మూడే మూడు చిట్కాలతో మిరాకిల్‌ : దెబ్బకు 8 కిలోలు తగ్గింది! | Weight Loss Secret Woman Sheds 8 Kg In 34 Days shares her story | Sakshi
Sakshi News home page

మూడే మూడు చిట్కాలతో మిరాకిల్‌ : దెబ్బకు 8 కిలోలు తగ్గింది!

Jan 29 2025 1:39 PM | Updated on Jan 29 2025 5:17 PM

Weight Loss Secret Woman Sheds 8 Kg In 34 Days shares her story

అసాధ్యం అనుకున్నదాన్ని సాధ్యం చేసిన చూపించిన వాళ్లే  స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతారు.  చదువులో ర్యాంకు సంపాదించాలన్నా,  మంచి ఉద్యోగం సాధించాలన్నా లక్ష్యం వైపు మన  గురి,  ఓపికతో మనం చేసిన ప్రయత్నాలే కీలకం. అలా  పట్టుదల,ఓపిక  తన డ్రీమ్‌ను సాకారం చేసుకున్న షీ’రో గురించి ఇపుడుతెలుసుకుందామా..!

దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన మహిళ రవిషా చిన్నప్ప  అనూహ్యంగా బరువు తగ్గి అందర్నీ సర్‌ప్రైజ్‌  చేసింది.  కేవలం 34 రోజుల వ్యవధిలో  8 కిలోల బరువు  తగ్గింది.  ఈ  విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.  ఈ సందర్భంగా విజయరహస్యాన్ని వెల్లడించింది. మంచి ఆహారం, స్థిరమైన వ్యాయామం ద్వారానే ఇది సాధించానని తెలిపింది. 

Ravisha Chinappa ('IVF Momma') ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్‌  చేసిన కథనం ప్రకారం తొలుత ఆమె  55 కిలోల బరువునుండి 47 కిలోలకు తగ్గింది. ఈ ప్రయాణం చాలా మందికి స్ఫూర్తినిచ్చింది.  ఒక పాపకు  తల్లి అయిన రవీషా తాను గర్భం దాల్చిన తర్వాత అప్పుడు పెరిగిన బరువు, గత  ఏడాది కాలంగా తగ్గడం లేదు. దీంతో  మూడు సీక్రెట్స్‌ను పాటించాను. అవే తన బరువు తగ్గడానికి చాలా దోహదపడ్డాయని వెల్లడించింది. అంతేకాదు  ఇంతకు ముందు తాను చాలా ప్రయత్నించినా విజయం సాధించలేదనీ, కానీ ఈ మూడు మార్గాలను స్వీకరించిన తర్వాత వేగంగా 8 కిలోల బరువు తగ్గానని తెలిపింది.

మూడు చిట్కాలు
జీవనశైలి,ఆహార మార్పులు : జీవనశైలి, శారీరక సామర్థ్యం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సానుకూలంగా, తన ఫిట్‌నెస్ లక్ష్యాలను దృశ్యమానం చేసుకుంది.

ఆహారం,వ్యాయామ దినచర్య, ప్రతీ గంటన్నకు ఒకసారి నీళ్లు ఇవే ఆమె  మార్గాలు. రోజువారీ 100 గ్రాముల ప్రోటీన్‌  తీసుకుంది ఎక్కువ ప్రోటీన్, తక్కువ కార్బ్ ఆహారం నియమాన్ని పాటించింది. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, సలాడ్‌లను ఎక్కువగా తీసుకుంది. తద్వారా చక్కెర, జంక్ ఫుడ్‌ను నివారించింది.

కొంచెం బలమైన కార్డియో, యోగా చేసింది. ప్రతిరోజూ 45 నిమిషాల నుండి 1 గంట వ్యాయామం చేసింది. ఇందులో పరుగు, ప్లాంక్స్, వెయిట్ లిఫ్టింగ్ ఉన్నాయి.

నీళ్లు : అలారం సెట్ చేసుకుని మరీ  ప్రతిరోజూ 3-4 లీటర్ల చొప్పున నీళ్లు తాగింది.  నీళ్ళు కొవ్వును కరిగిస్తాయి,మంచి అందాన్నిస్తాయని ఆమె అనుభవం. ఆకలి ఎక్కువగా అనిపిస్తే.. తక్కువ మోతాదులో రోజుకు 5-6సార్లు తినవచ్చట.

మానసిక ఆరోగ్యంపై దృష్టి
ఒత్తిడిని తగ్గించుకునేందుకు మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి రోజువారీ ధ్యానం సాధన చేసింది. అంకితభావం, సరైన ఆహారం, వ్యాయామం ,మానసిక శ్రేయస్సు , జీవనశైలిమార్పులు తమ వెయిట్‌ లాస్‌ జర్నీకి కీలకంగా పనిచేసాయని  తెలిపింది. 

ఇదీ చదవండి : మీరందరూ తప్పకుండా ఇలా చేయాలనేదే నా కోరిక: సమంతా

అతిలోకసుందరి వారసురాలు జాన్వీకపూర్‌ లగ్జరీ ఇల్లు : ఎంత వైభోగమో!


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement