secrets
-
కోకాకోలా సీక్రెట్స్ అమ్మబోయిన ఉద్యోగి.. పెప్సీ ఏం చేసిందంటే..
ప్రపంచవ్యాప్తంగా కోకాకోలా పానియాలకు ఉన్న ప్రసిద్ధి గురించి తెలిసిందే. తమ ఉత్పత్తులకు సంబంధించిన వాణిజ్య రహస్యాలను అత్యంత పకడ్బందీగా ఉంచుతుంది కోకాకోలా. అయితే ఈ సీక్రెట్స్‌ను అమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంది ఓ ఉద్యోగి. కానీ పెప్సీ కంపెనీ ఇచ్చిన షాక్‌తో కటకటాలపాలైంది.కోకా-కోలా గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్‌లో సెక్రటరీగా పనిచేస్తున్న జోయా విలియమ్స్ కొత్త ఉత్పత్తికి సంబంధించిన వ్యాపార రహస్యాలను పెప్సీకి విక్రయించడానికి ప్రయత్నించి అరెస్టు అయింది. జోయా విలియమ్స్, ఆమె సహచరులు ఇబ్రహీం డిమ్సన్, ఎడ్మండ్ డుహానీతో కలిసి దొంగిలించిన కోకాకోలా సమాచారాన్ని 1.5 మిలియన్ డాలర్ల (రూ. 12.6 కోట్లు) భారీ ధరకు విక్రయించడానికి కుట్ర పన్నారు. అయితే పెప్సీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా కోకాకోలాకు, ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేసింది.ఇదీ చదవండి: కంపెనీ డేటా లీక్.. రూ.57 లక్షలు డిమాండ్కోకా-కోలా గ్లోబల్ బ్రాండ్ డైరెక్టర్‌కి అసిస్టెంట్‌గా పనిచేసిన విలియమ్స్, ఒక రహస్య కొత్త ఉత్పత్తిని కలిగి ఉన్న ఫియల్‌ను దొంగిలించి విక్రయించడానికి ప్రయత్నించి పట్టుబడింది. ఎఫ్‌బీఐ ఒక రహస్య ఆపరేషన్‌లో పెప్సీ ఎగ్జిక్యూటివ్‌లుగా నటించి నిందితులను పట్టుకుంది. వీరి మధ్య పలు దఫాలుగా లావాదేవీలు జరిగాయి. ఈ క్రమంలో డిమ్సన్ ఒక కుకీ బాక్స్‌లో దాచిన 30,000 డాలర్లు తీసుకుని కోకాకోలా సీక్రెట్ పత్రాలు, ఫియల్‌ను అందజేసారు. విలియమ్స్, ఆమె సహచరులను వారి అక్రమ ఒప్పందం పూర్తయ్యేలోపు అరెస్టు చేయడంతో ఈ అండర్‌కవర్ ఆపరేషన్ ముగిసింది. -
జపాన్ వనితలా స్లిమ్‌గా ఉండాలంటే..! ఈ టిప్స్ ఫాలో అవ్వండి
ప్రస్తుతం మనదేశంలో చాలమంది టీనేజర్లు అధిక బరువుతో బాధపడుతున్నారు. ప్రతి పదిమందిలో ఐదుగురు అధిక బరువు సమస్యతో బాధపుతున్నారంటే..పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. అయితే జపాన్, కొరియా లాంటి దేశాల్లో అమ్మాయిలు బొమ్మల్లా, భలే అందంగా ఉంటారు. పెళ్లి అయ్యిందో లేదో కూడా చెప్పలేం అంత స్లిమ్‌గా యవ్వనంగా కనిపిస్తారు. మరీ వాళ్లు అంతలా ఉండేందుకు గల ఫిటెనెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.ఏం చేయాలంటే..జపాన్ వాళ్లు నాజుగ్గా ఉండేందకు కఠినమైన ఆహార నియమావళిని ఫాలో అవుతారట. ఇది వారికి ఆరోగ్యంగా ఉండేదుకే గాక దీర్ఘాయువుతో ఉండటానికి ఉపయోగపడుతుందట. వాళ్లు కడుపు నిండుగా అస్సలు తినరట. భోజనం చేసేటప్పుడు ఉదర ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తింటారట. కేలం 80 శాతమే తిని మిగతా భాగం సాఫీగా అరిగిపోయేందుక వీలుగా ఖాళీగా ఉంచుతారట. అందువల్ల జీర్ణ సమస్యలు ఉండువు, బానపొట్టలా రాదు కూడా. అలాగే వాళ్లు ఫుడ్ ప్లేట్లు చిన్నవే ఎంచుకుంటారట. ఇలా చేస్తే ఆహారం ప్లేటు నిండుగా ఉన్న ఫీల్ తోపాటు ఎక్కువ తింటున్నాం అనే అనుభుతి కలగడంతో తక్కువగానే తింటామని వారి నమ్మకం. అలాగే రెండోసారి వేసుకుని తినడానికి ఆలోచిస్తారట. నచ్చిందని గమ్మున వేసుకుని తినేయరట. అదీగాక భోజనం చేసేటప్పుడూ మొబైల్స్, టీవీ, కంప్యూటర్లు చూస్తు అస్సలు తినరు. భోజనంపై ధ్యాస ఉంచి తినడానికి ప్రాధాన్యత ఇస్తారట. అలాగే నమిలినమిలి మైండ్‌ఫుల్‌నెస్‌తో తింటారట. ఇలా చేయడం వల్ల మంచిగా ఆహారం జీర్ణమవ్వడమే గాక అధిక బరువు వంటి సమస్యలను ఎదుర్కొనరు. పైగా నాజుగ్గా అందంగా ఉంటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరీ..!.(చదవండి: 'లైట్‌హౌస్ పేరెంటింగ్': పిల్లలు ప్రయోజకులయ్యేందుకు ది బెస్ట్!) -
గ్రహాంతరవాసుల సీక్రెట్స్ రష్యాకు తెలుసా..?
గ్రహాంతర వాసులు ఉన్నారా? లేరా? అన్న అంశంపై దశాబ్ధాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి అగ్రరాజ్యం అమెరికాతో పాటు రష్యాలో ఎందరో పరిశోధకులు గ్రహాంతరవాసుల విషయంలో ఆసక్తికర పరిణామాలకు సాక్షులుగా ఉన్నారు. గ్రహాంతర వాసులు కొన్నేళ్ల క్రితం వరకు అయితే కేవలం ఊహాజనితమైన జీవులు. కానీ కొన్ని పరిశోధనల్లోనూ...కొందరి అనుభవాల్లోనూ చోటు చేసుకున్న ఘటనలను పరిశీలిస్తే గ్రహాంతర వాసులు కచ్చితంగా ఉన్నారని తెలుస్తోంది. అగ్రరాజ్యాలు మాత్రం గ్రహాంతర వాసులకు సంబంధించిన సమాచారాన్ని ఎందుకో దాచి పెడుతున్నాయంటున్నారు పరిశోధకులు. ఈ విషయంలో అమెరికా, రష్యా రెండూ దొందూ దొందే అంటున్నారు వారు.పదిహేనేళ్ల క్రితం నాటి మాట..రష్యాలో గ్రహాంతర వాసులను ప్రత్యక్షంగా చూసిన నేవీ అధికారులు ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ఇంత వరకు రష్యాలోని పుతిన్ ప్రభుత్వం దాన్ని బయట పెట్టలేదు. అయితే కొందరు అధికారుల ద్వారా అసలు విషయం లీక్ కావడంతో యుఎఫ్‌వో(అన్ ఐడెంటిఫైడ్ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్స్)లపై పరిశోధనలు చేస్తున్నవారికి కావల్సినంత మేత దొరికినట్లయ్యింది.అసలేం జరిగిదంటే..2009 జులైలో రష్యా నావికాదళానికి చెందిన ఓ సబ్ మెరైన్ సాగర గర్భంలో ప్రయాణిస్తోంది. హఠాత్తుగా డిస్క్ ఆకారంలో ఉన్న ఆరు వస్తువులు అత్యంత వేగంగా సబ్ మెరైన్ పక్కనుంచి వెళ్లడాన్ని దాని పైలట్ గమనించాడు. అవి నీటి గర్భంలో గంటకు 256 మైళ్ల వేగంతో దూసుకుపోవడాన్ని గమనించి సబ్ మెరైన్ పైలట్ ఆశ్చర్యపోయాడు.సబ్ మెరైన్ లోని ఇతర సిబ్బందికి విషయం చెప్పాడు. ఆ ఆకారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి ఎవరివి? శత్రుసేనలవా? అని వారు కంగారు పడ్డారు. ఆ ఆరు డిస్క్ లు విష్ణు చక్రాల్లా గిర గిరా తిరుగుతూ ముందుకు దూసుకుపోతున్నాయి. అవి ఏవైనా వాహనాలా? కొత్త రకం సబ్ మెరైన్ లా? అని వారు తమలో తాము ప్రశ్నించుకున్నారు. అవి మరోసారి సబ్ మెరైన్ కు సమీపం నుంచి దూసుకుపోయాయి. పైలట్ లో భయం మొదలైంది. ఎందుకొచ్చిందని సబ్ మెరైన్ ను అమాంతం నీటి ఉపరితలానికి తీసుకుపోయాడు. ఆ తర్వాత చూస్తే సాగర గర్భం నుంచి ఆ ఆరు వస్తువులు వేగంగా నీటి ఉపరి తలానికి దూసుకురావడమే కాకుండా గాల్లోకి ఎగిరి వేగంగా ఆకాశంవైపు వెళ్లిపోయాయి.ఆ డిస్కులు కచ్చితంగా గ్రహాంతర వాసులు ప్రయాణించే అంతరిక్ష నౌకలే కావచ్చునని నేవీ అధికారులు భావించారు.అంతరిక్షంలో ఎగరడమే కాదు నీటి గర్భంలోకి దూసుకుపోవడం అంటే గ్రహాంతర వాసుల సాంకేతిక పరిజ్ఞానం ఎంత అడ్వాన్స్ స్టేజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. తాము చూసిన దాన్ని సబ్‌మెరైన్ సిబ్బంది నేవీలోని ఇతర సహచరులకు చెప్పారు. చాలా మంది నమ్మలేదు. కానీ తర్వాత వారు దానిపై ఓ నివేదిక రూపొందించి ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఈ నివేదికను రష్యా ప్రభుత్వం చాలా సీక్రెట్‌గా దాచి పెట్టింది.అలా ఎందుకు చేసిందో ఇప్పటికీ పరిశోధకులకు అర్ధం కావడంలేదు. 27 ఏళ్ల కిందట బైకాల్ సరస్సులో వింత ఆకారాలుఈ ఘటనకు 27 సంవత్సరాల క్రితం 1982లో సైబీరియా ప్రాంతంలో మరో సంచలన ఘటన. బైకాల్ సరస్సులోకి ఏడుగురు డైవర్లు దూకి నీటి అడుక్కి వెళ్లారు. వారు 50 మీటర్ల దూరం వెళ్లే సరికి తమని ఎవరో గమనిస్తున్నారన్న అనుమానం వచ్చింది. ఎవరా అని వెనక్కి తిరిగి చూసిన డైవర్లు ఆశ్చర్యం..భయంతో ఉండిపోయారు. వారిని భారీ పరిమాణంలో ఉన్న ఓ వింత ఆకారం చూస్తోంది. ఆ ఆకారం మనిషి పోలికలతో ఉంది. కాకపోతే హెల్మెట్ వంటి పరికరాన్ని ధరించినట్లు ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్లే సరికి వింత మానవ ఆకారాలు కనిపించాయి. మనుషుల్లాగే కాళ్లూ చేతులతో ఉన్న ఆ జీవులు 9 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఆ జీవులను చూసి విస్తుపోయిన డైవర్లు ధైర్యం చేసి ఓ ఆకారాన్ని పట్టుకోడానికి ప్రయత్నించారు.ఊహించని విధంగా పెద్ద శక్తి ఆ డైవర్లను అమాంతం నీటి ఉపరితలం వైపుకు చాలా బలంగా నెట్టేసింది. అంతటి శక్తి ఆ ఆకారాలకు ఎలా సాధ్యమైందో డైవర్లకు అర్ధం కాలేదు. ఆ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అసలు నీటి కింద ఆక్సిజన్ సిలెండర్ల అవసరం లేకుండా ఆ జీవులు ఎలా ఉండగలుగుతున్నాయో అర్ధం కాలేదు.గడ్డ కట్టుకుపోయే నీటిలోనూ ఆ జీవిలు మనుగడ సాగించగలగడం ఎలా సాధ్యమో తెలియలేదు. అవి కచ్చితంగా ఏదో ఓ గ్రహం నుంచి వచ్చిన గ్రహాంతర వాసులేనని డైవర్లు భావిస్తున్నారు. వారు తాము చూసింది చూసినట్లు పూసగుచ్చి అధికారులకు వివరించారు. దాన్ని ఓ నివేదిక గా రూపొందించారు. ఈ నివేదిక కూడా రష్యాప్రభుత్వం దగ్గర భద్రంగా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం నాలుగు దశాబ్దాలు దాటినా ఈ నివేదికను గుట్టుగా ఉంచడం వెనుక కారణాలేంటో అర్ధం కావడం లేదంటున్నారు పరిశోధకులు.ఈ గ్రహాంతర వాసులేంటో..వారి శక్తి సామర్ధ్యాలేంటో.. వారి స్పేస్‌క్రాఫ్ట్‌ల ప్రత్యేకతలేంటో అంటూ సైంటిస్టులు ఇప్పటికీ జుట్టు పీక్కుంటున్నారు. మనం చూడలేదు కాబట్టి గ్రహాంతర వాసులు లేరని ఎలా అనేయగలం? అంటున్నారు గ్రహాంతర వాసులపై ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తున్న వారు. ఇటువంటి ఘటనలు రష్యాలో చాలానే చోటు చేసుకున్నాయని వారంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఓ సీక్రెట్ రీజన్ తోనే వాటిని దాచి పెడుతోందని వారు అభిప్రాయ పడుతున్నారు. -
గ్లాసీ స్కిన్ సీక్రెట్ : కొరియన్ బ్యూటీలు కూడా కుళ్లు కోవాల్సిందే!
మెరిసే చర్మం, మచ్చలేని అందమైన ముఖం అనేగానే అందరికీ గుర్తొచ్చేది కొరియన్ బ్యూటీస్. అందులోనూ ఇటీవల కొరియన్ బాండ్ మ్యూజిక్, సినిమాలు, సిరీస్‌లపై యూత్‌లో బాగా క్రేజ్ పెరిగింది. దీంతో కొరియన్ బ్యూటీల్లాగా గ్లాసీ స్కిన్‌తో మెరిసి పోవాలని కోరుకోవడం సహజమే. అందుకే మచ్చలేని మహారాణి, రాజులా మెరిసిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి. ఫేషియల్ ఎక్స్‌ర్‌సైజ్ ముందుగా వ్యాయామాలు చాలా ముఖ్యం. శరీర ఆకృతికి వ్యాయామాలు చేసినట్టుగానే ముఖానికి కొన్ని నిర్దేశిత వ్యాయామాలున్నాయి. రోజులో రెండు సార్లు కచ్చితంగా చేస్తే వీ-జాలైన్ మీ సొంతమవుతుంది. సరిపడినన్ని నీళ్లు తాగడం చాలా కీలకం. క్లెన్సింగ్ కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలంటే డీప్ క్లెన్సింగ్ కీలకం. నీరు, గ్లిజరిన్ వంటి మాయిశ్చరైజర్లు , తేలికపాటి సర్ఫ్యాక్టెంట్లనుతో తయారుచేసిన మైకెల్లార్ క్లెన్సింగ్ వాటర్‌తో ముఖాన్ని రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి. ఇది ఆల్కహాల్ ఫ్రీ కూడా. చర్మాన్ని టోన్ చేస్తుంది. క్మురికి, మేకప్, ఆయిల్‌ను డీప్‌గా శుభ్రం చేస్తుంది. లేదంటే నిమ్మకాయ కలిపిన ఫేస్‌వాష్‌తో అయినా శుభ్రం చేసుకోవచ్చు. పులిసిన బియ్యం కడిగిన నీళ్లు ఫేస్‌వాష్‌లు, కెమికల్ సబ్బుల జోలికిపోకుండా రైస్ వాటర్‌ను ఫేస్ వాష్‌గా వాడతారట కొరియన్స్. ఇది న్యాచురల్ క్లెన్సర్‌లా పనిచేస్తుంది. చర్మాన్ని ఎక్కువసేపు హైడ్రేట్‌గా ఉంచుతుంది. శుభ్రంగా కడిగిన బియ్యం నానబెట్టిన నీటి, తరువాత వడకట్టుకోవాలి. 24 గంటలు దీన్ని పులియ నివ్వాలి. మేజిక్ వాటర్‌తో ముఖం కడుక్కుంటే ప్రకాశవంతంగా తేమగా ముఖం మెరిసిపోతుంది. చర్మ సంరక్షణలో పెరుగు చాలా ముఖ్యమైన భాగం. పెరుగులో కొద్దిగా కస్తూరి పసుపు కలిపి, ఈ మిశ్రమంతో మృదువుగా మసాజ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఫేస్ మాస్క్ తేనె, నిమ్మరసం మాస్క్, గ్రీన్ టీ మాస్క్, చార్కోల్ సీరమ్ ఫేస్ మాస్క్ లేదా గ్రీన్-టీ సీరమ్ షీట్ మాస్క్‌ని ఉపయోగించి గ్లాసీ స్కిన్‌ను కూడా పొందవచ్చు.గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని డిటాక్సిఫై చేస్తుంది. నిమ్మరసం, తేనె మాస్క్ చర్మంపై పేరుకున్న మలినాలను, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. తేనె చర్మానికి తేమనందిస్తుంది. నిమ్మరసం టాన్ తొలగించి, స్కిన్ టోన్ లైట్ చేస్తుంది. చర్మాన్నిఆరోగ్యంగా, ముడతల్లేకుండా ఉంచేందుకు వాష్‌క్లాత్‌లతో ముఖాన్ని మసాజ్ చేస్తారు. గోరువెచ్చని నీటిలో మెత్తని గుడ్డను ముంచి, సున్నితంగా (ఎగువ దిశలో) తుడవాలి. దీంతో దుమ్ము , ధూళిని తొలగి తేటగా అవుతుంది. ట్యాపింగ్ ఫేషియల్ రిలాక్సేషన్ కోసం ట్యాపింగ్ టెక్నిక్‌ను కొరియన్లు బాగా వాడతారు. ఇది చర్మానికి మంచి రక్షణ అందించడంతోపాటు, రక్త ప్రసరణను పెంచుతుంది. అంతేకాదు తొందరగా వయసు సంబంధిత ముడతలు రాకుండా కాపాడుతుంది. టోనింగ్ అండ్ క్లీనింగ్ కొరియన్ చర్మ సంరక్షణలో మరో ముఖ్యమైంది టోనింగ్. పురాతన కాలంలో, కొరియన్లు తమ చర్మాన్ని టోన్ చేయడానికి దోసకాయ, టమోటా, పుచ్చకాయ వంటి సహజంగా నీరు లభించే వాటిని ఉపయోగించేవారట. కాబట్టి ఏదైనా టోనర్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఈ పదార్థాలను గుర్తు పెట్టుకొంటే మంచిది. వీటితోపాటు, జెన్సింగ్, గ్రీన్‌టీ రోస్ట్ బార్లీ టీకి కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఇక చివరగా రాత్రి పడుకునే ముందు ముఖచర్మ రక్షణ చర్యల్ని అస్సలు మర్చిపోరు. ప్రధానంగా అలెవెరా జెల్‌ను ముఖమంతా అప్లయ్ చేసుకుని, ఉదయం చల్లటి నీటితో కడుక్కుంటారు. -
పాక్ యువతి ట్రాప్‌లో డీఆర్డీఓ సైంటిస్ట్.. కీలక రహస్యాల చేరవేత..
పుణె: హనీ ట్రాప్‌లో చిక్కుకున్న డీఆర్డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ పాక్ ఏజెంట్‌కు రక్షణ రంగ రహస్యాలను లీక్ చేశాడని దర్యాప్తులో తేలింది. అలియాస్ జరా దాస్‌గుప్తాగా పరిచయమైన పాకిస్థాన్ యువతి కురుల్కర్తో వాట్సాప్ చాట్ ద్వారా మిస్సైల్ సిస్టమ్‌లోని నిగూఢమైన రహస్యాలను రాబట్టింది. డీఆర్డీఓలో ఓ విభాగానికి డైరెక్టర్‌గా పనిచేస్తున్న కురుల్కర్ని మే 3న ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన కస్టడిలో ఉన్నారు. ప్రదీప్ కురుల్కర్కు పాక్ యువతి జరా దాస్‌గుప్తాగా పరిచయమైంది. యూకేలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పి ప్రదీప్‌కు దగ్గరైంది. అనంతరం వాట్సాప్ చాట్, కాల్స్, అశ్లీల వీడియోలతో పాక్ యువతి ప్రదీప్ కురుల్కర్‌ను లోబరుచుకుంది. దర్యాప్తులో జరా దాస్ ఐడీ పాకిస్థాన్‌గా గురించినట్లు అధికారులు తెలిపారు. బ్రహ్మోస్ క్షిపణి, డ్రోన్, యూసీవీ, అగ్ని క్షిపణి లాంఛర్తో పాటు మిలిటరీ బ్రిగేడ్ సిస్టమ్‌కు సంబంధించిన అనేక రహస్యాలను ప్రదీప్ కురుల్కర్ జరా దాస్‌గుప్తాకు షేర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. వీరివురూ 2022 జూన్ నుంచి 2022 డిసెంబర్ వరకు టచ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఇంటెలిజెన్స్ అధికారులు కురుల్కర్‌పై అనుమానంతో దర్యాప్తు చేపట్టగా.. 2022 ఫిబ్రవరిలో ఆమె నెంబర్‌ను ఫోన్ నుంచి డిలీట్ చేసినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో నిజానిజాలు వెలుగులోకి రాగా.. అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: Violence On Elections Voting: బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస.. తొమ్మిది మంది మృతి.. -
దేశ రహస్యాలు పాక్‌కు లీక్ చేసిన డీఆర్డీఓ శాస్త్రవేత్త.. నిఘా వైఫల్యమేనా?
న్యూఢిల్లీ: కొన్ని సార్లు.. అంతా సవ్యంగానే ఉంటుందనుకుంటాం. దేశం సురక్షితంగా ఉందని భావిస్తాం. అనుభవజ్ఞులైన అధికారులు, సరిహద్దుల్లో సైన్యం కంటికి రెప్పలా ఉంటుందని భావిస్తాం. నిజమే.. మనం అనుకుంటున్న దాంట్లో 99% నిజమే. అయితే ఎక్కడో ఓ చోట, ఎవరో ఒకరు నమ్మక ద్రోహానికి సిద్ధంగా ఉంటారు. మదర్ ఇండియాకు వెన్నుపోటు పొడిచేందుకు వెనక్కు రారు. అలాంటి వారిలో అత్యున్నత అధికారులు ఉండడమే ఆశ్చర్యకరం. పైగా పాకిస్తాన్, చైనాలాంటి దేశాలు విసిరే హానీ ట్రాప్‌లో చిక్కడం మరింత విస్మయకరం. మహిళ అందాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టే జాబితా పెరిగిపోతోంది. గత నెల రోజులుగా భారత రక్షణ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న వ్యక్తి ప్రదీప్ కురుల్కర్. భారత రక్షణ వ్యవస్థలోని కీలక వింగ్ DRDOలో అత్యున్నత అధికారిగా ఉన్న ప్రదీప్.. ఇప్పుడు దేశ రహస్యాలను లీక్ చేసిన మాయగాడిగా మిగిలిపోయాడు. వలపు వలలో చిక్కి దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌కు లీక్ చేశాడు డీఆర్డీవో టాప్ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్. ఓ అజ్ఞాత మహిళ మాయలో పడి అడిగిన వివరాలన్నీ అందించాడు. భారత ఆయుధ సంపత్తిలో కీలకంగా ఉన్న బ్రహ్మోస్, అగ్ని, యాంటి శాటిలైట్ క్షిపణులకు సంబంధించిన రహస్యాలను శత్రు దేశానికి చేరవేశాడు. ప్రదీప్‌కు వలపు వల విసిరి రహస్యాలు రాబట్టుకున్న మహిళ తనను తాను జర్దాస్ గుప్తా. లండన్ లో నివసిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. పక్కా స్కెచ్ వేసి ఈయన్ను ట్రాప్ చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో సోషల్ మీడియా ద్వారా ప్రదీప్‌ను పరిచయం చేసుకుంది. మొదట ఆకట్టుకునే మెసెజ్‌లు, ఆ తర్వాత అందాలు ఆరబోసే వీడియో కాల్స్, రాత్రుళ్లు కవ్వించే మాటలు.. తనను ట్రాప్ చేస్తోందని తెలుసుకోలేక పోయిన ప్రదీప్ ఆమె మాయలో పడ్డాడు. వేరే దేశానికి రమ్మని పిలిస్తే క్షణం కూడా ఆలోచించకుండా వెళ్లిపోయాడు. భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌ను కూడా తిలకించారు. ఇద్దరూ కొన్నాళ్లు ఎంజాయ్ చేశారు. ఈ మహిళ అందానికి దాసోహమైన ప్రదీప్.. ఆమె ఏం అడిగినా కాదనకుండా అన్ని వివరాలు వెల్లడించాడు. దేశభద్రత గురించి పట్టించుకోకుండా తెలిసిన రహస్యాలన్నీ లీక్ చేశాడు. ఈ మత్తులో జరుగుతున్న ద్రోహం గురించి ప్రదీప్ కనిపెట్టలేకపోయాడా అన్నది ఓ మిలియన్ డాలర్ క్వొశ్చన్. ఇలాంటి ఆపరేషన్స్‌పై సైన్యంలో ఎందరికో అవగాహన కల్పించిన ప్రదీప్.. తానే ఆ గోతిలో పడ్డాడు. బ్యాడ్ ఎగ్జాంపుల్ గా మిగిలిపోయాడు. 1988 నుంచి డీఆర్డీఓలో 1988 నుంచి పనిచేస్తున్నారు ప్రదీప్. గ్రేడ్-హెచ్ ఔట్ స్టాండింగ్ కేటగిరీ సైంటిస్ట్‌గా ఉన్నారు. ఇది అత్యంత కీలకమైన హోదా. కేంద్రంలో అదనపు కార్యదర్శి హోదాతో సమానం. ఇంతటి కీలక హోదాలో ఉన్న వ్యక్తి దేశ సమాచారాన్ని లీక్ చేయడం ఒకింత విస్మయం కలిగించే విషయం. దీన్ని ఆరంభంలోనే నిఘావర్గాలు కనిపెట్టలేకపోడవంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సెక్యూరిటీ వైఫల్యంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశభద్రతలో డీఆర్డీఓ అత్యంత కీలకం. దేశవ్యాప్తంగా 50 ల్యాబొరేటరీలు ఉన్నాయి. 5వేల మందికిపైగా శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇప్పడు ప్రదీప్ వలపు వ్యవహారం బహిర్గతం కావడంతో వీరిపైనా విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి వచ్చింది. ప్రదీప్ విషయం తెలిసిన వెంటనే అధికారులు చర్యలు చేపట్టారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్)పుణెలో రెండు వారాల క్రితం అతడ్ని అరెస్టు చేసింది. అనంతరం కోర్టులో హాజరు పరచి కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన కస్టడీలోనే ఉన్నారు. ఇప్పుడు ప్రదీప్ ఏ ఏ రహస్యాలు చేరవేశాడన్నది లెక్క తేలాల్సిన అంశం. భారత రక్షణ వ్యవస్థలో ముఖ్యంగా ఆయుధ వ్యవస్థలో అంతర్గత లోపాలను బయటకు రానివ్వరు. సైన్యంలో టాప్ అధికారులకు మాత్రమే కొన్ని విషయాలు తెలుస్తాయి. ప్రదీప్ ఎంతవరకు ఉప్పందించాడు, ఎక్కడెక్కడ ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి? వేటిని మార్చుకోవాలి? ఇవీ ఇప్పుడు సైన్యంలోని టాప్ అధికారుల ముందున్న పెద్ద ఛాలెంజ్. చదవండి: చైనా చాట్‌జీపీటీ.. మరీ ఇంత దారుణమా.. తప్పుడు సమాధానాలు చెప్తే ఎలా? -
దేశ రహస్యాలు అమ్మడానికి ప్రయత్నించి.. చివరికి బిగ్ ట్విస్ట్..
కెలమంగలం(కర్ణాటక): కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలోని రహస్యాలను సెల్‌ఫోన్ ద్వారా ఫోటోలు తీసి విదేశీ గూఢచార సంస్థలకు విక్రయించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని డెంకణీకోట పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల మేరకు డెంకణీకోట సమీపంలోని బైరగొండపల్లి గ్రామానికి చెందిన రామక్రిష్ణారెడ్డి కొడుకు ఉదయ్‌కుమార్ (32). బెంగళూరులో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా 2017 నుంచి 2019 వరకు పనిచేశాడు. ఈ సమయంలో కార్యాలయంలో భద్రపరిచిన పలు ధృవీకరణ పత్రాలు, పరిశోధనా ఉపకరణాలను సెల్‌ఫోన్ ద్వారా ఫోటోలు తీసి విదేశీ ఏజెన్సీల వద్ద విక్రయించి డబ్బు సంపాదించడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకొన్న తళి పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టి ఉదయ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఉంది. చదవండి: మాజీ సీఎం యడియూరప్పకు తప్పిన ముప్పు.. వీడియో -
నక్షత్రాల అవిర్భావం గుట్టు విప్పిన భారత టెలిస్కోప్!
న్యూఢిల్లీ: బిగ్‌బ్యాంగ్ తర్వాత 20 కోట్ల ఏళ్లకు ఏర్పడ్డ తొలి నక్షత్రాల రహస్యాలను భారత టెలిస్కోప్ బహిర్గతం చేసింది. బెంగళూరులోని రామన్ పరిశోధనా సంస్థ (ఆర్ఆర్ఐ)లో డిజైన్ చేసి, నిర్మించిన సరస్–3 రేడియో టెలిస్కోప్‌తో నక్షత్రాల గుట్టును బయట పెట్టారు. 2020 మార్చిలో కర్ణాటకలోని దండిగనహళ్లి చెరువు వద్ద, కొంతకాలం శరావతి బ్యాంక్ వాటర్స్ వద్ద ఈ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేశారు. విశ్వం ఎలా ఏర్పడిందో తెలుసుకొనేందుకు ఆర్ఆర్ఐతోపాటు ఆస్ట్రేలియాకు చెందిన కామన్వెల్త్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్ఓ), యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్ టెల్ అవివ్ పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధన నిర్వహించారు. సరస్–3 టెలిస్కోప్ డేటాను ఇటవలే విశ్లేషించారు. బిగ్‌బ్యాంగ్ అనంతరం తొలుత ఏర్పడిన నక్షత్ర మండలాల్లోని 3 కంటే తక్కువ శాతం వాయువులు నక్షత్రాలుగా రూపాంతరం చెందినట్లు గుర్తించామని ఆర్ఆర్ఐ ప్రతినిధి సౌరభ్ సింగ్ చెప్పారు. దేశీయంగా అభివృద్ధి చేసిన సరస్–3 రేడియో టెలిస్కోప్ కాస్మిక్ డాన్ ఆస్ట్రోఫిజిక్స్‌పై అవగాహన మరింత పెంచుకొనేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. బిగ్‌బ్యాంగ్ అనంతర కాలాన్ని కాస్మిక్ డాన్‌గా వ్యవహరిస్తారు. అప్పటి గెలాక్సీల్లో అత్యధిక సాంద్రత కలిగిన కృష్ణ బిలాలు (బ్లాక్ హోల్స్) ఉండేవి. -
ఆమె.. అజయ్ దేవగణ్ బలహీనత.. ఎవరంటే ?
Unknown Facts About Ajay Devgn: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఇటీవల విడుదలైన దర్శక ధీరుడు తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'లో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి రన్‌వే 34 సినిమాలో అలరించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే అజయ్ దేవగణ్ మరో సంవత్సరం పెద్దవాడయ్యాడు. 1969, ఏప్రిల్ 2న జన్మించిన అజయ్ దేవగణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు బాలీవుడ్ సినీ తారలు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. అయితే 53వ పడిలోకి అడుగు పెడుతున్న ఈ బాలీవుడ్ హీరో 5 రహస్యాలు ఏంటో తెలుసుకుందామా ! 1. ట్రావెలర్ అజయ్ దేవగణ్ మంచి నటుడే కాకుండా ట్రావెల్ లవర్ కూడా. అతని కుటుంబంతో ప్రయాణించడం కంటే ఆయనకు ఏది గొప్ప ఆనందాన్ని ఇవ్వదట. అజయ్ తన తల్లిదండ్రులు, భార్యా పిల్లలు, ఇద్దరు సోదరీమణులు, వారి భర్తలు, పిల్లలతో కలిసి దూర ప్రయాణాలు చేస్తుంటాడని సమాచారం. సెలవుల్లో 25 మంది కుటుంబ సభ్యుల బృందం కలిసి టూర్‌కు వెళ్తాడట. ఇందుకోసం బిజినెస్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించి స్టే చేసేందుకు సాధ్యమైతే ఏకంగా ఒక ఐలాండ్నే బుక్ చేస్తాడని సమాచారం. 2. శివ భక్తుడు అజయ్ దేవగణ్ గొప్ప శివ భక్తుడు. ఎంత గొప్ప భక్తుడు అంటే అతని ఛాతిపై శివుడి పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. అంతేకాకుండా ఆయన డైరెక్ట్ చేసిన 'శివాయ్' మూవీని శివుడికి అంకితం ఇచ్చాడు. 3. టాలెంటెడ్ కుక్ అద్భుతంగా వండటంలోనూ అజయ్ దేవగణ్ సిద్ధహస్తుడు. భారతీయ, కాంటినెంటల్ డిషెస్‌ను సూపర్‌గా చేయగలడని టాక్. 4. కుటుంబమంటే అమితమైన ప్రేమ యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టే అజయ్ దేవగణ్ మంచి ఫ్యామిలీ మ్యాన్ కూడా. ఆయనకు మొదటగా పుట్టిన కూతురు నైసా.. అజయ్ దేవగణ్ బలహీనత. కనీసం రోజులో కొన్నిసార్లు అయినా ఆమెతో మాట్లాడలేకపోతే అజయ్‌కు రోజు గడవదట. అలాగే కుమారుడు యుగ్ అన్న అజయ్‌కి అమితమైన ప్రేమ. 5. పోలో గ్రీన్ కొలోన్ అంటే ఇష్టం అజయ్ దేవగణ్ గత మూడు దశాబ్దాలుగా రాల్ఫ్ లారెన్ తయారు చేసిన పోలో గ్రీన్ అనే కొలోన్నే ధరిస్తున్నాడని సినీ వర్గాల నుంచి సమాచారం. -
పాక్ ఏజెంట్లకు రహస్య సమాచారం.. నలుగురు డీఆర్డీఓ ఉద్యోగుల అరెస్టు
సాక్షి, బాలాసోర్(భువనేశ్వర్): పాకిస్తాన్ ఏజెంట్లకు రహస్య సమాచారం అందిస్తున్న నలుగురు డీఆర్డీఓ కాంట్రాక్టు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. బాలాసోర్‌జిల్లా డీఆర్డీఓ ఇంటిగ్రేటెడ్ రేంజ్లో పనిచేస్తున్న వీరిని తొలుత ప్రశ్నించి అనంతరం అదుపులోకి తీసుకున్నట్లు ఈస్ట్రన్ రేంజ్ ఐజీ హిమాంన్షు కుమర్ చెప్పారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి తమకు రహస్య సమాచారం వచ్చిందన్నారు. కొందరు వ్యక్తులు రహస్య సమాచారాన్ని విదేశీ ఏజెంట్లకు అందించేందుకు యత్నిస్తున్నారని, వీరికి పలు ఐఎస్డీ నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయని సమాచారం అందిందన్నారు. వెంటనే నలుగురు డీఎస్పీలతో ఏర్పాటైన పోలీసు టీములు ఏర్పాటు చేసి దర్యాప్తు ఆరంభించామని చెప్పారు. ఈ టీములు జరిపిన దాడుల్లో నలుగురు ఉద్యోగులు దొరికినట్లు వెల్లడించారు. అనైతికంగా రహస్య సమాచారం అందించి నిధులు పొందుతున్న ఆరోపణపై వీరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వీరి నుంచి నేరాలు రుజువు చేసే పలు ఆధారాలు కూడా దొరికాయని చెప్పారు. వీరిపై చాందీపూర్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయమై డీఆర్డీఓ స్పందించేందుకు నిరాకరించింది. 2014లో కూడా బాలాసోర్ నుంచి రహస్య సమాచారం విక్రయిస్తున్న ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. చదవండి: క్రిమినల్ కేసుల వివరాల్లేవ్.. మమత నామినేషన్ తిరస్కరించండి -
అగ్రరాజ్యం చేతిలో కరోనా రహస్యాలు...!
