటిట్యూడ్‌ని డెవలప్ చేసుకుంటే ఆటోమెటిక్‌గా మన బ్రెయిన్ దాని గురించి ఆలోచిచడం మొదలు పెట్టి డైట్‌ని స్కిప్ చేయాలనే ఆలోచన రానివ్వదని చెప్పుకొచ్చాడు పులక్.(చదవండి: ఆమె స్థైర్యం ముందు..విధే చిన్నబోయింది..! ఆస్తమాతో పోరాడుతూ..) -
నేహా ధూపియా వెయిట్ లాస్ జర్నీ!..ఏకంగా 14 గంటలు..!
మహిళలు ప్రసావానంతరం బరువు తగ్గడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఇద్దరు పిల్లలు తల్లికి మహాకష్టం. వారు తమ పనులు తాము చేసుకునే స్థాయికి చేరుకునేంత వరకు కూడా పిలల సంరక్షణ తల్లిదే భాద్యత. అందువల్ల ఏ మహిళైన తన ఫిట్‌నెస్‌పై దృష్టిసారిండం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయినా కొందరూ తగ్గగలుగుతారు. అదేమంతా అసాధ్యమైన విషయం కాదని బరువు తగ్గి మరి చూపించింది బాలీవుడ్ నటి నేహా ధూపియా. ఇద్దరు పిల్లల తల్లి అయినా ఆమె ప్రసవానంతరం విపరీతమైన బరువు పెరిగిపోయింది. అయితే జస్ట్ ఒక్క ఏడాదిలోనే తన ఫిట్‌నెస్‌పై దృష్టిసారించి మరీ కిలోలు కొద్ది బరువు తగ్గింది. అంతేగాదు తన వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగిందో కూడా నెటిజన్లతో షేర్ చేసుకుంది.బరువు తగ్గడం అనేది అంత సులభమైనది కాదు. అందులోనూ ప్రసవానంతర బరువు తగ్గడం అంటే ఇంకా కష్టం. కానీ నేహా తన సంకలప్పంతో బరువు తగ్గి మరీ చూపించింది. అలా ఆమె ఏకంగా 23 కిలోల వరకు బరువు తగ్గిపోయింది. 43 ఏళ్ల ధూపియా ఇదంతా అంత సులభమైనది కాదంటూ తన వెయిట్ లాస్జర్నీ గురించి చెప్పుకొచ్చింది. ముందుగా బరువు తగ్గేందుకు చేసిన వర్కౌట్లు వంటి వాటితో విపరీతమైన అలసట, వొళ్లు నొప్పులు వచ్చేసేవి. ఆ తర్వాత తీసుకునే డైట్‌పై ఫోకస్ పెట్టానంటు చెప్పుకొచ్చింది. తీసుకునే ఆహారంలో గ్లూటెన్ లేకుండా జాగ్రత్త పడింది. దాదాపు 14 గంటలు ఉపవాసం వంటివి చేసి 23 కిలోలు మేర బరువు తగ్గినట్లు తెలిపింది. అయితే ఒక ఏడాదిపాటు క్రమం తప్పకుండా వ్యాయామం,డైట్ విషయంలో నియమాలు పాటించినట్లు వివరించింది. అందువల్ల సులభంగా బరువు తగ్గి, మంచి ఫిట్‌గా ఉండగలిగానని చెప్పింది నేహా. ఇక్కడ ఒక్కోసారి డైట్ లేదా వ్యాయామాలు స్కిప్ అయిన నిరాశపడొపోకుండా..తర్వాత రోజు నుంచి కొనసాగించడమే గాకుండా బరువు తగ్గుతాను అనే పాజిటివ్ ఆటిట్యూడ్‌ని డెవలప్ చేసుకుంటుంటే ఆటోమేటిగ్గా చక్కగా బరువు తగ్గిపోతారని చెబుతోంది నెహా ధూపియా. అంతేగాదు వాకింగ్, జిమ్‌కి వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా బరువు తగ్గాలనుకుంటే ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వమంటూ పలు ఆసక్తికర విషయాలు ూడా చెప్పుకొచ్చింది.అవేంటంటే..సమతుల్య ఆహారం తీసుకోండిఅతిగా తినకుండా కొలత ప్రకారం తీసుకునేలా మైండ్ సిద్ధం చేసుకోండిలీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వండినీరు బాగా త్రాగండిచక్కెర పానీయాలు నివారించండిజంపింగ్, రన్నింగ్ లేదా డ్యాన్స్ వంటివి చేయండిపుష్ అప్స్, స్క్వాట్ల, ప్లాంక్‌లు వంటి వ్యాయామాలు చేయండికాస్త విరామం ఇచ్చి ఇంటి పనుల్లో నిమగ్నం అవ్వండి. మైండ్‌ఫుల్ ఈటింగ్ వంటి టెక్నీక్లతో ఆకలిని నియంత్రించండి. తగినంత నిద్రపోండి.ఇవన్నీ క్రమం తప్పకుండా ఫాలో అయితే ఇంట్లోనే సులభంగా బరువు తగ్గొచ్చని చెబుతోంది నేహా ధూపియా.(చదవండి: వర్షాకాలం..వ్యాధుల కాలం..తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!) -
ప్రపంచంలోనే బరువైన వ్యక్తి!.. తగ్గాడు కానీ..!
ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి వాకింగ్ కూడా చేయలేడు. ఎవరో ఒకరు సాయం లేనిదే వాకింగ్ చేయడం సాధ్యం కాదు. అయినప్పటికీ కిలోలు కొద్ది బరువు తగ్గాడు. పైగా 40 ఏళ్లకు మించి బతకడని తేల్చి చెప్పిన వైద్యుల మాటే తప్పు అని ప్రూవ్ చేసి చూపించాడు. ఇంతకీ అతను ఎలా అన్ని కిలోల బరువు తగ్గాడు? అది సరైనదేనా అంటే..ఒకప్పడూ ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తి, పాల్ మాసన్. అతను ఏకంగా 444.5 కిలోల బరువు ఉండేవాడు. అయితే ప్రస్తుతం అతను బరువు కోల్పోయాడు కానీ నడవలేడు. చెప్పాలంటే వాకింగ్ వంటివి చేయకుండానే బరువు తగ్గాడు. డాక్టర్లు సైతం అతడి భారీ కాయాన్ని చూసి మహా అయితే 40 ఏళ్లు బతుకుతాడని తేల్చి చెప్పేశారు. అయితే మాసన్ వైద్యుల అంచనాలను తారుమారు చేస్తూ..ఈ ఏడాది 64వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నాడు మాసన్. ప్రస్తుతం ఆయన 288 కిలోల బరువు ఉన్నారు. అయితే ఆయన నడవలేరు మంచానికే పరిమితమయ్యారు. నిజానికి మాసన్ అత్యంత స్థూలకాయుడిగా మారడానికి కరోనా మహమ్మారి టైంలో లాక్డౌన్ కారణంగా డిప్రెషన్‌కి సంబంధించిన మందులు ఓవర్ డోస్ తీసుకున్నాడు. అదీగాక ఆ టైంలోనే బ్రిటన్‌లో అత్యంత బరువైన వ్యక్తిగా ఉన్న జాసన్ హోల్టన్ మరణం అతడి మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపాయి. దీంతో అతడు విపరీతంగా బరువు పెరిగిపోయాడు. అయితే అను గ్యాస్ట్రిక్ బైపాస్ వంటి సర్జరీలతో 120 కిలోల వరకు బరువు తగ్గించుకోగలిగాడు. ఆ తర్వాత అదనపు స్కిన్‌ని తొలగించుకునేందుకు యూఎస్‌లో మరికొన్ని ఆపరేషన్లు చేయించుకున్నాడు. ఆ సమయంలోనే తన జీవిత భాగస్వామిని కూడా కలుసుకున్నాడు. అయితే ప్రస్తుతం తాను ఇంకా చాలా శారీరక, మానసిక సమస్యలు ఫేస్ చేస్తున్నాని, తినే ఆహారం క్వాండిటీ పెరుగుతుందే గానీ తగ్గదని చెబుతున్నాడు మాసన్. అంతేగాదు తన అధిక బరువుకు ప్రధాన కారణం మానసిక సమస్యలని కూడా తెలిపాడు. చిన్నతనంలో తన తండ్రి చేతిలో శారీరక వేధింపులకు గురయ్యానని, ఎలాపడితే అలా కొట్టేవాడని చెప్పుకొచ్చాడు. ఆరేళ్ల వయస్సు నుంచే తనని కుటుంబ సభ్యులు దారుణంగా వేధించేవారని చెప్పుకొచ్చాడు. ఇక్కడ మాసన్ వ్యక్తిగత మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గడం సాధ్యపడలేదు. దీని కారణంగా మాసన్ ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగ్గా అవ్వలేదు. ఇంకా పలు సమస్యలు ఫేస్ చేస్తున్నట్లు కూడా వివరించాడు. ఈ సంఘటన ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటంటే.. మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఏ అనారోగ్య సమస్య అయినా నయం అవుతుంది. అందువల్ల మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండి ఆరోగ్యకరమైన రీతిలో బరవు తగ్గేందుకు యత్నించాలి. ఆరోగ్యకరమైన రీతిలో బరవు తగ్గాలంటే..బరువు తగ్గడం చాలా కష్టమైన పని అయినప్పటికీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆహారం, వ్యాయామం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఒక నియమానుసారంగా చేస్తే..ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గడం సులభమని అంటున్నారు. అందుకోసం పాటించాల్సినవి ఏంటంటే..చక్కెరను తగ్గించండితాజా, కాలానుగుణ పండ్లు తినడంపై దృష్టి పెట్టండిఫైబర్, ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవడంమెడిటరేనియన్ డైట్ ఫాలో అవ్వడంక్రమం తప్పకుండా వ్యాయామంఎక్కవు నీరు త్రాగడంటైంకి మంచిగా నిద్రపోవడం. (చదవండి: నవ్వడం' కోసం ఏకంగా చట్టం..! ప్రతిరోజూ..) -
45 కిలోలు తగ్గిన భారత సంతతి సీఈవో..అతడి హెల్త్ సీక్రెట్ ఇదే..!
బరువు తగ్గడం అనేది శారీరక శ్రమకు మించిన కష్టమైన ప్రక్రియ. డైట్‌ని, జీవనశైలిని మార్చకుంటేనే ఇదంతా సాధ్యం. చెప్పాలంటే బరువు తగ్గాలనే గట్టి సంకల్పం ఉంటేనే తగ్గగలం. అలానే భారతసంతతి వ్యక్తి ఏకంగా 45 కిలోలు బరువు తగ్గి చూపించాడు. అందుకోసం ఆయన కొన్ని పత్యేకమైన ఆహారపు అలవాట్లను అనుసరించినట్లు తెలిపాడు. అతనెవరు? ఎలా ఇన్ని కిలోలు మేర బరువు తగ్గగలిగాడు సవివరంగా చూద్దామా..!భారత సంతతికి చెందిన బిహేవియరల్ సైన్స్ సోల్యూషన్స్ కంపెనీ ఫైనల్ మైల్ కన్సల్టింగ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రామ్ ప్రసాద్ ఏకంగా 45 కిలోలు బరువు తగ్గారు. ఆయన తన వెయిట్ లాస్ జర్నింగ్ గురించి సోషల్ మీడియా వేదికగా నెటిజనల్తో షేర్ చేసుకున్నారు. తాను స్థిరమైన అలవాట్లతో బరువు తగ్గగలిగానని అన్నారు. ముందుగా వెయిట్ లాస్ జర్నీలో తలెత్తే సందేహాలను, అనుమానాలను పక్కకు పెట్టేయాలి. "ఎక్స్ప్లోర్ వర్సెస్ ఎక్స్‌ప్లోయిట్," "ట్రెయిట్స్ వర్సెస్ స్టేట్," "హాబిట్ లాడరింగ్ వర్సెస్ మోటివేషన్," "డిఫెరింగ్ రివార్డ్స్ వర్సెస్ విల్‌పవర్." వంటి పాయింట్లపై దృష్టిపెట్టండి. అంటే.. ఇక్కడ మీకు ఎలాంటి జీవనశైలి ఎంచుకుంటే బెటర్ అనేది సోధించాలి. ఒక్కోసారి ఆ డైట్‌ని స్కిప్ చేయాలనిపించినప్పుడూ ఎలా ఆ ఫీలింగ్‌ని వాయిదా వేయాలి. అలాగే ఉన్న ప్రస్తుత పరిస్థితి, మీ శరీర తత్వానికి అనుగణంగా తీసకోవాల్సిన జాగ్రత్తలు, దీంతోపాటు అలవాట్లను స్కిప్ చేయకుండా ఉండేలా ప్రేరణనిచ్చే వాటిని ఎంచుకోవడం. వాయిదా పద్దతికి స్వస్తి పలికి విల్‌పవర్ చేయడం వంటివి అనుసరించాలని అంటున్నారు రాం ప్రసాద్. అలాగే బరువు తగ్గడంలో తనకు ఉపకరించిన వాటి గురించి కూడా చెప్పారు. డైట్లో రెండు నెలలు పాటు షుగర్ తీసుకోకుండా ఉండటం. ఏడాదిపాటు వాకింగ్ చేయడం. నాలుగైదు నెలలు పాటు శుభ్రంగా తినడం వంటివి చేసినట్లు సీఈవో రాం ప్రసాద్ చెప్పారు. అలాగే మూడేళ్లు ఒక పూటే భోజనం, వర్కౌట్లపై దృష్టిసారించడం వంటివి చేసినట్లు తెలిపారు. చివరిగా బరువు తగ్గాలనుకున్నప్పుడూ అందుకు సంబంధించి ఏర్పరుచుకున్న మన లక్ష్యాలపై ఫోకస్ ఉండాలని అన్నారు. అప్పుడే సులభంగా బరువు తగ్గగలమని చెప్పారు. అయితే నెటిజన్లు సీఈవో రాం ప్రసాద్ వెయిట్‌లాస్ జర్నీ చాలా స్ఫూర్తిని కలిగించిందంటూ ఆయన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఖర్జూరం తింటే మలబద్దకం వస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..) -
ఇలాంటి బంపర్ ఆఫర్ ఇస్తే..బరువు తగ్గడం ఖాయం!
ప్రస్తుతం అందర్నీ బాగా వేదించే సమస్య అధిక బరువు. నేటి జీవన విధానం, శారీరక శ్రమ లేకుండా ఏసీ గదుల్లో కంప్యూటర్ల మందు గంటగంటలు కూర్చొని చేసే ఉద్యోగాలతో చిన్న, పెద్దా అంతా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఒకవేళ వ్యాయామాలు చేద్దామనుకున్నా..కొన్ని రోజులు చేసి బద్ధకంతో స్కిప్ చేస్తూ పోతుండటంతో బరువులో పెద్ద మార్పు ఉండదు. దీంతో అధిక బరువు అన్నది భారమైన సమస్యగా మిగిలిపోతోంది చాలామందికి. తాజగా ఓ కంపెనీ తమ ఉద్యోగులకు ఓ మంచి బంపర్ ఆఫర్ ఇచ్చింది. తన ఉద్యోగులు ఆరోగ్యకరంగా మంచి సామర్థ్యంతో పనిచేయాలన్న లక్ష్యంతో ఈ ఆఫర్‌ని పెట్టిందట. ఆ ఆఫర్ వింటే ఇలాంటి కంపెనీలు కూడా ఉంటాయా?.. అని విస్తుపోతారు. ఎక్కడంటే..చైనాలో షెన్జెన్లోని ఇన్‌స్టా360 అనే టెక్ కంపెనీ తన ఉద్యోగులకు మంచి ఆరోగ్యంతో హాయిగా పనిచేసుకోండి అంటూ ఓ గొప్ప ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే హాయిగా బరువు తగ్గండి దగ్గర దగ్గర కోటి రూపాయాల వరకు బోనస్‌లు పొందండి అని ఆఫర్ ఇచ్చింది. ఈ టెక్ కంపెనీ తన ఉద్యోగులు ఊబకాయ సమస్య నుంచి బయటపడేలా బరువు తగ్గించే బ్యూట్ క్యాంప్ అనే కార్యక్రమాన్ని ప్రారండించింది. ఈ కార్యక్రమంలో మూడు నెలల పాటు సాగుతుంది. ప్రతి సెషన్లో సుమారు 30 మంది ఉద్యోగుల వరకు నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ కార్యక్రమంలో ఊబకాయం ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఇస్తారు.