మహిళలు ప్రసవానంతరం బరువు తగ్గడం అంత ఈజీ కాదు. బిడ్డను కన్న తర్వాత శరీరంలో వచ్చే మార్పులు కారణంగా బరువు తగ్గించుకోవడం అత్యంత సవాలుగా ఉంటుంది. ఇది చాలామంది తల్లులకు ఎదురయ్యే కఠిన సమస్య. అయితే దక్షిణాప్రికాకు చెందిన భారత సంతతి మహిళ మాత్రం ఈ సమస్యను అధిగమించి విజయవంతంగా బరువు తగ్గింది. అదికూడా 34 రోజుల వ్యవధిలోనే కేజీల కొద్దీ బరువు కోల్పోవడం విశేషం. ఆమె వెయిట్‌లాస్ జర్నీ ఎలా సాగిందంటే..
దక్షిణాఫ్రికాకు చెందిన భారత సంతతి మహిళ రవిషా చిన్నప్ప వెయిట్ లాస్ జర్నీ ఎందరికో స్ఫూర్తినిస్తుంది. ఐవీఎఫ్ ద్వారా తల్లి అయిన రవిషా ప్రసవానంతరం అధిక బరువు సమస్యతో ఒక ఏడాదిపాటు చాలా ఇబ్బందులు పడింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బరువులో పెద్దగా మార్పు కనిపించలేదు. ఇక డైట్‌లో సమర్థవంతమైన మార్పులు తీసుకొస్తేనే బెటర్ అని భావించింది. అందుకోసం ఓ 'త్రీ ట్రిక్స్'ని క్రమంతప్పకుండా అనుసరించింది. అవే ఆమె బరువును వేగంగా తగ్గించేలా చేయడంలో కీలకంగా ఉపయోగపడ్డాయి. అవేంటంటే..
మొదటిది..
శరీరం హైడ్రేటెడ్ ఉంచుకునేలా చూడటం..
రవిషా తల్లిగా బిజీ అయిపోవడంతో హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడంపై దృష్టిసారించలేకపోయినట్లు పేర్కొంది. నిజానికి కొవ్వుని కరిగించే మార్గాలలో హైడ్రేషన్ ఒకటి. అందుకోసం రవిషా తన ఫోన్ టైమర్ సహాయంతో హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకునేది.
నిద్ర లేచినప్పటి నుంచి ప్రతి 90 నిమిషాలకు ఒకసారి టైమర్ ఆన్ అయ్యేలా సెట్ చేసింది వెంటనే 20 సిప్‌ల నీరు తాగేలా చూసేకునేది రవిషా. మన శరీర బరువులో సగం ఔన్సుల నీటిని తాగేలా ప్రయత్నిస్తే అది జీర్ణక్రియకు మద్దతు ఇవ్వడమే గాకుండా బరువు తగ్గించే ప్రయాణంలో కీలకంగా ఉంటుంది.
రెండొవది ..
ఆహారంలో మార్పులు..
జీవనశైలిలో ఆహారాన్ని తీసుకునే విధానంలో కొద్దిపాటి మార్పులు చేసింది. ఎక్కువ ప్రొటీన్‌లు ఉండే ఆహారం తీసుకోవడంతో తియ్యటి పదార్థాలను తినాలనే కోరికను నియంత్రించుకుంది రవిషా. ప్రతిరోజూ కనీసం వంద గ్రాముల ప్రోటీన్‌ని ఉండేలా చూసుకునేది. ఇది దాదాపు 400 కేలరీలకు సమానం. ఒకరకంగా ఇది అనారోగ్యకరమైన ఆహారపదార్థాలు తినాలనే కోరికలను గణనీయంగా తగ్గించేలా చేయడమే గాక పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టిసారించేలా చేస్తుందని చెబుతోంది రవిషా.
మూడొవది..
క్రమం తప్పకుండా తన బరువుని చెక్‌చేసుకోవడం సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం వంటివి చేయాలి. ఎలాంటి ఒత్తిడికి, ఆందోళనలకి తావివ్వకుండా బరువు తగ్గేలా ఇంకేం చేయగలమో అనే దానిపై దృష్టిపెట్టడం, పాజిటివ్ మైండ్‌తో ఉండడం వంటివి చేయాలి. ముఖ్యంగా ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటోంది రవిషా.
ఇక్కడ రవిషా బరువు తగ్గాలనే సంకల్పం తోపాటు ఎలాంటివి ఆహారాలు తీసుకుంటే శరీరానికి మంచిది అనేది తెలుసుకుని మరీ ఆచరణలో పెట్టింది. చివరగా పాజిటివ్ ఆటిట్యూడ్‌కి పెద్దపీట వేసింది. ఇవే ఆమెను ప్రసావానంతరం విజయవంతంగా బరువు తగ్గేలా చేశాయి.
(చదవండి: భారతీయలు-అమెరికన్లు: ఆహారపు అలవాట్లలో ఇంత వ్యత్యాసమా..?)
Comments
Please login to add a commentAdd a comment