-
నన్ను నవ్వించాలి
‘షేర్షా, లక్ష్మీబాంబ్, ఇందూ కీ జవానీ, భూల్ భులయ్యా 2’ సినిమాల విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు హీరోయిన్ కియారా అద్వానీ. ప్రస్తుతానికి తెలుగులో సినిమాలు చేయడంలేదు కానీ హిందీలో బిజీగా ఉన్నారు కియారా. మరి.. పర్సనల్ లైఫ్ పట్టించుకునే తీరిక దొరుకుతోందా? అని కియారాని అడిగితే.. ‘హో...భేషుగ్గా.. నా పర్సనల్ లైఫ్‌కి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాను. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను’’ అన్నారు. మరి.. కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలి? అనేవి కూడా అనుకున్నారా? అంటే ‘‘కాబోయే భర్త గురించి కొన్ని అభిప్రాయాలున్నాయి. అతను ఎంతో నమ్మకంగా ఉండాలి. నన్ను నవ్విస్తుండాలి. నా జోక్స్‌కు తను నవ్వాలి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగల తెగువ ఉండాలి. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పగలిగే ధైర్యవంతుడై ఉండాలి. ఇతరులతో చాలా మర్యాదగా మసులుకోవాలి. ముఖ్యంగా నేను పురుషుడిని అనే అహంభావం ఉండకూడదు. అది ఉన్నవారిని నేను అస్సలు ఇష్టపడను’’ అని మనసులోని మాటను బయటపెట్టారు కియారా. -
పాక్‌కు సరిహద్దు రహస్యాలు
ఫిరోజ్‌పూర్: భారత్–పాకిస్తాన్ సరిహద్దులోని కంచెలు, రహదారులకు సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్ ఏజెంటుకు అందజేశాడన్న ఆరోపణలపై ఒక బీఎస్ఎఫ్ జవానును అరెస్టు చేశారు. గత కొన్ని నెలలుగా షేక్ రియాజుద్దీన్ అనే జవానుపై నిఘా పెట్టిన బీఎస్ఎఫ్ వర్గాలు ఆయనను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నాయి. రియాజుద్దీన్ మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా రెన్పురా గ్రామానికి చెందిన వాడని, పంజాబ్‌లో ఫిరోజ్‌పూర్‌లోని 29వ సరిహద్దు భద్రతాదళానికి చెందిన బెటాలియన్‌లో పనిచేస్తున్నాడని తెలిపారు. అతని నుంచి రెండు సెల్ఫోన్లు, ఏడు సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. పాకిస్తాన్ గూఢచార సంస్థకు చెందిన మీర్జా ఫైజల్ అనే వ్యక్తికి సరిహద్దు ఫెన్సింగ్, రోడ్లు, ఉన్నతాధికారుల ఫోన్ నెంబర్లు, ఇతర రహస్య వివరాలు రియాజుద్దీన్ అందజేసినట్టుగా బీఎస్ఎఫ్ వెల్లడించింది. 29వ బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. రియాజుద్దీన్ పోలీసు రిమాండ్‌కోసం కోర్టును ఆశ్రయిస్తామని విచారణ అధికారి రంజిత్‌సింగ్ తెలిపారు. -
బ్రిటిష్ మ్యూజియంలో ఈజిప్టు అద్భుతాలు!
ఫ్రెంచ్ పురాతత్వవేత్త గాడియో అద్భుత ఆవిష్కారాలు ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో సందర్శనకు సిద్ధమయ్యాయి. ప్రాచీన ఈజిప్టు నగరాల ఆనవాళ్ళు త్వరలో సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. సముద్రంలో మునిగిపోయి, ఎవ్వరికీ కనిపించకుండా పోయిన గొప్ప ఈజిప్టు నగరాలు ఎన్నో వేల సంవత్సరాలపాటు రహస్య నగరాలుగానే మిగిలిపోయాయి. కనిపించకుండా పోయిన ఆ నగరాలను పురాతత్వవేత్త ఫ్రాంక్ గాడియో కొన్నేళ్ళ క్రితం సముద్రానికి అడుగు భాగంలో కనిపెట్టిన విషయం తెలిసిందే. ఆ నగరాలకు సంబంధించిన అనేక అద్భుతాలను ఇప్పుడు సందర్శకులకు అందుబాటులో బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శనకు పెడుతున్నారు. సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం సముద్రంలో మునిగిపోయిన థోనిస్ హెరాస్టెయిన్ నగరంలోని అద్భుత దేవాలయాలు, ప్రాచీన శిలాకృతులు గాడియో కనిపెట్టే వరకూ ఎవ్వరికీ కనిపించకుండా రహస్యంగా నీటి అడుగున నిక్షిస్తమైపోయాయి. చేపలకు ఆవాసాలుగా మారిపోయాయి. ఆ నగరాలనుంచి సేకరించిన దేవతా విగ్రహాలు, శిల్ప సంపద ప్రస్తుతం ప్రపంచానికి పరిచయం కానున్నాయి. సంవత్సరాలకొద్దీ కాలం ఈ ప్రాచీన చిహ్నాలను గుర్తించేందుకు గాడియో ఎంతో శ్రమించాడు. దీనికి తోడు కానోపస్ ను కూడ అంగుళం లోతు ఇసుకలో కూరుకుపోయి నీటి అడుగు భాగంలో ఉన్నట్లుగా 1933లో బ్రిటిష్ ఆర్ ఏ ఎఫ్ పైలట్ కనుగొన్నాడు. ప్రస్తుతం ఆ ఈజిప్టు అద్భుత శిలా సంపదను మే 19న ప్రదర్శనకు అందుబాటులోకి తేనున్నట్లు మ్యూజియం క్యూరేటర్ మాసెన్ బెర్గోఫ్ తెలిపారు. ప్రాచీన గ్రీకు చరిత్రకారులు, గ్రంథాలు, పురాణాలు వంటి ఎన్నో విశేషాలను ఇప్పుడు మ్యూజియంను సందర్శించిన వారు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. -
జనవరి నుంచి ఫైళ్లు బహిర్గతం