ప్రతి సెషన్ మూడు గ్రూపులుగా విభజించి, వారంలో సముహం మొత్తం బరువు సగటు ఆధారంగా బోనస్‌లు అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్ విజయాన్ని ఆయా సముహాలకే ఇస్తుంది. ఎందుకంటే గ్రూప్‌లో ఉన్నవాళ్లంతా తగ్గితేనే కదా డబ్బులు వస్తాయి. కాబట్టి బరువు తగ్గాలన్న సంకల్పం వారిలో అనుకోకుండా రావడమే గాక పక్కవారిని మోటీవేట్ చేస్తారు. దీంతో సమిష్టిగా బరువు తగ్గే ప్రయత్నం తోపాటు వారి మధ్య సత్సంబంధాలు బాగుంటాయి. ఈ కార్యక్రమాన్ని ఆ కంపెనీ 2023లో ప్రారంభించింది. ఆ కంపెనీ అనుకున్నట్లు తమ ఉద్యోగలు సత్వరమే బరువు తగ్గేలా చేయడంలో అద్భుతమైన ఫలితాలు కూడా సాధించింది. ఇలా ప్రస్తుతం ఆ కంపెనీలో సుమారు 150 మంది ఉద్యోగులు దాక ఏకంగా 800 కిలోలు బరువు తగ్గి దాదాపు రూ. 83 లక్షల దాక రివార్డులు సంపాదించుకున్నారు. ఈ మేరకు ఆ కంపెనీలో పనిచేసే లి అనే వ్యక్తి మాట్లాడుతూ..తాను ఈ కార్యక్రమంలో నవంబర్ 2023లో చేరానని చెప్పాడు. ఆ శిక్షణ కార్యక్రమంలో రన్నింగ్, బాస్కెట్‌బాల్, స్విమ్మింగ్ వంటివి చేసి సుమారు 17.5 కిలోల మేర బరువు తగ్గి రూ. 80 వేలు బోనస్‌గా పొందానని తెలిపాడు. ఈ ప్రోగ్రాం తన ఆరోగ్యాన్ని, ఆర్థికస్థితిని మెరుగుపరిచిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ కంపెనీలో వెంటనే జాయిన్ అవుతానని ఒకరూ, మరోకరూ తాను ఏకంగా 10 కి.మీ వరుకు పరుగెత్తగలనని, తనలాంటి సిబ్బందితో తొందరగా ఆ కంపెనీ దివాలా తీసేస్తుందని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్) -
మెరుపు తీగలా మారిపోయిన ఓప్రా విన్ఫ్రే!
ఓప్రా విన్ఫ్రే ప్రపంచ ప్రసిద్ధి చెందిన టీవీ వ్యాఖ్యాత. ఆమె టీవీ షో ది ఓప్రా టాక్ షో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఈ షో ఆమెకు గ్లోబల్ సెలబ్రెటీ స్టేటస్ హోదా తెచ్చిపెట్టింది. ఆమె కూడా గత కొంతకాలం ఒబెసిటీ సమస్యలు ఎదుర్కొన్నారు. అధిక బరువుతో ట్రోలింగ్ గురయ్యారు. ఏమైందో ఏమో కొన్నాళ్ల వరకు కనిపించకుండా పోయి సడెన్‌గా స్లిమ్‌గా మారిపోయి అలానాటి ఓప్రాని తలిపించేలా మారిపోయింది. ఇప్పుడు ఫిట్‌నెస్‌పై ఛాలెంజ్‌లు విసురుతు ఎలా బరువు తగ్గించుకోవాలో అందరికీ పాఠాలు చెప్పేస్తోంది. 70 ఏళ్ల విన్ఫ్రే గత కొన్ని దశాబ్దాలుగా భారీ కాయంతో ఇబ్బందు ఎదర్కొంది. చాలామంది ముఖం మీద లావుగా ఉన్నారని అనడం, ట్రోలింగ్ వంటి వాటితో విసుగుపోయింది. అదీగాక 2021లో మోకాలి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఇక ఆమెకు బోలెడెంత్ రెస్ట్ దొరికింది. ఇకం అంతే ఇదే సమయం అనుకుని బరువు తగ్గే విషయంపై దృష్టి పెట్టింది. పూర్తిగా బాడీ ఫిట్‌నెస్‌పై దృష్టి కేంద్రీకరించినట్లు స్వయంగా ఆమె వెల్లడించింది. ఆకలిని నియంత్రించుకునేలా వైద్యుల సూచనలతో కొన్ని రకాల మందులు వాడుతున్నట్లు కూడా వెల్లడించింది. మంచి ఫిటనెస్ నిపుణుల సాయంతో మంచిగా డైట్‌ని ఫాలో అయి బరువు తగ్గినట్లు వెల్లడించారు. ఇప్పుడు తనకెంతో హాయిగా ఉందని ఆనందంగా చెబుతుంది. భారీ కాయం నుంచి నాకిప్పటికీ విముక్తి లభించింది. అందుకోసం ఆమె ప్రతి రోజు ఐదు నుంచి మూడు మైల్లు వాకింగ్, వారాంతరాల్లో 10 మేళ్లకు పైగా నడవటం, రోజుకు గాలన్ నీరు తాగటం వంటివి తీసుకున్నట్లు తెలిపింది. ఎలాగైన తాను తగ్గాలని గట్టిగా సంకల్పించుకుని ఇన్ఫ్ల్యూయెన్షియల్ పర్సనాలిటీగా ఆవిర్భవించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఐతే ఆమె వైద్యపరంగా బరువు తగ్గేందుకు ఎలాంటి మందులు వాడిందనేది వెల్లడించకపోయినా వైద్యుల సూచనల ప్రకారం డైట్ ఫాలో అయ్యి తగ్గానని పరోక్షంగా చెప్పింది. ఒకనొక దశలో ఎంత సంకల్పశక్తి ఉన్న బరువు తగ్గడం కష్టం అనిపించింది కానీ కఠినమైన ఫిట్నెస్ ఫాలో అయ్యి నిపుణుల సలహాలు తీసుకుంటే పెద్దకష్టమేమి కాదని అంటోంది. ఇప్పుడామె బాగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారికి ఆదర్శంగా నిలవడమేగాక ఎలా బరువు తగ్గాలో సలహాలు కూడా ఇచ్చేస్తోంది. బరువు తగ్గాలనుకుంగే ఏజ్‌తో సంబంధం లేదని కూడా ఫ్రూవ్ చేసింది ఓప్రా విన్ఫ్రే. (చదవండి: ఫ్లూ జ్వరంలా ఉందని తేలిగ్గా తీసుకుంది..కట్ చేస్తే అంతలోనే..) -
ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్! జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు..
అమెరికన్ ఫిట్నెస్ ఇన్‌ప్లుయెన్సర్, ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్ల వయసులోనే అనూహ్యంగా మరణించింది. ఎలాంటి కారణాలు లేకుండానే చనిపోయింది. ఓ రెస్టారెంట్‌కి భోజనానికి వెళ్లినప్పుడూ ఈ ఘటన జరిగింది. దీంతో ఆమె మరణానికి దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేయగా చాలా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. బరువు తగ్గాలనుకోవడమే ఆమెకు శాపమైందా? త్వరిగతిన బరువు తగ్గితే ప్రాణాలు కోల్పోతామా? తదితరాల గురించే ఈ కథనం.! అమెరికాలోని 40 ఏళ్ల మేకప్ ఆర్టిస్ట్ బ్రాందీ మల్లోరీ 2014లో ఏబీసీ వెయిట్ లాస్ రియాలటీ షోతో ఒక్కసారిగా ఆమె పేరు వార్తల్లో మారుమ్రోగిపోయింది. ఎందుకంటే? అక్కడ ఆ వెయిట్‌లాస్ షోలో ఏకంగా మల్లోరి 70 కిలోల బరువు తగ్గింది. విపరీతమైన బరువుతో బాధపడుతున్నవారికి ఆమె ఆదర్శంగా నిలిచింది. ఆమెలా బరువు తగొచ్చనే ఆలోచనను రేకెత్తించింది. అయితే ఆమె ఓ రెస్టారెంట్‌కి వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేసి తెచ్చుకుని కార్ వద్దకు వచ్చింది. అంతే ఆ తర్వాత ఆమె ఏమయ్యిందో ఏమో!..ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె మరణానికి గల కారణాలపై ముమ్మరంగా దర్యాప్తు చేయగా కారణాలు ఏమి తెలియలేదు. చివరకి బరువు తగ్గేందుకు ఆమె తీసుకున్న విధానమే కారణమా? అనే సందేహలు తలెత్తాయి. దీంతో ఆ దిశగా విచారణ చేయగా.. బరువు తగ్గడం కోసం చేసే విపరీతమైన వ్యాయామాలు కారణంగానే చాలామంది చిన్న వయసులోనే ప్రాణాలను కోల్పోతున్నట్లు వైద్యులు వెల్లడించారు. అందుకోసం వారి అనుసరించే కట్టుదిట్టమైన డైటే.. ప్రధాన కారణం అని అన్నారు. "సడెన్‌గా కేలరీలు పరిమితంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, వల్ల బరువు తొందరగా తగ్గొచ్చు గానీ అది మీ ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే? పోషకాహార లోపం, అలసట, కండరాల నష్టానికి దారితీస్తుంది. ఇది శరీరంలోని జీవక్రియలకు ప్రభావితం చేసి ఆరోగ్యంపై ప్రభావం ఏర్పడుతుంది. అలాగే ఆకలిని నియంత్రించే సప్లిమెంట్స్ కూడా ప్రమాదమే. అవి మధుమేహం వంటి ఇతరత్ర వ్యాధులకు దారితీసి ప్రాణాంతకం కావొచ్చు. కొందరూ బారియాట్రిక్ సర్జరీలతో గణనీయమైన బరువు తగ్గేలా లక్ష్యం పెట్టుకుంటున్నారు. దీని వల్ల స్పీడ్‌గా బరువు తగ్గినప్పటికీ జీవితాంతం ఆహార నియమాలు పాటించాల్సిందే. ఏదిపడితే అది తినకూడదు. అందువల్ల త్వరితగతినే బరువు తగ్గేందుకు అనుసరించే పద్ధతులకు మన శరీరం వెంటనే సహకరించలేదు. మనం సడెన్‌గా మొదలు పెట్టే డైట్‌కి మన శరీర వ్యవస్థ అడ్జెస్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. కాబట్టి నిధానంగా ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గే యత్నాలు చేయండి అని హితువు చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. లేదంటే ఇలానే హఠాన్మరణాలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. (చదవండి: పచ్చి మిర్చిని పచ్చిగా తినడమా? అనుకోవద్దు!.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
బరువు తగ్గడం..అంత బరువేం కాదు!
కొంతమంది శరీరతత్వాన్ని బట్టి బరువు పెరగడం, తగ్గడమనేది పెద్ద టాస్కే. మంచి పౌష్టికాహారం, కొవ్వులతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా బరువు పెరగడం సులభమే. కానీ దాన్ని తగ్గించుకోవాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ఇందుకు చాలా మంది సినీ తారలు కూడా నిదర్శనం. నిత్యం యోగా చేసే సినీతారలు, తదితర వంటి సెలబ్రిటీలే ఇంత కష్టపడుతుంటే.. మనలాంటి సామాన్యులు బరువు తగ్గడం సాధ్యమేనా అని నిరాశ పడొద్దు. బిజీ లైఫ్ వల్ల చాలామందికి వ్యాయామం చేయడానికి సమయం చిక్కదు. అలాగని డైటింగ్ చేస్తూ కడుపు మాడ్చుకోవడం కూడా కష్టమే. అందుకే చాలామంది సులభంగా బరువు తగ్గే మార్గాలను ఎంచుకుంటారు. అలాంటివారికి ఈ కింది చిట్కాలు ఉపయోగ పడవచ్చు. స్పీడ్‌గా బరువు తగ్గాలంటే.. మంచి నీటిని తరచు తాగడం వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాం. ముఖ్యంగా భోజనానికి ముందు నీరు తాగడం వల్ల కొద్దిగా తింటే చాలు పొట్ట నిండిన భావన కలుగుతుంది. 12 వారాలపాటు చేసిన ఓ అధ్యయనంలో భోజనానికి ముందు నీళ్లు తాగని వారితో పోలిస్తే.. తాగేవారు త్వరగా బరువు తగ్గుతార ని తేలింది. అలాగే కంటినిండా నిద్ర పోయినా బరువు తగ్గతారని పరిశోధనలో తేలింది టీవి చూస్తూనో సెల్ ఫోన్ చూస్తూ కూడా తిన్న బరువు పెరుగుతారట. ఇలాంటి అలవాటును మానుకునే యత్నం చేసినా బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ మూడు టెక్నిక్‌లు ఫాలో అయితే స్పీడ్‌గా బరువు తగ్గొచ్చు ఈజీగా బరువు తగ్గేందుకు ఏం చేయాలో..ఏం చేయకూడదో చూద్దాం. ఆహారాన్ని కంగారుగా తినకూడదు. నెమ్మదిగా నమిలి తినాలి. దీనివల్ల తక్కువ ఆహారం తీసుకుంటారు. నెమ్మదిగా ఆహారం తీసుకోవడం వల్ల కడుపు త్వరగా నిండిన ఫీలింగ్ వస్తుంది. మీరు రోజూ తీసుకొనే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండాలి. ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు త్వరగా నిండుతుంది. ఆకలి తగ్గితే శరీరంలోకి తక్కువ క్యాలరీలు చేరతాయి. జీఎల్పీ–1, ఘెర్లిన్ హార్మోన్లపై ప్రొటీన్లు ప్రభావం చూపడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. తియ్యని శీతలపానీయల జోలికి వెళ్లొద్దు. సోడా కలిగిన డ్రింక్స్ వల్ల రోగాల ముప్పు పెరుగుతుంది. చక్కెర శాతం ఎక్కువగా ఉండే పానీయాల వల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయి. కంటి నిండా నిద్రలేకపోయినా సరే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలేమి వల్ల లెప్టిన్, ఘెర్లిన్ హార్మోన్లపై ప్రభావం పడుతుంది. ఒత్తిడి వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలై ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరగడం వల్ల అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. దానివల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయి. నిద్రలేమి, ఒత్తిడి వల్ల మధుమేహం, ఊబకాయం వంటి అనేక రుగ్మతలు వస్తాయి. యోగర్ట్, లెంటిల్స్, క్వినోవా, చికెన్ బ్రెస్ట్, చేపలు, ఆల్మండ్స్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల తొందరగా ఆకలి వేయదు. మొక్కల నుంచి లభించే విస్కోస్ ఫైబర్ అనే పీచుపదార్థం బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. బీన్స్, ఓట్స్ సెరల్స్, బ్రస్సెల్స్ స్ప్రౌర్ట్స్, ఆస్పరాగస్, నారింజ, అవిసె గింజల్లో విస్కోస్ ఉంటుంది. ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. కంచం నిండుగా భోజనం చేస్తే బరువు కూడా అదే స్థాయిలో పెరుగుతారు. ఆకలి వేసినప్పుడు మధ్య మధ్యలో బాదం తదితర డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. టీవీ లేదా ల్యాప్‌టాప్‌లో సినిమాలు, వీడియోలు చూస్తూ తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు.ఎందుకంటే.. వాటి ధ్యాసలో పడి అతిగా తినేస్తారు కాబట్టి తింటున్నా అన్న భావనతో తినడం మంచిది. (చదవండి: ఆకస్మిక మైకం.. తరచు తలనొప్పా?) -
నేను పెళ్లి చేసుకుంటే ఇబ్బంది పడతానా?!
∙నాకు 27 ఏళ్లు. రెండేళ్ల కిందట బేరియాట్రిక్ సర్జరీ అయింది. ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడం వలన వైవాహిక జీవితంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తవచ్చా? ప్రెగ్నెన్సీ, డెలివరీలో కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? – వృంద శాఖాయ్, నాందేడ్ అత్యధిక బరువు ఉండి, అలాగే బీపీ, సుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉండి, ఆరునెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామాలు చేసినా ఫలితం లేనప్పుడు, పిల్లలు కలగడానికి కూడా పీసీఓడీ, అధిక బరువు కారణమైతే బేరియాట్రిక్ సర్జరీ ద్వారా బరువు తగ్గవచ్చు. గ్యాస్ట్రిక్ బ్యాండింగ్, గ్యాస్ట్రిక్ బైపాస్, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ వంటి పద్ధతుల ద్వారా బేరియాట్రిక్ సర్జరీ చేస్తారు. వీటిలో ఆహారం కొద్దిగా తినగానే పొట్ట నిండినట్లు అనిపించడం, ఇంకా ఎక్కువ తినలేకపోవడం, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, ఆహారంలోని కొవ్వు, ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ వంటి పదార్థాలు ఎక్కువగా రక్తంలోకి చేరకపోవడం వంటి ప్రక్రియల వల్ల ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి 10–20 కేజీల వరకు బరువు తగ్గే అవకాశం ఉంటుంది. బేరియాట్రిక్ సర్జరీ వల్ల వైవాహిక జీవితంలో ఏమీ ఇబ్బందులు ఉండవు. బేరియాట్రిక్ సర్జరీ వల్ల అధిక బరువు తగ్గడంతో పాటు విటమిన్–బీ12, విటమిన్–డి, ఐరన్, క్యాల్షియం వంటి అనేక పోషక పదార్థాల లోపం తలెత్తుతుంది. దీనివల్ల వీరిలో బరువు తగ్గడం ఒక స్టేజికి వచ్చాక పోషకాల లోపం కోసం డాక్టర్ల పర్యవేక్షణలో విటమిన్స్, సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి. కాబట్టి సర్జరీ జరిగిన ఏడాది తర్వాత గర్భం కోసం ప్రయత్నం చేయవచ్చు. ఈ జాగ్రత్తలు సరిగా తీసుకోనప్పుడు కొందరిలో రక్తహీనత, విటమిన్స్ లోపం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటప్పుడు గర్భం దాల్చటం వల్ల గర్భంలో పిండం సరిగా ఎదగకపోవడం, అబార్షన్లు, బిడ్డలో అవయవ లోపాలు, ఎదుగుదల లోపాలు, నెలలు నిండకుండా కాన్పు జరగడం, బిడ్డ గర్భంలోనే చనిపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులు, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు కూడా ఉండవచ్చు. అందువల్ల మీరు పెళ్లి తర్వాత గర్భం కోసం ప్రయత్నం చేసే ముందే సర్జరీ చేసిన డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు సీబీపీ, విటమిన్–డి వంటి అవసరమైన రక్తపరీక్షలు చేయించుకోవాలి. ఏవైనా పోషక లోపాలు ఉంటే వాటిని ఆహార నియమాలు, సప్లిమెంట్ల ద్వారా సరి చేసుకున్నాకనే గర్భం కోసం ప్లాన్ చేయడం మంచిది. గర్భం రాకముందు నుంచే ఫోలిక్ యాసిడ్ మోతాదు అదనంగా తీసుకోవాలి. అలాగే మల్టీవిటమిన్లు తీసుకుంటూ ఉండాలి. అవసరమైతే మల్టీవిటమిన్లు ఇంజెక్షన్ రూపంలో తీసుకోవలసి ఉంటుంది. గర్భం దాల్చగానే గైనకాలజిస్టును సంప్రదించి, వారి సలహా మేరకు విటమిన్స్‌తో పాటు క్యాల్షియం, ఐరన్ మాత్రలు తీసుకుంటూ ఉండాలి. బిడ్డ ఎదుగుదలకు సంబంధించి రెండో నెలలో స్కానింగ్, మూడో నెలలో ఎన్టీ స్కాన్, ఐదో నెలలో బిడ్డ అవయవాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు టిఫా స్కాన్, ఏడో నెల నుంచి బిడ్డ బరువు పెరుగుదల తెలుసుకోవడానికి గ్రోత్ స్కానింగ్ వంటివి చేయించుకోవాలి. సమస్యలను బట్టి తగిన సమయంలో కాన్పు చేయించుకోవడం వల్ల ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా తల్లీబిడ్డా క్షేమంగా ఉంటారు. బేరియాట్రిక్ సర్జరీ వల్ల ఆహారం ఎక్కువగా తినలేరు కాబట్టి న్యూట్రీషనిస్ట్ సలహా మేరకు క్రమ పద్ధతిలో కొద్ది కొద్దిగా రోజుకు ఆరుసార్లు పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది. ∙నాకు 28 ఏళ్లు. రెండు రొమ్ముల్లోనూ గడ్డలున్నాయి. డాక్టరుకి చూపిస్తే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అవి సహజమే అన్నారు. నాకింకా పెళ్లి కాలేదు. వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టవు కదా? – స్వర్ణలత, కాకినాడ కొందరిలో రొమ్ములో ఉన్న ఫైబ్రస్ టిష్యూ ఎక్కువగా పెరిగి గడ్డలా తయారవుతుంది. దీనినే ఫైబ్రో ఎడినోమా అంటారు. ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల, కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల, ఇంకా తెలియని కారణాల వల్ల ఇవి రావచ్చు. ఇవి బఠాణీగింజ అంత పరిమాణం నుంచి నిమ్మకాయంత పరిమాణం వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవి చిన్న గోలీలా ఉండి, పట్టుకుంటే చిక్కకుండా రొమ్ములో కదిలిపోతుంటాయి. వీటి వల్ల ప్రమాదం ఏమీ లేదు. కాకపోతే, పరిమాణం త్వరగా పెరగడం, మరీ పెద్దగా ఉండి నొప్పి పెడుతుంటే, చిన్న ఆపరేషన్ చేసి తొలగించి, దానిని ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపడం జరుగుతుంది. ఇవి సాధారణంగా 13–35 సంవత్సరాల వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అల్ట్రసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం వల్ల వాటి పరిమాణం కరెక్టుగా ఎంత ఉన్నదీ, అవి ఫైబ్రోఎడినోమా గడ్డలేనా లేక ఏవైనా తేడాగా ఉన్న గడ్డలా అనే సంగతి తెలుస్తుంది. దానిబట్టి తర్వాత మమోగ్రామ్, బయాప్సీ వంటి ఇతర పరీక్షలేవైనా అవసరమా లేదా అనేది తెలుస్తుంది. వీటి వల్ల వైవాహిక జీవితానికి ఇబ్బందేమీ లేదు. ఈ లోపల మీరు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ, బరువు పెరగకుండా ఉంటే అవి సైజు పెరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. డా‘‘ వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
