![Karnataka Police Arrested Man Who Tried To Sell Secrets Of Country - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/6/Karnataka-Police-Arrested-M.jpg.webp?itok=jSui9RV2)
నిందితుడు ఉదయ్‌కుమార్(ఫైల్)
కెలమంగలం(కర్ణాటక): కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలోని రహస్యాలను సెల్‌ఫోన్ ద్వారా ఫోటోలు తీసి విదేశీ గూఢచార సంస్థలకు విక్రయించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని డెంకణీకోట పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల మేరకు డెంకణీకోట సమీపంలోని బైరగొండపల్లి గ్రామానికి చెందిన రామక్రిష్ణారెడ్డి కొడుకు ఉదయ్‌కుమార్ (32). బెంగళూరులో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా 2017 నుంచి 2019 వరకు పనిచేశాడు.
ఈ సమయంలో కార్యాలయంలో భద్రపరిచిన పలు ధృవీకరణ పత్రాలు, పరిశోధనా ఉపకరణాలను సెల్‌ఫోన్ ద్వారా ఫోటోలు తీసి విదేశీ ఏజెన్సీల వద్ద విక్రయించి డబ్బు సంపాదించడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకొన్న తళి పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టి ఉదయ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఉంది.
చదవండి: మాజీ సీఎం యడియూరప్పకు తప్పిన ముప్పు.. వీడియో
Comments
Please login to add a commentAdd a comment