నేతాజీ కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ హామీ * జనవరి 23 బోస్ జయంతి నుంచి ఒక్కో రహస్యం బట్టబయలు * చరిత్రను అణచిపెట్టాల్సిన అవసరం లేదు * నన్ను మీ కుటుంబ సభ్యుడిగా చూడండి న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి ఏడు దశాబ్దాలుగా అణచివేతకు గురైన రహస్యాలు బట్టబయలు కానున్నాయి. 1945 ఆగస్టు 18న అకస్మాత్తుగా నేతాజీ అదృశ్యమైన ఘటన వెనుక దాగిఉన్న అతి రహస్యమేదో జాతికి వెల్లడి కానుంది. 2016 జనవరి 23 నుంచి నేతాజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఒక్కో రహస్యఫైలును బయటపెడతామని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అధికారికంగా ప్రకటించారు. సుభాష్ చంద్రబోస్ కుటుంబానికి చెందిన 35 మంది సభ్యులు ప్రధానితో ఆయన అధికార నివాసం 7, రేస్‌కోర్స్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, చరిత్రను అణచిపెట్టి ఉంచాల్సిన అవసరం ఇక ఎంతమాత్రం లేదని అన్నారు. నేతాజీకి సంబంధించి విదేశాల్లో ఉన్న ఫైళ్లను కూడా బహిర్గతం చేయాల్సిందిగా ఆయా దేశాల ప్రభుత్వాలను కోరతామని మోదీ తెలిపారు. ఈ మేరకు వివిధ దేశాల ప్రభుత్వాలకు తాను వ్యక్తిగతంగా లేఖలు రాయటమే కాకుండా.. ఆయా దేశాధినేతలతో జరిగే సమావేశాల్లో ప్రత్యేకంగా కోరనున్నట్లు మోదీ చెప్పారు. డిసెంబర్లో రష్యా నేతలతో సమావేశమయ్యే సందర్భంలో బోస్ ఫైళ్లను బహిర్గతం చేయాలని కోరతానన్నారు. 2016 జనవరి 23 నేతాజీ జయంతి సందర్భంగా ఆయన రహస్యాల వెల్లడి ప్రక్రియ ప్రారంభమవుతుందని మోదీ స్పష్టం చేశారు. బోస్ కుటుంబ సభ్యులతో దాదాపు గంటసేపు ప్రధాని సమావేశమయ్యారు. ‘‘చరిత్రను అణచివేయాల్సిన అవసరం లేనే లేదు. చరిత్రను మరచిపోయే దేశాలు చరిత్రను సృష్టించలేవు’’ అని బోస్ కుటుంబంతో భేటీ అనంతరం మోదీ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. తనను వారి కుటుంబ సభ్యుడిగానే పరిగణించాలని నేతాజీ కుటుంబాన్ని కోరినట్లు మోదీ మరో ట్వీట్లో తెలిపారు. నేతాజీ కుటుంబానికి తన నివాసంలో ఆతిథ్యమివ్వటం గొప్ప గౌరవమని పేర్కొన్నారు. 2014 జూన్‌లో మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత బోస్ రహస్యాలు బయటపెట్టాలన్న డిమాండ్లు పెరిగిన సంగతి తెలిసిందే. మోదీ ముందు దేశాన్ని పాలించిన ప్రభుత్వాలన్నీ కూడా బోస్ ఫైళ్లను బహిర్గత పరచటానికి నిరాకరిస్తూ వచ్చాయి. అలా చేస్తే వివిధ దేశాలతో భారత్ సంబంధాలు దెబ్బతింటాయని కూడా వాదిస్తూ వచ్చాయి. మోదీ ప్రభుత్వం కూడా గత ఆగస్టు వరకూ ఇదే వాదన వినిపించింది. అదే సమయంలో నేతాజీ కుటుంబ సభ్యులు కేంద్రం దగ్గర ఉన్న ఫైళ్లను కూడా బహిర్గత పరచాలన్న స్వరాన్ని పెంచుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే గత నెల(సెప్టెంబర్ 18న) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజల ముందుంచింది. ఆ తరువాత రెండు రోజులకే(సెప్టెంబర్ 20) ప్రధాని మోదీ తన నెలవారీ మన్‌కీ బాత్ కార్యక్రమంలో తాను అక్టోబర్‌లో నేతాజీ కుటుంబ సభ్యులను కలుస్తున్నట్లుగా ప్రకటించారు. బుధవారం నేతాజీ కుటుంబసభ్యులతో భేటీలో రహస్య ఫైళ్ల విడుదలపై మోదీ స్పష్టతనిచ్చారు. ఈ భేటీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న నేతాజీకి సంబంధించిన ఫైళ్లతో పాటు విదేశీ ప్రభుత్వాల దగ్గర ఉన్న ఫైళ్లను కూడా ప్రపంచం ముందుంచేలా చొరవ తీసుకోవాలని బోస్ కుటుంబసభ్యులు మోదీని కోరినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. తన ఆలోచనలు, తన ప్రభుత్వ ఆలోచనలతో నేతాజీ కుటుంబ సభ్యుల ఆలోచనలు కూడా కలుస్తున్నాయని మోదీ అన్నారని పేర్కొంది. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నేతాజీని గుర్తుచేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని మోదీ అన్నారని ఆ ప్రకటనలో తెలిపారు. కుటుంబం హర్షం.. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన రహస్యాలను బయటపెట్టాలన్న ప్రధాని ప్రకటనపై బోస్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. భారతదేశానికి ఈరోజే అసలైన స్వాతంత్య్రం సిద్ధించిన రోజని నేతాజీ మునిమనుమడు చంద్రకుమార్ బోస్ అన్నారు. వచ్చే ఏడాది జనవరి 23నుంచి బోస్ అదృశ్య రహస్యాలను ఆవిష్కరిస్తామని ప్రధాని భరోసా ఇచ్చారని ఆయన తెలిపారు. అంతకుముందున్న ప్రభుత్వాలు వీటిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తే.. ప్రధాని మోదీ ఈ రహస్యాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చంద్రకుమార్ ప్రశంసించారు. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా మోదీ చొరవను అభినందించారు. -
తమన్నా చెప్పిన సీక్రెట్స్