అవును.. కంపెనీలను తగ్గిస్తాం
న్యూయార్క్: ఉప్పు నుంచి సాఫ్ట్వేర్ దాకా విస్తరించిన టాటా గ్రూప్... ‘వెయిట్‌లాస్’ ట్రీట్మెంట్ను మొదలుపెడుతోంది. ప్రస్తుతం వందకుపైగానే ఉన్న గ్రూప్ కంపెనీల సంఖ్యను కచ్చితంగా తగ్గిస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. పతాక శీర్షికల కోసం తాము ఏదైనా వ్యాపారం నుంచి వైదొలగాలని భావించడం లేదని, రాబడులు ఇవ్వని వ్యాపారాలను మాత్రమే వదిలేయాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విఖ్యాత ఫార్చూన్ మేగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశాలను వెల్లడించారు. కాగా, టెక్నాలజీ సంబంధ కంపెనీలన్నింటినీ సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ గూటికిందికి... అలాగే ఇతరత్రా సారూప్యతలున్న కంపెనీలను మరికొన్ని పెద్ద కంపెనీల్లో కలిపేసే ప్రణాళికల్లో టాటా గ్రూప్ ఉందంటూ ఇటీవల కొన్ని కథనాలు వచ్చిన నేపథ్యంలో చంద్రశేఖరన్ వ్యాఖ్యలు దీన్ని ధ్రువీకరించినట్లయింది. ‘ఇప్పటికే మాది 100 బిలియన్ డాలర్ల గ్రూప్. ఈ వృద్ధిని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలంటే... పెద్ద కంపెనీలు అవసరం. ఎక్కువ సంఖ్యలో చిన్నచిన్న కంపెనీలతో భారీ వృద్ధి సాధ్యం కాదు. అందుకే మాకు ఇప్పుడు టాప్ కంపెనీలు కావాలి. అయితే, ఆయా వ్యాపార రంగాల్లో మాకున్న ప్రతి కంపెనీ నంబర్ వన్ లేదా రెండో ర్యాంకులో ఉండాలనేది నా అభిప్రాయం కాదు. టాప్ కంపెనీలు మాత్రం అత్యవసరం’ అని టాటా గ్రూప్ అధిపతి వివరించారు. పనితీరు మెరుగ్గా ఉండాల్సిందే... ‘ఇప్పుడు రాబడులు ఇవ్వని కంపెనీలు రానున్న రోజుల్లో ఇస్తాయని నేను అనుకోను. అలాంటి వ్యాపారాల నుంచి వైదొలగుతాం. దీని గురించి చాలా ఆలోచించా. తప్పనిసరిగా కంపెనీల సంఖ్య(పోర్ట్‌ఫోలియో)ను తగ్గించుకుంటాం. గ్రూప్ నిర్వహణలో ఉన్న ప్రతీ కంపెనీ పనితీరు మెరుగ్గా ఉండాల్సిందే. వృద్ధి రేటు, లాభదాయకత, పెట్టుబడులపై రాబడి వంటి అంశాలన్నీ సమీక్షిస్తాం. పనితీరు బాగోలేకుంటే గ్రూప్‌లో ఉండటానికి అర్హత లేనట్టే. వేగంగా పరుగెత్తాలంటే బరువును తగ్గించుకొని సన్నబడాల్సిందే’ అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. నాకు చాలా స్వేచ్ఛ ఉంది... టాటా గ్రూప్‌లో ప్రధాన వాటాదారులైన టాటా ట్రస్టులకు బోర్డు నిర్ణయాల గురించి, భవిష్యత్తు ప్రణాళికల గురించి చెప్పడంలో తప్పేముందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. అయితే, ప్రతి ఒక్క కంపెనీకి సంబంధించి ఏం చేస్తున్నామనేది తాను ట్రస్టులకు వివరించడం లేదన్నారు. ఇక నానో కారు విషయంలో టాటా మోటార్స్‌కు ఇతర ప్రాధామ్యాలు ఉన్నాయని చెప్పారు. ‘దేశీయంగా టాటామోటార్స్ కార్ల విక్రయాలు చాలా తక్కువ. అందులోనూ ఈ నానో అనేది మరింత చిన్న విభాగం. నానో ప్లాంట్‌ను మూసేయాలన్న నిర్ణయాన్ని తమ బోర్డు తీసుకుంటుందని నేను అనుకోవడం లేదు. ఇక గ్రూప్ చైర్మన్‌గా నాకు చాలా స్వేచ్ఛ ఉంది’ అని చంద్ర పేర్కొన్నారు. అయితే, ఏదైనా నిర్ణయం తీసుకునేముందు మేనేజ్మెంట్తో విస్తృతంగా చర్చిస్తామన్నారు. కాగా, మిస్త్రీ కుటుంబంతో టాటా సన్స్ బంధం ఎలా ఉండబోతోందన్నదానిపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. మిస్త్రీతో వివాదం అంశం కోర్టుల్లో ఉన్నందున తాను దీనిపై మాట్లాడబోనని తేల్చిచెప్పారు. -
ఇక సర్జరీతో పనిలేదు!
ఊబకాయులకు తీపి కబురు.సర్జరీ అవసరం లేకుండా బరువు తగ్గే విధానాన్ని రేడియాలజిస్ట్లులు కనుగొన్నారు. ఫోటో ఆధారిత ట్రీట్మెంట్ బేరియాట్రిక్ ఆర్టేరియల్ ఎమ్బాలిసేటన్ (బీఏఈ)పద్ధతి ద్వారా రోగి పొట్టలోని ఒక భాగానికి రక్తప్రసరణను తగ్గించి బరువు తగ్గేలా చేస్తారు. ప్రస్తుతం అనుసరిస్తున్న శస్త్రచికిత్స సర్జికల్ గ్యాస్టిక్ట్ బైపాస్ కు విభిన్నంగా ఎటువంటి ఆహార,వ్యాయామ నియమాలతో పనిలేకుండా బీఏఈ పనిచేస్తుందని యూఎస్ లోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకుడు క్లిఫార్డ్ వెసిస్ తెలిపారు. ప్రాథమిక దశ పరిశోధనల్లో బీఏఈ ప్రస్తుతం అమల్లో ఉన్న చికిత్స కంటే మెరుగ్గా ఉంది.కొంత మంది రోగుల మీద జరిపిన పరిశోధనల్లో మొదటి నెలలో 5.9 శాతం, ఆరు నెలల తర్వాత 13.3 శాతం బరువుల్లో సగటు తేడాలు కనిపించాయి.