నలుగు పెట్టుకుంటా! ఇప్పటికీ అదే మిశ్రమం! డైలీ జిమ్‌కెళ్తా! దేవుడు తమన్నాని పాలతో తయారు చేశాడా? గులాబీ రేకు సుకుమారాన్ని తమన్నా దేహానికి అద్దాడా? ఏదైనా శిల్పాన్ని చెక్కాలనుకుని ఈ బ్యూటీని తయారు చేశాడా? అని తమన్నా అందాన్ని తెగ వర్ణించాలని కుర్రకారు అనుకోవడం సహజం. దేవుడు ఇచ్చిన ఈ అందాన్ని, శరీరాకృతిని తమన్నా ఎలా కాపాడుకుంటున్నారు? ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అందుకే తమన్నా ఏం చేస్తారో తెలుసుకుందాం... ► తమన్నా మేని ఛాయ జెనిటికల్గా వచ్చింది. ఆమె అమ్మా, నాన్న కూడా తెల్లగా ఉంటారు. వాళ్లకన్నా తమన్నా రంగు ఇంకా ఎక్కువ. చిన్నప్పట్నుంచీ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ వాడే అలవాటు తనకు లేదు. సెనగపిండి, పసుపు పొడి, వేపాకు పొడి.. వీటిని రోజ్ వాటర్‌లో మిక్స్ చేసి అమ్మ ఇచ్చిన మిశ్రమాన్ని మొహానికి అప్లయ్ చేసుకునేది. పెద్దయ్యాక కూడా అదే ఫాలో అవుతున్నారు. ► షాంపూలూ అస్సలు వాడరు. హెయిర్ వాష్ కోసం హెర్బల్ పౌడర్స్‌ని వాడతారు. బొప్పాయి, ఉసిరి, శీకాకాయ్లతో పొడి తయారు చేసుకుంటారు. అవుట్డోర్ షూటింగ్స్ కారణంగా సూర్య రశ్మి బాగా సోకుతుంది కాబట్టి, దాదాపు ప్రతి రోజూ హెయిర్ వాష్ చేసుకుంటారామె. ► వీలు కుదిరినప్పుడల్లా ఒంటికి నలుగు పెట్టుకుంటారు. అది కూడా ఇంట్లో తయారు చేసిన పొడులతోనే. నలుగు పెట్టుకోవడం వల్ల మజిల్స్ రిలాక్స్ అవుతాయని అంటారామె. ► రాత్రి నిద్రపోయే ముందు మేకప్ క్లీన్ చేసేస్తారు. షూటింగ్స్ లేకపోతే మేకప్ జోలికి వెళ్లరు. ► ప్రతి రోజూ జిమ్ కంపల్సరీ. కార్డియో ఎక్సర్సైజ్, ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్.. ఇలా జిమ్‌లో పలు వ్యాయామాలు చేస్తారు. ఏది చేసినా ట్రైనర్ ఆధ్వర్యంలోనే. జిమ్‌కి కనీసం గంట సేపైనా కేటాయిస్తారు. ► ముందు రోజు రాత్రి నానబెట్టిన గుప్పెడు బాదం పప్పులను మర్నాడు ఉదయం తింటారు. ఆ తర్వాత గోరు వెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగుతారు. ► తమన్నాకి పెరుగంటే చాలా ఇష్టం. శరరీం కూల్‌గా ఉండటానికి పెరుగు చాలా ఉపయోగపడుతుందని, కాల్షియమ్ ఎక్కువగా ఉంటుందని ఆమె అంటారు. ► రోజు మొత్తంలో సూప్స్, పండ్ల రసాలు, నీళ్లు ఎక్కువగా తాగుతారు. తమన్నా చర్మం మెరవడానికి అదో కారణం. ► ఫ్రైడ్ ఫుడ్, టిన్ ఫుడ్స్‌కి దూరంగా ఉంటారు. అప్పటికప్పుడు కుక్ చేసిన ఫుడ్‌నే తీసుకుంటారు. ఆయిలీ ఫుడ్ తినరు. ►బేసిక్‌గా తమన్నా సన్నగానే ఉంటారు. కానీ, సినిమాల కోసం ఇంకా సన్నబడ్డారు. అలా సన్నబడటం కోసం తనకు చాలా ఇష్టమైన ఫ్రైడ్ ఫుడ్స్‌ని తాగ్యం చేసేశారు. ► అందం కోసం ఎంత చేసినా మానసికంగా ఒత్తిడికి గురైతే మాత్రం అది బయటకు కనిపించేస్తుందంటారు తమన్నా. అందుకే వీలైనంత కూల్‌గా ఉండటానికి ట్రై చేస్తారు. ► ‘ఎ లాఫ్టర్ ఈజ్ బెస్ట్ టానిక్’ అంటారు తమన్నా. అందుకే పెదాలపై చిరునవ్వు చెరగనివ్వరు. -
నేను మీ పడకగదిలోకి తొంగిచూస్తే..!
‘‘సెలబ్రిటీలంటే చాలామందికి చులకన. ఏది కావాలంటే అది కామెంట్ చేయడానికి పనికొచ్చే ‘వస్తువులు’ అనుకుంటారు. కానీ, మేమూ ‘మనుషులమే’ అని గ్రహించాలి. మేం మేకప్ వేసుకునేది మొహానికి మాత్రమే... మనసుకి కాదు. అందుకని, మా మనసు గాయపడే వ్యాఖ్యలు చేయడం తగదు. ఎవరైతే మా గురించి కామెంట్ చేస్తున్నారో, వాళ్లను ‘నిన్న రాత్రి మీ పడకగదిలో ఏం చేశారు?’ అనడిగితే ఊరుకుంటారా? ఎవరి పడక గదిలోకైనా మేము తొంగి చూస్తే ఒప్పుకుంటారా? ఎవరో ఒకరితో సంబంధం అంటగడితే ఆగ్రహించరా? మరి, మాకూ ఈ ఫీలింగ్స్ ఉంటాయని ఎందుకు గ్రహించరు? నా గురించి జనాలకు ఏమేం తెలియాలో అవన్నీ సామాజిక మాధ్యమం ద్వారా తెలియపరుస్తున్నాను. అంతటితో సంతృప్తిపడాలి. అంతేకానీ, కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి ప్రయత్నిస్తే, ఒళ్లు మండుతుంది. ఇలాంటి మాటలు మాట్లాడితే, ‘నోరు పారేసుకుంటోంది’ అంటారు. లేకపోతే ‘గయ్యాళి’ అని పట్టం కడతారు. కానీ, ఈ మాటలన్నీ బాధలో నుంచి పుట్టుకొచ్చినవే అని అర్థం చేసుకోవాలి. సెలబ్రిటీలను కూడా మనుషుల్లా చూడాలని విన్నవించుకుంటున్నా.’’ - ప్రియాంకా చోప్రా, కథానాయిక -
ఆధ్యాత్మికం... వ్యక్తిత్వ వికాసం
సంకలనం అన్నమయ్య సంకీర్తనల వ్యాఖ్యాతగా ఆంధ్రదేశానికి సుపరిచితులు వెంకట్ గరికపాటి. గతంలో ఆయన సంగీత ప్రియులకోసం అన్నమయ్య సంకీర్తన రత్నాకరము, అన్నమయ్య సంకీర్తన సుధాకరము పేరిట రెండు స్వరరాగ సుధారసాలను అందించారు. ఆ గ్రంథాలకు లభించిన ప్రోత్సాహ ఉత్సాహంతో తాజాగా ‘వికాస విభాసం’ పేరిట మరో చక్కటి వ్యాస సంకలనాన్ని వెలువరించారు. ‘సాక్షి’ సహా పలు దినపత్రికలలో ప్రచురితమైన ఈ వ్యాసాలు ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాసాలకు మేలు చేకూర్చే మేలిమి ముత్యాల్లాంటివి. ఇంపైన పదబంధాలతో, సులభమైన శైలితో సాగిన ఈ వ్యాసాలలో అందరికీ తెలిసిన విషయాల నుంచి, ఏ కొందరికో మాత్రమే తెలిసిన ఆధ్యాత్మిక రహస్యాలు కూడా ఉన్నాయి. రచయితది సాహితీ సుగంధాలకు కానీ, ఆధ్యాత్మిక పరిమళాలకు గానీ ఏమాత్రం పొసగని ఉద్యోగం. అయినా చిన్నప్పటి నుంచి తాను విన్న, చదివిన మంచి విషయాలను పదిమందితోటీ పంచుకోవాలన్న తపనతో పలు రచనలు చేశారు. మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ వ్యాసాలన్నింటిలోనూ యువతకు, విద్యార్థులకు అవసరమైన వ్యక్తిత్వ వికాస సూత్రాలు ఉండటం విశేషం. (వికాస విభాసం- ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి, పుటలు: 240, వెల రూ. 150 ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు). - డి.వి.ఆర్.